ADHD &ఆటిజం 03518...Canada
2020 జనవరి3న అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ADHD మరియు ప్రసంగ బలహీనత,మరియు ఆటిజం తో బాధపడుతున్నఐదు సంవత్సరాల బాలిక విషయమై ఆమె తల్లి ప్రాక్టీషనరును సంప్రదించారు. ఆమె ఒక చోట స్థిరంగా ఉండక ఎప్పుడూ కదులుతూ హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది. ఆమె కోరింది ఇవ్వకపోతే అన్నీ విసిరేస్తూ ఉంటుంది. రోజంతా ఆమె గిరగిరా తిరగడం, పైకి ఎక్కడం లేదా దిగడం చేస్తూ ఉంటుంది. ఆమె ఏదైనాచెప్పదలుచుకుంటేశబ్దాలు చేస్తుంది కానీ సరళ పదాలు కూడా మాట్లాడలేదు. ఆమె డయాపర్స్24/7 ఉపయోగిస్తూనే ఉంటుంది. పాప తల్లిదండ్రులు ఈ పాపని భరించడం కష్టమని ఆమెను సామాజిక సమావేశాలకు ఎప్పుడూ తీసుకెళ్ళేవారుకాదు.
ఆమె ఎల్లప్పుడూ కడుపు ఉబ్బరం,అజీర్ణం,మలబద్ధకం లేదా విరేచనాలతో బాధ పడుతూ ఉంటుంది. ప్రతీ సాయంత్రం ఆమె పొత్తికడుపు పట్టుకొనిఏడుస్తూ ఉంటుంది. ఆమెకు ఎప్పుడూ సరైన నిద్రే ఉండదు.3 సంవత్సరాల క్రితం ప్రకృతి వైద్యులు నిద్రకు మరియు అజీర్ణం కోసంమందులు ఇచ్చారు. ఇవి సహాయపడుతూనే ఉన్నాయి కనుక వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ అల్లోపతి మందులు మాత్రం ఇవ్వలేదు. ఆమె స్పీచ్ థెరపీ చేయించుకుంటుప్రత్యేక అవసరాల కార్యక్రమంలో ఉంది. 1 నుండి 10 వరకూ ఉండే హైపర్ యాక్టివిటీరేటింగ్ విషయంలో ఆమె బిహేవియర్ రేటింగ్ 8 వద్ద ఉంది.
ప్రాక్టీషనర్ఆ పాపతో ప్రతీ రోజూ 21 సార్లు ఓంకారం జపించాలని మరియు ఇంట్లో గాయత్రి మంత్రము రికార్డు వినబడుతూ ఉండేలా చేయాలని సిఫారసు చేస్తూ క్రింది రెమిడీ ఇచ్చారు:
CC12.2 Child tonic + CC15.5 ADD & Autism...TDS
పాప తల్లి 2020 ఫిబ్రవరి 26 మంచిరోజుగా భావించి రెమిడీ ప్రారంభించారు. ఈ సమయానికిపాప వ్యర్ధంగా తిరగడం 20% తగ్గింది.రోజువారీ జపఫలితం దీనికి కారణమని తల్లి భావించారు. ఒక వారంలోనే అమ్మాయి భోజనం చేసిన వెంటనే దుర్వాసన కలిగించే జారుడు విరోచనం చేసుకోవడం ప్రారంభించింది కానీ నొప్పి మాత్రం జాడలేదు. పాప ప్రక్క మీద మెలికలు తిరుగుతోంది,ఇది ఒక క్రొత్త ప్రవర్తనఐతే ఇదిపులౌట్ వలన ఏర్పడిందని ప్రాక్టీషనరు చెప్పి రెమిడినికొనసాగింపజేశారు. నిద్రా భంగం అలానే కొనసాగింది. ఏప్రియల్ చివరినాటికి హైపర్ యాక్టివిటీ మరియుబిహేవియరల్ రేటింగ్ 6 కంటే తక్కువ స్థాయితో మెరుగుపడింది. ఆమె ఇష్టపూర్వకంగా ఆదేశాలు వింటూనే ఉంది. ఆమె మామూలుగా తినగలుగుతున్నది. మరో నెలతరువాత మంచం మీద పొరలడం పైకి ఎక్కాలని ప్రయత్నించడం తనచుట్టూ తాను తిరగడం వంటివి అన్నీ ఆగిపోయాయి. ఆమెకు విరోచనం సాఫీగాఔతోంది. ఆమె రాత్రిళ్ళు7½గంటలు నిద్రపొగలుగుతోంది. అంతేకాక ఆమె మొదటిసారి ఇతర పిల్లలతో సంభాషించడం ప్రారంభమైంది. అలాగే తనంత తాను ఆదుకోవడంకూడా ప్రారంభించింది. గతంలో ఇది చాలా అరుదుగా ఉండేది. ఆమె బైక్ రైడింగ్ మరియు తనంత తాను రంగులను ఎంపిక చేసుకుంటూ పెయింటింగ్ పట్ల ఆసక్తి చూపించింది. ఈ మార్పులతో తల్లిదండ్రులుఎంతో ప్రోత్సహింపబడిపాపకుటాయిలెట్ శిక్షణ ప్రారంభించారు.
జూన్ చివరి నాటికి తల్లిదండ్రులు పగటిపూట డయాపర్స్ తో పూర్తిగా అవసరం లేకుండా బయటపడడంతో టాయిలెట్స్ శిక్షణ చాలా విజయవంతం అయిందని తల్లిదండ్రులు భావించారు. పాపకుశిషణ ఇచ్చే థెరపిస్టుపాపకుటాయిలెట్ శిక్షణ అభివృద్ధికి ఎంతో సంతోషించారు.
సెప్టెంబరులో పాప పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది. అక్కడ కూడా చాలా చక్కగా ప్రవర్తించడం తరగతి గదులలో కూర్చోగలగడం మరియు స్వయంగా బాత్ రూమ్ కు కూడా వెళ్లగలగడం కొనసాగింది. పాప హైపర్ యాక్టివ్ స్థాయి3 కు తగ్గిందని ఆమె తల్లి తెలియజేసారు. 2020 డిసెంబర్ 2 నాటికి నాటికిపాప హైపర్ యాక్టివ్ స్థాయి ఆమె వయసు పిల్లల సాధారణ స్థాయికి చేరింది. ఆమె తన ఆన్లైన్ తరగతుల కోసం కూడా పూర్తి శ్రద్ధతో కూర్చోవడం కూడా కొనసాగింది. ఆమె రెమిడిఅదేమోతాదులో కొనసాగించబడుతోంది.
పాప తల్లి యొక్క సాక్ష్యము:
మా కుమార్తెకు 2017 ఏప్రిల్ లో 2 సంవత్సరాల వయసులో సోషల్ కమ్యూనికేషన్ డిజార్డర్ తో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె ప్రతీ వారం రెండు గంటలసమయం SLP (స్పీచ్ లాంగ్వేజ్ పాతాలజీ/ భాషా ప్రక్రియల శిక్షణ)మరియు OT(ఆక్యుపేషనల్ థెరపీ/ప్రవృత్తి చికిత్స) పొందడంతోపాటు జీర్ణ సమస్యల కోసం మరియు నిద్ర కోసం ప్రకృతి వైద్యులు సూచించిన మందులపై ఆధారపడి ఉంది. 2020 ఫిబ్రవరిలో సాయి వైబ్రియానిక్స్తీసుకున్నప్పటి నుండిపాప విషయంలో గణనీయమైన పురోగతిని మేము చూసాము.ఈ పురోగతి మమ్మల్ని ఎంతో ఆకట్టుకునడంతో2020 మేలోటాయిలెట్ శిక్షణకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాము(గతంలో ఇది సాధ్యం కాలేదు). ఆమెలో అనూహ్యమైన మార్పు వచ్చి పూర్తిగా డయాపర్స్నుండి బయట పడటమేకాకఅవసరమైనప్పుడు స్వతంత్రంగా టాయిలెట్ ఉపయోగించడం ప్రారంభించిది. ఆమెఇప్పుడు గ్రేడ్ వన్ లో ఉండి ఆన్లైన్క్లాసులు తీసుకుంటూ చదువుపై దృష్టి సారించి ఇష్టపూర్వకంగా కార్యకలాపాల్లో పాల్గొంటూతన హోం వర్కు అసైన్మెంట్లను పూర్తిచేసుకోగలుగుతోంది. ఆమె అపరిచితులతో మరియు తన తోటి సమూహంతో బాగా కలవగలుగుతున్నది. ఈ అభివృద్ధిని చూసి ఆమెకు చికిత్స చేసే థెరపిస్టులు ఎంతో ముగ్ధులయ్యారు. డిసెంబర్ మా కుటుంబం క్రిస్మస్సెలవలుగడపడానికి రాత్రి సమయంలో 12 గంటలు ప్రయాణంలో కూడా మా అమ్మాయి చాలా బాగా ప్రవర్తించింది. మేము ఈ ఫలితాలతో ఎంతో ఆనందంతో ఉండడమే కాకుండా వైబ్రియనిక్స్ రెమిడీలు కొనసాగడానికి ఇష్టపడుతున్నాము. ఈ సానుకూలధృక్ఫధముతో మరింత మెరుగైన ఫలితాలు చూస్తామని ఆశిస్తున్నాము.