Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

చికిత్సా నిపుణుల వివరాలు 10228...India


చికిత్సా నిపుణుడు 10228...ఇండియా నేను వృత్తి రీత్యా మైనింగ్ ఇంజినీర్ ను. 1973 నుండి మా కుటుంబ సభ్యులంతా స్వామి భక్తులము.  నిరాశా, నిస్పృహలతో అలమటిస్తున్నవిపత్కర పరిస్థితులలో స్వామి మా కుటుంబాన్ని ఆదుకున్న సందర్భాలు ఎన్నో. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల నాగపూర్ సమితి కార్యకలాపాలు అన్నింటిలో పాల్గొంటూ ఉండేవాడిని. కానీ 1980 లో మైనింగ్ లో చేరిన తర్వాత 27 సంవత్సరాల పాటు సేవాకార్యక్రమాలలో నేను పాల్గొనడం చాలా తక్కువనే చెప్పాలి. నా ఉద్యోగ రీత్యా తరుచూ బదిలీలు అవుతున్నందున మరియు నేను పనిచేస్తున్న ప్రాంతంలో సమితి లేకపోవడంతో సేవాకార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం కుదరలేదు. 2007 లో తిరిగి ఉద్యోగమార్పు పైన నాగపూర్ వచ్చిన తర్వాత తిరిగి సేవాకార్యక్రమాలలో పాల్గొనసాగాను.

అప్పుడప్పుడు సమితి భజనల్లో ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ యొక్క అనుభూతి పొందేవాడిని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. కానీ ఇదంతా నా క్షేమం కోసం స్వామి చేసే లీల గా భావించేవాడిని.  

ఒకానొక సందర్భంలో నాగపూర్ లో ఉన్న నారాయణ విద్యాలయం అనే పాఠశాల 2008 మే నెలలో EHV సదస్సును ఏర్పాటు చేసింది. నేను ముంబాయి నుండి వచ్చే శిక్షకులకు సహాయం చేసేందుకు వాలంటీర్ గా ఉన్నాను. ఇదే సంవత్సరం అక్టోబర్ నెలలో ముంబాయి లోని ధర్మక్షేత్రం లో వైబ్రియోనిక్స్ వర్క్ షాప్ ఉంటుందని తెలిసి దానికి నేను దరఖాస్తు చేసుకోవడమే కాక నా శ్రీమతి ని కూడా ప్రోత్సహించి తీసుకు వెళ్ళాను. 

ఈ సదస్సులో విశ్వం లో ప్రతీ ఒక్క వస్తువు ఒక ప్రత్యేకమైన ప్రకంపనలు (వైబ్రేషణ్) ఉద్గారం చేస్తుందని అవి దేహంలో కూడా ఉంటాయని ఈ ప్రకంపనల అసమతుల్యం వల్లనే వ్యాధి కలుగుతుందని తెలిసింది. నేను భజనలో పొందిన అనుభవాన్ని దీనితో పోల్చి చూసుకొని ఉత్సాహంగా ఇది స్వామి అనుగ్రహమని భావించి వైబ్రో సేవను ప్రారంభించాను. నేను నా శ్రీమతి ఇద్దరం విజయవంతంగా శిక్షణ ముగించుకొని అద్భుత ఫలితాలతో 11000 పైచిలుకు పేషంట్లకు సేవలందించండం జరిగింది. 

వైబ్రో విజయాలు నాగపూర్ లోని ఎందరో సాయిసోదరులకు ప్రేరణ ఇచ్చి వైబ్రో శిక్షణ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇదే సమయములో 3 వైబ్రో సదస్సులు కూడా జరగడంతో పూనా మరియు ముంబాయి శిక్షకుల ద్వారా 50 మంది సాయి భక్తులు శిక్షణ పొందారు.

నాగపూర్లో 63 మంది అభ్యాసకులు ఉండగా వీరిలో 18 మంది నిత్యమూ సత్యసాయి మెడికేర్ వ్యాన్ కు తమ సేవలందిస్తున్నారు. వీరు పుట్టపర్తి లో జరిగిన మొదటి అంతర్జాతీయ వైబ్రో సదస్సుకు కూడా హాజరయ్యారు. మాలో ఇద్దరు SVP కోర్సును కూడా పూర్తిచేసి SRHVPను కూడా పొందారు. మిగతావారు 9 ఆలయాలలోను, ఒక గురుద్వారాలోను, ఓక కమ్యునిటీ సెంటర్ లోనూ పక్షానికి ఒకసారి తమ సేవలందిస్తున్నారు. నేను నెలవారీ రిపోర్టును ముంబాయి లోని మా కోఆర్డినేటర్ కు పంపిస్తాను. మేము నాగపూర్లో ప్రతీ నెలలో సుమారు  2,700  పేషంట్లకు సేవలందిస్తాము.

స్వామి నాకు సాయివైబ్రియోనిక్స్ వార్తా లేఖలను హిందీలోకి అనువదించే అవకాశం కూడా కల్పించారు. ఒక విషయం మీతో తప్పనిసరిగా పంచుకోవాలి. ఎప్పుడయినా నాతో పాటు పనిచేసే నా సహ అభ్యాసకులు ప్రశాంతినిలయం వెళ్ళినప్పుడు డాక్టర్ అగ్గర్వాల్ గారిని, శ్రీమతి హేమ అక్కయ్యను కలిసినప్పుడు ఎంతో ప్రేరణ ప్రోత్సహాలను పొందుతారు.

నా వైబ్రో సేవద్వారా నేను పొందిన రెండు ఆసక్తిదాయక మైన అనుభవాలను ఉదహరిస్తాను:

మొదటి అనుభవం:

ఈ సంఘటన మే 2009 లో జరిగింది. ఒక మహిళ తీవ్రమైన మోకాలి నొప్పులతో బాధ పడుతూ ఉంది. ఆమె ఒక స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ ఉంది. వారి కుటుంబ సభ్యులు దర్శన సమయంలో స్వామి హస్త చేలనంతో సృష్టించిన విభూతి పొందిన  ధన్యజీవులు. నిరాశ, నిస్పృహలతో ఉన్నపుడు, పిల్లలు అనారోగ్యముతో బాధ పడుతున్నప్పుడు నివారణ కోసం ఈ విభూతిని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆ విభూతి డబ్బా అడుగున ఉన్న కొద్దీమొత్తం తప్ప మరేమీ లేదు. కనుక ఈ పేషంటుకు  ఆ విభూతి ఇవ్వడానికి తటపటాయిస్తూనే ఒకవారం వేచి ఉన్నారు.

చివరి రోజున మా నాగపూర్ జిల్లా అధ్యక్షులు ఈశ్వరమ్మ సెలబ్రేషన్స్ కోసం కార్డు ఇవ్వడానికి  ఆ ఇంటికి వెళ్లి రెండు విభూతి పొట్లాలు కూడా కార్డు తో పాటు ఇచ్చారు. ఆ కుటుంబ మంతా ఈ సంఘటనకు ఆశ్చర్య పడి స్వామీనే ఈ రూపంలో పంపించారని భావించారు.

మా జిల్లా అధ్యక్షులు ఆ మహిళ ఆరోగ్యం గూర్చి ఆరా తీయగా ఆమె రెండు నెలల నుండి మంచానికే పరిమితమయి పోయిందని లోపల ఒక రూములో ఆమెను ఉంచామని వారు చెప్పారు. మా ప్రెసిడెంటు వారితో ఇటివలే 5 గురు సభ్యులు ధర్మ క్షేత్రం లో వైబ్రో శిక్షణ తీసుకొని సత్యసాయి మెడికేర్ వ్యాన్ లో దత్తత గ్రామాలకు వెళ్లి సేవ చేస్తూ అద్భుత ఫలితాలు పొందుతున్నారని కనుక ఈ కుటుంబము వారు కూడా వైబ్రో మందులు తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. ఆ పేషంటు భర్త నాకు ఫోన్ చేసి విషయం చెప్పి మందులు ఇవ్వాలంటే పేషంటు తప్పనిసరిగా అవసరమా అని అడిగారు. నేను అవసరం లేదని రోగి యొక్క వివరాలు తెలుసుకొని ఆమె తీవ్రమైన మోకాలి నొప్పులతో బాధపడుతున్నట్లు తెలుసుకొని క్రింది రెమిడి ఇచ్చాను.

(CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS) సాధారణ సూచనలతో.

నేను వెళ్ళిన సమయంలో ఆ మహిళ లోపల నిద్రపోతూ ఉంది. ఆమెకు నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక ఆమె భర్తకు రెమిడి బాటిల్ ఇచ్చి వాడే విధానం చెప్పాను. కానీ అతను అపనమ్మకంగా, అనుమానాస్పదంగా కనిపించడంతో ఈ మందులు 3 వారాల వరకు పనిచేస్తాయని రెండు రోజుల ముందుగానే తనకు ఫోన్ చేస్తే తిరిగి మందులు తీసుకొచ్చి ఇస్తానని నమ్మబలికాను.    

మూడు వారాల తరవాత ఆమె భర్త ఫోన్ చేసి ఇంకా 5-6 గోళీలు మాత్రమే మిగిలిఉన్నాయని ఇంటి ఎడ్రస్ చెపితే వచ్చి తీసుకుంటానని చెప్పారు. అవసరంలేదు నేనేవచ్చి ఇస్తానని ఎంత చెప్పినా అతను ఎడ్రస్ చెప్పాల్సిందేనని గట్టిగా పట్టుబట్టడంతో కొంచం బాధాకరంగానే ఆ వివరాలన్నీ చెప్పి నా మేనల్లుడిని క్రింది ఫ్లోర్ లో ఉంచి వారు రాగానే నేనుండే మొదటి ఫ్లోర్ కు తీసుకురమ్మని చెప్పాను.

10 నిమిషాల తర్వాత చప్పుడు విని తలుపు తెరిచే సరికి బహుశా నాజీవితంలో అంతటి షాక్ ఎప్పుడూ కలగలేదేమో, నా కళ్ళని నేనే నమ్మలేని పరిస్థితి. నా పేషంటు ఆమె భర్తతో కలసి వచ్చి ఎదురుగా నిలిచి ఉన్నారు. వాళ్ళకి క్షమార్పణ చెప్పి లోపలికి  ఆహ్వానించాను. ఎందుకంటే కాళ్ళునొప్పులతో ఇబ్బంది పడుతున్న ఆమెతో అన్ని మెట్లు ఎక్కించినందుకు నిజంగా నాకు చాలా బాధనిపించింది. ఐతే వారు లేదండి మూడు వారాల్లో జరిగిన ఈ ‘వైబ్రో అద్భుతాన్ని’ మీకు కళ్లారా చూపిద్దామనే ఎడ్రస్ కోసం పట్టుబట్టామని చెప్పారు.  స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆ మహిళ నెలల తరబడి సెలవుల్లో ఉండడం పద్దతి కాదని తన ఉద్యోగానికి రాజీనామా చేద్దామని కూడా నిర్ణయించుకున్నతరుణంలో ఆమె ఒoటరిగా కన్నీళ్ళతో స్వామిని వేడుకొన్న ప్రార్ధనలు ఫలించి ఈ వైబ్రోఅనే అమృతం రూపంలో తన అంగ వైకల్యము నుండి కాపాడారని చెప్పారు. జై సాయిరాం.

రెండవ అనుభవము:

ఆ రోజులలో (2007లో) మా నాగపూర్ సమితి ఇక్కడికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాన్వాడి అనే గ్రామాన్ని దత్తత తీసుకుని సత్యసాయి మెడికేర్ వ్యాన్ ద్వారా నెలకు రెండుసార్లు అలోపతిక్ మందులు ఇచ్చేవారము. నేను వాలంటీర్ గా చురుకుగా ఆ సేవలో పాల్గొంటూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి మా వ్యాన్లో మందులు ఐ పోయేవి. మేము వినయంగా ఆ గ్రామస్తులతో విషయం చెప్పి త్వరలోనే మందులు తెచ్చిఇస్తామని చెప్పేవారము.

మా నాగపూర్ సేవాదళ్ ప్రతీ సంవత్సరం (ఇప్పటికీ కూడా) మార్చి మరియు సెప్టెంబర్లో ప్రశాంతినిలయం సేవకు వెళుతూ ఉంటారు. అలా వెళ్ళినపుడు వీరిలో కొందరు డాక్టర్ అగ్గర్వాల్ గారివద్ద నుండి వైబ్రో రెమిడి లు తెచ్చుకొని అద్భుతాలు సాధించేవారు. 

ఇదే సమయంలో వైబ్రో శిక్షణ కోసం ఆసక్తి ఉన్న సాయి భక్తులు రావచ్చని పిలుపు రావడం 2008 నాగపూర్ నుండి ఐదుగురు ధర్మక్షేత్రంలో AVP శిక్షణ విజయవవంతంగా ముగించుకొనడం జరిగింది. ఆనందకరమైన విషయం ఏమిటంటే పేషంటుకు నయాపైసా కూడా ఖర్చు లేదు, మందులిచ్చే వారి ఖర్చు నామమాత్రమే. ఇప్పుడు మేము మెడికల్ క్యాంపులకు వెళ్ళినపుడు మందులు ఐపోయాయని తెల్లమొహం వేసుకొని రావక్కరలేదు. ఈ వైబ్రో మందులతో ఎంతమందికైనా వైద్యం అందించవచ్చు.

ముంబాయి నుండి వచ్చిన తర్వాత మా సత్యసాయి మెడికేర్ వ్యాన్ తో పాన్వాడి గ్రామంలో మొట్టమొదటిసారిగా వైబ్రో క్యాంపు పెట్టాము. మాకివ్వబడిన 54 CC కిట్లు (ఆ రోజుల్లో AVPలకు 54 CC బాక్స్ లు ఇచ్చేవారు), గోళీలు, మందు సీసాలు, స్టిక్కర్లు, రెడ్ బుక్ (మాకిచ్చిన గైడ్) అన్నీ తీసుకొని పాన్ వాడి గ్రామం వెళ్ళాము. మొదటిసారిగా ఎవరినీ నిరాశతో పంపకుండా 36 మందికి వైబ్రో మందులు, 100 మందికి అలోపతి మందులు ఇచ్చి ఆనందంతో ఇంటికి చేరాము. మా ఐదుగురము మాలో మేము ఎటువంటి స్వానుభవాలు, అభిప్రాయాలూ, వ్యక్తపరుచుకోకుండా తర్వాత క్యాంపు ఎప్పుడువస్తుందా అని ఎదురు చూడసాగాము. ఎందుకంటే ఈసారి క్యాంపులో పేషంట్లు అలోపతి వైపు మొగ్గు చూపుతారా, వైబ్రో మందులు అడుగుతారా తెలుసుకోవాలని  ఆసక్తి పెరిగింది.

మాకెంత ఆశ్చర్యం అయ్యిందంటే మేము వైబ్రో మందులు ఇచ్చిన 36 మంది పేషంట్లకు నయమయ్యింది. ముఖ్యంగా మలబద్ధకం, చర్మవ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, జలుబు దగ్గు ఇటువంటి వాటికి మేమిచ్చిన రెమిడి లు అందరికీ చక్కగా పనిచేశాయి. దీనితో వైబ్రో పేషంట్ల సంఖ్య 54కు పెరిగింది. ఆవిధంగా తరువాత క్యాంపులలో వైబ్రో పేషంట్ల సంఖ్య అలోపతి పేషంట్ల సంఖ్యకంటే పెరుగుతూ వచ్చింది.

ఒకసారి క్యాంపులో మా అలోపతి డాక్టర్ పేషంట్లను చూడడం త్వరగా ముగించుకొని  వైబ్రో మందులిస్తున్న మా పక్కకి వచ్చి కూర్చున్నారు. తర్వాత తనకి కూడా వైబ్రో మందులు కావాలని అడిగి తీసుకోవడం మాకెంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది.

ఈ విధంగా 12 గ్రామాలలో క్రమం తప్పకుండా వైబ్రో మరియు అలోపతి మందులు ఇస్తూ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాము. ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. జై సాయిరాం.