డా.జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్కు నుండి
Vol 11 సంచిక 5
September/October, 2020
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
భారతదేశంలో పండుగల సీజన్ గత నెలలో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇది గురుపూర్ణిమతో ప్రారంభమై అనంతరం కృష్ణాష్టమి కూడా వచ్చి వెళ్ళింది. పది రోజుల క్రితం గణేష్ చతుర్థి కూడా జరుపుకున్నాము. గణేష్ అంటే అడ్డంకులు తొలగించే వాడు అని అర్థం. అలాగే నిన్నటి రోజు కేరళ వారి ఓణం పండుగ ముగింపుకు చేరుకుంది. ఇది ఈ సంవత్సరంలో నిజంగా ఒక మధురమైన ఘట్టం. ఇది ప్రతీ ఒక్కరికీ ఎంతో ఆనందం, ఉత్సాహములను అందిస్తూ దివ్య ప్రకంపనలతో కూడిన దైవశక్తితో మనల్ని నింపింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి భయం ప్రశాంతి నిలయంతో సహా పెద్ద పెద్ద సామాజిక సమావేశాలు మరియు సామూహిక వేడుకలలో పొంచి ఉన్నప్పటికీ ఇది మరొక విధంగా అందరం ఆనందించదగ్గ సమయం. మనం స్వామి సేవలో పూర్తిగా నిమగ్నం కావడానికి లేదా అందులో మునిగిపోవడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. స్వామి ఇలా అంటారు “ఓణo సందేశం ఏమిటంటే అహంకారం పూర్తిగా విడిచి సంపూర్ణ శరణాగతి చేయడం ద్వారానే భగవంతుడు మన వశుడవుతాడు. హృదయం పవిత్రమైనప్పుడు భగవంతుడే అందులో నివసిస్తూ మనిషికి తనే మార్గదర్శకత్వము వహిస్తూ తానే నడిపిస్తాడు”. ..శ్రీ సత్య సాయి బాబా దివ్య వాణి, ప్రశాంతి నిలయం 1984 సెప్టెంబర్ 7. మన అహంకారాన్ని పూర్తిగా అర్పితం చేసి బేషరతుగా, నిస్వార్ధంగా, ప్రేమతో, సేవా కార్యకలాపాలలో మునిగిపోవడానికి వైబ్రియానిక్స్ కంటే మించిన ఉత్తమ మార్గం గురించి నేను నిజంగా ఆలోచించలేను. ప్రస్తుతం వైబ్రియానిక్సుకు సంబంధించినంత వరకూ తాజా నవీనీకరణలు మరియు పరిణామాలతో కొంగ్రొత్త వార్తలు ఈ సంచికతో మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆనందంగా ఉంది.
మనం మన కోర్సుల విషయంలో పూర్తిగా డిజిటల్ అయిపోయాయని మీకు తెలియజేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మనకు కాబోయే అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో చేర్చుకోవచ్చు మరియు మన నిరంతర విద్యా కోర్సుల పరిధిని మారుమూల ప్రాంతాలకు విస్తరించవచ్చు. మైక్రోసాఫ్ట్ విజువల్ ప్లాట్ ఫాం అయినటువంటి మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా మనం ప్రస్తుతం ఆన్లైన్లో వర్క్ షాప్స్ నిర్వహించుకొంటున్నాము. ప్రస్తుతం ఆంగ్లంలో కోర్సులను ప్రారంభించినప్పటికీ కాలక్రమేణా ఇతర భాషలకుకూడా వీటిని వర్తింపచెయ్యాలని ఆశిస్తున్నాము.
అంతేకాకుండా మనం ప్రారంభించిన వెబ్సైట్ కొత్త రూపాంతరంతో మీ ముందుకు వచ్చిన విషయం మీరు గమనించే ఉంటారు అని భావిస్తూ సమాచారాన్ని, జ్ఞానాన్ని మరింత సులభంగా అందించగలుగుతూ దీనికి మరింత ప్రాప్యత చేకూర్చడం కోసం క్రింద సూచించిన మరి కొన్ని హంగులను చేకూరుస్తున్నాము. ఈ సెప్టెంబర్ నెలాఖరు నాటికి క్రింది మార్పులు అమలు చేయబడడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాము.
- రోగ చరిత్రలన్నింటినీ వర్గీకరించి ఇరవై ఒక్క ప్రధాన వర్గాలకు అనుసంధానింపబడాలి.
- వార్తాలేఖలో ప్రచురింపబడిన అన్ని ఆరోగ్య కథనాలు సూచిక(ఇండెక్స్) చేయబడడమే కాకుండా లింక్(వెబ్సైట్) చేయబడతాయి.
- మరింత సౌలభ్యం కోసం స్మార్ట్ ఫోన్ ద్వారా యాక్సెస్ చేయడానికి అవకాశం కూడా కల్పించబడుతుంది.
ఏదైనా అనారోగ్యానికి సమర్థవంతమైన నివారణను అభివృద్ధి చేయడం అనేది నిరంతర ప్రక్రియ అని మనందరికి తెలుసు. మాపరిశోధనా బృందం ప్రాక్టీషనర్లు తమ రంగంలో అందించిన తాజా డేటా మరియు కేస్ హిస్టరీలపైననే ఎక్కువ ఆధారపడి ఈ నవీనీకరణలు చేపడుతున్నారు. (తాజా నవీనీకరణ కోసం ఈ సంచిక అదనంగా విభాగంలో #3’ ను చూడండి). అదేవిధంగా కోవిడ్-19 కొరకు అత్యంత ప్రభావవంతమైన రెమిడీని అభివృద్ధి చేసే విధానం కూడా పైన చెప్పిన విధానానికి భిన్నమేమీ కాదు. మనకు లభ్యమయ్యే అనేక వైరస్ లు DNA వైరస్ లు కాగా కోవిడ్ -19 వైరస్ RNA వైరస్. ఇది వేగంగా పరివర్తన చెందడానికి అభివృద్ధి కావడానికి అవకాశం ఎక్కువ కనుక కోవిడ్ -19 తో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడంలో వారి అనుభవాలను అవి సంక్లిష్టమైనవి ఐనా, సరళమైనవి ఐనా మన ప్రాక్టీషనర్ల నుండి వినడం మాకు మరింతగా కేసు యొక్క సంక్లిష్టత గురించి అర్థం చేసుకోవడానికి అవకాశం, అనుభవం కలిగిస్తుంది. ఈ కొత్త వైరస్ గురించి మనకు చాలా వరకు సమాచారం తెలియనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ మహమ్మారి కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ పెరుగుతూ ఉండగా మరికొన్ని చోట్ల ఒక కొత్త రకం అదనంగా పుట్టుకొస్తున్నట్లు సమాచారం తెలుపుతోంది. అందుచేత నేను మీ అందరినీ కోరేదేమిటంటే మీ రక్షణ విషయంలో మీరు సురక్షితంగా ఉండటానికి మేము సిఫార్సు చేసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించండి. ఎలాగూ మనం కోవిడ్-19 విషయం ప్రస్తావిస్తూ ఉన్నందువలన మన ప్రాక్టీషనర్లు ఇమ్యూనిటీ బూస్టర్ పంపిణీ ఉత్సాహంతో కొనసాగిస్తున్నట్లు ఆ వివరాలు మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇమ్యూనిటీ బూస్టర్ పంపిణీ విషయంలో 30% పెరుగుదలతో భారతదేశంలోనే ఈరోజు వరకు 1,80,000 పైగా వ్యక్తులకు చేరుకుంది. ఇది ఒక మైలురాయిగా భావిస్తూ ప్రాక్టీషనర్లందరినీ వారి నిస్వార్ధ సేవకు అభినందించడానికి చక్కని అవకాశముగా భావిస్తున్నాను.
VP లు మరియు అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ప్రాక్టీషనర్లు అందరూ IASVP లో సభ్యులుగా నమోదు కావడం తప్పనిసరి అయినప్పటికీ చాలామంది ఇంకా నమోదు కాలేదు. ఇటీవల భారతదేశంలోని ఢిల్లీ-NCR ప్రాంతానికి చెందిన ప్రాక్టీషనర్ 11573 చొరవ తీసుకొని IASVP లో సభ్యులుగా నమోదు కావడానికి, వారిని ప్రోత్సహించడానికి, మరియు నమోదుకు సహరించడానికి ఒక పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ చొరవ ఒక అద్భుత విజయాన్ని సాధించింది అని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఒక నెలలోనే ఢిల్లీ-NCR ప్రాంతం లోని అందరూ IASVP లో సభ్యులు అయ్యారు. ఇదే స్పూర్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా 2020 నవంబర్ 23 నాటికి అర్హతగల ప్రాక్టీషనర్లు అందరూ స్వామి యొక్క 95వ జన్మదినోత్సవం నాటికి IASVP సభ్యులు అవుతారు.
IASVP సభ్యులు అందరికీ వారు తమ ఈమెయిల్ సిగ్నేచర్ లో (ఈ మెయిల్ చివర్లో) తమ పేరు తరువాత మెంబర్ IASVP అని ప్రస్థావించాలని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అలాగే వైబ్రియానిక్స్ సంస్థ అంతట ఏకరీతి ప్రమాణాలను అమలు చేయాలనే ఉద్దేశంతో కార్యదర్శి ఒక ప్రామాణిక సందర్శన కార్డును IASVP సభ్యులందరికీ పంపిస్తూ ఉన్నారు. ఇప్పటివరకూ ఈ విజిటింగ్ కార్డు డిజైన్ మీరు స్వీకరించక పోతే దయచేసి నేరుగా IASVP కార్యదర్శికి [email protected] ద్వారా పంపండి.
ఒక ప్రాక్టీషనర్ తన రోగులకు మానసికంగా శారీరకంగా అన్నింటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగానూ ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగించడానికి వారిని ప్రేరేపిస్తూ, ఉత్సాహపరిచే ఒక రోల్ మోడల్ గానిలవాలి. ప్రాక్టీషనర్లు అందరూ వత్తిడి లేని, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి మీ అంతః చేతన పిలుపు మేరకు తగిన జీవన విధానాన్ని అనుసరించాలని కోరుతున్నాను. మా వార్తాలేఖ లోని అదనంగా విభాగంలో ఆరోగ్యకరమైన జీవనం గురించి అనేక వ్యాసాలు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని నేను విశ్వసిస్తున్నాను. మీ రోగులు, స్నేహితులు, మరియు కుటుంబ సభ్యులతో ఈ ఆచరణాత్మక కథనాల లింకులను పంచుకోవాలని అందరిని నేను కోరుతున్నాను. వారు ఈ కథనాలను ఆస్వాదించడమే మన వెబ్సైట్ ద్వారా మరింత వివరంగా అన్వేషించడానికి వారికి అవకాశం లభిస్తుంది. మన వార్తాలేఖ కోసం ఏమైనా ఆరోగ్య చిట్కాలు, ఆలోచనలు, మరియు సలహాలను ([email protected]) ద్వారా పంచుకోవాలని నేను మీ అందర్నీకోరుతున్నాను.
మనం స్వర్ణయుగం లోకి ప్రవేశించామనడంలో నాకు ఎటువంటి సందేహమూ లేదు. ఈ మహమ్మారి మన చుట్టూ ఉన్న వారికి సేవ చేయడానికే కాక మనలోని దివ్యత్వం యొక్క ప్రకాశాన్ని అనుభవించడానికి, అంతర్ముఖం కావడానికి మనందరికీ అవకాశం కల్పించింది. మనమందరం ఈ కారణంగా సమిష్టిగా ఎదుగుతూ ప్రతీ రోజునూ అధ్యాత్మికంగా చార్జ్ చేసుకుంటూ తద్వారా జీవన గమనం పరివర్తన మరియు మార్పులను సమిష్టిగా ప్రభావితం చేస్తూ స్వచ్ఛమైన షరతులు లేని అన్ని అవకాశాలను అందించడమే కాక ప్రేమతో భూమాతను పునీతం చేద్దాం దానికోసం మీ అందరికీ మంచి ఆరోగ్యం కావాలని మరియు వైబ్రియానిక్స్ ద్వారా ప్రేమించడానికి సేవ చేయడానికి మీకు అనేక అవకాశాలు కలగాలని ప్రార్ధిస్తున్నాను.
ఫ్రేమతో సాయి సేవలో
జిత్.కె. అగ్గర్వాల్