దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 14 సంచిక 5
సెప్టెంబర్ / అక్టొబర్ 2023
“మీరు సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా మీరు సాత్విక ఆలోచనలను పెంపొందించుకోగలుగుతారు. మరియు, సాత్విక ఆలోచనలను పెంపొందించడం ద్వారా, మీరు సాత్విక కర్మలను చేపట్టగలుగుతారు...అటువంటి సాత్విక ఆహారం మీకు లభించకపోవచ్చనే సందేహం మీకు కొన్నిసార్లు రావచ్చు. ఈ అభిప్రాయంతో నేను అస్సలు ఏకీభవించను. మీకు కూరగాయలు మరియు తినదగిన ఆకుకూరలు పుష్కలంగా లభించడంలేదా? నిజానికి, మీరు మీ తల్లి కడుపు నుండి పుట్టిన క్షణం, మీరు మీ తల్లి పాలు లేదా ఆవు పాలతో జీవించి, అభివృద్ధి చెందుతున్నారు కదా. మరి ఇది సాత్విక ఆహారం కాదా? మరి అటువంటప్పుడు మీరు శాఖాహార ఆహారం మీద జీవించలేరా...?"
...సత్యసాయి బాబా, “బాల్యం నుండి సాత్విక గుణాలు పెంపొందించు కొనండి.” దివ్య వాణి 2005 అక్టోబర్ 22 https://www.sssbpt.info/ssspeaks/volume38/sss38-17.pdf
“సేవ చేసే వ్యక్తే సేవ చేయించుకో బడుతున్నాడు. ఎలా అంటే మీరు మరొకరికి సేవ చేసినప్పుడు మీకు మీరే సేవ చేసుకుంటున్నారు, మీరు మరొకరికి ఎందుకు సేవ చేస్తారంటే అతని బాధ మీకు వేదనను కలిగిస్తుంది, ఆ బాధ నుండి ఉపశమనం కలిగించడం ద్వారా, మీరు ఆ వేదన నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని కోరుకుంటారు. మీకు అట్టి వేదనే లేకపోతే, మీ సేవ లోపభూయిష్టంగా మరియు కపటమైనదిగా ఉంటుంది”
…సత్యసాయి బాబా, సాధనా వనరుగా సేవ, దివ్య వాణి, బాంబే, 1967 నవంబర్ 6 https://www.sssbpt.info/ssspeaks/volume07/sss07-40.pdf