ప్రశ్నలు జవాబులు
Vol 16 సంచిక 4
జులై / ఆగష్టు 2025
Q1. పోటెంటైస్ చేసిన సూర్యకిరణాల రెమెడీని సాధారణంగా సూర్యకాంతి వల్ల వచ్చే అలెర్జీలకు ఉపయోగిస్తారు. దీనిని సూర్యకాంతికి సంబంధించిన ఇతర సమస్యలకూ ఉపయోగించవచ్చా?
A. పోటెంటైస్ చేసిన సూర్యకిరణాలను (సాధారణంగా సూర్యకాంతి అని అంటారు) చర్మ దద్దుర్లు, దురద, దద్దుర్లు (Hives), ఫోటోఅలెర్జిక్ ప్రతిచర్యల వంటి సమస్యలలో విజయవంతంగా ఉపయోగించబడింది. అదనంగా, లక్ష్యిత (Targeted) కాంబినేషన్లతో పాటు సహాయక చికిత్సగా ఇతర పరిస్థితుల్లో కూడా ఉపయోగించవచ్చు. ఉదా:
· వడదెబ్బ (Sunstroke): శరీర వ్యవస్థను స్థిరపరచడంలో సహాయపడుతుంది.
· సన్ బర్న్ (Sunburn): ప్రారంభ దశలో ఉపయోగిస్తే వాపు, మంట, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
· అకాల చర్మ వృద్ధాప్యం (Photoaging): కాలక్రమేణా చర్మాన్ని సూర్యరశ్మికి తట్టుకునేలా చేయడంలో సహాయపడవచ్చు.
· అతినీలలోహిత (UV) కిరణాల ప్రభావం: శరీర శుద్ధి (Detoxification), కణాల ఆరోగ్యానికి తోడ్పడవచ్చు.
· చర్మ క్యాన్సర్: ప్రత్యేక క్యాన్సర్ రెమెడీలతో పాటు సహాయకంగా మాత్రమే ఉపయోగించాలి.
· విటమిన్ D లోపం: ఇది సూర్యరశ్మికి ప్రత్యామ్నాయం కాదు. అయితే విటమిన్ D శరీరంలో బాగా గ్రహించబడటానికి, జీవక్రియలో ఉపయోగపడటానికి సహాయపడవచ్చు.
______________________________________________________________________________
Q2. SM1 Removal of Entities వల్ల తీవ్రమైన "పుల్అవుట్" రావచ్చా? వస్తే దాన్ని ఎలా నిలువరచాలి??
A. SM1 Removal of Entities ఒక లోతైన ఆధ్యాత్మిక రెమెడీ. చాలా అరుదుగా, ముఖ్యంగా అత్యంత సున్నితమైన వ్యక్తుల్లో లేదా లోతుగా అణచివేయబడిన భావోద్వేగాలు, మానసిక గాయాలు లేదా ప్రతికూల శక్తులు ఉన్నవారిలో, ఇది బలమైన పుల్అవుట్ కు కారణమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో, మొదట OD (రోజుకు ఒకసారి) లేదా ఒక్క మోతాదుతో ప్రారంభించి, తరువాత క్రమంగా TDS కు పెంచాలి. SM2 Divine Protectionను SM1తో పాటు ఇవ్వడం వల్ల శక్తి క్షేత్రం స్థిరపడుతుంది, రక్షణ లభిస్తుంది మరియు పుల్అవుట్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఒకవేళ పుల్అవుట్ వచ్చినట్లయితే (భావోద్వేగాలు ఎక్కువవ్వడం, శరీర నొప్పులు, అలసట మొదలైన రూపంలో) సాధారణ పుల్అవుట్ నిర్వహణ విధానాన్ని అనుసరించాలి. ఎక్కువ నీరు తాగాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ప్రార్థనలు చేయడం ఎంతో ఉపయుక్తం. ఇంకా ఒక సూచన ఏమిటంటే, SRHVP ద్వారా SM1ను బ్రాడ్కాస్ట్ చేయడం. దీని వల్ల రెమెడీ ప్రభావం మృదువుగా ప్రారంభమవుతుంది. అలాగే, రెమెడీ కలిపిన నీటిని రోగి చుట్టూ, ముఖ్యంగా గదిలోని మూలల్లో చల్లడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
______________________________________________________________________________
Q3. ఎలక్ట్రోమాగ్నెటిక్ పరికరాల నుంచి వచ్చే రేడియేషన్ వైబ్రియోనిక్స్ రెమెడీ ప్రభావాన్ని ఎలా నిర్వీర్యం చేస్తుంది?
A. విద్యుదయస్కాంత రేడియేషన్ తన స్వంత శక్తివంతమైన ఫ్రీక్వెన్సీలను విడుదల చేస్తుంది. ఒక వైబ్రియానిక్స్ రెమెడీని బలమైన లేదా ఎక్కువసేపు ఉండే విద్యుదయస్కాంత క్షేత్రంకు గురిచేసినప్పుడు, ఈ బాహ్య తరంగాలు రెమెడీలో నిక్షిప్తము చేయబడిన సూక్ష్మ లేదా సున్నితమైన తరంగాన్నీ అధిగమించవచ్చు. ఒక కేసెట్ టేప్ ను శక్తివంతమైన అయస్కాంతం దగ్గర ఉంచినప్పుడు, అందులో రికార్డు చేసిన మ్యూజిక్ చెరిగిపోవడం లేదా పాడవడం అవడం గుర్తుందా? ఇదే విధంగా, సమీపంలోని బలహీనమైన రేడియో తరంగాని శక్తివంతమైన రేడియో తరంగం పాడు చేయవచ్చు లేదా పూర్తిగా తుడిచివేయవచ్చు.
______________________________________________________________________________
Q4. వైబ్రియోనిక్స్ మాత్రను నాలుక కింద ఉంచి తీసుకోవడం, నాలుకపై ఉంచి తీసుకోవడం లేదా మింగడం మధ్య ప్రభావంలో ఏమైనా తేడా ఉందా?
A. అవును. యోగ మరియు ఆయుర్వేద సంప్రదాయాల ప్రకారం (సిద్ధ వైద్యం మరియు కొన్ని తాంత్రిక సంప్రదాయాలు సహా), నాలుక కింద భాగం అనేక నాడులు (సూక్ష్మ శక్తి మార్గాలు) కలిసే ముఖ్యమైన శక్తి కేంద్రంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా ఆ ప్రాంతం సూక్ష్మ ప్రకంపనలను స్వీకరించడానికి ప్రత్యేకంగా సున్నితంగా ఉంటుందని భావిస్తారు. నాడులు తప్పనిసరిగా నాలుక కిందే ముగియకపోయినా, ఈ ప్రాంతంలో వాటి పరస్పర అనుసంధానం శరీరమంతా ప్రాణశక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని విశ్వసిస్తారు. అందువల్ల, రెమెడీని ఏకాగ్రతతో, అవగాహనతో నాలుక కింద ఉంచి తీసుకుంటే, దాని సూక్ష్మ ప్రకంపనలు మరింత వేగంగా మరియు ప్రభావవంతంగా శరీరంలో పనిచేస్తాయని భావిస్తారు. అయితే, రెమెడీని నాలుకపై ఉంచినా, నమిలినా లేదా మింగినా అది పనిచేస్తుంది. కానీ, నాలుక కింద ఉంచి తీసుకునే విధానాన్ని శక్తిపరంగా మరింత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు.
ఆధునిక శరీర నిర్మాణ శాస్త్రం కూడా నాలుక కింద భాగం త్వరిత శోషణకు అనుకూలమని సూచిస్తుంది. ఈ ప్రాంతంలోని పలుచని శ్లేష్మ పొర కింద అనేక నరాలు మరియు సూక్ష్మ రక్తనాళాలు ఉండటం వల్ల, అక్కడ ఉంచిన కొన్ని మందులు త్వరగా రక్తప్రసరణలోకి చేరతాయి. అందుకే ఆంజైనా (Angina) ఉన్న రోగులకు నైట్రోగ్లిసరిన్ మాత్రలను నాలుక కింద ఉంచమని వైద్యులు సూచిస్తారు. దీంతో ఆ మందు వేగంగా రక్తంలో కలసి త్వరగా పనిచేస్తుంది.
______________________________________________________________________________
Q5. జీవితపు చరమ దశలో, ఆధ్యాత్మికంగా సాధనలో వున్నా వ్యక్తులు చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ కూడా ప్రశాంతంగా ఉంటారు. అలాంటి సమయంలో, బరువు తగ్గుతున్నారని ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు చికిత్స ఇవ్వాలని కోరితే, నేను ఏ రెమెడీ సూచించాలి?
A. ప్రశాంతంగా, సంతృప్తిగా ఉండి చాలా తక్కువ ఆహారం తీసుకుంటున్న వ్యక్తి సహజంగానే భౌతిక ప్రపంచం నుండి క్రమంగా వైదొలుగుతున్న ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రక్రియలో ఉండవచ్చు. అలాంటి సందర్భంలో, ఆ వ్యక్తి ఆత్మయాత్రకు సున్నితంగా తోడ్పడుతూ, భావోద్వేగ బలం, సూక్ష్మ పోషణ మరియు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని అందించడం లక్ష్యంగా ఉండాలి. ముందుగా కొద్దిసేపు నిశ్శబ్దంగా మనసును ఏకాగ్రపరచి, దైవ మార్గదర్శకత్వం కోసం ప్రార్థించిన తరువాత ఈ క్రింది రెమెడీలను TDS గా ఇవ్వవచ్చు:
108CC బాక్స్ ఉపయోగించే వారికి: CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic;
SRHVP ఉపయోగించే వారికి: రోగి అంతర్గతంగా ప్రశాంతంగా ఉంటే అంతర్గత ప్రశాంతతను మరియు సూక్ష్మ శరీర సమతుల్యతను కొనసాగించడం కొరకు NM75 Debility + NM90 Nutrition + SM2 Divine Protection + SM5 Peace & Love Alignment + SM6 Stress. రోగి మానసికంగా కలతగా, భయం లేదా అయోమయంలో ఉంటే, పై కలయికతో పాటు NM6 Calming + SM1 Removal of Entities + SM4 Stabilising + SM9 Lack of Confidence ఇస్తే ఇవి సూక్ష్మ అడ్డంకులను తొలగించడం, అనుబంధాలను సడలించడం మరియు భావోద్వేగ స్పష్టతను తీసుకురావడంలో సహాయపడతాయి.
అలాగే, రోగికి ఆధ్యాత్మికంగా సహాయం అందుతోందని కుటుంబ సభ్యులకు సున్నితంగా భరోసా ఇవ్వడం, అలాగే వారు రోగి పరిస్థితి పట్ల అతిగా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండడం ద్వారా కూడా రోగి శ్రేయస్సుకు తోడ్పడవచ్చని తెలియచేయవలెను.