పొడికళ్ళు, చీము ఉత్సర్గము 11645...India
40 ఏళ్ల మహిళ కోవిడ్ 19 నుండి కోలుకున్న రెండు నెలల తర్వాత పొడి కళ్ళు, ఎరుపుదనంతో కూడి గరగర లాడడం, దురద మరియు తెల్లటి చీము స్రవించడం వంటి సమస్యలతో 2020 జూన్ నుండి బాధపడుతున్నారు. ఐతే ఈ లక్షణాలను 2021 ఫిబ్రవరిలో ఆమె పరిస్థితి క్షీణించే వరకూ ఉపేక్షించారు. కోవిడ్ అనంతర ప్రభావాలు కారణమని కంటి వైద్య నిపుణుడు తెలిపి స్టెరాయిడ్ కంటి చుక్కలు సూచించారు. ఇది దురద మరియు చీమ ఉత్సర్గము నుండి 50% ఉపశమనాన్ని అందించింది కానీ ఆమె కంటిచుక్కలు ఉపయోగించడం ఆపివేస్తే లక్షణాలు తిరిగి రాసాగాయి. తన ఉద్యోగ రీత్యా రోజూ ఆరు గంటల పాటు కంప్యూటర్ తో పని చేయడం వల్ల ఏర్పడిన ఈ స్థితి ఆమె వ్యక్తిగత జీవితాన్ని అలాగే కెరీయర్ ని కూడా ప్రభావితం చేసింది.
2002 డిసెంబర్ 10న ఆమె ఎర్రటి మరియు చీమతో నిండిన కళ్ళతో ప్రాక్టీషనర్ ను సందర్శించగా వారికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC7.3 Eye infections…TDS శ్వేద జలం లో కంటి చుక్కలు వలె ఉపయోగించ డానికి
ఆమె అల్లోపతి చికిత్స వెంటనే ఆపివేశారు. ఒకటవ నెలలో ఎటువంటి మార్పు లేదు కానీ ప్రాక్టీషనర్ విశ్వాసం మరియు సలహాలు ద్వారా ప్రేరణ పొంది మరో రెండు నెలల పాటు రెమిడి కొనసాగించారు. మార్చి 10 తేదీన ఆమె రెండు కళ్ళల్లో చీము 25% తగ్గిందని కానీ ఇతర మార్పులు ఏమీ లేవని తెలిపారు. ఏప్రిల్ 11 నాటికి రోగికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తూ చీము ఉత్సర్గంలో 90% మరియు ఇతర లక్షణాలు 50% తగ్గాయి. మరో రెండు నెలల తర్వాత జూన్ 15న అన్ని లక్షణాల నుండి 100% ఉపశమనం పొందానని తన లాప్టాప్ లో హాయిగా పనిచేసుకోగలుగుతున్నారు అని ఉత్సాహంగా తెలిపారు. మోతాదు OD కి తగ్గించబడింది. మరో నెల తర్వాత నోటి నివారణ ఆపివేయబడింది. రోగి నిర్వహణ కోసం OD వద్ద కంటి చుక్కలు కొనసాగిస్తున్నారు, ఆమెకు IB కూడా OD గా ఇవ్వబడింది.
2024 మార్చినాటికి ఆమె రోగ లక్షణ రహితంగా ఉన్నారు.
సంపాదకుని వ్యాఖ్య: నేత్రవైద్యుని రోగనిర్ధారణ ద్వారా వచ్చిన సూచనలు అనుసరించి ప్రాక్టీషనర్ వేగవంతమైన ఉపశమనం కోసం కోవిడ్ రీ కూపరేషన్ కాంబోను అందించి ఉంటే బాగుండేది.