పార్శ్వపు నొప్పి 11586...India
34 ఏళ్ల మహిళ గత పది సంవత్సరాలుగా ఎడమ వైపు పార్శ్వపు నొప్పితో బాధపడుతున్నారు. నొప్పి వచ్చిన ప్రతీసారీ కనీసం రెండు గంటలు కొనసాగుతుంది. ఐటి ప్రొఫెషనల్ కావడంతో ఆమె రోజంతా కంప్యూటర్లతో పని చేయాల్సి ఉండేది. ఆమె ఈ తలనొప్పిగురించి చాలా బాధననుభవిస్తూ అవసరమైనప్పుడు అల్లోపతి పెయిన్ కిల్లర్లను తీసుకోసాగింది. దీర్ఘకాలిక దగ్గు నుండి ఆమె తల్లి త్వరగా కోలుకోవడం ఈమె వైబ్రియోనిక్స్ చికిత్సను ఎంచుకోవడానికి కారణ మయ్యింది. 2018 ఫిబ్రవరి 8 వ తేదీన ఆమెకు ఈ క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
మొదటి మోతాదు తీసుకున్నప్పటి నుండి వారంలో ఒక్కసారి కూడా తలనొప్పి రాలేదని ఆమె ఎంతో విస్మయంగా తెలిపారు. ఒక నెల వరకూ అదే మోతాదు కొనసాగించమని చికిత్సా నిపుణుడు ఆమెను కోరారు. కొన్ని రోజుల తరువాత రెమిడీని ప్రమాద వశాత్తూ ఆమె ఎక్కడో పోగొట్టుకుంది. ఐతే అప్పటికే అభ్యాసకుడు 2నెలలు జర్మనీ లో గడపడం కోసం బయలుదేరి వెళ్లిపోవడం జరిగింది. ఈ కాలంలో ఆమెకు ప్రతి వారం అడపాదడపా తలనొప్పి వచ్చింది. అయితే మునుపటి కంటే తీవ్రత కొంచం తక్కువగానే ఉంది. అభ్యాసకుడు తిరిగి వచ్చినతరువాత 2018 మే 20 వ తేదీన తిరిగి రెమిడీ ఇవ్వడం జరిగింది.
నివారణను తిరిగి ప్రారంభించిన రెండు నెలల తరువాత తలనొప్పి ఆమె తల స్నానం చేసిన తర్వాత మాత్రమే రాసాగింది. ఈ విధంగా ఒకసారి మాత్రం నొప్పి తీవ్రంగా వచ్చి గంట సమయం కొనసాగింది. ఆమె పెయిన్ కిల్లర్ ఏమీ తీసుకోలేదు. 5నెలల తరువాత, మోతాదు BD కి తగ్గించబడింది. ఐతే తల స్నానం తరువాత ఆమెకు తేలికపాటి తలనొప్పి వచ్చి కొద్దిసేపు కొనసాగుతూ ఉండేది. తరువాత అది కూడా తగ్గిపోయింది. ఈ విధంగా ఆమెకు తలనొప్పిభయం పూర్తిగా పోవడంతో కంప్యూటర్లతో హాయిగా పని చేయగలిగేది. అదే సమయంలో ఆమె తన తల్లిని కోల్పోవడం జరిగింది. సంప్రదాయం ప్రకారం ఎన్నోసార్లు తలస్నానం చేయవలసి వచ్చినా తలనొప్పి రాలేదు. 23 డిసెంబర్ 2018 న డోసేజ్ మరింత తగ్గించడానికి ముందు మరో నెల పాటు ODగా కొనసాగించాలని ఆమెకు సూచించబడింది. అనారోగ్యం రాకుండా ఉండటానికి ఒక సంవత్సరం పాటు ప్రత్యామ్నాయంగా ప్రక్షాళన(క్లెన్జింగ్) మరియు రోగనిరోధక శక్తి( ఇమ్యూనిటీ) రెమెడీలను తీసుకోవడానికి ఆమె అంగీకరించారు.