Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 14 సంచిక 5
సెప్టెంబర్ / అక్టొబర్ 2023
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

కేరళ ప్రజలు తమకు అత్యంత ప్రియతమ రక్షకుడిగా బలి చక్రవర్తిని స్మరించుకుంటూ గొప్ప ఆనందం మరియు ఉత్సాహంతో జరుపుకునే ఓనం పండుగ సమయంలో మీకు వ్రాస్తున్నందుకు నేను ఆశీర్వదించబడ్డానని భావిస్తున్నాను. బలి చక్రవర్తి తన నిస్వార్థత మరియు తన దేశంలోని ప్రజలపై కురిపించిన దాతృత్వానికి ప్రతీకగా కీర్తి వహించిన వాడు. మన ప్రియతమ ప్రేమమూర్తి స్వామి మాటల్లో ప్రేమ స్వరూపులారా! చెట్లు ఎలాంటి స్వార్థం లేకుండా మానవాళికి మేలు చేసే ఫలాలను ఇస్తాయి. ఇతరులకు సహాయం చేయడానికి నదులు నీటిని అందిస్తాయి. ఆవులు ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరుల మేలు కోసం పాలు ఇస్తాయి. మానవ శరీరం ఇతరులకు సహాయం చేయడం కోసం ఇవ్వబడింది”...శ్రీ సత్యసాయి బాబా, ఓణం ప్రసంగం, 2 సెప్టెంబర్ 2009.

మన ప్రపంచ జనాభాలో గణనీయమైన శాతంలో ప్రజలు శారీరక, మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తరుణంలో స్వార్థరాహిత్యమైన వైబ్రియానిక్స్ సేవను చేపట్టడం ద్వారా ముఖ్యంగా మన జీవితాలను ఒక లక్ష్యంతో జీవించే అవకాశాన్ని స్వామి కల్పించినందుకు మనమంతా ఎంతో అదృష్టవంతులం. గడచిన ఒక సంవత్సరంలోనే సామూహిక సేవా భావము యొక్క ఒరవడిలో భారతదేశం అంతటా 1184 వైబ్రో క్లినిక్‌లు/శిబిరాలు నిర్వహించబడ్డాయి, మరియు 36,039 మంది రోగులు చికిత్స పొందారని మీకు తెలుపడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నది. మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి 154 మంది ప్రాక్టీషనర్లు ఈ శిబిరాల్లో పాల్గొన్నారు. ఈ బృహత్తర సహకార సేవా కార్యక్రమం నిర్వహించడంలో మరియు పాల్గొనడంలో చురుకుగా పాల్గొన్న ప్రాంతీయ సమన్వయకర్తలు మరియు ప్రాక్టీషనర్ల నిస్వార్థ సహకారాన్ని మేము కృతజ్ఞతతో అభినందిస్తున్నాము.

భారతదేశంలోని AP మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రాక్టీషనర్లు ఈ సంవత్సరం జూలైలో విశాఖపట్నంలో తమ మొదటి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారని నివేదించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అత్యంత విజయవంతమైన ఈ పైలట్ ప్రాజెక్ట్, చాలా మంది అంకితభావం కలిగిన ప్రాక్టీషనర్లు మరియు ఉత్సాహపూరిత వాలంటీర్లను ఒకచోట చేర్చింది. ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు మరియు ప్రాంతాలకు ఒక రోల్ మోడల్‌గా ఉపయోగపడుతుందని మేము విశ్వసిస్తున్నాము, మరియు సమీప భవిష్యత్తులో జాతీయ సమావేశానికి బీజాలు వేస్తుందని ఆశిస్తున్నాము. ఈ సంచిక యొక్క అదనపు విభాగంలో మరిన్ని వివరాలు చూడవచ్చు.

ఇటీవల తాము పంపిన కేసు చరిత్రలు వార్తాలేఖలో ప్రచురించబడడం లేదన్న నిరాశను పలువురు ప్రాక్టీషనర్లు వ్యక్తం చేస్తున్న విషయం  నాకు తెలిసింది. మేము స్వీకరించే ప్రతీ కేసు చరిత్ర వైబ్రియానిక్స్ మిషన్‌కు ముఖ్యమైన సహకారం అని నేను ప్రాక్టీషనర్లు అందరికీ  భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. మేము వార్తాలేఖలో అన్ని కేసులను ప్రచురించలేకపోవడానికి కారణం స్థల పరిమితి మాత్రమే. ఈ సమస్యను పరిష్కరించడానికి, త్వరలోనే అన్ని కేసుల చరిత్రలను మా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసి వైబ్రియానిక్స్ కమ్యూనిటీకి అందుబాటులో ఉంచుతాము. మా థింక్-ట్యాంక్ సభ్యుడు ప్రాక్టీషనర్ 11573 సూచనను మేము స్వాగతిస్తున్నాము, ఇకనుండి ప్రాక్టీషనర్లు పంపే ప్రతీ కేసు చరిత్రపై మేము మా అభిప్రాయాన్ని అందిస్తాము. మా కేస్ హిస్టరీస్ బృందం ఈ సంకల్పమును నిర్ణీత సమయంలో అమలు చేస్తుంది.

 కోవిడ్ -19 యొక్క ప్రాణాంతక ముప్పు తగ్గినప్పటికీ, కొత్త జాతులు నిరంతరం ఉద్భవిస్తూ ప్రజలకు సోకుతున్నాయి. ఈ వేసవిలో EG.5 (Eris) అని పిలువబడే ఒమిక్రాన్ యొక్క కొత్త సంతతి వ్యాప్తి చెందడం ప్రారంభించింది. ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా చైనా, UK మరియు USA వంటి దేశాలలో వ్యాప్తి చెందుతున్న ప్రధానమైన కరోనావైరస్ సబ్‌వేరియంట్. ఎరిస్ అత్యంత ప్రబలమైన జాతిగా మారినప్పటికీ, ఇది ప్రాణాంతకమైన అనారోగ్యాన్ని లేదా తక్షణ ప్రమాదాన్ని కలిగించడం లేదు. శుభవార్త ఏమిటంటే, మా ప్రాక్టీషనర్లు ఇమ్యూనిటీ బూస్టర్ (IB) పంపిణీని కొనసాగిస్తూనే ఉన్నారు, ఇది ఇప్పటికే ఒక మిలియన్ మందికి పైగా ప్రయోజనం చేకూర్చింది.

 శ్రీకృష్ణుని జన్మదినమైన జన్మాష్టమి ఆనందకరమైన పండుగను సమీపిస్తున్న తరుణంలో, స్వామి నుండి ఒక అందమైన సందేశాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఇది మీ వైబ్రియానిక్స్ అభ్యాసాన్ని మరింత అర్ధవంతం చేయడానికి ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాను.  “గోపికలకు ఆధ్యాత్మిక శరణాగతి రహస్యం తెలుసు. వారి ఆరాధన ఏ బేరసారాల స్ఫూర్తితో కలుషితం కాలేదు. బేరసారాలు మరియు లాభార్జన కోసం తహతహలాడే వారు జీతభత్యాల కోసం అలమటించే నౌకర్ల లాంటివారు. మీరు భగవంతుని వారమని భావించండి. అప్పుడు పనిలో అలసిపోరు, చేయబడేది మరింత బాగా చేయబడుతుంది, మరింత సంతృప్తిని కూడా ఇస్తుంది. తద్వారా లభించే వేతనము ఏమిటో తెలుసా ? భగవంతుడు మిమ్మల్ని సదా ఆనందంలో ఉంచుతాడు. ఎవరైనా ఇంతకంటే ఏమి ఆశించగలరు? మిగిలిన అన్నింటినీ అతనికి వదిలివేయండి. అతనికి బాగా తెలుసు. ఆయనే సర్వస్వం మరియు ఆయనను కలిగి ఉండడం వల్ల కలిగే ఆనందమే గొప్ప బహుమతి. ఇదే మానవ ఆనంద రహస్యం. ఈ మార్గములపై  జీవితాలను గడపండి, ఇక మీరు ఎప్పటికీ దుఃఖానికి గురికారు. కృష్ణుడు ఇలా అంటాడు: నా భక్తులు ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవించరు"...సత్యసాయి బాబా, కృష్ణ జయంతి, 19 ఆగస్టు 1965.

సాయికి ప్రీతికరమైన సేవలో

జిత్ కె అగ్గర్వాల్.

శ్వాశకోశ ఎలర్జీ 03586...क्रोएशिया

32 ఏళ్ల వ్యక్తి 2015 నుండి గత ఐదేళ్లుగా శ్వాసకోశ అలెర్జీతో బాధపడుతున్నారు. అతనికి ప్రతీ సంవత్సరం వసంత ఋతువులో (మార్చి నుండి జూన్ వరకు) కళ్లవాపు తుమ్ములు ఏర్పడతాయి. దీనివలన అతని రోజువారీ జీవితం మరియు సాధారణ కృత్యాలు నిర్వహించడం కష్టంగా మారింది. ఐతే రోగి అల్లోపతి మందులతో ఉపశమనం పొంద సాగారు కానీ ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందించాయి. రోగి ప్రాక్టీషనర్ వద్దకు వెళ్లినప్పుడు ఎటువంటి మందులు లేదా చికిత్స తీసుకోవడం లేదు, ఈ అలర్జీకి కారణం మానసిక సంబంధమైనదేనని భావించిన ప్రాక్టీషనర్ 15 మార్చి 2020, అతనికి క్రింది రెమిడీ ఇచ్చారు.

CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies...TDS

కేవలం రెండు రోజుల తర్వాత, అతను తన అలెర్జీ లక్షణాలు పోయినట్లు తెలిపారు. అతను మరో రెండు నెలల పాటు రెమెడీని తీసుకోవడం కొనసాగించి 15 మే 2020న దానిని ఆపారు. తదనంతరం, అలెర్జీ పునరావృతం కాలేదు మరియు 27 జూలై 2023 నాటికి, అతను బాగానే ఉన్నారు.

 

పార్శ్వపు నొప్పి 03586...क्रोएशिया

52 ఏళ్ల మహిళ 2017 నుండి గత 3 సంవత్సరాల నుండి పార్శ్వపు నొప్పితో బాధపడుతున్నారు, ఇది ఏర్పడిన ప్రతీ సారి కొన్ని గంటలు లేదా వారంలో ఒక రోజు లేదా కొన్నిసార్లు కొన్ని రోజులు సంభవిస్తూ ఆమెకు తలనొప్పి, వికారం, వాంతులు మరియు కాంతికి అధిక సున్నితత్వం ఉంటుంది. ఈ లక్షణాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే ఆమె ఏ పని చేయలేక పోవడం, లేదా సాధారణ కృత్యాలు నిర్వహించడం అసాధ్యం అవుతోంది. ఆ సమయంలో ఆమె తనను తాను ఒక గదిలో బంధించుకొని బాహ్య ప్రపంచం నుండి దూరంచేసుకుంటుంది. ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలు లేవు, శారీరకంగా చురుకుగా మరియు అప్పుడప్పుడు క్రీడలలో నిమగ్నమవుతూ ఉంటారు. ప్రాక్టీషనర్‌ను సంప్రదించడం తప్ప ఆమె ఎలాంటి చికిత్స తీసుకోలేదు, ఆమె పరిస్థితికి మానసిక సంబంధమే కారణమని భావించిన ప్రాక్టీషనర్ 20 మార్చి 2020న, ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు.

CC11.3 Headaches + CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic...6TD

మార్చి 28న, తనకు ఒక్కసారి కూడా పార్శ్వపు నొప్పి కూడా రాలేదని ఆమె సంతోషంగా తెలిపారు! మోతాదు TDSకి తగ్గించబడింది. సురక్షితంగా ఉండటానికి, ఆమె TDSని 20 మార్చి 2021న ఆపడానికి ముందు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. వైబ్రోని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు జూలై 2023 వరకు, ఆమె లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు. 

ఫైబ్రో ఎడినోసిస్ 18004...भारत

2019 ఆగష్టు లో 37 ఏళ్ల మహిళకు ఎడమ రొమ్ములో నొప్పితో కూడిన ఎర్రటి గడ్డ ఏర్పడడంతో  ఆమె వైద్యుడిని సంప్రదించారు. USG స్కాన్ తేలికపాటి ఫైబ్రోడెనోసిస్‌ను వెల్లడించింది. ఆమెకు పెయిన్‌కిల్లర్లు మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు సూచించబడ్డాయి, రెండు సంవత్సరాలు తీసుకున్నా, మెరుగుదల లేకపోవడంతో ఆగస్ట్ 2021లో వాటిని ఆపివేసారు. అనంతరం కొన్ని నెలల్లో, గడ్డ పరిమాణం మరియు నొప్పి పెరుగుతోందని ఆమె గమనించి, ఆందోళన చెందారు. 2022  జనవరిలో వైద్యుడిని సంప్రదించగా బయాప్సీని సూచించారు. ఆమె ఎటువంటి హానికర ప్రక్రియను కోరుకోనందున, ఆమె16 ఫిబ్రవరి 2022 న ప్రాక్టీషనర్‌ను సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది:

#1. CC2.3 Tumours & Growths + CC3.7 Circulation + CC8.3 Breast disorders…TDS

ఆ తరువాత ఆమె ప్రాక్టీషనర్ తో కాంటాక్ట్ లొ లేరు కానీ మే 8 తేదీన ఆమె చిరునవ్వుతో ప్రాక్టీషనర్ ను సమీపించి తనకు గడ్డ మరియు నొప్పి మాయమైందని ఉత్సాహంగా తెలియజేసారు. ఇప్పుడు గడ్డ పునరావృతం కాకుండా రెమిడీ మరియు టానిక్ ను కోరుకున్నారు. #1 కింది విధంగా మెరుగుపరచబడింది:

#2. CC8.1 Female tonic + #1…OD

ప్రాక్టీషనర్ మరలా స్కానింగ్ తీయించుకోమని సూచించినప్పటికీ, ఆమెకు దాని అవసరం అనిపించలేదు. జూలై 14న గోళీలు  అయిపోయే వరకు ఆమె #2 తీసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత, జూలై 2023లో, అంతా బాగానే ఉందని, పునరావృతం ఏమీ లేదని ఆమె ధృవీకరించారు.

.రోగి యొక్క టెస్టిమోనియల్: “3 నెలల్లో, నా నొప్పి మరియు కణితి పూర్తిగా అదృశ్యమయ్యాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నేను సాయిబాబా భజనలు మరియు ఇతర సమితి కార్యక్రమాలకు వెళ్తున్నాను. నేను బాలవికాస్ గురు శిక్షణ తీసుకున్నాను మరియు ఇప్పుడు నేను మా గ్రామంలో బాలవికాస్ తరగతులు తీసుకుంటున్నాను”

నిద్రలో ఆయాసం 18004...भारत

ఇండో-చైనా సరిహద్దు దగ్గర పని చేస్తున్న 44 ఏళ్ల పోలీసు, 2010 నుండి దాదాపు ప్రతి రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు గుండె దడతో ఊపిరి పీల్చుకోలేకపోవడం, ఊపిరి ఆడకపోవటం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. గుండె దడ తో హఠాత్తుగా మెలుకువ రాగా గంట లేదా అంతకంటే ఎక్కువసేపు ఇది కొనసాగుతుంది. ఆ తరువాత, ఇది అతనికి రాత్రంతా మెలుకువగా ఉంచుతుంది. అతను నిపుణుడిని సంప్రదించే స్థోమత లేక ఎటువంటి చికిత్స తీసుకోలేదు. అలాగే 2019 నుండి, అతను అధిక BP కోసం సూచించిన మందులు తీసుకుంటున్నప్పటికీ, అది ఇప్పటికీ 160/100 మరియు 80/60 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతోంది. 15 మే 2022, అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:

CC3.1 Heart tonic + CC3.3 High Blood Pressure (BP) + CC3.7 Circulation…TDS 

అతను కాలానుగుణముగా తన వ్యాధి యొక్క స్థితి గతులను ప్రాక్టీషనర్ కు అందించలేకపోయారు. మూడు నెలల తర్వాత, రోగి భార్య తన వ్యక్తిగత చికిత్స కోసం ప్రాక్టీషనర్‌ను సందర్శించినప్పుడు, రెండు వారాల్లోనే తన భర్తకు ఊపిరాడక పోవడం నుండి 100% ఉపశమనం కలిగిందని మరియు అప్పటి నుండి కలత లేకుండా నిద్రపోతుఉండడంతో అతను మరో రెండు వారాల తర్వాత రెమిడీ ని నిలిపివేసాడు, మిగిలిన మాత్రలను భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. అలాగే అతను తన బిపి మాత్రలు వేసుకోవడం కొనసాగించగా అతని బిపి నార్మల్ గా ఉండసాగింది.   

10 ఆగస్ట్ 2023 నాటికి, ఊపిరాడక పోవడం వంటి సమస్యలు లేవని మరియు మంచి నిద్రను పొందగలుగుతున్నట్లు తెలిపారు.

గౌట్ 18004...भारत

76 ఏళ్ల రైతు గత 22 సంవత్సరాలుగా చీలమండలు మరియు మోకాళ్లలో వాపు, మంట, నొప్పితో పాటు వేళ్ల యొక్క కీళ్లలో నొప్పితో బాధపడుతున్నారు. అతను పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, అతనికి జ్వరం కూడా వచ్చేది. 2000 సంవత్సరంలో, అతని రక్త పరీక్షలో యూరిక్ యాసిడ్ పెరిగినట్లు వెల్లడైంది మరియు అతని పరిస్థితి గౌట్‌గా నిర్ధారించబడింది. అతను వివిధ వైద్యుల నుండి చికిత్స తీసుకున్నాడు కానీ గుర్తించదగిన మెరుగుదల లేదు. ప్రతీ రోజూ వైద్యులు సూచించిన పెయిన్ కిల్లర్స్ తీసుకోవడంపైనే ఆధారపడాల్సి వచ్చేది, అయినప్పటికి కూడా పొలాల్లో పని చేస్తూ జీవనోపాధి పొందడం కష్టంగా మారింది.

2018లో, అతనికి పొత్తికడుపు, కాళ్లు మరియు పాదాలలో నొప్పి మరియు మంటలు మొదలయ్యాయి. అతను గ్యాస్, అసిడిటీ లేదా అజీర్ణం వంటి తీవ్రమైన జీర్ణ సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా, అతను మూలికా నివారణలు మరియు యాంటాసిడ్‌లతో ఉపశమనం పొందేవారు. 27 జూన్ 2022న, అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:  

గౌట్ మరియు పాదాలు, కాళ్ళలో మంటలకు:

#1. CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.3 Arthritis…TDS

అజీర్ణ సమస్యలకు:

#2. CC4.5 Ulcers + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion…TDS

రోగికి ఆయుర్వేద మందులు లేదా యాంటాసిడ్‌లు తీసుకోవలసిన అవసరం లేదని భావించారు కానీ అవసరమైనప్పుడు నొప్పి నివారిణిని తీసుకోవడం కొనసాగించారు. జూలై 4న, మోకాళ్లు మరియు చీలమండలలో భరించలేని నొప్పి మరియు జ్వరం ఉన్నట్లు రోగి తెలపడంతో ఇది పుల్ అవుట్ అని భావించి, ప్రాక్టీషనరు #1 మోతాదును BDకి తగ్గించారు. జూలై 10 నాటికి, నొప్పి 50%కి తగ్గింది మరియు భరించగలిగేది ఉండేది కానీ అతని రెండు మోకాళ్లు ఎర్రగా మారాయి. జూలై 17 నాటికి, మోకాళ్లపై ఎరుపు రంగు మాయమైంది కానీ చీలమండలు ఎర్రగా మరియు నొప్పిగా మారాయి. ప్రాక్టీషనర్ #1 బాగానే పని చేస్తున్నదని రోగికి సౌకర్యవంతంగానే ఉన్నదని విశ్వసించారు. జూలై 24 నాటికి, అతని లక్షణాలన్నీ పూర్తిగా అదృశ్యమయ్యాయి! జూలై 31న ఒక వారం తర్వాత, రోగి #2ను ఆపాలని నిర్ణయించుకున్నారు, అయితే BDలో #1ని కొనసాగించారు. ఆగస్ట్ 28న, అతను పొలాల్లో తన పనిని తిరిగి ప్రారంభించారు. సెప్టెంబర్ 2న, అతను #1ని కూడా నిలిపివేశారు.

జూలై 2023 నాటికి, అతను గౌట్ మరియు అన్ని జీర్ణకోశ సమస్యల నుండి పూర్తి విముక్తి పొంది ఆరోగ్యంతో జీవనం కొనసాగిస్తున్నారు.

శ్వాస కోస అలెర్జీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 03609...यूएई

45 ఏళ్ల వ్యక్తి, గత 20 సంవత్సరాలుగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసలో గురక, మరియు పొగ వాసన కారణంగా ఛాతీలో బిగింపు (ఇది ఎగువ వెన్నునొప్పికి కారణమవుతున్నది), డస్ట్ అలెర్జీ కారణంగా ముక్కులో అవరోధం వంటి లక్షణాలతో బాధ పడుతూ ఉపశమనం కోసం రోజూ ఇన్హేలర్లు వాడేవారు. చలికాలంలో ఈ లక్షణాలు తీవ్రమవుతూ ఉండేవి. 31 ఆగస్టు 2022న, అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:

 #1. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic…6TD

ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ఎక్కువగా తినాలని, వంట కోసం కోల్డ్ ప్రెస్డ్ నూనెను వాడాలని, ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం మానేయాలని ప్రాక్టీషనర్ సూచించారు. అలాంటి పద్ధతుల గురించి తెలుసుకున్న పేషంటు ఇప్పుడు వాటిని ఖచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నారు. అక్టోబరు 8 నాటికి, పొగ లేదా ధూళికి గురిఅయినప్పటికీ అతనికి శ్వాసలో గురక లేదు, మరియు శ్వాస తీసుకోవడంలో 50% మెరుగుదల కలిగింది, అతని వెన్నునొప్పి కూడా దాదాపు అదృశ్యమైపోయింది. అతను వారానికి ఒకసారి మాత్రమే ఇన్‌హేలర్‌ను ఉపయోగించాల్సిన అవసరం కలుగుతోంది, త్వరితగతిన ఏర్పడిన ఈ మెరుగుదల ద్వారా ప్రేరణ పొంది, 10 సంవత్సరాలకు పైగా, బయటి ఆహారం తినడం వల్ల తనకు గ్యాస్, ఉబ్బరం మరియు అజీర్ణం ఏర్పడ్డాయని అయితే ఇంటిలో వండిన ఆహారంతో ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేవని తెలిపారు. కాబట్టి #1 క్రింది విధంగా మెరుగుపరచబడింది:

#2. CC15.4Eating disorders+ #1…6TD

ఒక వారం తర్వాత అతను తన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరింత తీవ్రమైందని కనుక ఇన్హేలర్‌ను కొన్ని సార్లు మాత్రమే ఉపయోగించాల్సి వచ్చిందని తెలుపుతూ అక్టోబర్ 24 న ప్రాక్టీషనర్ ను సంప్రదించగా #2ను నిలిపివేసి, #1 పునరుద్ధరించడంతో పాటు విడిగా #3 ఇచ్చారు.:

#3. CC15.4Eating disorders…TDS

ఒక వారంలో రోగికి శ్వాస, గ్యాస్, ఉబ్బరం మరియు అజీర్ణ సమస్యలలో 75% తగ్గుదల ఏర్పడడంతో #1 TDSకి తగ్గించబడింది. నవంబర్ 24 నాటికి, అతను అన్ని శ్వాసకోశ లక్షణాలలో కనీసం 90% వరకు తగ్గిపోవడంతో అతను ఇన్హేలర్‌ను ఉపయోగించడం మానేశారు. అతను ఇప్పుడు ధూళి మరియు అగరవత్తులనుండి వచ్చే ధూపాన్ని తట్టుకోగలుగుతున్నారు అలాగే అతని వెన్నునొప్పి కూడా పూర్తిగా పోయింది. డిసెంబర్ 15న, #1 BDకి తగ్గించబడింది. 15 జనవరి 2023 నాటికి, అతని లక్షణాలన్నీ మాయమయ్యాయి మరియు #1 ODకి తగ్గించబడింది, దానిని నెమ్మదిగా మరింత తగ్గించి మే నెలలో ఆపివేయడం జరిగింది. #3 మార్చిలో నిలిపివేయబడింది. అతనికి 2022-23 లో శ్వాసకోశ సమస్యలు లేని మంచి శీతాకాలము అనుభవించారు.

10 ఆగస్టు 2023 నాటికి, ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవనం కొనసాగిస్తున్నారు. 

మోకాలి నొప్పి 03609...यूएई

57 ఏళ్ల గృహిణి డిసెంబరు 2020 నుండి ఒక సంవత్సరం పాటు మోకాలి కీళ్లలో దృఢత్వం మరియు నొప్పితో బాధపడుతున్నారు. చిన్నప్పటి నుండి సాయి భక్తురాలు కావడంతో, భజనల కోసం నేలపై కూర్చోవడం ఆమెకు అలవాటు. చతికిలబడినప్పుడు మరియు నేలపై నుండి లేచినప్పుడు ఆమె రెండు మోకాళ్లకు తీవ్రమైన నొప్పి ఉంటున్నది. వయసు పెరుగుతున్న కారణంగా వచ్చిన నొప్పి అనీ, ఇది బహుశా నయం కాదని భావించి, ఏ డాక్టర్‌ను సంప్రదించలేదు. ఆ సమయంలోనే  సోదరుడు ప్రాక్టీషనర్ కావడంతో 25 డిసెంబర్ 2021న ఆమెకు క్రింది కాంబో ఇచ్చారు:

CC12.1 Adult tonic + CC20.2 SMJ pain...TDS 

జనవరి 9, 2022 నాటికి, ఆమె తన కీళ్ళలో ధృఢత్వం, బిగింపు స్వల్పంగా తగ్గినట్లు భావించారు, రెండు వారాల్లో మెరుగుదల 25% నుండి 50%కి చేరుకుంది. ఇప్పుడు ఆమె మరింత సులభంగా కూర్చుని లేవగలుగు తున్నారు. 15 ఫిబ్రవరి నాటికి, రెమెడీని ప్రారంభించిన రెండు నెలలలోపే, దృఢత్వం మరియు నొప్పి మాయమయ్యాయి. డోసేజ్ ODకి తగ్గించబడింది మరియు 15 మార్చి 2022న ఆపివేయబడింది. అప్పటి నుండి, ఆమె తన ఇతర ఆరోగ్య సమస్యల కోసం కూడా వైబ్రో రెమెడీలను తీసుకొనసాగారు. ఆగస్ట్ 2023 నాటికి, ఆమెకు మోకాళ్లతో ఎలాంటి సమస్య లేదు.

చర్మము పై మచ్చ 11632...भारत

40 ఏళ్ల మహిళకు గత ఏడాది కాలంగా కుడి భుజంపై 8సెం.మీ x 6సెం.మీ మేర మచ్చ బహుశా రింగ్‌వార్మ్ లేదా తామర వంటిది ఏర్పడింది. ఆమె వంకాయలు, ఎర్రని ఆకుకూర (తెలుగులో గోంగూర), మాంసం లేదా మసాలా ఆహారం తిన్నప్పుడల్లా తీవ్ర దురద ఏర్పడి చీము స్రవిస్తుంది. ఆమె వేరే చికిత్స ఏమీ తీసుకోలేదు, 1 జూలై 2022న, ప్రాక్టీషనర్ క్రింది రెమిడీ ఇచ్చారు:

#1. CC21.3 Skin allergies + CC21.6 Eczema + CC21.7 Fungus + CC21.11 Wounds & Abrasions…BD కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం  

#2. CC4.10 Indigestion + CC10.1 Emergencies + #1

పులౌట్ వంటివి ఏర్పడకుండా  నివారించడానికి, #2 OD వద్ద ప్రారంభించబడింది. మూడు రోజుల తర్వాత ఎటువంటి సమస్య లేకపోవడంతో

జూలై 8న డోసేజ్ BDకి అనంతరం TDSకి పెంచబడింది. జూలై 12న, ఆమె దురద నుండి 100% ఉపశమనం పొందారు కానీ మచ్చ పరిమాణం అలాగే ఉంది. డిసెంబర్ 24 నాటికి, ఇది 50% తగ్గింది మరియు 26 జనవరి 2023 నాటికి 95% తగ్గింది మరియు 23 మార్చి నాటికి అది అదృశ్యమైంది, కాబట్టి #1 ఆపివేయబడింది. జూన్ 20న, #2 BDకి తగ్గించబడింది. రోగి ఈ మోతాదును రోగనిరోధకత మోతాదుగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. జులై 2023 చివరి నాటికి ఆమె ఎలాంటి పునరావృత సమస్య లేనందున ఆరోగ్యంగా ఉన్నారు.

 

పిల్లాడిలో మలబద్ధకం 11604...भारत

సాధారణ ఎత్తు మరియు బరువు ఉండి చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్న ఆరేళ్ల వయస్సు ఉన్న ఒక బాలుడు గత ఐదు సంవత్సరాలుగా మలబద్ధకంతో బాధపడుతున్నాడు. అతను 2 లేదా 3 రోజులకు ఒకసారి గట్టిగా ఉండే మలాన్ని విసర్జించేవాడు; ఇది చాలా బాధాకరం కాబట్టి, అతను టాయిలెట్‌కి వెళ్లకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించేవాడు. రెండు రోజులపాటు మల విసర్జన లేకపోతే, అతను చాలా అశాంతి, కోపం మరియు కొన్నిసార్లు హింసాత్మకంగా ఉండేవాడు. బాలుడి తల్లి గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో చాలా మానసిక ఒత్తిడిని కలిగి ఉండి హైపోథైరాయిడిజం కోసం మందులు తీసుకుంటూ ఉండేవారు. బాలుడు వేర్వేరు వైద్యులు సూచించిన అనేక మందులను ప్రయత్నించాడు, కానీ గుర్తించదగిన మెరుగుదల కనిపించలేదు, కాబట్టి అవి నిలిపివేయబడ్డాయి.

2022 జూన్ 12 న, తల్లి అభ్యాసకుడిని సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది. 

CC4.4 Constipation + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC15.2 Psychiatric disorders…6TD 

అధిక ఫైబర్ గల ఆహారం, పండ్లు మరియు గింజలు మరియు ఉదయాన్నే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు ఇవ్వాలని మరియు సాధారణంగా అతను రోజూ తీసుకునే నీటి పరిమాణం కంటే అధికంగా నీటిని తీసుకోవాలని బాలుని తల్లికి ప్రాక్టీషనర్ ద్వారా సలహా ఇవ్వబడింది. జూలై 10 నాటికి, అతను రోజు విడిచి రోజు సాధారణ మలాన్ని విసర్జించ సాగాడు. మోతాదు TDSకి తగ్గించబడింది. అయితే, అతను ఇప్పటికీ టాయిలెట్‌కు వెళ్లడానికి విముఖత చూపిస్తు ఉండడంతో దీనిని అలవాటుగా చేసుకోవడానికి అతని తల్లి అతనిని బలవంతంగా టాయ్లెట్ కి పంపించ సాగారు. అలాగే, అతని ప్రవర్తనలో 50% మెరుగుదల ఏర్పడి ఇది స్థిరంగా కొనసాగి సెప్టెంబరు చివరి నాటికి, అతను ఇకపై అశాంతి మరియు కోపంతో ప్రకోపించడం తగ్గిపోయాయి.

2022 డిసెంబర్ 7న, అతను ఎలాంటి ఇబ్బంది లేదా నొప్పి లేకుండా ప్రతిరోజూ మలవిసర్జన చేయగలుగుతున్నట్లు తల్లి పేర్కొన్నారు. 2023 జనవరి 1 కి డోసేజ్ BDకి, ఫిబ్రవరి 1న ODకి మరియు జూలై 3న 3TWకి తగ్గించబడింది, దానిని అతను తన తల్లి కోరిక మేరకు అలవాటును కొనసాగిస్తూనే ఉన్నాడు.

 

దెబ్బ వలన ఏర్పడిన డబుల్ విజన్ 03604...यूएसए

2021 సెప్టెంబర్ 20 న, 70 ఏళ్ల వ్యక్తి తన ముఖానికి గృహ ఫర్నిచర్‌ తగలడంతో అతని కుడి కన్ను రక్తసిక్తమై, వాచి, మెత్తగా మరియు నల్లగా కమిలిపోయి అతనికి డిప్లోపియా (డబుల్ విజన్) వచ్చింది. ఇది సహజంగా నయం అవుతుందనే అభిప్రాయంతో, నేత్ర వైద్యుడు ఎలాంటి మందులు ఇవ్వలేదు. గాయం ఒక వారంలోనే నయమైంది కానీ డిప్లోపియా కొనసాగింది; ఇది మెదడుకు విపరీతమైన అలసట కలిగించి అతని సాధారణ పనితీరును కష్టతరం చేసింది. శస్త్రచికిత్స అవసరమయ్యే తీవ్రమైన పరిస్థితి కావచ్చునని భయపడి, అతను నేత్ర వైద్యుడి వద్దకు తిరిగి వెళ్లలేదు, అయితే 2021 నవంబర్ 23 న ప్రాక్టీషనర్‌ను సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది:

#1. CC7.6 Eye injury + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS   నోటి ద్వారా మరియు కంటి చుక్కల రూపంలో స్వేదనజలంలో

డిసెంబర్ 1న, అతని దృష్టిలో ఎటువంటి మెరుగుదల లేనప్పటికీ, అతను మానసికంగా మరియు భావాత్మకంగా ప్రశాంతంగా ఉండగలుగు తున్నారు. ఇది రెమిడీ యొక్క ఊహించని ప్రభావం - స్వాగతించే మార్పు! అయినప్పటికీ, #1 క్రింది విధంగా  మెరుగుపరచబడింది:

#2. CC7.5 Glaucoma + #1, dosage as before

డిసెంబరు 7న, రోగి డబుల్-విజన్ అధ్వాన్నంగా మారిందని, ముఖ్యంగా టీవీ చూస్తున్నప్పుడు మరియు చదివేటప్పుడు ఇబ్బందిగా ఉండేదని తెలిపారు. రెటీనా స్పెషలిస్ట్‌ను సంప్రదించాలనే ఆలోచన కలిగింది కానీ అయితే అదే సమయంలో మెరుగుదల ప్రారంభమై ఒక వారంలో, అతని డబుల్ దృష్టి 85% మెరుగుపడింది.

డిసెంబరు 21న అనగా నాలుగు వారాల తర్వాత, రోగి 100% సాధారణ దృష్టిని పొంది స్వయంగా చికిత్సను తీసుకోవడం మానివేశారు. 2022 జనవరి 7 న, రోగి తను చాలా ఆనందంగా ఉన్నానని, ఉన్నతమైన మానసిక మరియు భావోద్వేగ దృక్పథం, ఎక్కువ ఓర్పు కనబరచడం, మరియు ఉన్నదానిని ఉన్నట్లుగానే అంగీకరించ గలుగుతున్నానని తెలియజేశారు. 9 జూలై 2023 జులై 9 నాటికి. రోగి దృష్టి సాధారణంగానే కొనసాగుతున్నది.

కోవిడ్ అనంతర ప్రభావములు, నడుము నొప్పి 11648...भारत

33 ఏళ్ల మహిళకు ఏప్రిల్ 2021లో కోవిడ్ (డెల్టా) వచ్చింది మరియు రెండు నెలల తర్వాత కోలుకున్నారు. అయినప్పటికీ, ఆమెకు ప్రతిరోజూ ఉదయం ఆమె అన్ని కీళ్లలో నొప్పి మరియు దృఢత్వం మొదలై రెండు గంటల పాటు శరీరాన్ని కదిలించిన తర్వాత మాత్రమే ఇది తగ్గుతుంది. ఆమె చాలా బలహీనంగా భావించింది మరియు రోజంతా శక్తి హీనంగా ఉంటోంది. 2022 జూన్ లో ఆమెకు మళ్లీ కోవిడ్ (ఒమిక్రాన్) సోకింది మరియు 15 రోజుల పాటు స్టెరాయిడ్‌లతో చికిత్స పొందిన తర్వాత కోలుకున్నారు. అయితే ఇప్పుడు ఆచరణాత్మకంగా అన్ని సమయాల్లో ఆమె మరింత బలహీనం ఐనట్లు భావించారు.

అక్టోబరులో, ఇల్లు మారవలసి వచ్చినప్పుడు బరువైన గృహోపకరణాలను ఎత్తినప్పుడు ఆమెకు నడుము నొప్పి ఏర్పడింది, ఇది రాత్రిపూట పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే కొంత మెరుగుదల చూపుతోంది. ఆమె రెండు గంటలకు పైగా కూర్చుంటే, భరించలేని నొప్పి కలిగేది. వైద్యుడు దానిని డిస్క్ ప్రోలాప్స్‌గా నిర్ధారించి కండరాల సడలింపు మరియు నొప్పి నివారణ కోసం మందులు సూచించి చాలా నెమ్మదిగా మరియు జాగ్రత్తగా కదలమని ఆమెకు సలహా ఇచ్చారు. ఇవి ఆమెకు కొంత ఊరటనిచ్చాయి. అలాగే గత 3½ సంవత్సరాలుగా, ఆమెకు అప్పుడప్పుడు తేలికపాటి మైగ్రేన్ వచ్చేది, అయితే కోవిడ్ తర్వాత, అది తీవ్రంగా మారింది, ప్రతి వారం పునరావృతమవుతుండడంతో ఆమె నొప్పి నివారణ మందులను ఆశ్రయించాల్సి వచ్చింది. 2 జనవరి 2023 జనవరి 2న, ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:

కోవిడ్ అనంతరం సమస్యల నిమిత్తము : 

#1. IB Recuperation*…OD

వెన్ను నొప్పి కోసం : 

#2. CC20.5 Spine + CC20.7 Fractures…BD బాహ్య అనువర్తనం కోసం ఆవాల నూనెలో  

ప్రతిరోజూ 10-15 నిమిషాల పాటు నడవాలని, సున్నితమైన స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలని ఆమెకు సలహా ఈవ్వబడింది. చక్కని అనుభూతి కలగడం ప్రారంభమై జనవరి 17 నాటికి, ఆమె బద్ధకం 50% తగ్గింది కానీ ఆమె కీళ్ల నొప్పులు మరియు దృఢత్వం మాయమైంది. ఫిబ్రవరి 1 నాటికి, నీరసం మరియు బలహీనత 70% తగ్గింది, అయితే వెన్నునొప్పి 30% మాత్రమే తగ్గింది. ఆమె మార్చిలో కండరాల సడలింపు కోసం మందు మరియు పెయిన్ కిల్లర్ తీసుకోవడం మానివేశారు. మే ప్రారంభంలో, నడుము నొప్పితో సహా ఆమె కోవిడ్ అనంతర లక్షణాలన్నీ మాయమయ్యాయి, కాబట్టి ఆమె మే రెండవ వారంలో #1 మరియు #2 నిలిపివేశారు.

ఆగస్ట్ 3 నాటికి, ఎటువంటి పునరావృతం లేదు. ఈ మెరుగుదల ద్వారా ప్రోత్సహించబడిన ఆమె ఇప్పుడు పిసిఒడి మరియు కోవిడ్-పూర్వ స్థాయిలో ఆమెకు అప్పుడప్పుడు వచ్చే తేలికపాటి మైగ్రేన్ కోసం చికిత్సను కోరారు.

*కోవిడ్-19 నివారణకు సంబంధించిన అప్‌డేట్ కోసం వాల్యూం 13లోని సెప్టెంబర్/అక్టోబర్ 2022 సంచిక #5ని చూడండి. 

ప్లాన్టార్ ఫాసిటీస్, ఆందోళన, భావోద్వేగాలలో మార్పు 03611...यूएसए

40 ఏళ్ల మహిళ తన ఎడమ పాదం అరికాలిలో (మడమ భాగంలో అధికంగా) కత్తితో పొడిచినట్లుగా నొప్పి, వాపు మరియు దృఢత్వం కారణంగా 2022 మార్చి నుండి కుంటుతు నడుస్తోంది.  వైద్యుడు దానిని ప్లాంటర్ ఫాసిటిస్ (పాదం దిగువన మడమను కాలితో కలుపుతు ఉన్న ఫైబరస్ కణజాలం యొక్క వాపు) అని తెలిపి ఆమెకు పెయిన్ కిల్లర్స్ రాసి, ఐస్ తో రాసుకోవాలని, షూస్ మార్చుకోవాలని, నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఆమె మందులు వేసుకున్నారు, మరియు సలహాలను శ్రద్ధగా అనుసరించారు, కానీ ఎటువంటి ఉపశమనం కలగలేదు. మరికొందరు వైద్యులను కూడా సంప్రదించినా ఫలితం లేకపోయింది.

ఏప్రిల్‌ నెలలో ఆమె కూర్చున్నసమయంలో కూడా నొప్పి భరించలేనంతగా మరియు నిరంతరాయంగా కొనసాగడంతో ఇది ఆమె రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేసింది. దీనితో ఆమె ఆందోళన మరియు ఒత్తిడికి గురైనారు. ఆమె చిన్నవిషయాల గురించి చిరాకుపడడం, తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటానికి వెనుకాడడం, మరియు మానసిక కల్లోలం కలిగి ఉంటున్నారు.  ఇవన్నీ మైగ్రేన్ వంటి తలనొప్పికి దారితీశాయి. చివరికి, ఆగస్టులో, ఒక వైద్యుడు ఆమె పాదాల స్నాయువులకు శస్త్రచికిత్స చేయాలని సూచించాడు, కానీ ఆమె నిరాకరించారు.

అదనంగా 2018 ఫిబ్రవరి నుండి ఆమె అధిక రక్తస్రావంతో కూడిన బాధాకరమైన రుతుక్రమంతో బాధపడుతున్నారు. హెచ్‌బి స్థాయి 9 లీ పడిపోయి రక్తహీనతకు గురైనారు, కాబట్టి రోజువారీ పనులను చేస్తున్నప్పుడు చాలా బలహీనంగా మరియు నీరసంగా అనిపించేది మరియు చిన్న విషయాలకే చిరాకు కలిగేది. 2021 ప్రారంభంలో ఆమె కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత, ఆమె రుతుక్రమంలో తరచుగా మార్పులు కలిగి కొన్నిసార్లు, రక్తస్రావం ఋతు చక్రం అంతటా కొనసాగేది. ఇది ఒక సంవత్సరానికి పైగా కొనసాగింది. ఆమె దీనికి ఎటువంటి చికిత్స తీసుకోలేదు, కానీ ఆహారం, మల్టీవిటమిన్లు, గృహ చిట్కాలతో మరియు విశ్రాంతితో సరిపెట్టుకునే వారు. అయితే, ఆమెకు అత్యంత ముఖ్యమైన సమస్య మడమ నొప్పి. ఆమె 26 ఆగస్టు 2022న ప్రాక్టీషనర్‌ని సందర్శించినప్పుడు ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది

ప్లాంటార్ ఫాసిలైటిస్: 

#1. CC3.7 Circulation + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine...every 10 min for first 2 hours and then QDS 

ఇమ్యూనిటీ మరియు సాధారణ ఆరోగ్యం కోసం: 

#2. Immunity Booster*…BD 

అధిక రక్తస్రావం, ఆందోళన, భావోద్రేకాల నియంత్రణ కోసం : 

#3. CC3.1 Heart tonic + CC8.7 Menses frequent + CC15.2 Psychiatric disorders…TDS

1వ వారంలో, మడమ నొప్పిలో 15% మెరుగుదల కలిగింది, ఆపై మూడు నెలల్లో, రోగి తన లక్షణాలన్నింటిలో వివిధ స్థాయిలలో స్థిరమైన మెరుగుదలని అనుభవించారు. డిసెంబర్ 10 నాటికి, ఆమెకు మడమ నొప్పి, ఒత్తిడి మరియు మానసిక అలజడి 80%, బలహీనత మరియు బద్ధకంలో 50% మరియు రుతుక్రమం నొప్పి 35% మెరుగుపడి  రక్తస్రావం ముదురు నుండి మధ్యస్థ ఎరుపుకు మారిపోయింది. ఆమెకు ఇక తలనొప్పి ఏమాత్రం లేదు. ఆమె తన రోజువారీ జీవితంలో సానుకూల దృక్పథాన్ని, మెరుగైన కుటుంబ సంబంధాలను కొనసాగిస్తూ పనిపై ఎక్కువ శ్రద్ధ కనబరచ గలుగుతున్నారు.

డిసెంబర్ 28 నాటికి, మడమ నొప్పి, ఒత్తిడి మరియు మానసిక కల్లోలం అదృశ్యమయ్యాయి. బలహీనత మరియు నీరసంలో 70% మెరుగుదల ఏర్పడింది, రుతుక్రమం సమస్య మరింత తగ్గి రక్తం యొక్క రంగు సాధారణమైంది. ఆమె కుటుంబ జీవితాన్ని మరియు తన పనిని ఆస్వాదించడం ప్రారంభించారు. 7 జనవరి 2023 జనవరి 7న, #1 TDSకి తగ్గించబడి, ఆపై క్రమంగా తగ్గించబడుతూ   ఫిబ్రవరి 15న ఆపివేయబడింది.

2023 ఆగష్టు 5 నాటికి, మడమ నొప్పి పునరావృతం కాలేదు; ఆమె #2 మరియు #3 విషయంలో మంచి పురోగతి ఉండడంతో డోసు విషయంలో యధాతధంగా కొనసాగిస్తున్నారు. బలహీనత మరియు బద్ధకంలో అప్పటికే 95% మెరుగుదల ఉంది.

*కోవిడ్-19 నివారణకు సంబంధించిన అప్‌డేట్ కోసం వాల్యూం 13లోని సెప్టెంబర్/అక్టోబర్ 2022 సంచిక #5ని చూడండి

ప్రాక్టీషనర్ల వివరాలు 03586...क्रोएशिया

ప్రాక్టీషనర్ 03586...క్రొయేషియా  లైబ్రేరియన్‌షిప్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్న ఈ ప్రాక్టీషనర్ గత 36 సంవత్సరాలుగా క్రొయేషియాలోని జాదర్ సిటీ లైబ్రరీలో పని చేస్తున్నారు. ఆమె ప్రతిభావంతులైన సంగీత విద్వాంసురాలు మరియు కళాకారిణి, అంతేకాక ప్రత్యామ్నాయమ వైద్యం మరియు యోగా పట్ల మక్కువ కలిగి ఉన్నవారు. 1986లో ఆమెకు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె శ్రీ సత్యసాయి బాబాను మొదటిసారిగా టెలివిజన్‌లో చూసి అనిర్వచనీ యమైన ప్రేమ భావనతో ఉప్పొంగిపోయి స్వామి వైపు ఆకర్షించబడి అనుబంధం పెంచుకున్నారు. ఆమె తర్వాత లైబ్రరీలో ఉద్యోగం పొందిన తరువాత స్వామి  గురించిన పుస్తకాలు చదవడం ప్రారంభించి పుట్టపర్తిలోని స్వామి ఆశ్రమం చిరునామాను కనుగొన్నారు. తనకు కొంత విభూతి కావాలని ఆ చిరునామాకు ఉత్తరం పంపారు. ఒక నెల తర్వాత, మరొక నగరంలో (స్ప్లిట్) ఉన్న తన స్నేహితురాలిని సందర్శించినప్పుడు, ఆమెకు ఒక చిన్నపెట్టె ఇస్తూ ఆ స్నేహితురాలు 'ఎవరో 'కొంతమంది' సాయిబాబా నుండి ఈ పవిత్రమైన పొడిని నాకు ఇచ్చారు నీకే ఇవ్వాలి అనిపించింది అన్నారు. ’ స్వామి మీద తనకున్న ప్రేమ గురించి ఎవరికీ చెప్పకపోయినా అసంకల్పితంగా వచ్చిన ఈ గిఫ్ట్ ఆమెను ఆశ్చర్య చకితురాలిని చేసింది. ఆమె చివరికి లుకేమియాతో బాధపడుతున్న స్నేహితుడికి ఈ విభూతి ఇచ్చారు. ఆమె ఉంటున్న నగరంలో సాయి కేంద్రం లేనప్పటికీ, ఆమె సత్సంగ సభ్యులైన ఇతర సాయి భక్తులను కలుసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో పుట్టపర్తికి వెళ్లిన వారు ఆమెకు పలుమార్లు విభూతి అందించడం వల్ల ఆమెకు ఎంతో మేలు జరిగింది. టీవి ద్వారా కలిగిన స్వామి యొక్క ఆ ఒక్క దర్శనం ఆమెపై ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపి, ఇప్పుడు ఆమె జీవితంలో తన ఏకైక లక్ష్యం అన్ని జీవరాశులకు కరుణతో నిస్వార్థంగా సహాయం చేయడమేనని విశ్వషించేలా చేసింది. 17 సంవత్సరాలుగా ఆమె ప్రతిరోజూ వీధి పిల్లులకు ఆహారం ఇస్తున్నారు, ఇంకా పబ్లిక్ కిచెన్‌లు మరియు కుక్కల ఆశ్రయాలకు క్రమం తప్పకుండా ఆహారాన్ని తీసుకువెళుతున్నారు.

వీరు ప్రశాంతినిలయంలోని బాబా ఆశ్రమాన్ని సందర్శించాలనుకున్నారు కానీ ఆమె జీవన స్థితిగతులు, ఆర్ధిక పరిస్థితులు, మరియు యుద్ధం ఆమెను భారతదేశానికి వెళ్లడానికి అనుమతించక పోవడంతో 2018   వరకు ఆమె పుట్టపర్తికి చేరుకోలేకపోయారు. ఒక రోజు ఉదయపు ధ్యానం తర్వాత ఆమె చేతిలో నుండి ఒక కొవ్వొత్తి కింద పడిపోయి స్వామి చిత్రం నేలపై ఆ మైనపు ముద్దలో                     

ఏర్పడింది. అనంతరం ఆమె స్నేహితురాలు స్వామివారి తోటలో ప్రాక్టీషనర్ మరియు ఆమె కుమార్తెతో పలు సెల్ఫీలు దిగారు. తోటలోని వివిధ ప్రాంతాలలో తీయబడిన అలాంటి రెండు ఫోటోలలో ఎవరికీ కనిపించని రెండు ఇంద్రధనస్సులు చిత్రీకరింపబడ్డాయి! ఒక సంవత్సరం తర్వాత ఆమె రెండవ దర్శనానికి వచ్చి పుట్టపర్తిలో నడుస్తూ ఉన్నప్పుడు ఆమె కుమార్తె స్కార్ఫ్ పై స్వామివారి లాకెట్ సాక్షాత్కరించింది.

తరువాతి సంవత్సరాలలో, ఆమె స్వామి తాలూకు అనేక అద్భుతాలు చిన్నవి గానీ పెద్దవి గానీ అనేకం అనుభవిస్తూ నిరంతరం స్వామి ఉనికిని మరియు మార్గదర్శకత్వాన్ని పొందారు. ఆమె ఇంట్లోఉండే ఒక పిల్లికి మరియు తన కుటుంబ సభ్యులకు చికిత్స చేసిన ప్రాక్టీషనర్ ద్వారా వైబ్రియానిక్స్‌కు పరిచయం చేయబడి ఈ వ్యవస్థ అందించే సేవా అవకాశం ద్వారా ప్రేరణ పొందారు. అదే ప్రాక్టీషనర్ ద్వారా, 2019 సెప్టెంబరు లో రాజధాని నగరం జాగ్రెబ్‌లో వైబ్రియానిక్స్‌పై జరగనున్న సెమినార్ గురించి ఆమె తెలుసుకున్నారు. ఆమె ఎంతో ఆసక్తితో ఆ వర్క్‌షాప్‌కు హాజరై AVP అయ్యారు. అప్పటి నుండి ఆమె అనేకమంది రోగులకు, జంతువులకు మరియు మొక్కలకు చికిత్స చేసారు.

వైబ్రియానిక్స్‌ను అభ్యసించడం ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించడమే కాక ప్రాక్టీషనరుగా ఇట్టి అవకాశం కల్పింపబడినందుకు  కృతజ్ఞతతో మాత్రమే కాకుండా, ఆమె తన రోగులకు ఇస్తున్న రెమిడీలు స్వామి స్వయంగా ఆశీర్వదిస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతను వ్యక్తంచేస్తున్నారు. ఒకసారి ఆమె ఒక కుటుంబానికి రెమిడీలు తయారు చేయవలసి ఉన్నందున కొన్ని సీసాలలో చక్కర గోళీలతో నింపి ఒక అత్యవసర పని నిమిత్తం ఈ పనిని అరగంట నిలిపివేశారు. ఆనంతరం ఆమె తిరిగి వెళ్లి ప్రతీ రోగికి రెమిడీలు చేయడం ప్రారంభించి ఆమె చివరి సీసాకి వచ్చేసరికి, ఇదిగో, ఫోటోలో చూపిన విధంగా అది చెక్కర గొళీలకు బదులుగా అమృతాన్ని కలిగి ఉంది!

అలెర్జీలు మరియు మధుమేహంతో బాధ పడుతున్న అనేక మంది రోగులలో అద్భుతమైన ఫలితాలను పొందారు, ఆమె ఈ రోగాలలో ఒక్కొక్క్ దానికి ఒక ఉదాహరణ క్రింద వివరించారు.

గత ఐదేళ్లుగా వసంతకాలం ప్రారంభములో ఏర్పడే అలెర్జీలతో బాధపడుతున్న 32 ఏళ్ల వ్యక్తికి 2020 మార్చిలో ఆమె చికిత్స చేసారు. అతనికి తుమ్ములు మరియు కళ్లవాపు వంటి లక్షణాలు ఉన్నాయి. ప్రాక్టీషనర్ అతనికి CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies ఇచ్చారు. లక్షణాలు పునరావృతం కాకుండా కొన్ని రోజుల్లో అదృశ్యమయ్యాయి! యవ్వనం నుండి మధుమేహంతో బాధపడుతున్న 75 ఏళ్ల మహిళ 2021 జూన్ నెలలో ఆమెను సంప్రదించించారు. ఆమె అల్లోపతి మందులు తీసుకుంతున్నప్పటికి ఆమె రక్తంలో చక్కెర శాతం ఎక్కువగానూ మరియు హెచ్చుతగ్గులకు లోనౌతూ ఉంటోంది. మందులు నిలిపివేయవద్దని ఆమెకు సలహా ఇస్తూ, ప్రాక్టీషనర్ ఆమెకు CC6.3 Diabetes ప్రతిరోజూ ఉదయమే మేల్కొన్నప్పుడు ఖాళీ కడుపుతో తీసుకోవాలని సూచించారు. ఐదు రోజుల్లో ఆమె రక్తంలో చక్కెర సాధారణ స్థితికి రావడమే కాక రెండు సంవత్సరాల పాటు స్థిరంగా ఉంది, ఆ తర్వాత ఆమె రోగితో సంబంధాన్ని కోల్పోయింది

వైబ్రియానిక్స్‌ను పరిచయం చేసినందుకు ప్రాక్టీషనర్ స్వామికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఏదీ యాదృచ్ఛికం కాదని, అంతా ఆయన సంకల్పంతోనే జరుగుతుందని ఆమె గ్రహించారు. రోగులు వారి దైనందిన జీవితంలో మార్పులు చేసుకోవడానికి చూపే  సుముఖతపై ఫలితాలు తరచుగా ఆధారపడి ఉంటాయని ఆమె ప్రాక్టీస్‌లో తెలుసుకున్నారు. వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ ఆమె తన జీవితంపై శక్తివంతమైన పరివర్తన ప్రభావం చూపడమే కాక ప్రతీ రోజు, ఆమె మంచి వ్యక్తిగా మారడానికి ప్రయత్నించ సాగారు. ఈ సేవలో తనను పర్యవేక్షించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి స్వామి అనుక్షణం తనను సిహుస్తూనే ఉన్నారని ఆమె భావన.

స్వామిపై విశ్వాసం చాలా ముఖ్యమని ఆమె భావన. మానసికంగా దేవునికి దూరంగా వెళ్లడం ద్వారానే వ్యక్తి వ్యాధి బారిన పడతారని ఆమె విశ్వాసం. ప్రతికూల ఆలోచనలు తరచుగా వ్యాధిని ప్రేరేపిస్తాయి. బలమైన విశ్వాసం ఉంటే, ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె భావిస్తారు. స్వామి మనకు ఏది మంచిదో అదే చేస్తారని విశ్వసించండి, వర్తమానంలో స్వామి చర్య పట్ల బాధగా అనిపించినా ఫలితం ఏదైనప్పటికీ కృతజ్ఞతతో ఉండండి. మనకు హాని చేసిన వారి పట్ల కూడా కృతజ్ఞతా దృక్పథం, కలిగి ఉండండి ఎందుకంటే ఈ వ్యక్తులు తరచుగా మనకు ముఖ్యమైన బోధకులుగా ఉన్నందున, ఈ భావమే మనల్ని ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంచుతుంది. ప్రతి ఒక్కరికీ సహాయం చేయడమే ఆమె లక్ష్యము, ఎందుకంటే ప్రజలు మరియు జంతువులు, కూడా తమను తాము జాగ్రత్తగా చూసుకోవడంలో బలహీనులు.

ఉదహరించిన కేసు చరిత్రలు :

ప్రాక్టీషనర్ల వివరాలు 18004...भारत

ప్రాక్టీషనర్ 18004…ఇండియా  BA డిగ్రీని కలిగిన ఈ ప్రాక్టీషనర్ 2001 నుండి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. వీరు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌లోని మారుమూల జిల్లాలో నివసిస్తున్నారు, ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వం నిర్వహించే సింకోనా తోటలలో పని చేస్తారు.

1996లో వీరు బాబా గురించి మొదటిసారిగా తనకు లభించిన రెండు పుస్తకాల ద్వారా - “నర నారాయణ గుహ ఆశ్రమంమరియుబాబా యొక్క అద్భుతాలు” తెలుసుకున్నారు. అతను డిసెంబర్ 1997లో పుట్టపర్తిలో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేసినప్పుడు సాయిని మొదటిసారిగా వర్చువల్ దర్శనం చేసుకున్నాడు. 2000 లో ప్రశాంతి నిలయంలో శిక్షణ పొంది బాలవికాస్ ఉపాధ్యాయుడయ్యారు. 2001లో అతని గ్రామంలో సాయి భజన బృందం ఏర్పడింది మరియు అప్పటి నుండి అతను క్రియాశీల సేవాదళ్‌గా కొనసాగుతున్నారు. అతను ప్రస్తుతం సమితి సేవా కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు, అలాగే ప్రక్కనే ఉన్న  గ్రామంలో బాలవికాస్ బోధిస్తున్నారు.

డాక్టర్ అగర్వాల్ వైబ్రియానిక్స్ గురించి మాట్లాడుతున్న యూట్యూబ్ వీడియోను చూసిన తర్వాత, దీని గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగింది. కొన్ని వార్తాలేఖలను కూడా చదివి, ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా, ప్రజలు ఎంత అద్భుతంగా నయమయ్యారో చూసి ఆశ్చర్యపోయారు! ఆ సమయంలో అస్వస్థతతో ఉన్న తన భార్యకు చికిత్స చేయించుకోవాలని, తాను కూడా ప్రాక్టీషనర్‌గా మారాలని స్ఫూర్తి పొందారు.

ఇంగ్లీషు మరియు హిందీ భాషలలో అతనికి పట్టు లేకపోవడం, మరియు వైద్య పరిజ్ఞానం పూర్తిగా లేకపోవడం వల్ల అతను శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి మొదట్లో సంశయించారు. తన మారుమూల గ్రామంలో ఇంటర్నెట్ కనెక్షన్ దయనీయంగా ఉన్నందున అతను ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావడం గురించి కూడా భయపడ్డారు. గడువు ముగిసిన మూడు నెలల తర్వాత, అతను తన దరఖాస్తు ఫారమ్‌ను ఎంపిక బృందానికి పంపడానికి ప్రయత్నించగా అది అమలు కావడంలో విఫలమైందని సందేశం వచ్చింది. మనకు అనేక సందేహాలు ఉండవచ్చు, అమలుకావడంలో అనేక అడ్డంకులను ఎదురుకావచ్చు. కానీ భగవంతుని సంకల్పాన్ని ఏ శక్తి ఆపలేదు. అతనిని ఆశ్చర్యపరిచే విధంగా, అతని తన దరఖాస్తు ఆమోదించబడిందని మరియు ప్రాక్టీషనర్ కావడానికి మొదటి మెట్టును క్లియర్ చేసినట్లు నిర్ధారణను అందుకున్నారు! అతను డిసెంబర్ 2021లో APకి అర్హత సాధించారు.

వీరు వైబ్రియానిక్స్ పరీక్ష కోసం చదువుతున్నప్పుడు, స్వామి అనేక సందర్భాలలో తన సర్వవ్యాపకత్వము గురించి అతనికి అనేక నిదర్శనాలు ఇచ్చారు; ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి వీరి కుమారుడు పాల కుండను అధిక మంటపై ఉంచి దాని గురించి మరచిపోయాడు, కానీ అ తరువాత అద్భుతం జరిగినట్లుగా గ్యాస్ స్టవ్, తక్కువ మంటలో ఉన్నట్లు  కనుగొనబడింది. మరో సందర్భంలో, ఇంట్లో ఎవరూ చేయనప్పటికీ,ఎలక్ట్రిక్ కెటిల్ యొక్క మెయిన్ స్విచ్ ఆఫ్ చేయబడిందని అతని భార్య గుర్తించారు. దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు సెలవుపై వెళ్లినప్పుడు, ఇరుగుపొరుగు వారు తాళం వేసి ఉన్న వీరి ఇంటిలోపల ఎవరో నడుస్తున్నట్లు వెలుగునీ, నీడనీ చూశామని తెలిపారు. వారు తిరిగి వచ్చిన తరువాత చూస్తే ఇల్లు తాము  విడిచిపెట్టినప్పుదు ఎలా ఉందో అ విధంగానే ఉందని నిర్ధారించుకున్న తర్వాత, ప్రాక్టీషనరు తాము దూరంగా ఉన్నప్పుడు స్వామి వారి ఇంటికి కాపలాగా ఉన్నారని నిర్ధారించుకున్నారు.

ఈ ప్రాక్టీషనర్ తన కుటుంబం మరియు అతని గ్రామంలోని ప్రజలకు చికిత్స చేయడం ద్వారా ప్రారంభించారు, కానీ క్రమంగా 'అద్భుత నివారణల' కథలు పొరుగు గ్రామాలకు వ్యాపించి త్వరలోనే వీరి క్లినిక్ రోగులతో కిక్కిరిసిపోవడం ప్రారంభమయ్యింది. కొన్నిసార్లు రోజుకు 250 వరకు కేసులు చూడవలసి వచ్చేది. తనది ఫుల్ టైమ్ జాబ్ ఐన కారణంగా అతను కొన్నిసార్లు రోగులను అర్థరాత్రి వరకు చూడవలసి వచ్చేది. చివరకు రోగుల ప్రవాహాన్ని నియంత్రించమని స్వామిని ప్రార్థించడంతో ఇప్పుడు అతను ప్రతి రోగికి తగిన సమయాన్ని కేటాయించగలుగుతున్నారు. వైద్య పరిభాషలో ఎటువంటి పరిజ్ఞానం లేకుండా, అతను రోగి యొక్క రిపోర్టులను అర్థం చేసుకోగలుగు తున్నారు. అదే సమయంలో సరైన కాంబో ఇవ్వడానికి మార్గదర్శకత్వం వహించమని స్వామిని గాఢంగా ప్రార్దిస్తారు. తరువాత, రోగి లక్షణాలను ఆన్‌లైన్‌లో వెతుకుతున్నప్పుడు, ప్రతి సందర్భంలోనూ స్వామి సరైన కాంబో ఇచ్చేందుకు మార్గనిర్దేశం చేసినట్లు అతను కనుగొన్నారు! కొంతకాలం తరువాత వీరు ఆన్‌లైన్ ద్వారా ప్రాథమిక వైద్య కోర్సుకు హాజరయ్యారు, అంతేకాక వివిధ వ్యాధులపై ఆన్‌లైన్ వీడియోలు, రిపోర్టులు మరియు స్కాన్‌లు ద్వారా వ్యాధిపై అవగాహన పెంచుకున్నారు.

వివిధ రకాల జబ్బులకు చికిత్స చేయడంలో అతను అద్భుతమైన విజయాన్నిసాధించారు. 60 ఏళ్ల వృద్ధురాలు ఐదేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ మెట్లు ఎక్కేందుకు, దిగేందుకు ఇబ్బంది పడేవారు, వైబ్రో రెమెడీ యొక్క ఒక డోస్ ఇచ్చిన తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చి మెట్లపైకి, క్రిందికి సులభంగా మరియు నొప్పి లేకుండా వెళ్ళగలిగేవారు. ఒక్క డోస్‌తో అద్భుత వైద్యం!

రెండు మూత్ర పిండాల వైఫల్యము, పోస్ట్-సి-సెక్షన్ తో ఉన్న32 ఏళ్ల మహిళకు ప్రాక్టీషనర్ చికిత్స చేశారు. ఆమె క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉండడంతో డయాలసిస్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆమె రెండు రౌండ్ల డయాలసిస్ చేయించుకున్నారు కానీ, అదే స్థితిలో ఉన్న మరొక రోగి చనిపోవడాన్ని చూసి, ఆమె ప్రాణ భయంతో చికిత్సను నిలిపివేసారు. ఇలా నిర్ణయించు కోవడానికి ఆర్థిక పరిమితి కూడా ఒక కారణమైంది. ఒక నెల తర్వాత, రోగి యొక్క భర్త ప్రాక్టీషనర్‌ను సంప్రదించి తన భార్యకు మూత్రంలో రక్తంతో కూడిన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ UTI, మైకము, ఆమె ముఖం మరియు పాదాలలో తిమ్మిరి, వొళ్ళునొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి మరియు మలబద్ధకం గురించి చెప్పారు. ఆమెకు #1. CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC13.2 Kidney & Bladder infections + CC13.4 Kidney failure…6TD. ఇవ్వబడింది. మర్నాడు ప్రాక్టీషనర్ సందర్శనాకు వెళ్ళి ఆమెకు అదనపు కొంబోలు ఇచ్చారు: #2. CC3.7 Circulation + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue; #3. CC4.4 Constipation + CC4.8 Gastroenteritis and #4. CC3.3 High Blood pressure (BP) + CC12.4 Autoimmune diseases. మూడు వారాల తర్వాత, రోగి ఆమె పొత్తికడుపులో తీవ్రమైన నొప్పిని గురించి తెలిపారు, మరో రెండు రోజుల తర్వాత మూత్రవిసర్జన సమయంలో ఒక మాంసపు ముద్ద వంటి పదార్ధాన్ని విసర్జించారు. ఆ తర్వాత ఆమె కడుపు నొప్పి తగ్గింది. రెండు నెలల్లోనే, క్రియాటినిన్ మరియు యూరియా దాదాపు సాధారణ స్థాయికి వచ్చాయి మరియు రోగి ఇంటి చుట్టూ కొన్ని దైనందిన పనులు చేయడానికి సరిపోయేంత శక్తి చేకూరినట్లు అనుభూతి చెందారు! రెండు నెలల క్రితమే ఆశలు పూర్తిగా  కోల్పోయిన ఆ దంపతులు సాధకుడికి, స్వామి పట్ల కృతజ్ఞతతో నిండిపోయారు.

మరో కేసులో తన మొదటి వివాహం అనంతరం ఇద్దరు పిల్లలతో కూడిన 31 ఏళ్ల మహిళ తన రెండవ భర్తతో గర్భం దాల్చలేకపోయింది. ప్రాక్టీషనర్ ఆమెకు CC8.4 Ovaries & Uterus + CC8.5 Vagina & Cervix + CC8.7 Menses frequent…TDS.అందించారు. ఒక నెల తర్వాత ఆమె భర్త ఆమెకు వాంతులు కోసం ఒక ఔషధాన్ని తీసుకొనడానికి వచ్చారు, CC8.9 Morning sickness వారికి ఇవ్వబడింది. పది నెలల తర్వాత ఆమె ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చారు!

దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, దీర్ఘకాలిక గౌట్, రొమ్ము కణితులు, అనారోగ్య సిరలు, సయాటికా, గ్యాస్ట్రిక్ అల్సర్లు మరియు లివర్ సిస్ట్‌లకు చికిత్స చేయడంలో ప్రాక్టీషనర్ అద్భుతమైన ఫలితాలను పొందారు. వైబ్రో చికిత్స ప్రారంభించిన తొమ్మిది రోజుల తర్వాత ఒక రోగి 3 మిమీ మూత్రపిండ రాయిని విసర్జించాడు. దీర్ఘకాలిక గౌట్‌తో బాధపడుతున్న తన రోగులందరూ వైబ్రో చికిత్స ప్రారంభించిన తర్వాత భరించలేని నొప్పిని అనుభవించడాన్ని ప్రాక్టీషనర్ గమనించారు. తీవ్రమైన పులౌట్ కారణంగా కొందరు కొంబో ఆపేస్తారు, అయితే పట్టుదలతో నొప్పి భరించినవారు దాదాపుగా ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ వ్యవధిలో నయమయ్యారు. మధుమేహం మరియు BP ఉన్న అతని రోగులలో కొందరు వారి అల్లోపతి మందులను నిలిపివేసారు మరియు గత ఒక సంవత్సరం నుండి వైబ్రియానిక్స్ మాత్రమే తీసుకుంటున్నారు. మూత్రపిండాలు, గుండె, వెన్నెముకకు సంబంధించిన సమస్యలకు CC3.7 Circulation  చాలా ప్రభావవంతంగా ఉంటుందని ప్రాక్టీషనర్ కనుగొన్నారు.

2022 లో, ప్రాక్టీషనర్ ఒక్కరే 1400 మంది రోగులకు చికిత్స అందించారు మరియు 500 IB బాటిళ్లను కూడా పంపిణీ చేశారు! అతను ఇప్పుడు వారానికి మూడుసార్లు రోగులను చూస్తూ వారానికోసారి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ చేయడం తనకు 'గేమ్ ఛేంజర్' అని ఆయన తెలిపారు. అతను తన నిస్వార్థ సేవతో వందలాది మంది ప్రజల అభిమానాన్ని పొందడమే కాక ఈ చికిత్స పూర్తిగా ఉచితం అంటూ అందర్నీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నారు. వైబ్రోను అభ్యసించడం అతని స్వంత వ్యక్తిగత సాధనను తీవ్రతరం చేయడంలో సహాయపడింది. ప్రాక్టీషనర్ ఎల్లప్పుడూ రెమిడీలు సిద్ధం చేస్తున్నప్పుడు ప్రార్ధించడమే కాక తన రోగుల సంక్షేమం కోసం అదనంగా ప్రతీరోజూ లిఖిత జపం మరియు రుద్రం జపిస్తారు. 2025లో స్వామి శత జయంతి సందర్భంగా, ఈ శ్లోకాల నుండి వచ్చే ప్రకంపనలు వైబ్రో కాంబోలను మరింత ప్రభావవంతం చేసేలా చేయడం వల్ల సాధకులందరూ నేర్చుకుని స్వామికి రుద్రం సమర్పించాలని ఆయన సూచించారు. ఆత్మ-సాక్షాత్కారానికి మరియు, సేవ యొక్క ఆనందంలో మునిగి పోవ్ఆడానికి, సాయి వైబ్రియానిక్స్ మార్గమును సుగమం చేసిందని వీరు భావిస్తారు. ప్రాక్టీషనర్ నిరంతరం తన చుట్టూ స్వామి ఉనికిని అనుభవిస్తారు.

 ఉదహరించిన కేసులు :

 

ప్రశ్న జవాబులు

Q1. వైబ్రియానిక్స్ హోమియోపతి తో ఎలా అనుసంధానింపబడింది, ఇది వేగవంతమైన చికిత్సను అందిస్తుందా? 

A. వైబ్రియానిక్స్ మరియు హోమియోపతి రెండూ శరీర సంబంధిత శక్తి కేంద్రాలను సమతుల్యం చేయడం ద్వారా నివారణను సాధించడానికి ఒక పదార్ధం యొక్క ఒకే ప్రాథమిక కంపనాన్ని ఉపయోగించుకుంటాయి. అలాగే ఈ రెండు చికిత్సావ్యవస్థలు మనకు భగవంతునిచే అందించబడినందున, ఒకదానిపై మరొక దాని యొక్క ఆధిపత్యాన్ని నిర్ధారించ లేము. వైబ్రియానిక్స్ మానవాళికి ఉచిత సేవగా ఆచరించబడుతోంది కాబట్టి, ప్రాక్టీషనర్ యొక్క ప్రేమ మరియు సానుభూతి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, తద్వారా వేగవంతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ చికిత్సా వ్యవస్థను స్వామి వ్యక్తిగతంగా అనేకసార్లు ఆశీర్వదించడం వలన స్వామి యొక్క ప్రత్యేక శక్తి దీనికి మరింత మద్దతు ఇస్తుంది. ఒక అదనపు అంశం ఏమిటంటే, సిస్టమ్‌పై పూర్తి మరియు దృఢమైన విశ్వాసం ఉన్నవారు మాత్రమే వైబ్రియానిక్స్ సాధనకు ఎంపిక చేయబడతారు మరియు ఇది ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

 _______________________________________________________________________________

Q2. కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎరిస్ యొక్క ఆవిర్భావం దృష్ట్యా IB రెమిడీ లో ఏమైనా మార్పు ఉందా?  

ఎ. ఎరిస్ యొక్క లక్షణాలు ఒమిక్రాన్ మాదిరిగానే ఉంటాయి కాబట్టి, మన ఇమ్యూనిటీ బూస్టర్ IB యొక్క కొత్త వెర్షన్ వాటిని బాగా కవర్ చేస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా, IBని ప్రొఫైలాక్టిక్‌గా కొనసాగించాలని సూచింప బడింది. 

_______________________________________________________________________________

 Q 3. నోసోడ్‌ను ఎప్పుడు తయారు చేయాలనే విషయంలో దాని గురించి నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను? 108CCలు లేదా 576 కార్డ్‌లను ఉపయోగించి తయారుచేసిన రెమెడీ నుండి ఆశించిన ఫలితాలను లభించని తర్వాత మాత్రమే నేను నోసోడ్‌ని ఉపయోగించాలా?

A. 108CCలు మరియు 576 కార్డ్‌లు రెండూ ఏ వ్యాధికైనా నివారణలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కనుక ఈ రెండు సిస్టమ్‌ల నుండి నివారణలను ప్రయత్నించిన తర్వాత నోసోడ్‌ను ఎంచుకోవడం సాధారణ పద్ధతి. వాల్యూం 10 #3 Q5 మే/జూన్ 2019లో, మొదటి సందర్భంలో నోసోడ్‌లను ప్రయత్నించి అద్భుతమైన ఫలితాలను పొందిన అనేక మంది అభ్యాసకుల గురించి ప్రస్తావించబడింది. మరింత సానుకూల ఫీడ్‌బ్యాక్‌తో ప్రోత్సహించబడి, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేయడానికి మేము అనుభవజ్ఞులైన SVPలను ఆహ్వానిస్తున్నాము. 

_______________________________________________________________________________

Q4. రెటీనా  ధమని మూసివేతకు గురైన సమస్యకు రెమిడీ ఏమిటి?

A. రెటీనా ధమని మూసివేత అనేది కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనాలోని నాడీ కణాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్లే రెటీనా ధమనిలో బ్లాకేజ్ ఏర్పడటాన్ని సూచిస్తుంది, దీని ఫలితంగా తీవ్ర దృష్టి మాద్యం ఏర్పడవచ్చు. కాబట్టి రోగి తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి మరియు అర్హత కలిగిన వైద్యుని సంరక్షణలో ఉండాలి. ఐతే వైబ్రియానిక్స్ విషయంలో సూచించబడే కాంబో CC2.3 ట్యూమర్స్ & గ్రోత్స్ + CC7.6 కంటి గాయం + CC15.1 మెంటల్ & ఎమోషనల్ టానిక్.

CC2.3 Tumours & Growths + CC7.6 Eye Injury + CC15.1 Mental & Emotional tonic.

_______________________________________________________________________________

Q5. దీర్ఘకాల వైబ్రో ప్రాక్టీషనర్‌గా, నేను నోసోడ్‌లను బ్రాడ్కాస్ట్ చేయడం, శక్తివంతం చేయడం మరియు తయారు చేయడం కోసం 200C పొటెన్సీని (డయల్ సెట్టింగ్ 468) ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగించాను, కానీ నా సహచరులు చాలా మంది 1M (డయల్ సెట్టింగ్ 573) పోటెన్సి మెరుగ్గా పనిచేస్తుందని కనుగొన్నారు. దీనికి కారణం ఏమై ఉండవచ్చు మరియు భవిష్యత్తులో నేను ఏ పోటెన్సి ఉపయోగించాలి?

జ. అవును దీనికి కారణం ఉంది కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి కొంత విషయ పరిజ్ఞానం అవసరం.                           

భూమి యొక్క విద్యుదయస్కాంత క్షేత్రం (భూమి యొక్క హృదయ స్పందన అని పిలుస్తారు) యొక్క ఫ్రీక్వెన్సీని గణితశాస్త్రపరంగా 1952లో అంచనా వేయబడినప్పటికీ ఒక దశాబ్దం కష్టపడి పనిచేసిన తరువాత మాత్రమే జర్మన్ భౌతిక శాస్త్రవేత్త షూమాన్ దీని ఖచ్చితంగా కొలవగలిగారు. ఇది సగటున 7.83 Hzతో 7 నుండి 8 Hz వరకు మారుతుందని కనుగొన్నారు; దీనిని ఫండమెంటల్ షూమాన్ రెసొనెన్స్ అంటారు. ఇటీవలి దశాబ్దాలలో ఇది నెమ్మదిగా పెరుగుతోంది మరియు 2023 జూన్ 3వ వారంలో, ఇది నాటకీయంగా మారడం ప్రారంభించింది. భూమి యొక్క హృదయ స్పందన పెరిగినందున, ప్రసారం చేయడానికి లేదా శక్తివంతం చేయడానికి ఉత్తమమైన శక్తి కూడా పెరిగింది. 200Cతో సంతృప్తి చెందిన అనేక మంది ప్రాక్టీషనర్లు ఉన్నారు, అయితే 1M మెరుగ్గా పని చేస్తుందని కనుగొన్న వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏ పోటెన్సీ ఉపయోగించాలి అనేది మీరు నిర్ణయించుకోవాల్సిన విషయం. వైబ్రేషన్స్ పరంగా ఈ రెండు పొటెన్సీల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఒక నిర్దిష్ట పోటెన్సీ చాలా మంచిదని మీ మనస్సు విశ్వసిస్తే, దానికి కట్టుబడి ఉండండి. వాల్యూం 7 #4 Q4ని కూడా చూడండి.

_______________________________________________________________________________

Q6. SRHVP మెషీన్ను ఉపయోగించే సందర్భంలో ఏదైనా ప్రత్యేక నిర్వహణ విధానము అవసరమా?                                     

A. 108CC బాక్స్ మరియు SRHVP రెండూ కూడా రేడియేషన్ కలిగించే వస్తువుల నుండి దూరంగా ఉంచబడాలనే విషయం అందరికీ తెలుసు. అయితే, రెండింటినీ స్వామి తమ భౌతిక రూపంలో ప్రత్యక్షంగా అనుగ్రహించినందున, వీటిని చాలా జాగ్రత్తగా  మరియు భక్తితో ఉపయో గించాలి. SRHVP నిర్వహణకు సంబంధించి, వాల్యూం 12 #2 Q5లో సమగ్ర సమాధానం అందించబడింది.

దివ్య వైద్యుని దివ్య వాణి

మీరు సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా మీరు సాత్విక ఆలోచనలను పెంపొందించుకోగలుగుతారు. మరియు, సాత్విక ఆలోచనలను పెంపొందించడం ద్వారా, మీరు సాత్విక కర్మలను చేపట్టగలుగుతారు...అటువంటి సాత్విక ఆహారం మీకు లభించకపోవచ్చనే సందేహం మీకు కొన్నిసార్లు రావచ్చు. అభిప్రాయంతో నేను అస్సలు ఏకీభవించను. మీకు కూరగాయలు మరియు తినదగిన ఆకుకూరలు పుష్కలంగా లభించడంలేదా? నిజానికి, మీరు మీ తల్లి కడుపు నుండి పుట్టిన క్షణం, మీరు మీ తల్లి పాలు లేదా ఆవు పాలతో జీవించి, అభివృద్ధి చెందుతున్నారు కదా. మరి ఇది సాత్విక ఆహారం కాదా? మరి అటువంటప్పుడు మీరు శాఖాహార ఆహారం మీద జీవించలేరా...?"

 ...సత్యసాయి బాబా, “బాల్యం నుండి సాత్విక గుణాలు పెంపొందించు కొనండి.” దివ్య వాణి 2005 అక్టోబర్ 22                                      https://www.sssbpt.info/ssspeaks/volume38/sss38-17.pdf

 

సేవ చేసే వ్యక్తే సేవ చేయించుకో బడుతున్నాడు. ఎలా అంటే మీరు మరొకరికి సేవ చేసినప్పుడు మీకు మీరే సేవ చేసుకుంటున్నారు, మీరు మరొకరికి ఎందుకు సేవ చేస్తారంటే అతని బాధ మీకు వేదనను కలిగిస్తుంది, బాధ నుండి ఉపశమనం కలిగించడం ద్వారా, మీరు వేదన నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని కోరుకుంటారు. మీకు అట్టి వేదనే లేకపోతే, మీ సేవ లోపభూయిష్టంగా మరియు కపటమైనదిగా ఉంటుంది

…సత్యసాయి బాబా, సాధనా వనరుగా సేవ, దివ్య వాణి, బాంబే, 1967 నవంబర్ 6                                                                            https://www.sssbpt.info/ssspeaks/volume07/sss07-40.pdf

ప్రకటనలు

భవిష్యత్తు లో నిర్వహింప బోయే వర్క్ షాప్ లు

  • U K లండన్: సాయి వైబ్రియానిక్స్ వార్షిక సమావేశం, 24 సెప్టెంబర్ 2023, సంప్రదించ వలసిన వారు  [email protected]
  • ఇండియా పుట్టపర్తి: విర్చ్యువల్ AVP ఫ్రాక్టికల్ వర్క షాప్ 2-20 నవంబర్ 2023 అనంతరం ముఖాముఖీ వర్క షాప్ 25-27 నవంబర్ 2023, సంప్రదించ వలసిన వారు [email protected]

*ప్రవేశ ప్రక్రియ మరియు e కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే వర్క్ షాప్ లో ప్రవేశము.

 

అదనంగా

1. ఆరోగ్య వ్యాసము

ఆరోగ్యం మరియు రుచి కోసం పిండి పదార్ధాలు !

మానవ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మనము వివిధ రకాల పదార్ధాలను ఆహారంగా తీసుకుంటాము. కానీ ఇలా తినే ఆహారం సరైనదేనా మరియు ఆరోగ్యకరమైనదేనా, మన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పోషించడానికి మరియు పెంపొందించడానికి ఇది ప్రయోజనకరంగా ఉందా అని ఎవరూ విచారణ చేయడం లేదు. ”… సత్యసాయి బాబా

ముందుమాట: 'అనారోగ్యకరమైన తెల్లనివి నివారించడం'అనే సిరీస్‌లో, మనము పాలు, చక్కెర, ఉప్పు, మరియు బియ్యం, వాటి రకాలు మరియు ప్రత్యామ్నాయాలు యొక్క లాభాలు మరియు నష్టాల గురించి, వాల్యూం 14 యొక్క మునుపటి మూడు సంచికలలో. "వివేకము పిండివంటిది కానీ జ్ఞానము రొట్టె వంటిది2 "అనే శీర్షికలో తెలియ చేయడం జరిగింది. ఈ శీర్షిక లో ఆరోగ్యకరమైన రొట్టెలు, జావను పుడ్డింగ్‌లు, డెజర్ట్‌లు మరియు సాస్‌లు తయారు చేయడంలో జ్ఞానాన్ని పొందేందుకు మనం ఇప్పుడు పిండి ప్రపంచాన్ని పరిశోధిద్దాం!

1. పిండి అంటే ఏమిటి ?

పిండి అనేది ముడి ధాన్యాలు, కాయలు, గింజలు, చిక్కుళ్ళు, వేర్లు, లేదా కొబ్బరి వంటి ఫల రకాలను గ్రైండ్ చేయడం ద్వారా తయారు చేయబడిన పొడి  

2. పిండి కోసం డైటరీ గైడ్  

2.1 అమెరికన్ డైటరీ గైడ్ లైన్స్ పెద్దలకు రోజుకు 1600 నుండి 3000 కేలరీలు వారి వయస్సు, లింగము, బరువు, వైద్య పరిస్థితి మరియు జీవనశైలి ఆధారంగా సిఫార్సు చేస్తారు. వారు ఆహారంలోని మూడు మాక్రోన్యూట్రియెంట్లలో ప్రతి ఒక్కటి సరైన నిష్పత్తిని సూచిస్తారు, అవి పిండి పదార్థాలు 45-65%, కొవ్వులు 20-35% మరియు ప్రోటీన్ 10-35%. 3-5

2.2 కార్బ్ అనివార్యం : సాధారణ చక్కెర, స్టార్చ్ మరియు ఫైబర్‌తో కూడిన కార్బ్ శరీరానికి కావలసిన ఇంధనం యొక్క ప్రధాన వనరు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు మరియు విత్తనాలు అన్నీ సరైన జీర్ణకోశ ఆరోగ్యానికి, చక్కెరను సమతుల్యం చేయడానికి, వ్యాధి నుండి రక్షించడానికి మరియు బరువు నియంత్రణకు అవసరమైన పిండి పదార్థాలను కలిగి ఉంటాయి. ఫైబర్ కంటెంట్ కారణంగా తృణధాన్యాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటాయి, అయితే ఒక ధాన్యాన్ని పిండిగా చేసిన వెంటనే ఈ ఇండెక్స్ స్థాయి పెరుగుతుంది, ఉదాహరణకు గోధుమలు 30 GIని కలిగి ఉంటాయి, కానీ దాని పిండిలో 70 GI ఉంటుంది. GI స్థాయి మరియు కార్బో హైడ్రేట్ స్థాయి తక్కువ ఉన్న పిండి పదార్ధాలు కూడా ఉన్నాయి, ఉదాహరణకు గింజలు, విత్తనాలు, మరియు ఇతర మొక్కల మూలాల నుండి తయారు చేయబడిన పిండి. .5,6  

2.3 GI శ్రేణి పిండి పదార్ధాలు : బాదం, వాల్‌నట్ మరియు గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్‌లు జీరో GI ని కలిగి ఉంటాయి మరియు తక్కువ పిండి పదార్థాలు అధిక స్థాయిలో మంచి కొవ్వును కలిగి ఉంటాయి. 50 లేదా అంతకన్నా తక్కువ GI కలిగిన గింజలు సోయా, చిక్‌పీ, వోట్ మరియు కొబ్బరి ; అలాగే 50 కంటే ఎక్కువ లేదా మధ్యస్థ శ్రేణిలో GI ఉన్నవి క్వినోవా, జొన్న/మొక్కజొన్న, హోల్‌వీట్, సెమోలినా, బ్రౌన్ రైస్, బార్లీ, స్పెల్ట్, జొన్న, టేపియోకా మరియు ఆరోరూట్. 70 మరియు అంతకంటే ఎక్కువ అధిక GI ఉన్న వాటిలో తెలుపు /ఆల్-పర్పస్ పిండి (మైదా) మరియు తెల్ల బియ్యం, రై, మిల్లెట్‌లు మరియు అమరంత్ ఉంటాయి. శుద్ధి చేసినవి మినహా దాదాపు అన్ని పిండిలలో ఫైబర్ మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. 6-8 బియ్యం (వాల్యూం 14 #4), ఇతర తృణధాన్యాలు (వాల్యూమ్ 12 #5), గింజలు (వాల్యూమ్ 11 #1), విత్తనాలు (వాల్యూమ్ 4 #6), మరియు పప్పులు (వాల్యూమ్ 13 #1). యొక్క వివరణాత్మక పోషకాహార ప్రొఫైల్ కోసం మునుపటి వార్తాలేఖలలో ఆరోగ్య కథనాలను చూడండి.

2.4 గ్లూటెన్ అనేది గోధుమలు, బార్లీ మరియు రై లలో అంతర్లీనంగా ఉండే ప్రోటీన్. అనేక రకాల ఇతర పిండి పదార్ధాలు సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి, అయితే సేద్యం లేదా ప్రాసెసింగ్ సమయంలో. ప్రత్యేకించి వోట్స్ సమీపంలో లేదా అదే సదుపాయములతో పెరిగినా లేదా ప్రాసెస్ చేయబడిన సందర్భంలో గ్లూటెన్‌తో క్రాస్-కంటామినేట్ అవుతాయి. గ్లూటెన్ అనేది పిండికి సాగే నాణ్యత మరియు నిర్మాణాన్ని అందిస్తుంది, లేకుంటే అది సులభంగా చించివేయ బడుతుంది. గ్లూటెన్, అనేది ముఖ్యంగా తృణధాన్యాలలో ఉన్నది, ఆరోగ్యకరమైన వ్యక్తులకు మంచిది, కానీ ఉదరకుహర వ్యాధి ఉన్నవారు దీనిని నివారించాలి; చిన్న ప్రేగులలో లోపం లేదా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి ఇది సరిపడకపోవచ్చు. 9,10

 2.5 ఊక అనేది తృణధాన్యాల యొక్క బయటి పొర, ఎక్కువగా గోధుమలు, బార్లీ, రై, బియ్యం, వోట్, మిల్లెట్లు మరియు మొక్కజొన్నలలో కనిపిస్తుంది. ఇది ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు మరియు విటమిన్ల యొక్క మంచి వనరు. గోధుమ ఊకలో కరగని మరియు ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రేరేపించి మలబద్ధకాన్ని నివారిస్తుంది; వోట్స్ మరియు బార్లీ ఊక కరిగే మరియు కరగని ఫైబర్ రెండింటినీ కలిగి ఉంటాయి, ఇవి గుండెకు మరియు షుగర్ పెంపుదల వచ్చే రుగ్మతల నివారణకు అద్భుత మైనవిగా పరిగణించబడతాయి. కానీ ఊకలో యాంటీన్యూట్రియెంట్లు ఉంటాయి కనుక  ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారికి సరిపోకపోవచ్చు. 11-13

 

                                     Rice Bran                                                             Wheat Bran

 3. వివిధ రకాల పిండి పదార్ధాలు  

3.1 గ్లూటెన్ కలిగిన ధాన్యాల నుండి పిండి

గోధుమ పిండిలో వాటి గ్లూటెన్ కంటెంట్ ఆధారంగా వివిధ రకాలు ఉన్నాయి. మొత్తం గోధుమ పిండి (ఆటా), ఫైబర్ మరియు పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది మరియు 13-14% గ్లూటెన్‌తో అత్యంత సాధారణమైన పిండి అయిన డ్యూరం గోధుమ నుండి కార్బ్ రిచ్ సెమోలినా (సుజి); 12% గ్లూటెన్‌తో బహుళ ప్రయోజన పిండి (మైదా), దాని మరొక రూపము బేకింగ్ పౌడర్ మరియు ఉప్పుతో కూడిన సెల్ఫ్రైజింగ్ ఫ్లోర్, 9-10% గ్లూటెన్‌తో పేస్ట్రీ పిండి; 7.5 నుండి 9% గ్లూటెన్‌తో మృదువైన కేక్ పిండి. వీటిలో కొన్ని విభిన్నమైన అల్లికలను సృష్టించడానికి మరియు బేకింగ్ చేస్తున్నప్పుడు చక్కగా ఉబ్బడానికి అనువుగా ఉంటాయి. 14-16

బార్లీ పిండి, గోధుమల కంటే ఎక్కువ డైటరీ ఫైబర్, 5-8% గ్లూటెన్ కలిగి ఉంటుంది. మరింత పోషకమైన రై పిండిలో కేవలం 3% గ్లూటెన్ మాత్రమే ఉంటుంది.17-18

 

 

 

 

 

 

 

                       గోధుమ పిండి                                                  రే ధాన్యపు పిండి

3.2 గ్లూటెన్ రహిత ధాన్యాల నుండి పిండి  

నకిలీ ధాన్యపు పిండి, పూర్తి మాంసకృత్తులు మరియు పుష్టికరమైనవి, అమరాన్త్ మరియు బుక్వీట్, రెండూ ఎర్తి నట్టినెస్ కలిగి ఉంటాయి మరియు ఖరీదైన క్వినోవా గడ్డి రుచిని కలిగి ఉంటాయి, వీటిని గ్రైండ్ చేసే ముందు స్వల్పంగా వేడి చేయ బడతాయి. స్వల్పంగా చేదు రుచితో ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం ఈ నకిలీ ధాన్యపు పిండిని ఒక్కొక్కటిగా బియ్యం పిండితో కలిపి రొట్టెలను తయారు చేసినప్పుడు, అవి మెరుగైన చిన్న ముక్కల మృదుత్వాన్ని, రూపాన్ని, రంగును, వాసనను, ఆకృతిని, రుచిని పొంది  మొత్తంగా అందరూ ఇష్టపడేలా చేస్తాయి. ఆమోదయోగ్యమైనబియ్యపు పిండి నిష్పత్తి అమరాన్త్ తో 40%, బక్‌వీట్‌తో 15% మరియు క్వినోవాతో 18%.ఉంటాయి.

బియ్యం పిండి : దీనిలో గోధుమ పిండి యొక్క అన్ని గుణాలు ఉన్నాయి, బ్రౌన్ రైస్ పిండి మరింత పోషకకరమైనది మరియు ఆల్-పర్పస్ పిండికి మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. బియ్యం పిండితో బేకింగ్ చేయడానికి బేకింగ్ పౌడర్ అవసరం కావచ్చు. 24

కార్న్ ఫ్లోర్: ముఖ్యంగా చలికాలంలో ఆహారంలో చేర్చుకోవడానికి కార్న్ ఫ్లోర్ ఉత్తమమైన పిండి. మితంగా తీసుకునే టట్లైతే, ఇది జీర్ణ ఆరోగ్య ప్రయోజనాలను అందించే శక్తి మరియు పోషకాలకు మంచి మూలం.25

చిరుధాన్యాల పిండి: అత్యంత పోషకమైనది మరియు ఫైబర్-రిచ్, తృణధాన్యాలలోని అన్ని పోషకాలను కలిగి ఉంటుంది. 26

వోట్ పిండి:  సంపూర్ణ మైనది, ఆరోగ్యకరమైనది మరియు యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలము. గుండెకు అద్భుతమైనది.26

3.3 గింజల నుండి పిండి : సాధారణంగా గింజల నుండి లభించిన పిండిలో తక్కువ GI ఉంటుంది, పుష్కలంగా ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ మరియు విటమిన్లు ఉంటాయి, మరియు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.

బాదం పిండి:  అత్యంత ప్రజాదరణ ఈ పిండి బాదంగింజలను పై పిప్పి నుండి వేరుచేసి మరియు పొట్టు తీసిన తర్వాత, అసలు బాదం యొక్క అన్ని ప్రయోజనాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. పొట్టు తీయకుండా బాదంపప్పును పూర్తిగా గ్రైండ్ చేసి చేసే బాదం మీల్ కంటే ఇది మంచిది. సాధారణంగా లభించే బాదంగింజలు తినడానికి సురక్షితంగానే ఉంటాయి; అప్పుడప్పుడు అవి అమిగ్డాలిన్ (విటమిన్ B17) కలిగి ఉన్న చేదు బాదంను కలిగి ఉండి, తిన్నప్పుడు సైనోజెనిక్ టాక్సిన్‌ను విడుదల చేయవచ్చు. అయితే, 12 గంటలు నానబెట్టినప్పుడు, ఈ టాక్సిన్ ఉపరితలంపైకి వస్తుంది, కాబట్టి బాదంపప్పును నానబెట్టి తొక్కతీసివేయడం మంచిది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో మరియు నిర్దిష్ట క్యాన్సర్‌ల చికిత్సలో పరిమిత మోతాదులో విటమిన్ B17 యొక్క ప్రయోజనం వంటి విషయాలలో భిన్నఅభిప్రాయాలు కూడా ఉన్నాయి.27-31

వాల్నట్ పిండి :  నూనెను తీసిన పొట్టుతో తయారు చేసినప్పటికీ, దీనిలో ఒమేగా-3, ప్రొటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అన్నిరకాల పిండిపదార్ధాల కన్నా ఆరోగ్యకరమైనది కానీ ఇది చాలా ఖరీదైనది, దీనిని బాదం పిండి లేదా గోధుమ పిండితో కలపవచ్చు.32

ఇతర పోషకకరమైన గింజల పిండి పదార్ధాలలో రాగి పుష్కలంగా ఉండే జీడిపప్పు,  స్వీట్ చెస్ట్‌నట్, మకాడమియా, పిస్తాపప్పు, హాజెల్‌నట్‌లు, పళ్లు మరియు ప్రత్యేకమైన రుచిని కలిగి అరుదు
గాదొరికే పెకాన్ వంటివి ఉంటాయి. 33-37

3.4 విత్తనాల నుండి పిండి

బ్రెజిల్ గింజ (వాస్తవానికి ఒక విత్తనం) థైరాయిడ్ గ్రంధి పనితీరుకు అవసరమైన ఖనిజ సెలీనియం అధికముగా కలిగినట్టిది. ఇది అభిజ్ఞా క్షీణతను నిరోధిస్తుంది; సెలీనియం అధిక మోతాదు విషపూరితం కావచ్చు. ఇతర అత్యంత పోషకమైన పిండిలలో గుమ్మడికాయ గింజలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, జనపనార, అవిసె మరియు చియా గింజలు ఉన్నాయి. 38-42

3.5 చిక్కుళ్ళు నుండి పిండి

చిక్కుడు పిండిలు సాధారణ పప్పులు మరియు చిక్‌పీస్, ఆకుపచ్చ మరియు నల్ల శనగలు, ఆకుపచ్చ మరియు పసుపు బఠానీలు, కాయధాన్యాలు, తెల్ల బీన్, సోయాబీన్, లుపిన్ మరియు వేరుశెనగ వంటి బీన్స్ నుండి తీసుకోబడ్డాయి. వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్ మరియు సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రాసెస్ చేయబడిన, శుద్ధి చేసిన లేదా ఆల్-పర్పస్ ఫ్లోర్‌లకు అద్భుతమైన ప్రత్యామ్నాయం. 43-48

ఆరోరూట్ అనేది వివిధ ఉష్ణమండల వేరు మొక్కల నుండి తయారు చేయబడిన చక్కటి పిండి; ఇది సుదీర్ఘ షెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంటుంది, సాధారణంగా సాస్‌లను చిక్కగా చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఎక్కువ కార్బోహైడ్రేట్లు తక్కువ పోషకాలు కలిగి ఉండే ఈ పిండి సులభంగా జీర్ణమవుతుంది. ఇందులోని స్టార్చ్ కంటెంట్ మరియు ప్రీబయోటిక్స్ ప్రేవుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి, డయేరియాను నియంత్రిస్తాయి మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి.49,50

టాపియోకా (సాబు దానా) అనేది కాసావా వేరు యొక్క పూర్ణ భాగం నుండి పిండిగా లేదా రేకులు లేదా పిండి పదార్ధాలుగా విక్రయించబడుతుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు పూర్తిగా పోషకాలు తక్కువగా ఉంటాయి కానీ ఉదర సంబంధిత ఇబ్బందులు, లేదా కడుపు నొప్పి సమయంలో పరిమితం చేయబడిన ఆహారంగా ఇవ్వవలసిన సందర్భంలో మంచి శక్తి వనరు గా ఉపయోగ పడుతుంది. దీనిని బట్టలకు గంజి పెట్టే ప్రక్రియలో కూడా ఉపయోగిస్తారు.

పెండలం పిండి మొత్తం దుంప నుండి తయారు చేయబడుతుంది, తక్కువ ప్రాసెస్ చేయబడింది మరియు టాపియోకా కంటే ఎక్కువ విటమిన్ సి కంటెంట్‌తో కూడిన సంపూర్ణ ఆహారం.51,52

టైగర్ నట్ ఒక దుంప పదార్ధము, అనేక ఖనిజాలు, విటమిన్ సి, డి, & ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఫైబర్ మరియు అధిక పిండిపదార్థాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇది ప్రీబయోటిక్‌గా పనిచేసి రక్తంలో చక్కెరను నియంత్రించగలదు.53,54

3.7 పండ్ల నుండి లభించే పిండి :

కొబ్బరి (వాస్తవానికి ఒక పండు) పిండి అనేది కొబ్బరి నుండి పాలను తీసిన తర్వాత నిర్జలీకరణ ద్వారా తయారు చేయబడిన చక్కటి పిండి ఇది. గింజల పట్ల అలెర్జీ ఉన్నవారికి చక్కగా సరిపోయే ఆహారం ఇది. దీనిలో ఖనిజలవణాలు సమృద్ధిగా, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఒమేగా 6 తక్కువగా ఉంటాయి. ఇది ప్రత్యేకమైన రుచితో స్వల్పంగా తీపి రుచిని కలిగి ఉంటుంది. ఇతర తక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉండే పదార్ధాల కంటే పొడిగా ఉంటుంది. ఇది ఖరీదైనది అయినప్పటికి ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది సాల్సిలేట్‌ను తట్టుకోలేని వ్యక్తులలో జీర్ణశయాంతర లేదా శ్వాసకోశ లక్షణాలను కలిగిస్తుంది.55,56

4. పిండిపదార్ధాల నుండి ఉత్తమ ఫలితాలు పొందడానికి చిట్కాలు   

4.1 మీ కోసం తగిన సమతుల్య ఆహారం కోసం వివేకంతో పిండిపదార్ధాలను ఎంచుకోండి - గ్లూటెన్ ఫ్రీ, తక్కువ కార్బ్, ఫైబర్ రిచ్ లేదా ప్రోటీన్ రిచ్. ఏదైనా ఒక లేబుల్ మీద గ్లూటెన్-ఫ్రీ అని లేకపోతే అది గ్లూటెన్ కలిగి ఉండే అవకాశం ఉంది.4-10

4.2 తీసుకునే కార్బోహైడ్రేట్ల మొత్తాన్ని లెక్కించేటప్పుడు, దానిలో ఉండే పరిమాణ భాగాలను మనసునందు ఉంచుకొననండి. బొటనవేలు నియమం ఏమిటంటే వినియోగించే కేలరీలకు సమానంగా కేలరీలు దహనం కావించబడాలి. బరువు తగ్గడానికి తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం ఉత్తమం.5-8

4.3 ఇంట్లోనే పిండిని తయారు చేయడానికి, ధాన్యాలు మరియు గింజలను ఎండబెట్టడానికి మరియు గ్రైండ్ చేయడానికి 4-8 గంటల ముందు నానబెట్టడం మంచిది. ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే యాంటీన్యూట్రియెంట్లను (లెక్టిన్లు మరియు టానిన్లు) మరియు ఖనిజ శోషణకు ఆటంకం కలిగించే ఫైటేట్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. గింజలనుండి పిండిని తయారు చేస్తున్నట్లయితే, అది క్రీమీగా మారకుండా ఉండటానికి కొన్ని సెకన్ల పాటు కలపడం మంచిది. 57-61

4.4 మెరుగైన చక్కెర నియంత్రణ కోసం, బ్రెడ్, బియ్యం, కేకులు, పాస్తా మొదలైన పిండి-ఆధారిత ఉత్పత్తులను తక్కువగా తినండి.   తప్పనిసరిగా తక్కువ GI ఉన్న పిండినే ఎంచుకోండి లేదా కొవ్వు మరియు ఫైబర్ అధికంగా ఉండే పిండితో కలిపి తీసుకోండి. 

4.5 చాలా వరకు పిండి పదార్ధాలు గాలి చొరబడని కంటైనర్లలో 3 నుండి 6 నెలల వరకు ఉంటాయి, రిఫ్రిజిరేటెడ్ మరియు ఫ్రీజర్‌లో రెండు సంవత్సరాల వరకు ఉంటాయి. ఇలా ఫ్రీజ్ చేసిన పిండిని గది ఉష్ణోగ్రతకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉపయోగించే ముందు బాగా తిప్పండి. కొత్త పిండిని పాత పిండితో కలపవద్దు. సంపూర్ణ గోధుమలు మరియు సేంద్రీయ పిండి ఇతర వాటి కంటే తక్కువ షెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంటాయి. గాలి, కాంతి మరియు తేమకు గురికాకుండా ఉంఛండి.15,62

రిఫరెన్సులు మరియు లింకులు 

1. Sathya Sai Speaks, Divine Discourse 22 Oct 2005, vol 38 chapter 17, “Cultivate satvic qualities right from Childhood” sss38.pdf (sathyasai.org); sss38-17.pdf (sssbpt.info)

2. Austin O’Malley: Source: 20 Healthy Flours from Lowest to Highest Carbohydrates - TheDiabetesCouncil.com

3. Calories per day: How Many Calories Should You Eat In A Day? – Cleveland Clinic

4. Daily Diet Composition Charts for Carbs, Protein, and Fat (verywellfit.com)

5. Carbohydrates : How carbs fit into a healthy diet - Mayo Clinic

6. 20 Healthy Flours from Lowest to Highest Carbohydrates - TheDiabetesCouncil.com

7. A good guide to good carbs: The glycaemic index - Harvard Health

8. Glycaemic Index Chart for Common Foods (verywellhealth.com)

9. Gluten : Gluten | The Nutrition Source | Harvard T.H. Chan School of Public Health

10. What Is Gluten and What Does It Do? | Johns Hopkins Medicine

11. Bran : Bran Benefits and Different Types to Try (verywellhealth.com)

12. Bran Fact and Types (healthbenefitstimes.com)

13. Wheat Bran : Nutrition, Benefits and More (healthline.com)

14. Wheat flour: A Guide to Different Types of Wheat Flour (thespruceeats.com)

15. All-Purpose Flour Nutrition Facts and Health Benefits (verywellfit.com)

16. Whole wheat flour: A beginner’s guide to gluten | King Arthur Baking;

17. Is Barley Gluten-Free?(healthline.com)

18. Rye flour: How Much Gluten In Rye Flour – TheWellFloured Kitchen

19. Pseudo-grain flours: Amaranth Flour Nutrition Facts and Health Benefits (verywellfit.com)

20. What’s A Good Amaranth Flour Substitute ? - SPICEography

21. Ultimate Guide To Buckwheat Flour - From The Larder

22. The Pros And Cons Of Quinoa Flour – Healing Plant Foods

23. Study: Defining Amaranth, Buckwheat and Quinoa Flour Levels in Gluten-Free Bread: A Simultaneous Improvement on Physical Properties, Acceptability and Nutrient Composition through Mixture Design - PubMed (nih.gov)

24. Rice flour: Rice flour and its benefits (indiatimes.com)

25. Corn flour: https://www.healthifyme.com/blog/corn-flour-benefits-precautions-and-more/

26. Millets, Oats: Vibrionics Newsletter, Health article; https://news.vibrionics.org/en/articles/353

27. Nut flours: Almond Flour Benefits, Nutrition Facts and Recipes - Dr Axe (draxe.com)

28. Almond Meal vs. Almond Flour: What's the Difference?(healthline.com)

29. Are Almonds Poisonous? Different Varieties Explained (healthline.com)

30. How Almonds Went From Deadly To Delicious : The Salt : NPR

31, Amygdalin : Can Vitamin B-17 Really Kill Cancer ? - LifeHack

32, Walnut Flour: The Truly European Nut Flour - SPICEography

33. 10 of the Best Low Carb Flours (and How To Use Them) (nutritionadvance.com)

34. Should You Soak Cashews Before Roasting? - Beyond (beyondthenut.com)

35. Chestnut flour: Make Your Own Chestnut Flour From Whole Chestnuts (thespruceeats.com)

36. What Is Chestnut Flour and What Can You Make With It? | Taste of Home

37. Pecan flour: Pecan Flour vs All-Purpose Flour: The Ultimate Verdict - The Coconut Mama

38. Seed flours: 7 Proven Health Benefits of Brazil Nuts - Ben's Natural Health (bensnaturalhealth.com)

39. Wholesale Brazil Nut Flour 100% Organic from the amazon rain forest para-food.com

40. Pumpkin seed flour: Pumpkin Seed Flour: Unveiling the Nutritional Powerhouse - cookindocs.com

41. What Is Sesame Flour? (What It's For, Uses, Substitutes + More) (clockworklemon.com)

42. Chia Flour | Baking Ingredients | BAKERpedia

43. Legume flours: Legume flours: varieties and benefits (steptohealth.com)

44. Chickpea flour: Chickpea Flour Benefits, Uses and Side Effects - Dr Axe (draxe.com)

45. Peanut flour: What is Peanut Flour? - The Coconut Mama

46. How to Make Peanut Butter: 15 Steps (with Pictures) - wikiHow

47. Soy flour: Soy Flour Facts, Health Benefits and Nutritional Value (healthbenefitstimes.com)

48. What Is Mung Bean Flour? - The Coconut Mama

49. Root flours: Arrowroot: Nutrition, Benefits, and Uses (healthline.com)

50. Arrowroot Flour Nutrition Facts and Health Benefits (verywellfit.com)

51. What Is Tapioca and What Is It Good For ? (healthline.com)

52. Tapioca Flour: What Is It? Benefits, Uses and Side Effects - Dr. Axe (draxe.com)

53. Tiger nut flour: 9 Health Benefits of Tiger Nuts – Cleveland Clinic

54. Tiger Nuts: Benefits, Nutrition and How to Eat - Dr Axe (draxe.com)

55. Coconut flour: https://www.nutritionadvance.com/coconut-flour-nutrition-benefits/

56. Coconut Flour Nutrition, Benefits and How to Use It - Dr Axe (draxe.com)

57. Tips : Activated Nuts: How to Soak Away Hidden Anti-Nutrients | Health (paleohacks.com)

58. 12 Nuts You Should Soak Before Eating And Their Soaking Duration (healthyfoodhouse.com)

59. https://www.wikihow.com/Soak-Nuts#

60. How To Make Nut Flours [Almond, Hazelnut, Cashew] - The Healthy Maven

61. The Ultimate Guide To Nut Flours - From The Larder

62. Storage of flour: Can You Freeze Fluor? (A Guide to Long Term Storage) – Easy Freezing

________________________________________________________________________________________

2. మొదటి సాయి వైబ్రియానిక్స్ AP & తెలంగాణ రాష్ట్ర సమావేశం, విశాఖపట్నం 22 జూలై 2023

21 మంది ప్రాక్టీషనర్లు మరియు 50 మందికి పైగా భక్తులు హాజరైన ఈ సమావేశము ప్రార్థన మరియు చైర్ ప్రాక్టీషనర్11567 స్వాగత ప్రసంగం మరియు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్10375 కీలకోపన్యాసం అనంతరం వైబ్రియానిక్స్‌లో సేవా అవకాశాల పై తన సమర్పణ లో భాగంగా వైబ్రియానిక్స్ ఇన్స్టిట్యూట్ కు అవసరమైన పరిపాలనా మద్దతు మరియు పేదలకు మరియు అవసరమైయన వారికి సేవ చేయడానికి మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.  

AP & తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సాయి వైబ్రియానిక్స్ వైద్య శిబిరాలు మరియు క్లినిక్‌లపై ప్రాంతీయ సమన్వయకర్త11585 వార్షిక నివేదికను సమర్పించారు. వైబ్రియానిక్స్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై నేషనల్ కోఆర్డినేటర్11573 ప్రసంగించారు. అల్లోపతి, చైనీస్ ఔషధం, ఆయుర్వేదిక్ బాడీ టైప్, ప్రాణిక్ హీలింగ్ మొదలైన అంశాలతో వైబ్రియానిక్స్‌ను ఎలా సమగ్రపరచవచ్చో ప్రాక్టీషనర్11567 స్పృశించారు. మధుమేహం, రక్తపోటు, అలెర్జీలు మరియు వ్యసనాల వంటి అనారోగ్యాలను ఎదుర్కోవటానికి పరిశోధన మరియు పోటెంటైజేషన్యొక్క ప్రాముఖ్యతను ఎలా అన్వేషించవచ్చో నొక్కిచెప్పారు.

వైబ్రేషన్ లు, ఫ్రీక్వెన్సీ, శక్తి, విద్యుదయస్కాంత తరంగాలు మరియు ఆరోగ్యంపై వాటి ప్రభావం అనే భావనపై ప్రాక్టీషనర్ 03560 దృష్టి సారించారు, అంతేకాక లోతైన & నియంత్రిత శ్వాస, ధ్యానం, కృతజ్ఞతా భావము, దాతృత్వం, ఆహారం, ప్రకృతితో సన్నిహితంగా ఉండటం మరియు ఆరోగ్యకరమైన సంబంధాల ద్వారా ఒక వ్యక్తి యొక్క కంపన శక్తిని ఎలా పెంచవచ్చో వారు వివరించారు.

ప్రాక్టీషనర్02696 రోగులతో ఎలా సంభాషించాలి, వారి నుండి మనం ఎలా నేర్చుకోవచ్చు మరియు ప్రేమను మనలో అత్యంత ముఖ్యమైన భాగంగా ఎలా ఉంచుకోవాలో వివరించడం మరియు మనతో పాటు ఇతరులకు కూడా స్వస్థత చేకూర్చడంలో స్వీయ-విశ్లేషణ యొక్క ప్రాముఖ్యతను గురించి వారు నొక్కి చెప్పారు.

హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి డాక్టర్ జిత్ అగర్వాల్ సంక్షిప్త ప్రసంగంతో మధ్యాహ్నం సెషన్ ప్రారంభించబడింది. దైనందిన జీవితంలో కృతజ్ఞత అనేది మన ఆధ్యాత్మికత మరియు శ్రేయస్సుకు ఎంతటి ముఖ్య పాత్ర పోషిస్తుందో వారి ప్రీరణాత్మక ప్రసంగంలో వివరించారు. క్షమాపణ మరియు కృతజ్ఞతా భావాన్ని అభ్యసించడం ద్వారా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక యువతి అద్భుతంగా ఎలా స్వస్థత పొందిందనే దానిపై వారు ఒక అద్భుతమైన వృత్తాంతం చెప్పారు. 

ముగ్గురు AP & తెలంగాణ ప్రాక్టీషనర్లు11632, 11604, 11618  కాన్ఫరెన్స్‌కు ముందు నిర్వహించిన కేస్ హిస్టరీ రైటింగ్ పోటీలో ఎంపికైన కేస్ హిస్టరీలను సమర్పించారు. ప్రాక్టీషనర్11594 వైబ్రియానిక్స్‌లో పరిశోధన యొక్క ప్రాముఖ్యతపై ఒక పోస్టర్‌ను సిద్ధం చేసారు. ఆమె హాజరు కాలేక పోవడంతో కాన్ఫరెన్స్ చైర్ పర్సన్ దీనిని సమర్పించారు.

చివరి సెషన్‌లో, AP & తెలంగాణకు చెందిన ప్రాక్టీషనర్లు క్విజ్‌లో పాల్గొన్నారు. క్విజ్‌ మరియు  కేసు చరిత్ర రచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్యంగా స్థానిక సాయి సమితి వారు స్వామికి అద్భుతమైన ఆతిథ్యం మరియు హారతి అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సదస్సు ముగిసింది.

పాల్గొన్నవారి నుండి సేకరించిన అభిప్రాయాల ప్రకారం వారు ఈ అకడమిక్ సెషన్‌ను ఎంతగానో మెచ్చుకున్నారని మరియు క్రమ పద్ధతిలో ఇటువంటి సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని భావించినట్లు తెలిసింది.     

 

________________________________________________________________________________________

3.భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అరకు లోయలో 2023 జూన్ 23 సాయి వైబ్రియానిక్స్ వెల్నెస్ క్యాంప్ ప్రారంభోత్సవం 

జూలై 22న AP & TS  స్టేట్ కాన్ఫరెన్స్ జరిగిన మరుసటి రోజు ప్రాక్టీషనర్లు అందరూ సాయి వైబ్రియానిక్స్ వెల్‌నెస్ క్యాంప్‌ను ప్రారంభించేందుకు ప్రముఖ హిల్ స్టేషన్ అరకు వ్యాలీకి ఐదు గంటల బస్సు ప్రయాణం అనంతరం చేరుకున్నారు. విశాఖపట్నం నుండి 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం అనేక చిన్న గిరిజన సమూహాలు మరియు కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందింది.

50కి పైగా చిన్న గ్రామాలలో నివసిస్తున్న పేద మరియు జనవాసాలకు దూరంగా నివాసిస్తున్న నాభాకు సాయి వైబ్రియానిక్స్ సేవలను అందించడానికి మరియు వారి అత్యవసర ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి కొత్తవలస అనే మారుమూల గ్రామం ఎంపిక చేయబడింది. ఇది వైబ్రియానిక్స్ బృందం, సామాజిక కార్యకర్తలు, NGOలు, స్థానిక యువత మరియు ఇతర వాలంటీర్ల నుండి మద్దతు తో కూడిన ఒక సహకార ప్రయత్నము. స్థానిక నాయకులు మరియు భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు సభను ఉద్దేశించి ప్రసంగింస్తూ ఈ వెల్‌నెస్ క్యాంపు యొక్క ప్రాముఖ్యతను మరియు క్రమం తప్పకుండా క్యాంపు ద్వారా మనం అందించే సమాజ ఆరోగ్య సంరక్షణ అవసరాలకు మద్దతు ఇవ్వడానికి తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం యొక్క ప్రాముఖ్యత నొక్కి వక్కాణించడం జరిగింది. వైబ్రియానిక్స్ బృందం మరియు గిరిజన సమాజం మధ్య విశ్వాసం మరియు సత్సంబంధాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం ప్రయత్నించింది, వ్యక్తులందరికీ వైబ్రియానిక్స్ రెమిడీలు వారికి కొత్త గనుక ప్రాక్టీషనర్లు11567,02696,11585 వారి స్థానిక భాషలో సంబోదించి అవి తీసుకోవడంలో సౌకర్యవంతంగా ఉండేలా చూసారు. ప్రారంభోత్సవం తర్వాత, ఎంపిక చేసిన విద్యావంతులైన యువకుల బృందంతో ఒక చిన్న సమావేశం నిర్వహించి వారికి వైబ్రియానిక్స్ గురించి మరింత వివరణాత్మక అవగాహన కల్పించారు. వారి ఆరోగ్య సమస్యలు, వ్యవసాయం మొదలైన వాటిపై క్రమం తప్పకుండా వారికి మార్గనిర్దేశం చేసే ఒక సామాజిక కార్యకర్త ఈ వైద్య వ్యవస్థతో ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ప్రశ్న-జవాబు సెషన్‌తో కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రోఫిలాక్టిక్‌గా ఉపయోగించడం కోసం 150 IBలు మరియు CC9.3 Tropical diseases కూడిన 100 రెమెడీ బాటిళ్ల పంపిణీ చేయడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధుల అంగీకారంతో ప్రతినెలా 4వ ఆదివారం రెగ్యులర్ క్యాంపు నిర్వహించాలని నిర్ణయించారు*. వైద్య శిబిరం అనంతరం  పాల్గొన్న ప్రాక్టీషనర్లు అందరూ లోయలోని 'కాఫీ మ్యూజియం' మరియు 'ట్రైబల్ మ్యూజియం'కి సరదాగా యాత్ర చేశారు.   

*మొదటి నెలవారీ శిబిరాన్ని 27 ఆగస్టు 2023న ప్రాక్టీషనర్లు11634, 11648..ఇండియా నిర్వహించగా 47 మంది పేషంట్లు చర్మ సంబంధిత, జలుబు, దగ్గు, జ్వరం, కీళ్ల నొప్పులు, వంటి రుగ్మతలకు రెమిడీలు తీసుకున్నారు. 

 

________________________________________________________________________________________

4. జ్ఞాపకార్ధం 

శ్రీ నందన్ సింగ్ భకుని 11462…ఇండియా  ఫరీదాబాద్ నుండి 13 జూలై 2023న 74 సంవత్సరాల వయస్సులో తన స్వర్గపు నివాసానికి నిష్క్రమించారు. అతను కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత మార్చి 2011లో వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. చాలా వినయం గల నిరాడంబరమైన వ్యక్తి, నిష్ణాతుడైన భజన గాయకుడు, అతను ప్రతి అవకాశంలోనూ సేవ చేయడానికి సిద్ధంగా ఉండేవారు. అతను సమితి కన్వీనర్‌గా మరియు తరువాత SSSSOలో జిల్లా వైద్య సేవా సమన్వయకర్తగా పనిచేశారు. ప్రశాంతి నిలయానికి సంవత్సరానికి రెండుసార్లు సేవ కోసం వెళ్ళేవారు. అతను SSSSO & వైబ్రియానిక్స్ రెండింటి యొక్క అన్ని సమావేశాలు మరియు ఇతర కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. తన అనారోగ్యం లో కూడా అతని విలువైన సూచనలు మరియు అనుభవాలను పంచుకునేవారు. వీరి శ్రీమతి బాల వికాస్ గురువు మరియు మనవరాళ్ళు బాలవికాస్ విద్యార్థులు, ఆ విధంగా సాయి కార్యకలాపాలలో వీరి కుటుంబం యొక్క ప్రమేయం కొనసాగుతూనేఉంది