Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 14 సంచిక 5
సెప్టెంబర్ / అక్టొబర్ 2023


ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

కేరళ ప్రజలు తమకు అత్యంత ప్రియతమ రక్షకుడిగా బలి చక్రవర్తిని స్మరించుకుంటూ గొప్ప ఆనందం మరియు ఉత్సాహంతో జరుపుకునే ఓనం పండుగ సమయంలో మీకు వ్రాస్తున్నందుకు నేను ఆశీర్వదించబడ్డానని భావిస్తున్నాను. బలి చక్రవర్తి తన నిస్వార్థత మరియు తన దేశంలోని ప్రజలపై కురిపించిన దాతృత్వానికి ప్రతీకగా కీర్తి వహించిన వాడు. మన ప్రియతమ ప్రేమమూర్తి స్వామి మాటల్లో ప్రేమ స్వరూపులారా! చెట్లు ఎలాంటి స్వార్థం లేకుండా మానవాళికి మేలు చేసే ఫలాలను ఇస్తాయి. ఇతరులకు సహాయం చేయడానికి నదులు నీటిని అందిస్తాయి. ఆవులు ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరుల మేలు కోసం పాలు ఇస్తాయి. మానవ శరీరం ఇతరులకు సహాయం చేయడం కోసం ఇవ్వబడింది”...శ్రీ సత్యసాయి బాబా, ఓణం ప్రసంగం, 2 సెప్టెంబర్ 2009.

మన ప్రపంచ జనాభాలో గణనీయమైన శాతంలో ప్రజలు శారీరక, మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తరుణంలో స్వార్థరాహిత్యమైన వైబ్రియానిక్స్ సేవను చేపట్టడం ద్వారా ముఖ్యంగా మన జీవితాలను ఒక లక్ష్యంతో జీవించే అవకాశాన్ని స్వామి కల్పించినందుకు మనమంతా ఎంతో అదృష్టవంతులం. గడచిన ఒక సంవత్సరంలోనే సామూహిక సేవా భావము యొక్క ఒరవడిలో భారతదేశం అంతటా 1184 వైబ్రో క్లినిక్‌లు/శిబిరాలు నిర్వహించబడ్డాయి, మరియు 36,039 మంది రోగులు చికిత్స పొందారని మీకు తెలుపడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నది. మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి 154 మంది ప్రాక్టీషనర్లు ఈ శిబిరాల్లో పాల్గొన్నారు. ఈ బృహత్తర సహకార సేవా కార్యక్రమం నిర్వహించడంలో మరియు పాల్గొనడంలో చురుకుగా పాల్గొన్న ప్రాంతీయ సమన్వయకర్తలు మరియు ప్రాక్టీషనర్ల నిస్వార్థ సహకారాన్ని మేము కృతజ్ఞతతో అభినందిస్తున్నాము.

భారతదేశంలోని AP మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రాక్టీషనర్లు ఈ సంవత్సరం జూలైలో విశాఖపట్నంలో తమ మొదటి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారని నివేదించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అత్యంత విజయవంతమైన ఈ పైలట్ ప్రాజెక్ట్, చాలా మంది అంకితభావం కలిగిన ప్రాక్టీషనర్లు మరియు ఉత్సాహపూరిత వాలంటీర్లను ఒకచోట చేర్చింది. ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు మరియు ప్రాంతాలకు ఒక రోల్ మోడల్‌గా ఉపయోగపడుతుందని మేము విశ్వసిస్తున్నాము, మరియు సమీప భవిష్యత్తులో జాతీయ సమావేశానికి బీజాలు వేస్తుందని ఆశిస్తున్నాము. ఈ సంచిక యొక్క అదనపు విభాగంలో మరిన్ని వివరాలు చూడవచ్చు.

ఇటీవల తాము పంపిన కేసు చరిత్రలు వార్తాలేఖలో ప్రచురించబడడం లేదన్న నిరాశను పలువురు ప్రాక్టీషనర్లు వ్యక్తం చేస్తున్న విషయం  నాకు తెలిసింది. మేము స్వీకరించే ప్రతీ కేసు చరిత్ర వైబ్రియానిక్స్ మిషన్‌కు ముఖ్యమైన సహకారం అని నేను ప్రాక్టీషనర్లు అందరికీ  భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. మేము వార్తాలేఖలో అన్ని కేసులను ప్రచురించలేకపోవడానికి కారణం స్థల పరిమితి మాత్రమే. ఈ సమస్యను పరిష్కరించడానికి, త్వరలోనే అన్ని కేసుల చరిత్రలను మా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసి వైబ్రియానిక్స్ కమ్యూనిటీకి అందుబాటులో ఉంచుతాము. మా థింక్-ట్యాంక్ సభ్యుడు ప్రాక్టీషనర్ 11573 సూచనను మేము స్వాగతిస్తున్నాము, ఇకనుండి ప్రాక్టీషనర్లు పంపే ప్రతీ కేసు చరిత్రపై మేము మా అభిప్రాయాన్ని అందిస్తాము. మా కేస్ హిస్టరీస్ బృందం ఈ సంకల్పమును నిర్ణీత సమయంలో అమలు చేస్తుంది.

 కోవిడ్ -19 యొక్క ప్రాణాంతక ముప్పు తగ్గినప్పటికీ, కొత్త జాతులు నిరంతరం ఉద్భవిస్తూ ప్రజలకు సోకుతున్నాయి. ఈ వేసవిలో EG.5 (Eris) అని పిలువబడే ఒమిక్రాన్ యొక్క కొత్త సంతతి వ్యాప్తి చెందడం ప్రారంభించింది. ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా చైనా, UK మరియు USA వంటి దేశాలలో వ్యాప్తి చెందుతున్న ప్రధానమైన కరోనావైరస్ సబ్‌వేరియంట్. ఎరిస్ అత్యంత ప్రబలమైన జాతిగా మారినప్పటికీ, ఇది ప్రాణాంతకమైన అనారోగ్యాన్ని లేదా తక్షణ ప్రమాదాన్ని కలిగించడం లేదు. శుభవార్త ఏమిటంటే, మా ప్రాక్టీషనర్లు ఇమ్యూనిటీ బూస్టర్ (IB) పంపిణీని కొనసాగిస్తూనే ఉన్నారు, ఇది ఇప్పటికే ఒక మిలియన్ మందికి పైగా ప్రయోజనం చేకూర్చింది.

 శ్రీకృష్ణుని జన్మదినమైన జన్మాష్టమి ఆనందకరమైన పండుగను సమీపిస్తున్న తరుణంలో, స్వామి నుండి ఒక అందమైన సందేశాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఇది మీ వైబ్రియానిక్స్ అభ్యాసాన్ని మరింత అర్ధవంతం చేయడానికి ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాను.  “గోపికలకు ఆధ్యాత్మిక శరణాగతి రహస్యం తెలుసు. వారి ఆరాధన ఏ బేరసారాల స్ఫూర్తితో కలుషితం కాలేదు. బేరసారాలు మరియు లాభార్జన కోసం తహతహలాడే వారు జీతభత్యాల కోసం అలమటించే నౌకర్ల లాంటివారు. మీరు భగవంతుని వారమని భావించండి. అప్పుడు పనిలో అలసిపోరు, చేయబడేది మరింత బాగా చేయబడుతుంది, మరింత సంతృప్తిని కూడా ఇస్తుంది. తద్వారా లభించే వేతనము ఏమిటో తెలుసా ? భగవంతుడు మిమ్మల్ని సదా ఆనందంలో ఉంచుతాడు. ఎవరైనా ఇంతకంటే ఏమి ఆశించగలరు? మిగిలిన అన్నింటినీ అతనికి వదిలివేయండి. అతనికి బాగా తెలుసు. ఆయనే సర్వస్వం మరియు ఆయనను కలిగి ఉండడం వల్ల కలిగే ఆనందమే గొప్ప బహుమతి. ఇదే మానవ ఆనంద రహస్యం. ఈ మార్గములపై  జీవితాలను గడపండి, ఇక మీరు ఎప్పటికీ దుఃఖానికి గురికారు. కృష్ణుడు ఇలా అంటాడు: నా భక్తులు ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవించరు"...సత్యసాయి బాబా, కృష్ణ జయంతి, 19 ఆగస్టు 1965.

సాయికి ప్రీతికరమైన సేవలో

జిత్ కె అగ్గర్వాల్.