ప్రాక్టీ షనర్ల వివరాలు 11645...India
ప్రాక్టీషనర్ 11645...ఇండియా మెఖానికల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రులైన వీరు ONGC లో 32 సంవత్సరాలు పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజర్ గా 2021 జూన్ లో రిటైర్ అయ్యారు. తన కెరీర్ లో ఆఫ్షోర్ మరియు ఆన్షోర్ మిషనరీల
నిర్వహణ కార్యకలాపాలకు చేసిన కృషికి ఐదు మెరిటోరియస్ అవార్డులను అందుకున్నారు.
1968 లో ఏడేళ్ల వయసులో బాబా కేరళలోని వారి స్వగ్రామాన్ని సందర్శించి నప్పుడు వారి దర్శనం అనంతరం ప్రాక్టీషనర్ తండ్రి బాబా ఫోటోలు ఇంటికి తీసుకొచ్చినప్పుడు బాబాతో మొదటిసారి పరిచయం ఏర్పడింది. వీరి అత్తగారు గొప్ప సాయి భక్తురాలు, చిన్నతనంలో వారి ఇంటిలో హారతి కి హాజరయ్యేవారు. 1994 లో భక్తురాలిని వివాహం వివాహం చేసుకొని అనంతరం సాయి భజనలు మరియు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం గొప్ప ఆశీర్వాదంగా భావించారు. 1997 నుంచి 2021 మధ్య తన శ్రీమతి తో పాటు పాండిచ్చేరిలో నివసిస్తున్న వీరు అక్కడ వైద్య శిబిరాలు మరియు నారాయణ సేవలో చురుకుగా పాల్గొనేవారు. పదవీ విరమణ తర్వాత వీరు కొచ్చి లోని సాయి సమితి చెందిన ఇతర భక్తులలో కలిసి నెలవారి నారాయణ సేవలో పాల్గొనేవారు.
2011 నుండి ప్రాక్టీషనర్ అయిన తన అత్తమ్మ నుండి సాయి వైబ్రియానిక్స్ గురించి విన్నారు కానీ ఆ సమయంలో దానిని పెద్దగా పట్టించుకోలేదు. 2022 జనవరిలో ఆందోళన మరియు నిద్రలేమితో బాధపడుతున్న సన్నిహిత కుటుంబ సభ్యుడుని వైబ్రియానిక్స్ ఒక వారంలోనే ఎలా నయం చేసిందో ప్రత్యక్షంగా చూసి ప్రాక్టీషనర్ గా మారడానికి ప్రేరణ పొందారు. 2022 నవంబర్లో AVP కోర్సు విజయవంతంగా పూర్తి చేసి 2023 జూలైలో VP గా పదోన్నతి పొందారు.
ఇప్పటివరకు 100 కంటే ఎక్కువ మంది రోగులకు తీవ్రమైన మరియు దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేసిన ప్రాక్టీషనర్ కొన్ని ఆసక్తికరమైన కేసులను పంచుకోవాలని అనుకుంటున్నారు.
2023 మార్చిలో మూడు సంవత్సరాలుగా నిద్రలేమితో బాధపడుతున్న 75 ఏళ్ల మహిళకు చికిత్స చేశారు. ఆమెకు నిద్రపోవడానికి అరగంట ముందు ఆమెకు CC15.6 Sleep Disorders…OD ఇవ్వగా కేవలం ఒక వారం లోనే ఆమె గడచిన వారమంతా కూడా రాత్రంతా గాఢంగా నిద్రపోతున్నట్టు టాయిలెట్ వెళ్లడానికి మాత్రమే ఒకసారి మేల్కొంటున్నానని తెలిపారు. ఆమె రెమిడీ తీసుకోవడం కొనసాగిస్తూ ప్రస్తుతం బాగానే ఉన్నారు.
2023 ఫిబ్రవరిలో 41 ఏళ్ల మహిళ తన తల్లికి ఉన్న అనేక అనారోగ్య సమస్యల గురించి బెంగతో ప్రాక్టీషనర్ ని సంప్రదించారు. గత ఎనిమిది నెలలుగా ఆమెకు ఆకలి కోల్పోయి ఎప్పుడూ కడుపు నిండినట్లు అనిపించేది. అతను Eat well - CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion ఇచ్చారు. ఐదు రోజుల్లో ఆమె ఆందోళన తగ్గి సాధారణంగానే ఆహారం తినడం ప్రారంభించడంతో మోతాదు క్రమంగా తగ్గించారు.
2023 నవంబర్లో ఒక నెల వయసున్న ఆడపిల్ల రోజుకు 10 నుంచి 12 సార్లు విరోచనం చేయడం ప్రారంభించడంతో పరిస్థితి చాలా క్రిటికల్ గా మారింది. శిశు వైద్యుడు దీన్ని తల్లిపాల నుండి ఆవుపాలకు మారడంతో ప్రోటీన్లకు అసహనంగా నిర్ధారించారు. తల్లి అన్ని పాల ఉత్పత్తులను ఆపి సూచించిన ప్రోబయోటిక్స్ సిరప్ ను శిశువుకు ఇచ్చారు కానీ ఎటువంటి మెరుగుదల లేదు. ప్రాక్టీషనర్ శిశువుకు CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC12.2 Child tonic…6TD నీటిలో (1-2 నోటిలో చుక్కలు *). ఇచ్చారు. మరుసటి రోజు వదులుగా ఉండే మోషన్ ఫ్రీక్వెన్సీ రోజుకు 5 నుండి 6 సార్లు మరియు రెండు రోజుల తర్వాత 3 నుండి 4 సార్లు వరకు తగ్గింది. ఇప్పుడు పిల్లవాడు ప్రశాంతంగా ఉన్నాడు. మోతాదు TDS కు తగ్గించబడింది శిశువు సాధారణ మలాన్ని విసర్జించడం ప్రారంభించింది, ఒక వారం తర్వాత అది ODకి తగ్గించబడింది. ఇది శిశువుకు ఆరు నెలల వయసు వచ్చేవరకు కొనసాగించబడింది.
* 6 నెలల లోపు శిశువులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళ శరీరాలు నీటి వినియోగానికి తగిన రీతిలో ఉండవు. సంపుటి 14 సంచిక 3 ప్రశ్న 1 మే -జూన్ 2023 వార్తాలేఖ చూడండి. .
మలబద్ధకం మరియు ఇతర కడుపు సంబంధిత సమస్యలకు CC4.4 Constipation అద్భుతమైన నివారణ అని ప్రాక్టీ షనర్ తెలుసుకున్నారు. అతను ఈ కోంబోతో ముగ్గురు రోగులకు చికిత్స చేయగా వారు చాలా త్వరగా పూర్తి ఉపశమనం పొందారు. కనీసం పది మంది రోగుల్లో వైరల్ ఇన్ఫెక్షన్ లను నయం చేయడంలో IB యొక్క శక్తిని వారు ప్రత్యక్షంగా చూశారు.
వైబ్రియానిక్స్ సాధన చేయడం వీరికి అపారమైన ఆనందాన్ని మరియు సంతృప్తిని ఇచ్చింది, ప్రత్యేకించి ఇతర వైద్య విధానాలు విఫలమైన చోట వైబ్రియానిక్స్ అక్షరాలా ప్రాణ రక్షకంగా నిరూపింపబడిందని తెలుసుకున్నారు. SVIRT లో బాధ్యతా యుతమైన పాత్ర పోషించడానికి, అలాగే హిందీ మరియు మలయాళం నుండి ఆంగ్లంలోకి కేసు హిస్టరీలను అనువదించడము లేదా మరేదైనా డాక్యుమెంటేషన్ పని లేదా వైబ్రేషన్స్ గురించి అవగాహన కల్పించడానికి పెంచడానికి వీరు ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రాక్టీషనల్ తాను స్వామి యొక్క వినయపూర్వక సాధనంగా భావిస్తూ స్వచ్ఛమైన హృదయంతో సేవచేసి భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతి చేస్తే అనుకూలమైన ఫలితాలు దక్కుతాయని పేర్కొంటున్నారు. రోగులకు మరియు నిరుపేదలకు ఎక్కడ ఉన్నా సరే వారికి సాయి వైబ్రియానిక్స్ చికిత్స ప్రాప్తి కావాలని స్వామికి తన హృదయపూర్వక ప్రార్థన సమర్పించు కుంటున్నారు.
ఉదహరించిన కేసులు: