పార్శ్వపు నొప్పి, భుజం నొప్పి 11235...India
51 ఏళ్ల మహిళకు రెండేళ్ల క్రితం నుండి తలనొప్పి రావడం ప్రారంభించింది. సూర్య కాంతి ఐదు నిమిషాలు వంటిమీద సోకినా ఆ రోజంతా వికారంతో తలనొప్పిని కలిగిస్తుంది. వాంతి తర్వాత మాత్రమే ఉపశమనం కలుగుతుంది. ఆమె పరిస్థితి మైగ్రేన్‌గా నిర్ధారణ అయింది. ఆమె వృత్తి రీత్యా నెలకు 4-5 సార్లు టూర్‌కి వెళ్లాల్సి రావడంతో ఎండలో వెళ్లకుండా ఉండలేకపోయేవారు. అదనంగా, కొన్ని నెలల క్రితము, ఆమెకు మెడపై నొప్పి ప్రారంభమై ఎడమ భుజం మరియు మోచేయి వరకు పాకుతూ పోయేది. నొప్పి నివారణ మాత్రలు తీసుకోవడం ఆమెకు ఇష్టం లేదు కాబట్టి ప్రత్యామ్నాయం కోసం వెతికారు. 2018 సెప్టెంబర్ 21న, ప్రాక్టీషనర్ ఆమెకు క్రింది రెమిడీ అందించారు:
పార్శ్వపు నొప్పి కోసం :
#1. CC11.3 Headaches + CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic…6TD
భుజం నొప్పి కోసం :
#2. NM59 Pain + OM4 Cervical + OM27 Supportive tissue + CC20.4 Muscles & Supportive tissue…TDS
రోగిని ఆశ్చర్య ఆనందాలకు గురి చేస్తూ #1 యొక్క మూడు మోతాదులను తీసుకున్న తర్వాత ఆమె తలనొప్పి మరియు వికారం నుండి పూర్తిగా ఉపశమనం పొందారు. 2 వారాల తర్వాత, అక్టోబర్ 5న, ఆమె తలనొప్పి తీవ్రత, వ్యవధి మరియు తరుచుదనం 75% తగ్గిందని చెప్పారు. #1 TDSకి తగ్గించ బడింది. ఒక నెల తర్వాత ఆమెకు 100% ఉపశమనం లభించింది. ఈ సమస్య యొక్క జాడ లేకుండా పోవడంతో ఆమె ఎండలో బయటకు వెళ్లగలుగుతున్నారు. ఈ రెమెడీని మరో నెల పాటు కొనసాగించారు, తర్వాత డిసెంబర్ 4న ODకి తగ్గించి 2019 ఫిబ్రవరి 6 న ఆపివేయబడింది. భుజం నొప్పికి సంబంధించి, ఒక నెల తర్వాత 20% ఉపశమనం లభించింది, ఐదు నెలల తర్వాత 90% మరియు మరో రెండు నెలల తరువాత 100% ఉపశమనం లభించింది. మే 28న, #2 OD కి తగ్గింపబడి నెల అనంతరం 2019 జూలై లోఅపీయబడింది. 2022 మార్చి నాటికి ఎలాంటి లక్షణాలు పునరావృతం కాలేదు.
108CC బాక్సు ఉపయోగిస్తున్నట్లైతే #2:CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20. 4 Muscles & Supportive tissue ఇవ్వండి