Vol 11 సంచిక 5
September/October, 2020
అవలోకనం
డా.జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్కు నుండి
డాక్టర్ అగర్వాల్ గారు IASVP మెంబర్ షిప్ లో పురోగతి గురించి, జ్ఞాన భాగస్వామ్యం కోసం వర్తువల్ ప్లాట్ఫారం ని ఉపయోగించి వైబ్రియనిక్స్ ని ఎలా ముందుకు సాగుతుందో వివరించారు. ఈ భూగోళంపై నున్న ప్రజలందరి ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా, ఈ కోవిడ్ మహమ్మారి పోయే వరకు రక్షణ జాగర్తలు ఏ మాత్రం తగ్గించ కుండా ప్రజలందరకూ ఆదర్శం గా వైబ్రియనిక్స్ ప్రాక్టీషనర్స్ మసులుకోవాలని సూచించారు.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
12 ఆసక్తికరమైన కేసులు పంచుకో బడ్డాయి. వాటిలో నిద్రలేమి, క్రోన్స్ వ్యాధి , వంద్యత్యం, హెర్నియా, మలబద్ధకం, శ్వాస సంబంధిత అలర్జీలు, అంగస్తంభన సమస్యలు, మూత్రం ఆపుకోలేకపోవటం, లారింగైటిస్, దీర్ఘకాలిక బర్పింగ్గ్, అన్నవాహిక లో మంట దురద, ఆర్డాల్గియ, త్రేన్పులు, పునరావృతమవుతున్న కీళ్ల నొప్పి మరియు మానసిక రుగ్మతలు.
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
విబ్రియోనిక్స్ లో చాలా స్ఫూర్తిదాయకమైన ఫలితాలు సాధించిన అంకితభావం ఉన్న ఇద్దరు ప్రాక్టీషనర్లు ను మేము పరిచయం చేస్తున్నాము. ఒకరు క్రొయేషియా చెందిన ఫార్మసిస్టు. ఆమె పట్టణంలోని పర్యావరణ ప్రాంతంలోని లెక్కలేనన్ని లేవెండర్ పొదలను పునరుద్ధరించారు, మరియు వాటిని వైబ్రియనిక్స్ రెమెడీలతో వికసించేలా చేశారు. మరియొక ప్రాక్టీషనర్ వాస్తవానికి ఆయన జన్మతహా అమెరికాకు చెందిన వారు. ఇప్పుడు పుట్టపర్తిలో నివసిస్తున్నారు. ఆయన జీవితం లో స్వామి తో ఎన్నో మంచి అనుభవాలను కలిగి ఉన్నారు మరియు ప్రతి సంవత్సరం వేలాది మంది రోగులకు తన భార్య తో పాటు చికిత్సలు చేయటం ద్వారా తన సమయాన్ని మరియు జీవితాన్ని స్వామి సేవలో పవిత్రం చేసుకుంటున్నారు.
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు జవాబులు
దీనిలో covid-19 పాజిటివ్గా నిర్ధారణ అయిన తల్లికి ఇమ్యూన్టీ బూస్టర్ను ఇవ్వడం ద్వారా బిడ్డకు ఆమె రొమ్ము పాలు ఇవ్వటాన్ని ప్రోత్సహించవచ్చు. నేటి అసాధారణ పరిస్థితుల్లో తినదగిన వస్తువులను నిర్వహించటంలో జాగ్రత్తలు, ఒక వ్యాధి చికిత్సలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, అయస్కాంత వికిరణం నుండి 108 సీసీ పెట్టేను ఎలా భద్రపరచవచ్చు, పొటెంటైస్ చెయబడిన పండ్లు, విటమిన్లు మొదలైన వాటి ప్రభావం మరియు పొటెంటైస్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు వివరించబడ్డాయి.
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్య వాణి
స్వామి మనకు ప్రేమతో మార్గనిర్దేశం చేస్తున్నారు. వైద్యం కోసం మాత్రమే కాకుండా అనారోగ్యాన్ని నివారించడానికి కూడా ఔషధాన్ని వాడండి. ఇది మనం సేవ చేసే వారికి ఉపశమనం మరియు సంతృప్తి కలిగించడం వల్ల మనకు స్వీయసంతృప్తితో పాటు విలువైన స్వామి సేవ చేసాము అనే సంతృప్తి కూడా పొందుతాము.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
ఫ్రాన్స్, యూకే, అమెరికా మరియు భారతదేశంలో 20 20 కోసం రాబోయే వర్చువల్ వర్క్ షాపులు మరియు సెమినార్లు. AVP మరియు SVP వర్క్ షాపులు ప్రవేశ ప్రక్రియ మరియు E- కోర్సు చేయించుకున్న వారికి మాత్రమే. రిఫ్రెషర్ సెమినార్లు ప్రస్తుత ప్రాక్టీషనర్స్ కోసం.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
కూరగాయలు తినడం మీ ఆరోగ్యానికి రాజమార్గం అనే వ్యాసం ఇవ్వటం జరిగింది. కూరగాయలు అంటే ఏమిటి? సిఫార్సు చేసిన కూరగాయలు తీసుకోవడం, కూరగాయలు శుభ్రపరచడం, మరియు వివిధ వర్గాల కూరగాయలు, వాటి ప్రయోజనాలు మరియు వినియోగము, వినియోగంలో జాగ్రత్తలు గురించి సమాచారం ఇవ్వబడింది. ఒక ప్రాక్టీషనర్ యొక్క అద్భుతమైన అనుభవాన్ని ఆమెకు వైబ్రియానిక్స్ పై ఉన్న హృదయపూర్వక విశ్వాసం గురించి చిత్రాలతో వివరించడం జరిగింది.
పూర్తి వ్యాసం చదవండి