పునరావృత మవుతున్న మూత్రకోశ వ్యాధి (UTI) 11235...India
67 ఏళ్ల మహిళ జ్వరం మరియు మూత్రవిసర్జన సమయంలో నొప్పితో పునరావృతమవుతున్న UTIతో ఆరు నెలలకు పైగా బాధపడుతున్నారు. ఇది ప్రతి రెండు నెలలకు ఏర్పడుతూ ఉంటుంది, ఆ సమయంలో ఆమె 5 నుండి 7 రోజుల పాటు సూచించిన యాంటీబయాటిక్స్ యొక్క కోర్సును తీసుకుంటారు. ఆ తర్వాత ఆమె లక్షణాలు తొలగిపోతాయి. ఆ తర్వాత 2014 ఆగష్టు 8 న ఆ రోగ లక్షణాలు మరలా ఏర్పడినప్పుడు ఆమె తన వైద్యుడి వద్దకు వెళ్లడానికి బదులుగా, ప్రాక్టీషనరును సంప్రదించాలని నిర్ణయించుకొనగా వారు క్రింది రెమిడీ ఇచ్చారు:
CC8.1 Female tonic + CC13.2 Kidney & Bladder infections + CC15.1 Mental & Emotional tonic…TDS
మూడు రోజుల తర్వాత జ్వరం తగ్గి మరో నాలుగు రోజుల తరువాత నొప్పి పూర్తిగా అదృశ్యమైపోయింది. ఈసారి యాంటీబయాటిక్స్‌ను ఆశ్రయించాల్సిన అవసరం రాలేదని రోగికి ఎంతో ఆనందంగా ఉంది. తదుపరి ఈ సమస్య పునరావృతం కానందున మోతాదు నాలుగు నెలల తర్వాత BDకి మరియు మరో రెండు నెలల తర్వాత ODకి తగ్గించబడి జూన్ 2015లో రెమిడీ నిలిపివేయబడింది. ఫిబ్రవరి 2022 నాటికి, సమస్య పునరావృతం కాలేదు.