ప్రాక్టీషనర్ల వివరాలు 10741...India
ప్రాక్టీషనర్10741 ఈమెబి.ఏ డిగ్రీ పొందిన తర్వాత ఐదు ఏళ్ళు డివైన్ లైఫ్ సొసైటీ సెక్రటరీగా పని చేశారు. ఇప్పుడు ఈమె ఒక గృహిణి.1956లోమొట్టమొదటి సారి తన 12సంవత్సరాల వయసులో ఆమె స్వామి యొక్క దివ్యత్వాన్ని ప్రగాఢంగా విశ్వసించే ఈమె తల్లిదండ్రులతో కలిసి స్వామి వారి మొదటి దర్శనం చేసుకున్నారు. స్వామివారి దివ్య ఉపన్యాసం విని ముగ్దులయ్యారు. 1969లో వివాహం తర్వాత ఆమె ముంబై వెళ్లారు, అక్కడ ఆమె అత్తగారు ప్రోత్సహించడంతో గాయకురాలిగా సాయి సంస్థలలో చురుకుగా పాల్గొన్నారు. తర్వాత ఆమె బాలవికాస్ సమన్వయకర్తగా మరియు లేడీస్ ఇన్ఛార్జిగా మారడంతో ఆధ్యాత్మిక, విద్య మరియు సేవ అనే మూడు విభాగాల పర్యవేక్షణ అవసరమైనది. ఇవన్నీ ఆమెకు అపారమైన శాంతిని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. 1975లో స్వామి పిలుపుతో పుట్టపర్తి సందర్శించారు. 1997లో ఆమె బెంగళూరు వెళ్ళినప్పుడు ఆమె సేవ కొనసాగిస్తూ బృందావనం భజన గ్రూప్ లో చేరడం అదృష్టంగా భావిస్తున్నారు.
వైబ్రియానిక్స్శిక్షణా కార్యక్రమంలో పాల్గొని2009లో AVP గా మరియు ఒక సంవత్సరం తర్వాత VP గా మారడానికి మార్గనిర్దేశం చేయబడినందుకు అదంతా స్వామిఆశీర్వాదంగా ఈ ప్రాక్టీషనర్భావిస్తున్నారు. క్రమం తప్పకుండా నిర్వహించే రిఫ్రెషర్కోర్సులు తనకు అవసరమైన విశ్వాసాన్నిపొందేటట్లు చేశాయని వీరి అభిప్రాయం. ఆమె తన సమితి సభ్యులకు బాల వికాస్ పిల్లలు మరియు వారి తల్లిదండ్రులకు స్నేహితులు మరియు బంధువులకు కూడా చికిత్స చేశారు.2011 నుండి 2014 వరకు వైట్ ఫీల్డ్ లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సేవాదళ్ మహిళలకు సేవచేసే ఈ అవకాశాన్ని ఆమె ఎంతో అదృష్టంగా భావించారు. జీర్ణ వ్యవస్థ, తీవ్రమైన ఇన్ఫెక్షన్,ఉష్ణమండల వ్యాధులు, శ్వాసకోశ ఎలర్జీలు,అస్థిపంజర కండరాలకీళ్ల సమస్యలు, చర్మ సమస్యలువంటి అనేక వ్యాధులకు ఆమె విజయవంతంగా చికిత్స చేశారు.ఎంతోమంది మహిళలు తమ కుటుంబ సభ్యులకు కూడా వీరి నుండి రెమిడీలను తీసుకొనేవారు.
బృందావన ఆశ్రమానికి సమీపంలో ఉన్న పాఠశాలలో స్వామి విద్యార్థులు క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య శిబిరంలోని రోగులకు కూడా వీరు తమ సేవలను విస్తృత పరిచారు. ఆమెకు కేటాయింపబడిన రోగులలో ఎక్కువశాతం మూర్ఛ,మెదడు వైకల్యాలు,వెర్టిగో(తల తిరుగుట),న్యూరాల్జియా(నాడీ శోధన) వంటి నాడీ సంబంధిత వ్యాధులే ఎక్కువగా ఉన్నాయి.వ్యాధులు నయమైన శాతం చాలా ఎక్కువగా ముఖ్యంగా మూర్ఛ రోగులలో 90 నుండి 95%మెరుగుదల గుర్తించబడింది.2017లో క్లినిక్ ప్రారంభించినప్పుడు ప్రాక్టీషనర్ అక్కడ నాలుగు నెలలు పని చేశారు మరియు తర్వాత క్రమం తప్పకుండా ప్రయాణించడం కష్టమనిపించి ప్రస్తుతం సేవ అవసరానికి తగ్గట్టుగా చేస్తున్నారు.
వైబ్రియానిక్స్సేవ తన ఆధ్యాత్మికప్రయాణంలో తనకు ఎంతో సహాయపడింది అనిప్రాక్టీషనర్ చెబుతున్నారు. శారీరక శ్రేయస్సు, మానసిక సంతృప్తి మరియు ఆధ్యాత్మిక సమతుల్యత అనే మూడు స్థాయిలలో ఆమె తన స్వీయ పరివర్తనను గ్రహిస్తున్నారు. రోగులకు వైబ్రేషన్లనుఇచ్చేముందుఈసేవ యొక్క ప్రత్యేకతను మననం చేస్తూరోగులకోసం గాఢంగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నప్పుడు ఆమె తన హృదయంలో స్వామి ప్రేమను అనుభవిస్తున్నారు.స్వామి చెప్పినట్లుగా “దిల్ మే రామ్ హాత్ మే కామ్,అనగా హృదయంలో నామస్మరణ చేతులతో దీనజన సేవ” ఈ విధంగా స్వామి నామస్మరణ చేయడం ద్వారా ఆమె నిస్వార్థ సేవలో నిమగ్నం అయినప్పుడు సానుకూల, పవిత్రమైన మరియు స్వస్థ పరిచే ప్రకంపనలను పొందగలుగుతున్నారు.
పంచుకున్న కేసు: