Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్న జవాబులు

Vol 13 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2022


Q1. వార్తాలేఖలు చదువుతున్నప్పుడు నేను వైబ్రియానిక్స్ యొక్క కొన్ని అద్భుతమైన కేసులను కనుగొన్నాను.  ఇంత అద్భుతమైన ఫలితాలను పొందడానికి అక్కడ ఏదైనా కళ ఉందా అని నేను ఆశ్చర్యపోయాను ? 

A. విజయవంతమైన వైద్యానికి అనేక అంశాలు ఉన్నాయి. అన్నిటిలో మొదటిది సరైన కంపనాలను (వ్యాధి యొక్క ఫ్రీక్వెన్సీ సరిపోయేది) పంపిణీ చేయడం చాలా ముఖ్యం. సూచించిన మోతాదు మరియు జాగ్రత్తలకు కట్టుబడి ఉండాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సానుకూల శక్తిని సృష్టించే మరియు వైద్య ప్రక్రియను వేగిర పరిచే ఇతర నిర్ణయాత్మక అంశాలు ప్రాక్టీషనరు యొక్క పవిత్రత, సంప్రదింపుల సమయంలో దైవంతో ప్రాక్టీషనరు ఏర్పరుచుకొనే సంబంధం, రోగి యొక్క పరిస్థితి పట్ల ప్రాక్టీషనరు చూపే సానుభూతి,   తోటి మానవుల పట్ల వారికి గల ప్రేమ. ఈ చికిత్స ద్వారా రోగి ఆత్మవిశ్వాసంతో తాను త్వరగా కోలుకోవాలని ఆశించి నప్పుడు వైద్య ప్రక్రియ వేగవంతం అవుతుంది. వైబ్రియానిక్స్ పట్ల రోగికి గల విశ్వాసం ప్రాక్టీషనరు పట్ల అతని నమ్మకం, మరియు అతని మనో స్వచ్ఛత కూడా సానుకూల ఫలితాలను తీసుకురావడానికి దోహదపడే అంశాలు.

_________________________________________________________________________________

Q2. ఒక రెమిడీ ఏలోహంతోను సంబంధం కలిగి ఉండకూడదని నేను అర్థం చేసుకున్నాను( ఒక వార్త లేఖలో పేర్కొన్న విధంగా  స్వచ్ఛమైన వెండి లేదా రాగి కి మినహాయింపు ఇవ్వబడింది). ఐతే రెమిడీ వాటర్ ని స్ప్రే చెయ్యడానికి ఉపయోగించే బాటిల్ లో లోహపు స్ప్రింగు ఉంటుందని ఇది రెమిడీ పై ప్రభావం చూపుతుందని నేను గమనించాను. ఇది రెమిడీ ప్రభావాన్ని తగ్గిస్తుందా లేదా మొక్కలకు ప్రాణం ఉంటుంది కానీ మనుషులకు ఉన్నట్లు  మనసు లేనందున ఇది ఉపయోగించ దగినదేనా? 

A. అటువంటి బాటిల్ ను ఉపయోగించి స్ప్రే చేసిన రెమిడి ప్రతీసారి ప్రభావవంతంగా ఉంటుందని మేము అనుభవం నుండి కనుగొన్నాము. స్ప్రే చేయబడే రెమిడీ చాలా తక్కువ సమయం పాటు లోహంతో స్పర్శకు వస్తుంది కాబట్టి అది తటస్థీకరణ చేయబడే అవకాశం లేదు.

_________________________________________________________________________________

Q3. ఒక రెమిడీ పోస్ట్ లో పంపేటప్పుడు ఆ బాటిల్ ను అల్యూమినియం ఫోయిల్ లో పెట్టడం మంచిదేనా?

A. గత కొన్ని సంవత్సరాలుగా శక్తివంతమైన రేడియేషన్ ను విడుదల చేసే మొబైల్ టవర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీని దృష్ట్యా ఇటువంటి ప్రశ్నకు సంచిక 9 సంపుటి 6 లో ఇవ్వబడిన సమాధానం సవరించాల్సిన అవసరం ఉంది. రవాణా చేసే సమయంలో రేడియేషనుకు గురి అయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి కొత్తది మరియు మందముగా ఉన్న  అల్యూమినియం ఫోయిల్ తో జాగ్రత్తగా చుట్టడం మంచిది. అల్యూమినియం ఫోయిల్ పైకి బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ సాధారణ దృష్టికి కనిపించని సూక్ష్మ రంధ్రాలు ఉంది రేడియేషన్ కు గురిచేయవచ్చు. కాబట్టి వాడిన దానిని మళ్ళీ ఉపయోగించవద్దు. రేడియేషన్ చూపే వస్తువుల నుండి కనీసం 30 సెంటీమీటర్ల దూరంగా రెమిడీలను ఉంచడం ఉత్తమం.

_________________________________________________________________________________

Q4.   మేము సాధారణంగా 5ml ప్లాస్టిక్ సీసాల్లో రెమిడీలను పంపిణీ చేస్తాము. చాలామంది రోగులు దూర ప్రాంతాలలో  నివసిస్తున్నారు కాబట్టి నేను రెమిడీలను పెద్ద బాటిల్ లో పంపించ వచ్చా?

A. మీరు పెద్ద బాటిల్ లో రెమిడీ పంపడం వలన ఎక్కువ మొత్తంలో సప్లై ఉంటుంది కనుక రోగికి అనుకూలంగా ఉంటుంది కనుక పెద్ద బాటిల్ రెమిడీ పంపాలని అనుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. కానీ రెండు 5  ml బాటిళ్ళు  పంపడం ద్వారా కూడా  అదే ప్రయోజనం సాధించవచ్చు. కారణం ఏమిటంటే ఒకవేళ ఉపయోగంలో ఉన్న బాటిల్ రేడియేషన్ కి గురి అయ్యే పరిస్థితి ఉంటే మరొక బాటిల్ కు ఈ ప్రమాదం ఉండదు. ఒకవేళ రోగికి ఇలా హ్యాండిల్ చేయడం కష్టంగా అనిపిస్తే ఉదాహరణ: వృద్ధులకు, మీరు వారికి పెద్ద బాటిల్ పంపించవచ్చు.   

_________________________________________________________________________________

Q5. వైబ్రియానిక్స్ పోటెన్సీ లు హోమియోపతి పొటెన్సీ తో భిన్నంగా ఉంటాయా?  

A. వైబ్రియానిక్స్ పొటెన్సీలు హోమియోపతి పోటెన్సీలపై ఆధారపడి ఉంటాయి కనుక ఒకే విధంగా ఉంటాయి ఒకే విధంగా పనిచేస్తాయి కానీ రెమిడీలు భిన్నంగా తయారు చేయబడతాయి. హోమియోపతి సాంప్రదాయకంగా మదర్ టింక్చర్ లేదా మాతృ పదార్థం నుండి డైల్యూషన్ మరియు సక్షెషన్ పద్దతిలో తయారు అవుతాయి. అందువల్ల 12C కంటే తక్కువ పోటెన్సీ గల  పదార్ధాలలో అసలు పదార్థం యొక్క అణుమాత్రపు అంశాలు ఉండే అవకాశం ఉంది. మరోవైపు వైబ్రియానిక్స్ రెమిడీలు సూక్ష్మ ప్రకంపనలు స్వస్థ పరిచే పదార్ధం లేదా ఒక మీడియం లోకి పోటెన్టైజర్  మిషను ద్వారా  తయారు చేయబడతాయి. అందుచేత ఇందులో ఎలాంటి భౌతిక పదార్ధములు ఉండవు.