మానసిక వేదన, భయము, తీవ్రమైన కాళి నొప్పి 11645...India
2012లో భర్త మరణించిన తర్వాత ఒంటరిగా జీవిస్తున్న 76 ఏళ్ల మహిళ నిరాశ, భయము మరియు మానసిక వేదన తో పాటు ఆందోళన తో బాధపడుతున్నారు. తరచూ ఆలయాలను, బంధువులను సందర్శించడం క్రమం తప్పకుండా తన కారు నడపడం ద్వారా ఆమె ఓదార్పును పొందుతున్నారు. 2019 లో తీవ్రమైన కుడికాలు నొప్పి కారణంగా ఆమె దిన చర్యకు ప్రత్యేకించి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీవ్రంగా అంతరాయం కలిగింది, కాలక్రమణా నొప్పి తీవ్రమైంది. ఇది ఆమె బాధను మరింత పెంచి ఆమె నిద్రకు కూడా భంగం వాటిల్లి ఆమె మానసిక రుగ్మతలను మరింత తీవ్రతరం చేసింది. అధిక ఒత్తిడి సమయంలో ఆమె రెండు కాళ్ళలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ ఫలితంగా నిద్రలేని రాత్రులు ఏర్పడ్డాయి. నొప్పి నివారణ మందులు మరియు విటమిన్లతో కూడిన అల్లోపతి మందులు నాలుగు సంవత్సరాలుగా తీసుకున్నప్పటికీ ఆమె పరిస్థితి అలాగే కొనసాగి జీవితాన్ని ఒక సవాలుగా మార్చింది. ఉపశమనం కోసం నిరాశగా ఎదురు చూస్తున్న సందర్భంలో వైబ్రియానిక్స్ ద్వారా నొప్పిని తగ్గించుకోవడమే కాక మానసిక స్థితిని కూడా మెరుగుపడుతుందని ఆమె బంధువు ఆమెకు తెలియజేసినప్పుడు ఆమె ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే 2023 ఏప్రిల్ 8వ ప్రాక్టీషనర్ ను సంప్రదించగా వారు క్రింది రెమిడీ ఇచ్చారు:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.4 Muscle & Supportive tissue + CC20.5 Spine…TDS
రెమిడీ తీసుకున్న ఒక నెలలోనే చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతతతో సంతోషంగా ఉన్నట్లు అనుభూతి పొందారు. డ్రైవింగ్ చేసే సమయంలో మరియు రాత్రులలో కండరాల నొప్పిలో 90% మెరుగుదల ఉంది. తద్వారా ఆమె నిద్ర కూడా మెరుగుపడింది. నొప్పి రెమిడి తీసుకోవాల్సిన అవసరం ఆమెకు కలుగలేదు. జూన్ 10న మరో నెల తర్వాత భయం మరియు వేదన యొక్క ఆలోచనలు పోయి తాను ప్రశాంతంగా ఉన్నానని మరియు ఒత్తిడికి గురైనప్పటికీ నొప్పి యొక్క జాడ కనిపించలేదని అంత సంతోషంగా తెలియజేశారు. ఆగష్టు 25న రెమిడీ ఆపివేయడానికి ముందు మోతాదు ఒక నెల BD కి ఆ తర్వాత OD కి తగ్గించబడింది. ప్రాథమికముగా చికిత్స లేదని భావించిన తన సమస్యకు పరిష్కారం తన జీవన నాణ్యతను మెరుగుపరిచి నందుకు మరియు మానసిక వేదన నుండి విముక్తి కలిగించినందుకు వైబ్రియానిక్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
2024 మార్చినాటికి ఆమె డ్రైవింగ్ ని ఆస్వాదిస్తూ మానసికంగా దృఢంగా ఉన్నారు.