దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 9 సంచిక 5
September/October 2018
"ఈ రోజుల్లో ప్రజలంతా పొద్దస్తమానం ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇంక పానీయాలు, స్నాక్స్ విషయం చెప్పనే అక్కరలేదు. ఏమాత్రం అవకాశం చిక్కినా మధ్య మధ్య వాటిని కూడా కడుపులో వేసేస్తూ ఉంటారు. ఇలా చేస్తే అజీర్ణము ఇంకా ఇతర వ్యాధులు రాకుండా ఎలా ఉంటాయి. మనిషికి నిమిషానికి ఒక కేలరీ శక్తిని ఇచ్చే ఆహారము సరిపోతుంది. యుక్తవయసులో ఉన్నవారికి రోజుకు 2,000 కేలరీల ఆహారము సరిపోతుంది. ఆరోగ్యకరమైన జీవితానికి మనిషికి రోజుకు 1,500 కేలరీలనిచ్చే ఆహారము చాలు. కానీ ఈ రోజుల్లో మనిషి సగటున 5,000 కేలరీల శక్తి నిచ్చే ఆహారం తీసుకుంటున్నాడు. దీనిఫలితముగా అజీర్ణము నిద్రలేమి ఏర్పడుతున్నాయి. నిద్ర లేకపోవడం ఎన్నో అనర్ధాలకు కారణ మవుతుంది. నిద్ర గురించి చింతించకూడదు. ఏమాత్రం ఆందోళన చింత లేకుండా పడుకుంటే హాయిగా నిద్ర పట్టేస్తుంది"
-సత్యసాయిబాబా, “నడిచే దేవాలయం ” వేసవి వెన్నెల 1990 అధ్యాయం3
http://sssbpt.info/summershowers/ss1990/ss1990.pdf
"ఎవరయితే నిస్సహాయులైన తమ సోదర సోదరీమణులకు సేవ చేస్తారో వారు ఇప్పుడు నేను చెపుతున్న మాటలకు సాక్ష్యంగా నిలుస్తారు. అహంకారం రూపుమాపడానికి, హృదయాన్ని ఆనందంతో నింపుకొనడానికి సేవకు మించిన సాధన మరొకటిలేదు. సేవను అర్ధంలేనిది గానూ, చిన్నతనంగానూ చూసేవారు దీని యొక్క మహత్తర ఫలితాలు పొందలేరు. సేవ యొక్క ఉత్తుంగ తరంగం ఈ ప్రపంచమును ప్రభావితం చేసే ద్వేషం, అసూయ, స్వార్ధం వంటి అవలక్షణాల నన్నింటిని దూరం చేయగలదు."
-సత్యసాయిబాబా , “ఏనుగులు మరియు సింహము ”10సెప్టెంబర్ 1969నాటి దివ్యవాణి1969
http://www.sssbpt.info/ssspeaks/volume09/sss09-18.pdf