Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 11 సంచిక 6
November/December 2020


ప్రియమైన ప్రాక్టీషనర్ల కు,

వార్త లేఖ యొక్క ఈ సంచిక మన వైబ్రియానిక్స్ కు సంబంధించి రెండు ప్రధాన మైలురాళ్లను సూచిస్తుంది. మొదటిది మన ప్రియమైన స్వామి యొక్క 95వ జన్మదినోత్సవ వేడుకలు కాగా రెండవది మన వైబ్రియానిక్స్ సంబంధిత అత్యంత  ప్రధానమైన ప్రకటన. పుట్టపర్తిలో సాయి వైబ్రియానిక్స్ సంబంధిత రీసెర్చ్, ట్రైనింగ్ మరియు వెల్నెస్ సెంటర్ను స్థాపించడానికి అంతా సిద్ధంగా ఉంది. వాస్తనికి ఈ ప్రాజెక్టు ప్రారంభమై ఎంతో కాలంనుండీ కొనసాగుతున్నప్పటికీ కోవిడ్ మహమ్మారి కారణంగా పది నెలలు వెనక్కి నెట్టివేయబడింది. స్వామి ‘‘మీకు ఏం జరిగినా అది మీ మంచి కోసమే అని భావించండి’’...SSS వాల్యూం 17 అధ్యాయం 15. అని బోధించారు. ఈ ఆలస్యం గత ప్రణాళిక ప్రకారం ఉన్న భవనాల సైజును తగ్గించి ప్రస్తుత మరియు భవిష్యత్తు అవసరాల నిమిత్తం రూపకల్పన చేయడానికి అవకాశం ఇస్తుందని మేము గ్రహించలేకపోయాము. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ప్రాక్టీషనర్లకు వర్చువల్ ఫ్లాట్ఫామ్ ద్వారా  శిక్షణను అలవాటు చేయడంతో దీనినే కొనసాగించాలని భావిస్తూ ఉన్నాము. ఇది విస్తృతమైన స్థలం కోసం మనం గతంలో ప్రణాళిక సిద్ధం చేసిన అవసరాన్ని గణనీయంగా తగ్గించింది.

ప్రస్తుతం ఈ ఇన్స్టిట్యూట్ పూర్తి కావడానికి రెండు సంవత్సరాలు పడుతుందని భావిస్తున్నాము. ఈ ఇన్స్టిట్యూట్ మన ప్రాక్టీషనర్లకు పరిశోధన మరియు అభివృద్ధికి ఎంతో అవసరమైన సదుపాయాన్ని ఇవ్వటమే కాకుండా వైబ్రియానిక్స్ సంబంధిత కార్యకలాపాల అభివృద్ధికి అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రచురణలు, శిక్షణ మరియు అన్నిటికంటే ముఖ్యంగా రోగులకు చికిత్స వంటి విషయాల్లో అన్ని రకాలుగా స్వతంత్ర ప్రతిపత్తిగల ఒక ముఖ్య కేంద్రంగా ఉంటుంది. ఇది ఇప్పటికే ప్రశంసనీయమైన పాత్ర నిర్వహిస్తున్న ప్రధాన నాయకత్వ బృందం ద్వారా నిర్వహింపబడుతున్న హీలింగ్ ట్రస్ట్ చేత పూర్తిగా నడిచే విధంగా నేను ఏర్పాటు చేస్తున్నాను. ఈ కేంద్రాన్ని స్థాపించడం అనేది క్రమంగా నా బాధ్యతలను ఎంతో అంకితభావం గల మన వైబ్రియానిక్స్ కోర్ టీంకు మార్చే ప్రక్రియలో మొదటి దశ. ఈ వైబ్రియానిక్స్ ను కొనసాగించడానికి  నాకు శక్తిని, అవకాశాన్ని ఇచ్చినందుకు స్వామికి హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలుపుకుంటూ అంతకన్నా ఎక్కువగా స్వామి తమ దివ్య ఆశీర్వాదం వలన వైబ్రియానిక్స్ మిషనుకు సమర్థవంతమైన టీం మరియు అన్ని వర్గాలు మరియు అన్ని రంగాల నుండి అన్ని వయసుల నుండి  అంకితభావం గల వ్యక్తులు అనగా రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది నుండి గృహ నిర్వాహకుల వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుండి విద్యావేత్తల వరకు మరియు 30 ఏళ్ళ నుండి మన పరిశోధన అధిపతి 87 ఏళ్ల వయసులో కూడా ఇంకా బలంగా ఉండి సేవ నిర్వహిస్తున్న వంటి వారి వరకూ అనేక మంది ఉన్నారు!

కోవిడ్-19 మహమ్మారి వచ్చి పది నెలలు దాటినా ఇది మన మనసులో సజీవంగానే ఉంది, కారణం ఇది మన భూగ్రహం అంతటా ఇంకా వినాశనాన్ని సృష్టిస్తూనే ఉంది. ఎందుకంటే ఇది  ప్రధానంగా అధిక స్థాయి అసింప్టోమాటిక్  ట్రాన్స్మిషన్ మరియు నిరంతరం మారిపోతూ ఉన్న స్థితి కలిగి ఉంది. కనుక మీ మీ వ్యక్తిగత రక్షణ విషయంలో అలసత్వం వలదని అలాగే మెడికల్ హెల్ప్ తీసుకుంటున్న రోగులను కూడా వారు వాటిని కొనసాగించేలా చేయమని అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా క్రింది స్థాయి నుండి కూడా మనకు చక్కటి ప్రోత్సాహకరమైన ఫీడ్బ్యాక్ అందుతుందని తెలియజేయటానికి సంతోషంగా ఉంది. ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకున్న వారిలో ఎక్కువమంది ఎటువంటి ఇన్ఫెక్షన్ బారిన పడలేదు మరియు తేలికపాటి లక్షణాలను చూపించిన అతి కొద్ది మంది కూడా దీనినే ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకున్నారు. భారతదేశంలో మాత్రమే గత రెండు నెలల్లో ఇమ్యూనిటీ బూస్టర్ డిమాండ్ భారీగా పెరిగింది. 2020 ఆగస్టు నాటికి IBని తీసుకోవడం ప్రారంభించి కొనసాగిస్తున్న 180,000 మంది గ్రహీతలులతోపాటు మన  ప్రాక్టీషనర్లు 54 వేల మంది కొత్త గ్రహీతలకు పంపిణీ చేశారు.  

మరొక ఉత్తేజకరమైన నవీనీకరణ ఏమిటంటే ఈ సంవత్సరం గురు పూర్ణిమ రోజున పునరుద్ధరింపబడిన మన వెబ్సైట్  (https://www.vibrionics.org) ప్రారంభించిన నాలుగు నెలల లోపు 4 వేల మంది దీన్ని సందర్శించారు. చికిత్స కోరుకునే వ్యక్తుల నుండి విచారణ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మనం రూపొందించిన వెబ్సైట్ 2వ దశ మరింత మెరుగైన హంగులతో యూజర్ ఫ్రెండ్లీ మెనూ కలిగి ఉండి కేటగిరీ లేదా వర్గము ప్రకారము రోగ చరిత్రలు, మంత్రాలు, మరియు తాజాగా రూపొందించిన వ్యాసాల విభాగపు వెబ్సైట్ లింకులతో చక్కగా మెరుగుపరచబడి ఉన్నది. మన వార్తా లేఖల యొక్క పిడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేయడానికి వీలుగా న్యూస్ వెబ్ సైట్ (https://news.vibrionics.org) మెరుగుపరచబడినది..ఏ భాషలోనైనా శోధన విభాగం సెర్చ్ బార్ “pdfs” అని ఎంటర్ చేయడం ద్వారా ఈ పేజీని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. మరాఠీ మాట్లాడే వారి సహాయం కోసం ఈ భాషను మన వెబ్ సైట్ లో చేర్చడం జరిగింది. తమిళము మాట్లాడే మనప్రాక్టీషనర్లకు ఒక శుభవార్త ఏమిటంటే మన AVP మ్యాన్యువల్ ను ప్రాక్టీషనర్లు 11579 & 11580 ద్వారా తమిళంలోనికి అనువదించబడింది, ఇది 2020 నవంబర్ 23న స్వామి యొక్క దివ్య పాదాలచెంత సమర్పింప బడుతుంది.

 ప్రతీ ఒక్కరికీ నా వినయపూర్వకమైన అభ్యర్థన ఏమిటంటే మీ ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక వ్యాసాలు మరియు రోగుల యొక్క వృత్తాంతాలు లేదా టెస్టిమోనియల్స్ (ఆడియో వీడియో లేదా వ్రాసినవి) పంపించండి. ప్రారంభకులకు మేము ప్రాక్టీషనర్11601 నుండి స్వీకరించిన ఒక వీడియోను మన వెబ్ సైట్ లో ఉంచాము. దానిని తప్పనిసరిగా వీక్షించండి. వెబ్సైట్ కు సంబంధించిన ఏదైనా ప్రశ్న లేదా సూచనతో సహా లేదా వెబ్ సైట్లలో మీకు ఏదైనా బగ్ ఎదురైతే తక్షణ ప్రతిస్పందన కోసం [email protected] కు వ్రాయండి.

చివరిగా స్వామి ఆనందం గురించి చెప్పిన అతి ప్రభావవంతమైన బోధతో ముగించాలని అనుకుంటున్నాను. స్వామి ఏం చెప్పారంటే “మీరు ఏం చేసినా శ్రద్ధ మరియు అంకితభావంతో చేయండి. ఆనందం యొక్క రహస్యం ఏమిటంటే మీకు నచ్చినది చేయడమే కాదు మీరు చేసే పనిని ఇష్టపడడం”. ప్రేమపూర్వకంగా చేసే ఏ సేవ అయినా ఆధ్యాత్మికంగా భగవంతుడికి నివేదనగా మరియు అత్యంత ఫలవంతమైన ఆరాధనగా మారిపోతుంది. నిజమే మనం ప్రస్తుతం ఊహించలేని ఒక విషాద మహమ్మారి చేతిలో నలిగిపోతూ ఉన్నప్పటికీ మనకు మార్గనిర్దేశం చేయడానికి మన ప్రేమ మూర్తి స్వామి వాణి, మన వెనక ఉండి నడిపించడానికి వైబ్రియానిక్స్ సమూహము, మరియు స్వామి వైబ్రియానిక్స్ కు ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదము తోడుగా ఉన్నాయి. కనుక మనమందరం ఒక కొత్త కోణంలో బలంగా దయతో మునుపటి కన్నా అధికమైన అంకితభావంతో అన్నిటికంటే ఎక్కువగా ఆధ్యాత్మిక పురోగతితో ఎదగడానికి ప్రయత్నిద్దాం..  

సాయికి ప్రేమపూర్వక సేవలో,

జిత్ కె అగ్గర్వాల్.