వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 5 సంచిక 3
May/June 2014
“భగవంతునికి అర్పితమైన పని పవిత్రమవుతుంది. అటువంటి పని అనపేక్ష (కోరిక లేనిది). నిస్వార్థంగా భగవదారాధనగా జరిగిన చర్యకు కోరికలంటవు. భగవంతుని మీద స్థిరమైన దృష్టితో మనిషిసేవకు పూనుకోవాలి.”
…Sathya Sai Baba, Book Commemorating Sathya Sai Baba’s 80th Birthday, 2005
“భోజనానికి ఎంత సులువుగా కూర్చున్నారో అంత సులువుగా లేవగలగాలి. కూర్చోవటం తేలికై, లేవటం బరువైతే మీరు అవసరాన్ని మించి తిన్నారు. ఇది తమోగుణ లక్షణాలను పెంచుతుంది. కడుపులో ఖాళీ నాలుగు భాగాలుగా ఉంటుంది. పిన్నలు మూడు భాగాలను ఆహారంతో నింపి, మిగిలిన భాగాన్ని నీటితో నింపాలి. పెద్ద వాళ్ళు రెండు భాగాలను ఆహారంతో, ఒక భాగాన్ని నీటితో, ఒక భాగాన్ని గాలితో నింపుకోవటం మంచిది. నీటికి కూడా ఖాళీ లేకుండా నాలుగు భాగాలూ ఆహారంతో నింపితే జీర్ణ క్రియా నిబంధనలను మీరు దాటుతున్నారు. పగటి భోజనం తరువాత పది నిముషాలపాటు విశ్రాంతి తీసుకోండి. ఆపాద మస్తకం రక్త ప్రసారానికి ఇది దోహదం చేస్తుంది. రాత్తి భోజనం తరువాత మీరు నడిచి తీరాలి. ఇది చక్కని ఆరోగ్యాన్నీ, సాత్విక స్వభావాన్నీ అందించే దినచర్య.”
…Sathya Sai Baba, Divine Discourse, 'My Dear Students', Vol 2, Ch 2