Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనముగా

Vol 9 సంచిక 4
July/August 2018


1.     ఆరోగ్య వ్యాసము

రక్తహీనత

అనారోగ్యము శారీరక పోషకాహార లోపం కన్నా మానసిక పోషకాహార లోపము వల్లనే కలుగుతుంది. వైద్యులు విటమిన్ల లోపము గురించి చెపుతూ ఉంటారు. కానీ నేను దీనిని విటమిన్ G లోపము అని అంటాను. ఈ లోప సవరణకు దేవుని నామమును స్మరించడం, దేవుని మహిమను కీర్తించడం చేయవలసిందిగా సిఫారసు చేస్తాను. ఆ విటమిన్ లోపానికి ఇదే పరమ ఔషదం. దీనితో పాటు నియంత్రిత జీవన విధానము, మంచి అలవాట్లు కూడా రెండింట మూడొంతులు జీవితాన్ని ప్రభావితం చేస్తే ఔషదం కేవలం ఒకవంతు మాత్రమే ప్రభావితం చేస్తుంది.“…శ్రీ సత్యసాయిబాబా .

1. రక్తహీనత అనగా ఏమిటి?2-11

మానవ శరీరము యొక్క ఎముక మజ్జ మూడు రకాలైన రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అవి ఇన్ఫెక్షన్ ల నుండి శరీరాన్ని రక్షించే తెల్లరక్త కణాలు (WBC), రక్తం గడ్డకట్టడానికి దోహదం చేసే ప్లేట్లెట్ లు, శరీరమంతా ప్రాణవాయువును సరఫరా చేసే ఎర్రరక్త కణాలు (RBC) హిమోగ్లోబిన్ (Hb), అనేది ఎర్రరక్త కణాల్లో ఉండే ఒక సంక్లిష్టమైన ఇనుప ధాతువు కలిగి ఉండే ప్రోటీన్. ఇది రక్తానికి ఎరుపు రంగు నివ్వడమే కాక ఆక్సిజెన్ ను జీవకణాలన్నింటికి సరఫరా చేస్తుంది.2

రక్త హీనత అనేది మన శరీరములో చాలినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేకపోవడం లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం మూలంగా ఏర్పడుతుంది.3,4,5 ఎర్ర రక్తకణాల యొక్క సాధారణ జీవితకాలం120 రోజులు. లివరు మరియు స్ప్లీన్ ద్వారా తొలగించబడే జీవితకాలం ముగిసిన ఎర్రరక్తకణాల లోటును పూడ్చడానికి శరీరము ప్రతీ రోజూ ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది.6  సాధారణముగా రక్తంలో ఎర్ర రక్త కణాలు ఒక మైక్రో లీటరుకు మగవారిలో 4.7 నుండి 6.1 మిలియన్లు, ఆడవారిలో 4.2 నుండి 5.4 మిలియన్ల వరకూ ఉంటాయి.7  అలాగే సూచించబడిన హిమోగ్లోబిన్ స్థాయి మగవారికి 14 నుండి 18 g/dL ఆడవారికి 12 నుండి 16 g/dL ఉంటాయి.8 ఒక చిన్న సాధారణ రక్త పరీక్ష ద్వారా వీటి స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసు కోవచ్చు.

2. రక్త హీనత యొక్క లక్షణాలు 2-5,8,10-19,21               

రక్తహీనత యొక్క లక్షణాలు ఏమీ లేని స్థాయి నుండి ప్రాణంతకమైన స్థాయి వరకూ ఉంటాయి. రక్త పరీక్ష చేయించుకోనంత వరకూ సాధారణ నుండి ఒక మోస్తరు స్థాయి లో ఉండే రక్తహీనత గురించి తెలుసుకోవడం కూడా కష్టమే. రక్తహీనత యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • పాలిపోయినట్లు ఉండడం, ముఖ్యంగా పాలిపోయినట్లుండె కంటి పొరలు, నాలుక, అరచేతులు, గోర్లు దీనినే పాలర్ అని పిలుస్తారు, అలాగే పెళుసుగా చెంచా ఆకారంలో ఉండే గోర్లు ఇవి రక్తహీనత కు కొన్ని చిహ్నాలు. ఆసుపత్రి ఆధారిత చికిత్సా అధ్యయనం ప్రకారము పాలర్ అనేది పిల్లల్లో రక్తహినతకు ఒక నమ్మదగిన సంకేతమని, ఇది లేకపోవడం వారిలో తీవ్రస్థాయిలో ఈ సమస్య లేనట్లు భావించడానికి కూడా ఆస్కారం ఉందని నిరూపించింది.
  • అలసట, మగత, మెదడు మొద్దుబారినట్లు ఉండడం, దడ గుండె వివిధ అవయవాలకు ఆక్సిజెన్ పంపడంలో వత్తిడికి లోనుకావడం, అసాధారణ హృదయ స్పందన, శ్వాస లేకపోవడం, ఛాతిలో నొప్పి వంటివి ఉంటాయి.
  • నిర్లక్ష్యం చేయకూడని కొన్ని ఇతర సూచికలు: సాధారణ కార్యకలాపాలు చేసుకోవడానికి కూడా శక్తి లేకపోవడం, బరువు తగ్గడం, మతిమరుపు, ముభావంగా ఉండడం, తలనొప్పి, లో బి.పి, తిమ్మిరి, అరచేతులు అరికాళ్ళలో చల్లగా ఉండడం, సాధారణ స్థాయి కన్నా ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం, రుచి లేకపోవడం, నాలుకలో వాపు లేదా నొప్పి, నోటి మూలల్లో పగుళ్ళు, చెవిలో హోరు, మలము యొక్క రంగు మారడం, జుట్టు రాలిపోవడం, అనారోగ్యంతో ఉన్నట్లు అనుభూతి వంటివి కూడా కొన్ని సూచికలు గా గుర్తించవచ్చు.   
  • వింత కోరికలు : ఎవరికైనా పోషకాహారములు కానట్టి పదార్ధాలు అనగా ధూళి, మట్టి, పేపర్లు, పెయింట్, రబ్బరు బ్యాండు మైనము, మంచు, పిండి వంటివి తినే అలవాటు ఉంటే (దీనినే పైకా ప్రవర్తన అంటారు) వీరు ఐరన్ లోపము కలిగి ఉన్నట్లు భావించాలి. చాలామంది చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, పెరుగుదలలో లోపము ఉన్నవారు ఈ అలవాట్లను కలిగి ఉంటారు.3,10,12,14,16-18
  •  B12 విటమిన్ లోపము ఉన్నవారి లక్షణాలు: ఈ లోపం ఉన్నవారికి కాళ్ళల్లోనూ, చేతులలోనూ సూదులు గుచ్చుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. స్పర్శజ్ఞానం ఎక్కువ ఉండదు, నడవడం కష్టంగా ఉంటుంది, కాళ్ళు చేతులలో పటుత్వం ఉండదు. ఎప్పుడూ అస్థిమితంగా డిప్రెషన్ తోనూ, ఆకలి లేకుండాను, నిరాశతోనూ ఉంటారు.12,19

3.  రక్తహీనత కు కారణాలు  2-5,8-10-14,20,21-24

  • ఐరన్ మరియు విటమిన్ల లోపము: ప్రపంచ వ్యాప్తంగా రక్త హీనతకు కారణం ఇనుము లోపము అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇనుము, విటమిన్ B9 (ఫోలేట్) మరియు విటమిన్ B12 ఇవే ప్రధాన కారణాలు.
  • రక్తాన్ని కోల్పోవడం కారణంగా లోపం ఏర్పడడం : స్త్రీలు ఋతుక్రమంలో ఎక్కువ రక్తాన్ని కోల్పోవడం, గాయాల కారణంగానూ, శస్త్రచికిత్సల కారణంగాను, అల్సర్, కేన్సర్ కారణంగానూ, తరుచుగా రక్తదానం చేయడం కారణంగాను రక్త హీనత ఏర్పడుతూ ఉంటుంది.
  • పోషక పదార్ధాలు జీర్ణం చేసుకోవడంలో శారీరక అసమర్ధతకొన్ని ప్రత్యేక ఆహార పదార్ధాలు, పానీయాలు, ధూమపానం, మద్యపానం, దీర్ఘకాలిక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా పరాన్నజీవులకు సంబంధించిన మరియు రోగనిరోధక లోపానికి చెందిన వ్యాధులు, కొన్ని రకాల మందులు, వైద్యము, శస్త్ర చికిత్సలు, వంటివి పోషక పదార్ధాలలో ఉన్న ఐరన్ ను విటమిన్ లను తీసుకోవడంలో శరీరానికి ప్రతిబంధకంగా ఉంటాయి.
  •  RBC (ఎర్రరక్త కణాలు) సరిపడినంతగా లేకపోవడంఅధిక మొత్తం లో రేడియేషన్ కు గురికావడం, కొన్ని రకాల రసాయన పదార్ధాలకు గురికావడం, వైరస్ లు, రోగ నిరోధక శక్తి లోపానికి చెందిన వ్యాధులు, పోషకాహార లోపము, హార్మోన్ల అసమతౌల్యత, గర్భ ధారణ, దీర్ఘకాలిక వ్యాధులు  ఎర్ర రక్త కణాల ఉత్పత్తి వేగాన్ని తగ్గిస్తాయి. వారసత్వ జన్యుపరమైన లోపము కూడా దీనికి కారణం కావచ్చు. పరిశోధన20 మన శరీరంలో ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేసే యంత్రాంగము ఇనుము లోపం కారణముగా ఎంత ప్రతికూలమైన పరిస్థితిని ఎదుర్కొంటుందో పరిశోధనలు నిరూపించాయి.
  • RBC ఎర్ర రక్తకణాలు నాశనమవడం: కొన్ని ప్రత్యేక ఆరోగ్య కారణాలు వారసత్వ సమస్యల కారణంగా ఎముకల మజ్జలో ఎర్ర రక్తకణాల ఉత్పతి కంటే నాశనమవడమే హెచ్చుస్థాయిలో ఉంటోంది. ఉదాహరణకు స్ప్లీన్ వ్యాకోచం, తలసేమియా, కొన్ని రకాల  ఎంజైముల లోపం కారణంగా ఈ సమస్య తలెత్తుతోంది. 4
  • భారత దేశంలో స్త్రీలు, పిల్లలు ఎదుర్కొనే అదనపు సమస్యలుభారత ప్రభుత్వపు ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 23, రక్తహీనత కు పైన పేర్కొన్న కారణాలే కాకుండా పరాన్నజీవుల కారణంగా ఐరన్ లోపము, పరిసరాలలో పారిశుధ్య లోపము, సురక్షితము కాని మంచినీరు, పిల్లలు, స్త్రీలలో వ్యక్తిగత పారిశుధ్య లోపము కూడా కొన్ని కారణాలుగా పేర్కొంది.
  • ప్రధానమైన కారణముఆయుర్వేదము ప్రకారము 24, పోషకాహార లోపము అనేది చాలినంత పౌష్టికాహారం తీసుకోకపోయినందుకు కాదు శరీరంలో అగ్నితత్వం (వికృత పిత్త) లో అసమతుల్యం కారణంగా ఏర్పడుతోంది అని పేర్కొంటోంది. దీనికి కారణం పుల్లని మరియు అధిక ఉప్పు గల పదార్ధాలు తినడం, అధిక శారీరక శ్రమగా పేర్కొంటున్నది.  

4. ప్రమాదాలు మరియు జాగ్రత్తలు 2,3,5,10-14,17,22-29

రక్తహీనత అనేది వ్యాధి కాదు ఇది ఏ సమస్యలు లేకుండా నివారించదగినట్టిది. దీనిని నిర్లక్ష్యం చేయడం వలననే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. పిల్లలు, యువజనులు, మహిళలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు కలవారు దీనికి లోనవుతూ ఉంటారు. దీర్ఘకాలిక రక్తహీనత విషయంలో రక్తంలో ప్రాణవాయువు శాతం తీవ్రస్థాయిలో పడిపోతేనే తప్ప ఆక్సిజెన్ స్థాయి తక్కువ ఉన్నా శరీరము దానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది. 22 అటువంటి సందర్భాలలో రక్తము ఎక్కించడం, ఎముకల మజ్జ మార్పిడి వంటివి అవసరమవుతాయి. రక్తంలో దీర్ఘకాలిక ప్రాణవాయువు లోపము గుండె, మెదడు, ఇంకా ఇతర ముఖ్యమైన అవయవాలను దెబ్బతీయడమే కాక దీనివలన మరణము కూడా సంభవించవచ్చు. రక్తహీనత జంతువులకు కూడా ప్రమాదకరమైనదే.

రక్తహీనత కు కారణం గుర్తించకుండా వైద్యపరంగా చికిత్స చేయరాదు.17 ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకొనేవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా సూచన మేరకే వాటిని తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా తీసుకుంటే అది శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో నిలవ ఉంచబడి            గుండె, కాలేయము, పాంక్రియాస్ వంటి ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. తగు జాగ్రత్తలతో రక్తదానం చేయడం దీనిని నిరోధిస్తుంది.3,11,17,24-29

5. రక్తహీనతకు నివారణ మరియు చికిత్స 2,3,5,13,14,23,24,30-54

సంపూర్ణ ఆహారము స్వీకరించడం ప్రారంభించండి: రోజుకు సుమారు 500 గ్రాముల పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలు, ఉడికించిన తృణధాన్యాలు, సులువుగా జీర్ణమై మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. 30 మన శరీరం ఏమి కోరుతుందో దాని ప్రకారము ఎట్టి ఆహారము అందిస్తే దేహము చురుకుగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందో అట్టి ఆహారాన్ని  అందించాలి. నోటిలోకి తక్కువ లేదా సరిపడినంత ఆహారము తీసుకోని బాగా నమలడం వలన త్వరగా జీర్ణము అవుతుంది. అవగాహనతోను కృతజ్ఞతా భావనతోను తినడం మంచిది.

ఇనుము మరియు B9, B12 మరియు  C విటమిన్ల మూలాలు మరియు కొన్ని గృహ చిట్కాలు క్రింద ఇవ్వబడ్డాయి:

1. ఇనుము 2,3,5,13,14,23,24,32-39ఇనుము లభించే అత్యత్తమ వనరులు

(a) పండ్లు  ఆపిల్, దానిమ్మ, అరటిపళ్ళు, పీచ్ మరియు పుచ్చకాయ.

(b) డ్రై ఫ్రూట్స్  ఖర్జూరం, ఆఫ్రికాట్లు, అత్తిపండ్లు, మరియు ఎండు గింజలు ;  పిస్తాలు, హాజల్ గింజలు, బాదాం మరియు జీడిపప్పు. విత్తనాలు గుమ్మడికాయ/స్క్వాష్, నువ్వులు, జనపనార గింజలు, అవిశ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, చియా మరియు ఫెనుగ్రీక్. 

(c) ఆకుకూరలు  పాలకూర, కాలే, మెంతుకూర, ఆవాలు, ఫెనుగ్రీక్ ఆకులు, ఆవాలు, చేమగడ్డ, ముల్లంగి, పుదినా, మునగ కాయలు, మరియు కర్రీ ట్రీ ఆకులూ, బ్రోకాలి (పచ్చిది లేదా ఉడకబెట్టింది), బ్రసెల్స్ మొలకెత్తిన విత్తనాలు, కాలిఫ్లవర్, మరియు గుమ్మడికాయ, బీట్ రూట్, పచ్చి అరటి(కూర అరటి) తొక్క వలవని ఉడక బెట్టిన బంగాళా దుంప, మరియు సూర్యకాంతిలో ఎండబెట్టిన టమాటాలు నుండి కూడా లభిస్తుంది.

(e) తృణ ధాన్యాలు క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్, అమరాంత్, సోయాచిక్కుడు మరియు వాటి ఉత్పత్తులు, చిక్కుడు రకాలు, బటానీలు, కాయధాన్యాలు, చిక్ పీస్ వీటిలో ఇది సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా ఫింగర్ మిల్లెట్, పెర్ల్ మిల్లెట్ (చిరుధాన్యాలు) మనం తినే బియ్యము, గోధుమ కన్నా ఉత్తమ మైనవి.

ఐరన్ ను తగు జాగ్రత్తతో  తీసుకోవాలి 3,5,23: ఐరన్ ను B మరియు C విటమిన్లు సమృద్ధిగా ఉన్న పదార్ధాలతో అనగా చిరుధాన్యాలు/ఉడికించిన గింజలు/పులియ బెట్టిన పదార్ధాలు/మొలకెత్తిన విత్తనాలు వంటి వాటితో తీసుకున్నట్లయితే సులువుగా జీర్ణమవుతాయి. పైన చెప్పబడ్డ అనేక పదార్ధాలలో B & C విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. కనుక తగు జాగ్రత్తతోనూ విజ్ఞతతోనూ ఈ ఆహార పదార్ధాలను తీసుకోవాలి. పాలఉత్పత్తులను, కాల్షియం ఉత్పత్తులను, యాంటాసిడ్లను, కాఫీ, టీ, పంచదార, చాకొలేట్, సోడా, తవుడు, గుడ్లు వంటివి ఐరన్ జీర్ణము కావడానికి నిరోధకంగా పనిచేస్తాయి కనుక వీటిని ఐరన్ కాంబినేషన్ తో తీసుకోక పోవడం మంచిది.

2. ఫోలేట్  (విటమిన్ B9) 2,3,43-46: సహజంగా ఈ విటమిన్ పండ్ల లోనూ కూరగాయలలోను, తృణ ధాన్యాలలోను, గింజలు, విత్తనాలలోనూ లభిస్తుంది. ఈ విటమిన్ శరీరంలో నిలవ ఉంచబడదు కానీ ప్రతీ రోజూ అవసరం మేరకు శరీరానికి తగినంత చేర్చబడుతూ ఉంటుంది. అధికంగా ఉన్నది సహజ సిద్ధంగా బయటకు పంపివేయబడుతుంది. ఫోలేట్ ఎర్రరక్తకణాలను పెంపొందింపజేయడమే కాక రోగ నిరోధక శక్తిని, మెదడుకు బలాన్ని పెంపొందిస్తుంది. ఇంకా B12, విటమిన్ జీర్ణము కావడానికి, ఆరోగ్యకరమైన గర్భధారణకు కూడా ఉపయోగకరమైనది. ఈ విటమిన్ ను తీసుకోవడానికి ఉదయమే సరియైన సమయం ఎందుకంటే అప్పుడే శక్తి విడుదల అధికంగా ఉంటుంది.46

ఫోలేట్ సమృద్ధిగా ఉండే పదార్ధాలు: ‘‘ఐరన్ మూల పదార్ధాలు” అని చెప్పబడ్డ పదార్ధాలు ఫోలేట్ ను కూడా సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఫోలేట్ సమృద్ధిగా ఉండే మరికొన్నిపదార్ధాలు అవకడో, అస్పరేగాస్, ప్రునె, మొక్కజొన్న, ఆకుకూరలు, ఓక్రా, మరియు క్యారెట్లు. ఫోలేట్ అనేది ఫోలిక్ యాసిడ్ రూపంలో రొట్టెలలోను, పాస్తా లోనూ, చిరుధాన్యాల లోనూ లభిస్తుంది.2,3,43,44

3. విటమిన్ B12 2,3,47:  సాధారణంగా ఈ విటమిన్ సహజసిద్ధమైన స్థితిలో జంతు సంబంధమైన పదార్ధలలోనే లభిస్తుంది. అలాగే పాలు పాల ఉత్పత్తులయిన పెరుగు, వెన్నలలోనూ, పులియబెట్టిన సోయా ఉత్పత్తులలో కూడా లభిస్తుంది. విటమిన్ B12, సమృద్దిగా గ్రహించడానికి. శరీరంలో నిలువ చేసుకోవడానికి దీనిని  విటమిన్ B6  ఉండే పదార్దాలైన పాలకూర, అక్రోటు, అవకడో, పోలిష్ చెయ్యని బియ్యం, మరియు అల్లం వంటి వాటితో కలిపి తీసుకోవాలి.

వండిన అన్నాన్ని తగినంత నీటిలో రాత్రంతా ఉంచి తాజా పెరుగులో కలిపి రుచికోసం కొంత ఉప్పుతో చేర్చి తిన్నట్లయితే దీనిలో పుష్కలంగా విటమిన్ B1248  లభిస్తుంది.

భారత దేశంలో పులియబెట్టిన పధార్థాలైన50 ఇడ్లీ లు (ఉడికించిన బియ్యపు పిండి, మినుప పిండి తో చేయబడినవి) మరియు దోక్లా  (చిక్ పీ పిండి నుండి తాయారు చేసినవి ) వీటి పైన కొంత సందిగ్ధం ఉన్నప్పటికీ వీటిలో  B12, సమృద్ధిగా ఉంటుందని విశ్వసిస్తారు. ఇడ్లీ ల పైన నిర్వహించిన అధ్యయనంలో మినప పిండి పులియబెట్టినపుడు దీనిలో విటమిన్  B12 చేరుతుందని తెలిసింది.

4. విటమిన్ ఈ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు 5,40-42: ఉసిరికాయ, జామకాయ, బత్తాయి, నిమ్మ వంటి పుల్లని పళ్ళు, కివి లాంటి బెర్రీ పళ్ళు, ఎండుద్రాక్ష, ద్రాక్షా, బొప్పాయి, అరటిపళ్ళు, పుచ్చకాయ, ఎరుపు ఆకుపచ్చని మిరియాలు, క్యాబేజీ, కొత్తిమీర, పండ్లు, ఆకుపచ్చ కూరగాయాలు, తృణ ధాన్యాలు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇంకా  పైన్ఆపిల్  మామిడి, పార్స్లీ, ఆలుగడ్డ, చిలకడ దుంప, మరియు ఇతర దుంపలు, టమాటాలు ( గింజలు తీసివేయాలి కారణం ఏమిటంటే అవి త్వరగా జీర్ణం కాక జీర్ణ వాహికలో రాళ్ళుగా మారతాయి.31). రోజూ కొన్ని తులసి ఆకులు తినడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.24

విటమిన్ C ను తగు జాగ్రత్తతో తీసుకోవాలి.42: మానవ శరీరము స్వతహాగా C విటమిన్ ను తయారుచేసుకోవడం గానీ  నిలువ ఉంచుకోవడం గానీ చేయలేదు కనుక  తాజా పండ్లను కూరగాయలను తీసుకునే టప్పుడు ఈ విటమిన్ ఎక్కువ తీసుకున్నా మేమో అని బెంగపడవలసిన అవసరం లేదు. ఐతే ఎవరైనా C విటమిన్ ను సప్లిమెంట్ రూపంలో తీసుకుంటూ ఉంటే  రోజుకు  2 గ్రాములకు మించి తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే దానివలన  కడుపులో వికారం కలిగే అవకాశం ఉంది. ఆహార పదార్ధాలను వండడం ద్వారా, నిలువ చేయడం ద్వారా, మైక్రోఓవెన్ ఉపయోగించడం, ఉడికించడం ద్వారా కొంత C విటమిన్ నష్టమయ్యే అవకాశం ఉంది. కానీ ఉసిరికాయ లో మాత్రం వంటకు ఉపయోగించినప్పటికీ దానిలో C విటమిన్ ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది.

6. గృహ చిట్కాలు 24,32,52

*గోరువెచ్చని నీటిలో తేనె కలిపి ప్రతిరోజూ సేవిస్తే అది ఎర్ర రక్త కణాలను పెంచడమే కాక Hbస్థాయిలను కూడా పెంచుతుంది. ఐతే తేనెను బాగా వేడిగా ఉన్న నీటితో ఇవ్వడం లేదా తేనెను వేడి చేయడం వంటివి చేయకూడదు. దానివలన తేనె విష తుల్యముగా మారే అవకాశము ఉంది. అలాగే దీనిని  సంవత్సరం లోపు పిల్లలకు ఇవ్వడం కూడా మంచిది కాదు.32

*పురాతన కాలంలో ఉపయోగించిన రీతిగా ఇనుప పాత్రలలో ఆహారాన్ని తినడం చాలా మంచిది. ఇనుప పాత్రలు గానీ లేదా పళ్ళాలలో గానీ వండిన పదార్ధాలు ఇనుమును గ్రహించడం వలన అవి రక్తహీనత ఉన్న రోగికి సత్వర ఉపశమనాన్ని ఇస్తాయి.13,24 నల్లగా కనిపించే బెల్లములో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చెరుకురసాన్నిపెద్ద పెద్ద ఇనుప పాత్రలలో మరిగించడం ద్వారా ఈ బెల్లాన్ని తయారు చేస్తారు కనుక దీనిలో సులువుగా జీర్ణమయ్యే ఇనుప ధాతువు ఉంటుంది.52

*ప్రతీ క్షణం విటమిన్ Gతీసుకుంటూ ఉండండి. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండండి. అంతర్యామిగా ఉన్న భగవంతుడి సామీప్యాన్ని ఎల్లప్పుడూ అనుభవించండి!

సాయి వైబ్రియానిక్స్: భగవాన్ బాబా వారిచేత ఆశీర్వదింపబడిన ఈ అద్భుతమైన రెమిడీలు రక్త హీనతను అరికట్టడమే కాక ఇది శారీరక స్థాయికి రాకముందే (సూక్ష్మ శరీర స్థాయిలో ఉన్నప్పుడే) నివారించగల శక్తివంతమైనవి. ప్రాక్టీషనర్ లు ‘108 కామన్ కొంబో’ లేదా ‘వైబ్రియానిక్స్ 2016’ పుస్తకాలను చదవవచ్చు.

రిఫెరెన్స్ కోసం కావలసిన వెబ్సైట్ ఎడ్రస్ లు:

1. http://www.sssbpt.info/ssspeaks/volume05/sss05-39.pdf

2. https://www.mayoclinic.org/diseases-conditions/anemia/symptoms-causes/syc-20351360

3. https://www.speakingtree.in/blog/a-visual-guide-to-anemia

4. https://www.health24.com/Medical/Anaemia/Anaemia-20130216-3

5. https://draxe.com/anemia-symptoms/https://draxe.com/vitamin-c-foods/

6. https://www.labce.com/spg469710_normal_red_blood_cell_rbc_characteristics.aspx

7. https://medlineplus.gov/ency/article/003644.htm 

8. Taber’s Cyclopaedic Medical Dictionary, Edition 20, pages 105, 966,1141.

9.  http://www.who.int/vmnis/indicators/haemoglobin.pdf

10. https://www.healthline.com/nutrition/iron-deficiency-signs-symptoms

11. https://blogs.mercola.com/sites/vitalvotes/archive/2007/06/25/How-do-You-Know-if-You-Are-Anemic.aspx

12. https://www.webmd.com/a-to-z-guides/understanding-anemia-symptoms#1

13. https://www.drweil.com/health-wellness/body-mind-spirit/heart/anemia/

14. https://www.nhsinform.scot/illnesses-and-conditions/nutritional/iron-deficiency-anaemia

15. Pallor detects anaemia in kids: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2797134/

16. Study on pica: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2850349/

17. https://articles.mercola.com/sites/articles/archive/2016/11/05/craving-ice-iron-deficiency.aspx

18. https://kidshealth.org/en/parents/pica.html

19. https://www.healthline.com/health/pernicious-anemia

20. https://www.sciencedaily.com/releases/2018/01/180122110806.htm

21. http://www.journalijar.com/article/6859/prevalence-of-anemia-in-men-due-to-various-causes-in-kancheepuram-  district/

22. https://www.medicinenet.com/anemia/article.htm#what_are_the_signs_and_symptoms_of_anemia

23. http://www.pbnrhm.org/docs/iron_plus_guidelines.pdf

24. https://www.artofliving.org/in-en/ayurveda/ayurvedic-treatments/6-home-remedies-anemia

25. http://www.sankalpindia.net/book/haemoglobin-test

26. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5503668/

27. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3128151/

28. http://indianbloodbank.com/donors-guidelines.html

29. http://www.hsa.gov.sg/content/hsa/en/Blood_Services/Blood_Donation/Can_I_Donate/iron-and-blood-donation/new-hemoglobin-criteriaformaleblooddonors.html

 

Prevention and Cure

30. Eating Wisely and Well by Ramesh Bijlani (from Integral yoga of Sri Aurobindo and Mother), Rupa Publications 2012, Chapter 5, page 48-55

31. Sathya Sai Baba Speaks on Food, Sri Sathya Sai Sadhana Trust Publication, Dec.2016 edition, page 65; http://www.saibaba.ws/teachings/foodforhealthy.htm  

32. https://www.slideshare.net/BhimUpadhyaya/food-body-by-sadhguru

33. https://food.ndtv.com/food-drinks/fruits-for-anaemia-load-up-on-these-6-fruits-to-boost-your-haemoglobin-1761166;

      https://food.ndtv.com/health/anemia-diet-9-ways-to-include-iron-rich-foods-in-your-meals-1273991

34. https://www.healthline.com/nutrition/iron-rich-plant-foods#section3

35. https://www.medindia.net/patients/lifestyleandwellness/curry-leaves-health-benefits.htm

36. https://www.myfooddata.com/articles/vegetarian-iron-foods.php

37. https://www.africrops.com/africrops-moringa-a-solution-to-iron-deficiency/

38. http://www.academicjournals.org/journal/IJMMS/article-full-text-pdf/86F279D77

39. https://ods.od.nih.gov/factsheets/iron-consumer/

40. https://www.banyanbotanicals.com/info/ayurvedic-living/living-ayurveda/herbs/amalaki-amla/

41. https://www.globalhealingcenter.com/natural-health/foods-high-in-vitamin-c/

42. Vitamin C utilisation: https://medlineplus.gov/ency/article/002404.htm

43. https://www.myfooddata.com/articles/foods-high-in-folate-vitamin-B9.php

44. https://www.globalhealingcenter.com/natural-health/folic-acid-foods/

45. https://articles.mercola.com/sites/articles/archive/2007/01/16/get-your-folic-acid-from-whole-food-sources-not-multi-vitamins.aspx

46. Best time to take vitamin B: https://www.medicalnewstoday.com/articles/319556.php

47. https://www.livestrong.com/article/245167-how-to-prevent-vitamin-b12-deficiency/

48. Fermented rice food: http://sssbpt.info/ssspeaks/volume09/sss09-21.pdf

49. http://www.drvasudev.com/Vitamin-B12-&-vegans.asp

50. https://food.ndtv.com/opinions/magical-benefits-of-fermented-foods-like-yogurt-idli-or-dhokla-1285304

51. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3551127/

52. www.ihatepsm.com/blog/jaggery-gud

 

2. ఫ్రాన్సులో మొదటి  SVP వర్క్ షాప్  14-17 మే  2018

ఫ్రెంచ్ టీచర్ మరియు కోఆర్డినేటర్01620 ఆధ్వర్యంలో ఇద్దరు ఉత్సాహవంతులైన VP ప్రాక్టీషనర్లకు ఫ్రాన్సులో SVP వర్క్ షాప్ నిర్వహింప బడింది. ఈ ఇద్దరూ కూడా 2015 లో ఇదే కోఆర్డినేటర్ ద్వారా AVP శిక్షణ పొందినవారే కావడం విశేషం. శిక్షణకు 10 రోజుల ముందు ఈ భాగస్వాములు కలుసుకొని ఈ కోర్సులో వారు నేర్చుకున్న విషయాల పైన సవివరమైన చర్చ జరిపి తమ అవగాహనను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. శిక్షకురాలు వీరికి కార్డులను, SRHVP మిషన్ ను ప్రయోజన కారకంగా ఎలా ఉపయోగించాలనే విషయాలను చక్కగా వివరించారు. కార్డులు ఉపయోగించే విధానము సరియైన రీతిలో నేర్చుకునేందుకు వీలుగా అనేక అభ్యాసకృత్యాలు విద్యార్ధులకు ఇవ్వబడ్డాయి. అలాగే అలోపతి మందులను పోటేన్ టైజ్ చేయడం, బ్లడ్ నోసోడ్ తయారుచేయడం పైన కూడా చక్కని అనుభవ పూర్వక అభ్యాసాలు కల్పింపబడ్డాయి. స్నేహ పూర్వక వాతావరణములో జరిగిన ఈ శిక్షణ తమకెంతో ఆనందాన్నిచ్చిందని ఇక్కడ నేర్చుకున్న అంశాలను ద్విగుణీకృతమైన ఉత్సాహంతో తమ ప్రాక్టీసు లో ఉపయోగిస్తామని అభ్యర్ధులు తెలిపారు. విద్యార్ధులు ఉత్తమ శ్రేణిలో పాసవడమే కాక తమ ఇళ్ళకు చేరిన వెంటనే మిషన్ తో పేషంట్ లను చూడడం ప్రారంభించారు. కార్యక్రమ అంతిమ దశలో డాక్టర్ అగ్గర్వాల్ గారి ద్వారా నిర్వహించిన స్కైప్ కాల్ లో ఎన్నో విలువైన సూచనలు అభ్యర్ధులు అందుకోవడం జరిగినది.

3. విర్జీనియా, USA లో  2018 జూన్ 22-24 తేదిలలో   AVP వర్క్ షాప్

యు.యస్ మరియు కెనడా కోఆర్డినేటర్ 01339 ఆధ్వర్యంలో రిచ్మండ్ లోని ఆమె స్వగృహంలో 3 రోజుల వర్క్ షాప్ నిర్వహింపబడినది.  యుఎస్ఎ, కెనడా మరియు ట్రినిడాడ్ నుండి ఐదుగురు భాగస్వాములు ఇందులో పాల్గొన్నారు. అనేక నెలల పాటు క్రమం తప్పకుండ నేర్చుకున్న ఈ కోర్సు పాఠాలను ఈ శిక్షణ ద్వారా పరిపూర్ణం చేసుకొని సుశిక్షితులైన ప్రాక్టీషనర్ లుగా సేవా సాధనలో అడుగు పెట్టడానికి ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. శిక్షణ ఇచ్చే కోఆర్డినేటర్ కు సహకారం అందించడానికి ఈ అభ్యర్ధుల యొక్క ఈ కోర్సు టీచర్ లు కూడా కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ మూడు రోజుల శిక్షణ లో పాల్గొన్న భాగస్వాములు ఐదుగురు కూడా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తమ గమ్యస్థానం చేరుకున్న వెంటనే వైబ్రో సేవలో పాల్గొనడానికి  ఉత్సాహంతో ఉన్నారు. ఒక అభ్యర్ధి తన కోసం ఎంతో మంది పేషంట్లు ఎదురు చూస్తూ ఉన్నారనడం విశేషం. ఈ శిక్షణా తరగతులలో పాల్గొనడం ఒక మరువలేని అనుభవం అనే అభిప్రాయాన్ని అభ్యర్దులంతా వ్యక్తపరిచారు.

 

4. చెన్నై-ఇండియా లో పునశ్చరణ సదస్సు 17 జూలై 2018  

 

వైబ్రియోనిక్స్ టీచర్ 11422 ద్వారా చెన్నైలో నిర్వహింపబడిన రిఫ్రెషర్ వర్క్ షాపుకు ఏడుగురు ప్రాక్టీషనర్ లతో పాటు అమెరికాకు చెందిన ఒక సీనియర్ విజిటింగ్ ప్రాక్టీషనర్ 03521  కూడా పాల్గొని చికిత్సా అభ్యాసకులకు కొన్ని ప్రయోజనాత్మకమైన సూచనలు తెలియజేసారు.

*నీటి యొక్క ఉపయోగాలు, నీటిని సేవించే ఆరోగ్యకరమైన పద్దతులు, సహజ సిద్ధమైన విధానంలో నీటిని శక్తివంతం చేసే పద్దతులు గురించి సంపుటము 8 సంచిక 2&3 లలో  “నీరు మరియు ఆరోగ్యము ” 1-3.భాగాలు చూడవచ్చు.

ఓం శ్రీ సాయి రామ్