అదనపు సమాచారం
Vol 5 సంచిక 1
January/February 2014
సాయి విబ్రియోనిక్స్ విద్యా ప్రయోజనాలకోసం ఆరోగ్య సమాచారం, దానికి సంబంధితవ్యాసాలను అందిస్తుంది; ఈ సమాచారం వైద్యసలహా కాదు. రోగులకు వారి నిర్దిష్ట రోగపరిస్థితి గురించి వారి వైద్యుని చూడమని సలహా ఇవ్వండి.
విటమిన్ ‘డి’: ప్రయోజనాలు మరియు వ్యాధి నివారణ
విటమిన్ డి - కొన్ని ఆహారాలలో లభించు, ఆరోగ్యమునకు, బలమైన ఎముకలకొరకు అవసరమైన పోషక పదార్థం యీ విటమిన్ డి. ఇది ఆహారం, దాని అనుబంధాలనుండి కాల్షియంను (ఎముకల ఆరోగ్యానికి ప్రధానమైనది) గ్రహించడానికి సహాయం చేస్తుంది. కాల్షియంతో పాటు, విటమిన్ డి వృద్ధులను గుల్లబారిన ఎముకల వ్యాధిని కాపాడటానికి సహాయపడుతుంది.
అనేకవిధాలుగా శరీరానికి విటమిన్ డి చాలాముఖ్యం. కండరాలు కదలికకు, మెదడు, యితర శరీరభాగాలమధ్య సందేశాలను తేవడానికి నరములకు చాలా అవసరం, బ్యాక్టీరియా, వైరస్ లపై దాడి చేయటానికి, రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డి చాలా ముఖ్యమైన అవసరం.
విటమిన్ డి మరియు సూర్యరశ్మి:
మీ చర్మానికి సూర్యకాంతి తగిలినప్పుడు, మీశరీరంలో స్వయంగా విటమిన్ డి తయారవుతుంది. విటమిన్ డి, విటమిన్లలో విలక్షణమైనది. ఏలనన మీశరీరంలో విటమిన్ డి హార్మోనుగా మార్చబడి, కొన్నిసార్లు "యాక్టివేటెడ్ విటమిన్ డి"/"కాల్సిట్రియల్" గా పిలువబడుతుంది.
మీకు అవసరమైన విటమిన్ డి, మీరు తినే ఆహారాల మీద ఆధారపడి ఉండదు. తగినంత విటమిన్ డి పొందాలంటే, సూర్యరశ్మికి మీ చర్మాన్ని బహిర్గతం చేయడమేకాక మీరు సప్లిమెంట్లను కూడా తీసుకోవాలి. ఇతర విటమిన్లు మరియు ఖనిజాలు పోలిస్తే, యిది కొంచెం క్లిష్టమైనా, అవసరమైన మోతాదులో విటమిన్ డి పొందడానికి తోడ్పడుతుంది.
విటమిన్ డి సంశ్లేషణకు సూర్యరశ్మి ముఖ్యమైనను, చర్మక్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి, సూర్యకాంతిని మితంగా పొందటం అవసరం.
విటమిన్ డి కి, ఎండ ముఖ్యమైనను, కొన్ని నిమిషాలకంటే ఎక్కువసేపు యెండలో ఉన్నప్పుడు, రక్షిత దుస్తులు ధరించి, మరియు 8 లేదా అంతకంటే ఎక్కువ SPF (సూర్య రక్షణ కారకం) తో సన్ స్క్రీన్ వాడాలి. టానింగ్ పడకలు చర్మం విటమిన్ డి ను తయారు చేయడానికి కూడా కారణమవుతాయి, అయితే చర్మక్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి.
మనకు విటమిన్ డి అవసరమేమిటి?
- కాల్షియం మరియు భాస్వరం యొక్క శోషణం మరియు జీవక్రియ, వివిధ విధులు, ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఎముకల నిర్వహణ కొరకు ముఖ్యమైనది.
- రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తుంది.
- ఎయిడ్స్ రోగనిరోధక వ్యవస్థ - విటమిన్ డి సాధారణ జలుబువంటి రోగాలను నిరోధిస్తుందని, ‘యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో’, ‘డెన్వర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, మసాచుసెట్స్’, ‘జనరల్ హాస్పిటల్ & చిల్డ్రన్స్ హాస్పిటల్, బోస్టన్’ లోని రోగనిర్ధారణ శాస్త్రవేత్తలు అంటున్నారు.
- మల్టిపుల్ స్క్లెరోసిస్ ప్రమాదం - విటమిన్ డి బహుళ స్క్లేరోసిస్ అభివృద్ధి చెందకుండా తగ్గించగలదు. ‘ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ, USA లోని మల్టిపుల్ స్క్లెరోసిస్ అండ్ న్యూరోఇమ్యునాలజీ సెంటర్ డైరెక్టర్ మరియు న్యూరోలజి డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన డెన్నిస్ బోర్డెట్ ప్రకారం, మల్టిపుల్ స్క్లేరోసిస్, ఉష్ణమండలంలో, సూర్యరశ్మికి చేరువగా వున్నచోట చాలా తక్కువగా ఉంటుంది.
- సహేతుకంగా ఆలోచించి చేసే కార్య నిర్వహణ - 40 మరియు 79 సంవత్సరాల వయస్సు మధ్య 3000 యూరోపియన్ పురుషులను అధ్యయనం చేయగా, ‘విటమిన్ డి’ మెదడు పనితీరును మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని తేలింది.
- ఆరోగ్యకరమైన శరీర బరువు – జార్జియా మెడికల్ కళాశాల, జార్జియాలో నిర్వహించిన పరిశోధన ప్రకారం ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడంలో విటమిన్ డి బహుశా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తేలింది.
- ఆస్త్మాలక్షణాలు, మళ్ళీ తిరిగివచ్చుట(ఫ్రీక్వెన్సీ)- ఇది ఆస్తమా లక్షణాల తీవ్రతను మరియు ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. కోస్టా రికాలో 616 మంది పిల్లలు పర్యవేక్షించిన తర్వాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు కనుగొన్నదేమంటే, ఆస్త్మా కారణంగా ఆసుపత్రుల కు వెళ్లాల్సిన సంభావ్యతను కూడా తగ్గిస్తుంది.
- రుమటాయిడ్ ఆర్థరైటిస్(కీళ్లవాతం)-విటమిన్ డి మహిళల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అభివృద్ధి చెందకుండా కొంతవరకు ఆపగలదు.
- రేడియోధార్మిక నష్టంనుండి రక్షిస్తుంది –విటమిన్ డి శరీరరాన్ని రేడియోధార్మికత ప్రమాడమ్ నుండి పరిరక్షణ కలిగించగలదని, న్యూయార్క్ నగరంలో గల ఆరోగ్య, మానసిక పరిశుభ్రత విభాగంలోని రేడియోలాజికల్ నిపుణులు చెబుతారు.
- విటమిన్ డి & క్యాన్సర్ ప్రమాదం - వివిధ అధ్యయనాలలో విటమిన్ డి తగినస్థాయిలో ఉన్నవారికి, తక్కువస్థాయిలో విటమిన్ డి వున్నవారికన్నా, క్యాన్సర్ అభివృద్ధి గణనీయంగా తక్కువని చూపబడినది. క్యాన్సర్ చికిత్స కేంద్రాలు, అమెరికా నిర్వహించిన అధ్యయనంలో క్యాన్సర్ రోగుల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుందని తేలింది.
- క్షయవ్యాధినుండి కోలుకొనుట – సెప్టెంబర్ 2012 లో అధికమోతాదులో విటమిన్ డి తీసుకున్నప్రజలకు క్షయవ్యాధినుండి త్వరగా కోలుకునే అవకాశముందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS) యొక్క ప్రొసీడింగ్ లో పరిశోధకులు నివేదించిరి.
- హృద్రోగ ప్రమాదం - సెప్టెంబరు 2012 లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో విటమిన్ డి యొక్క లోపం, గుండెపోటు మరియు చిన్నవయసులో మరణం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని సూచించారు.
విటమిన్ డి లో వున్న 8 ముఖ్య లక్షణాలు
1. సూర్యకాంతి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలకు ప్రతిస్పందనగా మీ చర్మం ద్వారా విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.
2. మీ చర్మంలో విటమిన్ డి ను ఉత్పత్తి చేసే, సహజ సూర్యకిరణాలు గాజుతలుపునుండి వ్యాప్తి చెందవు. కాబట్టి మీరు కారులో లేదా ఇంటిలో కూర్చున్నప్పుడు విటమిన్ డి ను మీరు ఉత్పత్తి చేయలేరు.
3. మీ ఆహారంనుండి విటమిన్ డి తగినంత మోతాదులో పొందుట అసాధ్యం. సూర్యరశ్మికి శరీరాన్ని బహిర్గతం చేయటమే, మీ శరీరంలో స్వయంగా విటమిన్ డి ను ఉత్పత్తి చేసే ఏకైక నమ్మకమైన మార్గం.
4. విటమిన్ డి ఆహారంలో కనీస స్థాయిలో వుండడానికి ప్రతిరోజూ 10 పెద్ద గ్లాసులను విటమిన్ డి బలపర్చిన పాలు త్రాగాలి.
5. మీరు భూమధ్యరేఖకు బాహ్యంగా వుంటే, విటమిన్ డి సూర్యుడి ద్వారా శరీరంలో ఉత్పన్నం చేయటానికి ఎక్కువ సమయం అవసరం.
6. మీ చిన్నప్రేగులలో కాల్షియం శోషణకు కావలసిన స్థాయిలో విటమిన్ డి వుండుట చాలా ముఖ్యం. తగినంత విటమిన్ డి లేకుండా, మీ శరీరం కాల్షియంను గ్రహించలేదు, కనుక కాల్షియం సప్లిమెంట్లను తీసుకొనుట నిరుపయోగం.
7. దీర్ఘకాలిక విటమిన్ డి లోపం అత్యంత త్వరగా సవరించబడదు. శరీరంలో ఎముకలను బలపరచి, నాడీవ్యవస్థను పునర్నిర్మించడానికి, కొన్నినెలలపాటు, విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ, సూర్యకాంతిలో శరీరాన్ని బహిర్గతం చేయాలి.
8. నాసిరకం సన్ స్క్రీన్లు (SPF = 8) కూడా, విటమిన్ డి ను వుత్పత్తి చేసే మీశరీరసామర్థ్యాన్ని 95% వరకు అడ్డుకుంటాయి. శరీరంలో క్లిష్టమైన విటమిన్ లోపం కలగజేస్తూ, సన్ స్క్రీన్ ఉత్పత్తులు నిజానికి వ్యాధికి కారణమవుతాయి. సూర్యరశ్మి నుండి మీ శరీరంలో చాలా విటమిన్ డి ని ఉత్పత్తి చేయుట సాధ్యంకాదు: మీ శరీరం స్వీయ-నియంత్రించి, దానికి అవసరమైనంత మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.
మీ మూత్రపిండాలు మరియు కాలేయం ద్వారా మీ శరీరంలో, విటమిన్ డి వుపయోగానికి ముందు వుత్పన్నమవుతుంది. కాబట్టి కిడ్నీ లేదా కాలేయ వ్యాధి లేదా పాడైన కాలేయం విటమిన్ డి వుత్పత్తి చేయడానికి మీ శరీర సామర్థ్యాన్ని బాగా క్రుంగదీస్తుంది.
విటమిన్ డి లోపంవల్ల కలుగు రోగాలు
• విటమిన్ డి లోపంవల్ల, కాల్షియం శోషణ జరగకపోవుటవల్ల, బోలు ఎముకలవ్యాధి (ఆస్టియోపోరాసిస్) సాధారణంగా సంభవిస్తుంది.
• శరీరంలో తగినంత విటమిన్ డి వున్నచో, ప్రోస్ట్రేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, నిరాశ, పెద్దప్రేగు కాన్సర్ మరియు మనోవైకల్యం లను రాకుండా నిరోధిస్తుంది.
• విటమిన్ డి లోపంవల్ల "రికెట్స్" అను ఎముకలను పూర్తిగా శిధిలంచేసే వ్యాధి కలుగుతుంది.
• విటమిన్ డి లోపం 2వ రకం మధుమేహంను మరింత పెంచుతుంది. క్లోమంలో (ప్యాంక్రీస్) ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించవచ్చు.
• ఊబశరీరం విటమిన్ డి వినియోగం బలహీనపరుచుతుంది. ఊబకాయం వున్నవారికి 2 రెట్లు ఎక్కువ విటమిన్ డి అవసరం.
• సోరియాసిస్ చికిత్సకు ప్రపంచవ్యాప్తంగా విటమిన్ డి ని ఉపయోగిస్తారు.
• మనోవైకల్యానికి విటమిన్ డి లోపం ముఖ్యకారణంగా నివేదించబడింది.
• తగిన సూర్యరశ్మి లేకపోవడంవల్ల ప్రారంభించబడిన మెలటోనిన్ అసమతౌల్యం కారణంగా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ సంభవిస్తుంది.
• దీర్ఘకాలిక విటమిన్ డి లోపం తరచుగా ఫిబ్రోమైయాల్జియాగా తప్పుగా గుర్తించబడుతుంది, ఎందుకంటే కండరాల బలహీనత, నొప్పులు మరియు నొప్పులవంటి లక్షణాలు చాలా పోలి ఉంటాయి.
• సూర్యరశ్మిని వారానికి 2-3 సార్లు పొందినచో, మధుమేహం మరియు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం 50% - 80% తక్కువ.
• విటమిన్ డి సప్లిమెంట్ (రోజువారీ 2000 యూనిట్లు) తీసుకునే శిశువులకు తరువాతి 20 సంవత్సరాలలో టైప్1 మధుమేహం వచ్చే ప్రమాదం 80% తక్కువగా వుంటుంది.
ఆహారంలో విటమిన్ డి
క్రిందనున్న పట్టికలో ఏ ఆహారములో ఎంత విటమిన్ డి వుంటుందో తెలియగలరు.
తగినంత విటమిన్ డి లేకపోవుటవల్ల ప్రమాదం కలిగే సామూహిక బృందం
- తల్లిపాలు త్రాగే శిశువులు:
సామాన్యంగా మనిషి పాలలో అవసరానికి తగ్గ మోతాదులో విటమిన్ డి దొరకదు. మనిషి పాలలో విటమిన్ డి మోతాదు, తల్లి శరీరంలోని విటమిన్ డి మోతాదుమీద ఆధారపడి ఉంటుంది. కనుక విటమిన్ డి సప్లిమెంట్స్, అధిక మోతాదులో తీసుకుంటున్న తల్లుల పాలలో ఈ పోషకపదార్ధం అధిక మోతాదులో వుంటుంది.
- వయసు మళ్లిన వృద్ధులు:
వృద్ధులలో విటమిన్ డి మోతాదు బాగా తగ్గుటచే, వారికి ప్రమాదం ఎక్కువ. ఏలనన వయసుతోపాటు చర్మానికి విటమిన్ డి తయారు చేసే సామర్ధ్యం తగ్గుతుంది. వారు ఎక్కువగా యింటిలోనే వుండిపోతారు. వారు తగిన మోతాదులో విటమిన్ తీసుకోకపోవచ్చు.
· చాలా తక్కువ సూర్యరశ్మి పొందే ప్రజలు:
ఎక్కువగా యింట్లోనే వుంటూ, మత కట్టుబాట్లవల్ల పొడుగు వస్త్రాలు, తలకి ముసుగులు ధరించే స్త్రీలు, అదేవిధంగా వృత్తిరీత్యా యెండకు బహిర్గతం అవలేనివారు, సూర్యరశ్మివలన తగినంత విటమిన్ డి పొందజాలరు.
· నల్లని లేక బాగా రంగు తక్కువగా వుండే చర్మం గలవారు: ఎపిడెర్మల్ పొరలో వుండే వర్ణద్రవ్యం మెలనిన్ అధిక్యతవల్ల, నల్లని చర్మం ఏర్పడి, సూర్యకాంతి నుండి విటమిన్ డి ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని చర్మంలో తగ్గిస్తుంది. వివిధ నివేదికల ప్రకారం, తెల్లవారికన్నా నల్లవారిలో తక్కువ సేరం (serum) 25 (OH) D గుర్తించబడ్డాయి. నల్లచర్మం గలవారు తెల్లవారికన్న సూర్యరశ్మికి 20 - 30 రెట్లు ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అయితేనే, అదే మోతాదులో విటమిన్ డి చేయగలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు.
· ఇన్ఫ్లమాటరీ ప్రేగువ్యాధి మరియు ఇతర పరిస్థితులు కలిగిన ప్రజలు కొవ్వు మాలాబ్జర్పషన్ (People with inflammatory bowel disease and other conditions causing fat malabsorption):
విటమిన్ డి కొవ్వు కరిగే విటమిన్, దాని శోషణ ఆహారపు కొవ్వును పీల్చుకునే సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఆహార కొవ్వును పీల్చుకునే సామర్థ్యాన్ని తక్కువగాగల వ్యక్తులకు విటమిన్ డి భర్తీ అవసరమవుతుంది.
· ఊబశరీరం లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్స పొందిన వ్యక్తులు
ఆరోగ్యకరమైన బరువుగలవారికన్న, బాడీ మాస్ ఇండెక్స్ ≥30 వున్నవాళ్లకి, తక్కువ-సెరమ్ 25 (OH) D వున్నచో, ఊబకాయులు సాధారణ బరువుకు సరిపోయేవారి 25 (OH) D స్థాయిలను, సాధించడానికి విటమిన్ డి బాగా యెక్కువ మోతాదులో తీసుకోవాలి.
విటమిన్ డి కి పరీక్ష
25(OH) D అనబడు రక్తపరీక్ష మాత్రమే మనశరీరంలో విటమిన్ డి సరైన మోతాదులో వుందో, లేదో నిర్ధారించగలదు.
Sources:
http://ods.od.nih.gov/factsheets/VitaminD-QuickFacts/
http://www.medicalnewstoday.com/articles/161618.php
http://www.vitamindcouncil.org/about-vitamin-d/what-is-vitamin-d/
http://www.naturalnews.com/003069_vitamin_D_deficiency.html
http://ods.od.nih.gov/factsheets/VitaminD-HealthProfessional/
http://www.vitamindcouncil.org/about-vitamin-d/testing-for-vitamin-d/
రోజుకో వుల్లిపాయ వైద్యుని దూరంగా వుంచుతుంది (1వ భాగం/3)
ఉల్లిపాయ ఆరోగ్యమునకు చాలా లాభకరమగుటచే, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వంటలో ఉపయోగిస్తారు. దాని ఆరోగ్య ప్రయోజనాలన్ని ఒక వార్తాలేఖలో చెప్పాలంటే అసాధ్యం, అందుకే ఈఅంశాన్ని 3 భాగాలుగా విభజించితిమి. తదుపరి వార్తాలేఖలలో 2, 3 భాగాలు వస్తాయి.
రోజుకు ఒక ఉల్లిపాయ తిని, వైద్యుడిని దూరంగా ఉంచవచ్చు. వెల్లుల్లి వంటి ఉల్లిపాయ, అల్లియం కుటుంబానికి చెందినది. రెండు రకాలు కూడా సల్ఫర్ కలిగిన సమ్మేళనాల్లో సంపన్నమైనవి. వీనివల్లనే ఘాటువాసనలు మరియు వారి ఆరోగ్య-ప్రోత్సాహక ప్రభావా చాలా బాధ్యలు వుల్లి, వెల్లుల్లి కి కలుగుతున్నవి. సత్య సాయిబాబా మనల్ని సాత్వికాహారం తీసుకోమని ప్రోత్సహిస్తున్నప్పటికీ, సాధారణంగా రాజసికఆహారంగా భావించిన ఉల్లిపాయలో అనేక ప్రయోజనాలు వున్నవని చెప్పేరు. తన ప్రసంగాలలో, ఉల్లిపాయను ప్రముఖ తెలుగు సామెత "ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు!'' అని ప్రశంసించేవారు. రక్తనాళాలలోని కొలెస్ట్రాల్ ను తగ్గించటానికి, మన జీర్ణశక్తిని మెరుగుపర్చడానికి, రోజుకి మనం ఒక తెల్ల వుల్లిపాయను తీసుకోవటం చాలామంచిదని సిఫార్స్ చేసేవారు.
ఉల్లిపాయ (Allium Cepa) ఆరోగ్యప్రదాన రసాయనాలతో, ముఖ్యంగా, ఆరోగ్యప్రధానములైన, ఫ్రూక్టాంస్ (fructans), ఫ్లావోనోయిడ్స్ (flavonoids) మరియు ఓర్గనో (organo)- అనే ప్రయోజనకారులైన 3 సల్ఫర్ సమ్మేళనాలతో నిండివున్నది. ఫ్రూక్టాంస్ ప్రయోజనమైన బాక్టీరియాకు మద్దతు యిస్తూ, జీర్ణశక్తిని కాపాడు కార్బోహైడ్రేట్ అణువులు. ఉల్లిపాయలలో అధికంగా ఫ్లావోనోయిడ్స్ (flavonoids), ప్రత్యేకంగా క్వెర్సేటిన్ అని పిలవబడు శక్తివంతమైన ఎంటియొక్సిడెంట్ (antioxidant) ఉంటుంది. ఉల్లిపాయ కోసినప్పుడు, సెల్ గోడలు దెబ్బతిన్నప్పుడు, ఉల్లిపాయలోని సల్ఫర్ సమ్మేళనాలు తయారవుతాయి. ఈ సమ్మేళనాల కలయిక కాన్సర్, హృద్రోగం, శ్వాసకోశ అనారోగ్యం, మధుమేహం, సంక్రమణవ్యాధులు వంటి అనేక అనారోగ్యాల బారినుండి శక్తివంతమైన రక్షణను అందిస్తాయి.
ఉల్లిపాయలు, గుండెఆరోగ్యం
గుండెపోటు
‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’ లో ప్రచురించిన ఒక వ్యాసంలో, ఇటాలియన్ పరిశోధకులు, ఉల్లిపాయలు అధికంగా ఉన్న ఆహారం అనగా వారానికి ఒకటి కాని, అంతకంటే ఎక్కువగాని ఉల్లిపాయలను తినేవారికి, అరుదుగా వుల్లి తినేవారికన్నా, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 22 శాతం తగ్గుతాయని చెప్పేరు.
ఉల్లిపాయ"మంచి" హై డెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, "చెడ్డ" లోడెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
ఉల్లిపాయలలో ఘాటైన రుచిగల ఉల్లిపాయలు మరింత మంచివి. ఉల్లిపాయ తినుటవల్ల "మంచి" HDL కొలెస్టరాల్ స్థాయి పెరుగుతుందని రీసెర్చ్ చూపించింది. ప్రతిరోజు సగం ఘాటైన పచ్చని లేదా తెల్లని ఉల్లిపాయ తినుట లేదా దానికి సమానమైన రసం త్రాగినను, నాలుగింట ముగ్గురు రోగులలో 30% "మంచి" HDL కొలెస్ట్రాల్ పెంచడానికి సరిపోతుంది. అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్లో కార్డియాలజిస్ట్ మరియు వైద్యశాస్త్రంలో ప్రొఫెసర్ అయిన డాక్టర్ విక్టర్ గుర్విచ్, కరోనరీ హార్ట్ డిసీజ్ తో వున్నరోగులకు ప్రతిరోజు ఉల్లిపాయలు తినమని సలహా యిస్తారు. ఉల్లిపాయలు యెక్కువగా వుడికించితే, దాని ప్రయోజనం తగ్గుతుందని కూడా ఆయన చెప్పారు. ఉల్లిపాయల్లో కనిపించే 150 కన్నా ఎక్కువ రసాయనాలలో, "మంచి" HDL ను పెంచేవి యేవో చెప్పలేకపోయినా, పచ్చిఉల్లిపాయలు చాలా బాగా పని చేస్తాయని పరిశోధకులు ఖచ్చితంగా చెప్పేరు. వండిన ఉల్లిపాయలో HDL పెంచే ప్రభావం బాగా తగ్గిపోతుంది, నాశనం చేస్తుంది. బలమైన, భరించలేని ఘాటైన ఉల్లిపాయలు మీఆరోగ్యాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. మామూలు ఉల్లిపాయలు మీఆరోగ్యాన్ని వివిధ విధాలా ప్రభావితం చేసినను, ఘాటైన తెలుపు, పసుపు రకాలవల్ల అత్యంత మేలు కలుగుతుంది. పరిశోధనలో ఉల్లిపాయలు తినడంవల్ల "చెడ్డ" LDL రక్త కొలెస్ట్రాల్ ను తగ్గించగలదని తేలింది. ఒక అధ్యయనంలో, న్యూఢిల్లీలో 45మంది ఆరోగ్యవంతులకు 15 రోజుల పాటు, రోజుకి 3000-కేలరీలు-బాగా కొవ్వుగల ఆహారం ఇచ్చారు. వారి రక్త కొలెస్ట్రాల్ సగటున 219 నుండి 263 వరకు పెరిగింది. అయితే, రోజూ ఒక టేబుల్ స్పూన్ లేదా 10 గ్రాముల ఉల్లిపాయలను వారి కొవ్వు భోజనంతో పాటు తినుటవల్ల, వారి రక్త కొలెస్ట్రాల్ సగటున 237 కు తగ్గినది.
రక్తంలో గడ్డలేర్పడకుండా ఉల్లిపాయల తోడ్పాటు
ఆస్పిరిన్ వలెనే ఉల్లిపాయ కూడా (anti-coagulant) యాంటీ-కగల్యుంట్ గా పనిచేస్తుంది, ఇది రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తప్రవాహాన్ని అడ్డుకునే ప్రమాదకరమైన రక్తం గడ్డలను నిరోధించడానికి సహాయపడుతుంది. ఈ నిరోధక గడ్డలు శరీరంలోని గుండె లేదా మెదడువంటి వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసి, గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి వాటికి కారణమవుతాయి. కొన్ని ఉల్లిపాయ రసాయనాలు గడ్డలేర్పడకుండా వుంచితే, మరికొన్ని ఏర్పడుతుండగానే గడ్డలను కరిగిస్తాయి. ఒక దశాబ్దం పరిశోధన తరువాత, బ్రిటీష్ మరియు భారత శాస్త్రవేత్తలు, ఉల్లిపాయలు మీగుండెకు ఉత్తమమైనవని నిర్ధారించేరు. ఒక అధ్యయనంలో, వారు మొదట పురుషులకు వెన్న, మీగడలతో చాలా ఎక్కువ కొవ్వుగల భోజనం పెట్టిన తర్వాత వారిలో రక్తగడ్డలు కరిగించే కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి. అప్పుడు వారు వారికి అదేవిధమైన కొవ్వు భోజనం యిస్తూ, 2 ఔన్సుల (60 గ్రాములు) పచ్చి, ఉడికించిన లేదా వేయించిన ఉల్లిపాయలు కూడా భోజనంలో జోడించిరి. కొవ్వుభోజనంతిన్న 2 1/2 గంటల తర్వాత రక్తపరీక్ష చేయగా, రక్తంలో గడ్డకట్టే సామర్ధ్యాన్ని, ఉల్లిపాయలు పూర్తిగా నిర్మూలించి నట్లు వెల్లడైంది. వాస్తవానికి, 1/2 కప్పు కన్నా తక్కువ ఉల్లిపాయలు, కొవ్వుకుగల రక్తాన్ని గడ్డకట్టించే శక్తిని నిర్మూలం చేస్తాయి. గుండె మీద ఉల్లిపాయలవల్ల కలిగే ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపించే ఈ అధ్యయనాలు, ఫ్రెంచ్ పారడాక్స్ లో బాగా వివరించబడ్డాయి - ఫ్రెంచ్ ప్రజలు సాధారణంగా అధిక (సేట్యురేటెడ్) కొవ్వుగల ఆహారం ఎక్కువగా తిన్నప్పటికి, వారిలో గుండెవ్యాధులు తక్కువగా ఉంటాయి దాదాపు అన్ని ఫ్రెంచ్ వంటకాలలో ఉల్లిపాయను వాడటమే దీనికి కారణం. వాస్తవానికి పెద్ద సర్వేలో ఉల్లిపాయ, వెల్లుల్లి యిష్టమైనవారికి, అల్లియం ఫ్యామిలీలోని ఈ ఉల్లి, వెల్లుల్లి తిననివారి కంటే మెరుగైన రక్తం ప్రొఫైల్స్ (కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ మరియు HDL) ఉన్నట్లు తేలింది. వారంలో కప్పు ఉల్లిపాయలు తిన్నవారికి కూడా తక్కువ రక్త కొలెస్ట్రాల్ మరియు మంచి హృదయ ఆరోగ్యం వున్నట్లు తేలింది.
ఉల్లిపాయలు, అధిక రక్తపోటు
అధికరక్తపోటు గల ఒక బృందంవారికి రోజుకు 730 ఎమ్.జి. చొప్పున క్వెర్సెటిన్ 28రోజులు యివ్వగా, వారి రక్తపోటు 2 - 7 పాయింట్లకు సిస్టోలిక్ లో, 2 - 5 పాయింట్లకు డయాస్టొలిక్ పడిపోయింది. ప్లేస్బో యిచ్చిన బృందంలో ఏమాత్రం మార్పులేదు.
మరొక అధ్యయనంలో, ఉల్లిపాయ వేసిన నూనె 2-3 టేబుల్ స్పూన్లు తీసుకున్న, తగుమాత్రంగా రక్తపోటుగల 67% మందిలో రక్తపోటును తగ్గించినవి. వారి సిస్టోలిక్ స్థాయి 25 పాయింట్లు, వారి డయాస్టొలిక్ రీడింగ్స్ 15 పాయింట్లు పడిపోయినవి.
ఉల్లిపాయల యొక్క ఆరోగ్య ప్రభావాలపై చేసిన 7 ఏళ్ల పరిశోధనల తర్వాత, పరిశోధకులు రోజుకు 100 గ్రాముల ఉల్లిపాయలు (2/3 కప్పు) తీసుకున్నవారికి, గుండె జబ్బు, అదేవిధంగా అధిక రక్తపోటు దూరమౌతాయని నిర్ధారించారు.
బోలు ఎముకలవ్యాధికి ఉల్లిపాయల ప్రయోజనాలు
నెలసరి ఆగిపోయిన తరువాత స్త్రీలలో బోలు ఎముకల వ్యాధి(ఎముక సన్నబడటానికి) చికిత్స కొరకు ఇచ్చిన ఔషధ అలెండ్రోనేట్ (ఫోసామాక్స్) యొక్క ఔషధ ప్రభావాలపై ఉల్లిపాయ తీసుకోవడం వల్ల దుష్ప్రభావం వున్నట్లు ఒక అధ్యయనం కనుగొంది. ఈ అధ్యయనంలో, (Alendronate) అలెన్డ్రోనేట్ లేదా ఉల్లిపాయ పొడితో చికిత్స పొందిన ఎలుకలలో ఓవియరీటోమీ (ovariectomy) ప్రేరిత ఎముక నష్టం అధ్యయనం చేసింది. ఎముక నష్టాన్ని ఎదుర్కోవటానికి ఉల్లిపాయల సామర్ధ్యం అలెన్డ్రోనేట్ (ఫోసామాక్స్) కు దగ్గరగా వచ్చింది. ఉల్లిపాయలు ఎముకలు మరియు కీళ్ళ నొప్పి, వికారం, పూతలు, యాసిడ్ బ్యాకప్ మరియు దద్దుర్లు వంటి దుష్ప్రభావాలు లేకుండా, ఎముకలను బలోపేతం చేస్తాయని తెలుస్తోంది.
స్విట్జర్లాండ్ లోని బెర్న్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఒక రసాయన సమ్మేళనం కనుగొన్నారు – జిపిసిఎస్ (GPCS) అనబడు పెప్ టైడ్ (peptide) రసాయనం ఎముక విచ్ఛేదనం (ఎముక విచ్ఛిన్నం చేసే కణాలు) యొక్క చర్యను నిరోధిస్తుంది మరియు తద్వారా ఎముక నష్టాన్ని తగ్గిస్తుంది. ఎముక క్షీణత అనుకరించడానికి పారాథైరాయిడ్ హార్మోన్కు సంబంధించిన కొత్త ఎలుకల ఎముకలలోని ఎముక కణాలు, వైట్ ఉల్లిపాయ నుండి సేకరించిన GPCS సమ్మేళనం, ఎముక ఖనిజాల నష్టం, కాల్షియంతోపాటు గణనీయంగా నిరోధించబడ్డాయి.
ఇతర అధ్యయనాలలో, మనం తినే ఉల్లిపాయలు ఎముక ద్రవ్యరాశి, ఎముక మందం మరియు ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతున్నట్లు తెలిపిరి. ఇటువంటి ప్రోత్సాహకరమైన జంతు మరియు మానవ అధ్యయనాలలో- ఉల్లిపాయలు ఎముక సాంద్రత నష్టం అనుభవిస్తున్న, ఋతుక్రమం ఆగిన మహిళలకు చాలా ప్రయోజనకరమని అని తేలింది. 35 మిలియన్ల మహిళల పోషక విలువలను విశ్లేషించిన ఒక పరిశోధనా అధ్యయనం, ఋతుక్రమం ముందు, ఆగిన మహిళల్లో ఉల్లిపాయల వినియోగం ఎముక సాంద్రతలో బలమైన ప్రయోజనాలతో సంబంధం కలిగిస్తుంది, అయితే ఉల్లిపాయ అరుదుగా వాడినచో, (ఒక నెల లేదా అంతకన్నా తక్కువ) ఎముకల ఆరోగ్యానికి ప్రయోజనం చాలా తక్కువ. ఋతుక్రమం ఆగిన మహిళలు ప్రతిరోజూ వుల్లిపాయలు తీసుకోవడంవల్ల, తుంటి ఎముకలు విరిగే ప్రమాదం చాలా తక్కువ.
మీ శరీర శుభ్రతకు, వుల్లిపాయలు
ఉల్లిపాయలలో (సల్ఫర్) గంధకం కలిగిన సమ్మేళనాలు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నవి. ఇవి పాదరసం, సీసం, ఆర్సెనిక్ మరియు కాడ్మియం వంటి భారీ లోహాల నుండి మీ శరీరాన్ని శుభ్రపరచడానికి చాలా మంచివి.
మా తదుపరి వార్తాలేఖలో, కాన్సర్, మధుమేహం,చర్మ వ్యాధుల బారినుండి వుల్లిపాయ యేవిధంగా సంరక్షించగలదో తెలియజేస్తాము.
Sources:
http://www.saibaba.ws/teachings/foodforhealthy.htm
http://onions-usa.org/img/site_specific/uploads/phytochemical_brochure.pdf
http://americanfitness.squarespace.com/onions-0712/
http://www.foods-healing-power.com/health-benefits-of-onions.html
http://www.foods-healing-power.com/health-benefits-of-onions.html
http://www.foods-healing-power.com/onions-for-your-heart.html
www.MedicineHunter.com
http://jn.nutrition.org/content/137/11/2405.full
http://www.foods-healing-power.com/onions-blood-pressure.html
http://curezone.org/dis/1.asp?C0=60
http://www.herballegacy.com/Peret_Medicinal.html
http://wrightnewsletter.com/2005/06/13/onion-consumption-may-slow-down-bone-loss/
http://health.tipsdiscover.com/onion-strong-cancer/
http://www.foods-healing-power.com/health-benefits-of-onions.html
http://www.foods-healing-power.com/onions-for-your-heart.html
http://www.ncbi.nlm.nih.gov/pubmed/12126069?dopt=Abstract
అభ్యాసకులందరికీ ముఖ్య గమనిక
మాకు పంపబడుతున్న కొన్నికేసులు అద్భుతమైనవి కాని కొన్నిటిలో, కొన్ని ముఖ్యమైన వివరాలు లేని కారణంగా మీతో అన్ని కేసుల వివరాలను పంచుకోలేకపోవుచున్నాము. ఏలనంటే ఆ వివరాలు అభ్యాసకుల ద్వారానే మాకు అందించబడతాయి. కనుక మీరు మీ కేసులను పంపినప్పుడు దయచేసి కింద కోరిన వివరాలని తప్పక చేర్చండి:
రోగి వయసు, పురుషుడు/స్త్రీ, చికిత్స మొదలైన తేదీ, అన్ని రోగలక్షణాల యొక్క వివరణాత్మక జాబితా, దీర్ఘకాల లక్షణాల యొక్క వివరణాత్మక జాబితా, ప్రతి రోగలక్షణం యొక్క వ్యవధి, ప్రతి దీర్ఘకాలిక లక్షణానికి మీరు వూహించిన కారణం, గతంలో జరిగిన చికిత్స వివరాలు లేదా ఇప్పటి చికిత్స వివరాలు, యివ్వబడిన కాంబో పరిహారాలు, వాటి మోతాదులు, తేదీవారీగా రోగి పరిస్థితిలో మెరుగుదల శాతం, మీరు పంపే రోజునాటి రోగిపరిస్థితి, ఇతర సంబంధిత సమాచారం మొదలైన వివరాలన్నీ, మీ కేసులను భవిష్యత్తు వార్తాలేఖలలో ప్రచురించడానికి మాకు సహాయపడతాయి.