Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 15 సంచిక 3
May / June 2024
అవలోకనం

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

స్వామి వారి "ప్రేమ" పై గాఢమైన సందేశాన్ని ఉటంకిస్తూ, ప్రేమతో సేవలందిస్తున్న అన్ని క్రియాశీల ప్రాక్టీషనర్లను అభినందిస్తూ, డాక్టర్ అగర్వాల్ ఐబీ ప్రయాణాన్ని స్మరించుకుంటున్నారు. ప్రాక్టీషనర్లు సమర్పిస్తున్న పేషెంట్ రికార్డ్ (రోగి నమోదు వివరాలు) నమూనాలో వచ్చిన మెరుగుదలలను, అలాగే కేస్ హిస్టరీలు (రోగి వైద్య చరిత్రలు) నాణ్యతను ప్రశంసిస్తూ, ప్రతి ఒక్కరూ తమ జ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవాలని మరియు భగవాన్ 100వ జన్మదినోత్సవం సందర్భంగా మన వైబ్రియోనిక్స్ సేవను మరింత సమృద్ధిగా చేసి, భగవంతునికి సమర్పణగా తమ విలువైన సూచనలు అందించాలని పిలుపునిస్తున్నారు

పూర్తి వ్యాసం చదవండి

దృష్టాంత చరిత్రలు

ఈ సంచికలో 12 ఆసక్తికరమైన కేసులు పంచుకోబడ్డాయి: రెస్పిరేటరీ అలర్జీ (శ్వాసకోశ అలర్జీ), మోకాలి నొప్పి, మెన్సెస్ పెయిన్ & అలసట, వెన్నునొప్పి, ఆసిడ్ రిఫ్లక్స్, మానసిక వేదన, భయం, తీవ్రమైన కాలి నొప్పి, కళ్ల పొడిబారడం, చీము స్రావం, సోరియాసిస్, కనురెప్పలు వాలిపోవడం, స్కిన్ అలర్జీ, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, మైగ్రేన్ & అసిడిటీ, నిరంతర దగ్గు, డిప్రెషన్, తలనొప్పి, అసిడిటీ & ఇన్సోమ్నియా

దృష్టాంతములు చదవండి

సాధకుని వివరములు

ఈ సంచికలో, చిన్ననాటి నుంచే స్వామి సన్నిధిలో పెరిగిన, అత్యంత అర్హత కలిగిన మరియు ఉత్సాహభరితమైన ఇద్దరు ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. వారు తమ హృదయాన్ని హత్తుకునే అనుభవాలను (కేసులు) మరియు అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన తమకు ఇష్టమైన కాంబోలు గురించి వివరాలు పంచుకుంటున్నారు.

సాధకుని వివరములు చదవండి

ప్రశ్నలు జవాబులు

ఈ సంచికలో మీరు ఈ క్రింది అంశాల గురించి తెలుసుకోవచ్చు: యాంటీబయాటిక్స్ కు ప్రత్యామ్నాయంగా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కోసం ఉపయోగించే వైబ్రియోనిక్స్ రెమెడీ ఏమిటి? వాటర్ రెమెడీని ఫ్రిజ్ లో ఎందుకు నిల్వ చేయకూడదు? మన శరీరంలోని ఏ స్థాయిలో వైబ్రియోనిక్స్ మాత్రలు వాస్తవంగా పనిచేస్తాయి? ఒక యెస్విపి తన వ్యక్తిగత యెస్ ఆర్ హెచ్ వి పి కార్డ్ను స్వయంగా తయారు చేసుకోగలడా? అలాగే హోమియోపతి రెమెడీ లేదా ఏదైనా సహజ పదార్థం లేదా మొక్కకు సంబంధించిన పదార్థం యొక్క వైబ్రేషన్ ను ఎలా తయారు చేయవచ్చు? శారీరక వ్యాధులు తగ్గిపోయిన తర్వాత, తన మానసిక మరియు ఎమోషనల్ భావోద్వేగ స్థితులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోగి అదనంగా ఏమి చేయవచ్చు?

పూర్తి వ్యాసం చదవండి

దివ్య వైద్యుని దివ్య వాణి

సంపూర్ణ ఆరోగ్యం యొక్క రహస్యం ఏమిటి? బాధల నుండి విముక్తి పొందే విధంగా సేవ ఎలా చేయాలి? అనే విషయాలను స్వామి ప్రేమపూర్వకంగా మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు

పూర్తి వ్యాసం చదవండి

ప్రకటనలు

భారతదేశంలోని పుట్టపర్తిలో జరగబోయే వర్క్‌షాప్స్ (శిక్షణా శిబిరాలు).

పూర్తి వ్యాసం చదవండి

అదనంగా

"హెల్తీ గట్ హెల్తీ లైఫ్ (ఆరోగ్యకరమైన పేగులు – ఆరోగ్యకరమైన జీవితం)" అనే ఆరోగ్య వ్యాసంలో ఆరోగ్యకరమైన గట్ (పేగులు) యొక్క ప్రాముఖ్యత, మైక్రోబ్స్ (సూక్ష్మజీవులు) మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయో, పేగులలోని ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అంశాలు, అన్‌హెల్తీ గట్ మైక్రోబయోమ్ (అనారోగ్యకరమైన పేగుల సూక్ష్మజీవ సముదాయం) పెరగడానికి కారణాలు, పేగులలో బ్యాక్టీరియా అసమతుల్యత వల్ల కలిగే లక్షణాలు, అలాగే మంచి గట్ బ్యాక్టీరియాను పెంచడం, సంరక్షించడం మరియు పునరుద్ధరించడం కోసం ఉపయోగకరమైన సూచనలు వివరించబడ్డాయి. అదనంగా, రెండు ఎవిపి వర్క్‌షాప్స్ గురించి వివరాలు ఉన్నాయి—ఒకటి ఉరుగ్వేలో స్పానిష్ భాషలో, మరొకటి భారతదేశంలోని పుట్టపర్తిలో నిర్వహించబడింది. అలాగే యూకే లో జరిగిన ఆన్‌లైన్ సదస్సు, ఏపీ లో ప్రారంభమైన వైబ్రియోనిక్స్ వెల్‌నెస్ సెంటర్ గురించి, అలాగే లండన్‌కు చెందిన తొలి ప్రాక్టీషనర్లలో ఒకరైన దివంగత ఆత్మకు అర్పించిన మన నివాళి గురించి కూడా వివరాలు ఉన్నాయి.

పూర్తి వ్యాసం చదవండి