Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

యాసిడ్ రిఫ్లక్స్ 11645...India


80 ఏళ్ల మహిళ 2018 మే నుండి గత 5 ఏళ్లుగా భోజనం చేసిన ప్రతీసారీ పుల్లని రుచితో తేనుపు రావడం ఆమె అన్నవాహికలో మంటను కలిగించే తీవ్రమైన ఆమ్లత్వము తో బాధపడుతూ ఉన్నారు. వీటి ఫలితంగా మైకము కమ్మినట్లు ఉండడంతో ఆహారం తీసుకోవడం మరియు చలన శీలత పరిమితం చేయబడి ఆమెను మంచాన పడేలా చేసి ప్రాథమిక అవసరాలకు కూడా ఇతరులపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది.  

ప్రారంభంలో సూచించబడిన యాంటాసిడ్లు తీసుకొని తాత్కాలిక ఉపశమనం పొందారు కానీ లక్షణాలు మరింత తీవ్రము కావడంతో  డాక్టర్ ఆమె పరిస్థితి యాసిడ్ రిఫ్లక్స్ గా నిర్ధారించారు. లక్షణాలు తీవ్రంగా మారడంతో 2018 జూన్ లో హోమియోపతి రెమిడీలకు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ అవి దాదాపు 30% ఉపశమనం మాత్రమే అందించాయి. వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తర్వాత 2023 మే 10వ తేదీన ఆమె కుమారుడు ప్రాక్టీషనర్ ను సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది: 

CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS 

మషాలా ఆహారాన్ని నివారించాలని, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని స్వీకరించాలని, మరియు నెమ్మదిగా నీటిని రోజుకు 2 నుండి 3 లీటర్లకు పెంచాలని ప్రాక్టీషనర్ పేషెంట్ కు సూచించారు. ఆమె అన్ని ఇతర మందులు నిలిపివేశారు

మే 18న ఒక వారం లోపు పేషెంట్ లక్షణాలన్నింటిలో 75% ఉపశమనం కలిగిందని ఆమె కుమారుడు ఆనందంగా తెలిపారు. జూలై 20 నాటికి ఆమె రోగ లక్షణరహితంగా మారి సాధారణంగానే ఆహారం తీసుకుంటూ ఎవరి సహాయం లేకుండా రోజువారి పనులు చేసుకుంటున్నారు. మోతాదు ఒక నెలకు  BD కి తగ్గిపోయింది, ఇది క్రమంగా మరింత తగ్గి ప్రస్తుతం OD గా కొనసాగుతోంది. 2024 మార్చి నాటికి ఆమె ఆహారాన్ని మాములుగానే ఆస్వాదిస్తూ బాగానే ఉన్నారు.   

పేషెంటు కుమారుని వాంగ్మూలము:

“మా అమ్మ ఐదు సంవత్సరాలకు పైగా తీవ్రమైన ఆమ్లత్వము మరియు తత్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అల్లోపతి లేదా హోమియోపతి మందులతో సమస్య మెరుగుపడలేదు. వైబ్రియానిక్స్ రెమిడి తీసుకున్న తర్వాత మొదట్లోనే అన్ని సమస్యలు తగ్గాయి ఇప్పుడు ఆమె సాధారణమైన స్థితిలో జీవిస్తున్నారు, మా తల్లికి సహాయం చేసినందుకు స్వామికి మరియు ప్రాక్టీషనర్ కు ధన్యవాదాలు.”