Vol 16 సంచిక 4
జులై / ఆగష్టు 2025
అవలోకనం
డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
డా. అగర్వాల్, స్వామి వైబ్రియానిక్స్‌ను ఆశీర్వదించిన అపురూప క్షణాలను, అలాగే బంధనానికి దారితీయని సేవ గురించి స్వామి ప్రసాదించిన శాశ్వత మార్గదర్శకత్వాన్ని స్మరించుకుంటున్నారు. సిద్ధం చేసిన ప్రతి రెమెడీ, సేవ చేసిన ప్రతి రోగి—వాటిని స్వామి పదపద్మాలకు సమర్పించినప్పుడు అవి పవిత్రమైన సేవాకార్యాలుగా మారుతాయని ఆయన తెలియజేస్తున్నారు. స్వామి శతజయంతి సందర్భం సమర్పణగా మరిన్ని కేసుల చరిత్రలు, అసాధారణమైన అనుభవాలను పంచుకోవాలని ప్రాక్టీషనర్లను కోరుతూ, వైబ్రియానిక్స్ పరిశోధనకు అంకితభావంతో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. అలాగే శ్రీ సత్యసాయి సేవా సంస్థల వైద్య సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన వైబ్రియానిక్స్ శిబిరాలకు ప్రశాంతి నిలయంలో లభించిన ఇటీవలి గుర్తింపుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
ఈ సంచికలో ఈ క్రింది 12 ఆసక్తికరమైన కేసులు పొందుపరచబడ్డాయి: దీర్ఘకాలిక ఎలిఫెంటియాసిస్, ఫైలేరియల్ ఆర్థ్రైటిస్; మడమ ఎముక స్పర్స్ (క్యాల్కేనియల్ స్పర్స్), అలోపేషియా ఏరియేటా; శ్వాసకోశ అలర్జీ; ఇన్‌ఫెక్షన్‌తో కూడిన ఆసనద్వార ఫిస్టులా; మైగ్రేన్; అలర్జిక్ రైనైటిస్; అనారోగ్య సిరలు (వెరికోస్ వీన్స్), మణికట్టు నొప్పి; నిద్రలేమి; అరికాళ్ల మంట; మరొక అలర్జిక్ రైనైటిస్; తోక ఎముక స్థానభ్రంశం, నొప్పి; మరియు పోషకాహార లోపం వల్ల కలిగే చర్మవ్యాధి.
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
ఈ సేవ జీవితాన్ని ఎలా పరివర్తన చెందిస్తుందో, ఆసక్తికరమైన కేసులతో పంచుకుంటున్న ఇద్దరు అంకితభావం గల ప్రాక్టీషనర్ల గురించి తెలుసుకోండి. మొదటి ప్రాక్టీషనర్ వైబ్రియానిక్స్‌పై ఒక వీడియోను వీక్షించి, దాని అద్భుత ఫలితాలను ప్రత్యక్షంగా అనుభవించిన తరువాత ఈ సేవను స్వీకరించారు. అచంచలమైన నిబద్ధతతో ఐటీ సహా అనేక విభాగాలను నిర్వహిస్తూ, వైబ్రియానిక్స్ ప్రధాన బృందంలో అవిభాజ్య సభ్యునిగా సేవలందిస్తున్నారు. రెండవ ప్రాక్టీషనర్ సృజనాత్మకత, కరుణతో నిండిన వ్యక్తి; ప్రకృతి, జంతువుల పట్ల అపారమైన ప్రేమతో, వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై, వైబ్రియానిక్స్ సేవ ద్వారా అపారమైన ఆనందాన్ని పొందుతున్నారు.
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు జవాబులు
తెలుసుకోవడానికి చదవండి: పొటెన్టైజ్ చేసిన సూర్యకిరణాలు ఎలా విస్తృతమైన స్వస్థత ప్రభావాలను కలిగిస్తాయి? SM1 Removal of Entitiesను ఏయే విధాలుగా సమర్థవంతంగా ఉపయోగించవచ్చు? ఒక విద్యుదయస్కాంత పరికరం వైబ్రియానిక్స్ రెమెడీని ఎలా నిర్వీర్యం చేస్తుంది? నాలుక కింద ఉంచిన వైబ్రియానిక్స్ మాత్ర, నాలుకపై ఉంచిన లేదా మింగిన మాత్రతో పోలిస్తే దాని ప్రభావంలో ఏమైనా తేడా ఉంటుందా? అలాగే జీవితం చివరి దశలో ఉన్న రోగికి ఎలా సేవ చేయాలి?
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్యవాణి
గుండె జబ్బులను ఎలా నివారించాలో, అలాగే “ఇతరులకు సేవ చేయడం పుణ్యం; ఇతరులు బాధపడుతుంటే ప్రభావితం కాకుండా నిష్క్రియగా ఉండడం, ఇతరులకు హాని చేయడం అంతటి పాపం” అనే సత్యాన్ని మన హృదయాల్లో శాశ్వతంగా లిఖించుకోవాలని స్వామి ప్రేమతో బోధిస్తున్నారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
భారతదేశంలోని పుట్టపర్తిలో జరగనున్న రాబోయే శిక్షణా శిబిరాల వివరాలు.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
• “ఆరోగ్యవంతమైన హృదయం మీ చేతుల్లోనే ఉంది” అనే ఆరోగ్య వ్యాసం—గుండె నిర్మాణం, దాని విధులు, గుండె స్పందన చక్రం (Cardiac Cycle), విద్యుత్ ప్రసరణ వ్యవస్థ (Conduction System), వివిధ గుండె వ్యాధులు మరియు వాటి లక్షణాలు, నాడి స్పందనను ఎలా గుర్తించాలి, ఎలా పరీక్షించాలి, గుండెపోటు, గుండె వైఫల్యం, కార్డియాక్ అరెస్ట్ సందర్భాల్లో ప్రథమ చికిత్స, అలాగే గుండె ఆరోగ్య సంరక్షణకు అవసరమైన సూచనలతో. • యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగిన వార్షిక సమావేశం సారాంశం. • అనుభవాలు: డా. జిత్ కె. అగర్వాల్ డైరీ నుండి – మూల కారణాన్ని వెలికితీయడం: వైబ్రేషనల్ అంతర్దృష్టి నేర్పిన పాఠం; అలాగే సాయీ గాయత్రీతో భూమి కోసం జపం – ఒక వైబ్రియానిక్స్ సమర్పణ. • స్మరణాంజలి: అంకితభావంతో సేవ చేసిన ఇద్దరు ప్రాక్టీషనర్లకు మన ఘన నివాళి.
పూర్తి వ్యాసం చదవండి