అదనంగా
Vol 12 సంచిక 4
జూలై / ఆగస్ట్ 2021
1. ఆరోగ్య చిట్కాలు
మీ ముక్కు మరియు గొంతును జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం!
“చక్కని వాసన మరియు పరిమళ భరితమైన వాసన గల సువాసనలను మాత్రమే ముక్కు ద్వారా గ్రహించాలి. దుర్వాసన పీల్చినప్పుడు వ్యాధికి దారి తీస్తుంది. మీరు దుర్వాసన గల గాలిని పీల్చుకుంటే, వ్యాధిని కలిగింప చేసే సూక్ష్మక్రిములను లోనికి తీసుకునే అవకాశం ఉంది… మీరు మాటలు, వినికిడి, దృష్టి, ఆలోచన మరియు చర్యల దుర్విషయాలతో సంబంధం ఉన్న చెడును వదిలించుకున్నప్పుడు (ఐదు జ్ఞానేంద్రియాల దుర్వినియోగం) మీరు పరమాత్మగా మారగలుగుతారు ”… సత్య సాయి బాబా1
1. ముక్కు మరియు గొంతు - నిర్మాణము, మరియు నిర్వహణ
ముక్కు అనేది ఒక చక్కని సురక్షిత అవయవం, ఇది మనుగడ కోసం ఊపిరి పీల్చుకోవడానికి, రుచి మరియు వాసన
తెలుసు కోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. దీనికి రెండు బాహ్య నాసికా రంధ్రాలు ఉంటాయి, ముక్కుదూలం లేదా సెప్టం వీటిని విభజించి దానికి ఆకారాన్ని ఇస్తుంది; నాసికా కుహరాలు (ఫోసే) శ్లేష్మ పొర మరియు గాలిని వడపోసే చిన్న వెంట్రుకలతో కూడిన (సిలియా) ముక్కు యొక్క రెండు వైపులామూడేసి చొప్పున ఉండే ఆరు టర్బినేట్లు (అస్థి చీలికలు) గాలిని వెచ్చగా మరియు తేమగా ఉంచడానికి మరియు దుమ్ము మరియు పుప్పొడిని ఫిల్టర్ చేయడానికి, మరియు నాలుగు జతల సైనసెస్ (గాలి నిండిన కుహరాలు), ఇందులో రెండు శిశువు పుట్టినప్పటి నుండి ముక్కు మరియు బుగ్గల మూలము చుట్టూ ఉండేవి, మరొకటి నుదిటి భాగంలో ఏడు సంవత్సరాల వయస్సు నుండి అభివృద్ధి చెందుతు ఉంటుంది, మరొకటి యుక్త వయసు నుండి ముక్కు వెనుక భాగంలో ఉంటుంది. నాసికా మార్గాన్ని తేమగా ఉంచడానికి సైనసెస్ శ్లేష్మమును ఉత్పత్తి చేస్తాయి, మరియు మన స్వరం యొక్క ధ్వని మరియు ప్రతిధ్వని స్థాయిని నిర్ణయించే బాధ్యత కలిగి ఉంటాయి. ఇవి మెదడు మరియు కళ్ళను రక్షించడానికి మరియు ఊపిరితిత్తులలోని నైట్రిక్ ఆక్సైడ్ మొత్తాన్ని నియంత్రించడంలో సహాయపడటానికి ఒక గాలి మెత్త(ఎయిర్ కుషన్)లాగా పనిచేస్తాయి.
( ఫారింక్స్) : గాలి, ద్రవ మరియు ఘనపదార్థాలు లోపలికి వెళ్లడానికి ఒక మార్గం గానూ మరియు మాట్లాడటానికి సహాయపడుతుంది. ఇది ముందు భాగంలో స్వరపేటిక (వాయిస్ బాక్స్) ను కలిగి ఉంటుంది, దాని స్వర తంతువులు శ్వాసనాళం (విండ్ పైప్) లోకి తెరువబడి ఉంటాయి. ఎపిగ్లాటిస్ (స్వర తంతువుల పైన మృదు కణజాలం) ఆహారం మరియు ఇతర పదార్ధాలు ఊపిరితిత్తులలోకి పోకుండా నిరోధిస్తుంది; సంక్రమణ లేదా ఇన్ఫెక్షన్ నుండి రక్షించడానికి గొంతుకు ఇరువైపులా టాన్సిల్స్ మరియు అడెనాయిడ్లు (శోషరస కణజాలం) 2,3 ఉంటాయి. చెవి, ముక్కు మరియు గొంతు ఎగువ శ్వాసకోశ వ్యవస్థలో భాగంగా ఉండి ఒక పరస్పర అనుసంధాన యూనిట్‌గా పనిచేస్తాయి. వైరస్లు మరియు బ్యాక్టీరియా ఈ మూడింటి మధ్య తేలికగా కదలగలిగే అవకాశం ఉండడంతో ఒకదానిలో ఏర్పడే సమస్య మరొక దానిలో కొత్త సమస్యను సృష్టిస్తుంది.
2. ఊర్ధ్వ శ్వాస మార్గ సంక్రమణం (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) (URI)
URI అనేది సైనస్ లు, నాసిక, గొంతు ఊర్ధ్వ పార్శ్వములను గురిచేస్తూ ఉంటుంది. సాధారణంగా శీతాకాలంలో వైరస్
లేదా బ్యాక్టీరియా నాసిక లేదా గొంతు ద్వారా శరీరంలోనికి ప్రవేశించి నప్పుడు ఇది సంభవిస్తుంది. ఇది అంటు వ్యాధి కనుక ఒకరి నుండి ఒకరికి స్పర్శ, తుమ్ములు, దగ్గు ద్వారా వ్యాప్తి చెందుతుంది. జన బాహుళ్యం గల ప్రదేశాలు అనగా తరగతి గదులు, కార్యాలయాలు, ఇల్లు, వాహనాలు ఎక్కువ ప్రమాద భరిత మైనవి. తరుచూ చేతులు కడుగుకోవడం, దగ్గే టప్పుడు,తుమ్మే టప్పుడు ఏదైనా వస్త్రాన్ని అడ్డంగా ఉంచుకోవడం ద్వారా వ్యాప్తిని కొంత వరకూ అరికట్టవచ్చు. దీని సాధారణ లక్షణాలు ముక్కులో అవరోధము, గొంతులో మంట, దగ్గు, జ్వరము, ముక్కు కారడం, తుమ్ములు, ముఖ భాగంలో నొప్పి లేదా వత్తిడి, వంటి నొప్పులు, దురద లేదా కంటి వెంట నీరు కారడం, వంటివి. అతి సాధారణ శ్వాస మార్గ సంక్రమణలు జలుబు మరియు దగ్గు(మరిన్ని వివరాలు కోసం సంచిక 9 సంపుటి 6, మరియు సంచిక 10 సంపుటి 2 లలో వరుసగా ఉన్న “సాధారణ జలుబు”, “దగ్గు”అనే వ్యాసాలు చదవండి). URI అనేది తనంతట తానే తగ్గిపోయే అవకాశం కలిగినది. సాధారణంగా 7-10 రోజులు ఉంటుంది. కొన్ని సందర్భాలలో మూడు వారాల వరకూ ఉంటుంది, ఐతే అధిక జ్వరము, తీవ్ర శ్వాసా అవరోదము, లేదా మింగడంలో ఇబ్బంది ఉన్నప్పుడు వైద్య చికిత్స అవసరము.5,6
2.1 సైనసైటీస్, సైనసెస్ యొక్క వాపు కారణంగా ఏర్పడుతుంది. ఎక్కువగా వైరస్ కారణంగా వ్యాప్తి అవుతున్నప్పటికీ ఇది ఒక వారంలో స్థిరపడకపోతే బాక్టీరియా కారణంగా ఏర్పడినట్టిదిగా భావించ వచ్చు. చాలా అరుదుగా ఫంగల్ ద్వారా ఏర్పడినట్టిదిగా ఉంటుంది. దీని లక్షణాలు నాసికా అవరోధం, ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు నుండి మందపాటి రంగు లేని స్రావము ఉత్పత్తి, ముక్కు కారడం, వాసన గ్రహించే శక్తి తగ్గడం మరియు కళ్ళు, బుగ్గలు లేదా నుదిటి చుట్టూ నొప్పి లేదా వత్తిడి ఉంటాయి. తీవ్రమైన సైనసిటిస్ సాధారణంగా జలుబు కారణంగాను, మరియు దీర్ఘకాలిక సైనసిటిస్ ఇతర నాసికా రుగ్మతలతో (క్రింద ఉన్న #3 చూడండి), అనగా అలెర్జీ సంబంధిత శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, HIV/AIDS వంటి రోగనిరోధక వ్యవస్థ రుగ్మత లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి వాటితో సంబంధం కలిగి ఉంటుంది.7-10
2.2 లారింగైటిస్: లారింగైటిస్ అనేది స్వర తంతువుల యొక్క వాపు ప్రధానంగా అధికంగా మాట్లాడడం ద్వారా ఏర్పడుతుంది. అలెర్జీ, యాసిడ్ రిఫ్లక్స్, వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా దీనికి కారణం కావచ్చు. దీని లక్షణాలు కఠిన స్వరం లేదా మాట్లాడే శక్తి కోల్పోవడం, గొంతులో దురద లేదా మంట, ఆగకుండా కొనసాగే దగ్గు (అంటు వ్యాధిలా సోకే దగ్గు వివరాల కోసం సంచిక 10 సంపుటి 2 ని చూడండి)11,12
2.3 ఫారిం గైటీస్, సాధారణంగా గొంతు మంట అని పిలువబడే ఫారింగైటిస్, ఫారింక్స్ యొక్క వాపు వలన కలుగుతుంది. ఇది సాధారణ జలుబు లేదా ఫ్లూ లేదా సాధారణ బ్యాక్టీరియా సంక్రమణ (స్ట్రెప్ త్రోట్) వంటి వైరల్ ఇన్ఫెక్షన్ వలన కలుగుతుంది. గొంతులో నొప్పి, పొడిబారడం, దురదతో పాటు ఇతర లక్షణాలు గ్రంథులవాపు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారటం, దగ్గు మరియు మింగడం లేదా మాట్లాడటం కష్టం కావడం. అలెర్జీ, యాసిడ్ రిఫ్లక్స్, స్వరమును శ్రుతి మించి వాడకం లేదా ఎక్కువసేపు నోరు తెరిచి నిద్రపోవడం కూడా గొంతు నొప్పికి కారణం కావచ్చు.12-17
2.4 టాన్సి లైటిస్, అనేది పిల్లల్లో సాధారణంగా వచ్చే ప్రమాదకరమైన వ్యాధి18,19, ఫారింగైటీస్ మాదిరిగానే లక్షణాలు
కలిగి టాన్సిల్స్ లోవాపు కలిగి ఉంటుంది. కొన్నిసార్లు, అడెనాయిడ్లు కూడా వాపుకు గురవుతాయి. కొంతమంది పిల్లలలో రోగనిరోధక కారకాల 'ఎ' టైపు స్ట్రెప్టోకోకి బ్యాక్టీరియా20 A సమూహం వల్ల పునరావృతమవుతున్న టాన్సిల్ సంక్రమణకు దారితీస్తాయని ఒక అధ్యయనం గుర్తించింది. అరుదుగా వచ్చే బ్యాక్టీరియల్ టాన్సిలైటిస్ క్విన్సీ లేదా దవడ వాపు (గొంతులో గడ్డలు)కు, టాన్సిల్స్ తీవ్రమైన వాపుకు, గొంతు, లేదా ప్రక్కనే ఉండే భాగాల వాపు మరియు జ్వరమును కలిగిస్తుంది.21
2.5 ఇన్ఫ్లూయెంజా (ఫ్లూ) మరియు కోవిడ్ -19: ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) మరియు కోవిడ్ -19 రెండూ శ్వాసకోశ అంటు వ్యాధులు. ఇవి ఎగువ మరియు దిగువ శ్వాసకోశ మరియు ఇతర శరీర వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి.5,22,23
3. నాసికా రుగ్మతలు
3.1 అలెర్జిక్ రినిటిస్ (హేఫీవర్): దీనిలో నాలుగు ప్రధాన లక్షణాలు ఉన్నాయి - తరచుగా ముక్కు కారటం (రినోరోహియా), నాసికా అవరోధం, నాసికా దురద మరియు తుమ్ములు. కొందరికి తలనొప్పి, ముక్కు మరియు గొంతులో శ్లేష్మం లేదా గొంతు నొప్పి కూడా ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణాలు అలెర్జీని కలిగించే దుమ్ములో ఉండే సూక్ష్మ క్రిములు (డస్ట్ మైట్స్), నాచు (ఫంగస్), పెంపుడు జంతువులలో ఉండే కారకాలు (చర్మ కణాలలో కనిపించే ప్రోటీన్, జంతువుల యొక్క లాలాజలం లేదా మూత్రం) ఇంకా చెట్లు మరియు మొక్కల నుండి ఉత్పత్తి అయ్యే పుప్పొడి వంటి అలెర్జీ కారకాలు ప్రధాన కారణం.24-26
3.2 అదనపు శ్లేష్మం (పోస్ట్ నాసల్ డ్రిప్): గొంతు వెనుక భాగంలో ఏర్పడి అసౌకర్యం కలిగిస్తూ ఉంటుంది. ముక్కు, గొంతు మరియు సైనసెస్ నిరంతరం శ్లేష్మం ఉత్పత్తి చేస్తూ వాయుమార్గాలు తడి ఆరిపోకుండా ఉండటానికి సహాయపడతాయి. ఐతే కొందరిలో గొంతు నొప్పి, దగ్గు, వికారం లేదా దుర్వాసన ఉండవచ్చు. వాస్తవానికి ఈ పోస్ట్ నాసల్ డ్రిప్ సూక్ష్మ క్రిములు లేదా అలెర్జీ కారకాలను ఎక్కువ శ్లేష్మం ఉత్పతి చేయడం ద్వారా బయటకు పంపి శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పనిచేసే చక్కని యంత్రాంగము.27
3.3 నాసికా తిత్తులు (నాసల్ పాలిప్స్) ఇవి మృదువైన, నొప్పిలేని, క్యాన్సర్ కాని పెరుగుదలలు. ఇవి శ్వాస మార్గంలో నాసిక గోడలపై లేదా సైనస్ లపై కన్నీటి చుక్కలు లేదా ద్రాక్ష వంటి ఆకారంలో ఉంటాయి. చిన్న పాలిప్స్ ఏ విధమైన లక్షణములు లేనివిగా ఉంటాయి. పెద్దవి నాసికా మార్గములో అవరోధంగా ఉంటూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన యొక్క భావన నుండి దూరం చేయడం మరియు తరచుగా అంటువ్యాధులకు దారితీస్తాయి. పాలిప్స్ సాధారణంగా దీర్ఘకాలిక మంట లేదా సైనసిటిస్ వల్ల సంభవిస్తాయి కాని కొన్నిసందర్భాలలో ఉబ్బసం, అలెర్జీ, కొన్ని ఔషధములు పడక పోవడం, లేదా కొన్ని రోగనిరోధక రుగ్మత వల్ల సంభవిస్తాయి.28
3.4 స్థాన భ్రంశం చెందిన ముక్కు దూలం: సెప్టం ఒక వైపుకు స్థానభ్రంశం అయినప్పుడు, ఒకటి లేదా రెండు నాసికా రంధ్రాలలో చికిత్సకు స్పందించని రద్దీ లేదా శ్వాసావరోధము, ఒక-వైపు మాత్రమే ఉండే నాసికా నొప్పి, పునరావృతమయ్యే సైనస్ ఇన్ఫెక్షన్ మరియు నిద్రించే సమయంలో ధ్వనించే శ్వాస వంటి ఇబ్బందులు ఉండవచ్చు. కొన్నిసార్లు ముక్కు పొడిబారడం వలన ముక్కు రంద్రాల నుండి రక్తం స్రవించ వచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, ఇది శ్వాసను ప్రభావితం చేస్తుంది, అలాగే తలనొప్పికి లేదా ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.29,30
3.5 నాసికలో రక్త స్రావం (ఎపిస్టాక్సిస్) అనేది మన ముక్కు లోపలి భాగంలో కణజాలం నుండి రక్తం కోల్పోవడం. 10 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు 50 ఏళ్లు పైబడిన పెద్దవారిలో అధిక బిపి, అథెరోస్క్లెరోసిస్ లేదా రక్తం గడ్డకట్టే రుగ్మత వంటి వైద్య పరిస్థితులతో, ముక్కులో రక్తస్రావం చాలా సాధారణం. గాలి పొడిబారీ ఉండడం, నాసికా స్ప్రేలను తరచుగా ఉపయోగించడం, ముక్కులోకి బలంగా పీల్చుకోవడం, లేదా ముక్కును చాలా గట్టిగా రుద్దడం లేదా బలవంతంగా ఛీదడం, ముక్కులోకి ఏదైనా ఒక వస్తువును చొప్పించడం, ఆటల సమయంలో ముక్కుకు దెబ్బ తగలడం, ముఖంపై ఏర్పడిన పాత లేదా ఇటీవలి గాయాలు, అధిక ఎత్తుగల ప్రదేశాలకు వెళ్ళడం, అలెర్జీ, లేదా ఇన్ఫెక్షన్ ల వల్ల “పూర్వ రక్తస్రావం” (ఆంటీరియర్)సంభవించవచ్చు. ఇది సాధారణంగా గృహ చిట్కాలతో తగ్గింప చేసుకోవచ్చు. అలాగే “పరాంత భాగ రక్త స్రావం” (పోస్టీరియర్) అనేది ముక్కు వెనుక లేదా అంతర భాగాలలో సంభవిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి స్థితిలో 20 నిమిషాల తర్వాత కూడా ముక్కులో రక్తస్రావం ఆగిపోనప్పుడు వైద్య సంరక్షణ అవసరం.31-34
ముక్కులో రక్త స్రావాన్ని నియంత్రించే దశలు (లింక్33 లోని చిత్ర మాలికను చూడండి)
- నిటారుగా కూర్చొనుట మీ ముక్కు యొక్క సిరల్లో రక్తపోటును తగ్గించడానికి నిటారుగా కూర్చోండి, మరియు రక్తాన్ని మింగకుండా ఉండటానికి తల ముందుకు వంచకుండా చూసుకోండి.
- మృదువుగా ముక్కును చీదండి ముక్కులో ఎక్కడైనా గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి మీ ముక్కును సున్నితంగా చీదండి. తాత్కాలిక చర్యగా, ముక్కు యొక్క రక్తస్రావం అవుతున్న వైపు ఒక నాసికా డీకంజెస్టెంట్ను పిచికారీ చేయవచ్చు, సెలైన్ ఆధారిత నాసికా జెల్ ను రాయవచ్చు, లేదా నాసికా స్ప్రే లేదా సెలైన్ వాటర్ లేదా సాదా నీటిలో నానబెట్టిన దూది ఉండలను కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ తో వేయవచ్చు.
- నాసిక పై మృదువుగా ఉన్న భాగాన్ని నొక్కి ఉంచండి 5-10 నిమిషాలు బొటనవేలు మరియు చూపుడు వేలు ఉపయోగించి ముక్కు యొక్క సున్నిత భాగాన్ని మృదువుగా నొక్కి ఉంచండి. నోటి ద్వారానే శ్వాసను తీసుకోండి. రక్తస్రావం మందగించడానికి ముక్కు యొక్క దూలము పై ఐస్ ప్యాక్ ఉంచండి.
- రక్త స్రావం ఆగక పోతే,31-35 రక్తస్రావం ఆగకపోయినా, రక్తం వేగంగా లేదా అనియంత్రితంగా వస్తున్నా, లేదా తరుచుగా సంభవిస్తున్నా, వీటితో పాటు అదనంగా అధిక బిపి, తేలికపాటి తలనొప్పి, ఛాతీ నొప్పి లేదా వేగవంతమైన హృదయ స్పందన రేటు వంటి ఇతర లక్షణాలతో కూడి ఉంటే తక్షణ వైద్య సహాయం తీసుకోండి.31-35
4. ఆరోగ్యకరమైన నాసిక మరియు గొంతుకోసము చిట్కాలు
- మీ నాసికను ఎప్పటికీ ఆర్ద్రంగా ఉంచండి సాదా పెట్రోలియం జెల్లీ, కొబ్బరి లేదా నువ్వుల నూనె లేదా శాలైన్ నాసల్ ఉపయోగించడం ద్వారా ముక్కును తేమగా ఉంచండి; గాయములు కాకుండానూ మరియు ముక్కులో వేళ్ళు పెట్టుకొని రక్తస్రావం కాకుండా నివారించడానికి పిల్లల వేలుగోళ్లను కత్తిరించండి. ముక్కును చీదాలనుకుంటే సున్నితంగా బ్లో చేయండి కానీ ఎప్పటికీ బలవంతం చేయకండి.31,36 సైనసిటిస్, పోస్ట్ నాసల్ డ్రిప్ మరియు ఇతర నాసికా రుగ్మతలను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి మీ నాసికా భాగాలను ప్రతీరోజూ నీటితో శుభ్రం చేయండి; శ్వాస మార్గంలో అవరోధాలను తొలగించడానికి ఆవిరిని పీల్చుకోండి, అయితే ఇది సున్నితంగా చెయ్యాలి కానీ అతిగా చేయకూడదు ఎందుకంటే ఇది ముక్కు లోని మ్యూకస్ లైనింగ్‌ను దెబ్బతీస్తుంది.37
- ముక్కు ద్వారానే ఎల్లప్పుడూ శ్వాస తీసుకోండి: నాసికా శ్వాసను అడ్డుకునే ఏదైనా సమస్యకు సాధ్యమైనంత త్వరగా స్పందించండి.(సరైన శ్వాసక్రియ వివరాల కోసం సంచిక 10 సంపుటి 5 ని చూడండి). నోటి ద్వారా శ్వాస తీసుకోవడం తప్పనిసరి పరిస్థితిలో చాలా స్వల్ప వ్యవధికి మాత్రమే పరిమితం చెయ్యాలి, ఎందుకంటే శరీరం దీనిని దాడిగా భావించి రోగనిరోధక శక్తి పై ప్రభావం చూపి దానిని బలహీనపరుస్తుంది. 38,39 ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు ముక్కు, గొంతు మరియు సైనస్‌లను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడతాయి.
- గొంతుకు విశ్రాంతి నివ్వండి: మీ గొంతును తరచుగా విశ్రాంతి తీసుకోనివ్వాలి మరియు లారింగైటిస్ను నివారించడానికి తగినంత వెచ్చని ద్రవాలు త్రాగాలి; మనము నిశ్శబ్దంగా ఉన్నప్పుడు స్వర తంతువులు బాగా తెరుచుకొని శ్వాస చక్కగా తీసుకోవడానికి చక్కని వాయుమార్గాన్ని ఏర్పరుస్తాయి. మీ గొంతును అనర్గళంగా మాట్లాడటానికి వీలుగా తర్ఫీదు చెయ్యాలి అంతేగానీ గుసగుసలాడకండి, ఎందుకంటే ఇది సాధారణ ప్రసంగం కంటే స్వరపేటికకు ప్రమాదం తెచ్చి పెడుతుంది. చాలా బిగ్గరగా లేదా చాలా మృదువుగా మాట్లాడటం మీ గొంతుపై వత్తిడిని పెంచుతుంది.40-42
- నిరోధించండి: దుమ్ము మరియు అలెర్జీ కారకాలకు గురికాకుండా ఉండండి, ముఖ్యంగా అలెర్జీ రినిటిస్ నివారించడానికి పుప్పొడి ఎక్కువగా ఉండే కాలాలలో (తెల్లవారుజాము మరియు సంధ్యా సమయంలో, ముఖ్యంగా వసంత ఋతువు మరియు వేసవి ప్రారంభంలో) దూరంగా ఉండాలి.43
- పాటు మొత్తంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, నిద్ర / విశ్రాంతి, వ్యాయామం, ఆహారం మరియు నీరు తీసుకోవడం గురించి ఆరోగ్య మార్గదర్శకాలను అనుసరించండి (మునుపటి వార్తాలేఖలలో ఆరోగ్య చిట్కాలను చూడండి).
సూచనలు మరియు లింకులు
1. Divine Discourse on “Sanctify the body”, 20 May 1990, http://www.sssbpt.info/ssspeaks/volume23/sss23-10.pdf
2. Nose and throat anatomy: https://www.stanfordchildrens.org/en/topic/default?id=anatomyandphysiologyofthenoseandthroat-90-P02027
3. About nose: https://health.clevelandclinic.org/7-surprising-facts-nose/
4. ENT interconnection: https://www.bergerhenryent.com/the-interconnected-world-of-the-ear-nose-throat/
5. URIs: https://www.medicalnewstoday.com/articles/32388
6. URI: https://www.medicinenet.com/upper_respiratory_infection/article.htm
7. Chronic sinusitis: https://www.mayoclinic.org/diseases-conditions/chronic-sinusitis/symptoms-causes/syc-20351661
8. https://my.clevelandclinic.org/health/diseases/17701-sinusitis
9. Sinusitis viral/bacterial: https://health.clevelandclinic.org/killer-sinus-infection-how-to-tell-if-yours-is-viral-or-bacterial
10. https://www.medicinenet.com/sinusitis/article.htm
11. Laryngitis: https://www.mayoclinic.org/diseases-conditions/laryngitis/symptoms-causes/syc-20374262
12. Pharyngitis: https://www.medicalnewstoday.com/articles/324144
13. https://www.health.harvard.edu/diseases-and-conditions/sore-throat-pharyngitis-a-to-z
14. https://www.hopkinsmedicine.org/health/conditions-and-diseases/pharyngitis
15. https://my.clevelandclinic.org/health/symptoms/8274-sore-throat-pharyngitis
16. https://www.mayoclinic.org/diseases-conditions/sore-throat/symptoms-causes/syc-20351635
17. https://www.everydayhealth.com/sore-throat/
18. Tonsilitis: https://my.clevelandclinic.org/health/diseases/21146-tonsilitis
19. https://medlineplus.gov/tonsilitis.html
20. Study on tonsillitis in children: https://www.niaid.nih.gov/news-events/recurrent-tonsilitis
21. Quinsy: https://teachmesurgery.com/ent/throat/tonsilitis/
22. Covid-19 & RIs: https://www.webmd.com/lung/coronavirus
23. Covid-19 is multi-systemic: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7371790
24. Four cardinal symptoms of Rhinitis: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2846743/
25. Allergic rhinitis/Hay fever: https://my.clevelandclinic.org/health/diseases/8622-allergic-rhinitis-hay-fever
26. https://www.mayoclinic.org/diseases-conditions/hay-fever/symptoms-causes/syc-20373039
27. Postnasal drip: https://www.medicalnewstoday.com/articles/319636
28. Nasal polyps: https://www.mayoclinic.org/diseases-conditions/nasal-polyps/symptoms-causes/syc-20351888
29. Deviated Nasal Septum: https://www.mayoclinic.org/diseases-conditions/deviated-septum/symptoms-causes/syc-20351710
30. https://my.clevelandclinic.org/health/diseases/16924-deviated-septum
31. Nosebleed: https://my.clevelandclinic.org/health/diseases/13464-nosebleed-epistaxis;
32. Effectively prevent and manage nosebleed: https://www.medanta.org/patient-education-blog/are-nosebleeds-a-sign-of-cancer/
33. Pictorial steps to stop nosebleed: https://www.nationaljewish.org/conditions/health-information/health-infographics/12-nose-bleed-tips
34. https://newsnetwork.mayoclinic.org/discussion/home-remedies-4-steps-to-stop-a-nosebleed/
35. Nosebleed Dos & Donts: https://www.med.umich.edu/pdf/Nosebleed-Dos-and-Donts.pdf
36. Relieve dry nose: https://breathefreely.com/how-to-relieve-a-dry-nose/
37. Nasal Irrigation: https://www.health.haravard.edu/diseases-and-conditions/what_to_do_about_sinusitis
38. Nasal breathing best: https://health.clevelandclinic.org/breathe-mouth-nose/
39. Complications of mouth breathing: https://www.healthline.com/health/mouth-breathing
40. Rest your voice: https://www.healthline.com/health/home-remedies-for-laryngitis
41. Silence helps: https://health.harvard.edu/a_to_z/vocal-cord-disorders-a-to-z
42. Take care of your voice: https://www.nidcd.nih.gov/health/taking-care-your-voice
43. Avoid exposure: https://www.healthline.com/health/allergic-rhinitis
_________________________________________________________________________________________
2. కోవిడ్-19 రెమిడీ పై అప్డేట్ (నిజ వ్యాసము సంచిక 11 సంపుటి 2 లో ప్రచురింప బడింది, రెమిడీ విషయంలో గత అప్డేట్ సంచిక 0 సంపుటి 3 లో 2021 జూన్ 9 న ప్రచురింపబడి, ఈ –మెయిల్ ద్వారా పంపబడింది.)
కోవిడ్ -19 యొక్క డెల్టా వేరియంట్ విషయంలో ప్రపంచమంతా పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో, డెల్టా ప్లస్ అని పిలువబడే మరొక వేరియంట్ తో అనేక కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. ఈ సరికొత్త వేరియంట్ పై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తూ ఉండగానే ప్రాథమిక అధ్యయనాలు గతంలో కనిపించిన సాధారణ లక్షణాలైన పొడి దగ్గు, జ్వరం, అలసట, నొప్పులు, చర్మముపై దద్దుర్లు, కాలి మరియు చేతి వేళ్ల రంగు పాలిపోవడం, గొంతు నొప్పి, కండ్లకలక, రుచి కోల్పోవడం మరియు వాసన కోల్పోవడం, విరేచనాలు మరియు తలనొప్పి, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మాట్లాడే శక్తి కోల్పోవడం, వీటితో పాటు డెల్టా ప్లస్ రోగులలో వికారం, కీళ్ల నొప్పులు మరియు వినికిడి కోల్పోవడం వంటివి కూడా కనబడుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మన రెండు రకాలైన IB కాంబోలు సవరించబడ్డాయి, పూర్తి చికిత్స ప్రోటోకాల్ కు సంబంధించి తుది నివేదిక క్రింద ఇవ్వబడింది:
A. ఇమ్యూనిటీ బూస్టర్ (IB)ముందస్తు కోసం మరియు చికిత్స కోసం:
108CC బాక్సు మాత్రమే ఉన్నవారి కోసం: CC3.2 Bleeding disorders + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC5.2 Deafness + CC7.2 Partial Vision + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.5 Mouth infections + CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic + CC21.11 Wounds & Abrasions
108CC box లేకుండా SRHVP బాక్సు ఉన్నవారి కోసం: NM6 Calming + NM25 Shock + NM80 Gastro + BR4 Fear + SM18 Digestion + SM20 Eyes + SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM35 Sinus + SM39 Tension + SM40 Throat + SR268 Anacardium 30C + SR272 Arsen Alb 30C + SR278 Cactus 30C + SR279 Cadmium Sulph 30C + SR291 Gelsemium 30C + SR298 Lachesis 30C + SR301 Mercurius 30C + SR304 Oxygen 200C + SR318 Thuja 200C + SR383 Cuprem Met 30C + SR408 Secale Corn 6X + SR458 Brain Whole + SR463 Cranial Nerves + SR566 Fungi-Pathogenic
మోతాదు: ముందస్తు కోసం: BD ఉదయం నిద్ర లేవగానే మరియు రాత్రి నిద్రపోయే ముందు. కోవిడ్ -19 టీకా తీసుకున్న వారికి, కోవిడ్ నుండి కోలుకున్న వారికి, మరియు కోవిడ్ లేని దేశంలో నివసిస్తున్నవారికి ఉదయం మేల్కొనగానే OD ఇవ్వండి.
చికిత్స కోసం: ప్రతి గంటకు ఒక మోతాదు చొప్పున 6 గంటల వరకు అనంతరం 6TD ఆ తరువాత, మెరుగుదలను బట్టి క్రమంగా QDS - TDS - BD - OD కి తగ్గుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా రక్తం గడ్డకట్టడం వంటి కోవిడ్ అనంతర సమస్యలు ఉన్నవారికి అదే మోతాదును అనుసరించండి.
కోవిడ్ -19 లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారికి, అసలు పరీక్ష చేయించు కోని వారికి 6TD వద్ద ప్రారంభించి పైన చెప్పినట్లుగానే తగ్గించండి.
హెచ్చరిక :రోగి తీసుకుంటున్న ఆలోపతి చికిత్స కొనసాగించ మనాలి, ఎట్టి పరిస్థి తులలో ఆపమని చెప్పకూడదు.
B. కోవిడ్ నుండి కోలుకున్న సందర్భంలో: ఒక రోగి కోలుకున్న తరువాత శక్తి లేనట్లు భావించినా, శారీరకంగా మానసికంగా అలసిపోయినట్లు అనిపించినా, ఏదైనా ఇతర సమస్య ఏర్పడినా, రోగి తిరిగి ఆరోగ్యంగా బలంగా అయ్యే వరకూ క్రింది రెమిడీ ఇవ్వండి:
108 CC బాక్సు ఉన్న వారికి: CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC4.1 Digestion tonic + CC11.3 Headaches + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic + CC20.1 SMJ tonic + CC21.11 Wounds & Abrasions
108CC box లేకుండా SRHVP బాక్సు ఉన్నవారి కోసం: NM2 Blood + NM6 Calming + NM7 CB7 + BR3 Depression + SM18 Digestion + SM26 Immunity + SM31 Lung & Chest + SR269 Antim Tart 30C + SR272 Arsen Alb 30C + SR298 Lachesis 30C + SR318 Thuja 200C + SR351 Kali Carb 30C + SR389 Kali Bic 6X + SR408 Secale Corn 6X + SR566 Fungi-Pathogenic
మోతాదు : TDS మెరుగుదల తరువాత క్రమంగా తగ్గించాలి, ఐతే IB ని OD గా ఉదయం లేవగానే ఈ రెండింటికి 20 నిమిషాలు విరామం ఉండేటట్లు కొనసాగించాలి.
C. టీకా యొక్క దుష్ప్రభావాలను తొలగించ డానికి:
SRHVP బాక్సు ఉన్న వారికి: SR318 Thuja 30C.
108 CC బాక్సు ఉన్న వారికి: CC9.4 Children’s diseases
మోతాదు: రాత్రిపూట OD, టీకా వేయడానికి రెండు రోజుల ముందు నుండి మరియు టీకాలు వేసిన రోజు నుండి 10 రోజులు వరకు వేసుకోవాలి. IB కూడా ఉదయం మేల్కొనగానే OD గా కొనసాగించాలి.
ఒకవేళ రోగిలో ఏవైనా దుష్ప్రభావాలు ఏర్పడితే (లక్షణాలు: చేతిలో విపరీతమైన నొప్పి, అలసట, తలనొప్పి, నొప్పులు, వికారం లేదా వాంతులు), సాధారణంగా టీకా తర్వాత ఒకటి లేదా రెండు రోజులు ఇలా అనిపిస్తుంది, పైన సూచించిన విధంగా రికూపరేషన్ కాంబో తీసుకోవాలి.
D. ఆక్సిజన్ సంతృప్త స్థాయిలను పెంచడానికి, ఐతే ఇతర చికిత్సలు అన్నీ కొనసాగించాలి:
SRHVP బాక్సు ఉన్న వారికి: SR304 Oxygen 200C నీటిలో
108 CC బాక్సు ఉన్న వారికి: CC19.1 Chest tonic నీటిలో
మోతాదు: ప్రతీ పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున ఆక్సిజన్ స్థాయి 90 కి చేరుకునే వరకు, తరువాత ప్రతి గంటకు ఒకటి చొప్పున అవసరమైనంత వరకు.
_________________________________________________________________________________________
3. భారత దేశ ప్రాంతీయ సమన్వయ కర్తల (RCs) వర్చువల్ సమావేశము – 2021జూన్ 13
రెండు నెలలకు ఒకసారి జరిగే RC ల నాల్గవ వర్చువల్ కాన్ఫరెన్స్ 2021 జూన్ 13 న జరిగింది. ఆర్‌సిల యొక్క ప్రాధమిక బాధ్యత
సాయి వైబ్రియోనిక్స్ లో పాలనా బాధ్యతల కోసం ఒక బలమైన భూమిక ఏర్పాటు చేయడం, అదే సమయంలోవైబ్రియోనిక్స్ పెరుగుదలకు ఇతోదికంగా కృషి చేయడం. RC ల బృందం ప్రాక్టీషనర్లు మరియు వైబ్రియానిక్స్ సంస్థ యొక్క IASVP విభాగానికి మధ్య సంధానకర్త గా పనిచేస్తుంది. గత ఆరు నెలల్లో, ప్రశాంతి నిలయమునకు వచ్చే వివిధ రాష్ట్రాల సేవకులకు IB ల పంపిణీ, IASVP సభ్యత్వ నమోదు, ప్రాంతీయ సమావేశాలను నిర్వహించడం మరియు 'స్ప్రెడ్ ది వర్డ్ క్యాంపెయిన్' ప్రారంభించడం వంటి అనేక పరిపాలనా బాధ్యతలను గూర్చి ఈ సమావేశాలు చర్చించడం, అమలు చేయడం, సమీక్షించడం వంటివి నిర్వహిస్తూ వచ్చాయి. సంబంధిత విభాగాల నుండి అందుకున్న విలువైన అభిప్రాయములు వివిధ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడ్డాయి. ప్రాక్టీషనర్ల డేటాబేస్ సమాచారాన్ని ప్రామాణీకరించడానికి దేశవ్యాప్తంగా ఒక డ్రైవ్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇది రోగులు తమ ప్రాంతాలలో ప్రాక్టీషనర్లను సంప్రదించాల్సిన అభ్యర్థనలకు శీఘ్ర ప్రతిస్పందన ఇవ్వడానికి మన ప్రాక్టీషనర్స్ ఇన్ఫో విభాగానికి ఎంతో ఉపకరిస్తుంది. ఈ RC ల సమావేశాలు ప్రాక్టీషనర్లను ఒకచోట చేర్చడానికీ, వారిలో ఒక అవినాభావ సంబంధాన్ని నెలకొల్పడానికి సహాయపడతాయి. ఈ RC కాన్ఫరెన్సులు చేసిన సానుకూల సహకారం ఇప్పటికే రిఫ్రెషర్ వర్క్‌షాప్‌లలో క్రమంగా పెరుగుతున్న హాజరైన వారి సంఖ్యలో స్పష్టంగా కనిపిస్తుంది.
_________________________________________________________________________________________
4. కర్నాటక వర్చువల్ సెమినార్ల మొదటి వార్షికోత్సవం - 2021 జూన్ 6
కర్ణాటకలో ఒక సంవత్సర కాలంగా నిర్వహిస్తున్న నెలవారీ వర్చువల్ సమావేశాల వార్షికోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రాక్టీషనర్లు 2021 జూన్ 6 న ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం 90 మంది పాల్గొన్నారు. ఇది ఇటీవల నిర్వహింప బడుతున్న ఏ వైబ్రియోనిక్స్ వర్చువల్ మీట్ తో చూసినా అత్యధిక హాజరు. దీనిలో కర్ణాటక వెలుపల నుండి చాలా మందితో పాటు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వానించబడిన కొంతమంది సీనియర్ ప్రాక్టీషనర్లు కూడా పాల్గొన్నారు. కర్ణాటక ప్రాంతీయ సమన్వయకర్త (RC) మునుపటి సంవత్సరంలో, AVP మాన్యువల్ మరియు 108 సిసి పుస్తకంలోని 21 వర్గాలను అలాగే దీర్ఘకాలిక వ్యాధులు వాటి కారణాలు, ఆహారం మరియు జీవనశైలి మార్పులకు ప్రాధాన్యతనిస్తూ సవివరంగా చర్చించారు. ముగ్గురు ప్రాక్టీషనర్లు ఈ వర్చువల్ సమావేశాల నుండి తాము ఎంతో ప్రయోజనం పొందామని తమ అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం పొందారు, కాగా ఇది ఇతర అభ్యాసకుల ఆలోచనలు మరియు వారి మనో భావాలను ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపించింది. డాక్టర్ అగర్వాల్ వైబ్రియోనిక్స్ ఆవిర్భావానికి దారితీసిన సంఘటనలు స్వామితో తనకు గల కొన్ని వ్యక్తిగత అనుభవాలను వివరించారు. విజయవంతమైన చికిత్సకు ప్రేమే ఆధారం అని నొక్కి వక్కాణిస్తూ ప్రాక్టీషనర్లు స్వామితో కనెక్ట్ అవ్వాలని మరియు తల నుండి కాకుండా హృదయం నుండి పని చేయాలని ప్రాక్టీషనర్లకు సలహా ఇచ్చారు.
ప్రాక్టీషనర్ల సందేహాలు తొలగింపచేయడంతో పాటు వారికి అందించిన 1-2 టేక్-హోమ్ పాయింట్లు ఇక్కడ చేర్చబడ్డాయి.
- ఇమ్యునిటీ బూస్టర్ IB చాలా ముఖ్యమైనది కనుక, ఉదయాన్నే నోటిలో ఇతర ప్రకంపనలు ఏవీ ఉండవు కనుక, ఉదయాన్నే మొదట తీసుకోవాలని సలహా ఇవ్వబడుతుంది. కాబట్టి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది మరియు ఆ సమయంలో మరచిపోవటం కూడా ఉండదు.
- CC17.2 Cleansing ఒక బలమైన పుల్లౌట్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది కనుక రోగి మంచి ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఈ కాంబో ఇచ్చే ముందు రోగికి ఏదైనా నిర్దిష్ట రుగ్మతకు మొదట చికిత్స చేసి ఉండాలని సిఫార్సు చేయబడింది.
- చర్మమునకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసేటప్పుడు, వ్యాధి లక్షణాలు ఉధృత మయ్యే కారణం దృష్ట్యా (మొదటి రకం పుల్లౌట్) ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక మోతాదు ఇచ్చి వేచి చూడాలి, ఆపై రోగి నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మోతాదును నెమ్మదిగా పెంచుకోవాలి.
నిరంతర అభ్యసన ప్రక్రియలో భాగంగా, ఇది చాలా విజ్ఞాన ప్రదమైన సమావేశము. ప్రాక్టీషనర్లు అందరూ దీనిద్వారా ఎంతో ప్రేరణ పొంది ఇటువంటి సెషన్లు మరిన్ని మరిన్ని జరగాలని అభ్యర్థించారు. ఆన్‌లైన్ సెషన్‌లు ప్రాక్టీషనర్లను వైబ్రియోనిక్స్ తో అనుసంధానించడమే కాకుండా, ఒకరినొకరు తెలుసుకోవటానికి మరియు ఒక కుటుంబంలాగా పని చేయడానికి వారికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఇటువంటి సమావేశాలలో చర్చించిన అనేక కార్యకలాపాలను చిన్న సమూహాలకు చేరవేసి తద్వారా వైబ్రియానిక్స్ ను మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సదస్సును విజయవంతం చేయడంలో బాబా అందించిన అపారమైన అనుగ్రహానికి కర్ణాటక ఆర్.సి కృతజ్ఞతలు తెలిపారు
_________________________________________________________________________________________
5. జ్ఞాపకార్ధం
శ్రీమతి అపర్ణా చౌదరి 00036 79 సంవత్సరాల వయస్సులో, 2021 ఫిబ్రవరి 23 న స్వామిలో లీనమయ్యారు. ఆమె తన చివరి క్షణాల వరకు స్వామితో అనుసంధానంలో ఉంటూ పూర్తి జ్ఞానంలో ఉన్నారు. 1994లో వైబ్రియానిక్స్ ప్రారంభమయిన నాటినుండి ఆమె దీనిలోనే కొనసాగుతూ వచ్చారు. ఆమె పుట్టపర్తి మరియు చుట్టుపక్కల గ్రామాలలో తన రోగులకు రెండు దశాబ్దాలుగా వినయంతో సేవ చేసారు. భక్తి మరియు సేవతో తన జీవితాన్ని గడిపిన వీరు వైబ్రియానిక్స్ కు చేసిన సేవలను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో గుర్తింప బడతాయి. “ముద్రలు (వేలు భంగిమలు) ద్వారా భగవంతునితో అనుసంధానం” (హ్యాండ్‌బుక్ ఆన్ యూనియన్ విత్ గాడ్) అనే పుస్తకంద్వారా ఆమె అందరిచేత గుర్తుంచుకోబడతారు.
శ్రీ మనీష్ గుప్త 10462 పెద్దప్రేగు క్యాన్సర్‌కు గురై 2021 జూన్ 8 న తుది శ్వాశ విడిచారు. 47 సంవత్సరాల తక్కువ వయస్సులో చాలా విలువైన సహోద్యోగిని కోల్పోయినందుకు మేము చాలా బాధపడ్డాము. 90 వ దశకంలో స్వామి ఫోల్డ్ లోనికి వచ్చినప్పటి నుండి వీరు ప్రశాంతి సేవలో రెగ్యులర్‌గా పాల్గొంటూ ఉండేవారు, వీరు నిష్ణాతుడైన భజన గాయకుడు కూడా. 2009 లో రాజస్థాన్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నప్పుడు వైబ్రియోనిక్స్‌తో అతని ప్రయాణం ప్రారంభమైంది. అభిరుచి మరియు ఆసక్తితో కేటాయించిన ఏపనిని ఐనా చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వీరు 2018 లో ప్రాంతీయ సమన్వయకర్త అయ్యారు. 2019 ఆగష్టు లో తన జట్టులో కొత్త శక్తిని చొప్పించడానికి రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. అంకితభావం, చిత్తశుద్ధి మరియు కష్టపడి పనిచేసే తత్వం గల ఈ సాయి భక్తుడు ఎల్లప్పుడూ తన కట్టుబాట్లకు ఉల్లంఘించక ధృఢంగా నిలిచే వారు. మన హృదయపూర్వక ప్రార్థనలు అతని భార్య మరియు ఇద్దరు కుమార్తెలకు ఈ సమయంలో బాసటగా నిలవాలని ఆకాంక్ష.
వైబ్రియోనిక్స్ పెరుగుదలకు ఇతోదికంగా కృషి చేయడం. RC ల బృందం ప్రాక్టీషనర్లు మరియు వైబ్రియానిక్స్ సంస్థ యొక్క IASVP విభాగానికి మధ్య సంధానకర్త గా పనిచేస్తుంది. గత ఆరు నెలల్లో, ప్రశాంతి నిలయమునకు వచ్చే వివిధ రాష్ట్రాల సేవకులకు IB ల పంపిణీ, IASVP సభ్యత్వ నమోదు, ప్రాంతీయ సమావేశాలను నిర్వహించడం మరియు 'స్ప్రెడ్ ది వర్డ్ క్యాంపెయిన్' ప్రారంభించడం వంటి అనేక పరిపాలనా బాధ్యతలను గూర్చి ఈ సమావేశాలు చర్చించడం, అమలు చేయడం, సమీక్షించడం వంటివి నిర్వహిస్తూ వచ్చాయి. సంబంధిత విభాగాల నుండి అందుకున్న విలువైన అభిప్రాయములు వివిధ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడ్డాయి. ప్రాక్టీషనర్ల డేటాబేస్ సమాచారాన్ని ప్రామాణీకరించడానికి దేశవ్యాప్తంగా ఒక డ్రైవ్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇది రోగులు తమ ప్రాంతాలలో ప్రాక్టీషనర్లను సంప్రదించాల్సిన అభ్యర్థనలకు శీఘ్ర ప్రతిస్పందన ఇవ్వడానికి మన ప్రాక్టీషనర్స్ ఇన్ఫో విభాగానికి ఎంతో ఉపకరిస్తుంది. ఈ RC ల సమావేశాలు ప్రాక్టీషనర్లను ఒకచోట చేర్చడానికీ, వారిలో ఒక అవినాభావ సంబంధాన్ని నెలకొల్పడానికి సహాయపడతాయి. ఈ RC కాన్ఫరెన్సులు చేసిన సానుకూల సహకారం ఇప్పటికే రిఫ్రెషర్ వర్క్‌షాప్‌లలో క్రమంగా పెరుగుతున్న హాజరైన వారి సంఖ్యలో స్పష్టంగా కనిపిస్తుంది.