అభ్యాసకుల వివరాలు 02779...Japan
2009లో నాకు సాయి వైబ్రియోనిక్స్ సేవలో ఒక అభ్యాసకుడవ్వడానికి అవకాశమొచ్చింది.నాకు అంతకముందు ప్రత్యామ్నాయ చికిత్సలు నేర్చుకోవాలని చాలా ఆశక్తిగా ఉండేది. నాకు ఇంత అమోఘమైన సరళమైన చికిత్సావిధానం నేర్చుకునే అవకాశం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను.ఈ అమూల్యమైన చికిత్సా విధానం ద్వారా నాకు జపాన్లో మరియు ఇండియాలో సేవ చెయ్యడానికి చాలా అవకాశాలు లభించాయి.ఇండియాలో ఒక గ్రామ సేవకు వెళ్ళినప్పుడు 200 మంది పేషంట్లకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం కలిగింది.ఈ అనుభవం ద్వారా నేను నిస్వార్థ సేవలో లభించే ఆనందాన్ని మరియు సంతృప్తిని రుచి చూసాను.
నేను మతధర్మ శాస్త్రంలో ఒక విద్యార్థిని. అందువలన నేను మొదట్లో వైబ్రియోనిక్స్ దేవుడిచ్చిన వరంగా కాకుండా ఒక భౌద్ధిక ద్రిష్టికోణంతో చూసేవాడిని.
మూడేళ్ళ తర్వాత 2012లొ నేను మానసికంగా మరియు శారీరికంగా చాలా క్రుంగి ఉన్నపుడు ఈ సేవ చేయడంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకున్నాను.ఆ సమయంలో నేను రోజుకి ఆరు గంటలు ధ్యానం చేస్తూ ఉండేవాడిని.సేవ చేయకుండా వట్టి ధ్యానం మాత్రం చేయడం ఉపయోగకరం కాదని అందరు చెబుతుంటారు.కాని నాకు ఆధ్యాత్మిక వికాశాన్ని పొందాలన్న అత్యాశ ఉండేది.ఒక రోజు ఒక చోట సాముహిక ధ్యానంలో పాల్గొనడానికి వెళ్తుండగా నేను వ్యాకులపడి చంచలమైన మనస్సుతో ఇంటికి తిరిగి వెళిపోయాను. ఈ వ్యాకులత ఆపై నాలుగైదు నేలలుకైన తగ్గలేదు. నన్ను దేవుడు ఒక్కడు తప్ప ఇంకెవ్వరు కాపాడలేరని అనిపించింది. చాలా రోజులవరకు నాకు దేవుడిని తలుచుకోకపోతే ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా అనిపించేది.నేను స్వామీ పటం ఒకటి నా చేతిలో పెట్టుకుంటేగాని పడుకోలేక పోయేవాడిని. ఈ నా పరిస్థితి మారడానికి అందరిలో సాయిని చూసుకోవడం ఒకటే మార్గమని నాకనిపించింది.అప్పటినుండి నన్ను సంప్రదించడానికి వచ్చే ప్రతి పేషంట్లోను సాయిని చూసుకోవడం మొదలు పెట్టాను. ఇంత సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించి నన్ను అనుగ్రహించినందుకు స్వామికి మనసార నా కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నాను. నేను పొందిన ఈ అనుభవాలు వలన సేవపై మరియు చికిత్సా విధానంపై నాకున్న ద్రిష్టికోణం పూర్తిగా మారిపొయినది.
నాకు కలిగే అనుభవాలు మరియు నేను కలిసే వ్యక్తులందరూ కూడా నా గత జ్ఞ్యాపకాలు మరియు నా మనస్సులో దాగి ఉన్న విషయాలు చూపించే అద్దాలే. నిస్వార్థ సేవ మరియు ప్రేమ నా మనస్సును శుద్ధ పరచడానికి ఉన్న ఏకైక మార్గాలని నేను గ్రహించాను. బాహ్య ద్రిష్టితో కాకుండా అంతర్ద్రిష్టితో చూడాలని నేను తెలుసుకున్నాను.ఈ విధంగా ఏ విధమైన దురభిమానాలు లేన స్వచ్చమైన కాంతి నానుండి వెలువడడానికి వీలుపడుతుంది. "అన్నికూడను మీ మనస్సు యొక్క రియాక్షన్, రిఫ్లెక్షన్,రిసౌండ్ " అన్న స్వామీ భోధన ఈ సేవ చేయడం ద్వారా నేను అర్ధంచేసుకోగలిగాను. నేను ఎప్పటికి స్వామీ యొక్క స్వచ్చమైన సాధనంగా ఉండాలని కోరుకుంటూనాను.
జపాన్ దేశంలో ఉన్నత వైద్య వ్యవస్థతో కూడిన ఉన్నత ప్రమాణంలో ఆరోగ్య సంరక్షణ మరియు జాతీయ ఆరోగ్య భీమ మాకు లభిస్తున్నాయి. నా అభిప్రాయంలో అల్లోపతి మందుల దుష్పరిణామాలు తెలుసుకొని,సఫలమైన మరియు సురక్షితమైన వేరే వైద్య విధానాల్ని ఎన్నుకుంటున్న వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. స్వామీ మనకి అందచేసిన ఈ మహత్తరమైన చికిత్సా విధానాన్ని జపాన్లో ఇంకా ఎక్కువగా అందరు అర్ధంచేసుకొని, అంగీకరించి మరియు ఉపయోగించాలాని నేను మనసార కోరుకుంటున్నాను.
సంపాదకుని వ్యాఖ్యానం:
ఈ అభ్యాసకుడు అనేక రకాల వ్యాదుల్ని స్వామీ దయతో విజయవంతంగా నయం చేసారు.పీహెచ్ డీ చేసి మనావతా విలువల శిక్షణలో నేతృత్వం వహించిన ఈ అభ్యాసకుని అన్య వివరాలు, 2014 జనవరిలో ప్రశాంతి నిలయంలో జరిగిన మొదటి అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సమావేశం కార్యకలాపాల పుస్తకంలో పు.107-112లలొ ప్రచురింపబడింది. ఈ సంచికలో ప్రచురింపబడిన జపాన్ అబ్యాసకుల బృందం వివరాలన్నీ సేకరించి మాకు అందించినందుకు ఈ అభ్యాసకునికి మా కృతజ్ఞ్యతలు తెలుపుకుంటూన్నాము.