Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 15 సంచిక 3
May / June 2024
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరూ ఈ సంవత్సరం స్వామి వారి ఆరాధనా దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో మన ప్రియమైన స్వామి తన భౌతిక దేహాన్ని విడిచిన తరుణంలో వారి జీవితం ద్వారా ప్రతిబింబించిన ప్రేమ సందేశాన్ని స్మరించుకొనే సమయం ఇది

“ప్రేమయే భగవంతుడు, భగవంతుడే ప్రేమ, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు ఖచ్చితంగా కనిపిస్తాడు, ఎక్కువ మంది వ్యక్తులను ప్రేమించండి, వారిని మరింత గాఢంగా ప్రేమించండి,  ప్రేమను సేవగా మార్చండి, సేవను ఆరాధనగా మార్చండి, అదే అత్యున్నత సాధన. ప్రేమ అనే జ్యోతి లేకుండా జీవిస్తున్న ప్రాణి ఏదీ ఉండదు. ఆఖరికి పిచ్చివాడు కూడా ఎవరో ఒక వ్యక్తినో లేదా వస్తువునో గాఢంగా ప్రేమిస్తాడు. మీ హృదయంలో ప్రేమ అనే చలమ లేకుండా ప్రేమను పంచాలనే స్పృహ మీలో ఉదయించదు. మీరు ఎవరికైతే ఈ ప్రేమను విస్తరింప చేసారో వారి నుండి ప్రతిఫలంగా ఏదీ ఆశించకండి. ఇతరులను దేవుని అంశగా భావించి ఆరాధించండి. అలాగే మీకు మీరే దేవుని ఆసనంగా భావించి మిమ్మల్ని మీరే ప్రేమించుకోండి. మీ హృయద పీఠముపై భగవంతుడు ఆసీనుడయ్యేలా పవిత్రంగా ఉంచండి”. ... శ్రీ సత్య సాయి బాబా, 1965 మార్చి(Sri Sathya Sai Speaks, Vol 5)

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లుగా మనం సాయిని మన హృదయాలలో ప్రతిస్టించుకుని మన చేతులను సేవలో నిమగ్నం చేస్తున్నామనడానికి లభిస్తున్న ఆశాజనకమైన అప్డేట్లే దీనికి నిదర్శనం. అటువంటి అంకితభావం మరియు శ్రద్ధ గల బృందంలో భాగమైనందుకు నేను కృతజ్ఞుడను! 113 మంది భారతీయ ప్రాక్టీషనర్ల కృషి మరియు నిస్వార్ధ సేవ కారణంగా మనము ఇప్పుడు 12 రాష్ట్రాల్లో 100 వేరువేరు వేదికలలో క్రమం తప్పకుండా శిబిరాలను నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకు 16224 మంది రోగులు సుమారు 500 శిబిరాల్లో చికిత్స పొందారు. త్వరలో ఇతర రాష్ట్రాలలో కూడా ఈ సేవా కార్యకలాపాలను విస్తరించాలని మేము ఆశిస్తున్నాము. 

సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం మన IB ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పటివరకు దానిని నాలుగు సార్లు అప్డేట్ చేసిన తర్వాత 2024 జనవరి లో ఒక మిలియన్ మార్కు దాటాము. గత నెల చివరి నాటికి అధికారిక లబ్ధిదారుల సంఖ్య 1,033,011.

ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయుల10375 &11422 నేతృత్వంలో మన శిక్షణా విభాగం గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా అభివృద్ధి చెందింది. వారు కోర్సు నిర్మాణము, వర్క్ షాపులు, ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ రెండింటిలో మరియు బోధనా పద్ధతులకు గణనీయమైన మెరుగుదలలు చేసారు. ఈ నిష్ణాతులైన మరియు అంకితభావం గల ఉపాధ్యాయుల ఘనత, వారి నిరంతర మద్దతు, మరియు ప్రోత్సాహం కారణంగా ఇటీవల మేము SVIRT లో అధునాతన కోర్సులు చేర్చడం గురించి ప్రాక్టీషనర్ల నుండి కొన్ని విచారణలు స్వీకరించాము. అర్హత ప్రమాణాలు మరియు ఇతర వివరాలు తదుపరి సంచికలో తెలియజేయబడతాయి.

ఇటీవల నేను కొన్ని వర్క్ షాప్ లలో కొన్ని అంశాలకు హాజరయ్యే అవకాశం లభించింది. మన బోధనా పద్ధతులు అసాధారణమైన మార్పుకు గురయ్యాయని గమనించి నేను ఎంతో ఆనందించాను. ప్రాక్టీషనర్లు అందరూ తమ అభ్యాసాన్ని మెరుగుపరచుకోవడానికి తదుపరి కోర్సులు మరియు వర్క్ షాప్ లకు హాజరుకావాలని నేను గట్టిగా సిఫారసు చేస్తున్నాను. ఇది నూతన పరిణామాలతో మిమ్మల్ని అధునాతనంగా ఉంచుతుంది మరియు విషయం గురించి మరింత లోతైన జ్ఞానాన్ని పొందడంలో మీకు సహాయపడుతుంది.   

కొత్త ప్రాక్టీషనర్లు నవీనీకరించబడిన పేషెంట్ రికార్డు ఫార్మేట్ (ఒక ఔత్సాహిక ప్రాక్టీషనర్11646 పట్టిక రూపంలో రూపొందించినది) సంక్షిప్తంగా ఉన్నా సంబంధిత పూర్తి సమాచారాన్ని కలిగి ఉన్న కేసు చరిత్రను అందించగలుగుతారు. అప్డేట్ చేసిన ఈ విజయవంతమైన ఫార్మేట్ ను కేస్ హిస్టరీల విషయంలో ముందుకు సాగే ప్రాక్టీషనర్లు అందరూ ఇకనుండి మీ పేషెంట్ రికార్డుల కోసం ఉపయోగించేందుకు ముందుకు రావలసిందిగా ప్రోత్సహిస్తున్నాము. ఇది మీకు మాత్రమే కాకుండా కేసు హిస్టరీ టీం కి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మన ప్రాక్టీషనర్ల సైట్ లో కేసు చరిత్రను రాయడానికి మార్గదర్శకములతో పాటు ఈ ఫార్మెట్ ను కనుగొనవచ్చు(ఫార్మ్స్ అనే దానిపై క్లిక్ చేసి ఆపై ఎడమవైపు డౌన్లోడ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఫైల్ పేర్లు అన్నీ కూడా స్వీయ వివరణాత్మకమైనవి).     

మన ప్రియమైన స్వామి 100వ జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి సామూహిక సమర్పణల కోసం ఇప్పటికే సూచనలను  పంపిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే క్యాంపులు గురించిన సమాచారంతో అనేక ఈమెయిల్ లను అందుకున్నాము. అసాధారణమైన కేసు చరిత్రలు మరియు వైబ్రియానిక్స్ తో అసాధారణ అనుభవాల గురించిన రాత పూర్వక సమాచారం మరియు అనేకమంది ప్రాక్టీషనర్లు వారి కథనాలను త్వరలో పంపుతామని సూచించిన వాగ్దానములు కూడా అందుకున్నాము. ఇంకా అలా చేయని వారు ఎవరైనా ఉంటే వారందరినీ ఇప్పుడే మీ రచనలపై పని ప్రారంభించమని ప్రోత్సహించదలిచాను. మీ సమర్పణలను రాయడంలో మీకు సహాయం లేదా మద్దతు అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. దయచేసి కేసు చరిత్రల కోసం [email protected] మరియు అనుభవాల కోసం [email protected] ను సంప్రదించండి.

ఈశ్వరమ్మడే కి సమీపంలో ఉన్నందున స్వామి వారి మాతృశ్రీ జీవితాన్నిఅవలోకిద్దాం. నిస్వార్థ దయ మరియు కరుణ తోకూడిన  ఈ ఉద్ధరింపబడిన ఆత్మ మూడు కోరికలు మాత్రమే కలిగి ఉన్నది. వాటిలో ఏదీ తన కోసం కాదు. పుట్టపర్తికి ప్రాథమిక వైద్య సదుపాయాలకోసం ఒక చిన్నవైద్య శాల, ఒక పాఠశాల మరియు నిత్యం నీటి వసతి కల్పించేందుకు ఒక వనరు ఇవ్వాలని ఆమె స్వామి వారిని కోరారు. మనందరికీ తెలిసినట్లు ఇవే అనంతరం శ్రీ సత్యసాయి విద్యాసంస్థలు, శ్రీ సత్యసాయి జనరల్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ అనే భారీ సంస్థలుగా వికసించాయి. అట్టి మహోన్నతమైన అమ్మవారి గ్రంధం నుండి ఒక పత్రాన్ని తీసుకొని మనం మన స్వార్ధ కోరికల కంటే సమాజ అవసరాలనే దృష్టిలో ఉంచుకొని స్వామివారు అందించిన ఈ అద్భుతమైన వైద్య విధానంతో మన శక్తి మేరకు సమాజానికి సేవ చేసేందుకు మనందరం కృషి చేద్దాం.

స్వామికి ప్రీతికరమైన సేవలో

జిత్ కె అగర్వాల్  

శ్వాశ కోశ ఎలెర్జీ, మోకాలి నొప్పి, ఋతు నొప్పి, & అలసట 11648...India

BMI (బాడీ మాస్ ఇండెక్స్) 33 గా ఉన్న 37 ఏళ్ల వయసు గల మహిళకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. 1998లో ఆమె రజస్వల ఐనప్పటినుండి ఆమె మూడు రోజుల బహిష్టు సమయంలో ప్రతీనెలా పొత్తికడుపు మరియు రొమ్ములలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ ఉన్నారు. హోమియోపతిక్ మాత్రలు ఉపశమనాన్ని అందించినప్పటికీ ఒక మోతాదు తీసుకోక పోయినట్లయితే తీవ్రమైన నొప్పి తిరిగి వచ్చేది.

2013లో ఆమె తండ్రి మరణించిన వెంటనే ఆమె దగ్గు, జ్వరం, బలహీనత, మరియు గొంతులో కపంతో బాధపడేవారు. జ్వరం తగ్గి పోయి దగ్గు 2 నుండి 3 మూడు నెలల్లో తగ్గింది కానీ కఫం మాత్రం కొనసాగింది. 2014 ఏప్రిల్ నుండి ఆమెకు ఎడమ కన్ను మరియు ఎడమ నాసికా రంద్రం నుండి నీరు కారడం, స్వల్పంగా తలనొప్పి, నాసికలో అవరోధం వలన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ప్రారంభమైంది. ఈ విధంగా 4 నుండి 5 రోజులు పాటు మందులు వాడడంతో తగ్గిపోతూ నెలకు మూడు సార్లు పునరావృతం అవుతూ ఉండేవి. తరచుగా వరుసగా రెండు రోజులు తలస్నానం చేయడం ద్వారా ప్రేరేపింపబడేవి. ఆమె హోమియోపతి నివారణలు తీసుకుంటున్నారు కానీ ఉపశమనం లభించనప్పుడు అల్లోపతి వైపు మొగ్గుచూపుతూ ఉండేవారు.

2020 జులై లో కోవిడ్ పాజిటివ్ గా పరీక్షింపబడి హై డోస్ స్టెరాయిడ్లతో చికిత్స పొందారు, ఫలితంగా ఆమె నిరంతరం అలసిపోతూ ఉండేవారు. 2021 డిసెంబర్ నుంచి ఆమె రోజుకు 3 నుండి 4 సార్లు విరోచనానికి వెళ్లాలనిపిస్తూ ఉండడంతో కోవిడ్ వ్యాక్సిన్ యొక్క రెండవ డోస్ దీనికి కారణమని భావించారు.

2022 సెప్టెంబర్ లో బైక్ పై నుండి పడిపోకుండా తనను తాను నిరోధించుకొనే ప్రయత్నంలో ఆమె ఎడమ పాదం బెణికింది కానీ చివరికి అది నయమైంది. అయితే ఆమె ఎడమ మోకాలు మరియు చీలమండలో నొప్పి మరియు వాపు ఏర్పడి అక్టోబర్ చివరి నాటికి పరిస్థితి మరింత దిగజారింది. మూడు రోజులకు ఒకసారి నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆమె సూచింపబడిన నొప్పి నివారణ మందులతో పాటు కాల్షియం మాత్రలు మరియు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకుంటూ ఉండేవారు. ఈ విధంగా మందులు మరియు తగినంత విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ ఆమె చలన శీలత గణనీయంగా తగ్గింది. రోజుకు నాలుగు కిలోమీటర్లు నడిచే మునుపటి సామర్థ్యానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు తన కార్యాలయంలో కూడా స్వేచ్ఛగా నడవలేక పోయేవారు.   

శాశ్వత పరిష్కారం కోసం నిరాశతో ఆమె ప్రాక్టీషనరును సంప్రదించి శ్వాశ సంబంధిత సమస్యలు తనను ఎక్కువగా బాధిస్తున్నాయని, అలాగే మోకాలు మరియు ఋతుక్రమమునొప్పి కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. సంప్రదింపుల సమయంలో ఆమె ఎర్రటి ముఖం మరియు పేలవమైన స్వరంతోపాటు ఆమె అన్ని ఎలర్జీ లక్షణాలను తెలిపారు. ఆమె అన్ని మందులు నిలిపివేశారు, 2022 డిసెంబర్ 12 ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:

శ్వాశ కోశ ఎలర్జీ కి:

#1. CC9.2 Infections acute + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies…6TD ఒక వారం వరకూ అనంతరం TDS

మోకాలి నొప్పికి :

#2. CC18.5 Neuralgia + CC20.2 SMJ pain…TDS నువ్వుల నూనెలో బాహ్య అనువర్తనం కోసం.

ఋతు నొప్పికి  : 

#3. CC8.7 Menses frequent…TDS ఋతు కాలములో 3 రోజుల ముందు ప్రారంభించి కొనసాగించడానికి

డిసెంబర్ 18న ఒక వారంలోనే ఆమె ఎలర్జీ లక్షణాలలో 25% ఉపశమనం పొందారు. బాహ్య అనువర్తన కోసం ఇచ్చిన నూనె రాయడం వలన నొప్పుల నుండి తక్షణ ఉపశమనం లభిస్తోంది కానీ కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటోంది కనుక #2 ఈ విధంగా మెరుగుపరచబడి డిసెంబర్ 20న ఇది మౌఖికంగా ఇవ్వబడింది

#4. CC10.1 Emergencies + #2…TDS 

2023 జనవరి 5న రెండు వారాల తర్వాత 2022 డిసెంబర్ లో మొదటిసారిగా తనకు నొప్పిలేని ఋతుక్రమం వచ్చిందని అంతేకాక అదనంగా మోకాళ్ళ నొప్పులలో 40% మరియు శ్వాశకోశ లక్షణాల్లో 60% మెరుగుదల ఉందని ఉత్సాహంగా తెలియజేశారు.  

2023 జనవరి 30న అలసట మాయమైందని మరియు అన్ని ఇతర లక్షణాలలో దాదాపు 75% మెరుగుదల ఉందని ఆమె ఆనందంగా తెలియజేశారు. ఫిబ్రవరి 26 నాటికి ఆమె చాలా రోజులుగా తల స్నానం చేస్తున్నప్పటికీ శ్వాసకోశ లక్షణాలలో 100% మెరుగుదల ఉన్నట్లు తెలిపారు; #1 OD కి తగ్గించబడింది. ఆమె కుటుంబంలో అత్యవసర పరిస్థితుల కారణంగా తదుపరి ఫాలో అప్ కోసం రావడం సాధ్యం కాలేదు.

జూన్ 14 వరకు శ్వాసకోశ లక్షణాలు లేదా ఋతుక్రమ నొప్పి పునరావృతం కాలేదని తెలియజేశారు. తరుచుగా మలవిసర్జనకు వెళ్లాలనే ఆలోచన మరియు మోకాలి నొప్పులు మాయమయ్యాయి. ఐతే అధిక వత్తిడికి గురిఐన సమయంలో ఏర్పడిన స్వల్ప మోకాళ్ళ నొప్పి విశ్రాంతితో పరిష్కరించబడుతున్నది. ఆమె రోజువారి 4 కిలోమీటర్ల నడకను తిరిగి ప్రారంభించారు. #4 OD కి తగ్గించ బడింది. #3 ను అవసరం మేరకు SOS గా తీసుకోవడానికి సూచించ బడింది.

ఈ సమయంలో ఆమె 2014 ఏప్రిల్ లో గుర్తించిన హైపో థైరాయిడిజమ్ ఏర్పడిన ఆహారము పై కోరికల విషయంలో 30% మెరుగుదలను కూడా వెల్లడించారు ఇది ఊహించని బోనస్.

2023 జూన్ 24 నాటికి #1 మరియు #4 క్రమంగా తగ్గించి ఆపివేయ బడ్డాయి, వీటితో పాటు #2 కూడా డిసెంబర్ 4 న ఆపివేయ బడింది.

2024 ఏప్రిల్ నాటికి ఆమె అన్ని రోగ లక్షణాల నుండి విముక్తి పొందారు. ఇటీవలే హైపో థైరాయిడిజం మరియు అధిక బరువు కోసం రెమిడీలు తీసుకోవడం ప్రారంభించారు.

వెన్ను నొప్పి 11648...India

44 ఏళ్ల వ్యక్తి 2022 అక్టోబర్ నుండి సంవత్సర కాలముగా నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అతను పనిచేయడానికి మోటార్ సైకిల్ పై రోజూ 50 కి.మీ ప్రయాణం చేయడం నొప్పి కి కారణం అని భావించారు. ప్రారంభంలో విశ్రాంతి మరియు నొప్పి నివారణ స్ప్రే తో తగ్గించుకున్నప్పటికీ 2023 లో అతను ఎత్తుగానూ మరియు ఇరుకైన సీటుతో ఉన్న కొత్త మోటర్ సైకిల్ ను ఉపయోగించడం ప్రారంభించినప్పటినుండీ అతని పరిస్థితి మరింత దిగజారింది. నొప్పి పగలు క్రమంగా పెరుగుతూ సాయంత్రానికి  తీవ్రమయ్యేది. తన నాలుగు కిలోమీటర్ల రోజువారీ నడకను బలవంతంగా ఆపివేయడమే కాకుండా తన కుటుంబంతో కొంత సమయాన్ని ఆస్వాదించడం కూడా అతనికి కష్టం అనిపించింది. హీట్ ప్యాడ్ ఉపయోగించడం మరియు రాత్రిపూట తగినంత విశ్రాంతి తీసుకోవడం అతనికి తాత్కాలిక ఉపశమనం కలిగించేవి. సెప్టెంబర్ ప్రారంభంలో నొప్పి భరించ లేనివిధంగా వచ్చినప్పుడు అతను వైద్యుడిని సంప్రదించగా MRI స్కానింగ్ మరియు నొప్పిని తగ్గించే మౌఖిక ఔషధాలను సూచించారు. అయినప్పటికీ వైద్యుడైన తన స్నేహితుడి సలహా అనుసరించి వెంటనే MRI చేయించు కోకుండా దూరంగా ఉండి తీవ్రనొప్పి కలిగినప్పుడు అల్ట్రాసెట్ Ultracet (ఇది ఓపియాడ్ ను కలిగి ఉంటుంది.) మాత్ర తీసుకునేవారు. ఇది అతనికి రెండు గంటలు ఉపశమనం కలిగించేది కానీ తప్పించుకోలేని మోటార్ సైకిల్ రైడ్ తర్వాత నొప్పి వెంటనే తిరిగి వచ్చేది. 2023 అక్టోబర్ 20 తేదీన అతను ప్రాక్టీషనర్ ని సంప్రదించారు                                                                                                                         CC10.1 Emergencies + CC20.5 Spine…TDS నువ్వుల నూనెలో బాహ్య అనువర్తనం కోసం …BD 

అతను పని వత్తిడి కారణంగా BD గా మాత్రమే రెమిడీ తీసుకున్నప్పటికీ కేవలం మూడు రోజుల్లో నొప్పి నుండి 20% ఉపశమనం లభించింది. నవంబర్ 3 నాటికి 50% మెరుగుదల కలిగింది. అంతేకాక అతను విశాలంగా మరియు క్రిందికి సౌకర్యవంతంగా సీటు ఉన్నటువంటి మోటార్ సైకిల్ కి మారారు. నవంబర్ 30న అతను 80% ఉపశమనం ఉన్నట్లు ఆనందంగా తెలియజేశారు. సాయంత్రం పది నిమిషాలు విశ్రాంతి తర్వాత తన కుటుంబం సభ్యులతో విశ్రాంతిని మరియు ఆనందాన్ని పొందుతున్నారు. చికిత్స ప్రారంభించినప్పటి నుండి తనికి నొప్పి నివారణ మందులు లేదా హీట్ ప్యాడ్ అవసరం రాలేదు.

డిసెంబర్ 28 నుండి అతని ఒక వారం పాటు నొప్పికి రెమిడీ తీసుకోలేకపోవడంతో నొప్పి పునరావృతం అయ్యింది. 2024 జనవరి 4న రెమిడీ తిరిగి ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత అతను 80% ఉపశమనం పొందారు. ఫిబ్రవరి 16 నాటికి 100% ఉపశమనం కలగడంతో  మోతాదు OD కి తగ్గించబడినది మరియు బాహ్య అనువర్తనం నిలిపివేయబడినది. అతని ఇప్పుడు తన రోజువారి నడకలను మరియు మోటార్ సైకిల్ పై ప్రయాణాలను నొప్పి లేకుండా తిరిగి ప్రారంభించారు.

2024 ఏప్రిల్ 3వ తేదీ నాటికి నొప్పి పునరావృతం కాలేదు కానీ అతను తన సౌకర్యం కోసం OD లో కొనసాగుతున్నారు. అతను ఈ చికిత్సతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తన బంధువుల కోసం కూడా ఈ రెమిడీలను తీసుకుంటున్నారు. 

రోగి యొక్క వాంగ్మూలము (స్పష్టత కోసం కొంచెం పారా ఫ్రేజ్ చేయబడింది):  

నా వెన్ను నొప్పికి ప్రాక్టీషనర్ ను సంప్రదించడాన్ని నేను వాయిదా వేస్తూ వచ్చాను కానీ రెమిడి ప్రారంభించిన తర్వాత మాత్రమే నేను ఇంతకుముందే రెమిడీ తీసుకున్నట్లయితే ఇంత బాధ పడే వాడిని కాదు అని గ్రహించాను. తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు  తీసుకున్న ఈ రెమెడీలు అద్భుతంగా పనిచేసాయి. నేను వీటిని ఎంతో గౌరవ ప్రదంగా భావించడమే కాకుండా ఇతరులకు కూడా గట్టిగా సిఫారసు చేస్తున్నాను. నా స్నేహితులను కూడా ప్రాక్టీషనర్లుగా తయారుకమ్మని ప్రోత్సహిస్తున్నాను. 

యాసిడ్ రిఫ్లక్స్ 11645...India

80 ఏళ్ల మహిళ 2018 మే నుండి గత 5 ఏళ్లుగా భోజనం చేసిన ప్రతీసారీ పుల్లని రుచితో తేనుపు రావడం ఆమె అన్నవాహికలో మంటను కలిగించే తీవ్రమైన ఆమ్లత్వము తో బాధపడుతూ ఉన్నారు. వీటి ఫలితంగా మైకము కమ్మినట్లు ఉండడంతో ఆహారం తీసుకోవడం మరియు చలన శీలత పరిమితం చేయబడి ఆమెను మంచాన పడేలా చేసి ప్రాథమిక అవసరాలకు కూడా ఇతరులపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది.  

ప్రారంభంలో సూచించబడిన యాంటాసిడ్లు తీసుకొని తాత్కాలిక ఉపశమనం పొందారు కానీ లక్షణాలు మరింత తీవ్రము కావడంతో  డాక్టర్ ఆమె పరిస్థితి యాసిడ్ రిఫ్లక్స్ గా నిర్ధారించారు. లక్షణాలు తీవ్రంగా మారడంతో 2018 జూన్ లో హోమియోపతి రెమిడీలకు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ అవి దాదాపు 30% ఉపశమనం మాత్రమే అందించాయి. వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తర్వాత 2023 మే 10వ తేదీన ఆమె కుమారుడు ప్రాక్టీషనర్ ను సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది: 

CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS 

మషాలా ఆహారాన్ని నివారించాలని, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని స్వీకరించాలని, మరియు నెమ్మదిగా నీటిని రోజుకు 2 నుండి 3 లీటర్లకు పెంచాలని ప్రాక్టీషనర్ పేషెంట్ కు సూచించారు. ఆమె అన్ని ఇతర మందులు నిలిపివేశారు

మే 18న ఒక వారం లోపు పేషెంట్ లక్షణాలన్నింటిలో 75% ఉపశమనం కలిగిందని ఆమె కుమారుడు ఆనందంగా తెలిపారు. జూలై 20 నాటికి ఆమె రోగ లక్షణరహితంగా మారి సాధారణంగానే ఆహారం తీసుకుంటూ ఎవరి సహాయం లేకుండా రోజువారి పనులు చేసుకుంటున్నారు. మోతాదు ఒక నెలకు  BD కి తగ్గిపోయింది, ఇది క్రమంగా మరింత తగ్గి ప్రస్తుతం OD గా కొనసాగుతోంది. 2024 మార్చి నాటికి ఆమె ఆహారాన్ని మాములుగానే ఆస్వాదిస్తూ బాగానే ఉన్నారు.   

పేషెంటు కుమారుని వాంగ్మూలము:

“మా అమ్మ ఐదు సంవత్సరాలకు పైగా తీవ్రమైన ఆమ్లత్వము మరియు తత్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అల్లోపతి లేదా హోమియోపతి మందులతో సమస్య మెరుగుపడలేదు. వైబ్రియానిక్స్ రెమిడి తీసుకున్న తర్వాత మొదట్లోనే అన్ని సమస్యలు తగ్గాయి ఇప్పుడు ఆమె సాధారణమైన స్థితిలో జీవిస్తున్నారు, మా తల్లికి సహాయం చేసినందుకు స్వామికి మరియు ప్రాక్టీషనర్ కు ధన్యవాదాలు.”

పొడికళ్ళు, చీము ఉత్సర్గము 11645...India

40 ఏళ్ల మహిళ కోవిడ్ 19 నుండి కోలుకున్న రెండు నెలల తర్వాత పొడి కళ్ళు, ఎరుపుదనంతో కూడి గరగర లాడడం, దురద మరియు తెల్లటి చీము స్రవించడం వంటి సమస్యలతో 2020 జూన్ నుండి బాధపడుతున్నారు. ఐతే ఈ లక్షణాలను 2021 ఫిబ్రవరిలో ఆమె పరిస్థితి క్షీణించే వరకూ ఉపేక్షించారు. కోవిడ్ అనంతర ప్రభావాలు కారణమని కంటి వైద్య నిపుణుడు తెలిపి స్టెరాయిడ్ కంటి చుక్కలు సూచించారు. ఇది దురద మరియు చీమ ఉత్సర్గము నుండి 50% ఉపశమనాన్ని అందించింది కానీ ఆమె కంటిచుక్కలు ఉపయోగించడం ఆపివేస్తే లక్షణాలు తిరిగి రాసాగాయి. తన ఉద్యోగ రీత్యా రోజూ ఆరు గంటల పాటు కంప్యూటర్ తో పని చేయడం వల్ల ఏర్పడిన ఈ స్థితి ఆమె వ్యక్తిగత జీవితాన్ని అలాగే కెరీయర్ ని కూడా ప్రభావితం చేసింది.

2002 డిసెంబర్ 10 ఆమె ఎర్రటి మరియు చీమతో నిండిన కళ్ళతో ప్రాక్టీషనర్ ను సందర్శించగా వారికి క్రింది రెమిడీ ఇవ్వబడింది: 

CC7.3 Eye infections…TDS శ్వేద జలం లో కంటి చుక్కలు వలె ఉపయోగించ డానికి 

ఆమె అల్లోపతి చికిత్స వెంటనే ఆపివేశారు. ఒకటవ నెలలో ఎటువంటి మార్పు లేదు కానీ ప్రాక్టీషనర్ విశ్వాసం మరియు సలహాలు ద్వారా ప్రేరణ పొంది మరో రెండు నెలల పాటు రెమిడి కొనసాగించారు. మార్చి 10 తేదీన ఆమె రెండు కళ్ళల్లో చీము 25% తగ్గిందని కానీ ఇతర మార్పులు ఏమీ లేవని తెలిపారు. ఏప్రిల్ 11 నాటికి రోగికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తూ చీము ఉత్సర్గంలో 90% మరియు ఇతర లక్షణాలు 50% తగ్గాయి. మరో రెండు నెలల తర్వాత జూన్ 15న అన్ని లక్షణాల నుండి 100% ఉపశమనం పొందానని తన లాప్టాప్ లో హాయిగా పనిచేసుకోగలుగుతున్నారు అని ఉత్సాహంగా తెలిపారు. మోతాదు OD కి తగ్గించబడింది. మరో నెల తర్వాత నోటి నివారణ ఆపివేయబడింది. రోగి నిర్వహణ కోసం OD వద్ద కంటి చుక్కలు కొనసాగిస్తున్నారు, ఆమెకు IB కూడా OD గా ఇవ్వబడింది.

2024 మార్చినాటికి ఆమె రోగ లక్షణ రహితంగా ఉన్నారు.

సంపాదకుని వ్యాఖ్య: నేత్రవైద్యుని రోగనిర్ధారణ ద్వారా వచ్చిన సూచనలు అనుసరించి ప్రాక్టీషనర్ వేగవంతమైన ఉపశమనం కోసం కోవిడ్ రీ కూపరేషన్ కాంబోను అందించి ఉంటే బాగుండేది. 

మానసిక వేదన, భయము, తీవ్రమైన కాళి నొప్పి 11645...India

2012లో భర్త మరణించిన తర్వాత ఒంటరిగా జీవిస్తున్న 76 ఏళ్ల మహిళ నిరాశ, భయము మరియు మానసిక వేదన తో పాటు ఆందోళన తో బాధపడుతున్నారు. తరచూ ఆలయాలను, బంధువులను సందర్శించడం క్రమం తప్పకుండా తన కారు నడపడం ద్వారా ఆమె ఓదార్పును పొందుతున్నారు. 2019 లో తీవ్రమైన కుడికాలు నొప్పి కారణంగా ఆమె దిన చర్యకు ప్రత్యేకించి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీవ్రంగా అంతరాయం కలిగింది, కాలక్రమణా నొప్పి తీవ్రమైంది. ఇది ఆమె బాధను మరింత పెంచి ఆమె నిద్రకు కూడా భంగం వాటిల్లి ఆమె మానసిక రుగ్మతలను మరింత తీవ్రతరం చేసింది. అధిక ఒత్తిడి సమయంలో ఆమె రెండు కాళ్ళలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ ఫలితంగా నిద్రలేని రాత్రులు ఏర్పడ్డాయి. నొప్పి నివారణ మందులు మరియు విటమిన్లతో కూడిన అల్లోపతి మందులు నాలుగు సంవత్సరాలుగా తీసుకున్నప్పటికీ ఆమె పరిస్థితి అలాగే కొనసాగి జీవితాన్ని ఒక సవాలుగా మార్చింది. ఉపశమనం కోసం నిరాశగా ఎదురు చూస్తున్న సందర్భంలో వైబ్రియానిక్స్ ద్వారా నొప్పిని తగ్గించుకోవడమే కాక మానసిక స్థితిని కూడా మెరుగుపడుతుందని ఆమె బంధువు ఆమెకు తెలియజేసినప్పుడు ఆమె ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే 2023 ఏప్రిల్ 8వ ప్రాక్టీషనర్ ను సంప్రదించగా వారు క్రింది రెమిడీ ఇచ్చారు:

CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.4 Muscle & Supportive tissue + CC20.5 Spine…TDS

రెమిడీ తీసుకున్న ఒక నెలలోనే చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతతతో సంతోషంగా ఉన్నట్లు అనుభూతి పొందారు. డ్రైవింగ్ చేసే సమయంలో మరియు రాత్రులలో కండరాల నొప్పిలో 90% మెరుగుదల ఉంది. తద్వారా ఆమె నిద్ర కూడా మెరుగుపడింది. నొప్పి రెమిడి తీసుకోవాల్సిన అవసరం ఆమెకు కలుగలేదు. జూన్ 10న మరో నెల తర్వాత భయం మరియు వేదన యొక్క ఆలోచనలు పోయి తాను ప్రశాంతంగా ఉన్నానని మరియు ఒత్తిడికి గురైనప్పటికీ నొప్పి యొక్క జాడ కనిపించలేదని అంత సంతోషంగా తెలియజేశారు. ఆగష్టు 25న రెమిడీ ఆపివేయడానికి ముందు మోతాదు ఒక నెల BD కి ఆ తర్వాత OD కి తగ్గించబడింది. ప్రాథమికముగా చికిత్స లేదని భావించిన తన సమస్యకు పరిష్కారం తన జీవన నాణ్యతను మెరుగుపరిచి నందుకు మరియు మానసిక వేదన నుండి విముక్తి కలిగించినందుకు వైబ్రియానిక్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

2024 మార్చినాటికి ఆమె డ్రైవింగ్ ని ఆస్వాదిస్తూ మానసికంగా దృఢంగా ఉన్నారు.  

 

సోరియాసిస్ 11632...India

52 ఏళ్ల స్త్రీకి 20001 మార్చి లో తన కుడి బొటన వ్రేలు మరియు మడమలో దురద మరియు నొప్పి ఏర్పడింది, అలోపతి మందులతో తాత్కాలిక ఉపశమనం పొందారు. 2002లో రెండు అరచేతులు మరియు వేళ్ళపై ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అవే మందులు వాడినా ఉపయోగం కలగలేదు. అప్పటినుండి ఆమె నిరంతర నొప్పి దురద మరియు అరచేతుల్లో మంట ముఖ్యంగా మేల్కొన్నప్పుడు ఇది తీవ్రంగా ఉండేది. అరచేతులపై తెల్లటి మందపాటి పొలుసులు కప్పబడి ఉన్నాయి. దురద నుండి ఉపశమనానికి వాటిని ఒక గోడ లేదా మంచం మీద రుద్దుతూ ఉండేవారు దీనివలన పొలుసులు రాలిపోయేవి.

పాత్రలు కడగడం, ఉప్పు మరియు చింతపండు ఉపయోగించడం వంటి రోజువారి పనులు మంటను తీవ్రతరం చేశాయి. బస్సులో సపోర్టు కోసం కడ్డీలు పట్టుకోవడం లేదా అలాంటిది ఏదైనాపని వలన తన అరచేతిలో వేళ్ళపై చిన్న కోతలు ఏర్పడి రక్తస్రావం అయ్యేలా చేసేది. ఆమె చేతి తొడుగులతో(గ్లౌజ్) దీన్ని తగ్గించుకుందామని ప్రయత్నించారు, కానీ వాటి వలన నిరంతర దురద ఒక సవాలుగా మారింది. ఎంతో మంది వైద్యుల్ని సంప్రదించినప్పటికీ ఉపశమనం పెద్దగా ఏమీ లేదు. లక్షణాలు తగ్గించు కోవడానికి కొబ్బరి నూనె మరియు పసుపు వంటి ఇంటి నివారణలు ఉపయోగించసాగారు.

2019 అక్టోబరులో వారి కుటుంబములో ఏర్పడిన విషాదం తర్వాత ఆమె లక్షణాలు మరింత తీవ్రమయ్యి ముఖం వరకు ఇవి విస్తరించాయి. సూచించబడిన మందులను తీసుకుంటున్నారు కానీ ఇది మరిన్ని సమస్యలకు అనగా ఆమె శరీరం అంతటా చర్మం నల్లబడడం పాదాల్లో వాపుకు దారితీసింది. 2019 అక్టోబర్ నుండి రెండు నెలల పాటు తీసుకున్న ఆయుర్వేద చికిత్స ఉపయోగ పడలేదు. 2019 డిసెంబర్లో ఆమె హోమియోపతికి మారారు కానీ ఆమె పాదాల్లో వాపు పెరగడం వల్ల ఒక నెల తర్వాత దీనిని నిలిపి వేసారు. అప్పటినుండి ఆమె వివిధ వైద్యులు సూచించిన అనేక మందులు ప్రయత్నించారు కానీ ఫలితం లేదు ఓవర్ ది కౌంటర్ గా యాంటీ హిస్టమిన్ తాత్కాలిక ఉపశమనాన్ని అందించింది.

2021 జూన్ 9న ఒక చర్మవ్యాధి నిపుణుడు బయాప్సీ మరియు ఇతర టెస్టుల ద్వారా పరీక్షించి సోరియాటిక్ ఎరిత్రో డెర్మా అని వెల్లడించారు (రిపోర్టులో అందుబాటులో ఉన్నాయి). 15 రోజులు సూచించిన మందులు తర్వాత ఆమె అరచేతులు మరియు వేళ్ళపై మినహా అన్ని లక్షణాల నుండి ఉపశమనం పొందారు. సుదీర్ఘ చికిత్స( ఏడు వారాలకు పైగా) మరియు పెరుగుతున్న వ్యయ భారం వలన జూలై 28న దాన్ని నిలిపివేసి గృహ చిట్కాలను ఆశ్రయించారు.

2022 నవంబర్ 12 న ప్రాక్టీషనర్ గృహంలో భజన సమయంలో వైబ్రియానిక్స్ ప్రయత్నించమని సూచించగా ఆమె వెంటనే అంగీకరించారు, క్రింది రెమిడీ ఇవ్వబడింది:

#1. CC21.3 Skin allergies + CC21.10 Psoriasis…BD కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం

#2. CC12.4 Autoimmune diseases + #1…TDS

మరుసటి రోజు ఆమెను ఆశ్చర్యానికి గురిచేస్తూ నొప్పి, దురద, మంటతో పాటు మచ్చల పరిమాణములో 80% ఉపశమనం లభించింది. అనేక సంవత్సరాల తరువాత ఆమెకు మొదటిసారి తన అరచేతులను గోడ వంటి వాటిపై రాయ వలసిన అవసరం రాలేదు. కేవలం మూడు రోజుల తర్వాత నవంబర్ 16న ఆమెకు నమ్మశక్యం కాని రీతిలో 100% ఉపశమనం కలిగిందని అలాగే చర్మం మృదువుగా మారడం ప్రారంభించిందని తెలిపారు. ఐతే చేతులపై పొలుసులు పైకి కనిపిస్తూనే ఉన్నా అవి ఆమెను ఇబ్బంది పెట్టడం లేదు. పాత్రలు కడగటం తలస్నానం చేయడం వంటివి ఏ సమస్య లేకుండా చేయ గలుగుతున్నారు, ఐతే భజన సమయంలో చప్పట్లు కొట్టేటప్పుడు స్వల్ప అసౌకర్యాన్ని పొందుతూ ఉండేవారు కానీ 2023 ఫిబ్రవరి నాటికి అది కూడా అదృశ్యమైంది.

సెప్టెంబర్ నెలలో సందర్శన సమయంలో ఎటువంటి లక్షణాలు పునరావృతం కాలేదని ధ్రువీకరించారు కానీ రెమిడీలు కొనసాగించాలని అభిలషించారు. 2024 ఏప్రిల్ 1న  #1 ని BD  గా #2 ను OD వర్తింప చేసుకొని కొనసాగిస్తూ ఉన్నారు. ఏప్రిల్ 25 నాటికి ఆమె పూర్తి క్షేమంగా ఉన్నారు.   

వాలిపోతున్న కను రెప్పలు (టోసిస్) 11632...India

ఒక వృద్ధాశ్రమంలో నెలవారీగా జరిగే వైబ్రియానిక్స్ క్యాంపులో 80 ఏళ్ల వృద్ధురాలు 2022 జనవరి నుండి ప్రారంభమైన కనురెప్పలు వాలిపోవడం కోసం చికిత్స పొందారు. ప్రారంభంలో ఆమె మేల్కొన్నప్పుడు కళ్ళు తెరవడంలో ఇబ్బంది ఏర్పడి రెప్పలు అతుక్కుపోయినట్లుగా అనిపించి ఆమె వాటిని తన చేతి వేళ్ళతో బలవంతంగా తెరవాల్సిన పరిస్థితి ఉండేది. రోజులు గడిచే కొద్దీ కుడి కనురెప్ప పూర్తిగానూ ఎడమ రెప్ప పాక్షికంగానూ పడిపోతూ ఉండేది. 2 నుండి ౩ వారాల్లో ఆమె పరిస్థితి మరింత దిగజారి మేలుకున్న తర్వాత కుడి కనురెప్పను బలవంతంగా తెరిచిన తర్వాత ఒకటి రెండు నిమిషాల్లో దానికదే మూసుకుపోతుంది మరియు ఎడమ కనురెప్ప పాక్షికంగా మూసుకుపోతుంది. ఇది ఆమె దృష్టిని గణనీయంగా బలహీనపరిచింది..

ఈ ఆశ్రమంలో ఈమె ఒక్కరే అక్షరాస్యురాలు కావడం వలన ఈమె ప్రతీరోజు సాయంత్రం ఇతరులకు ఆధ్యాత్మిక గ్రంథాలను శ్రద్ధగా చదివి వినిపించేవారు. ఇది తాను బాగా ఇష్టపడే ఒక మంచి వ్యాపకం. టీవీ చూడటం ఇంకొక ఇష్టమైన కాలక్షేపం. కానీ క్రమంగా క్షీణిస్తున్న ఆమె కంటి పరిస్థితి వలన తన అభిరుచులను కొనసాగించడం కష్టమయ్యింది. కేవలం15 నిమిషాల్లో టీవీ చూడటం లేదా చదవడం వలన నొప్పి ఏర్పడి కొంత సమయం విశ్రాంతి తర్వాత మాత్రమే ఉపశమనం లభించేది.  

ఫిబ్రవరిలో వైద్యుడు ఆమె కంటి పరిస్థితికి వృద్ధాప్యం కారణమని పేర్కొని ఐదు నెలల పాటు విటమిన్ సప్లిమెంట్లను సూచించారు కానీ ఇవేమీ ప్రభావం చూపలేదు. 2022 ఆగస్టు నుండి ఐదు నెలల పాటు హోమియోపతి చికిత్స తీసుకున్నా ఎటువంటి సహాయము చేయలేదు.

2023 ఫిబ్రవరి 6 ప్రాక్టీషనర్ ఆమెకు క్రింది రెమిడీ అందించారు: 

 #1. CC3.7 Circulation + CC18.4 Paralysis + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain...TDS కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం

#2. CC10.1 Emergencies + #1...TDS

సున్నితంగా మరియు జాగ్రత్తగా ఆమె కనురెప్పలపై #1 మసాజ్ చేసేవారు. తర్వాత నాలుగు నెలల్లో స్థిరమైన మెరుగుదల కనిపించింది. జూన్ 9న నిద్రలేచిన ఐదు నిమిషాల్లో పాక్షికంగా అయినా తన వేళ్ళను ఉపయోగించకుండా రెండు కళ్ళను తెరవగలిగినట్లు మరియు రోజంతా అవి అదేవిధముగా ఉంటున్నాయని తెలిపారు. దీనికి అదనంగా టీవీ చూసేటప్పుడు నొప్పి నుండి 50% కూడా లభించింది.

సెప్టెంబర్ 13 నాటికి మరో మూడు నెలల్లో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాక నిద్ర లేచిన ఒక్క నిమిషంలో ఆమె సాధారణంగానే తన కన్నులు తెరవగలుగుతున్నారు. మరో రెండు నెలల్లో నవంబర్ 15 నాటికి ఆమె కనురెప్పలు మాములుగానే పనిచేస్తున్నాయి. ఆమె ఆనందంగా తన రోజువారి అధ్యాత్మిక గ్రంధాలను పఠించడం కొనసాగించగలుగుతూ ఉండడంతో వైబ్రియానిక్స్ కు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

డిసెంబర్ 27 న 27 #1 మరియు #2 యొక్క మోతాదు BD కి మరో నెల అనంతరం OD, కి తగ్గించి 2024 మార్చి 1 న ఆపివేయ బడింది.

2024 ఏప్రిల్ నాటికి లక్షణాల పునరావృతం ఏదీ లేదు. ​

 

చర్మము పై ఎలెర్జీ 11658...India

45 ఏళ్ల మహిళ కు గత 30 సంవత్సరాలుగా సబ్బు, లేదా కూరగాయలను తాకినప్పుడల్లా ఆమె రెండు చేతులకు ఎలర్జీ వచ్చేది. ఆమె అరచేతులు నల్లబడి గుర్తించదగిన గీతలు మరియు కోతలు ప్రత్యేకించి ఆమె గోళ్ళ చుట్టూ కనిపిస్తాయి. నెలకు ఒకసారి ఈ కోతలు రక్తస్రావం కలిగించడమే కాక జ్వరం కూడా వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆమె అరచేతులు దురదగా ఉంటాయి. ఆమె ఆయుర్వేద క్రీం పెట్రోలియం జల్లి మరియు ఆవాల నూనెను ఆశ్రయించగా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించింది. దీంతో ఆమె రోజువారి పనులు ఎవరి సహాయం లేకుండా చేయడం కష్టంగా మారింది. ఆమె తన తండ్రి లో ఇలాంటి పరిస్థితిని చూసినందున ఇది నయం చేయలేని వ్యాధిగా భావించి ఏ వైద్యుడిని సంప్రదించలేదు. వైబ్రియానిక్స్  సమర్థత గురించి తెలుసుకున్న తర్వాత ఆమె వెంటనే 2023 డిసెంబర్ 28 ప్రాక్టీషనర్ను సంప్రదించి క్రింది రెమిడి పొందారు:   

CC21.3 Skin allergies + CC21.5 Dry Sores...TDS శుద్ధమైన కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం…BD

ఆమె తన సాధారణ క్రీములు మరియు నూనెను పూయడం మానేశారు, డిసెంబర్ 30న మూడు రోజుల్లో ఆమె తన లక్షణాల్లో 80% ఉపశమనాన్ని పొందారు, అతి త్వరలోనే 2024 జనవరి 2 నాటికి ఇది 100% పెరిగింది. ఇంత త్వరగా స్వస్థత చేకూరడం చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయారు. రోగ లక్షణాలు పెంచే సాధారణ ప్రేరేపితములకు నిరంతరం గురియైనప్పుడు కూడా ఎటువంటి అలర్జీ జాడలేదు. మౌఖికంగా తీసుకొనే రెమిడీ ఒక్ వానికి BD అనంతరం మరో వారానికి OD కి తగ్గించబడింది మరియు ఫిబ్రవరి 5న ఆపడానికి ముందు క్రమంగా తగ్గించబడింది. బాహ్య అనువర్తనం కోసం రోగి రెమిడీ కొనసాగించడానికి ఇష్టపడడంతో OD కి తగ్గించబడింది. ఆమె వైబ్రియానిక్స్ కు అపారమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ఇద్దరు స్నేహితులను ప్రాక్టీషనర్ కు సూచించారు.

2024 ఏప్రిల్ నాటికి ఎటువంటి పునరావృతం లేదు. 

పేషెంట్ వాంగ్మూలము:

“నా యుక్తవయసు నుండి అరచేతులపై చర్మ అర్జీ కారణంగా నేను ఎలాంటి ఇంటి పనులు చేయలేకపోయాను. పెళ్లయిన తర్వాత ముగ్గురు పనిమనుషులపై పూర్తిగా ఆధారపడి ఉండేదానిని, వారు నా పనంతా చేసేవారు. కానీ వైబ్రియానిక్స్ తీసుకున్న తర్వాత నా అరచేతులకు ఎటువంటి అలర్జీ లేకుండా పోవడంతో నేను నా రోజువారి పనులన్నింటిని చేయగలగడం చూసి ఆశ్చర్యపోయాను. నా అరచేతులు ఇప్పుడు చాలా మృదువైనవి గానూ మరియు ఎటువంటి గాట్లు లేకుండా ఉన్నాయి. ఈ ఉచిత సేవకు నేను కృతజ్ఞు రాలిని. ఇప్పుడు నా కుమార్తె తన కాళ్ళపై వెరికోస్ వీన్స్ కు కూడా మందు తీసుకుంటుంన్నది. వచ్చే నెల నుండి నా మైగ్రేన్ మరియు కండరాల నొప్పుల కోసం అల్లోపతి మందులపై ఆధారపడకుండా వైబ్రియానిక్స్ ను పూర్తిగా నమ్మి ఈ రెమిడీ తీసుకోవాలని భావిస్తున్నాను.”

 

ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్(ప్రకోప ప్రేగు రుగ్మత) (IBS) 11650...India

BMI(బాడి మాస్ ఇండెక్స్) 25 కలిగిన 13 ఏళ్ల బాలుడు ఒక రోజులో 3 లేదా 4 సార్లు (ఒక్కసారి వెళ్ళడం సాధారణ స్థాయి) మధ్యస్తంగా గట్టిమలంతో కొంచెం పొత్తికడుపు నొప్పితో మల విసర్జన చేయడం ప్రారంభించాడు. భోజనం చేసిన ప్రతీ సారి అసౌకర్యం మరియు వెంటనే మలవిసర్జన చేయవలసిన అవసరం రావడం దాంతో పరిమాణంతో సంబంధం లేకుండా పొత్తికడుపు తిమ్మిరి మరియు అసౌకర్యంతో డిసెంబర్ 15 నాటికి దీని ఫ్రీక్వెన్సీ 7 లేదా 8 రెట్లు పెరిగింది. అతని తరచూ వాష్ రూమ్ కి వెళ్ళడానికి తల్లి గమనించే వరకు బాలుడు ఈ విషయాన్ని చెప్పకుండా దాచాడు. గత కొన్ని రోజులుగా అతని ఆకలి తగ్గడం, వాష్ రూమ్ కి వెళ్ళవలసి వస్తుందనే భయంతో తినడానికి కూడా విముఖత చూపిస్తున్నాడు.

2022 డిసెంబర్ 10న అతనికి ఐబీఎస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అల్లోపతి మందులు తో ఉపశమనం పొందాడు అయితే మందులు ఆపిన తర్వాత లక్షణాలు పునరావృతం అయ్యేవి. అతను ఆహారం గురించి జాగ్రత్తగా ఉంటూ తేలికపాటి మసాలా ఉన్న ఆహారం మాత్రమే తీసుకుంటూ బయట ఆహారానికి దూరంగా ఉన్నాడు. 2023 మార్చిలో అతనికి మలాసనం దగ్గర నొప్పి కూడా అభివృద్ధి కావడంతో దానికి సమయోచిత లేపనంతో పాటు నోటి మందులు కూడా సూచింపబడ్డాయి. సాధారణంగా అతను లేపనాన్ని మాత్రమే ఉపయోగించేవాడు, లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు టాబ్లెట్లను ఆశ్రయించాడు కానీ అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇచ్చాయి. 2024 లో తల్లిదండ్రులకు వైబ్రేషన్స్ గురించి తెలిసే వరకూ అతను నెలలు తరబడి ఈ విధంగా చేస్తూ వచ్చాడు. 2024 జనవరి 3 ప్రాక్టీషనర్ తో సంప్రదింపుల సమయంలో ఆ బాలుడు ఆరోజు ఉదయం నుండి పొత్తికడుపులో తిమ్మిరి, మరియు ఆసన నొప్పితో తరచుగా మోషన్ కి వెళ్లసాగాడు. తన కొడుకు సాధారణంగా రిజర్వుడు గా ఉంటాడని తల్లిదండ్రులతో తప్ప ఎవరితోనైనా పరిచయాలకు దూరంగా ఉంటాడని తల్లి చెప్పారు. ప్రత్యేకంగా వెబ్రియానిక్స్ రెమిడీలు ఎంచుకున్న తర్వాత అతను ఇతర మందులు నిలిపివేశాడు అతనికి క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి:  

జీర్ణ కోశ సంబంధిత సంస్యలకు : 

#1. CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies…6TD for five days followed by TDS 

భావోద్వేగ శ్రేయస్సుకు : 

#2. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic…TDS 

సాధారణ ఆరోగ్య శ్రేయస్సుకు : 

#3. IB*…OD 

జనవరి 8 నాటికి ఐదు రోజుల్లో పొత్తికడుపు తిమ్మిరి అదృశ్యమైంది, మలము యొక్క ఫ్రీక్వెన్సీ రోజుకు 4 లేదా 5 సార్లకు తగ్గింది. జనవరి 16 నాటికి అతను రోజుకు రెండుసార్లు మాత్రమే సాధారణ మల విసర్జన చేస్తున్నాడు. ఆసన నొప్పి కూడా మాయమైంది. ఇంక అతని తల్లిదండ్రుల ఆనందానికి, బాలుడి సంతోషానికి అవధులే లేవు, ఇప్పుడు అతను మరింత ఆత్మ విశ్వాసంతో ఉంటూ   ఇతరులతో కలిసిపోవడం ప్రారంభించాడు. జనవరి 22 నాటికి అతని ఆకలి తిరిగి ఏర్పడింది. అతని రోజుకు ఒకసారి మలవిసర్జన చేస్తున్నాడు. అతడికి అల్లోపతి మందుల అవసరం లేదని తల్లిదండ్రులు ధీమాగా ఉన్నారు. ఫిబ్రవరి 1 నాటికి 1# మరియు 2# కలిపి మోతాదును BD కి మరో రెండు వారాల్లో మరింత తగ్గి ప్రస్తుతం OD గాకొనసాగిస్తున్నాడు.    

2024 ఏప్రిల్ 24 కి బాలుడు బాగానే ఉన్నాడు, అతని అధిక బరువుకు చికిత్స తీసుకుంటున్నాడు.  

*IB combo ను వార్తాలేఖ సంపుటి 13 సంచిక 5 మేరకు ఇవ్వబడింది.

పార్శ్వపు నొప్పి & అసిడిటీ 11652...India

18 ఏళ్ల బాలుడు 2018 నుండి గత ఐదేళ్లుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉండేవాడు, మండుతున్న ఎండలో పాఠశాల నుండి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన తర్వాత ఈ నొప్పి ఏర్పడేది. మైగ్రేన్ నొప్పిగా నిర్ధారింప బడిన ఈ నొప్పి తన తలకి రెండు వైపులా బాధించేది. పెద్ద శబ్దాలకు గురి కావడం, చదువుకోవడం వంటివి తలనొప్పిని తీవ్రతరం చేసేవి. అతను ఒక వారం పాటు సూచించిన మందులు తీసుకున్నాడు, ఇది ఉపశమనం కలిగించినప్పటికీ ఆర్థిక పరిమితి అతనిని చికిత్స కొనసాగకుండా నిరోధించింది. ఐతే నొప్పి లేపనం రాయడం వలన అతను 2 నుండి 4 గంటల పాటు నిద్రపోయేవాడు, ఫలితంగా పూర్తి ఉపశమనం లభించేది.

గత మూడు సంవత్సరాలుగా వారానికి 3 నుండి 4 సార్లు తలనొప్పి తో పాటు మైకము మరియు ఛాతీలో మండుతున్న అనుభూతి కూడా కలగసాగేవి. ఆయుర్వేద డైజెస్టివ్ టాబ్లెట్ (హాజ్మోలా) మంట నుండి ఉపశమనం అందించేది. అయినప్పటికీ తను ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనసాగించినప్పటికీ అతని లక్షణాలు కొనసాగుతూనే ఉండటం అతని చదువును గణనీయంగా ప్రభావితం చేసింది. అతను వారానికి 2 నుండి 3 సార్లు విద్యాలయానికి వెళ్లకుండా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. సెలవులలో అతను సూర్యరశ్మికి ప్రభావితం కాకుండా ఉన్నప్పుడు అతను బాగానే ఉన్నాడు. దీనికి అదనంగా మూడు సంవత్సరాల క్రితం అతను నత్తిగా మాట్లాడడం ప్రారంభమయ్యింది, అది కాలక్రమేణా మరింత తీవ్రమైంది. అయితే ప్రాక్టీషనల్ దీనికి తరువాత చికిత్స చేయాలని భావించి  2023 మే 12 తేదీన అతనికి క్రింది రెమిడీ ఇచ్చారు:  

CC4.10 Indigestion + CC11.4 Migraines + CC14.1 Male tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic…TDS

మే 25న రెండు వారాలపాటు శ్రద్ధగా, తెలివిగా, జాగరూకతతో రెమిడి తీసుకున్న తర్వాత పార్శ్వపు నొప్పి తీవ్రత సగం తగ్గి  వారానికి 2 సార్లు మాత్రమే వస్తున్నట్లు అతను ఉత్సాహంగా తెలిపాడు. అంతేకాక తేలికపాటి మైకము మరియు మంట యొక్క సందర్భాలు 2 నుంచి 3 మాత్రమే ఉన్నాయి. అతనికి ఇప్పుడు నొప్పి లేపనం కానీ,  మంటను తగ్గించే ట్యాబ్లెట్ యొక్క అవసరం రాలేదు. అతని శక్తి స్థాయిలలో మెరుగుదల ఏర్పడి అతను ఇప్పుడు చదువుపై బాగా దృష్టి పెట్టగలిగాడు.   

మూడు వారాల తర్వాత జూన్ 16న అతని తదుపరి సందర్శన సమయంలో చాలా రిలాక్స్డ్ గా మరియు సంతోషంగా కనిపించాడు ఇప్పుడు తలపోటు 80% తక్కువ తీవ్రత తో వారానికి ఒకసారి మాత్రమే వస్తోంది. మరో నెలలో తలనొప్పి రెండు సార్లు ఇబ్బంది పెట్టడం మినహా మైకము మరియు మంట పూర్తిగా అదృశ్యమైనవి. అతను రోగ కారకాలకు గురైనప్పుడు కూడా రోగ లక్షణ రహితంగా ఉన్నందున ఆగస్టు 18 న మోతాదు BD కి తగ్గించబడింది. ఇది అక్టోబర్ 8 న ఆగిపోయే ముందు క్రమంగా మరింత తగ్గించబడింది. వైబ్రియానిక్స్ ప్రారంభించిన తర్వాత అతను ఒకరోజు కూడా పాఠశాలకు వెళ్ళకుండా ఉండలేదు! 

2024 ఏప్రిల్ 9 నాటికి, ఎలాంటి లక్షణాలు పునరావృతం కాలేదు, లాప్టాప్ ఎక్కువ సేపు ఉపయోగించడంతో అతనికి తేలికపాటి తలనొప్పి వస్తూ ఉండడంతో ఇది అతని స్క్రీన్ టైం ని సమర్థవంతంగా నిర్వహించేలా ప్రేరేపించింది. అతను 2023 అక్టోబర్ 20 నుండి నత్తి కోసం రెమిడీ తీసుకుంటున్నాడు, ఆరు నెలల్లో ఒక 50% మెరుగుదల కనిపించింది.  

కొనసాగుతున్న దగ్గు 11654...India

46 ఏళ్ల మహిళ 1993 నుండి గత 30 సంవత్సరాలుగా రోజూ కఫం, రాత్రి పూట తేలికపాటి ముక్కు దిబ్బడ, నిరంతరం దగ్గుతో బాధపడుతున్నారు. కాలానుగుణ మార్పులు మరియు బయట ఆహారం తీసుకోవడం లక్షణాలను ముఖ్యంగా రాత్రి సమయంలో తీవ్రతరం చేసేవి. ఆమె గొంతులో కఫం అంటుకొని తెగిరాక పోవడం వల్ల చికాకు మరియు నెప్పి వచ్చేది. 1995 నుండి తన లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు అల్లోపతి మందులు తీసుకోవడం ప్రారంభించారు. ఇది ఒక రోజులోపు ఉపశమనం కలిగించింది కానీ దగ్గు మాత్రం ఎప్పుడూ తగ్గేదికాదు. ఉబ్బసంతో తన అమ్మమ్మ జీవితకాల పోరాటాన్ని చూసిన తరువాత ఆమె దగ్గు తన జీవితంలో అనివార్యమైన భాగమని రాజీ పడసాగారు.   

తన అత్తగారి కోసం సంప్రదింపులు సందర్భంగా ఆమె తనకు కూడా రెమిడీలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన నిరంతర దగ్గు గురించి వివరాలు తెలుపుతూ పొరుగువారు తనకు దగ్గు మహిళ (కాఫ్ లేడి) అని నిక్ నేమ్ పెట్టిన విషయం కూడా తెలిపారు. 2023 ఆగస్టు 11 క్రింది రెమిడి ఇవ్వబడింది.

#1. CC10.1 Emergencies + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic…TDS  

#2. IB*…OD 

ఆగస్టు 16 నాటికి ఐదు రోజుల్లో ఆమెకు నమ్మశక్యము కాని రీతిగా దగ్గు, కఫం, మరియు ముక్కుదిబ్బడ జాడ లేకుండా పోయాయి. ఆమెకు మరి ఏ ఇతర ఔషధం అవసరం రాలేదు. పది రోజుల తర్వాత ఆగస్టు 26న తన లక్షణమైన దగ్గు నుండి తనకు కొత్తగా లభించిన స్వేచ్ఛను చూసి పొరుగువారు ఆశ్చర్యపోయారని ఆమె ఉత్సాహంగా తెలిపారు. ఈ వేగవంతమైన మెరుగుదలతో  #1 నెల రోజులకు OD కి తగ్గింప బడింది. రెమిడీని నిర్వహణ మోతాదుగా తీసుకోవాలని ప్రాక్టీషనర్ సూచించినప్పటికీ గోళీలు అయిపోవడంతో సెప్టెంబర్ చివరిలో రెమిడీలు నిలిపివేశారు.

2024 జనవరి 5 న విషాదం నుండి బయటపడి గత నాలుగు నెలలుగా రోగ లక్షణాలు లేకుండా ఉన్నట్లు నివేదించారు. అయితే రెండు రోజుల క్రితం చల్లటి వాతావరణ కారణంగా ఆమెకు తేలికపాటి దగ్గు వచ్చింది. ప్రాక్టీషనర్ రీఫిల్ గా #1…TDS మరియు #2…OD.గా ఇచ్చారు. నాలుగు రోజుల్లో దగ్గు మాయమైంది ఫిబ్రవరి 10న #1 OD.కి తగ్గించబడింది.

ఏప్రిల్ 11 నాటికి లక్షణాలు పునరావృతం కాలేదు, రోగి #1 మరియు #2 OD గా తీసుకోవడం కొనసాగిస్తూ OW నిర్వహణ మోతాదు స్థాయికి తగ్గించే ప్రణాళికతో ఉన్నారు. వైబ్రియానిక్స్ పట్ల కృతజ్ఞతతో ఆమె తన స్నేహితులకు ప్రాక్టీషనర్ ను సూచిస్తున్నారు.

 

ఆందోళన, తలపోటు, అసిడిటీ & నిద్ర లేమి 11570...India

2017 లో దగ్గర బంధువు అకాల మరణం తర్వాత 36 ఏళ్ల మహిళ నిరాశతో రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోయి నిరంతర తలనొప్పి మరియు అనుచితమైన ఆలోచనలు కారణంగా నిద్రలేమికి గురయ్యారు. విపరీతమైన అసిడిటీ మరియు భోజనం చేసిన తర్వాత విపరీతంగా తేన్పులు రావడం వల్ల ఆమెకు చాతిలో మంట ఏర్పడేది. డిప్రెషన్ మరియు నిద్రలేమికి మూడు సంవత్సరాలు అల్లోపతి చికిత్స తీసుకున్నా ఉపశమనం కలగక పోవడంతో 2020 సెప్టెంబరు లో ఇది ఆపివేయబడింది. తలనొప్పి మరియు అసిడిటీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆమె ఓవర్ ది కౌంటర్ మందులు వేసుకుని తాత్కాలిక ఉపశమనం పొందారు.

2020 డిసెంబర్ 18 ప్రాక్టీషనర్ను సంప్రదించినప్పుడు తాను త్వరగా కోలుకోవడం గురుంచి చాలా ఆత్రుతగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:  

ఆందోళన, తలనొప్పి, అసిడిటీ కి :

#1. CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC15.2 Psychiatric disorders…TDS 

నిద్ర లేమికి :

#2. CC15.6 Sleep disorders …నిద్రించడానికి అరగంట ముందు.

రెండు వారాల్లో అన్ని లక్షణాల నుండి 50% మెరుగుదల కనిపించింది. మరో రెండు వారాల్లో అనగా  2021 జనవరి 16 నాటికి ఇది 80% పెరిగింది. ఆమెకు ఎంతో రిఫ్రెష్ గా అనిపించింది. #1 BD కి తగ్గించబడింది. ఇప్పుడు #2, తీసుకోకుండానే బాగా నిద్రపోగలుగుతున్నందున అవసరమైనప్పుడు మాత్రమే దానిని తీసుకోవాలని సలహా ఇవ్వబడింది. 

జనవరి 28 నాటికి ఆమె లక్షణాలని మాయమయ్యాయి ఆమెకు చాలా సంతోషంగా ఉంది ఆందోళన మరియు భయాలు నుండి విముక్తి పొందారు. #2 యొక్క అవసరం కలగలేదు. #1 OD కి క్రమంగా OW కి క్రమంగా తగ్గించబడి 2021 మార్చి 3 నాటికి ఆపివేయ బడింది.  

2024 ఏప్రిల్ నాటికి ఆమె లక్షణాల పునరావృతం ఏమీ లేకుండా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు.

పేషంట్ యొక్క వాంగ్మూలము (హిందీ నుండి ఖచ్చితమైన అనువాదము):

ఇంతకుముందు ప్రతీ చిన్న విషయానికి చాలా టెన్షన్ పడే దానిని. నాకు రాత్రి నిద్ర పట్టేది కాదు. డిప్రెషన్ గురించి మూడు సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నా ఏమాత్రం ఫలితం ఉండేది కాదు. అటువంటి స్థితిలో వైబ్రియానిక్స్ రెమిడీ తీసుకోవడం ప్రారంభించాను. ఈ మందుతో నేను కొద్ది రోజుల్లోనే కోల్కోవడం ప్రారంభించాను. ఇప్పుడు నేను బాగా నిద్రపోతున్నాను మరియు దేనిగురించి టెన్షన్ పడటం లేదు. నాకు ఇట్టి ఔషధం అందించిన ప్రాక్టీషనర్ కు నేను చాలా కృతజ్ఞురాలిని.    

ప్రాక్టీ షనర్ల వివరాలు 11648...India

ప్రాక్టీ షనర్ 11648...ఇండియా  ఈమె సైన్స్ గ్రాడ్యుయేట్ మరియు మానవ వనరుల శాఖలో MBA చేసారు. ఆమె 2008 నుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో HR ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నారు. క్రీడలు, దేవాలయాలు సందర్శించడం, స్తోత్రాలు పఠించడం, వంటి వాటిపట్ల అభిరుచి కలిగిన వీరు బాహ్య దృష్టి కలిగిన చురుకైన వ్యక్తి మరియు అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు.  

భక్తుల కుటుంబంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నారు, ఆమె తల్లి అమితమైన సాయి భక్తురాలు. తల్లిదండ్రుల నుండి సాధారణ మరియు సాత్విక జీవన శైలి ప్రభావంతో పెరిగిన వీరు ఎల్లప్పుడూ దేవునికి ఎంతో సన్నిహితంగా ముఖ్యంగా శ్రీరాముని రూపానికి ఎంతో ఆకర్షితురాలుగా ఉండేవారు. ఆమె ఒక భక్త  కుటుంబంలో జన్మించడం ఒక అదృష్టంగా భావిస్తున్నారు. 2022 లో వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తర్వాత “సాయి” రాముని భౌతిక రూపాన్ని చూడనందుకు పశ్చాత్తాపం పొందారు. అయితే తన జీవిత కాలంలో తనకు స్వామి భౌతిక దర్శనం తప్పక చేసుకో గలుగుతాననే గట్టి విశ్వాసంతో ఉన్నారు.  

ప్రాక్టీషనర్ 20 సంవత్సరాల వయసులో ఆమె తల్లితో కలిసి వారాంతపు భజనలకు హాజరవుతూ ఉండేవారు. అంతేకాక దుస్తులు మరియు ఆహార పంపిణీ, అనాధాశ్రమాల్లో పిల్లలతో గడపడం, వృద్ధాశ్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. ఆమె తన 30 సంవత్సరాల వయసులో బాగా స్థిరపడాలని తద్వారా ప్రతీ రోజు సేవను కొనసాగించాలని భావించారు. కాలేజీలో బయోటెక్నాలజీ చదివడం వలన మరియు ఆమె తండ్రి హోమియోపతి డాక్టర్ గా ఉండడం వలన మానవ శరీరం గురించి మరింత తెలుసుకోవడానికి ఆమెను ప్రేరేపించింది. స్వామి తన వైబ్రియానిక్స్ ప్రయాణానికి పునాది వేస్తున్నారని మొదట్లో ఆమె గ్రహించలేదు. ఆమె వివాహం అయిన వెంటనే ఆమె భర్తకి వైరల్ జ్వరం అనంతరం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి గురి అయ్యారు. అతను స్టెరాయిడ్లు తీసుకోవడానికి ఇష్టపడక పోవడంతో ఆమె ప్రత్యామ్నాయ చికిత్సలను వైపు చూడడం ప్రారంభించారు. ఆమె ఆఫీసు సహోద్యోగి వైబ్రో ప్రాక్టీషనర్ అని తెలుసుకున్నారు. మరింత తెలుసుకోవాలని కుతూహలంతో ఆమె వెబ్సైటు సందర్శించి  ఆమె స్వయంగా ప్రాక్టీషనర్ కావడానికి దరఖాస్తు చేసుకోవచ్చని కనుగొన్నారు. ఆమె తన AVP కోర్స్ ను 2022 నవంబర్ లో పూర్తి చేసి 2023 జూలైలో VP అయ్యారు.   .

తనను స్వామి వారికి దగ్గర చేసిన కొన్ని సంఘటనలు పంచుకోవాలని ప్రాక్టీషనర్ భావిస్తున్నారు. AVP గా చేరడానికి ముందు వైద్య శిబిరాల్లో VP11634 (తర్వాత వీరే ఆమెకు మెంటర్ గా మారారు) కి సహాయం చేయడానికి సూచింప బడ్డారు. ఒకరోజు ఆమెకు   వేళ్ళన్నింటిలో తీవ్రమైన నొప్పిఏర్పడడంతో తన భర్త పరిస్థితి గురించిన ఒత్తిడికి గురికావడం బహుశా తన నొప్పికి కారణమని భావించారు. VP ద్వారా ప్రోత్సహింపబడిన ఆమె బాబాను ప్రార్థించారు, మరుసటి రోజు ఉదయానికి ఆమెకు పూర్తి ఉపశమనం కల్పించి ఆమెను ఆశ్చర్యానికి గురి చేస్తూ నొప్పి మాయమయ్యింది. మరొకసారి ఆమె AVP అడ్మిషన్ ప్రాసెస్ సమయంలో స్వామి ఫోటోను తనకు చూపించడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలని స్వామికి సవాలు విసిరారు. అదే రోజు ఆమె తన సాధారణ ప్రయాణంలో ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో స్వామి ఫోటోలు గమనించారు, విశేషమేమంటే గతంలో ఆ దారిలో ఎప్పుడూ ఆ ఫోటోలను ఆమె చూడలేదు!

మొదటి సంవత్సరంలోనే ఇంటి నుంచి 114 మంది రోగులకు మరియు శిబిరాల్లో 269 మంది రోగులకు చికిత్స అందించిన వీరు తన అద్భుతమైన అనుభవాలను పంచుకుంటున్నారు. చర్మం చాలా వేగంగా కంపనాలను గ్రహిస్తుందని ఆమె కనుగొన్నారు, పేషంటు ఒక రోజు తన నోటి ద్వారా తీసుకునే మోతాదును దాటవేసినప్పటికీ బాహ్య అనువర్తనం కోసం వాడే నూనె అద్భుతంగా పనిచేస్తుందని ఆమె గ్రహించారు. ఆమె దీర్ఘకాలిక వ్యాధుల కోసం దాదాపు అన్ని కోంబోలకు CC10.1 Emergencies & CC15.1 Mental & Emotional tonic జోడిస్తారు, మరియు తన రోగులందరికీ అద్భుతమైన ఫలితాలను అందించే IB ని అందిస్తారు. కంటి వ్యాధుల కోసం కంటి రెప్ప కురుపు(స్టై), కంటి వ్యాధులు, మరియు మంట (కండ్లకలక) కోసం CC7.3 Eye infections అద్భుతంగా ఉంటుందని కేవలం 48 గంటల వ్యవధిలో పూర్తి నివారణ అందిస్తుందని గ్రహించారు. అయితే రెమిడి ఆపివేసినట్లయితే కంటి కురుపు తిరిగి రావచ్చు, కానీ ఒక నెలపాటు OD గా ఇవ్వడం ద్వారా అద్భుతం చూడవచ్చని ఉపాయాన్ని సూచిస్తున్నారు. రెండు సందర్భాల్లో అతిసారం, అజీర్ణం, మరియు ఉబ్బరం వంటి ఉదర సంబంధిత సమస్యల కోసం ఈట్ వెల్ కాంబో ఒక గంటలోనే చక్కగా పనిచేసింది. గెట్ వెల్ + బ్రీత్ వెల్ కాంబోను 2 లేదా 3 డోసులు తీసుకోవడం ద్వారా జలుబు, దగ్గు, మాయమైన అనేక సందర్భాలను ఆమె వివరిస్తున్నారు. జలుబు దగ్గు రెండు రోజుల నుండి ఉంటే ఈ కాంబో ప్రతీ పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున ఓ గంట పాటు ఇచ్చిన అనంతరం 6TD గా ఇస్తే ఒక రోజులోనే తగ్గిపోతుందని గ్రహించారు.

అనేక క్లిష్ట మైన కేసుల సందర్భాల్లో కూడా ప్రాక్టీషనర్ అద్భుతమైన విజయాన్ని సాధించారు. అటువంటి హృదయాన్ని కదిలించే ఒక కేసు ఏమిటంటే వీల్ చైర్ కు పరిమితమైన 56 ఏళ్ల పొరుగింటి స్త్రీకి 2019 లో షుగర్ లెవెల్స్ నియంత్రణ కోల్పోవడంతో ఎడమ కాలు తీసివేయ బడింది. తన వీల్ చైర్ నెట్టుకోవడం చేతులు మరియు మెడలో విపరీతమైన నొప్పిని కలిగించింది, అంతేకాక 2023 డిసెంబర్ 2వ తేదీన ఆమె కింద పడిపోవడం వల్ల నొప్పి మరింత తీవ్రమైంది. 2023 డిసెంబర్ 27న ఆమెకు #1. CC20.2 SMJ pain + CC20.5 Spine + CC20.7 Fractures…BD బాహ్య అనువర్తనం కోసం నువ్వుల నూనెలో మరియు #2. CC10.1 Emergencies + #1…6TD, గా అలాగే మన నిద్ర కోసం మన సాధారణ కొంబో కూడా ఇవ్వబడింది. రెండు వారాల్లో ఆమె నొప్పులన్నీ మాయమయ్యాయి కానీ నిద్రలో స్వల్ప మెరుగుదల కలిగింది. 2024 జనవరి 17వ తేదీన ఆమె తొడలపై వేడి నీటి వలన ఏర్పడిన బొబ్బలు కోసం రెమిడీ కోరారు. ఆమెకు #4. CC21.4 Stings & Bites + CC21.11 Wounds & Abrasions…BD కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం మరియు #5. CC10.1 Emergencies + 18.5 Neuralgia + #4…6TD.రెమిడీ ఇవ్వబడింది. ఫిబ్రవరి 2 నాటికి కాలిన గాయాలు పొడిగా మారడం ప్రారంభమై మార్చి చివరి నాటికి పూర్తిగా తగ్గిపోయాయి. ఆమెకు నిద్ర విషయంలో 60% మెరుగుదల ఉంది. సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఇప్పుడు మధుమేహం కోసం రెమిడీ తీసుకుంటున్నారు. వైబ్రియానిక్స్ సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తూ వైద్య శిబిరాలలో పాల్గొనే అవకాశం కల్పించి నందుకు స్వామివారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జులై 22 - 23 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 1 వ రాష్ట్రస్థాయి సదస్సులో ఆమె మరియు తన భర్త చురుకుగా సేవ చేసారు. సదస్సు సందర్భంగా నిర్వహించిన క్విజ్ లో కూడా ఆమె విజేతగా నిలిచారు. 

ప్రాక్టీషనర్ కావడానికి ముందు కుటుంబంలో ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఎంతో ఆందోళన చెందేవారు. సాయి వైబ్రియానిక్స్ ఆమెకు మనః శాంతిని ఇచ్చింది. బహిర్ముకురాలు కావడంవల్ల అపరిచితులకు కూడా వైబ్రో రెమిడీస్ అందించే అవకాశాన్ని ఆమె కోల్పోయేది కాదు అని ఈమె మెంటర్ తెలియ జేస్తున్నారు. వైబ్రో శిబిరాలలో కూడా రోగులకు రెమిడీలను అందిస్తూ జీవనశైలి మార్పులతో చికిత్సను వేగవంతం చేసుకోమని ప్రత్యేకంగా సలహా ఇస్తూ ఉంటారు. తనకు తెలియని ఏవైనా వైద్య సమస్యల కోసం ఇంటర్నెట్ ను ఆశ్రయించడానికి ఆమె వెనుకాడరు. కేస్ హిస్టరీల అనువాదం, పరిశోధన, మరియు వైబ్రో గురించి అవగాహన కల్పించడం వంటి ఇతర రంగాల్లో కూడా సహకరించడానికి ఆమె ఉత్సాహంగా ఉన్నారు.

మన ఉద్దేశాలు స్వచ్ఛమైనవిగా ఉండి, ఇతరుల విషయంలో తీర్పు చెప్పడం పట్ల దూరంగా ఉంటే అన్నీ మనకు అనుకూలంగా జరిగుతాయని ప్రాక్టీషనర్ విశ్వసిస్తున్నారు. తన విషయానికే వస్తే వైబ్రియానిక్స్ లోనికి ప్రవేశించిన వెంటనే ఆమెకు ఆఫీసు పనిభారం మరియు చిన్న పిల్లల తల్లిగా ఇంట్లో నిబద్ధత పెరిగినప్పటికీ ఆమె సేవాగంటలు ప్రభావితం కాలేదు. రోగులతో మరియు ప్రేమ మరియు కరుణతో వ్యవహరించడం ఆమెకు భౌతిక ఆస్తుల కంటే ఎక్కువ సంతృప్తిని అందిస్తుంది.

ఉదహరించిన కేసులు:

 

ప్రాక్టీ షనర్ల వివరాలు 11645...India

ప్రాక్టీషనర్ 11645...ఇండియా  మెఖానికల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రులైన వీరు ONGC లో 32 సంవత్సరాలు పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజర్ గా 2021 జూన్ లో రిటైర్ అయ్యారు. తన కెరీర్ లో ఆఫ్షోర్ మరియు ఆన్షోర్  మిషనరీల నిర్వహణ కార్యకలాపాలకు చేసిన కృషికి ఐదు మెరిటోరియస్ అవార్డులను అందుకున్నారు.

1968 లో ఏడేళ్ల వయసులో బాబా కేరళలోని వారి స్వగ్రామాన్ని సందర్శించి నప్పుడు వారి దర్శనం అనంతరం ప్రాక్టీషనర్ తండ్రి బాబా ఫోటోలు ఇంటికి తీసుకొచ్చినప్పుడు బాబాతో మొదటిసారి పరిచయం ఏర్పడింది. వీరి అత్తగారు గొప్ప సాయి భక్తురాలు, చిన్నతనంలో వారి ఇంటిలో హారతి కి హాజరయ్యేవారు. 1994 లో భక్తురాలిని వివాహం వివాహం చేసుకొని అనంతరం సాయి భజనలు మరియు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం గొప్ప ఆశీర్వాదంగా భావించారు. 1997 నుంచి 2021 మధ్య తన శ్రీమతి తో పాటు పాండిచ్చేరిలో నివసిస్తున్న వీరు అక్కడ వైద్య శిబిరాలు మరియు నారాయణ సేవలో చురుకుగా పాల్గొనేవారు. పదవీ విరమణ తర్వాత వీరు కొచ్చి లోని సాయి సమితి చెందిన ఇతర భక్తులలో కలిసి నెలవారి నారాయణ సేవలో పాల్గొనేవారు.

2011 నుండి ప్రాక్టీషనర్ అయిన తన అత్తమ్మ నుండి సాయి వైబ్రియానిక్స్ గురించి విన్నారు కానీ ఆ సమయంలో దానిని పెద్దగా పట్టించుకోలేదు. 2022 జనవరిలో ఆందోళన మరియు నిద్రలేమితో బాధపడుతున్న సన్నిహిత కుటుంబ సభ్యుడుని వైబ్రియానిక్స్ ఒక వారంలోనే ఎలా నయం చేసిందో ప్రత్యక్షంగా చూసి ప్రాక్టీషనర్ గా మారడానికి ప్రేరణ పొందారు. 2022 నవంబర్లో AVP కోర్సు విజయవంతంగా పూర్తి చేసి 2023 జూలైలో VP గా పదోన్నతి పొందారు.

ఇప్పటివరకు 100 కంటే ఎక్కువ మంది రోగులకు తీవ్రమైన మరియు దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేసిన  ప్రాక్టీషనర్ కొన్ని ఆసక్తికరమైన కేసులను పంచుకోవాలని అనుకుంటున్నారు.

2023 మార్చిలో మూడు సంవత్సరాలుగా నిద్రలేమితో బాధపడుతున్న 75 ఏళ్ల మహిళకు చికిత్స చేశారు. ఆమెకు నిద్రపోవడానికి అరగంట ముందు ఆమెకు CC15.6 Sleep Disorders…OD ఇవ్వగా కేవలం ఒక వారం లోనే ఆమె గడచిన వారమంతా కూడా రాత్రంతా గాఢంగా నిద్రపోతున్నట్టు టాయిలెట్ వెళ్లడానికి మాత్రమే ఒకసారి మేల్కొంటున్నానని తెలిపారు. ఆమె రెమిడీ తీసుకోవడం కొనసాగిస్తూ ప్రస్తుతం బాగానే ఉన్నారు.

2023 ఫిబ్రవరిలో 41 ఏళ్ల మహిళ తన తల్లికి ఉన్న అనేక అనారోగ్య సమస్యల గురించి బెంగతో ప్రాక్టీషనర్ ని సంప్రదించారు. గత ఎనిమిది నెలలుగా ఆమెకు ఆకలి కోల్పోయి ఎప్పుడూ కడుపు నిండినట్లు అనిపించేది. అతను Eat well - CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion ఇచ్చారు. ఐదు రోజుల్లో ఆమె ఆందోళన తగ్గి సాధారణంగానే ఆహారం తినడం ప్రారంభించడంతో మోతాదు క్రమంగా తగ్గించారు.

2023 నవంబర్లో ఒక నెల వయసున్న ఆడపిల్ల రోజుకు 10 నుంచి 12 సార్లు విరోచనం చేయడం ప్రారంభించడంతో పరిస్థితి చాలా క్రిటికల్ గా మారింది. శిశు వైద్యుడు దీన్ని తల్లిపాల నుండి ఆవుపాలకు మారడంతో ప్రోటీన్లకు అసహనంగా నిర్ధారించారు. తల్లి అన్ని పాల ఉత్పత్తులను ఆపి సూచించిన ప్రోబయోటిక్స్ సిరప్ ను శిశువుకు ఇచ్చారు కానీ ఎటువంటి మెరుగుదల లేదు. ప్రాక్టీషనర్ శిశువుకు CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC12.2 Child tonic…6TD నీటిలో (1-2 నోటిలో చుక్కలు *). ఇచ్చారు. మరుసటి రోజు వదులుగా ఉండే మోషన్ ఫ్రీక్వెన్సీ రోజుకు 5 నుండి 6 సార్లు మరియు రెండు రోజుల తర్వాత 3 నుండి 4 సార్లు వరకు తగ్గింది. ఇప్పుడు పిల్లవాడు ప్రశాంతంగా ఉన్నాడు. మోతాదు TDS కు తగ్గించబడింది శిశువు సాధారణ మలాన్ని విసర్జించడం ప్రారంభించింది, ఒక వారం తర్వాత అది ODకి తగ్గించబడింది. ఇది శిశువుకు ఆరు నెలల వయసు వచ్చేవరకు కొనసాగించబడింది. 

* 6 నెలల లోపు శిశువులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళ శరీరాలు నీటి వినియోగానికి తగిన రీతిలో ఉండవు. సంపుటి 14 సంచిక 3 ప్రశ్న 1 మే -జూన్ 2023 వార్తాలేఖ చూడండి.  .

మలబద్ధకం మరియు ఇతర కడుపు సంబంధిత సమస్యలకు CC4.4 Constipation అద్భుతమైన నివారణ అని ప్రాక్టీ షనర్  తెలుసుకున్నారు. అతను ఈ కోంబోతో ముగ్గురు రోగులకు చికిత్స చేయగా వారు చాలా త్వరగా పూర్తి ఉపశమనం పొందారు.  కనీసం పది మంది రోగుల్లో వైరల్ ఇన్ఫెక్షన్ లను నయం చేయడంలో IB  యొక్క శక్తిని వారు ప్రత్యక్షంగా చూశారు.

వైబ్రియానిక్స్ సాధన చేయడం వీరికి అపారమైన ఆనందాన్ని మరియు సంతృప్తిని ఇచ్చింది, ప్రత్యేకించి ఇతర వైద్య విధానాలు విఫలమైన చోట వైబ్రియానిక్స్ అక్షరాలా ప్రాణ రక్షకంగా నిరూపింపబడిందని తెలుసుకున్నారు. SVIRT లో బాధ్యతా యుతమైన పాత్ర పోషించడానికి, అలాగే హిందీ మరియు మలయాళం నుండి ఆంగ్లంలోకి కేసు హిస్టరీలను అనువదించడము లేదా మరేదైనా డాక్యుమెంటేషన్ పని లేదా వైబ్రేషన్స్ గురించి అవగాహన కల్పించడానికి పెంచడానికి వీరు ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రాక్టీషనల్ తాను స్వామి యొక్క వినయపూర్వక సాధనంగా భావిస్తూ స్వచ్ఛమైన హృదయంతో సేవచేసి భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతి చేస్తే అనుకూలమైన ఫలితాలు దక్కుతాయని పేర్కొంటున్నారు. రోగులకు మరియు నిరుపేదలకు ఎక్కడ ఉన్నా సరే వారికి సాయి వైబ్రియానిక్స్ చికిత్స ప్రాప్తి కావాలని స్వామికి తన హృదయపూర్వక ప్రార్థన సమర్పించు కుంటున్నారు.  

ఉదహరించిన కేసులు:  

 

ప్రశ్నలు జవాబులు

Q1. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం తీసుకునే యాంటీబయోటిక్స్ కు వైబ్రియానిక్స్ లో ప్రత్యామ్నాయం ఏమిటి?  

A. యాంటీబయాటిక్స్ అనేవి సహజమైన సెమిసింతటిక్ లేదా సింతటిక్ యాంటీ మైక్రోబియల్స్, ఇవి బ్యాక్టీరియాను చంపటం లేదా వాటిని పెరగకుండా నిరోధించడం ద్వారా పనిచేస్తాయి. యాంటీబయోటిక్స్ లో అనేక తరగతులు ఉన్నాయి, ప్రతీ ఒకటి నిర్దిష్ట రకం బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా మాత్రమే ప్రభావితం చూపిస్తుంది. వైబ్రో రెమిడీ బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లను లకు ఒక సాధారణ నివారణ. యాంటీబయాటిక్ వలే కాకుండా వైబ్రేషన్లు బ్యాక్టీరియాను లేదా వైరస్ ను చంపవు కానీ ఇన్ఫెక్షన్తో పోరాటానికి శరీరం యొక్క స్వతః నిరోధక రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా పనిచేస్తాయి. వైబ్రియానిక్స్ లో మనకు 108CC బాక్సులో మనకు CC9.2 Infections acute అలాగే SRHVP లో NM36 War లేదా SR293 Gunpowder, సాధారణంగా ఇది మరింత శక్తివంతమైన వైబ్రేషన్. సరళంగా చెప్పాలి అంటే మనము లక్షణాల ప్రకారం లేదా శరీర భాగానికి కంపనాల ద్వారా అందిస్తాము, తద్వారా అది నేరుగా ఆ అవయవానికి వెళుతుంది.  

_______________________________________________________________________________

Q2. ఫ్రిజ్ లో వాటర్ రెమిడీ ని నిల్వ చేయవద్దని మనము ఎందుకు సిఫారసు చేస్తున్నాము?   

A.ముందుగా మనం అన్ని రెమెడీలు బలమైన కాంతికి ప్రత్యేకించి సూర్యరశ్మికి దూరంగా చల్లని ప్రదేశంలో ఉంచాలని గుర్తుంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో కంప్రెసర్ నుండి వచ్చే మెకానికల్ వైబ్రేషన్లు రెమిడి యొక్క శక్తిని మార్చగలవు కాబట్టి రెమిడీలను ఫ్రిజ్ లో ఉంచము. ఐతే వాటర్ రెమిడీ ని ఫ్రిజ్ లో తక్కువసమయం అనగా రెండు రోజులు ఉంచడం( వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రమే) సురక్షితమని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. కనుక చిన్న పరిమాణంలో పదేపదే నీటి రెమిడిని తయారు చేయడం ఉత్తమ ఎంపిక, రెమిడీ నీరు మిగిలిపోయి ఉంటే దాన్ని మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. కొంతమంది ప్రాక్టీషనర్లు పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఫ్రిడ్జ్ వెలుపల నీటి నివారణ రెండు రోజులు కంటే ఎక్కువ సేపు ఉంటుందని తెలిపారు. సంపుటి 4 సంచిక 2 ప్రశ్న 1 మరియు సంపుటి 6 సంచిక 1 ప్రశ్న 6 సమాధాలను చూడండి.   

_______________________________________________________________________________

Q3. మనకు అనేక శరీరాలు ఉన్నాయి, భావోద్వేగ, భౌతిక, ఎతిరిక్, మానసిక, సూక్ష్మ, ఆధ్యాత్మిక మొదలైనవి. మరి ఏ శరీరం పై వైబ్రియానిక్స్ గోళీలు పని చేస్తాయి, దయచేసి వివరంగా తెల్పండి. 

A.గోళీల లోని క్రియాశీల పదార్థం హీలింగ్ వైబ్రేషన్, ఇది ఎథిరిక్ స్థాయిలో పనిచేస్తుంది, ఎందుకంటే ఇది సూక్ష్మ శక్తుల నెట్వర్క్ కనుక హీలింగ్ వైబ్రేషన్లు దీనిపై తమ ప్రభావం చూపుతాయి. గమనించ వలసిన విషయం ఏమిటంటే అన్ని శరీరాలు ప్రాణాధార శక్తి ద్వారా సన్నిహితంగా పరస్పరం సంధానింపబడి ఉన్నాయీ కనుక ఒక శరీరంలో జరిగే మార్పులు అన్ని ఇతర శరీరాలకు చేరవేయబడతాయిక అందుచేత ఈ హిలింగ్ వైబ్రేషన్లు అన్ని స్థాయిలపై ప్రభావం చూపుతాయని గమనించాలి.  

_______________________________________________________________________________

Q4. ఒక SVP తన వ్యక్తిగత SRHVP తన సొంతంగా తెలిసిన రెమిడీల ద్వారా అనగా హోమియోపతి నివారణలు లేదా వ్యాధికి సంబంధించినవి లేదా సహజ/వృక్ష పదార్థాలు ద్వారా కార్డుని సృష్టించాలనుకుంటే అతను దాన్ని ఎలా చేయగలడు?

A. కార్డులు రేడియానిక్స్ మరియు రేడిఎస్తీసియా యొక్క సాంకేతికతలను ఉపయోగించి తయారుచేయబడతాయి. అందువల్ల ఈ అంశం వైబ్రియానిక్స్ పరిధికి వెలుపల ఉన్నది. అయితే మీరు హోమియోపతి ఔషధం యొక్క వైబ్రేషన్ చేయాలనుకుంటే మీరు మదర్ టింక్చర్ లేదా పోటెన్సీ ని మీకు కావలసిన శక్తికి పోటెంటైజ్ చేయవచ్చు. అదేవిధంగా ఏదైనా సహజమైన లేదా మొక్కల పదార్థంతో కూడా చేయవచ్చు.   

_______________________________________________________________________________

Q5. వైబ్రియానిక్స్ మన శరీరంలోని అన్ని స్థాయిల్లో పనిచేస్తుంది కాబట్టి శారీరక రుగ్మతలు మాయమైన తర్వాత రోగులు వారి     మానసిక మరియు భావోద్వేగ స్థితిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం అదనంగా ఏదైనా చేయాల్సిన అవసరం ఉందా?   

A. శారీరిక వ్యాధికి చికిత్స చేసినప్పుడు వైబ్రియానిక్స్ రెమెడీస్ కూడా మానసిక మరియు భావోద్వేగ స్థాయిలను కూడా సమతుల్యం చేస్తాయి, అయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని గుర్తుంచుకోవాలి. మన శారీరిక మరియు మానసిక శ్రేయస్సుకు అనుకూలమైన ఆరోగ్యకరమైన జీవనశలిని అనుసరించకపోతే అనారోగ్యం తిరిగివచ్చే అవకాశం ఉంది అయితే కొన్ని సందర్భాల్లో దీనికి చాలా సమయం పట్టువచ్చు. కనుక వార్తా లేఖలు చదవడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ధ్యానం, సానుకూల ఆలోచన మొదలైన వాటిని పాటించమని సిఫారసు చేస్తున్నాము.  

దివ్య వైద్యుని దివ్య వాణి

" సంపూర్ణ ఆరోగ్యం యొక్క రహస్యం మనసును ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచుకోవడంలో ఉంది. ఎప్పుడు చింతించకండి, ఎప్పుడు తొందరపడకండి, ఎటువంటి భయం, ఆలోచన లేదా ఆందోళనలతో బాధపడకండి."

…శ్రీ సత్యా సాయి బాబా, దివ్య వాణి                                                            https://www.srisathyasai.org/pages/sai-his-messages-quotes.html#

మనము  చేపట్టే సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను అనుభవింప చేసుకోవడానికి ఉద్దేశింపబడినవి. మీరు ఇతరులకు సేవ చేస్తున్నారు అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. వాస్తవానికి మీరు ఎవరిని “ఇతరులుగా” పరిగణించకూడదు ఎందుకంటే అందరూ దైవ స్వరూపులే. కానీ మనిషి ఈ సత్యాన్ని గ్రహించే ప్రయత్నాలు చేయడం లేదు. అందువల్లనే ఇబ్బందులకు గురి అవుతున్నాడు.  భగవంతుడు సర్వవ్యాపకుడని గ్రహించిన తర్వాత అతను బాధల నుండి విముక్తి పొందుతాడు. బాధలు తొలగిపోవాలంటే మనిషి సమాజంలో ఐక్యత అనే సూత్రాన్ని పాటించాలి”.

...శ్రీ సత్యా సాయి బాబా, "సమాజంలో ఐక్యత కోసం సేవా కార్యక్రమాలు" దివ్యా వాణి 21జులై 2002                            https://saispeaks.sathyasai.org/discourse/service-activities-unity-society

ప్రకటనలు

భవిష్యత్తులో నిర్వహింప బోయే వర్క్ షాప్ లు

• భారతదేశం పుట్టపర్తి: వర్చువల్ AVP 1-20 నవంబర్ 2024** 26-28 నవంబర్ 2024**, సంప్రదించండి [email protected]

  • ఇండియా పుట్టపర్తి : 2023మే బ్యాచ్ కోసం వర్చువల్ SVP ఫాలో అప్ కోర్సు  27-28 జులై 2024, సంప్రదించ వలసిన వారు [email protected]
  • ఇండియా పుట్టపర్తి: Virtual AVP ప్రాక్టికల్ వర్క్‌షాప్ 1-20 Nov 2024** తర్వాత ముఖాముఖి వర్క్‌షాప్ 26-28 నవంబర్ 2024**, సంప్రదించ వలసిన వారు [email protected] 
  • ఇండియా పుట్టపర్తిSVP వర్క్ షాప్ తేదీలు 1-3 డిసెంబర్  2024 కు మార్చబడినవి ** సంప్రదించ వలసిన వారు [email protected]

*వర్క్ షాప్ లు ప్రవేశ ప్రక్రియ మరియు e కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే.

**మార్పుకు లోబడి

 

అదనంగా

1. ఆరోగ్య కథనం

ఆరోగ్యవంతమైన ప్రేగుల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం !

“కడుపు చాలు అని కేకలు వేస్తుంది కానీ నాలుక మరింత కావాలి అని వత్తిడి చేస్తుంది, ఈ విధంగా మనిషి నిస్సహాయంగా వ్యాధికి లక్ష్యం అవుతున్నాడు. మీరు తీసుకునే ఆహారం మీరు నియంత్రించ గలిగే ఏకాగ్రత స్థాయిని నిర్ణయిస్తుంది, దాని నాణ్యత మరియు పరిమాణం మీ స్వీయ నియంత్రణ ఎంతవరకు తగ్గింపబడిందో లేదా పెంచబడిందో నిర్ణయిస్తుంది... జీవించడానికి మాత్రమే తినండి కానీ తినడానికి మాత్రమే జీవిస్తున్నారని భావించవద్దు”.... సత్య సాయి బాబా1,2   

1. గట్ అంటే ఏమిటి?

సాధారణ వాడుక భాషలో ప్రేగులను గట్ అనే ఆంగ్ల పదంతో సూచిస్తారు. మన జీర్ణవ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. ఎలిమెంటరీ కెనాల్ గా కూడా పిలవబడే ఈ గట్ వాస్తవానికి జీర్ణాశయ అంతర మార్గము (GI ట్రాక్ట్ ) అని పిలుస్తారు. ఇది నోటి నుండి మొదలవుతుంది, అన్నవాహిక ద్వారా కడుపులోకి ఆహారం సులభంగా వెళ్లడానికి లాలాజల రసాలు ఆహారాన్ని తేమగా ఉంచడమే కాక యాంత్రిక జీర్ణక్రియకు కూడా సహాయ పడతాయి. జీర్ణాశయంలో ఆహారం మరింతగా విభజింపబడి జీర్ణ రసాలతో కలిసి కైమ్ అనే పేరుతో చిన్నప్రేగు కు తీసుకువెళ్లబడుతుంది. 22 అడుగుల పొడవుగా చుట్టబడిన గొట్టం వలె ఉండే చిన్న ప్రేగు మన శరీరం కంటే మూడున్నర రెట్లు పొడవు ఉంటుంది. దీన్ని ఆంత్రము అనికూడా పిలుస్తారు. నీరు, పోషకాలు మరియి జీర్ణ రసాలు మ్యూకోసా ద్వారా గ్రహింపబడతాయి, మరియు జీర్ణం కాని మూలకాలు పెద్ద పేగు లేదా కోలన్ కు పంపించబడతాయి. చూషణ ప్రక్రియ ఇక్కడ పూర్తయ్యి వ్యర్ధాలు పురీష నాళము మరియు పాయువు ద్వారా తొలగింపబడతాయి. అనుబంధ అవయవాలు కాలేయము, ప్యాంక్రియాస్, మరియు గాల్బ్లేడర్ ఈ జీర్ణ ప్రక్రియలో సహాయపడతాయి. అందువల్ల గట్  అనేది కేవలం ఒక ప్రసరణ ఉపకరణం మాత్రమే కాదు, జీర్ణక్రియ, శోషణము, సమీకరణము, మరియు వ్యర్ధాలను మలము ద్వారా పంపించి వేసే పూర్తిస్థాయి వ్యవస్థను నిర్వహిస్తుంది. దీని ప్రాముఖ్యత విషయంలో మనం తక్కువ అంచనా వేస్తాం కానీ 2వ మెదడుగా పిలవబడే ఈ అవయవం ఒక సామెతలో చెప్పినట్లుగా గట్(గుడ్) ఫీలింగ్ అనే అనుభూతి మనకు అందిస్తుంది.  

2. ఆరోగ్య కరమైన ప్రేగు యొక్క ప్రాముఖ్యత  

2.1 ప్రేగు వృక్ష జాలం:  శైశవ దశలో ప్రేగులో ఏ సూక్ష్మ జీవులు లేకుండా శుద్ధిగా ఉంటుంది. క్రమ క్రమంగా ఇది చెడు మరియు మంచి బ్యాక్టీరియా ను స్వీకరించడం ప్రారంభించడంతో వలస ప్రారంభమై ఇది మైక్రోబియం లేదా మైక్రో బయోటా అని పిలవబడే ట్రిలియన్ల కొద్ది బ్యాక్టీరియా యొక్క అధనాతన సంక్లిష్టమైన సూక్ష్మ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. దీనిలో కొన్ని రకాల వైరస్లు, శిలీంద్రాలు లేదా ఫంగి, మరియు పరాన్న జీవులు ఇవన్నీ కూడా పేగుల్లో పెద్ద సంఖ్యలో ఉంటాయి. జీవితం యొక్క ప్రాధమిక దశలో ఏర్పడిన మైక్రోబియం యొక్క నాణ్యత అనువంశికత, మాతృ సంబంధిత మైక్రో బయోటా, యోని నుండి సాధారణ డెలివరీ (సిజేరియన్ కాకుండా) మరియు తల్లి పాలు ఇవ్వడం పై ఆధారపడి ఉంటుంది5. బాల్యంలో పొందిన ప్రాథమిక మైక్రోబయోట మెరుగైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆహారం మరియు పర్యావరణ బహిర్గతం, ఆరోగ్యం మరియు వ్యాధి రెండింటి లోనూ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ప్రాధమిక దశ మైక్రో బయోటా వయోజన మైక్రో బయోట నాణ్యత నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.6

2.2 మైక్రోబియం ఎలా పనిచేస్తుంది మరియు మన శరీరానికి ఎలా మేలు చేస్తుంది! ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలో అతిధి గట్ కణాలు మరియు నివాస బ్యాక్టీరియా శాంతియుతంగా సహజీవన సంబంధంతో ఉంటూ రెండూ ఒకదానివలన మరొకటి ప్రయోజనం పొందుతాయి. మానవ ప్రేగు వ్యవస్థ బ్యాక్టీరియాకు పోషకాలు అందిస్తే ప్రతిఫలంగా ఇది జీర్ణ క్రియ, శోషణ మరియు ఇతర ప్రక్రియలకు సహాయపడుతుంది. అవి సమ్మేళనాలను విచ్చిన్నం చేస్తాయి అమినో ఆమ్లాలు మరియు B విటమిల్లు మరియు విటమిన్ K తో సహా కొన్ని విటమిన్లను సంశ్లేషణ చేస్తాయి. అవసరమైన కీలక B12 ఏర్పడడాని కావలసిన ఎంజైములు గట్ బ్యాక్టీరియా ద్వారా సంశ్లేషణ చేయబడతాయి కానీ మొక్కలు లేదా జంతువుల ద్వారా కాదు6. ఇవి పెద్ద ప్రేవులోని కార్బోహైడ్రేట్ల జీవక్రియకు సహాయ పడతాయి. చిన్నపేగు యొక్క పై భాగంలో చక్కెర త్వరగా శోషింపబడుతుంది. స్టార్చ్ మరియు ఫైబర్ సమ్మేళన కార్బోలు పెద్ద పేగులోకి ప్రయాణిస్తాయి అక్కడ మైక్రో బయోట వాటిని జీర్ణ ఎంజైముల సహాయంతో విచ్చిన్నం చేస్తుంది. జీర్ణం కానీ సమ్మేళనలు పులియబెట్టబడి చిన్న గొలుసు కొవ్వు ఆమ్లాలను (SCFA) విడుదల చేస్తాయి. ఇవి పెద్ద పేగు యొక్క PH ని తగ్గించి హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను పరిమితం చేస్తాయి. గట్ లో ఉన్నSCFA కండరాల పనితీరును మెరుగుపరవడమే కాక క్యాన్సర్ ప్రేగు రుగ్మలతో సహా దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది మరియు వ్రణోత్పత్తి(అల్సరేటివ్ కొలైటిస్) పెద్దప్రేగు క్రోన్స్ వ్యాధి మరియు యాంటీబయాటిక్ సంబంధిత విరోచనాల చికిత్సలో కూడా సహాయపడుతుంది. గట్ బ్యాక్టీరియా కూడా కొవ్వులను జీర్ణం చేయడంలో సహాయపడటానికి కాలేయం పంపిన బైల్ లేదా పిత్తాన్ని జీవ క్రియ చేస్తుంది. 6

గట్ మరియు మెదడు మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ మన మానసిక ఆరోగ్యాన్ని గుర్తించడానికి పేగు మైక్రోబయోటాను అనుమతిస్తుంది. శరీరం లో 95% శరిటోనిన్ అనే భావోద్వేగాలను ప్రభావతం చేసే హార్మోన్ గట్ బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఒత్తిడి మైక్రో బయోట యొక్క కూర్పును ప్రభావితం చేయడంతో ఇది మన హార్మోన్లు మరియు నాడీ వ్యవస్థకు ప్రతికూలంగా మారుతుంది7

ఇంతే కాకుండా మన రోగ నిరోధక వ్యవస్థలో 80% మన ప్రేగు యొక్క జీవక్రియ వ్యవస్థలతో దగ్గర సంబంధం కలిగి ఉన్నది. గట్  బ్యాక్టీరియా యాంటిజన్స్ (గుర్తించని పదార్థము లేదా జీవ వ్యవస్థ) తగువిధంగా ప్రతి స్పందించడానికి రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది మరియు శిక్షణ ఇస్తుంది. అలెర్జీ కి గురికాని పిల్లలతో పోలిస్తే అలెర్జీతో బాధపడే శిశువులు మరియు పిల్లలలో అనేక రకాల ప్రేగు సంబంధిత బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తింప బడింది.  

శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పేగు హానికరమైన వ్యాధికారకాలకు దూరం చేస్తుంది రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది మరియు మ్యాడ్యులేట్ చేస్తుంది అలర్జీలు, ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులను నివారిస్తుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది

2.3 మంచి ప్రేగు వృక్షజాలం మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే కారకాలు: బలమైన ప్రేగులు సూక్ష్మజీవులు యొక్క ఆరోగ్యకరమైన వైవిధ్యాన్ని కలిగి ఉండడంతో  ఏ ఒక్క బ్యాక్టీరియా, వైరస్, లేదా ఫంగస్ ఆధిపత్యం చెలాయించదు. సరైన వైవిద్య ఆహారం ద్వారానే ఇది చేకూరుతుంది.  

ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు: కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, బీన్స్ మరియు చిక్కుళ్ళు, గింజలు మరియు విత్తనాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు స్థూల మరియు సూక్ష్మ పోషకాలు యొక్క మంచి కలయికతో ఉన్నవి మనకు అత్యవసరము. సంపూర్ణ ఆహారము ఐన అన్నము మరియు బీన్స్, చీజ్ తో కూడిన పాస్తా, పిటా బ్రడ్ మరియు హ్యూమస్, వేరుశనగ, వెన్న వంటి ఆహారాలు అన్ని అమైనో ఆమ్లాలను అందిస్తాయి.

ప్రీ బయోటిక్స్: సహజంగా అనేక మొక్కల ఆహారాల్లో ఉంటాయి. ప్రేగు బ్యాక్టీరియాకు మంచి ఆహారంగా పనిచేసి వాటిని పెంపొందించుకుంటాయి. అన్ని ఫ్రీ బయోటిక్స్ ను ఫైబర్ అని చెప్పవచ్చు కానీ అన్ని ఫైబర్ రిచ్ ఆహారాలు ఫ్రీ బయోటిక్స్ కాదు. ఇవి ఆపిల్స్, అరటి వంటి పండ్లు, వచ్చి వెల్లుల్లి, ఉల్లిపాయలు, లీక్స్, ఆస్పరాజస్, ఆర్టీచోక్స్, క్యాబేజీ, జికామ లేదా మెక్సికన్ టర్నిప్, బఠానీలు, బ్యాండ్ లైన్ గ్రీన్స్ వంటి కూరగాయలు, గోధుమలు, ఓట్స్, రై, బార్లీ, క్వినోవా, ఉసిరి, మొక్కజొన్న వంటి తృణధాన్యాలు, బీన్స్ మరియు చిక్కుళ్ళు, అవిసె గింజలు, చియా గింజలు మరియు వాల్ నట్స్ వంటి గింజలు9

ప్రీ బయోటిక్స్ అనేవి ప్రయోజన కరమైన మైక్రో బయోటా  కు సజీవ తార్కాణాలు: ది యాక్టివ్ లేదా లైవ్ కల్చర్ తో కూడిన ప్రాసెస్ చేయని పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలలో కనిపించే ప్రత్యేక ప్రయోజనకరమైన మైక్రోబయోటా ఊరగాయగా చేసిన  కూరగాయలు, సోయా ఆధారిత తెంపే, మీసో(బి విటమిన్లు ముఖ్యంగా బి12 సమృద్ధిగా) నాటో, కించి, మరియు సౌర్ క్రాట్ ప్రత్యేకించి క్యాబేజీ, కాఫీర్(పాల ప్రపంచంలోని చాంపియన్ అని పిలవబడే పాల పానీయం) మరియు పులియబెట్టబడిన టీ  (కొంబుచా) పులియబడిన లేదా ఆవిరితో ఉడికించిన భారతీయ ఇడ్లీలు, మరియు ఢోక్లా వంటి ఆహారాలు ఇప్పటికీ ప్రయోజనకరంగా పరిగణింపబడుతున్నాయి. అయినప్పటికీ ప్రోబయాటిక్స్ ఆవిరితో లేదా ఉడికించిన పదార్ధాలలో మనుగడ సాగిస్తాయా అనే దానిపై విభిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి

హైడ్రేషన్: స్వచ్ఛమైన నీరు ఎక్కువగా తీసుకుంటూ, రసంతో కూడిన తాజా పండ్లు మరియు కూరగాయలతో శరీరాన్ని ఆర్ద్రతగా ఉంచండి.

2.4. అసమతుల్యత మరియు అనారోగ్య గట్ మైక్రోబియమ్ కు కారణమయ్యే కారకాలు: మన పేగుల యొక్క దైనందిన కదలిక సూక్ష్మజీవుల ఉత్పత్తిని నిర్ధారిస్తుంది. జీర్ణాశయ మార్గం ద్వారా ఆహారం మరియు వ్యర్ధాల కదలిక వివిధ సూక్ష్మజీవులను ఆ మార్గంలో వివిధ ప్రదేశాల్లో పంపిణీ చేస్తుంది. తొలగింపు వేగంగా జరిగితే అనారోగ్యకరమైనవి వృద్ధి చెందవు. కొన్ని ఆహారాలు, అంటువ్యాధులు, యాంటీబయోటిక్స్, ఏవైనా మందుల యొక్క దీర్ఘకాలిక వినియోగం, నిద్ర తక్కువ కావడం, అధిక స్థాయి వత్తిడి స్థాయి వల్ల సమతుల్యత దెబ్బతింటుంది. ప్రాసెస్ చేయబడిన లేదా చక్కెర అధికంగా ఉండే ఆహారాలు అనారోగ్యకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందటానికి సహాయపడతాయి. ఆల్కహాల్, పొగాకు, పొగ, ఇతర కాలుష్య కారకాలు మరియు పురుగుమందులు వంటి పర్యావరణ విష పదార్థాలు మంచి సూక్ష్మజీవులు వృద్ధి చెందకుండా చేస్తాయి. 8,11,12

3. ప్రేగు బ్యాక్టీరియా అసమతుల్యత లక్షణాలు (గట్ డిస్ బయోసిస్)

డిస్ బయోసిస్ అనేది మైక్రోబియం యొక్క వైవిధ్యం మరియు అసమతుల్యత లక్షణము. దీని లక్షణాలు నోటి దుర్వాసన, నొప్పితో కూడిన గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, ఆమ్లత్వం, యాసిడ్ రిఫ్లెక్స్, పేలవమైన జీర్ణ క్రియ, పొత్తికడుపులో నొప్పి, అతిసారం, మలబద్ధకం, ప్రేగు అలవాట్లలో మార్పు, ఆరోగ్యంగా లేనట్లు అనిపించడం, ఆకస్మికంగా ఆహార అసహనం, ఊహించని  అలసట, ఆందోళన మరియు నిరాశ వంటి మానసిక రుగ్మతలు, బరువు పెరగటం, స్వీటు పై మక్కువ, చర్మంపై దద్దుర్లు లేదా అలర్జీలు మరియు నిద్రారుగ్మతలు.11,13ఈ లక్షణాలకు ఇతర వైద్య సంబంధిత కారణాలు లేకుంటే  ఇది అనారోగ్య ప్రేగు మరియు ప్రాసెస్ చేసిన అదనపు ఆహారాలు తీసుకోవడం వలన కావచ్చు.  

సాధారణ గట్ బ్యాక్టీరియా యొక్క అసమతుల్యత తాప జనక ప్రేగు వ్యాధి (IBD) లేదా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) కు కారణం అవుతుంది. దీని విస్తృతమైన అనారోగ్య సూచికలు ఊబకాయం, టైప్ టు మధుమేహం మరియు ఆటోపి. అలాగే పార్కిన్సన్స్ లేదా ఆల్జీమర్స్ వ్యాధికి కూడా దారి తీయవచ్చు.5

మన ప్రేగు మైక్రోబియం యొక్క కూర్పును తెలుసుకోవచ్చు, కానీ వివిధ రకాలైన గట్ బ్యాక్టీరియా మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేసుకుంటూ తెలుసుకోవడానికి తగినంత పరిశోధనలు అందుబాటులో లేవు. కానీ ఇన్ఫెక్షన్లు మరియు బ్యాక్టీరియా అధిక పెరుగుదల అసమతుల్యత, ప్రత్యేకించి ఈ పెరుగుదల కనిపించే విధంగా మరియు నిరంతరంగా ఉంటే రక్తము, మలము, లేదా శ్వాస పరీక్ష ద్వారా తనిఖీ చేయవచ్చు.8

4. గట్ బ్యాక్టీరియాను పెంచడానికి, నిర్వహించడానికి, పునరుద్ధరించడానికి చిట్కాలు

  • నెమ్మదిగా తినండి, స్థానికంగా పండించిన తాజా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మరియు పులియబెట్టబడిన ఆహారాన్ని శ్రద్ధతో పూర్తిగా నములుతూ తినండి11. ఆహారం పరిశుభ్రంగా తయారు చేయబడినది నిర్ధారించుకొని ఇది దేవుని నుండి లభించిన ఒక విలువైన బహుమతిగా కృతజ్ఞతతో మరియు ప్రేమతో మౌనంగా కృతజ్ఞత మరియు ఆరాధనతో డిజిటల్ పరద్యానాలు లేకుండా తీసుకోండి. ప్యాక్ చేసిన, మరియు ప్రాసెస్ చేయబడిన ఆహారాలు లేదా ఉప్పు మరియు చక్కెర తో కూడిన పదార్ధాలు  నివారించండి. అతిగా తినవద్దు. మంచినీటి నియమాలు తప్పనిసరిగా అనుసరించండి.
  • ప్రీ బయోటిక్ ఆహారాన్ని హఠాత్తుగా పెంచవద్దు. ఇది ఉదరంలో వాయువును పెంచి అపాన వాయువు మరియు ఉబ్బరానికి దారి తీస్తుంది. భరించగలిగే తత్వాన్ని, మరియూ సున్నితత్వాన్ని అంచనా వేయడానికి తక్కువ మొత్తంతో ప్రారంభించి అధిక ఫైబర్ గల ఆహారాన్ని క్రమంగా పెంచండి. ఎందుకంటే తక్కువ ఫైబర్ గల ఆహారం తీసుకుంటే అది బ్యాక్టీరియాను తగ్గిస్తుంది మరియు వ్యాధికారిక బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
  • మీ జీర్ణ క్రియకు మరియు సెల్లులార్ స్థాయిలో మలినాల ప్రక్షాళనకు ప్రతీ రాత్రి కనీసం 12 గంటల పాటు ఉపవాసం పాటించండి. సహజ షిర్కేడియం విధానంకు అనుగుణంగా పగటిపూట సమయ పరిమితితో కూడిన ఆహారపు షెడ్యూల్నుపాటించండి14. సూర్యోదయం తర్వాత ఏదైనా పానీయం (నీరు కాకుండా) ముందుగా తీసుకోవాలనుకుంటే ఉదయం ఏడు గంటలకు తర్వాత అలాగే చివరిగా సూర్యాస్తమయం అనంతరం సాయంత్రం ఏడు గంటల లోపు తీసుకొనేలా చూసుకోండి. ఆహార విరామాన్ని 12 గంటల నుంచి కనీసం 10 గంటలకు క్రమంగా తగ్గించవచ్చు. రాత్రి 10 గంటల నిద్రకు ఉపక్రమించి సూర్యోదయానికి కనీసం ఒక గంట ముందుగా నిద్ర లేచే క్రమశిక్షణ అలవరచుకుంటే అది మంచి గట్ బ్యాక్టీరియాను నిర్మించడంలో సహాయపడుతుంది (సమయ పరిమితి తో కూడిన అట్టి ఆహారపు అలవాటు మరియు అప్పుడప్పుడు చేసే ఉపవాసం జీర్ణక్రియ ప్రక్రియకు విశ్రాంతి నిచ్చి పాత కణాల తొలగింపు మరియు కొత్త కణాల పునరుత్పత్తితో కూడిన ప్రేగు సంబంధిత మ్యూకస్ పొరకు స్వస్థత నిస్తుందని పరిశోధన సూచిస్తున్నది.) 15
  • మలవిసర్జన చేయడానికి తొడ భాగంలో బాగా వంచి కూర్చోండి లేదా వెస్ట్రన్ టాయిలెట్ ఐతే పాదాల వద్ద  తక్కువ ఎత్తున్న పీటను ఉంచి శరీర పై భాగాన్ని కొద్దిగా ముందుకు వంచి కూర్చోవాలి. ఇది కండరాలకు విశ్రాంతి నిచ్చి ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.4

చివరి మాట:  మీరు ఏమి తింటారో, ఎప్పుడు తింటారో, ఎంత తింటారో అదే మీ తత్వంగా మారుతుంది. ఫ్రీ మరియు ప్రొ బయాటిక్స్ తో కూడిన ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆహారం, తగినంత నీరు,  ఆరోగ్య కరమైన జీవనశైలి ఇవి ఆరోగ్యకరమైన ప్రేగు మరియు ఆరోగ్యకరమైన జీవితానికి కీలకము.

రిఫెరెన్సులు మరియు వెబ్ సైట్ లింకులు

  1. Sathya Sai Baba Divine Discourse on “Food and Health” on 21 Sept 1979: https://sssbpt.info/ssspeaks/volume14/sss14-31.pdf
  2. Sathya Sai Baba Divine Discourse on “Well or Ill” 26 Sept 1965: https://sssbpt.info/ssspeaks/volume05/sss05-38.pdf
  3. https://www.niddk.nih.gov/health-information/digestive-diseases/digestive-system-how-it-works#
  4. Gut, The Inside Story of Our Body’s Most Underrated Organ, Giulia Enders, published by Greystone Books, 2015.
  5. Human gut microbiome in health and disease: https://ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4566439/
  6. https://www.hsph.harvard.edu/nutritionsource/microbiome/
  7. Impact of Gut microbiome: https://www.apa.org/monitor/2012/09/gut-feeling
  8. https://my.clevelandclinic.org/health/body/25201-gut-microbiome
  9. Prebiotics: https://www.chop.edu/health-resources/food-medicine-prebiotic-foods
  10. Probiotics: https://healthline.com/nutrition/11-super-healthy-probiotic-foods
  11. https://www.betterhealth.vic.gov.au/health/healthyliving/gut-health
  12. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC6699480/
  13. Imbalance/Dysbiosis: https://my.clevelandclinic.org/health/diseases/dysbiosis
  14. Circadian rhythm for health: https://www.youtube.com/watch?v=fciGNBN0nKM
  15. Right way of intermittent fasting: https://www.youtube.com/watch?v=0P2lz45rFCA

______________________________________________________________________________

2. వర్క్ షాప్ లు & సెమినార్లు

2.1 స్పానిష్ లో AVP వర్క్ షాప్, మొంటి విడియో, ఉరుగ్వే 6-7 ఏప్రిల్ 2024

ప్రాక్టీషనర్ 01001 స్పానిష్ లో తన తొలి వర్క్ షాప్ ను నిర్వహించారు. అర్జెంటీనాకు చెందిన ఇద్దరు నిబద్ధత కలిగిన విద్యార్థులు ఉరుగ్వే కు సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ వర్క్ షాప్ కు చేరుకున్నారు. 2024 ఫిబ్రవరి 19 నుండి 23 వరకు నుండి జరిగిన వర్చువల్ కోర్సులో అర్హత సాధించి తర్వాత AVP లుగా మారారు. ప్రాక్టీషనర్ కు ఇద్దరు టీచర్లు 11422 & 10375 మద్దతు ఇచ్చారు. డాక్టర్ అగర్వాల్ ఈ రెండు రోజుల వర్క్ షాప్ లో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వారి సందేహాలకు సమాధానం ఇచ్చారు. కొత్తగా అర్హత పొందిన ప్రాక్టీషనర్లు03618 & 03619  వైబ్రియానిక్స్ యొక్క స్వచ్ఛమైన సేవా స్ఫూర్తికి గాఢంగా కనెక్ట్ అయ్యారు. మరియు వారి ఈ కోర్సు పూర్తిచేసి ఈ అపారమైన కృతజ్ఞతతో వారు స్వామి తమకు చూపిన ఈ అద్భుతమైన మార్గంలో తమ ప్రయాణాన్ని ప్రారంభించడానికి తమ నగరాలకు చేరుకున్నారు. 

______________________________________________________________________________

2.2 పుట్టపర్తి లో AVP వర్క్ షాప్, 26-28 ఏప్రిల్ 2024

ఏప్రిల్ బ్యాచ్ కి చెందిన ఎనిమిది మంది ఉత్సాహవంతులైన విద్యార్ధులు వర్చువల్ కోర్సులో అర్హత సాధించి ఏప్రిల్ 27న ఆశీర్వదింప బడిన 108CC బాక్సులు పొందడం ద్వారా AVPs 11661-11668 లు గా ఎంపిక కావడం అద్భుతమైన ఆశీర్వాదం గా భావిస్తున్నారు. కోర్స్ మొత్తంలో వారు విషయ పరిజ్ఞానము, మరియు అభ్యాస నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటూ విషయ సంబంధిత మరియు గ్రహణ శక్తి గల ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా అధ్యాపకులను ఆనందపరిచారు. వారు రోగులతో ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించే అవకాశాన్ని పొంది, రోగులనుండి వివరాలను సున్నితంగా పొందడం, వారి కోసం రెమిడీలను ప్రణాళిక ద్వారా తయారు చేయడం మరియు ఫాలో అప్ చేయడం వంటివి నేర్చుకున్నారు. డాక్టర్ అగర్వాల్ తమ ముగింపు ఉపన్యాసంలో రోగులకు చికిత్స చేయడంలో తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ వైబ్రియానిక్స్ ఎంత సరళమైనదో అంత శక్తివంతమైనదని, విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, స్వామితో సన్నిహితంగా ఉండవలసిన ఆవశ్యకత, ప్రాపంచిక ఆకర్షణ నుండి మనస్సును ఎలా మచ్చిక చేసుకోవాలి అనే విషయాలు వివరించారు. స్వామి ఆసుపత్రిలో నర్సుగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రాక్టీషనర్ 11614  మూర్ఛ, గుండెపోటు, పాముకాటు, రక్తస్రావం, లేదా డయాబెటిక్ పేషంటులలో హైపో గ్లైకేసీమియా వంటి సందర్భాల్లో కొన్ని ప్రథమ చికిత్స చిట్కాలను అందించారు. ఆనందంతో కూడిన వారి ముఖ బింబాలు కృతజ్ఞతా భావాలను వ్యక్త పరుస్తూ ఈ సేవలో మునిగిపోవడానికి తమ  సంసిద్ధతను ప్రతిబింబించాయి.   

 

 

______________________________________________________________________________

2.3 సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీ షనర్ల సమావేశము UK మిడ్ లాండ్ గ్రూప్, 21 జనవరి 2024

వర్చువల్ గా నిర్వహించిన ఈ ఒక పూట సమావేశములో చిత్తవైకల్యము మరియు హార్మోన్ల సమతుల్యత ద్వారా ఎండోక్రైన్ వ్యవస్థను నిర్వహించడం పై ప్రాక్టీషనర్లు02802 & 00534 విజ్ఞాన దాయకమైన చక్కని ప్రదర్శన అందించారు. పాల్గొన్న ప్రాక్టీషనర్లు విజిటింగ్ ఫ్యాకల్టీ  డాక్టర్ పభాని నొప్పిని నివారించే చిట్కాలు, బే ఆకులను ఉపయోగించి చికిత్స నిర్వహించే పద్ధతులను తెలిపారు. అంకిత భావంతో అనేక విధాలుగా పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం ముగిసింది.గమనిక: ఈ సమావేశంలో అందించిన మెటీరియల్ ప్రాక్టీషనర్ సైట్ లో సైట్లో (Forms > Download).ఆప్షన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.  

     

______________________________________________________________________________

3. క్యాంపులు మరియు క్లినిక్ లు 

కొత్త సాయి వైబ్రియానిక్స్ సెంటర్ ప్రారంభోత్సవం, 7 ఏప్రిల్ 2024, AP.

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులు మరియు అనుగ్రహంతో ఆంధ్ర ప్రదేశ్ లో అనకాపల్లి జిల్లా లోని అచ్యుతాపురం లో హరిపాలెం శ్రీ సత్య సాయి మందిరంలో 2024 ఏప్రిల్ 7న సాయి వైబ్రియానిక్స్ వెల్నెస్ సెంటర్ ప్రారంభించబడింది. స్థానిక సమితి సభ్యులు మరియు చుట్టుపక్కలప్రాంతాల నుండి ప్రజలు ఎక్కువగా హాజరైన ఈ కార్యక్రమంలో భక్తి పూర్వక ప్రార్ధనలు మరియు భజనలతో రీ చార్జి చేయబడిన తరువాత సీనియర్ ప్రాక్టీషనర్11567 స్ఫూర్తిదాయకమైన ప్రసంగం మరియు వైబ్రియానిక్స్ పై ప్రశ్న-జవాబు సెషన్ తో ముగిసింది. సందర్శకులకు 54 IB బాటిల్ పంపిణీ చేసిన అనంతరం హారతి మరియు ప్రసాదం తో ముగిసింది.  అంకిత భావం గల ఇద్దరు ప్రాక్టీషనర్లు11634 & 18009 ఈ కేంద్రంలో 2024 మే 5 నుండి ప్రతినెల 1వ ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రోగులకు చికిత్స చేస్తారు. 

______________________________________________________________________________

4. జ్ఞాపకార్ధం

శ్రీ మహేంద్ర పోపట్  00298…UK 2024 మార్చి 24 తేదీన 75 సంవత్సరాల వయసులో లండన్ నుండి తన స్వర్గపు నివాసానికి బయలుదేరారు. వీరు ప్రారంభ ప్రాక్టీ షనర్లలో ఒకరు, ఆ రోజుల్లో లండన్లో సమావేశాలు, వర్క్ షాప్ లు నిర్వహించడం ద్వారా UK లో  వైబ్రియానిక్స్ స్థాపనలో ఎంతో కృషి చేశారు. వైబ్రియానిక్స్ లోనికి రావడంలో వీరి నుండి ప్రేరణ పొందిన వీరి జ్యేష్ట సోదరి ప్రాక్టీషనర్02821 వీరి గురించి ఇలా చెప్పారు, “ఇతని నిష్క్రమణం చాలా ఆశ్చర్య కరమైనది! అతను ఎవరికీ లేనంత బలం మరియు ధైర్యం కలిగి ఉన్నాడు, అతని సేవ నిజంగా నిస్వార్ధమైనది, వారి సన్నిహితులు అందరూ ఇవే మనోభావాలు పంచుకుంటున్నారు. అతను ఎల్లప్పుడూ వైద్య సేవపై దృష్టిపెట్టి ఉండేవారు, రోగులకు సేవ చేయడానికి అనేక నెలలు పుట్టపర్తి కి వచ్చి ఉండేవారు. 2020లో అతనికి స్ట్రోక్ వచ్చిన నాటి నుండి వారు అంతగా చురుగ్గా లేరు కానీ రోగులకు మరియు ఇతర ప్రాక్టీషనర్లకు సలహాల ద్వారా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు వారి నిష్క్రమణానికి ఎంతో చింతుస్తున్నారు. మరియు సహోదరితే మిస్ అవుతున్నాడు. వారి ఆత్మకు శాంతి కలగాలని మరియు శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని ప్రార్ధన!