Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 13 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2022
అవలోకనం

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

స్వామి జీవితం ఉన్నత లక్ష్యం కోసం ఎలా గడపాలి, పవిత్ర హృదయంతో తన బాధ్యతను ఎలా నిర్వర్తించాలి అనే మార్గదర్శకాన్ని ప్రస్తావిస్తూ, డాక్టర్ అగర్వాల్ వైబ్రియోనిక్స్ అనేది నిరంతరం అభివృద్ధి చెందుతున్న ప్రయాణం అని వివరిస్తున్నారు. సాయి సేవా సంస్థ సహకారంతో, విస్తృత స్థాయిలో ఇబి పంపిణీ, ఆన్‌లైన్ పరస్పర సమావేశాలు ద్వారా ప్రాక్టీషనర్లు ఒక కుటుంబంలా అనుసంధానమవడం, పరస్పరం జ్ఞానాన్ని పంచుకోవడం, అలాగే శిక్షణ, సమాచార సాంకేతికత రంగాలలో జరుగుతున్న అభివృద్ధి, మరియు వైబ్రియోనిక్స్ను సామాన్య ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి చేపడుతున్న చర్యల గురించి ఆయన వివరిస్తున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

దృష్టాంత చరిత్రలు

ఈ సంచికలో 12 ఆసక్తికరమైన కేసులు పంచుకోబడ్డాయి: రుమటాయిడ్ ఆర్థ్రైటిస్; మూత్రపిండాల్లో రాళ్లు; దీర్ఘకాలిక అసిడిటీ; మెడ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి; చేతి నొప్పి; ఎగ్జిమా (చర్మ దద్దుర్లు); హెమీఫేషియల్ స్పాసమ్ (ముఖం ఒకవైపు కండరాల అసంకల్పిత సంకోచం); మసిల్ టియర్ (కండరాల చిరుగు), నీటిలో సూక్ష్మ పురుగుల ఉధృతి; బ్రహ్మకమలం మొక్క పునరుజ్జీవనం; తరచుగా నొప్పితో కూడిన బహిష్టు; మరియు ఆత్మవిశ్వాసం లోపం.

దృష్టాంతములు చదవండి

సాధకుని వివరములు

ఈ సంచికలో ప్రేమతో సేవ చేయాలనే సహజమైన తపన కలిగిన ఇద్దరు అంకితభావం గల, చురుకైన ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. వీరిద్దరూ వైబ్రియోనిక్స్ను తమ జీవితంలో విడదీయరాని భాగంగా మార్చుకున్నారు. మొదటి ప్రాక్టీషనర్ మధుమేహం మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులలో సంభవించే తీవ్రమైన దశలకు చికిత్స చేసి అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఆయన వైబ్రియోనిక్స్ తన జీవన శ్వాస వంటిదని భావిస్తారు. మరొక ప్రాక్టీషనర్ వ్యాధి నివారణ ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడమే కాకుండా, వైబ్రియోనిక్స్ పరిపాలనా బృందంలో కూడా సేవలందిస్తున్నారు. క్లిష్టమైన కేసులకు చికిత్స అందించే సమయంలో వైబ్రియోనిక్స్ యొక్క అద్భుతమైన ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు.

సాధకుని వివరములు చదవండి

ప్రశ్న జవాబులు

తెలుసుకోవడానికి చదవండి: చికిత్స మరియు స్వస్థతలో మంచి ఫలితాలు రావడానికి దోహదపడే, వాటిని నిర్ణయించే మరియు సానుకూల ఫలితాలను కలిగించే అంశాలు ఏమిటి? లోహపు స్ప్రింగ్ ఉన్న ప్లాస్టిక్ స్ప్రే సీసాలు ద్వారా పిచికారీ చేసిన రెమెడీ ప్రభావవంతంగా పనిచేస్తుందా? రెమెడీ బాటిల్‌ను తపాలా ద్వారా పంపేటప్పుడు దానిని అల్యూమినియం ఫాయిల్ తో చుట్టడం మంచిదేనా? రెమెడీలను 5 మి.లీ. ప్లాస్టిక్ బాటిల్స్ లో పంపడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వైబ్రియోనిక్ పొటెన్సీస్ మరియు హోమియోపతిక్ పొటెన్సీస్ మధ్య తేడా ఏమిటి?

పూర్తి వ్యాసం చదవండి

దివ్య వైద్యుని దివ్య వాణి

స్వామి ప్రేమపూర్వకంగా ఆరోగ్యంగా ఎలా జీవించాలి, ఆత్మానందంను ఎలా అనుభవించాలి, అలాగే మోక్షం వైపు నడిపించే సేవా మార్గంలో ఎలాంటి సరైన మనోభావంతో సేవ చేయాలో మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

ప్రకటనలు

భారతదేశం మరియు అమెరికా లో జరగబోయే శిక్షణా శిబిరాలు.

పూర్తి వ్యాసం చదవండి

అదనంగా

ఆహారంలో పప్పుధాన్యాలతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి అనే ఆరోగ్య వ్యాసంలో పప్పుధాన్యాలు అంటే ఏమిటి? వాటి ఆరోగ్య ప్రయోజనాలు, వినియోగ విధానం, నిల్వ చేసే పద్ధతులు, వివిధ రకాల లెంటిల్స్ (పప్పులు), పోషక విలువలు కలిగిన పీస్ (బఠాణీలు) మరియు బీన్స్ (చిక్కుడు జాతి ధాన్యాలు) గురించి, అలాగే పప్పుధాన్యాలను తెలివిగా ఉపయోగించడానికి ఉపయోగకరమైన సూచనలు వివరించబడ్డాయి. నవంబర్–డిసెంబర్ 2021లో పుట్టపర్తిలో నిర్వహించిన ఏవిపి మరియు ఏపి వర్క్‌షాప్స్, అలాగే వార్షిక క్యాంప్ కు సంబంధించిన చిత్రాలు. కొత్తగా అర్హత పొందిన ఒక ప్రాక్టీషనర్ ఇంటికి తిరిగి వెళ్తున్న ప్రయాణంలో వైబ్రియోనిక్స్ యొక్క అద్భుతమైన శక్తిని ఎలా అనుభవించారో తెలిపే ఒక ప్రేరణాత్మక అనెక్డోట్ (స్ఫూర్తిదాయక సంఘటన). స్మారకాంజలి విభాగంలో, తమ చివరి శ్వాస వరకు నిస్వార్థంగా సేవలందించిన ఇద్దరు అంకితభావం కలిగిన ప్రాక్టీషనర్లకు ఘన నివాళిని అర్పిస్తున్నాము.

పూర్తి వ్యాసం చదవండి