చికిత్సా నిపుణుల వివరాలు
ప్రాక్టీషనర్ 11586...ఇండియా , బ్యాంకింగ్ రంగంలో నైపుణ్యము కలిగిన ఈ ప్రాక్టీషనర్ 24 సంవత్సరాలు భారతదేశంలో పనిచేసి అనంతరం ఇండోనేషియాలో ఫైనాన్షియల్ సెక్టార్ లో 21 సంవత్సరాల పాటు అనగా 2015 మధ్యకాలం వరకు పని చేశారు. వీరు స్వామి జీవిత చరిత్ర అయిన సత్యం-శివం-సుందరం చదివి దాని నుండి ప్రేరణ పొంది స్వామి ఫోల్డ్ లోనికి వచ్చారు ఆ తర్వాత సత్యసాయి సేవా సంస్థ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. వీరి కెరీర్ వీరిని భారతదేశం మరియు ఇతర దేశాల్లో వివిధ ప్రాంతాలు పర్యటించేలా చేసింది. ఇలా ఎక్కడ పనిచేయవలసి వచ్చినా స్థానిక సాయి కేంద్రాన్ని సంప్రదించి అక్కడ సేవ చేసే అవకాశాన్ని వారు పొందేవారు. ఇండోనేషియా లో ఉన్నప్పుడు 2010లో వేద పఠనం యొక్క స్వస్థతా సామర్ధ్యం గురించి స్వామి చెప్పిన మాటలు విన్నారు. వెంటనే వారు వేదము నేర్చుకోవడానికి సాధన చేయడం ప్రారంభించారు. ఈ విధంగా రెండు సంవత్సరాలు సాధనచేసి దాని యొక్క ప్రభావం ఏమిటో కనుగొన్నారు. కొన్నిసంవత్సరాలు గా ఎటువంటి ఎదుగుదలలేని అతని పెరట్లోని రుద్రాక్ష చెట్టులు పుష్పించడం ప్రారంభించాయి. కొంతకాలం తర్వాత వారు 20వేల రుద్రాక్షలు పొంది వీటిని భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు మరియు తన చుట్టూ ఉన్న ప్రజలకు పంపిణీ చేశారు. 2013లో డాక్టర్ జిత్ అగర్వాల్ మరియు వారి శ్రీమతి హేమ అగర్వాల్ గారికి సంబంధించిన సోల్ జర్న్స్ వీడియోల ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నారు. ఈ వైద్య విధానం పట్ల ఆకర్షితులై దీనిని నేర్చుకోవాలన్న ఆలోచన వీరిలో ప్రారంభమైంది. అలాగే స్వామివారు అన్న మాటలు “వైబ్రియానిక్స్ భవిష్యత్తు వైద్య విధానం “ అన్న మాటలతో కూడా వీరు ప్రేరణ పొందారు. వీరు ఉద్యోగం నుండి పదవి విరమణ చేసి 2015 లో భారతదేశానికి వచ్చారు. తనకు పరిస్థితులు అనుకూలించిన వెంటనే AVP కోర్సుకోసం 2016 లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కోర్సు, వర్క్ షాప్, అవసరమైన పరీక్షలు పూర్తి చేసుకొని 2017మార్చ్ లో AVPగా పూర్తి అర్హత సాధించారు. 2017 అక్టోబర్ లో మెంటరింగ్ విధానము ద్వారా అవసరమైన శిక్షణ పూర్తి చేసుకొని VP అయ్యారు. అదే స్పూర్తితో అంకిత భావంతో కృషి చేసి 2018 నవంబర్ లో SVP అయ్యారు. వీరు తనకు తాను మరియు తను ముందుగా గుర్తించిన రోగులకు చికిత్స చేయడం ద్వారా తన అభ్యాసాన్ని ప్రారంభించారు. అదే సమయంలో కుటుంబ వ్యవహారాల వలన వీరు తన కుమారునితో కలసి 4 నెలలు అమెరికాలో గడపవలసి వచ్చింది.. అక్కడ ఉన్నప్పుడు హిందూ మరియు సిక్కు దేవాలయాలలో వైబ్రియానిక్స్ గురించి మాట్లాడే అవకాశం లభించింది. దీని ఫలితంగా 2018 ప్రారంభంలో 72 మంది పేషంట్ల కు వైద్యం చేసే అవకాశం లభించింది. అనంతరం రెండు నెలలు జర్మనీలో తన రెండవ కుమారుని వద్ద గడిపే అవకాశం వచ్చింది. ఇక్కడ కూడా స్థానిక దేవాలయాలలో వైబ్రియానిక్స్ గురించి చెప్పే ఆకాశం వచ్చింది. వీరి కుమారునికి జర్మన్ భాష తెలుసును కనుక పేషంట్లను చూడడంలో సహాయపడేవాడు తత్ఫలితంగా ఇక్కడ కూడా 26 మంది పేషంట్లను చూసే అవకాశం లబించింది. ఈ రెండు సార్లు కూడా వీరు భారత దేశం వచ్చేముందు ఆ ప్రాంతంలోని పేషంట్లను స్థానిక ప్రాక్టీషనర్ల కు అప్పగించి రావడం జరిగింది.
ఇప్పటివరకూ 480 కి పైగా రోగులకు చికిత్స చేసారు. వీరిలో అధికశాతం అర్థ్రైటీస్, వెన్నునొప్పి, దీర్ఘకాలిక దగ్గు, మైగ్రేన్, నిద్ర రుగ్మతలు, అనారోగ్య సిరలు, చర్మ అలెర్జీలు, విటిలిగో వంటి వాటితో బాధపడుతూ ఉన్నవారే. చాలా మంది టీనేజర్ల మరియు పెద్దల యొక్క రోగాలకు వారి మానసిక సమస్యలే మూలకారణంగా ఉన్నట్లు వీరు తమ అనుభవం ద్వారా తెలుసుకున్నారు. కనుక సాధారణంగా ఇచ్చే రెమిడీ లతో పాటు అదనంగా CC15.1 Mental & Emotional tonic ఇవ్వడం వలన అద్భుత ఫలితాలు కనబడ్డాయి. అలాగే 45 సంవత్సరాలు పై బడిన మహిళలకు అదనంగా CC8.6 Menopause కలిపి ఇవ్వటం వలన వెన్ను నొప్పికి అధ్బుతమైన ఫలితం కనిపించింది. 21 సంవత్సరాల గర్భిణీ కి సంబంధించిన హృదయానికి హత్తుకొనే గాధను ఈ ప్రాక్టీషనర్ మనతో పంచుకుంటున్నారు. ఈమె గృహసంబంధమైన సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి లోఉన్నారు. ఈమె మొదటి సంతానము మానసిక వైకల్యముతో పుట్టినందున ప్రాక్టీషనర్ ను కలిసే సమయానికి అబార్షన్ చేయించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఈమెకు ఇచ్చిన CC8.2 Pregnancy tonic అద్భుతాలు సృష్టించి ఈమె మానసిక వైఖరి ప్రశాంతముగా మారడమే కాక ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చింది. తనకు ఎవరో చేతబడి చేశారని భావిస్తున్న 35 సంవత్సరాల మరొక గర్భిణీ స్త్రీకి CC15.2 Psychiatric disorder తో పాటు ప్రెగ్నెన్సీ టానిక్ ఇవ్వడం వలన ఆమె తన భయాలన్నింటి నుండి దూరమవడమే కాక మూడునెలల అనంతరము ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మ నిచ్చింది.
వైద్య సహాయం అందుబాటులో లేని దూర ప్రాంతాలలో రోగులకు సేవలు అందించే బృందంలో కూడా ఈ ప్రాక్టీషనర్ సభ్యులుగా ఉన్నారు. వారు ఫోన్ ద్వారా రోగులతో సంభాషించి తరువాత పోస్ట్ ద్వారా నివారణలను పంపుతారు. గత 6 నెలలలో ఈ పద్దతిలో 50 మందికి పైగా సేవలు అందించారు. రెమెడీలను తయారు చేసేటప్పుడు సాయి గాయత్రిని జపించడం వీటిని మరింత శక్తివంతం చేస్తుందని అనుభవం ద్వారా వీరు తెలుసుకున్నారు. చాలా మంది రోగులు వారి ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉన్నారని, వైబ్రో రెమెడీల వల్ల ప్రయోజనం పొంది కూడా మధ్యలోనే వాటిని మానేస్తున్నారని వీరు కనుగొన్నారు. అలాంటి సందర్భాల్లో ఆయన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండేవారు. వీరు వారానికి ఒకసారి మాతృ భూమికి శాంతి మరియు ప్రేమ వైబ్రేషన్ లను ప్రసారం చేయడం కూడా ప్రారంభించారు.
తమిళనాడులోని అభ్యాసకుల డేటాబేసును నవీకరించడం మరియు వారి నెలవారీ నివేదికలను అప్‌లోడ్ చేయడం వంటి అడ్మినిస్ట్రేటివ్ విధులలో కూడా వీరు పాల్గొంటున్నారు. చెన్నైలోని సాయి కేంద్రాల్లో అవగాహన సదస్సులు కూడా వీరు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎందరో భక్తులకు ప్రేరణ ఇవ్వడమే కాక వారిని వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్స్ గా మారడానికి ప్రేరణ కలిగిస్తున్నది. అలాగే వైబ్రియోనిక్స్ నేర్చుకోవడానికి స్నేహితులు మరియు పరిచయస్తులను ప్రేరేపించడానికి వీరు ప్రతీ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ఉపయోగించుకుంటూ ఉంటారు. వైబ్రియోనిక్స్ సాధన ప్రారంభించిన తర్వాత వీరి జీవితం కొత్త అర్థాన్ని, ప్రయోజనాన్ని సంతరించు కున్నది. తన ప్రేమను ప్రతీరోజూ సేవ రూపంలో వ్యక్తపరచటానికి మరియు స్వామి సూచించిన “మానవ సేవే మాధవ సేవ’మరియు “లవ్ ఆల్ సర్వ్ ఆల్” జీవితం లో పాటించటానికి వైబ్రియానిక్స్ సేవ దోహదం చేస్తుందని ఆయన ధృడ విశ్వాసం. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యాసకులందరికీ ప్రేమ, దయ, సానుభూతి, మరియు వైద్యం చేసే శక్తిని అవసరమైన వారందరికీ ప్రసాదించమని అందరినీ ఆశీర్వదించమని ఆయన ప్రతి ఉదయం స్వామికి ఒక నిర్దిష్ట రీతిలో ప్రార్థన చేస్తున్నారు.
పంచుకున్న కేసులు :