Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్నలు జవాబులు

Vol 11 సంచిక 5
September/October, 2020


ప్రశ్న 1. కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన స్త్రీ తన బిడ్డకు రొమ్ము పాలు త్రాగించ వచ్చా?

జవాబు. తల్లిపాలు బిడ్డకు రోగనిరోధక శక్తి/ ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో ఎంతో సహకరిస్తాయి. ఇది బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది కనుక అట్టి పాలు ఇవ్వకుండా నిరోధించమని మేము చెప్పలేము. అయితే తల్లీ, బిడ్డా ఇద్దరికీ ఇమ్యూనిటీ బూస్టర్ ఇవ్వడం ద్వారా రక్షణ కల్పించవచ్చు. అధ్యయనాలు మరియు పరీక్షల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 పొజిటివ్ వచ్చిన తల్లి తన బిడ్డకు రొమ్ము పాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించాయి. అనేక సందర్భాల్లో వారు తల్లిపాలలో కోవిడ్ వైరస్ జాడ కనుగొనక పోవడం దీనికి ప్రధాన కారణం. ఈ క్రింది లింకును సందర్శించండి https://www.who.int/news-room/commentaries/detail/breastfeeding-and-covid-19

________________________________________________________________________

ప్రశ్న 2. వార్తాలేఖ సంచిక 7 సంపుటి 2 లో సూచినట్లుగా పండ్లు మరియు కూరగాయలను 20 నిమిషాలు ఉప్పు మరియు వెనిగర్ ద్రావణంలో నానబెట్టి తరువాత మంచి నీటితో కడుగుతున్నాను. కోవిడ్-19 యొక్క ప్రస్తుత పరిస్థితిలో పండ్లు, కూరగాయలు మరియు ఇతర సామాగ్రిని వాడడానికి ముందు ఇంకా ఎటువంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి దయచేసి సలహా ఇవ్వండి?   

జవాబు. కోవిడ్-19 సోకిన వ్యక్తిని మరొక వ్యక్తి తాకడం ద్వారా పొజిటివ్ ఉన్న వ్యక్తి నుండి తుంపర్లు మరొక వ్యక్తి శ్వాస ద్వారా పీల్చటం లేదా కలుషితమైన ఉపరితలాన్ని తాకడం ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుంది. మానవ శరీరం వెలుపల వైరస్ ఉపరితల రకాన్ని బట్టి కొన్ని గంటల నుండి రోజుల వరకు ఈ వైరస్  జీవించి ఉంటుంది.  మీకు ఇటీవల కొనుగోలు చేసిన కిరాణా లేదా సామాగ్రి ఉంటే వాటిని చాలా గంటలు పక్కన పెట్టండి. అట్లా కొనుగోలు చేసిన సామగ్రిని వాడవలసి వచ్చినప్పుడు ఉపయోగం తరువాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి. శరీరంపై వైరస్ వేగంగా క్షీణిస్తుందని  నిర్ధారించబడింది. ఉపరితలం తో సంబంధం లేకుండా వైరస్ రోజుల్లో కాక కొన్ని గంటల్లోనే చనిపోతాయి. వండడం ద్వారా ఉష్ణోగ్రత ఆహారం పైన వైరస్ను చంపుతుంది అని గమనించాలి. మరిన్ని వివరాల కోసం https://medical.mit.edu/covid-19-updates/2020/06/can-i-get-virus-grocery-delivery సందర్శించండి.

________________________________________________________________________

ప్రశ్న 3. వ్యాధికి చికిత్స చేయడంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యం ఏమిటి?  

జవాబు. మనం చేసే చికిత్సలో భగవంతుని దయను అర్థించడం లోనే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఉంది. భగవాన్ బాబా ఏమంటారంటే దేవుని దయ అందరి పై సమానంగా కురిసే వర్షం వంటిది కానీ మన గిన్నెలు తల క్రిందులుగా ఉంచితే వర్షాన్ని పొందలేము. ప్రార్థన అంటే అట్టి వర్షాన్ని పట్టుకోడానికి మన గిన్నెను పైకి తిప్పటం వంటిది. ఒక రోగికి తన వ్యాధి మూలాన కలిగిన మానసిక ఆందోళన కారణంగా ప్రార్థనపై దృష్టి పెట్టే స్థితిలో ఉండకపోవచ్చు. ఇట్టి పరిస్థితిలో రోగి పట్ల ధృఢమైన విశ్వాసము మరియు స్వచ్ఛమైన ప్రేమతో చేసిన ప్రాక్టీషనరు యొక్క ప్రార్థన వ్యాధిని నయం చేయడంలో శక్తివంతమైన సాధనంగా మారుతుంది. అట్టి స్థితిలో ఒక త్రిభుజం ఏర్పడి దేవుని నుండి ప్రాక్టీషనరు పొందిన అనుగ్రహం రోగికి పంపబడుతుంది. కనుక రోగిని కనీసం రెమిడీ తీసుకునేటప్పుడైనా ప్రార్థన చేయమని సలహా ఇవ్వాలి.  

“ప్రార్థన మరియు ధ్యానాన్ని చమత్కారం అనో, కాకమ్మ కబుర్ల వంటివనో, ఏవో పిచ్చి చేష్టలనో  లేదా కాలక్షేపంగానో భావించవద్దు. వాటిని గట్టిగా పట్టుకోండి ఎందుకంటే అవేమిమ్మల్ని పాడైపోకుండా రక్షించే సాధనాలు”… శ్రీ సత్య సాయి బాబా – దివ్యవాణి, 25 నవంబర్ 1964.

________________________________________________________________________

ప్రశ్న 4. నేను వైబ్రియానిక్స్ లో చేరకముందు మ్యాగ్నెట్ థెరపీని అభ్యాసం చేశాను. నేను అట్టి చికిత్సా అయస్కాంతాలను ఉంచిన   అల్మారాలో 108 CC బాక్స్ ఉంచడం సరైనదేనా?   

జవాబు. రెండింటినీ కలిపి ఉంచవద్దు. 108 సిసి బాక్స్ లోని రెమిడీలు అన్ని విద్యుదయస్కాంత వికిరణం నుండి NM45 Atomic Radiation + SR324 X-Ray, చేరిక ద్వారా రక్షింపబడినప్పటికీ శక్తివంతమైన అయస్కాంతాలు, ఎలక్ట్రిక్ మోటార్లు(ఉదాహరణకి ఎలెక్ట్రిక్ ఫ్యాన్లు శక్తివంతమైన ఎలెక్ట్రో మేగ్నెట్స్ ఉపయోగిస్తాయి), SRHVP మిషన్,TV లు, మైక్రోవేవ్ లు, కంప్యూటర్లు, సెల్ఫోన్ల నుండి వచ్చే రేడియేషన్ కు దీర్ఘకాలికముగా లోనుకాకుండా భద్రపరచ వలసిందిగా  సిఫార్సు చేయబడింది. వార్తాలేఖ సంపుటి  7 సంచిక 1మరియు సంపుటి 8 సంచిక 4 లను కూడా చూడండి.

_______________________________________________________________________

ప్రశ్న 5. మంచి ఆరోగ్యంకోసం ప్రోత్సహింపడుతున్న కొన్ని ఆహారపదార్ధాలు ఖరీదైనవిగా ఉండడం వలన పండ్లు కూరగాయలు మరియు విటమిన్లతోతయారయిన నోసోడ్ లను భౌతిక ఆహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చా?  

జవాబుఎస్ ఆర్ హెచ్ పి పి మిషన్లో శక్తివంతం చేసిన పండ్లు మరియు కూరగాయలను అందులోని పోషకాలు మరింత జీవలభ్యంగా ఉండటానికి మరియు వాటి ద్వారా కొంతమందికి కలిగే ఆహారపు ఎలర్జీని తొలగించడానికి ఉపయోగించవచ్చు. ఐతే ఆహార వస్తువుల యొక్క శక్తివంతమైన సంస్కరణ దాని శక్తివంతమైన సిగ్నేచర్ ను కలిగి ఉంటుందే తప్ప మన శరీరానికి అవసరమైన పోషకాలను కలిగి ఉండదు. వీటి ద్వారా సూక్ష్మ శరీరంలోని అసమతుల్యత నివారణ అయినప్పటికీ భౌతిక లేదా శారీరక అవయవాలు పని చేయడానికి పోషకాలు తప్పనిసరి. సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం కానీ ఖరీదైన కూరగాయలు పండ్లు తినవలసిన అవసరం లేదు. స్థానికంగానూ కాలానుగుణంగానూ లభించే పండ్లు మరియు కూరగాయలలో దేవుడు అవసరమైన పోషకాలను అందించాడు.  

* యాదృచ్చికంగా ఇక్కడ నోసోడ్ అనే పదము సరైన ఉపయోగం కాదు. నోసోడ్ అనేది వ్యాధిగ్రస్తుడైన మానవ లేదా జంతువుల కణజాలం లేదా శారీరక ఉత్సర్గము నుండి తయారు చేసిన ఒక రెమిడి.

_______________________________________________________________________

ప్రశ్న 6. వార్త లేఖ సంచిక 11 సంపుటి 2 లో అనారోగ్య పదార్ధాన్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు చేతికి గ్లౌస్ /తొడుగులు ధరించాలి అని సూచించారు. ఆహార పదార్థాలను పొటెంటైజ్/ శక్తివంతం చేసేటప్పుడు కూడా ఇలా చేయాలా?    

జవాబు. సాధారణ నియమం ప్రకారం SRHVP మిషను లోని శాంపిల్ వెల్ లో సరిపోయే అంత చిన్న శుభ్రమైన సీసాలో నమూనాను (ఇది ఆహార పదార్థం, అలెర్జీ కారకం, ఔషధం ఏదైనా కావచ్చు) తీసుకురావలసిందిగా మనము రోగికి సలహా ఇస్తాము. అప్పుడు పదార్థం యొక్క ప్రత్యక్ష నిర్వహణ లేదా హ్యాండిల్ చేయడం అనే ప్రశ్నే తలెత్తదు. అలాగే ఇది ప్రాక్టీషనరు నుండి ఉత్సర్గమయ్యే శక్తితో కాలుష్యం అవుతుందేమో అన్న భయాన్ని కూడా నివారిస్తుంది. ఇలా తెచ్చిన సీసాను శాంపిల్ వెల్ లో ఉంచే ముందు ప్లాస్టిక్ కవరులో  లేదా క్లింగ్ ఫిల్మ్ వంటి రేపరులో చుట్టాలి అటువంటి పరిస్థితిలో చేతికి గ్లౌస్ తొడుగు కోవలసిన అవసరం లేదు.