ప్రాక్టీషనర్ల వివరాలు 11597...India
ప్రాక్టీషనర్ 11597…ఇండియా మూడు ప్రతిష్టాత్మక పాఠశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసిన సుప్రసిద్ధ విద్యావేత్త ఐన ఈమె ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఫిల్. బి.ఇడి కలిగి ఉన్నారు. పేద పిల్లలకు విద్యను అందించడంలో సహాయపడటం ఆమె హృదయానికి నచ్చిన పని. ఈమె చేసిన మొదటి ఉద్యోగం సాయంకాల సమయాలలో వెనుకబడిన పిల్లలకు ఒక ఎన్ జీ వో తో కలిసి ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా పనిచేయడం. అనంతరం పాఠశాలలో పగటిపూట బోధనకు పరివర్తనం చెంది దాదాపు నాలుగు దశాబ్దాల పాటు బోధనలో కొనసాగేలా అవకాశం లభించింది. ఈమె అనేక సంవత్సరాలుగా భారత సంస్థ ASHA కు విద్యారంగంలో వాలంటీరుగా పాల్గొని ఓల్కాట్ మెమోరియల్ స్కూల్ లో పిల్లలకు సహాయపడ్డారు, మరియు బాల్వాడి (గ్రామీణ ప్రీ స్కూల్ పిల్లలు) పాఠ్యాంశాలను సుసంపన్నం చేయడానికి కృషి చేసారు. ఈ సంస్థలన్నీ అణగారిన పిల్లలు మరియు మురికివాడల పిల్లలకు సేవలు అందిస్తున్నాయి. 1984లో ఒక యువ ప్రధానోపాధ్యాయురాలుగా ఆమెకు చిరస్మరణీయమైన సంఘటన జరిగింది. ఒక పాఠశాల కార్యక్రమంలో మదర్ థెరీసా అనుకోకుండా ఆమెను పిలిచి తలపై తన అరచేతిని వేసి ఆశీర్వదించారు. విద్యా రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా 2013 లో రోటరీ క్లబ్ వారు “నేషన్ బిల్డర్ (జాతి నిర్మాణ కర్త)”అవార్డు తో సత్కరించారు.
ఈమె చిన్నతనం నుండి క్రమంతప్పకుండా వృద్ధాప్య గృహాలను సందర్శిస్తూ సేవలలో పాల్గొంటూ ఉండేవారు. అనంతరం ఈమె ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యగా సైనికుల కోసం “సంక్షేమ కేద్రాలకు” నాయకత్వం వహించేవారు. 2014లో విద్యావాహిని ప్రాజెక్టులలో కొంతకాలం పాల్గొన్నారు కానీ అప్పటి పని వత్తిడి కారణంగా తన భాగస్వామ్యం అరుదుగా ఉండేది. ప్రస్తుతం ఒక ఆధ్యాత్మిక సంస్థ సహకారంతో ఆశ్రమ వాసులకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించే సేవలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
ఈ ప్రాక్టీషనర్ భర్త ఆదర్శప్రాయుడైన ఆర్మీ ఆఫీసర్, షిరిడి బాబా భక్తుడు మరియు ఈమె కూడా ఈ ఆరాధనలో భర్తతో పాటు పాల్గొనేవారు. 2004లో భర్త అపస్మారక స్థితికి వెళ్ళిన సందర్భంలో ఈ విషాదం వీరి జీవితంలోకి ఊహించని రీతిగా సత్యసాయి భక్తుల ప్రవాహాన్ని తీసుకువచ్చింది. 2004లో గురుపూర్ణిమ వేడుకలకు ఆమె తన చిన్న కుమార్తెతో పాటు ప్రశాంతి నిలయం సందర్శించారు. అప్పటినుండి స్వామి వరదాభయ హస్తాలు ఆమె చుట్టూ చేరి తను మరియు తన కుటుంబ సభ్యులు స్వామి యొక్క దైవిక మార్గదర్శకత్వంలో నడుస్తూ అన్ని వేళల లోనూ వృత్తిపరంగాను మరియు ఆధ్యాత్మికంగానూ పురోగతి మరియు సంక్షేమం వైపు నడిపిస్తున్న అనుభూతి పొందసాగారు. 2006లో ఆమె భర్త యొక్క విషాదకరమైన నిష్క్రమణంతో అప్పటివరకూ ఆమె అనుభవించిన భౌతిక పరమైన కష్టాలు, శారీరక బాధలు, నిస్సహాయత, ముగింపుకు చేరి ఇతరుల బాధలను మరియు ఇబ్బందులను తగ్గించటానికి అప్పటినుండి ఆమె హృదయాన్ని తెరిచేందుకు దోహద పడ్డాయి. అయితే ఆ సమయంలో ఆమె తన సొంత ఇంటిని స్థిరీకరించేందుకు తన పిల్లలకు సహాయంగా ఉండటానికి ఎక్కువ సమయం వెచ్చించ సాగారు.
2015 సెప్టెంబర్ లో ఆమె బెంగుళూరుకు వెళ్ళిన తర్వాత వైట్ ఫీల్డ్ లోని బృందావనంలో వైబ్రియానిక్స్ క్లినిక్ వెలుపలగల ఒక నేమ్ బోర్డు ఆమె దృష్టిని ఆకర్షించింది. ఇది కేవలం భౌతికపరమైన తాత్కాలికమైన పరిచయం అయినప్పటికీ వైబ్రియానిక్స్ వైపు ఆమె ప్రయాణం 2017 లో అనుకోకుండా వెబ్సైట్ చూడడం ద్వారా ప్రారంభమైంది. ఆమె పదవీ విరమణకు ముందు ఫిబ్రవరి 2018 లో AVPగానూ, 13 నెలల తర్వాత VP గా మారారు. ఇప్పటివరకు అవసరమైనప్పుడు ట్రాన్స్క్రిప్షన్ వంటి పరిపాలన సహాయం కూడా అందించటంతో పాటు అనారోగ్యంతో ఉన్న 1000 మందికి పైగా రోగులకు అనేక రకాల వ్యాధులకు చికిత్స చేశారు. వైట్ ఫీల్డ్ ఆసుపత్రిలోని వైబ్రియానిక్స్ వెల్నెస్ క్లినిక్ లో డాక్యుమెంటేషన్ ప్రక్రియ లో ప్రాక్టీషనర్ 11210 కి క్రమం తప్పకుండా సహయపడుతూ వైబ్రియానిక్స్ వార్తాలేఖలలో “అదనంగా” అనే విభాగ నిర్వహణకు కూడా తోడ్పడుతున్నారు.
2019 మార్చి లో IASVP సభ్యురాలైన తరువాత ఈమె బెంగుళూరు లోని షిరిడి బాబా ఆలయంలోని వైద్య శిబిరంలో రోగులకు చికిత్స చేయడానికి ప్రాక్టీషనర్ 10354 తో కలిసి పనిచేయడం ప్రారంభించారు. చర్మం మరియు జీర్ణ సమస్యలు ఉన్నా చాలామంది రోగులు వైబ్రియానిక్స్ తో ఉపశమనం పొందుతున్నప్పటికి వారిలో ఆ తర్వాత కొన్ని ఇతర సమస్యలు బయటపడటం ఆమె గమనించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం దీనికి కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. రోగులకు ఈ విషయమై అవగాహన కల్పించడానికి ప్రతి అవకాశాన్ని ఆమె తీసుకుంటూ అవసరమైన నివారణలను కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు ప్రబలంగా ఉన్నప్పుడు ఆమె రెమిడీలను ఇవ్వసాగారు. ఈమె అనుభవం ప్రకారం శిబిరాల్లో చికిత్స పొందిన రోగులలో మూడింట ఒక వంతు మాత్రమే సూచించిన మోతాదు అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సమయానికి రీఫిల్ లను స్వీకరిస్తారు. అలాంటి వారే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. ఉదాహరణకు దీర్ఘకాలిక సోరియాసిస్ తో ఉన్న ఇద్దరు రోగులు ఇతర చికిత్సలు సహాయం చేయని పరిస్థితిలో వైబ్రియానిక్స్ తో అద్భుతమైన ఫలితాన్ని పొందారు.
రోగులకు వ్యాధి నివారణ అయ్యే విధానాన్ని తనింకా అర్ధం చేసుకోలేక పోయానని ఈ ప్రాక్టీషనర్ భావిస్తున్నారు. కొన్నిసార్లు వ్యాధి తగ్గిపోయినట్లు మంచి మార్పు ఉంటుంది,ఐతే చాలా తరచుగా రోగి జీవితంలో ఇతర మార్పులు కలిగి అవి వ్యాధి నివారణకు సహాయపడుతూ ఉండవచ్చు. రక్త ప్రసరణ వ్యవస్థ లో ఏర్పడే అవరోధాల వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయని ఆమె పేర్కొంటూ ఇటువంటి వారి విషయంలో CC3.7 Circulation జోడించడం వల్ల నివారణ వేగంగా ఉంటుందని ఆమె కనుగొన్నారు. ఈ ప్రాక్టీషనరు పేషంట్ల యొక్క వివరణాత్మక వ్యాధి చరిత్రలను భద్రపరుస్తారు. ఇవి రోగి తదుపరి సందర్శనలో సరైన చర్య తీసుకోవడంలో ఆమెకు సహాయపడతాయి, ప్రత్యేకించి పులౌట్ ఉన్న సందర్భాలలో ఇది ఎంతో ప్రయోజన కారి అనీ ఐతే 8%రోగుల్లో ఇలా జరుగుతుందని వీరి అనుభవంలో తెలుసుకున్నారు.
తన మెంటర్ లను సేవ చేసేసందర్భంలో ప్రత్యక్షముగా చూడటం అనేది ఈ ప్రాక్టీషనరుకు అంకితభావంతో పని చేయడం, రోగుల సంప్రదింపుల సమయంలో ప్రశాంత ప్రవర్తన కొనసాగించడం, ఈ సమయంలో 100% రోగితో హృదయపూర్వకంగా కనెక్ట్ కావడానికి సాయపడసాగింది. రోగుల పట్ల మరింత సానుభూతి చూపడానికి ఆమె తన వైఖరిలో మరింత మార్పును కలిగించుకోవాలని ఆమె భావిస్తున్నారు. రోజూ వ్యాయామం చేయడం, సంతులిత ఆహారం తినడం, ప్రతి పనిని తన శక్తి మేరకు ఉత్తమంగా చేయడం తద్వారా తనను తాను ఆరోగ్యంగా ఉంచుకుంటు రోగులకు మంచి రోల్ మోడల్ గా ఉంటున్నారు. ఆమె తనను తాను ప్రాక్టీషనర్ గా కంటే ఒక లైఫ్ కోచ్ గా చూస్తున్నారు అందువల్ల ఆమె రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వడం సహజంగానే ఆమెకు అలవాటయింది. దీనికి అనుగుణంగా ఆమె రోగులలో కొందరు (సుమారు 10%)ఆమె సూచించే ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడానికి మానసికంగా సిద్ధంగా ఉంటున్నారు.
ప్రాక్టీషనర్ అభిప్రాయం ప్రకారం సమాజంలోని అన్ని వర్గాల రోగులు అల్లోపతి మందుల పట్ల అసంతృప్తి గానూ, వ్యతిరేక భావనతో ఉన్నారు. ఎందుకంటే దీని యొక్క దుష్ప్రభావాలు మరియు సమస్యల గురించి వారికి అవగాహన ఉంది. అందుచేతనే వైబ్రియానిక్స్ అనేది అందరూ మెచ్చే ప్రస్తుత కాలానికి సరిపడా చక్కని ఔషధం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
పంచుకున్న కేసులు: