దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 7 సంచిక 3
May/June 2016
“సమతులిత వ్యక్తులుగా వికసించడానికి, సేవ ఒక ముఖ్యమైన లక్షణం. మనిషి నుండి అహాన్ని తొలగించడమే సేవ యొక్క గొప్ప లక్ష్యం. సేవ, ప్రేమ మరియు ఆప్యాయతలను ప్రోత్సహిస్తుంది. సేవ, ప్రాపంచిక ద్రుక్పధం నుండి మనిషిని దూరం చేసి దైవ మార్గంలో ఉంచుతుంది. సేవా భావము మనిషికి దివ్యత్వం యొక్క అర్థాన్ని వివరిస్తుంది. ఇది మానవజాతి అంతటికి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. నిజానికి, ఆధ్యాత్మిక మార్గంలో వికసించడానికి సేవ మొదటి అడుగు.”
-సత్యసాయి బాబా, "మానవ సేవే మాధవ సేవ" బృందావనంలో సమ్మర్ షవర్స్, 1973
http://www.sssbpt.info/summershowers/ss1973/ss1973-08.pdf
“ఆరోగ్యకరంగా జీవించడం ఎలా? నా సొంత ఆరోగ్యం గురించి చెప్తాను. నా వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు, మీరు నమ్ముతారో లేదో, నా పద్నాలుగో ఏట నుండి నిరంతరంగా నా భరువు 108 పౌండ్లు మాత్రమే ఉంది. అది ఎప్పుడు 109 కి పెరగలేదు ల్లేదా 107కి తగ్గనులేదు. ఈ విధమైన సంతులనం మరియు నియంత్రణను మీరు సాధించినప్పుడు, మీరు ఆరోగ్యకరంగా జీవించగలుగుతారు. నేను అదనపు ఆహారాన్ని కొంచం కూడా తీసుకోను. భోజనానికి నన్ను ఒక లక్షాధికారి ఆహ్వానించినా లేదా ఒక భిక్షగాడు ఆహ్వానించినా నేను మితముగానే భుజిస్తాను. నా వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ, నా శరీరం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంది. నేను ఏ విధమైన నొప్పులతోను బాధపడడం లేదు మరియు నా గుండె ఒక రాతి వలె గట్టిగా ఉంది. నేను శ్రమించే విధముగా శ్రమించే వారు ఎవ్వరు లేరు. నా ధృడమైన ఆరోగ్యానికి కారణము నా నియంత్రిత ఆహార అలవాట్లు మాత్రమే. ఆహారం, భుద్ధి మరియు దైవం ....వీటిలో ఏకత్వం మరియు సామరస్యాన్ని సాధించడానికి, ఇదే మార్గం."
-సత్యసాయి బాబా, " అవతారం మరియు భక్తులు" దివ్యోపన్యాసం, 23 నవంబెర్, 1994
http://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-31.pdf