దివ్య వైద్యుడి దివ్య వాణి
Vol 8 సంచిక 5
September/October 2017
“నీకు ఎంత కావాలో అంతే తిను అధికంగా తినవద్దు.నీవు తినవలసిన దానికన్నా ఎక్కువ తీసుకొని వృధా చేయవద్దు. ఎందుకంటే ఆహారం వృధా చేయడం మహాపాపం. నీవు వృధా చేసే ఆహారం మరొకరి కడుపు నింపవచ్చు. కనుక ఆహారము వృధా చేయవద్దు.ఆహారము భగవత్ స్వరూపము జీవితం భగవద్ ప్రసాదితము మానవుడు ఆహారము నుండే వచ్చాడు కావున మనిషి యొక్క దేహము ,మనసు,సంస్కారము నకు ఆహారమే ప్రధాన ఆధారము."
"శరీరము తీసుకునే ఆహారము యొక్క స్థూల భాగము మలము గా బయటకు తోసివేయ బడుతుంది.సూక్ష్మ భాగము శరీరములో రక్తముగా మారుతుంది.సూక్ష్మాతి సూక్ష్మ భాగము మనసుగా మారుతుంది. కనుక మనసు మనం తీసుకునే ఆహారమును ప్రతిబింబిస్తుంది.ఈ నాడు మనసులోని పశు లక్షణాలు,అసుర భావాలకు కారణం తీసుకునే ఆహారమే అని గ్రహించాలి."
-సత్యసాయిబాబా , “ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి బోధనలు –మొదటిభాగము” https://www.sathyasai.org/publications/TeachingsOfBSSSB-Vol01.html
"అవసరంలో ఉన్న వ్యక్తికి హృదయ పూర్వకంగా సహాయము చెయ్యి దానివల్ల వచ్చే దివ్యానందాన్ని అందుకో .ఆ సేవ పెద్దగా ఉండాల్సిన అవసరం ఏమిలేదు ఇతరులు గుర్తించ లేనంత చిరు సహాయము గా ఉన్నా ఫరవాలేదు.దీనివలన నీలో ఉన్న మరియు అతనిలో ఉన్న భగవంతుడు సంతసించిన చాలు అనే భావనతో చేయాలి. "
-సత్యసాయిబాబా , “ సేవా సాధన పై ప్రవచనాలు ” 1981నవంబర్ 19 నాటి అనుగ్రహ భాషణము http://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-31.pdf