Vol 13 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2022
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
మనం 2022 లోకి వెళుతున్న సందర్భంలో జీవితాన్ని ప్రాపంచిక దృక్పథం తో చూసే వ్యక్తికి రాబోయే సంవత్సరం కూడా ఈ మహమ్మారిని భరించడం వల్ల ఏర్పడిన పరిస్థితికి సంబంధించిన అనిశ్చిత స్థితి మరియు ఆందోళనతో నిండి ఉంటుంది. కానీ ఉన్నతమైన ఆదర్శంతో జీవితాన్ని గడిపే వారికి ఈ 2022 పురోభివృద్ధి, ఆశావహ ధృక్పధం, సేవ చేయడానికి మరియు ప్రేమను పంచుకునే అవకాశాన్ని అందించే సంవత్సరంగా స్వాగతించ బడుతుంది. స్వామి ఇలా అన్నారు “పవిత్రమైన శరీరం కలిగిన మనిషి ఈ దేహాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. మనిషి జీవితం ఒక వెదురు కర్ర వంటిది. అది సంపద, భార్య పిల్లలు, కోరికల రూపంలో అనేక ముడులను కలిగి ఉంటుంది. ఈ చిక్కులను తొలగించాలి. ఈ కొత్త సంవత్సరం నుండి మీరు మానవత్వం యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించి మీ జీవితములో పరివర్తన పొందాలి. అప్పుడు మీరు దేశానికి నిజమైన సేవకులు అవుతారు. ప్రజా జీవితం లోని ప్రతీ రంగంలోనూ మీ వంతు పాత్ర పోషించి మీ హృదయాన్ని స్వచ్ఛంగా కల్మష రహితంగా ఉంచుకోండి... సత్య సాయి బాబా- నూతన సంవత్సర ప్రసంగం 1998 జనవరి 1.
మన ప్రతీ ఆలోచన, వాక్కు, మరియు పనిలో మానవత్వాన్ని కనబరాచాలంటే సరైన దృక్పథం తప్పనిసరి. ఒక సంస్థ గా మేము 2021 కి న్యాయం చేశామనే భావిస్తున్నాను. కొత్త సంవత్సరంలో కూడా మనం ఇదే ఉత్సాహాన్ని కొనసాగించగలమని ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను. గడిచిన సంవత్సరాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లుగా మరియు సేవకు అంకితమైన సంస్థగా మనము అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించాము.
- 2020లో ప్రారంభించిన స్ప్రెడ్ ద వర్డ్ ప్రచారం గడచిన సంవత్సరంలో మహమ్మారి సమయంలో కూడా ఊహించని విధంగా పెద్ద ఎత్తున ప్రారంభమైంది. సామాజిక పరిమితులకు కట్టుబడి ఉన్న సమయంలో కూడా మన ప్రాక్టీషనర్లు ఈ సవాళ్లను దీటుగా స్వీకరించి భక్తులు నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సాయుధ బలగాల వరకు పట్టణ ప్రాంతాల నుండి ప్రపంచంలోని మారు మూల వరకు కూడా జనబాహుళ్యమును చేరుకోవడానికి పాఠశాలలు, కళాశాలలు, సాయి కేంద్రాలు మరియు ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ ద్వారా తమకు లభించిన ప్రతీ అవకాశమును వినియోగించుకొని ప్రజలకు అవగాహన కల్పించారు.
- భారతదేశంలో సత్యసాయి సేవా సంస్థ మరియు సాయి వైబ్రియానిక్స్ మధ్య సహకారం పెరగడం ప్రశాంతి నిలయంలో వైబ్రియానిక్స్ క్లినిక్ లు సజావుగా పనిచేయడానికి, మరియు కొత్త క్లినిక్ లు ప్రారంభించడం మరియు సాయి ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీ వంటి అనేక ఇతర ప్రదేశాల్లో కొత్తవాటిని పెంచడానికి మార్గం సుగమం చేసాయి.
- సాధారణం నుండి వర్చువల్ సమావేశాలకు మారిన ఫలితంగా ఈ ప్రపంచమే ఒక చిన్న ప్రదేశంగా మారడంతో ఇప్పుడు మనమంతా ఒకే కుటుంబంగా మరియు సంస్థగా సన్నిహితంగా ఉన్నాము. ప్రాక్టీషనర్ల మధ్య వర్చువల్ నెట్వర్కింగ్ పెరగడంతో గత సంవత్సరంలో గణనీయమైన అభివృద్ధి కనబరుస్తూ అందరి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి మరియు అప్డేట్ గా ఉండడానికి అనేక క్రొత్త ప్రాంతాలు నెలవారి సమావేశాలు ప్రారంభించాయి.
- ఇమ్యూనిటీ బూస్టర్ (IB) గరిష్ట స్థాయిలో వ్యక్తులకు పంపిణీ చేయడం గత సంవత్సరం ప్రాక్టీషనర్ల ప్రాధాన్యతా అంశంగా నిలిచింది. (IB) కోసం డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ 2021 చివరి నాటికి మనము 600,000 లబ్ధి దారుల సంఖ్యకు చేరువలో ఉన్నాము.
- ఈ సంవత్సరం మనము సాధించిన అతి పెద్ద పురోగతి కొత్త అభ్యాసకులకు శిక్షణ ఇవ్వడం మరియు ఇప్పటికే ఉన్న వారికి తిరిగి శిక్షణ ఇవ్వడం. 2021లో మన శిక్షణ ప్రమాణాలను గణనీయంగా పెంపొందించడానికి కృషి చేశాము. AVP మరియు SVP హోదా కోసం మరియు కొత్తగా స్థాపించబడిన అసిస్టెంట్ ప్రాక్టీషనర్ AP క్యాటగిరీ కోసం అడ్మిషన్ నుండి అక్రిడిటేషన్ వరకు అప్డేట్ చేయబడిన ప్రమాణాలు (SOP) ఇప్పుడు అమలులో ఉన్నాయి. చాలా కష్టపడి పనిచేస్తూ ఎల్లప్పుడూ అప్రమత్తముగా ఉండే అడ్మిషన్స్ టీం మరియు IT టీమ్ కు మరియు వారికి మద్దతు ఇస్తున్న ఉపాధ్యాయులు, మెంటర్లు, మరియు ట్రైనింగ్ కోఆర్డినేటర్లు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
- మా పూర్వపు నెలవారీ నివేదిక కోఆర్డినేటర్ లను ప్రాంతీయ సమన్వయకర్తలుగా RC లుగా ఎలివేట్ చేయడం మరొక అభివృద్ధికరమైన అంశము. ఆర్ సి లు ఇప్పుడు పరిపాలన మరియు ప్రాక్టీషనర్ల మధ్య మధ్యవర్తిగా చాలా ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నారు. ద్వైమాసిక సమన్వయం మరియు నవీనీకరణ సమావేశం ఇప్పుడు వీరికి ఒక సాధారణ అంశంగా మారాయి.
- మా AP కోర్సును మాతృభాషలో ప్రారంభించడం అనేది భారతదేశంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో క్లినిక్లను ప్రారంభించడంతో పాటు సాయి వైబ్రియానిక్స్ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యానికి మమ్మల్ని మరింత చేరువ చేసింది. 2021లో మేము హిందీ మరియు తెలుగులో ప్రారంభించాము, మరియు 2022 లో ఇదే పురోగతి కొనసాగిస్తూ కన్నడ, తమిళం, మరియు మలయాళం వంటి ఇతర భాషల్లో AP కోర్సులను ప్రారంభించి అనేక అదనపు క్లినిక్కులు ఏర్పరచడం ద్వారా మా పరిధిని విస్తరించాలని మేము భావిస్తున్నాము.
- 2021లో మా IT బృందం ఐటీ వనరులను (సర్వర్లు, డేటాబేస్ లు, డేటా నిల్వ మరియు వెబ్సైట్లు) సమర్థవంతంగా నిర్వహించిందని మరియు 99% నకు మించి అందుబాటులో ఉండేలా చూసుకున్నదని తెలపడానికి నేను సంతోషిస్తున్నాను. 2022 లో హిందీ మరియు తెలుగు వినియోగదారులకు భాషా మద్దతుతో మా ప్రధాన వెబ్ సైట్ యొక్క సవరించిన అంశాన్ని లేదా సంస్కరణను విడుదల చేయడం, బహుళ భాషలలో కేస్ హిస్టరీ లను శోధించడం కోసం మద్దతు అందించడం, మరియు మా మొదటి అంతర్జాతీయ సమావేశపు పుస్తకంలో ప్రచురింపబడిన అన్ని కేసు చరిత్రలను మా వార్తల విభాగపు సైట్ లో అందుబాటులో ఉంచడం, మరియు ఐటి విభాగంలో సంభావ్య ప్రయోజనాల నిమిత్తం అదనపు నిర్వాహక సిబ్బందికి శిక్షణ ఇవ్వడము ఈ బృందం యొక్క ప్రధాన ప్రణాళికలు. దయచేసి వారి ప్రణాళికల అమలులో ఐటీ బృందానికి మీ మద్దతు మరియు సహకారాన్ని అందించండి. మీరు [email protected] ద్వారా వారికి వ్రాయవచ్చు.
- కొన్ని నెలల క్రితం సాయి వైబ్రియానిక్స్ సెంటర్ నిర్మాణాన్ని ప్రారంభించాము. ఐతే నిర్మాణ కాంట్రాక్టర్లతో ఊహించని సవాళ్ళతో ఇటీవల ఇది నిలిపివేయబడింది. వీలైనంత త్వరగా పనిని పునః ప్రారంభించాలని మేము భావిస్తున్నాము. ఇది ఆలశ్యానికి దారి తీయవచ్చు, ఆలశ్యాలు తిరస్కరణలు కావు.
సంస్థగా మేము “పనిలో పురోగతి” లో ఉంటాము. మనం ఎల్లప్పుడూ ఇదే ఆశయంతో ఉంటామని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే పరిణామం చెందకపోతే మనం ఎదగలేము!
స్వామిని వాక్కు దృష్ట్యా మనమందరం పెంపొందించుకోవాల్సిన నిజమైన దృక్పథం ఇక్కడ ఉంది- “కరుణతో నిండిన హృదయం భగవంతుని ఆలయం. యేసు కరుణ కోసం వేడుకొన్నాడు, కరుణ అతని సందేశం, పేదలను కష్టాలను చూసి ఎంతో చలించి పోయాడు. ఈ రోజు ఏసు ఆరాధింపబడుతున్నాడు కానీ అతని బోధనలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. సాయిని ఆరాధిస్తున్నారు కానీ ఆయన బోధనలు విస్మరింప బడ్డాయి. ప్రతీ చోట ఆడంబరం, ప్రదర్శన, ఆర్భాటపు ఉపన్యాసాలు ఉంటున్నాయి. ఉపన్యాసాలు, ఉపన్యాసాలు, ఉపన్యాసాలు, ఇవే తప్ప కార్యాచరణ లేదు, ప్రేమ లేదు, సేవ లేదు. ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు హీరోలు, చెప్పినది ఆచరణలో పెట్టడంలో జీరోలు. కరుణను అభివృద్ధి చేసుకోండి, ప్రేమలో జీవించండి, మంచిగా ఉండండి, మంచి చేయండి, మంచినే చూడండి. ఇదే భగవంతుని చేరుకొనే మార్గం. - సత్య సాయి బాబా, క్రిస్మస్ ప్రసంగం, 1981 డిసెంబర్ 25.
మీకు మరియు మీ ప్రియమైన వారికి 2022 సంతోషంగా ఆరోగ్యంగా మరియు సుసంపన్నంగా ఉండాలని కోరుకుంటూ
సాయికి ప్రీతికరమైన సేవలో
జిత్ కె అగర్వాల్
కీళ్ల వాతావ 11599...India
52 సవత్సరాల మహిళా ఉపాధ్యాయురాలు చేతులు మరియు కాళ్ళ జాయింట్లలో నొప్పితో బాధపడుతూ ఉన్నారు. బ్లాక్ బోర్డు పై రాయడానికి సుద్ధ మొక్కను పట్టుకునే సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. రుమటాలజిస్ట్ ఆమె పరిస్థితిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు బోలు ఎముకల వ్యాధిగా నిర్ధారించగా ఆమె 2015 డిసెంబర్ నుండి సూచించిన మందులు మరియు సప్లిమెంట్లను తీసుకోవడం ప్రారంభించారు. ఎటువంటి ఉపశమనం లేనప్పటికీ ఆమె మందులను కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. అదనంగా 2 సంవత్సరాల క్రితం ఆమె మోకాలిలో నొప్పి ఏర్పడింది (బహుశా పాఠశాలలో ఎక్కువ గంటలు నిలబడడం వల్ల కావచ్చు), మరియు ఒక సంవత్సరం క్రితం జీర్ణకోశ వ్యాధులు(కడుపులో మంట) కూడా ఏర్పడింది. 2018 జనవరి నాటికి ఆమెకు చాక్ పీస్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడడంతో మెడికల్ లీవ్ తీసుకోవలసి వచ్చింది. 2018 ఆగస్టు 2న ప్రాక్టీషనరును సందర్శించిన సమయంలో ఆమె చాలా నిస్పృహకు గురై ఉన్నారు. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు బోలు ఎముకల వ్యాధికి :
#1. CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.6 Osteoporosis…TDS
జీర్ణకోశ వ్యాధులకు :
#2. CC4.5 Ulcers + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion…TDS
ఒక నెల తర్వాత సెప్టెంబర్ 5న ఆమెకు కడుపులో మంట 90% తగ్గడంతో #2 OD కి తగ్గించబడింది, ఆపై 100% మెరుగుదల ఏర్పడడంతో అక్టోబర్ 15న నిలిపివేయబడింది. సెప్టెంబర్ 20 నాటికి మోకాళ్ళు మరియు కీళ్ళలో నొప్పి స్వల్పంగా తగ్గిందని ఆమె తెలిపారు. డిసెంబర్ 28 నాటికి జాయింట్లలో నొప్పి 50% మరియు మోకాళ్ళలో నొప్పి 80% తగ్గింది. 2019 జూలై 10 నాటికి జాయింట్లలో నొప్పి 90% మెరుగుకావడంతో #1 యొక్క మోతాదు BD కి తగ్గించబడింది. అక్టోబర్ 21నాటికి గత రెండు నెలలుగా అల్లోపతీ మందులు అన్నింటిని నిలిపివేసినప్పటికీ కొద్దిపాటి నొప్పి మాత్రమే ఉందని ఆమె పేర్కొన్నారు. చాక్ పీస్ పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఆమె తన బోధన తిరిగి కొనసాగించారు. డిసెంబర్ 15న #1 మోతాదు OD కి తగ్గించబడింది. 2020 జనవరి నాటికి ఆమె పూర్తిగా కోలుకున్నారు. 2020 మార్చిలో ఒకసారి మరియు 2021 జనవరిలో మరొకసారి రెమిడీ తీసుకోవడం ఆపాలని ప్రయత్నించగా ఆమెకు కొంచం నొప్పి అనిపించి రెండు వారాలపాటు కొనసాగింది. అందుచేత నిర్వహణ మోతాదు OD గా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. 2021 నవంబర్ నాటికి పూర్తిగా రోగ లక్షణ రహితంగా ఉంటూ ప్రాక్టీషనరుతో నిరంతరం అనుసంధానంలో ఉంటున్నారు.
మూత్ర పిండాలలో రాళ్ళు 11599...India
2007లో కారు ప్రమాదం కారణంగా కుడి చీలమండలలో కాంపౌండ్ ఫ్రాక్చర్ కారణంగా పది నెలల పాటు ఆసుపత్రిలో ఉన్నప్పటినుండి ఈ 62 ఏళ్ల వ్యక్తి కిడ్నీలో రాళ్లతో బాధ పడుతున్నారు. అతనికి 18 నుంచి 24 నెలలకు ఒకసారి తన రెండు డొక్కలలో భరింపరాని నొప్పి ఏర్పడి నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రాళ్ళు మూత్రపిండం, మూత్రనాళం, మూత్రాశయములలో ఎక్కడ ఉన్నాయో అనే దానిపై ఆధారపడి అతని ఇతర లక్షణాలు అయినటువంటి పొత్తికడుపులో నొప్పి, మూత్ర విసర్జన సమయంలో అత్యవసర స్థితి మరియు మంట, మూత్రాశయాన్ని కష్టంగా కాళీ చేయడం, అప్పుడప్పుడు జ్వరం వంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అతను 12 సంవత్సరాల్లో 6 సార్లు ఆసుపత్రిలో చేర్చబడి ఒక రోజంతా సెలైన్ వంటి ద్రవ పదార్థాల మీద ఉంచబడి 7 నుండి 10 రోజులు తీసుకోవాల్సిన మందులతో అదే రోజు డిశ్చార్జ్ చేయబడుతూ ఉండేవారు. అతని కిడ్నీలో ఏర్పడే రాళ్ళు 7 మిల్లీమీటర్ల కంటే మించి ఉండేవి కావు, అందుచేత నీరు పుష్కలంగా తాగాలని, మరియు ఆక్జలేట్లు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలని సూచింపబడ్డారు. 2013లో వీరికి మధుమేహం, రక్తపోటు, మరియు రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు నిర్ధారింపబడి 2018 లో వైబ్రియానిక్స్ రెమిడీలు ఈ పరిస్థితిలన్నింటిని పూర్తి నియంత్రణలోకి తీసుకువచ్చే వరకు అల్లోపతి మందులు తీసుకుంటూనే ఉన్నారు. అతను 2019 అక్టోబర్ 14 తేదీన తన రెండు డొక్కలలో విపరీతమైన నొప్పి ఏర్పడడంతో కొన్ని గంటల్లోనే ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC13.5 Kidney stones + CC15.1 Mental & Emotional tonic…ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకు అనంతరం 6TD
మూడు గంటల్లో నొప్పి తగ్గిపోవడంతో అతను తన కార్యాలయానికి హాజరు కాగలిగారు. అదే రోజు సాయంత్రం అతను నొప్పి మాయమైంది. మూత్రం పోస్తున్నప్పుడు రాళ్ల అవశేషాలు కనిపించాయని అతను ధృవీకరించారు. తన యొక్క ఇతర లక్షణాలు కూడా అదృశ్యం అయినందున తను పూర్తిగా ఆశ్చర్యపోయారు. అక్టోబర్ 21న మోతాదు TDS కు తగ్గించబడింది. అక్టోబర్ 30న OD కి తగ్గించబడింది. లక్షణాలు పునరావృతం కాకుండా ఇప్పటికి రెండు సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ అతనను OD లో కొనసాగడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం అతను చాలా సంతోషంగా ఉంటూ తన స్నేహితులందరికీ వైబ్రియానిక్స్ గురించి సిఫారసు చేస్తున్నారు!
దీర్ఘకాలిక ఆమ్లత్వము 11599...India
51 సంవత్సరాల వ్యక్తి ఐదేళ్లుగా ఆమ్లత్వము కారణంగా మంట, తేనుపు, యాసిడ్ రిఫ్లెక్స్ తో బాధపడుతున్నారు. అతను శరీరానికి వ్యాయామము లేని నిశ్చల జీవన శైలి, మరియు రిటైల్ సేల్స్ కు సంబంధించి ఒక గొలుసు గ్రూపుకు అధిపతిగా చాలా ఒత్తిడితో కూడిన పనిభారము కలిగి ఉన్నారు. గత ముప్పై సంవత్సరాలుగా తను రోజుకి పది సిగరెట్లు తాగుతూ ఉండేవారు. గత ఐదు సంవత్సరాలుగా అతను అనేక నివారణా ఔషధాలను, మరియు ప్రిస్క్రిప్షన్ మందులు ప్రయత్నించారు కానీ ఏదీ సహాయం చేయలేదు. 2018 సెప్టెంబర్ 9న ప్రాక్టీషనరును కలిసేనాటికి అతను ఎలాంటి ఔషధాలు తీసుకోవడంలేదు, అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC4.5 Ulcers + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic…TDS
ధూమపానం మానేయాలని నిశ్చల జీవనశైలికి దూరంగా ఉండాలని ప్రాక్టీషనరు సూచించారు. 2019 ఫిబ్రవరి 16 వరకు అతను తిరిగి రాలేదు, ఐతే ఈ రెమిడీ తీసుకుంటున్న ఇంతకాలం వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేవని తెలిపారు. ఇచ్చిన రెమిడీ జనవరిలో పూర్తయిపోవడంతో వ్యాధి లక్షణాలు మళ్ళీ తీవ్రమయ్యాయి. అతనికి రీఫిల్ ను ఇస్తూ రోజుకు 40 నిమిషాల చొప్పున వారానికి కనీసం ఐదు రోజులు నడవాలని సూచించారు. మార్చి 19న తన వ్యాధి లక్షణాల తీవ్రత తక్కువగా ఉందని సంతోషంతో తెలియ జేశారు. జూన్ 6 వ తేదీనాటికి 20% మెరుగుపడడంతో అతను క్రమం తప్పకుండా రెమిడీ తీసుకోవడం ప్రారంభించారు. అతను ధూమపానం మానివేయడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. నవంబర్ 11న అతను 50% మెరుగుదల ఉందని, డిసెంబర్ 26 నాటికి 80% చేరుకుని, 2020 మార్చి మూడో వారం నాటికి ఆమ్లత్వం జాడ కూడా లేకుండా పోయింది.
కోవిడ్ లాక్ డౌన్ కారణంగా అతను ప్రాక్టీషనరును సందర్శించలేక పోవడంతో 2020 మార్చిలో రెమిడీ తీసుకోవడం మానేశారు. సానుకూల అంశం ఏమిటంటే లాక్డౌన్ కారణంగా అతను తన బ్రాండ్ సిగరెట్ పొందలేకపోయిన కారణంగా ఈ దురలవాటు బలవంతంగా వదల వలసి వచ్చింది. ఒకవారం లోనే తనలో శక్తిస్థాయి పెరిగినట్లు భావన కలిగింది. అతని జీవనశైలిని మార్చడంలో గొప్ప పురోగతికి దారితీసింది. ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవనం యొక్క ప్రాముఖ్యత అతను గ్రహించారు. నెమ్మదిగా ధూమపానం మానివేసి, సైక్లింగ్ ప్రారంభించారు. ప్రతీరోజు పదిహేను కిలోమీటర్లు మరియు వారాంతంలో 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణం ప్రయాణించడం ప్రారంభించారు. చివరిగా 2021 ప్రాక్టీషనరును సంప్రదించిన సందర్భంలో 18 నెలలకు పైగా వ్యాధి పునరావృతం కాలేదని తెలిపారు.
సంపాదకుని వ్యాఖ్య: క్రమం తప్పకుండా రెమిడీలు తీసుకోవడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతను ఈ కేసు నిరూపిస్తుంది.
మెడ ప్రాంతంలో నొప్పి 03518...India
42 ఏళ్ల వ్యక్తి గత 10 సంవత్సరాలుగా తల వెనుక భాగంలో చెవుల భాగం నుండి మెడ వరకు నొప్పితో బాధ పడుతున్నారు. అది క్రమంగా ఇబ్బంది కరంగా మారి ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరింది. తను సరైన భంగిమలో కూర్చోనకుండా తన లాప్ టాప్ ను రోజుకు ఎనిమిది గంటలు ఎక్కువ సేపు వాడుతున్నప్పుడు ఇలా జరుగుతూ ఉన్నట్లు అతను కనుగొన్నారు. అతను కొన్ని నెలలు హోమియోపతి ప్రయత్నించారు కానీ పెద్దగా ఉపశమనం లేదు. తను అల్లోపతీ మందులు తీసుకోలేదు. అతను ల్యాప్టాప్ తో పనిచేయకుండా ఉన్నప్పుడు(ఉదాహరణకు సెలవుల్లో) అతను కొంత ఉపశమనం పొందారు, తిరిగి పని ప్రారంభించినప్పుడు నొప్పి తీవ్రమవుతున్నది. 2021 ఏప్రిల్ 16న అతను తల మరియు ముఖ భాగంలో నిర్దిష్ట బిందువుల వద్ద ఆక్యుప్రెషర్ ను ఎలా ఉపయోగించాలో నేర్పించిన ప్రాక్టీషనర్ ను సంప్రదించి క్రింది రెమిడీ స్వీకరించారు:
CC3.7 Circulation + CC11.3 Headaches + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.5 Spine…TDS
ఒక నెలలో నొప్పి 80% తగ్గింది, మరియు కంప్యూటర్ లో అతను రోజువారీ పనిగంటలు 4 నుండి 5 గంటలకు తగ్గింది. జూన్ 13 నాటికి నొప్పి 90% వరకూ తగ్గిపోగా, జూన్ 27 నాటికి నొప్పి పూర్తిగా తగ్గిపోవడంతో మోతాదు OD కి తగ్గించబడింది. జూలై 1 నుండి అతని కంప్యూటర్ వినియోగం రోజుకు 8 గంటల వరకు పెరిగింది ఐతే రెండు సందర్భాలలో అతను అతిగా ఒత్తిడికి గురైనట్లు అనిపించినప్పుడు అతను కొంత నొప్పి అనుభవించారు, కానీ రెండు రోజుల పాటు మోతాదు BD కి పెంచడం ద్వారా అతను పూర్తిగా బాగానే ఉన్నారు. నిర్వహణ మోతాదుగా రెమిడీ కొనసాగించమని అతనికి సలహా ఇచ్చినప్పటికీ జులై 3వ వారం నుంచి నొప్పి తిరిగి రాకపోవడంతో రెమిడీ తీసుకోవడం మానేశారు. 2021 నవంబర్ 30 నాటికి అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు, శ్రద్ధగా ఆక్యుప్రెషర్ కొనసాగిస్తున్నారు.
ముంజేతిలో నొప్పి 03518...India
41 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలికి మహమ్మారి సమయంలో ఆన్లైన్ తరగతులు ప్రారంభమైనప్పటి నుండి గత ఎనిమిది నెలలుగా కుడిచేతితో ముఖ్యంగా ముంజేతి వద్ద ఎక్కువ నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఇది క్రమంగా అధ్వానంగా మారి ప్రతీ రోజు సాయంకాలం నాటికి బాగా అలసటకు గురిచేస్తున్నది. 1:10 రేటింగ్ స్కేలులో 7 గా నమోదయ్యే నొప్పి స్వల్పంగా నిరంతరాయంగా కొనసాగుతున్నది. కీబోర్డ్ పైన టైప్ చేస్తున్నప్పుడు లేదా కుట్లు అల్లికలు చేసినప్పుడు నొప్పి 8 రేటింగ్ పెరుగుతూ భుజం వరకు పాకుతోంది. గత 4 రోజులుగా ఎడమ చేయి కూడా నొప్పికి గురి అవుతున్నది. ఆమె ఎటువంటి నొప్పి నివారణులు లేదా ఇతర మందులు తీసుకోలేదు. 2021 మే 14న ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue...QDS
ఒక వారంలో ఆమె ఎడమ చేతిలో నొప్పి పూర్తిగా మాయం అయింది కానీ కుడిచేతి నొప్పి అలాగే ఉందనిపించింది. జూన్ 13 నాటికి ఆమె కుడిచేతిలో నొప్పి 75% తగ్గింది, కానీ ఆమె కుట్లు అల్లికలు పని చేస్తున్నప్పుడు నొప్పి పెరిగింది, ఐతే ఇప్పుడు భుజం వరకు పాకడం లేదు. జూన్ 24న ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి, ఆమె శ్రద్ధగా రెమిడీ తీసుకోవడం కొనసాగించారు, జూలై 15 నాటికి నొప్పి నుండి 100% ఉపశమనం లభించింది. పాఠశాలలో రోజంతా ఉన్నా కూడా ఆమె అలసిపోవడం లేదు. మోతాదు BD కి తగ్గించబడి ఆగస్టు 11 నాటికి ఆపివేయబడింది. 2021 నవంబర్ నెలాఖరు నాటికి ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నప్పటికీ ఆమె నొప్పి లేకుండా ఉత్సాహంగా ఉన్నారు, తరగతులను చక్కగా నిర్వహిస్తున్నారు, తన అభిరుచి ఐన కుట్టుపని కూడా కొనసాగిస్తున్నారు.
తామర 03599...USA
11 ఏళ్ల బాలిక తన ఎడమ మోచేయి మడతలపైన రెండు సంవత్సరాల నుండి పొడిగా ఉంటూ తీవ్రమైన దురదతో పాటు కఠినముగా, రంగు మారిన చర్మంతో ఉన్న తామరతో బాధపడుతున్నది. ఈ సమస్య ప్రతీ మూడు లేదా నాలుగు నెలలకు పునరావృతం ఔతూ ఉన్నందున ఆలోపతి ఔషధాలు నోటిద్వారానూ మరియు బాహ్య అనువర్తనం కోసం వాడే క్రీములు లక్షణాలను తాత్కాలికంగా తగ్గించడంలో సహాయపడుతున్నవి. సాధారణంగా పాప చర్మం చాలా సున్నితంగా ఉండడం వలన చిన్న పురుగు కానీ కీటకం గానీ కుడితే అది వెంటనే దద్దుర్లకు కారణం అవుతుంది. ఈసారి తామర లక్షణాలు పునరావృతం అయినప్పుడు తల్లి అలోపతి మందులు ఎంచుకోకుండా బదులుగా 2020 నవంబర్ 3న ప్రాక్టీషనరును సంప్రదించగా అమ్మాయికి క్రింది రెమిడీ ఇవ్వబడింది;
#1. NM27 Skin-D + NM36 War + NM46 Allergy-2 + NM62 Allergy-B + NM102 Skin Itch + BR13 Allergy + SR308 Pituitary Gland + CC10.1 Emergencies + CC21.1 Skin tonic + CC21.3 Skin allergies + CC21.6 Eczema ...TDS ఆక్వా బేస్ క్రీములో బాహ్య అనువర్తనం కోసం
#2. CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + #1…TDS
ఒక వారం తర్వాత దురదల విషయంలో 60% మెరుగుదల మరియు గరుకుదనం మరియు రంగు మారడం విషయంలో 50% మెరుగుదల కలిగింది. నవంబర్ 22న ఆ అమ్మాయిలో బహుశా అలర్జీ కారణంగా ముక్కునుండి నీరు కారడం, ముక్కు మూసుకు పోవడం, కళ్లనుండి నీరు కారడం వంటి లక్షణాలు అభివృద్ధి కాగా #2 క్రింది విధంగా మార్చబడింది:
#3. CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC21.1 Skin tonic + CC21.3 Skin allergies + CC21.6 Eczema…TDS
నవంబర్ 27నాటికి ఐదు రోజుల్లోనే అన్ని తీవ్ర లక్షణాల్లో 50% ఉపశమనం లభించింది. ఇప్పుడు చర్మం 90% మెరుగ్గా ఉంది. 2021 జనవరి 4 నాటికి పూర్తి ఉపశమనం కలుగగా చర్మం సాధారణ స్థితికి వచ్చింది. #1 ఆపివేయబడింది, #3 ను ఆపడానికి ఒక వారం ముందు వరకూ కూడా BD కి తగ్గించబడింది. 2021 డిసెంబర్ నాటికి అనగా రెమిడీ మానివేసిన దాదాపు సంవత్సరం తర్వాత పాపకు తామర పునరావృతం కాలేదు.
108CC బాక్సు ఉపయోగిస్తున్నట్లైతే #1: CC10.1 Emergencies + CC21.1 Skin tonic + CC21.3 Skin allergies + CC21.6 Eczema ఇవ్వండి.
హెమి ఫేషియల్స్ స్పాజం 11626...India
60 ఏళ్ల మహిళ తన ముఖం యొక్క కుడి వైపున కండరాలు మెలితిప్పడం (కండరాలు కుంచించుకు పోవడం) అనే వ్యాధితో గత నాలుగు సంవత్సరాలుగా బాధపడుతున్నారు. ఇలా కండరాల మెలితిరగడం కంటి దగ్గర మొదలై క్రమంగా చంప కండరాలకు
విస్తరించింది. ఆమె కుడి కన్ను ఎడమ వైపు కంటే చిన్నదిగా కనిపించింది (చిత్రాన్ని చూడండి). రెండు సంవత్సరాల క్రితం వైద్యుని సంప్రదించగా ఆమెకు నాలుగు బొటాక్స్ ఇంజక్షన్లు సూచించారు. 2018 మార్చిలో ఒక ఇంజక్షన్ తీసుకోగా అది కంటి వాపుకు కారణం అయ్యింది, అంతేకాక దీని అధిక ఖరీదును దృష్టిలో పెట్టుకుని కొనసాగించకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఈమె భర్త చనిపోవడంతో చాలా ఒత్తిడికి లోనై ఉన్నారు. క్రమంగా ఈ కండరాలు మెలి తిరగడం ముఖ్యంగా ఉదయపూ సమయంలోనూ, మరియు మాట్లాడేటప్పుడు నిమిషానికి ముప్పై నుండి నలభై సార్లు కు పెరిగిపోయింది. దీని వలన చాలా అసౌకర్యానికి గురై 2020 మార్చి 17 న ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:
#1. CC15.1 Mental & Emotional tonic + CC18.4 Paralysis + CC20.4 Muscles & Supportive tissue…TDS
మొదటి నెలలో కండరాలు మెలితిరగడం 30% మరొక నెలలో 50% నకు తగ్గింది. ఆమె చాలా నీరసంగా ఉన్నందున ఆమెకు 2020 జూన్ 16న #1 మెరుగుపరిచి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#2. CC12.1 Adult tonic + #1…TDS
ఆగస్టు 25 నాటికి ఆమె చెంప సాధారణంగా కనిపించింది కానీ ఇంకా కొంత కండరాల మెలితిరగడం అలాగే ఉంది. అక్టోబర్ 18 నాటికి పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి #2 BD కి తగ్గించబడింది,మరియు 2021 ఫిబ్రవరి 12న OD కి తగ్గించబడి మే 3 వ తేదీన నిలిపి వేయబడింది. 2021 అక్టోబర్ నాటికి ఆమెకు సాధారణంగా ఉంది కానీ అప్పుడప్పుడు ఆమె చాలా ఒత్తిడికి లోనైనప్పుడు స్వల్పంగా కండరాల ఇబ్బంది ఉంటుంది. అందుచేత రెమిడీని నిర్వహణ మోతాదు OD గా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు 2021 డిసెంబర్ నాటికి ఆమె రెమిడీని కొనసాగిస్తూ ఆరోగ్యంగా ఉన్నారు.
కండర చీలిక 03601...Nepal
2018 ఆగస్టు లో 52 ఏళ్ల మహిళ మోటార్ సైకిల్ ప్రమాదానికి గురయ్యారు. ఆమె కుడి మోచేయి నేలకు బలంగా తాకింది. రెండు రోజుల్లో నొప్పి బాగా పెరగడంతో ఆమెకు ఎక్స్రే తీయబడింది. ఎముకకు ఎటువంటి పగుళ్ళను ఇది నిర్ధారించలేదు, కానీ మోచేతి వద్ద కండరంలో చీలిక ఏర్పడినట్లు డాక్టర్ నిర్ధారించారు. సూచింప బడిన మందులు వేసుకుంటూ ఆయింట్మెంట్ ఒక నెల రోజుల పాటు వాడారు. ఇది ఆమెకు నొప్పి నుండి 50% ఉపశమనం కలిగించింది కానీ వంట గదిలో బరువైన వస్తువులు ఎత్తడం కష్టంగా ఉంది. 2018 అక్టోబర్ లో నొప్పి తీవ్రమైనందున ఆమె హెర్బల్ రెమిడీ మరియు మసాజ్ ఎంచుకున్నారు. అది ఆమెకు సహాయపడింది కనుక నొప్పి కలిగినప్పుడల్లా ఈ మందు వాడుతూ జీవితాన్ని వెళ్లబుచ్చసాగారు. 2019 జూన్ లో నొప్పి బాగా తీవ్రమై అరకేజీ కూరగాయలు కూడా ఆమె లేపలేక పోయేవారు. డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చారు అది కొంత ఉపశమనం కలిగించింది కానీ అది తాత్కాలికమే. 2019 నవంబర్ లో నొప్పి మళ్లీ ఏర్పడింది. సంప్రదాయ వైద్యుని వద్ద నుండి మూలికా చికిత్స తీసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇది పని చేసినట్లు అనిపించింది. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఆమెకు ప్రయాణం చేయడంలో ఇబ్బంది ఉన్నందున ఈ చికిత్స కొనసాగించలేకపోయారు. అందుచేత నొప్పి ఆమె కుడి భుజము, మెడ మరియు వీపు పైభాగానికి వ్యాపించి ఆమె తన మెడను ప్రక్కకు వంచడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. 2021 ఆగస్టు 9న నొప్పి భరించలేనిదిగా ఉండడంతో వైద్యుని సందర్శించాలని ప్రణాళిక వేసుకున్నారు. అదే రోజున ఆమె AVP గా కొత్తగా అర్హత సాధించిన తన సోదరుడి నుండి ఇమ్మునిటీ బూస్టర్ (IB) అందుకున్నారు. ఆమె ఆ రాత్రి ఒక మోతాదు IB తీసుకున్నారు. అద్భుతంగా ఆమె నొప్పి పూర్తిగా మాయమైంది. 2021 సెప్టెంబర్ 15న ఆమె తన దీర్ఘకాలిక పరిస్థితికి తన సోదరుడు నుండి క్రింది రెమిడీ అందుకున్నారు:
CC12.1 Adult tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.4 Muscles & Supportive tissue + CC20.7 Fractures…BD
ఆమె IB ని OD గా కొనసాగిస్తూనే ఉన్నారు. వారం తర్వాత 5-6 కిలోల కూరగాయలు, మరియు రెండు వారాల తర్వాత 25 కిలోల బ్యాగ్ ని తీసుకెళ్లగలిగారు. తన ఇంటి పనులన్నీ ఇబ్బంది లేకుండా చేసుకో గలుగుతున్నారు. అక్టోబర్ 15 నుండి ప్రారంభించి ఒక నెల రోజులలో మోతాదు క్రమంగా OW కి తగ్గించబడింది. 2021 డిసెంబర్ నాటికి OW నిర్వహణ మోతాదుగా IB ని OD గా కొనసాగిస్తున్నారు. ఇప్పుడామె ఎటువంటి నొప్పి లేకుండా చాలా చక్కగా ఉన్నారు.
నీటిలో కీటకముల ద్వారా ఇన్ఫెక్షన్ 12051...India
ఒక చిన్న గ్రామంలోని చాలా మంది నివాసితులు దాదాపు నెల రోజులుగా శరీరమంతటా తీవ్రమైన దురద మరియు దద్దుర్లతో బాధపడుతున్నారు. తమ గ్రామంలోని మొత్తం 41 నీటి ట్యాంకులలో (41 వ్యక్తిగతమైనవి, ఒకటి అందరికీ చెందినది) నీరు రంగు మారిపోయి పురుగులతో కూడి ఉన్నాయని గుర్తించారు. గ్రామస్తులలో ఒక ప్రధాన వ్యక్తి 2021 జూలై 17న ప్రాక్టీషనర్ ను సంప్రదించగా క్రింది రెమిడీ అందించారు:
NM36 War + NM101 Skin-H + NM102 Skin Itch + SM2 Divine Protection + SM41 Uplift + SR272 Arsen Alb 30C + SR293 Gunpowder + SR311 Rhus Tox 200C + SR497 Histamine…TDS బాహ్య అనువర్తనం కోసం, విభూతిని ట్యాంకులలో కలపడం కోసం …2TW
41 మంది గ్రా మస్తులు మౌఖికంగా ఔషధాన్ని ఉపయోగించారు. 20 రోజుల్లో ఆ బృందం లోని పిల్లలు మరియు మధ్యవయస్కులు వ్యాధి లక్షణాల నుండి పూర్తిగా విముక్తి పొందగా వృద్ధులు 100% మెరుగుపడటానికి మరో పది రోజులు పట్టింది. గ్రామస్తులు OD మౌఖిక నిర్వహణ మోతాదుగా కొనసాగించాలని సూచించారు.
విభూతి తో చేర్చిన పై రెమిడీ ఒక చిన్నపేకట్టును మొదట ఒక లీటరు నీటిలో కలిపి ఆ నీటిని ట్యాంకులో చేర్చి ఆ నీటిని కర్రతో బాగా కదిలించారు. ఈ పద్ధతి మొత్తం 41 ట్యాంకులలో వారానికి రెండు సార్లు చొప్పున 4 వారాలు అనుసరించారు. కొన్ని ట్యాంకులు ఒక వారంలోనే పురుగుల నుండి విముక్తి కాగా మరికొన్ని 10 రోజులలో విముక్తి పొంది ఆ నీరు సురక్షితంగా ఉపయోగించబడింది. వారానికి ఒకసారి పై పద్దతి అనుసరించాలని సూచించ బడింది. ఈ నీటిని తాగడానికి తప్ప అన్నీ గృహ అవసరాలకు ఉపయోగించారు. ఇలా నెల రోజులు చేసిన తరువాత ఆ నీటిని వడకట్ట కుండానే ఉపయోగించడం కొనసాగించారు. వారు భవిష్యత్తులో నీటి చికిత్స కోసం స్థానిక అధికారులు సహాయం కూడా కోరలేదు.
గ్రామస్థుల నుండి ప్రశంశా పూర్వక సాక్ష్యము: మీ మార్గదర్శకత్వంలో 11 మంది పిల్లలకు 13 మంది యువకులకు మరియు 17 మంది వృద్ధులకు నీటిలో ఉండే పురుగుల కారణంగా చర్మానికి ఏర్పడిన రుగ్మత నిమిత్తం వైబ్రియానిక్స్ ఔషధం అందించినట్లు తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మా అవసరానికి అనుగుణంగా అభ్యర్థించిన వెంటనే మీరు అందించిన ఔషధం చాలా చక్కగా పనిచేసింది. నిత్యమూ రోజుకు రెండుసార్లు చొప్పున రెండు వారాల పాటు మేము దీనిని తీసుకున్నాము. కేవలం 20 రోజులలో 100% నివారణ పొంది నందుకు సంతోషంగా ఉంది. మీ సూచన మేరకు వారానికి రెండుసార్లు ఈ రెమిడీని 40 ట్యాంకులలో కలిపాము. మేము ఈ నీటిని పరీక్షించి చూడగా ఆ నీరు పూర్తిగా స్వచ్చంగా మారిపోయి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంది. మేము ఈ ఔషధం పైన పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాము కనుక ఇటువంటి మరి ఏ ఇతర పరిస్థితులలో కూడా వైబ్రియానిక్స్ ఔషధాన్ని అందజేయ వలసిందిగా అభ్యర్ధిస్తున్నాము.
గ్రామస్తులు అందించిన పై వ్యాఖ్యకు వీడియో లింకు: https://photos.app.goo.gl/vfYrTwY8v9octcr87
108CC బాక్సు ఉపయోగిస్తున్నట్లైతే : CC21.1 Skin tonic + CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions; ఇవ్వండి.
సంపాదకుని వ్యాఖ్య: NM103 Stings & Bites లేదా CC21.4 Stings & Bites అదనంగా జోడించినట్లైతే వేగవంతమైన ప్రతి స్పందన వచ్చిఉండేది.
బ్రహ్మ కమలం మొక్క పునరుజ్జీవింప చేయడం 11615...India
మొక్కల ప్రేమికురాలైన ప్రాక్టీషనర్ యొక్క పెద్ద కోడలు 5 సంవత్సరాల క్రితం బ్రహ్మకమలం (ససూర్య అబ్వలత) నాటారు. అది చక్కగా పెరుగుతూనే ఉంది కానీ ఒక పుష్పం కూడా వికసించలేదు. ఐతే తన మలబద్ధకం సమస్య కోసం మరియు కోవిడ్-19 మహమ్మారి సమయం లోనూ వైబ్రియానిక్స్ యొక్క ప్రయోజనాలను అనుభవించి ఉన్న మీదట వైబ్రియానిక్స్ మొక్కలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని తెలుసుకున్న వెంటనే ఆమె తన మొక్కను పునరుజ్జీవింప చేయడానికి రెమిడీని అభ్యర్థించారు. 2020 జులై 15 న క్రింది రెమిడీ ఇవ్వ బడింది:
CC1.1 Animal tonic + CC1.2 Plant tonic…OD నీటిలో
సెప్టెంబర్ 15న ఒక పుష్పం వికసించినట్లు (చిత్రం చూడండి) ఆమె చాలా ఆనందంగా తెలిపారు. ఆమె ఒక్క రోజు కూడా మిస్ కాకుండా రెమిడీని కొనసాగించారు. నవంబర్ మొదటి వారంలో మరో మూడు పూలు పూసాయి. 2021 ఏప్రిల్ నుండి అది పుష్పించే కాలం కాదు కాబట్టి రెమిడీ నీటిని మొక్కకు అందించడం నిలిపివేశారు. మరుసటి ఋతువులో అనగా 2021 జులై నాటికి 5 పువ్వులు, (చిత్రాన్ని చూడండి) ఆ తర్వాత ఆగస్టు నెలలో 15 మరియు సెప్టెంబర్ నెలలో 18 పూలు(చిత్రాన్ని చూడండి) వికసించాయి. తనకు ఇష్టమైన మొక్క పునరుజ్జీవనం పొందడం వలన ఆమెకు మరలా రెమిడీ ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. 2021 నవంబర్ నాటికి అ మొక్క పుష్పించడం కొనసాగిస్తూనే ఉంది.
*ఈ మొక్క హిమాలయ పువ్వుల రాజు అని పిలవబడే ఔషధమూలిక బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇది సమర్పించబడుతూ ఉంటుంది.

బాధకారమైన, తరుచుగా వచ్చే ఋతుక్రమము 11624...India
34 ఏళ్ల గృహిణికి 2012 జూన్ లో మొదటి డెలివరీ అయినప్పటి నుండి బాధాకరమైన మరియు తరచుగా వచ్చే ఋతుక్రమంతో బాధపడుతున్నారు. ఆమె నెలవారీ ఋతుచక్రం 15-18 రోజులకు తగ్గడమే కాక రక్తస్రావం 4 నుండి 5 రోజుల వరకు ఉంటున్నది. 2017 నవంబర్ లో ఆమె రెండవ బిడ్డ జన్మించిన తర్వాత, ఆమెకు తీవ్రమైన వెన్ను మరియు కాళ్ళ నొప్పి రావడం ప్రారంభించింది, ఇది రుతుక్రమానికి 4 నుండి 5 రోజుల ముందు ప్రారంభమయ్యి ఋతు కాలమంతా కొనసాగుతుంది. దీనితో పాటు పొత్తికడుపు దిగువ భాగంలో తిమ్మిరి కూడా ఏర్పడడంతో ఆమె పీరియడ్స్ సమయంలో మలాన్ని సరిగ్గా విసర్జించలేకపోవడంతో ఆమె ఇంటి పనులు చేయడం కష్టంగా మారింది. ఆమె పండ్లు పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటూ ఉన్నారు. ఈ సమస్యల గురించి ఆమె ఏ వైద్యుడిని సంప్రదించలేదు మరియు ఎటువంటి మందులు తీసుకోలేదు. 2021 ఏప్రిల్ 5 న, ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
ఋతుక్రమము కోసము:
#1. CC8.4 Ovaries & Uterus + CC8.7 Menses frequent + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…TDS
అజీర్ణము కోసము:
#2. CC4.1 Digestion tonic + CC4.4 Constipation + CC12.1 Adult tonic…TDS
ఆమె రెమెడీ తీసుకోవడం ప్రారంభించిన రోజు ఆమె ఋతు చక్రంలో ఐదవ రోజు. ఆమె తర్వాతి పీరియడ్స్ 21వ రోజున వచ్చింది. మరియు ఆమె బహిష్టుకు ముందు వెన్ను మరియు కాలు నొప్పి మరియు తిమ్మిరిలో 20% మెరుగుదలని గమనించారు. మరియు పీరియడ్స్ సమయంలో మలబద్ధకం నుండి 100% ఉపశమనం పొందారు. జూలై 20న, ఆమె తన పీరియడ్స్ రెగ్యులర్‌గా మారిందని (26-27 రోజుల సైకిల్) మరియు మే నెల నుండి ఆమె బహిష్టుకు పూర్వ లక్షణాలన్నింటిలో 100% ఉపశమనం ఉందని తెలియజేసారు. అలాగే, పీరియడ్స్ సమయంలో ఆమె సాధారణ ఆహారమే తీసుకొన సాగారు.
ఆగస్ట్ 15న #1 మరియు #2 రెండింటి డోసేజ్ BDకి తగ్గించబడింది, ఇది ఆమె పూర్తిగా ఆపడానికి ముందు అక్టోబర్ మధ్య వరకు కొనసాగింది. డిసెంబర్ 2021 నాటికి, ఆమె ఎలాంటి వ్యాధి లక్షణాలు పునరావృతం కాకుండా బాగానే ఉన్నారు. ప్రాక్టీషనర్ రోగితో క్రమం తప్పకుండా టచ్‌లో ఉంటూ మరో సంవత్సర కాలం ఆమెను పర్యవేక్షిస్తూనే ఉండడానికి నిర్ణయించుకున్నారు.
ఆత్మవిశ్వాసం లోపించడం 03582...South Africa
అంతర్ముఖురాలైన 13 ఏళ్ల అమ్మాయికి ఆత్మవిశ్వాసం లోపించడంతో మూడు సంవత్సరాల వయస్సు నుండి తన సొంత కుటుంబం మరియు స్నేహితులతో కూడా మాట్లాడటానికి భయపడేది. స్కూల్లో పరీక్షలు రాయడం కూడా చాలా ఒత్తిడితో కూడుకున్నవి గా పాప భావించింది. ఈ పాప యొక్క ఆంటీ ఆమెను 2021 ఆగస్టు 3న ప్రాక్టీషనర్ వద్దకు తీసుకు వెళ్లారు. ఆమెకు ఈ క్రింది రెమిడీ అందించబడింది:
CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic…TDS
ఒక నెల తర్వాత సెప్టెంబర్ 5న ఆమె పూర్తి పరివర్తన గురించి ఆమె తల్లి నుండి విన్న తరువాత ప్రాక్టీషనర్ ఎంతో సంతోషించారు, క్రింద పేర్కొన్న పాప తల్లి యొక్క వ్యాఖ్యని చదవండి. ఈ రెమిడీని నవంబర్ లో ఆమె పరీక్షలు పూర్తయ్యేవరకూ TDS గా కొనసాగించి ఆ తరువాత నిర్వహణ మోతాదు OD కి తగ్గించబడింది.
పేషంటు తల్లి యొక్క వ్యాఖ్య:
“ఆశ్రయ ఎప్పుడూ అంతర్ముఖిరాలిగా ఉంటూ అందరితో కలవడానికి విముఖత చూపుతూ వెనుక నిలబడి చూడడానికి మరియు వినడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా అవసరమైతే తప్ప ఆ సంభాషణ పట్ల ఆసక్తి చూపదు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సహా గుంపులో మాట్లాడటానికి ఆమెకు కష్టంగా ఉండేది. ఆమె చేతులు తడిగా మారిపోయి ఆమె నుదుటిపై చెమట బిందువులు ఏర్పడతాయి. ఆమె అభిప్రాయాలను కలిగి ఉంటుంది కానీ తన అభిప్రాయాలను తనలోనే దాచుకోవడానికి ఇష్టపడుతుంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోడానికి వైబ్రియానిక్స్ రెమిడీ తీసుకోవడం ప్రారంభించినప్పటి నుండి ఇవన్నీ మారిపోయి అప్పటి నుండి ఆమె ఒక ఆత్మ విశ్వాసం కలిగిన యువతిగా మారిపోయింది. ఆమె ఇప్పుడు వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చల్లో పాల్గొంటున్నది. ఆశ్రయ కూడా తన గొంతును వినిపిస్తూ ఉద్వేగభరితమైన విషయం అయినప్పటికి మాట్లాడానికి భయపడడం లేదు. ఉపాధ్యాయులు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కూడా ఆమె ఖచ్చితంగా ఆమె భయం అనే గూడు నుండి బయటకు వచ్చిందని గమనించారు. మా చిన్న అమ్మాయి ఒక అందమైన ఆత్మ విశ్వాసం కలిగిన యువతిగా వికసించి ఇప్పుడు ఈ ప్రపంచమంతా తనదేనని భావిస్తోంది. వైబ్రియానిక్స్ గురించి మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు స్వామి”
ప్రాక్టీషనర్ల వివరాలు 11599...India
ప్రాక్టీషనర్ 11599…ఇండియా రెండు దశాబ్దాలకు పైగా అమ్మకపు రంగంలో విజయవంతమైన కెరీర్ తర్వాత ఎండ్యూరెన్స్ స్పొర్ట్స్ లో తమ సమయాన్ని వెచ్చించాలని ఆశతో 44 సంవత్సరాల వయసులో రిటైర్ అయ్యారు. ఐతే జీవితం వీరి కోసం ఇతర
ప్రణాళికలను కలిగి ఉంది. 2000 సంవత్సరంలో విమానాశ్రయంలో ఒక దివ్య దృష్టి గల వ్యక్తిని అనుకోకుండా కలుసుకోవడం వేద జ్యోతిష్య శాస్త్రం పై వీరి ఆసక్తిని రేకెత్తించి, అద్వైత శాస్త్రం గురించి చదవడానికి దారితీసింది 2005లో సంక్లిష్ట అధ్యాత్మిక సత్యాలను అత్యంత సరళంగా వివరించిన భగవాన్ సత్యసాయిబాబా ఉపన్యాసాల ద్వారా వీరు స్వామివైపు ఆకర్షితులయ్యారు.
2007, లో తన తల్లి మరణించిన బాధను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బిజీ గా ఉన్న వీరు తన స్నేహితుడి యొక్క కొన్ని మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ (అనువాదపు) పనిలో స్నేహితుడికి సహాయం చేస్తూ పెద్ద తప్పు చేశారు. అతను స్వామికి చేసిన ప్రార్థనలకు ఫలితం అన్నట్లుగా అతని స్నేహితుడి సర్వర్ లో తప్పుగా అప్లోడ్ చేసిన ఫైల్ అదృశ్య మయ్యింది. వాస్తవానికి తన సొంత కంప్యూటర్లు అప్లోడ్ చేసినట్లు ప్రతిబింబించి నప్పటికీ ఆ ఫైలు రహస్యంగా అదృశ్యం అయినప్పుడు అతను స్వామి యొక్క ఒక గొప్ప అద్భుతానికి సాక్షీభూతులయ్యారు.
అనేక సంవత్సరాలుగా ప్రాక్టీషనర్ అనారోగ్యంతో ఉన్న రోగులను ఆస్పత్రి అపాయింట్మెంట్ కోసం తీసుకువెళ్లడం, రోగ నిర్ధారణ మరియు ల్యాబ్ నివేదికలను వారికి వివరించడం మరియు వారి వైద్య సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైన ప్రత్యామ్నాయాలను సూచించడం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు. 2016 లో సోల్జర్న్స్ వీడియోలను చూసిన తర్వాత సాయి వైబ్రియానిక్స్ అతని హృదయానికి తాకింది, ఎందుకంటే అప్పటికే వీరు అట్టి సేవలో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు అండగా ఉంటున్నారు. అతను ప్రాక్టీషనర్ కావడానికి పేరు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు వైబ్రియానిక్స్ సేవే తన ప్రాణాధారమని చెబుతున్నారు.
దీర్ఘకాలిక సమస్యల తాలూకు తీవ్రమైన పరిణామాలకు చికిత్స చేయడం ద్వారా ఈ ప్రాక్టీషనర్ అద్భుతమైన ఫలితాలను చూశారు. అలాంటి ఒక సందర్భంలో ఒక డయాబెటిక్ పేషెంట్ యొక్కప్రాధమిక బ్లడ్ గ్లూకోజ్ స్థాయి 300 కంటే అధికంగా ఉంది. 582 రీడింగ్ ఉన్నప్పుడు ఇతను ప్రాక్టీషనరును సంప్రదించారు ఆసుపత్రికి వెళ్లడానికి నిరాకరించడంతో ఆమెకు
CC6.3 Diabetes + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic… రెండు గంటల పాటు ప్రతీ పది నిమిషాలకు ఒక డోసు ఆపైన 6TD. గా రెమిడీ ఇచ్చారు. మొదటి రెండు గంటల్లో ఆమె గ్లూకోజ్ రీడింగ్ సంఖ్య 150 కి పడిపోయింది, కేవలం 10 గంటల్లో ఆమె బేస్ లైన్ స్థాయికి కి తిరిగి వచ్చింది. మరొక సందర్భంలో పదేళ్ల లుకేమియా రోగి యొక్క ప్లేట్లెట్ స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయాయి. అతనికి రక్తమార్పిడి మరియు అదే సమయంలో వైబ్రియానిక్స్ రెమిడీ: CC2.1 Cancers - all + CC2.2 Cancer pain + CC3.2 Bleeding disorders + CC15.1 Mental & Emotional tonic.కూడా ఇవ్వబడింది. రెండు రోజుల్లో బాలుడి ప్లేట్లెట్ కౌంట్ సాధారణ స్థితికి చేరుకుంది, అతనిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ప్రాక్టీషనర్ చికిత్స చేసిన కేన్సర్ రోగుల విషయంలో వైబ్రియానిక్స్ తీసుకున్న తర్వాత వారి కణుతుల విషయంలో చెప్పుకోదగ్గ తగ్గుదల కనిపించింది. ఇటీవల పెద్దప్రేగు క్యాన్సర్ మరియు మెటాస్టాసిస్ తో బాధపడుతున్న 53 ఏళ్ల మగ రోగికి ఖిమో ప్రారంభించే ముందు 2021 మే 14న ప్రాక్టీషనర్ ను సంప్రదించగా అతనికి CC2.1 Cancers - all + CC2.3 Tumours & Growths + CC4.2 Liver & Gallbladder tonic + CC4.4 Constipation + CC4.11 Liver & Spleen + CC15.1 Mental & Emotional tonic…6TD. ఇచ్చారు. రెండు రౌండ్లు ఖీమో తర్వాత రోగి ఎంతో ఉత్సాహంతో CEA(కణితి పెరుగుదల నిర్ధారణ సూచి) విలువలను చూసి వైద్యులు అయోమయంలో పడ్డారని అది నిజానికి 523 గా ఉందని నెలల వ్యవధిలో 28 పడిపోయిందని తెలిపారు. 2021 సెప్టెంబర్ లో అది 16కు పడిపోయింది. ఇది వైబ్రియానిక్స్ యొక్క అద్భుతమే అని రోగి ధృఢంగా తెలిపారు. ఈ పురోగతి ఇలాగే కొనసాగితే విస్తృతంగా వ్యాపించిన మెటాస్టాసిస్ ఇప్పుడు శస్త్రచికిత్స పరిధిలో ఉన్నందున ఇది డిసెక్షన్ చేయడానికి వీలు కల్పిస్తుందని వైద్యులు ధృవీకరించారు. మరొక కేసు సందర్భంలో 60 ఏళ్ల వ్యక్తి పాంక్రియాటిక్ క్యాన్సర్ కోసం ఒక సంవత్సర కాలం ఖీమో తీసుకున్న తర్వాత అతని రోగ లక్షణాల విషయంలో అభివృద్ధి పేలవంగా ఉందని అందువల్ల తదుపరి చికిత్స కొనసాగించడంలో ఉపయోగం లేదని చెప్పబడింది. అతనికి 2021 ఆగస్టు 5న క్రింది రెమిడీ ఇవ్వబడింది. CC2.1 Cancers - all + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC4.7 Gallstones. తదనంతరం రోగి మరొక క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ వారు చికిత్సా విధానాన్ని మార్చారు. ఖీమోను పునరుద్ధరించడానికి ముందు రక్త పరీక్షలో CEA విలువ ఆ సంవత్సరంలో మొదటి సారి 19-9, గా ఉంది. కణితి విషయంలో గణనీయమైన తగ్గుదల ఫలితంతో సంతోషించిన రోగి భార్య వైబ్రియానిక్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సందర్భాలు ఈ ప్రాక్టీషనరును మరింత వినయపూర్వకంగా, స్వామికి కృతజ్ఞతతో వారి యొక్క వినయ పూర్వకమైన సాధనంగా ఉన్న అనుభూతి చెందడానికి ఉపయోగపడ్డాయి.
అతను మెడికల్ క్యాంపులలో పాల్గొనడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రతీ నెల వృద్ధాశ్రమాలను సందర్శించి వైబ్రియానిక్స్ రెమిడీలు అందిస్తారు. చెన్నైలోని సుందరం మందిరంలో వారానికి ఒకసారి వైబ్రియనిక్స్ సేవ చేస్తున్నారు. 2021 కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజా రవాణా పని చేయని పరిస్థితిలో అతను సైకిల్ ద్వారా చెన్నైలోని కోవిడ్ రోగులకు ఇమ్యూనిటీ బూస్టర్ పంపిణీ చేయడంలో చురుకుగా పాల్గొన్నారు. వైబ్రియానిక్స్ పై ఆంగ్లంలో ఉన్న అనేక భాషణలను తమిళం లోనికి అనువదించారు, ప్రస్తుతం 108 సిసి మాన్యువల్ తమిళంలోకి అనువదించడం లో నిమగ్నమై ఉన్నారు. ఇతరులకు సహాయం చేయడానికి మరిన్ని అవకాశాల కోసం వీరు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు, వైబ్రియానిక్స్ కు అదనంగా వీరు పాస్ పోర్ట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ లు మొదలైన వాటి విషయంలో సహాయం అందించడానికి రోటరీ కన్జ్యూమర్ సెల్ తో స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉంటారు.
వైబ్రియానిక్స్ తనకు మరింత విశ్లేషణాత్మకంగా ఉండడాన్ని నేర్పిందని, తన శ్రవణ నైపుణ్యాలను పదును పెట్టిందని, మరింత అవధారణ నైపుణ్యాలను పెంచిందని, అన్నిటికంటే మించి వినయాన్ని నేర్పిందని ప్రాక్టీషనర్ పేర్కొంటున్నారు. తను మాన్యువల్ లో కనుగొన్న వాటికి అతీతంగా రెమిడీలను సూచిస్తూ స్వామి తనను ప్రోత్సహిస్తున్నట్లు వీరు తరచుగా అనుభూతి చెందుతున్నారు. అలాంటి సంఘటనలు వీరి విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి. రోగి చెప్పే విషయాలు భౌతికంగా వింటూ చెప్పని విషయాలు హృదయం ద్వారా అనుభూతి చెందినప్పుడే రోగికి సంపూర్ణ చికిత్స జరుగుతుందని వీరు నమ్ముతారు. తోటి ప్రాక్టీషనర్లకు వీరు స్వామి భోధన “మీరు అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని నిరుత్సాహానికి గురైన వ్యాధిగ్రస్తుని చూసినప్పుడు అదే మీసేవా క్షేత్రం” అనుసరించి జీవించమని సలహా ఇస్తున్నారు.
పంచుకున్న కేసులు
ప్రాక్టీషనర్ల వివరాలు 03518...India
ప్రాక్టీ షనర్ 03518…ఇండియా ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన వీరు 2020 లో రిటైర్మెంట్ తర్వాత స్వామి పై మరింత దృష్టి కేంద్రీకరించి సేవ చేసేందుకు కెనడా నుండి పుట్టపర్తికి మకాం మార్చారు. అప్పటి నుండి ఆమె అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనసాగారు,
వాటిలో ఒకటి ప్లాస్టిక్ వల్ల పర్యావరణ మరియు ఆరోగ్య ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి మరియు దాని గురించి స్థానిక నివాసితులకు అవగాహన కల్పించడానికి స్వచ్ఛ పర్తి ప్రాజెక్టులో చురుకుగా పనిచేస్తున్నారు. ఆమె మొదటిసారిగా 1986 సత్య సాయి బాబా వారికి పరిచయం కాబడి విభిన్న మత విశ్వాసాల ఐక్యతపై వారి బోధనలకు ఆకర్షితులయ్యారు. ఆమె స్థానిక వారాంతపు భజనలకు హాజరు కావడం ప్రారంభించడంతో పాటు తన కుమార్తెను బాలవికాస్(సత్యసాయి విద్యా విధానం) తరగతిలో చేర్పించారు. ఆమె స్థానిక సాయి సెంటర్ మరియు కెనడియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సత్య సాయి ఎడ్యుకేషన్ లో వివిధ నాయకత్వ పోస్టులలో పని చేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఆమె తన స్నేహితులు మరియు సహ ఉద్యోగులకు ఉచితముగా వ్యాధి నివారణ మరియు ఆరోగ్య సలహాలను అందించారు. ఒత్తిడి మరియు ఆందోళనకు లోనుకాకుండా వ్యవహరించడంలో సహాయపడటానికి ఆమె స్థానిక పాఠశాలలో పదేళ్ల పాటు విద్యార్థులకు జ్యోతి ధ్యానం నేర్పించారు. కార్పొరేట్ వెల్నెస్ ఆఫరింగ్ లో భాగంగా ఆమె తన కార్యాలయంలో ఆధ్యాత్మిక వెల్ నెస్ వీడియోల శ్రేణిని రూపొందించారు, మరియు ముందస్తు వ్యాధి నివారణ, ఆరోగ్య వెబ్సైట్ ను కూడా నిర్వహిస్తున్నారు.
వీరు మొదటిసారిగా 2003లో సాయి వైబ్రియానిక్స్ గురించి విన్నారు, కానీ ఆమె విశ్లేషణాత్మక మనసు ఆ సమయంలో దానిని సఅంగీకరించడానికి సిద్ధంగా లేదు. 2014 లో ఆమె స్నేహితుల బృందం తన ఇంటిలో భగవద్గీత మొత్తాన్ని ఫఠించినప్పుడు ఆ ప్రకంపనల శక్తిని ఆమె స్వయంగా చూసారు. స్వామికి సమర్పించిన గులాబీలు సాధారణంగా ఐదు రోజుల్లో వాడిపోతాయి కానీ ఈ ప్రకంపనల శక్తి వలన అవి రెండు వారాల పాటు తాజాగా ఉన్నాయి. కొన్ని నెలల తర్వాత ఆమె డాక్టర్ మరియు శ్రీమతి అగర్వాల్ యొక్కసౌల్జర్న్స్ వీడియో లను చూశారు. వైబ్రియానిక్స్ ను భవిష్యత్తు ఔషధంగా స్వామి చెప్పిన మాటలు మరియు ముందస్తు నివారణ, ఆరోగ్యం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతిలో తన సొంత నమ్మకాలకు అనుగుణంగా వైబ్రియానిక్స్ ఉండడంతో ఆమె వెంటనే AVP కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2015 మార్చిలో అర్హత సాధించి 2020 మధ్యకాలం వరకు కెనడాలో 90 మంది రోగులకు చికిత్స అందించారు. 2020 ఆగష్టు లో VP అయ్యి కోవిడ్ పరిమితులు ఉన్నప్పటికీ సెప్టెంబర్ 2020లో పుట్టపర్తికి కి వెళ్ళిన తర్వాత మరో 85 మంది రోగులకు చికిత్స అందించారు.
2021 జూలై లో వీరికి ట్రైనింగ్ కోఆర్డినేటర్ పాత్ర కేటాయించినప్పటినుండి వైబ్రియానిక్స్ అడ్మిన్ టీంలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. AVP మరియు SVP హోదాలకు సంబంధించి ప్రవేశ ప్రక్రియ నుండి అధికారికమైన గుర్తింపు వరకు SOP(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదా ప్రమాణీకృత నిర్వహణ విధానము) రూపొందించడంలో ఆమె గ్లోబల్ ట్రైనింగ్ హెడ్ కి సహాయం చేస్తున్నారు. వైబ్రియానిక్స్ సేవ కోసం ఎంతో నిబద్ధతతో ఏది కావాలంటే అది చేయాలనే సంకల్పంతో ఆమె వైబ్రియానిక్స్ కు సంబంధించిన భాషణలను అనువదించడం, వార్తాలేఖలను ప్రచురణ కోసం ఫార్మాట్ చేయడం మరియు స్వామి ఆశీర్వాదం పొందిన 108CC మాస్టర్ బాక్స్ నిర్వహణకు సంబంధించిన పనులను సమన్వయం చేయడం మరియు ఆక్టివ్ గా సేవ చేస్తున్న ప్రాక్టీషనర్ల 108CC బాక్సులను రీఛార్జి చేయడంలో కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం SVP కావడానికి శిక్షణ కూడా తీసుకుంటున్నారు.
ప్రాక్టీషనర్ యొక్క ప్రారంభ కేసుల్లో ఒకటి తీవ్రమైన శారీరక నొప్పి కారణంగా ఒక ఏడాది కాలంగా డ్రైవింగ్ చేయడంకష్టంగా మారిన స్త్రీకి CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC20.5 Spine + CC20.6 Osteoporosis + CC20.7 Fractures ఇవ్వబడింది. నాలుగు నెలల్లో ఆమె అద్భుతంగా కోలుకొని నొప్పి నుండి పూర్తిగా విముక్తి పొందారు. ప్రస్తుతం ఈ ప్రాక్టీషనర్ CC20.4 Muscles & Supportive tissue ను ఏదైనా SMJ కోంబోకు జోడించి నప్పుడు త్వరగా నొప్పి నివారణ అందించడంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని కనుగొన్నారు. ఒకసారి ఈ ప్రాక్టీషనర్ కు స్వయంగా తీవ్రమైన లారింగైటీస్ ఇబ్బంది ఏర్పడి, ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. CC19.7 Throat chronic…6TD, గా తీసుకున్న తర్వాత మరుసటి రోజు షెడ్యూల్ చేసిన ప్రసంగాన్ని అద్భుతంగా అందించగలిగారు.
ఒక యువతి గర్భం దాల్చి బిడ్డను కనాలని అనేక ప్రయత్నాలు చేసి చివరికి IVF పద్దతి ద్వారా గర్భం దాల్చింది కానీ గర్భధారణ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. మూడు నెలల తరువాత ఆమె ఫోటోఫోబియా మరియు గర్భధారణ మధుమేహం వంటి సమస్యలను అంతేకాక తన చిన్ననాటి ఆస్తమా సమస్య కూడా తిరిగి వచ్చింది. ఆమెకు IB తో పాటు CC8.2 Pregnancy tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic, ఇవ్వడంతోపాటు పై సమస్యలు ఏర్పడినప్పుడు CC7.1 Eye tonic మరియు CC19.6 Cough chronic తో చికిత్స చేశారు. ఆమెకు అన్ని సమస్యలు మాయం అవడమే కాకుండా గర్భధారణ సురక్షితంగా కొనసాగి 2020 ఆగస్టులో ఆరోగ్యకరమైన ఆడ శిశువును ప్రసవించారు. వీటన్నింటినీ రోగి వ్వైబ్రియానిక్స్ యొక్క అద్భుతానికి ఆపాదించారు.
బాహ్య ప్రతికూల శక్తుల పట్ల చాలా సున్నితంగా ఉండటం వల్ల ఈ ప్రాక్టీషనర్ అనవసరమైన సామాజిక పరస్పర చర్యలను పరిమితం చేయడానికి కష్టపడి పనిచేస్తారు తద్వారా తన వైబ్రియానిక్స్ సాధన ప్రభావితంకాకుండా ఉంటూ రోగులకు ప్రభావవంతంగా చికిత్స చేయడానికి తాను స్వామి వారి ప్రేమ ప్రవాహానికి సరైన వాహకంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. తన వ్యక్తి గత అనుభవాల ద్వారా ఆమె ప్రతి ఒక్కరితో వైబ్రియానిక్స్ యొక్క సమర్ధత గురించి బోధిస్తూ ఉంటారు, కానీ చాలా మంది రోగులు ఇతర అన్ని చికిత్సలు ప్రయత్నించి చివరి ప్రయత్నంగా వైబ్రియానిక్స్ రెమిడీలు తీసుకుంటున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు.
వైబ్రియానిక్స్ సాధన ఆమెకు మరింత ప్రేమగా ఉండడం, మరియు తీర్పుచెప్పడం, స్వయం విశ్లేషణ లేకుండా భగవదాదేశమును స్వీకరించడాన్ని నేర్పించింది. ఈ సాధనలో కనుచూపుమేరలో రోగికి నయం అవుతున్న జాడ కనబడక పోయినా ఆశని మాత్రం కోల్పోవద్దని ఆమె తోటి ప్రాక్టీషనర్లకు సలహా ఇస్తున్నారు. ప్రతీ రోగి ప్రాక్టీషనరుకు సూక్ష్మమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తారని ఇది క్రమంగా తనలో పరివర్తనను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. .
పంచుకున్న కేసులు
ప్రశ్న జవాబులు
Q1. వార్తాలేఖలు చదువుతున్నప్పుడు నేను వైబ్రియానిక్స్ యొక్క కొన్ని అద్భుతమైన కేసులను కనుగొన్నాను. ఇంత అద్భుతమైన ఫలితాలను పొందడానికి అక్కడ ఏదైనా కళ ఉందా అని నేను ఆశ్చర్యపోయాను ?
A. విజయవంతమైన వైద్యానికి అనేక అంశాలు ఉన్నాయి. అన్నిటిలో మొదటిది సరైన కంపనాలను (వ్యాధి యొక్క ఫ్రీక్వెన్సీ సరిపోయేది) పంపిణీ చేయడం చాలా ముఖ్యం. సూచించిన మోతాదు మరియు జాగ్రత్తలకు కట్టుబడి ఉండాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సానుకూల శక్తిని సృష్టించే మరియు వైద్య ప్రక్రియను వేగిర పరిచే ఇతర నిర్ణయాత్మక అంశాలు ప్రాక్టీషనరు యొక్క పవిత్రత, సంప్రదింపుల సమయంలో దైవంతో ప్రాక్టీషనరు ఏర్పరుచుకొనే సంబంధం, రోగి యొక్క పరిస్థితి పట్ల ప్రాక్టీషనరు చూపే సానుభూతి, తోటి మానవుల పట్ల వారికి గల ప్రేమ. ఈ చికిత్స ద్వారా రోగి ఆత్మవిశ్వాసంతో తాను త్వరగా కోలుకోవాలని ఆశించి నప్పుడు వైద్య ప్రక్రియ వేగవంతం అవుతుంది. వైబ్రియానిక్స్ పట్ల రోగికి గల విశ్వాసం ప్రాక్టీషనరు పట్ల అతని నమ్మకం, మరియు అతని మనో స్వచ్ఛత కూడా సానుకూల ఫలితాలను తీసుకురావడానికి దోహదపడే అంశాలు.
_________________________________________________________________________________
Q2. ఒక రెమిడీ ఏలోహంతోను సంబంధం కలిగి ఉండకూడదని నేను అర్థం చేసుకున్నాను( ఒక వార్త లేఖలో పేర్కొన్న విధంగా స్వచ్ఛమైన వెండి లేదా రాగి కి మినహాయింపు ఇవ్వబడింది). ఐతే రెమిడీ వాటర్ ని స్ప్రే చెయ్యడానికి ఉపయోగించే బాటిల్ లో లోహపు స్ప్రింగు ఉంటుందని ఇది రెమిడీ పై ప్రభావం చూపుతుందని నేను గమనించాను. ఇది రెమిడీ ప్రభావాన్ని తగ్గిస్తుందా లేదా మొక్కలకు ప్రాణం ఉంటుంది కానీ మనుషులకు ఉన్నట్లు మనసు లేనందున ఇది ఉపయోగించ దగినదేనా?
A. అటువంటి బాటిల్ ను ఉపయోగించి స్ప్రే చేసిన రెమిడి ప్రతీసారి ప్రభావవంతంగా ఉంటుందని మేము అనుభవం నుండి కనుగొన్నాము. స్ప్రే చేయబడే రెమిడీ చాలా తక్కువ సమయం పాటు లోహంతో స్పర్శకు వస్తుంది కాబట్టి అది తటస్థీకరణ చేయబడే అవకాశం లేదు.
_________________________________________________________________________________
Q3. ఒక రెమిడీ పోస్ట్ లో పంపేటప్పుడు ఆ బాటిల్ ను అల్యూమినియం ఫోయిల్ లో పెట్టడం మంచిదేనా?
A. గత కొన్ని సంవత్సరాలుగా శక్తివంతమైన రేడియేషన్ ను విడుదల చేసే మొబైల్ టవర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీని దృష్ట్యా ఇటువంటి ప్రశ్నకు సంచిక 9 సంపుటి 6 లో ఇవ్వబడిన సమాధానం సవరించాల్సిన అవసరం ఉంది. రవాణా చేసే సమయంలో రేడియేషనుకు గురి అయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి కొత్తది మరియు మందముగా ఉన్న అల్యూమినియం ఫోయిల్ తో జాగ్రత్తగా చుట్టడం మంచిది. అల్యూమినియం ఫోయిల్ పైకి బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ సాధారణ దృష్టికి కనిపించని సూక్ష్మ రంధ్రాలు ఉంది రేడియేషన్ కు గురిచేయవచ్చు. కాబట్టి వాడిన దానిని మళ్ళీ ఉపయోగించవద్దు. రేడియేషన్ చూపే వస్తువుల నుండి కనీసం 30 సెంటీమీటర్ల దూరంగా రెమిడీలను ఉంచడం ఉత్తమం.
_________________________________________________________________________________
Q4. మేము సాధారణంగా 5ml ప్లాస్టిక్ సీసాల్లో రెమిడీలను పంపిణీ చేస్తాము. చాలామంది రోగులు దూర ప్రాంతాలలో నివసిస్తున్నారు కాబట్టి నేను రెమిడీలను పెద్ద బాటిల్ లో పంపించ వచ్చా?
A. మీరు పెద్ద బాటిల్ లో రెమిడీ పంపడం వలన ఎక్కువ మొత్తంలో సప్లై ఉంటుంది కనుక రోగికి అనుకూలంగా ఉంటుంది కనుక పెద్ద బాటిల్ రెమిడీ పంపాలని అనుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. కానీ రెండు 5 ml బాటిళ్ళు పంపడం ద్వారా కూడా అదే ప్రయోజనం సాధించవచ్చు. కారణం ఏమిటంటే ఒకవేళ ఉపయోగంలో ఉన్న బాటిల్ రేడియేషన్ కి గురి అయ్యే పరిస్థితి ఉంటే మరొక బాటిల్ కు ఈ ప్రమాదం ఉండదు. ఒకవేళ రోగికి ఇలా హ్యాండిల్ చేయడం కష్టంగా అనిపిస్తే ఉదాహరణ: వృద్ధులకు, మీరు వారికి పెద్ద బాటిల్ పంపించవచ్చు.
_________________________________________________________________________________
Q5. వైబ్రియానిక్స్ పోటెన్సీ లు హోమియోపతి పొటెన్సీ తో భిన్నంగా ఉంటాయా?
A. వైబ్రియానిక్స్ పొటెన్సీలు హోమియోపతి పోటెన్సీలపై ఆధారపడి ఉంటాయి కనుక ఒకే విధంగా ఉంటాయి ఒకే విధంగా పనిచేస్తాయి కానీ రెమిడీలు భిన్నంగా తయారు చేయబడతాయి. హోమియోపతి సాంప్రదాయకంగా మదర్ టింక్చర్ లేదా మాతృ పదార్థం నుండి డైల్యూషన్ మరియు సక్షెషన్ పద్దతిలో తయారు అవుతాయి. అందువల్ల 12C కంటే తక్కువ పోటెన్సీ గల పదార్ధాలలో అసలు పదార్థం యొక్క అణుమాత్రపు అంశాలు ఉండే అవకాశం ఉంది. మరోవైపు వైబ్రియానిక్స్ రెమిడీలు సూక్ష్మ ప్రకంపనలు స్వస్థ పరిచే పదార్ధం లేదా ఒక మీడియం లోకి పోటెన్టైజర్ మిషను ద్వారా తయారు చేయబడతాయి. అందుచేత ఇందులో ఎలాంటి భౌతిక పదార్ధములు ఉండవు.
దివ్య వైద్యుని దివ్య వాణి
ఆరోగ్యం మందులపై ఆధారపడి ఉండదు- మంచి మాటలు, మంచి నడవడిక, మంచి చూపు, మంచి ఆలోచనలు ఇవి చాలా అవసరం. చెడు ఆలోచనలు మరియు చెడు భావాలతో అనారోగ్యంగా ఉన్న్ వారికి శక్తివంతమైన లేదా ఖరీదైన మందులు అయినప్పటికీ కూడా ఏమి ప్రయోజనం చేకూర్చగలవు? మరోవైపు ధర్మబద్ధమైన జీవనం, ప్రయోజనకరమైన ఆలోచనలు, ఉన్నతమైన ఆదర్శాలు మరియు నీతివంతమైన ప్రవర్తన ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అత్యంత విలువైన ఆత్మానందమును అనగా జీవిత పరమార్ధము యొక్క వాస్తవికత యొక్క నిజమైన అవగాహన అందిస్తుంది.
…సత్యసాయి బాబా, “ బోషణంలో నగ ”, దివ్య వాణి, 1982 నవంబర్ 20 https://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-54.pdf
ప్రశాంతినిలయంలో జీవనం గడపడం సేవా మార్గంలో విశ్వాసాన్ని పెంపొందించి జీవన సాఫల్యం కలిగించేలా చెయ్యాలి. సేవ యొక్క నిర్దిష్ట అంశం చిన్నది కావచ్చు, లక్షలాది మంది ప్రయోజనం పొందే కార్యక్రమంలో మీకు అవకాశం లభించక పోవచ్చు. మీరు గొర్రె పిల్లను పైకి లేవనెత్తి గట్టును దాటించడం, లేదా పిల్లవాడిని రద్దీగా ఉండే రోడ్డు దాటించడం, ఇవి కూడా భగవంతునికి సమర్పించే సేవా పుష్పాలే.
...సత్యసాయి బాబా “ పాదాల చెంత సేవా పుష్పం ” దివ్యా వాణి 1970 మార్చి 4 https://www.sssbpt.info/ssspeaks/volume10/sss10-06.pdf
ప్రకటనలు
భవిష్యత్తులో నిర్వహింప బోయే వర్క్ షాపులు *
- యు ఎస్ ఎ : విర్చ్యువల్ AVP వర్క్ షాప్ 2022 ప్రకటన చేయవలసి ఉంది,సంప్రదించ వలసిన వారు సుషన్ వెబ్సైట్ [email protected]
- ఇండియా పుట్టపర్తి : కొనసాగుతున్న AP వర్క్ షాప్ తెలుగు 2021 డిసెంబర్ 30, సంప్రదించ వలసినవారు [email protected] లేదా ఫోన్ నంబరు 8329-848 898
- ఇండియా పుట్టపర్తి : SVP వర్క్ షాప్ 2022 మార్చ్ 3-7 ** సంప్రదించవలసిన వారు వెబ్సైట్ [email protected]
* AP, AVP, మరియు SVP వర్క్ షాపులు ప్రవేశ ప్రక్రియ మరియు e కోర్సు పూర్తి చేసిన వారీకి మాత్రమే. రిఫ్రెషర్ సెమీనార్లుప్రస్తుతం ఉన్న ప్రాక్టీషనర్లకు ఉంటాయి.
**మార్పులు ఉండవచ్చు
అదనంగా
1. ఆరోగ్య చిట్కాలు
ఆహారంలో పప్పుల వినియోగంతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి
నాలుక యొక్క కోరికలను తీర్చడం మరియు భారీ ఆహారాన్ని రోజుకి మూడు నాలుగు సార్లు తీసుకోవడం ఒళ్ళు పెంచడానికి మాత్రమే. క్రమబద్ధమైన మరియు పరిమితమైన ఆహారం తీసుకోవడం వల్ల వల్ల మాత్రమే ఒక వ్యక్తి తన విధులను నిర్వర్తించగలడు.. సత్య సాయి బాబా1
1. పప్పులు అంటే ఏమిటి
పప్పులు కాయగూరల పంటల వలె కాకుండా బహుళ దళములు కలిగిన కాయలుగా పండించే పప్పుధాన్యాలు ప్రత్యేకించి
ఎండు ధాన్యాల జాతికి చెందినవి. వాటిలో వివిధ రకాల కాయధాన్యాలు, బఠాణీలు మరియు ఎండిన బీన్స్ ఉన్నాయి. ఇతర పంటల కంటే ఇవి తక్కువ నీటిని ఉపయోగించు కుంటాయి. గ్రీన్హౌస్ వాయువులను తగ్గించడంలో మరియు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి. 2-3
2. పప్పుధాన్యాల ప్రయోజనాలు వినియోగం మరియు నిల్వ
ప్రయోజనాలు : పప్పులు కణజాల పనితీరు మరియు కండరాల పెరుగుదలకు అవసరమైన తక్కువ కొవ్వు మూలము మొక్కల ఆధారిత ప్రోటీన్లు కలిగినవి. గోధుమలు మరియు క్వినోవా కంటే రెండింతలు మరియు బియ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రోటీన్ పదార్ధము కలిగినవి. ఒకసారి తినే పదార్ధంలో లేదా అరకప్పు ఉడకబెట్టిన పప్పులలో సుమారు తొమ్మిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాక అవి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ (బియ్యంలో ఉండే గ్లైసిమిక్ పదార్ధములో 1/3 వ వంతు మాత్రమే) కలిగి ఉంటాయి, మరియు అధిక మొత్తంలో ఫైబర్ (బ్రౌన్ రైస్ కంటే నాలుగు రెట్లు) అధిక మొత్తంలో ఆంటీ ఆక్సిడెంట్లు, పోలిట్, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, విటమిన్లు, మరియు ఖనిజలవణాలు సమృద్ధిగా ఉంటాయి. అవి గుండె జబ్బులు మరియు టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి, ఆరోగ్యం మరియు దృష్టి మెరుగుపరుస్తాయి, బరువును నియంత్రిస్తాయి, ఎముకలను బలోపేతం చేస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి, మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఏదైనా శాఖాహార ఆహారంలో పప్పుదినుసులు ముఖ్యమైన భాగంగా ఉండాలి3-8.
ఉపయోగించడం; ఎండిన బఠాణీలు మరియు బీన్స్ విషయంలో వాటిని రాత్రంతా నానబెట్టండి. ఈ ప్రక్రియలో పప్పులు తిరిగి జీవం పొందుతాయి, వాటి ఎంజైములు సక్రియం చేయబడతాయి. మరియు మెరుగైన జీర్ణక్రియ మరియు పోషకాలను గ్రహించడంలో సహాయపడటానికి యాంటీ న్యూట్రింట్లు విచ్ఛిన్నమవుతాయి. వాటి జీవలభ్యతను పెంచడానికి వాటిని మొలకెత్తింప చేయవచ్చు. (మొలకల పై కథనం కోసం సంచిక 9 సంపుటి 5 చూడండి. కాయధాన్యాలు, బఠానీలు, బీన్స్ మరియు కొన్ని మసాలా దినుసులు ఉండినప్పుడు అట్టి భోజనాన్ని భారతీయులు బాగా ఇష్టపడతారు. తీపి మరియు ఉప్పగా ఉండే వంటకాలు కూడా పప్పు మరియు చిక్ప పిండితో తయారుచేస్తారు.3,4,8,9
జాగ్రత్తలు; ఆహారంలో అధిక మొత్తంలో ప్రోటీన్ గుండె, మూత్రపిండాలు, మరియు కాలేయాన్ని ప్రభావితం చేసే కణాల విస్తరణకు మూలమై క్యాన్సర్ కు దారితీయవచ్చు. 10,11
నిల్వ: పప్పు ధాన్యాలు ఎక్కువ కాలం నిలవ ఉండటానికి పొడిగా, బిగుతుగా, వేడి, కాంతి మరియు తేమ నుండి దూరంగా, బిగుతుగా ఉండే కంటెయినర్లలో ఉంచాలి. పురుగులు, కీటకాల ఇబ్బందులనుండి ముఖ్యంగా వర్షాకాలంలో వీటి నివారణకు వాటిలో కొన్ని నల్లమిరియాలు, ఎర్ర మిరపకాయలు, లవంగాలు, బే ఆకులను ఉపయోగించవచ్చు. సేంద్రియ పప్పుధాన్యాలు వీటిని సులభంగా ఆకర్షిస్తాయి12,13 (ఆరోగ్య చిట్కాలు కథనం క్రింది ధాన్యాల నిల్వ కోసం సంచిక 12 సంపుటి 5 చూడండి.)
3. పప్పు ధాన్యాలు/ పప్పులలో రకాలు:
ఇవి పూర్తి గింజగా అందుబాటులో ఉంటాయి,రెండు బద్దలు పలుచని పొరతో కలపబడి పొరను తొలగించినప్పుడు బద్దలుగా విడిపోతాయి. ఇవి బీన్స్ కంటే తక్కువ యాంటీ న్యూట్రియంట్స్, ఫోలెట్లను కలిగి రంగు మరియు ఆకృతిలో విభిన్నంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆల్కలైజ్ చేయడానికి మరియు పిహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ఫోలేట్, మాంగనీస్, ఐరన్, మరియు ఫాస్పరస్ అధికంగా ఉండడం వలన ఒక కప్పు వండిన పప్పు రోజువారి అవసరాల్లో 90% ఫోలెట్ అవసరాన్ని 37% ఐరన్ అవసరాన్ని తీర్చగలదు. 6,14,15
3.1 ఊలవలు లేదా హార్స్ గ్రామ్ (కుల్తి): అద్భుతమైన పప్పుగా పిలవబడే దీనిని సాధారణంగా రేసుగుర్రాలకు తినిపిస్తారు. ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది, మరియు సాధారణ జలుబు, గొంతు ఇన్ఫెక్షన్, జ్వరం, ఉబ్బసం, బ్రాంకైటిస్, గుండెజబ్బులు, కామెర్లు, సక్రమంగా లేని ఋతు చక్రాలు, మూత్రంలో రాళ్ళు, మరియు ల్యూకోడెర్మ వంటి అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పోషకాహార లోపాన్ని నివారించడానికి దీనిని ఉపయోగిస్తారు. అత్యధిక కాల్షియం ధాతువు కలిగి ఉండటం వల్ల ఇది ఎముకలకు అద్భుతమైనది. దీనియొక్క సూప్ శీతాకాలపు రోజులలో శరీరాన్ని వెచ్చదనంగా ఉంచడానికి అనువైనది. అలాగే మొలకెత్తిన శనగలు, లేదా బూడిద గుమ్మడికాయ, పొట్ల కాయ రసం తీసుకోవడం ద్వారా శరీరంలో దీని ద్వారా ఉత్పత్తి చేయబడిన అదనపు వేడిని సమతుల్యం చేయవచ్చు. 16,17
3.2 ధాన్యాలు(మసూర్): మట్టి వాసన కలిగి గోధుమరంగు కలిగిన ఈ ధాన్యాలు సూపులు మరియు ఉడక బెట్టిన వాటి కొరకు అనువైనవి. వండిన తర్వాత మెత్తగా ఉంటాయి. అతిగా ఉడకబెట్టినప్పుడు గుజ్జుగా మారిపోతాయి. మొలకెత్తిన తర్వాత ఆకుపచ్చ రంగు కలిగి, పెప్పి యర్, క్రంచి, నట్టియర్, వంటి సువాసనతో సలాడ్ కు అనువైనవి. తేలికపాటి ఎరుపు రంగు కలిగిన ధాన్యాలు అత్యంత సాధారణమైనవి. వీటి యొక్క పేస్టును పూస్తే గాయాలు త్వరగా మానిపోతాయి. 14,15,18
3.3 పెసలు / గ్రీన్ గ్రామ్ : పూర్తి గింజలుగా ఉన్నవి మొలకెత్తించి పచ్చిగానూ, ఆవిరిలో ఉడికించిన లేదా వండిన వాటిని తినడానికి అనువైనవి. పై పొర లేకుండా ఉన్న పెసరపప్పు పసుపు రంగులో ఉంటుంది, ఇది దక్షిణ ఆసియా వంటకాల్లో ప్రసిద్ధి చెందిన కిచిడీ అనే వంటకంలో బియ్యంతో కలిపి ఉపయోగించబడే ఈ వంటకం పిల్లలకు, వృద్ధులకు మరియు కోలుకుంటూ ఉన్న రోగులకు మంచిది. మాత్ బీన్స్(మట్కి): అనే చిన్న దీర్ఘచతురస్రాకార గోధుమ ధాన్యాలు రూపము, ప్రయోజనాలు మరియు వినియోగంలో పెసర్ల మాదిరిగానే ఉంటాయి.19,20
3.4 పీజియన్ పీస్ (పావురం బఠానీలు) (తూర్/అర్హర్): ఇది పసుపు రంగులో ఉంటుంది, ఇది భారతదేశంలో కూరగాయలు మరియు చింతపండు సారంతో సాంబార్ అనే వంటకాన్ని తయారు చేయడానికి కి విస్తృతంగా ఉపయోగించబడుతుంది, భోజన సమయంలో అన్నంతో లేదా రుచికరమైన క్రిప్స్ తో కలిపి తింటారు. అధిక పోషక విలువలు గల ఈ పప్పు రోజువారీ తీసుకునే ఇనుము మరియు కాల్షియం యొక్క అవసరాన్ని తీర్చగలదు. పిండం పెరుగుదలకు మరియు నవజాత శిశువు యొక్క పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్ యొక్క అద్భుతమైన మూలంగా కూడా ఇది పరిగణింపబడుతుంది. ఈ పప్పు యొక్క పేస్టు బట్టతల నివారణకు, వాపుల నివారణకు, అలాగే ఈ ధాన్యం యొక్క ఆకులు గాయాలు నివారించడానికి ఉపయోగపడతాయి. 21,22
3.5 మినుములు (ఉరద్): భారతదేశంలో ఇడ్లీ దోశ వడ కచోరి వంటి వివిధ ప్రసిద్ధ స్నాక్స్ తయారు చేయడానికి మరియు కొన్ని రుచికరమైన వంటకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కొన్ని మసాలా దినుసులతో కలిపి మినపగుండ్లతో వండిన మాకి దాల్ అని పిలువబడే ఈ వంటకం చాలా పోషక కారకమైనదిగా పరిగణిస్తారు. దీనిలో లభించే పోషకాలతో పాటు అదనంగా ఎముకలు మరియు దంతాలకు అవసరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లం మరియు ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. పురుషులు మరియు స్త్రీలకు ముఖ్యంగా పునరుత్పత్తి వయసులో ఒక సంపూర్ణ ఆరోగ్య ప్యాకేజీ గా పరిగణింపబడే ఇది ఫైల్స్ మరియు కొలిక్ డిజార్డర్ ను నివారిస్తుంది, కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది మరియు ధమనులలో పోషకాహారలోపం మరియు ఫలకం ఏర్పడకుండా చేస్తుంది.23-25
బాహ్య అనువర్తనం: బాగా నానబెట్టిన మినుముల నుండి తయారుచేసిన పేస్టు చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో, మొటిమలు, చర్మం రంగు మారడం, మరియు చర్మంపై మచ్చల చికిత్సలో ఉపయోగపడుతుంది. ఉడకబెట్టి మెత్తగా చేసి కొబ్బరినూనెతో కలిపి తలకు రాసినట్లైతే జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, చుండ్రు పోవడానికి మరియు జుట్టు పెరుగుదలకు ఉపయోగ పడుతుంది. అదేవిధంగా దీనినే ఒక గుడ్డలో కట్టి నువ్వులనూనెతో కలిపి ప్రభావిత భాగాలపై పట్టి వేసి నట్లైతే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. 23,25
హెచ్చరిక: ఇది ఒక భేదిమందుగా, మూత్రవిసర్జన కారిణిగా, ప్రక్షాళన కారిణిగా ఉపయోగపడుతున్నప్పటికీ ఎక్కువగా తీసుకోవడం యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది మూత్రపిండాల్లో రాళ్ళు పిత్తాశయ రాళ్ళు మరియు గౌట్ ఉన్న వారు జాగ్రత్త వహించాలి. 23
4. పోషక కరమైన బఠానీలు మరియు బీన్స్
4.1 శనగలు / గార్బాంజో బీన్స్(కాబూలి చనా)& బెంగాల్ గ్రామ్ (కాలా చనా): వీటి యొక్క వంట సమయాన్ని తగ్గించడానికి మరియు జీర్ణమయ్యేలా చేయడానికి కనీసం 12 నుండి 24 గంటల పాటు నానబెట్టాలి. అవి రక్తహీనతను నివారిస్తాయి శక్తి స్థాయిని పెంచుతాయి, ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు ఆరోగ్యకరం.
శెనగపప్పు ఇలాంటి ప్రయోజనాలే కలిగి ఉంటుంది దీనిని వండడం సులభం.19,26-28
ఇతర ప్రయోజనాలు: శనగ పిండి నుండి తయారుచేసిన ఫేస్ ప్యాక్ లు చర్మంపై పూడుకు పోయిన స్వేద రంధ్రాలను శుభ్రం చేయడానికి మరియు మృదువైన చర్మాన్ని అందించడానికి పరీక్షించి రుజువు పరిచిన వంటకం. ఆడించిన లేదా వండిన శనగ నూనె చక్కని బైండర్ గామరియు వంటకాలలో గుడ్డు స్థానమును భర్తీ చేసేలాగా పనిచేస్తుంది. వేయించి పిండి పట్టిన శనగపిండి కాఫీకి కెఫీన్ లేని ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. 26-28
4.2 చిక్కుడు కాయలు(రాజ్మా) : పోషకాలు అధికంగా ఉండే కిడ్నీ ఆకారపు చిక్కుళ్ళు సాధారణంగా దొరికే ఎర్రని చిక్కుళ్ళు బియ్యం లేదా మొక్కజొన్నతో కలిపి తింటారు. ఆరోగ్య వర్ధకాలు ఐన ఈ చిక్కుళ్ళు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ విషయంలో మినుముల తర్వాతి స్థానంలో ఉన్నాయి. 24. వీటిని 12 నుంచి 24 గంటలు నానబెట్టి ద్రవాన్ని వంపివేసి చిక్కుళ్లను అనేకసార్లు కడిగి లేతగా ఉడికించాలి’ ఇలా చేయడం వలన పచ్చివానిలో సహజంగా కనిపించే కాలేయానికి హాని కలిగించే టాక్సిన్లు తొలగించబడతాయి లేదా క్రియారహితం చేయబడతాయి. చిక్కుళ్లలో వైట్ బీన్స్, బ్లాక్ బీన్స్, బార్లొట్టి బీన్స్, నావి బీన్స్( బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి ఉత్తమమైనది) పింటో బీన్స్, అడ్డుకి బీన్స్, బట్టర్/లిమా బీన్సు, హారికోట్స్, కన్నెలిని బీన్స్, ఫ్లాగోలెట్ బీన్స్, ఫావా/బ్రాడ్ బీన్స్, ( తల్లి కాగోరే వారికి మంచిది, మరియు పార్కిన్సన్ వ్యాధి నివారణ, మరియు కండర పనితీరు మెరుగుదలకు ఉపయోగపడుతుంది) మరియు ఆల్ఫాఆల్ఫా దీని మొలకలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 3,6,29,30
4.3 సోయాబీన్స్ : ఇది చాలా చర్చనీయాంశమైన అధిక ప్రోటీన్ గల ఆహారము. సేంద్రియ సోయాబీన్ గానీ, GMO లేనిది మరియు కనిష్టంగా ప్రాసెస్ చేయబడిన వాటిని ఎంచుకోవచ్చు. వీటిని తీసుకోవడానికి ఉత్తమ పద్ధతి మిసో యంపే మరియు నాటో వలె పులియబెట్టడం ద్వారా ప్రోబయోటిక్స్ మరియు విటమిన్ కె పుష్కలంగా లభిస్తాయి, అవి గుండె, ఎముకలకె కాక మొత్తం శరీర ఆరోగ్యమును మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిద్ర రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తాయి. 31,32
4.4 బ్లాక్ ఐడ్ బీన్స్/కౌ పీస్(లోబియా): ఇది విటమిన్ A మరియు K తో కూడి పోలిట్ అధికంగా ఉండే బీన్. దీన్ని మొలకలు గా తినవచ్చు లేదా రుచిని మెరుగుపరచడానికి ఉల్లిపాయ టొమాటో మరియు మసాలా దినుసులతో వండి వాడవచ్చు. సాధారణ బీన్స్ మాదిరిగా ఎక్కువగా అపానవాయువు ఏర్పడదు. 33 జాగ్రత్తలు : సాధారణ అలెర్జెన్ మరియు జన్యు పరంగా మార్పు చేసింది కావడం వలన అధికంగా తీసుకోవడం పురుషులలో హార్మోన్ అసమతౌల్యానికి దారి తీయవచ్చు. 33
5. పప్పు ధాన్యాల విచక్షణాత్మక వినియోగానికి చిట్కాలు
- ఉపయోగించే ముందు బాగా కడగాలి: కొనుగోలు చేసేటప్పుడు తాజాదనాన్ని మరియు సేంద్రీయ ఉత్పత్తి లేదా పురుగుమందులు లేనిది తనిఖీ చేయాలి. నాణ్యత మరియు వాటి మన్నిక పరీక్షించడానికి అవసరమైన చిన్న పరిమాణంలోనే కొనాలి.12
- సమతుల్య ఆహారం కోసం అధిక ప్రోటీన్లు అధికంగా ఉండే ఫైబర్ పప్పులను ధాన్యాలతో జతచేయాలి: ప్రాధాన్యత లేదా సౌలభ్యం ఆధారంగా ఒకే రకం పై ఆధారపడ వద్దు. వాటిని మారుస్తూ ఉండాలి లేదా ఇతర కాయ ధాన్యాలు మరియు బఠాణీలు వంటి వాటితో కలపాలి. పప్పులను విటమిన్ సి తో కలపడం ద్వారా శోషణ మెరుగుపడుతుంది. ఉదాహరణ తాజా నిమ్మరసం 8
- తప్పనిసరి ఐతే తప్ప పప్పులను ఉడికించవద్దు: ఉత్తమ పోషకాహారం కోసం పప్పులను కొన్ని గంటలు నానబెట్టి బాగా కడగాలి. కొన్ని పప్పులను జాగ్రత్తగా మొలకెత్తింప చేసి చిక్కుడు మినహా మిగతా వాటిని సలాడ్లలో పచ్చిగానే చేర్చవచ్చు.29 ఎక్కువ ప్రయోజనాలకోసం మొలకలు మరియు వండిన పప్పుల మిశ్రమాన్ని తీసుకోండి. జీర్ణక్రియకు సహాయపడటానికి కొన్ని మసాలా దినుసులతో కలిపి ఉడికించవచ్చు. అధిక ఉష్ణోగ్రతల వద్ద అతిగా ఉడికించడం లేదా వేయించడం పోషకాల నాణ్యత ప్రభావితం చేయవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కొన్ని పప్పు ధాన్యాల లోనూ చిక్కుడు గింజల లోనూ మాత్రమే ఉండేవి అధిక వేడిమికి క్షయమైపోతాయి. 3,7,29,34-
- మితంగా పప్పులు తీసుకుంటూ తగినంత నీరు త్రాగండి ; గ్యాస్, పొత్తికడుపులో తిమ్మిర్లు, మరియు ఉబ్బరం నిరోధానికి భోజనానికి అరగంట ముందు మితంగా పప్పుదినుసులు తీసుకుంటూ తగినంత నీరు కూడా త్రాగండి. గ్యాస్ ను తగ్గించడానికి ఉడికించిన బీన్స్ నుండి నీటిని తొలగించవచ్చు కానీ దానివల్ల ఖనిజాలు లవణాలు కూడా పోతాయి.14,34
- పప్పు ధాన్యాల పేస్టు: చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మరియు గాయాలను నయం చేయడానికి వాపులు మరియు కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి పప్పు ముద్దను బాహ్యంగా పూయవచ్చు. (చూడండి 3.2, 3.4, 3.5 & 4.1).
రిఫరెన్సులు మరియు లింకులు
- https://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-54.pdf
- What are pulses: https://pulses.org/what-are-pulses
- Why eat pulses!: https://www.nhs.uk/live-well/eat-well/beans-and-pulses-nutrition/
- Undervalued superfood: https://draxe.com/nutrition/pulses/
- Benefits of Pulses: https://pubmed.ncbi.nlm.nih.gov/25061763/
- https://draxe.com/nutrition/what-are-legumes/
- Benefits with caution: https://www.usapulses.org/consumers/nutritious
- Balanced diet of pulses & grains: https://www.fao.org/3/i5388e/i5388e.pdf
- Sprouting pulses: https://food.ndtv.com/food-drinks/6-benefits-of-sprouting-and-the-right-way-to-do-it-1691887
- Risks of high protein: Fasting for survival by Cardiologist Dr Jamnadas https://www.youtube.com/watch?v=RuOvn4UqznU
- RDA for protein intake & caution: https://pubmed.ncbi.nlm.nih.gov/26797090/#
- Storage: https://www.indiastudychannel.com/experts/38166-How-to-keep-grains-safe-from-bugs-for-long-storage
- https://www.indiastudychannel.com/experts/46530-how-to-store-grains-and-pulses-in-a-safe-manner
- Lentils: https://www.medicalnewstoday.com/articles/297638#diet
- https://draxe.com/nutrition/lentils-nutrition/
- Horse gram/miracle pulse: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4397296/
- Balancing benefits of horse gram: https://isha.sadhguru.org/in/en/blog/article/horse-gram-benefits-nutrition-recipes
- Colourful (Masoor) lentils: https://www.1mg.com/ayurveda/masoor-dal-239
- Mung beans: https://draxe.com/nutrition/mung-beans-nutrition/
- Moth bean/Matki: https://www.netmeds.com/health-library/post/matki-moth-bean-health-benefits-nutrition-and-recipes
- Pigeon peas/Toor dal: https://www.netmeds.com/health-library/post/toor-arhar-dal-5-nutritional-reasons-on-why-you-should-eat-this-protein-rich-legume-daily
- https://www.1mg.com/ayurveda/toor-dal-207
- Benefits of Black gram/urad dal: https://www.netmeds.com/health-library/post/black-gram-nutrition-therapeutic-benefits-uses-for-skin-and-hair
- Omega-3 in whole black gram: https://www.anuradhasridharan.com/2019/12/omega-3-fats-plant-based-sources-ALA.html
- External application https://www.1mg.com/ayurveda/urad-dal-152
- Chickpeas: https://draxe.com/nutrition/chickpeas-nutrition/
- https://www.netmeds.com/health-library/post/kala-chana-health-benefits-nutritional-profile-uses-for-skin-hair-recipes
- https://www.hsph.harvard.edu/nutritionsource/food-features/chickpeas-garbanzo-beans/
- Kidney beans/Rajma: https://draxe.com/nutrition/kidney-beans-nutrition/
- https://draxe.com/nutrition/10-best-legumes-to-eat/
- Soybean: https://draxe.com/nutrition/natto/
- Benefits of soybean: https://www.lybrate.com/topic/benefits-of-soybean-and-its-side-effects
- Black-eyed peas/Lobia: https://draxe.com/nutrition/black-eyed-pea-benefits/
- How to cook beans for maximum benefit: https://www.youtube.com/watch?v=bY7of8J2s7g
- Omega-3 not lost in cooking: https://www.hsph.harvard.edu/nutritionsource/2007/06/19/ask-the-expert-omega-3-fatty-acids/
- High heat may break down Omega-3: https://omega3innovations.com/blog/does-frying-baking-and-canning-fish-affect-the-omega-3-content/
_________________________________________________________________________________
2. విర్చువల్ AVP వర్క్ షాప్ నవంబర్ 2-20 అనంతరం ముఖాముఖి వర్క్ షాప్ 2021 నవంబర్ 24-26 పుట్టపర్తి నవంబర్లో జరిగిన AVP వర్క్ షాప్ బ్యాచ్ లో ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు ప్రతినిధులు దుబాయ్, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా,
రొమేనియా మరియు భారతదేశం నుండి ఉండడం హృదయాన్ని ఉత్తేజపరిచింది. 10 వారాల ఇంటిగ్రేటెడ్ కోర్సులలో
మొదటిసారిగా అభ్యర్థులు వారి సంబంధిత e కోర్సు ఉపాధ్యాయులతో పరస్పరం ఒకరి కొకరు అధ్యాయాల వారీగా సంప్రదింపులు జరపడంతో పాటు వర్చువల్ పర్యవేక్షణలో మూల్యాంకనలు కూడా జరిగాయి. ఇది వారికి సబ్జెక్ట్ పై మరింత స్పష్టత ఇవ్వడమే కాక ఆచరణాత్మక అంశాలపై వర్క్ షాప్ లో వారు మరింత ఉత్పాదకంగా వ్యవహరించగలగడానికి, ప్రాక్టికల్ గా రోగుల సమస్యలను గుర్తించి 108 CC పుస్తకాన్ని ఉపయోగించి తగిన కోంబోలను గుర్తించడం మరియు సరైన పేషంటు రికార్డులను నిర్వహించడం వంటి విషయాలపై స్పష్టత నిచ్చింది. మానవ అవయవ వ్యవస్థ పై రెండు సెషన్ల ద్వారా వ్యాధులు వాటి ప్రధాన లక్షణాలు, మరియు అవసరమైన జీవనశైలి మార్పులు గురించి వైద్యపరంగా అర్హత కలిగిన ఒక సీనియర్ ప్రాక్టీషనరు వివరించారు. నవంబర్ 24న ఒక నిజమైన మోడల్ క్లినిక్ తర్వాత అర్హత కలిగిన AVP లు స్వామివారి ముందు ప్రమాణం చేసి వారికి ఇవ్వబడిన చార్జింగ్ చేసిన 108CC బాక్సు నుండి వెల్నెస్ కిట్లు, రోగులకు రెమిడీలు తయారు చేశారు. వాలిడిక్టరీ సెషన్లో డాక్టర్ అగ్గర్వాల్ వైబ్రియానిక్స్ ఎలా పని చేస్తుంది, ప్రతీ వ్యాధికి దాని స్వంత ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, మరియు ఇది ఇవ్వబడిన రెమిడీ యొక్క వైబ్రేషన్ తో సరిగా సరిపోల్చ గలిగితే ఆ వ్యాధి అంతరించిపోతుందని తెలియజేశారు. వ్యాధి పేరు మనకు తెలియని అవసరం లేదు, మనకు మార్గం చూపించడానికి వ్యాధి లక్షణాలు మరియు కారణం తెలిస్తే సరిపోతుంది. ఒక వ్యాధి దీర్ఘకాలంగా ఉన్నందున దాని నివారణకు ఎక్కువ సమయం పడుతుందనే అభిప్రాయం కూడా అవసరం లేదు, ఫలితాలు కొన్నిసార్లు చాలా వేగంగా ఇంకా చెప్పాలంటే తక్షణమే ఫలితం కూడా లభించవచ్చు. ప్రాక్టీషనర్ యొక్కదక్షత, అంకితభావం, భక్తి అలాగే రోగి మరియు ప్రాక్టీషనర్ యొక్క సానుకూల ఆలోచనలు చికిత్స చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మనము మనసు నుండి కాక హృదయము నుండి ఆ దివ్య వైద్యునికి శరణాగతి భావంతో రోగికి ఏది మంచిదే అదే ఒనగూడుతుంది.
_________________________________________________________________________________
3. AP హింది వర్క్ షాప్ 2021 డిసెంబర్ 16-21
మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రజానీకానికి వైబ్రియానిక్స్ సేవలు చేర్చాలనే సంకల్పలో
వైబ్రియానిక్స్ శిక్షణ మాతృభాషలో అందించడానికి మేము పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాము. భారతదేశం లోని ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలకు చెందిన ఏడుగురు అభ్యర్థుల కోసం ఇటువంటి మొదటి వర్క్ షాప్ హిందీ లో జరిగింది. పాల్గొనన్న వారి లక్ష్యము మరియు ఉత్సాహం విశేషమైనదవి. తాము ఇంటికి చేరగానే వైద్య సదుపాయాలు అందుబాటులో లేనిచోట సేవ చేయాలనే గొప్ప అభిరుచిని ప్రదర్శించారు. చాలా మంది వారు అర్హత సాధించిన రోజే ఎంతో ఉత్సాహంతో తన సేవలు ప్రారంభించడం నిజంగా ప్రోత్సాహకరంగా ఉంది.
_________________________________________________________________________________
4. పుట్టపర్తిలో వార్షిక శిబిరం 2021 నవంబర్ 21-23
భగవాన్ వారి జన్మదిన సందర్భంగా ఒక నైవేద్యంగా ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ లో 13 వ సంవత్సరం ప్రాక్టీషనర్ 01228 వార్షిక ఆరోగ్య శిబిరం నిర్వహించారు( చిత్రాలను చూడండి). ఈ సంవత్సరం 6 గురు ప్రాక్టీషనర్లు వచ్చే భక్తులకు


సేవ చేసేందుకు చేతులు కలిపారు. మహమ్మారి ఫలితంగా గత ఏడాది లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంది అయితే ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా 419 మంది రోగులకు అందించబడ్డాయి. ఐదుగురు ప్రాక్టీషనర్లు మొదటిసారిగా పాల్గొని ఈ అనుభవం చాలా ఆనందదాయకం గా మరియు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. వైబ్రియానిక్స్ గురించి ఏమీ తెలియని పలువురు రోగులు దీనిపై ఎంతో ఆసక్తిని కనబరిచారు, అలాగే చాలా మంది వారి కుటుంబాలకోసం రెమిడీలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తు ఉపయోగం కోసం తాము నివశిస్తున్న ప్రాంతాలలో ప్రాక్టీషనర్ల వివరాలను కూడా తీసుకున్నారు. కోవిడ్ కు సంబంధించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అనుసరించ బడ్డాయి.
_________________________________________________________________________________
5. ఆసక్తి రేకి సిద్ధించే కారణాలు కథనాలు
ఐబి రెమిడీ చేసిన అద్భుతం 18004…ఇండియా
ఒక ప్రాక్టీషనర్ తనAP కోర్సు పూర్తి చేసి పుట్టపర్తి నుండి ఇంటికి వెళుతూ వైబ్రియానిక్స్ యొక్క గొప్పదనాన్ని నిరూపించే ఒక అద్భుతాన్ని అనుభూతి చెందారు. ఇతను తన పట్టణానికి( కాలింపాంగ్) వెళుతూ తోటి ప్రయాణికులకు బాగ్దోగ్ర ఎయిర్ పోర్ట్ నుంచి తన వాహనం పై లిఫ్ట్ ఇచ్చారు. కొన్ని నిమిషాల తర్వాత ఈ వ్యక్తి ఒక ఎటాక్ గురయ్యి అతని శరీరం చల్లగా అయిపోయి కుడి పక్క తిమ్మిరితో కదలలేని స్థితి ఏర్పడింది. ప్రాక్టీషనర్ కు ఏం చేయాలో అర్ధాంకని స్థితిలో ఉన్నాఋ. తన IB బాటిల్ లో రెండు మాత్రలు మిగిలి ఉండటంతో అతను ఒక మాత్రను రోగి నోట్లో వేసి ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకొని స్వామిని హృదయపూర్వకంగా ప్రార్ధించారు. తను కళ్ళు తెరచి చూసే సరికి తను చూసిన దాని నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఆ వ్యక్తి పూర్తిగా కోలుకుని చక్కగా ఉన్నారు. అతని తిరిగి వెచ్చగా మారి అతను తన కుడి వైపుభాగాలను కదల్చ గలుగు తున్నాడు. ఇలా తనంత తాను ఇంత హఠాత్తుగా కోలుకోవడం చూసి మీరు నాకేమైనా మ్యాజిక్ మాత్ర ఇచ్చారా అని ప్రాక్టీషనరును అడిగారు. తరువాత ఆ వ్యక్తి తన వివరాలు చెపుతూ తన సోదరుని మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్ళడానికి స్థానిక ఆసుపత్రికి వెళ్తున్నట్లు వివరించారు. బెంగళూరు నుంచి విమానం ఎక్కేముందు కూడా ఆ వ్యక్తి ఇలాంటి దాడికి గురయ్యారు. ఒక తోటి ప్రయాణికుడు అతని ప్రభావిత శరీర భాగాలకు ఒక గంట పాటు మసాజ్ చేశాడు అది అతనికి కొంత ఉపశమనం కలిగించి అతనిని విమానంలో తీసుకెళ్లడానికి అవకాశం కల్పించింది. ఇంత అద్భుతాన్ని అనుభవించిన ప్రేరణతో చికిత్స కోసం త్వరలో ప్రాక్టీషనరు వద్దకు తిరిగి వస్తానని ఆ వ్యక్తి వాగ్దానం చేశాడు.
_________________________________________________________________________________
6. జ్ఞాపకార్థం
శ్రీ యలమటి నరసింహారావు 01456…ఇండియా హైదరాబాదుకు చెందిన వారు. 2002 నుండి వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ చేస్తూ వారానికి ఆరు రోజులు ఇంటి వద్దే క్లినిక్ నడుపుతున్నారు. తన చివరి క్షణం వరకు చాలా చురుకుగా సేవ చేస్తూ వారు 2021 అక్టోబర్ 14 న 77 సంవత్సరాల వయసులో ఎటువంటి సమస్య లేకుండా నిద్రలో కన్నుమూసారు. వారి కుటుంబ సభ్యులు మరియు వైబ్రియానిక్స్ సోదరులు వారు లేని లోటు పట్ల బాధా తప్త హృదయులయ్యారు.
శ్రీ కేశవరావు బంగాల్ కర్ 10300…ఇండియా మహారాష్ట్రలో నాగపూర్ నుండి 2020 డిసెంబర్ 25 న 85 సంవత్సరాల వయసులో తన శరీరాన్ని విడిచి స్వర్గస్తులయ్యారు. ముంబైలోని ధర్మక్షేత్రంలో శిక్షణ పొందిన మొదటి బ్యాచ్ ప్రాక్టీషనర్లకు చెందిన వారు. వీరు చురుగ్గా ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు పాటు అందించిన వైబ్రియానిక్స్ వైద్యసేవలు మరువలేనివి.