Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 13 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2022


ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

మనం 2022 లోకి వెళుతున్న సందర్భంలో జీవితాన్ని ప్రాపంచిక దృక్పథం తో చూసే వ్యక్తికి రాబోయే సంవత్సరం కూడా ఈ మహమ్మారిని భరించడం వల్ల ఏర్పడిన పరిస్థితికి సంబంధించిన అనిశ్చిత స్థితి మరియు ఆందోళనతో నిండి ఉంటుంది. కానీ ఉన్నతమైన ఆదర్శంతో జీవితాన్ని గడిపే వారికి ఈ 2022 పురోభివృద్ధి, ఆశావహ ధృక్పధం, సేవ చేయడానికి మరియు ప్రేమను పంచుకునే అవకాశాన్ని అందించే సంవత్సరంగా స్వాగతించ బడుతుంది. స్వామి ఇలా అన్నారు “పవిత్రమైన శరీరం కలిగిన మనిషి ఈ దేహాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. మనిషి జీవితం ఒక వెదురు కర్ర వంటిది. అది సంపద, భార్య పిల్లలు, కోరికల రూపంలో అనేక ముడులను కలిగి ఉంటుంది. ఈ చిక్కులను తొలగించాలి. ఈ కొత్త సంవత్సరం నుండి మీరు మానవత్వం యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించి మీ జీవితములో పరివర్తన పొందాలి. అప్పుడు మీరు దేశానికి నిజమైన సేవకులు అవుతారు. ప్రజా జీవితం లోని ప్రతీ రంగంలోనూ మీ వంతు పాత్ర పోషించి మీ హృదయాన్ని స్వచ్ఛంగా కల్మష రహితంగా ఉంచుకోండి... సత్య సాయి బాబా- నూతన సంవత్సర ప్రసంగం 1998 జనవరి 1.

మన ప్రతీ ఆలోచన, వాక్కు, మరియు పనిలో మానవత్వాన్ని కనబరాచాలంటే సరైన దృక్పథం తప్పనిసరి. ఒక సంస్థ గా మేము 2021 కి న్యాయం చేశామనే భావిస్తున్నాను. కొత్త సంవత్సరంలో కూడా మనం ఇదే ఉత్సాహాన్ని కొనసాగించగలమని ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను. గడిచిన సంవత్సరాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లుగా మరియు సేవకు అంకితమైన సంస్థగా మనము అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించాము.

 సంస్థగా మేము “పనిలో పురోగతి” లో ఉంటాము. మనం ఎల్లప్పుడూ ఇదే ఆశయంతో ఉంటామని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే  పరిణామం చెందకపోతే మనం ఎదగలేము! 

స్వామిని వాక్కు దృష్ట్యా మనమందరం పెంపొందించుకోవాల్సిన నిజమైన దృక్పథం ఇక్కడ ఉంది- “కరుణతో నిండిన హృదయం భగవంతుని ఆలయం. యేసు కరుణ కోసం వేడుకొన్నాడు, కరుణ అతని సందేశం, పేదలను కష్టాలను చూసి ఎంతో చలించి పోయాడు. ఈ రోజు ఏసు ఆరాధింపబడుతున్నాడు కానీ అతని బోధనలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. సాయిని ఆరాధిస్తున్నారు కానీ ఆయన బోధనలు విస్మరింప బడ్డాయి. ప్రతీ చోట ఆడంబరం, ప్రదర్శన, ఆర్భాటపు ఉపన్యాసాలు ఉంటున్నాయి. ఉపన్యాసాలు, ఉపన్యాసాలు, ఉపన్యాసాలు, ఇవే తప్ప కార్యాచరణ లేదు, ప్రేమ లేదు, సేవ లేదు. ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు హీరోలు, చెప్పినది ఆచరణలో పెట్టడంలో జీరోలు. కరుణను అభివృద్ధి చేసుకోండి,  ప్రేమలో జీవించండి, మంచిగా ఉండండి, మంచి చేయండి, మంచినే  చూడండి. ఇదే భగవంతుని చేరుకొనే మార్గం. - సత్య సాయి బాబా, క్రిస్మస్ ప్రసంగం, 1981 డిసెంబర్ 25.  

మీకు మరియు మీ ప్రియమైన వారికి 2022 సంతోషంగా ఆరోగ్యంగా మరియు సుసంపన్నంగా ఉండాలని కోరుకుంటూ

సాయికి ప్రీతికరమైన సేవలో 

జిత్ కె అగర్వాల్