ప్రాక్టీషనర్ల వివరాలు 11235...India
ప్రాక్టీషనర్ 11235...ఇండియా సైన్స్ మరియు లా లో గ్రాడ్యుయేట్ ఐన వీరు కొచ్చిన్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. తీరిక సమయాల్లో ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడంతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 1990లో తన బంధువు ఇచ్చిన సాయిబాబా పుస్తకాన్ని మొదటిసారి చదివారు. పుస్తకం చదువుతున్నప్పుడు అతను పూర్తిగా వేరే ప్రపంచము లోనికి చేరినట్లు భావోద్వేగం చెందగా కన్నీరు ధారాపాతంగా వీరి చెక్కిళ్ళ మీదుగా ప్రవహించాయి అంతేకాకుండా అంతరంగికంగా ఏవో అవ్యక్త భావాలను అనుభవించారు. స్వామి వైపుకు వీరు చేసే ప్రయాణంలో ఇది ప్రధామాంకము.
1992 నుండి, వీరు ప్రశాంతి సేవ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందుల పంపిణీ మరియు నెలవారీ వైద్య శిబిరాలలో పాల్గొనడం వంటి సాయి సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. మొత్తం ఏడేళ్లపాటు సేవా, ఆధ్యాత్మిక, ప్రచురణ విభాగాల్లో సమన్వయకర్తగా సేవలందించారు. మూడు సంవత్సరాలుగా వారు తన స్థానిక సాయి సమితిలో స్టడీ సర్కిల్‌లకు ఇన్‌ఛార్జ్‌గా ఉంటున్నారు.
ఒక జిల్లా సమావేశంలో సాయి వైబ్రియానిక్స్ గురించి విన్నప్పుడు, ప్రాక్టీషనరుగా మారాలని అంతరంగంలో బలమైన కోరిక అంకురించింది. 2010లో దీనికి అవకాశం వచ్చినప్పుడు, అతను రెండో ఆలోచన లేకుండా వెంటనే దరఖాస్తు చేసుకున్నారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో AVP, సెప్టెంబరు 2011లో VP మరియు మార్చి 2013లో SVPగా అర్హత సాధించారు. అతను 9200 కంటే ఎక్కువ మంది రోగులకు చికిత్స అందించారు. కేరళలో గల ఐదు ప్రాంతీయ సమన్వయ కర్తలలో వీరు కూడా ఒకరు. వీరి బృందం వేల సంఖ్యలో ఇమ్యూనిటీ బూస్టర్ బాటిళ్ల పంపిణీలో ప్రధాన పాత్ర పోషించింది, 50% కంటే ఎక్కువ IBలు వీరి రాష్ట్రంలో పంపిణీ చేయబడ్డాయి.
అతను ఇతర ప్రాక్టీషనర్లతో కలిసి పని చేయడం మరియు మహమ్మారి ప్రారంభానికి ముందు ఒక నెలలో మూడు వారాంతాల్లో మూడు వేర్వేరు కేంద్రాలలో వైబ్రియానిక్స్ శిబిరాలు నిర్వహించే అవకాశాలను పొందడం అదృష్టంగా భావిస్తారు. మహమ్మారి సమయంలో కూడా, అతను తన రోగులతో ఫోన్ సంప్రదింపుల తర్వాత కొరియర్ ద్వారా రెమెడీలను పంపడం ద్వారా సేవను కొనసాగించారు. అతని సేవ యొక్క లబ్ధిదారులు ప్రస్తుతం నెలకు 100 మంది రోగులు ఉన్నారు.
ఈ ప్రాక్టీషనరు తన సేవలో అనేక ఆసక్తికరమైన సందర్భాలను ఎదుర్కొన్నారు. ఒక సందర్భంలో, 42 ఏళ్ల మహిళ RA ఫ్యాక్టర్ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారింప బడ్డారు. ఆమె దీర్ఘకాలంగా కీళ్లలో వాపు మరియు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. దీని కోసం ఆమె చాలా కాలం అల్లోపతి మందులను తీసుకున్నారు కాని ఉపశమనం కలుగ లేదు. వైబ్రో రెమెడీలు తీసుకున్న రెండు వారాల తర్వాత, 50% మెరుగుదల మరియు ఒక నెల తరువాత దాదాపు పూర్తి ఉపశమనం కలిగింది. మరో సందర్భంలో, వెర్టిగోతో బాధపడుతున్న 63 ఏళ్ల వ్యక్తి, నాలుగు నెలల పాటు అల్లోపతి చికిత్సను ప్రయత్నించినా ఉపశమనం కలగని కారణముగా తనకు CC5.3 Meniere's disease + CC15.1 Mental & Emotional tonic + CC18.7 Vertigo ఇవ్వబడింది. రెండు వారాల్లో అతనికి 70% ఉపశమనం కలుగగా తదనంతరం అతను పూర్తిగా నయమయ్యారు.
వైబ్రియానిక్స్ చికిత్స వలన పూర్తి స్వస్థత చేకూరిన వీరి రోగులలో ఒక మహిళ ఎంతో ప్రేరణ చెంది తన కుమార్తె మరియు అల్లుడిని ప్రాక్టీషనరు వద్దకు పంపారు. ఈ యువ జంట గత మూడు సంవత్సరాలుగా బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ సఫలం కాలేదు. ఇద్దరికీ అధిక కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్ ఉన్నాయి, దీని కోసం వారు అల్లోపతి చికిత్స తీసుకుంటున్నారు. ఆ యువతికి పిసిఒడి కూడా ఉంది, దాని కోసం ఆమె కొన్ని ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేయించుకుంది. వైబ్రో రెమెడీలు తీసుకున్న ఒక నెల తర్వాత, వీరిద్దరికీ కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్ లెవల్స్‌లో తగ్గుదల కనిపించింది అంతేకాక రెండు నెలల తర్వాత ఆమె IVF చికిత్స ప్రారంభించటానికి కేవలం ఒక వారం ముందు తను గర్భం దాల్చింది! గర్భం దాల్చిన తేదీ అల్లోపతి మెడిసిన్ షెడ్యూల్‌తో సరిపోలడం లేదని, తద్వారా ఈ విజయాన్ని పూర్తిగా వైబ్రియానిక్స్ చికిత్సకు ఆపాదించాలని సంబంధిత వైద్యుడు సూచించాడు, కాబట్టి నవంబర్ 2019లో వారి కుమారుడు జన్మించినప్పుడు, వారు అతన్ని 'వైబ్రో బేబీ' గా పిలిచారు.
ఈ ప్రాక్టీషనరు కొన్ని కాంబోలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని గ్రహించారు. అతను CC8.2 Pregnancy tonic నొప్పిలేకుండా, సాధారణ ప్రసవానికి ఉత్తమమైన ఔషధంగా కనుగొన్నారు. వీరి అనుభవంలో CC18.7 Vertigo, CC19.6 Cough chronic, CC19.7 Throat chronic మరియు CC21.11 Wounds & Abrasions ఎప్పుడూ విఫలం కాలేదు సిమ్యులేటర్ కార్డ్‌లలో NM59 Pain మరియు NM97 Sciatica అతనికి అసాధారణమైన ఫలితాలను అందించాయి.
వైబ్రియానిక్స్ అభ్యాసం ప్రాక్టీషనరుకు నిస్వార్థ సేవ యొక్క నిజమైన అర్థాన్ని నేర్పింది, అలాగే రోగుల పట్ల సహనం, కరుణను పెంచింది. ఈ సేవలో విజయవంతం కావాలంటే, అహంకారం లేకుండా మరింత క్రమశిక్షణతో మరియు అంకితభావంతో పనిచేస్తూ మెరుగైన శ్రోతగా ఉండాలని అతను గుర్తించారు. ప్రారంభ రోజులలో ఒక పేషెంట్ తనను 'డాక్టర్' అని పిలిచినప్పుడు అతను ఉబ్బితబ్బిబ్బైన అనుభూతి చెందినా క్రమంగా చికిత్సా ఫలితాలను నిరంతరం గమనించడం ద్వారా, అతని అహం చికిత్సా ప్రక్రియకు ఆటంకం కలిగిస్తోందని అవగాహన కలిగింది. అప్పటి నుండి, అతను రోగుల పట్ల తన విధానంలో సమానత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నించ సాగారు. రోగులకు స్వస్థత చేకూర్చే స్వామి చేతిలో తాను కేవలం ఒక సాధనం మాత్రమేనని వీరికి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇంత వయసులో కూడా తను అలసిపోకుండా వైబ్రియానిక్స్ క్యాంపులు నిర్వహించేందుకు వివిధ ప్రాంతాలను సందర్శించే శక్తి కలిగి ఉండటం స్వామివారి కృప వల్లనే అని భావిస్తారు.
ఇతర ప్రాక్టీషనర్లకు వీరి సందేశం ఏమిటంటే, ‘మన వైద్య ప్రక్రియ యొక్క విజయం మన ఆలోచనలు, మాటలు మరియు పనుల స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. సానుకూల ప్రకంపనలను పెంపొందించేది మన సాధన మరియు దీనిని సాధించడానికి నామస్మరణ ఉత్తమమైన పద్ధతుల్లో ఒకటి. ప్రాక్టీషనర్లు ఆధ్యాత్మిక మరియు సేవా ఆధారిత వ్యక్తులతో సహవాసం చేయాలని మరియు సేవ చేయడానికి అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీరు సూచిస్తున్నారు.
పంచుకున్న కేసులు