అభ్యాసకురాలి వివరాలు 02892...Australia
నర్సింగ్ లో మరియు ప్రసూతివైద్యం లో నాకు నేపధ్యముంది.నేను ప్రస్తుతం స్వామీ యొక్క ఐదు మానవతా విలువలను భోధించే ఉపాధ్యాయులకు సహకారిగా శిక్షణ పొందుతున్నాను.నేను స్వామి యొక్క ఆచరణాత్మక ఆధ్యాత్మిక బోధనల ఆధారంగా ఒక పుస్తకం కూడా రాస్తున్నాను.
నేను 1999 నుండి స్వామీ భక్తురాల్ని.2013 గురుపూర్ణిమ సందర్భంలో నాకు వైబ్రియానిక్స్ గురించి తెలిసి ఇదే నేను చేయవలసిన సాధనయని నాకు అనిపించింది.నా దరఖాస్తు పత్రాన్ని డా.అగ్గర్వాల్ గారికి సమర్పించాను.నన్నుఆస్ట్రేలియాకి వెళ్లి ఆన్లైన్ కోర్సు పూర్తిచేశాక తిరిగి వచ్చి మిగతా కోర్సు పూర్తి చేయమని చెప్పారు.నాకు ఈ సేవ ద్వారా అందరికి సహాయపడాలని అనిపించి నవంబర్ నెల లో స్వామి పుట్టినరోజు సమయంలో తిరిగి వచ్చి కోర్సు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను.2013లో నేను కోర్సు పూర్తి చేసాను. 2015 నవంబర్ లో సీనియర్ కోర్సు చేయడానికి తిరిగి పర్తి వెళుతున్నాను. భవిష్యత్లో శిక్షకుల కోర్సు చేయాలన్నది నా లక్ష్యం. స్వామి సేవ చేయగలగడం నా అధ్రుష్టమని నేను భావిస్తున్నాను.సేవ చేయడం వల్ల స్వామీ దీవెనలు ఎంతగానో నాకు లభ్యమవుతున్నాయి.
సాయి వైబ్రియానిక్స్ చికిత్స తీసుకున్న పేషంట్లలో చూసే అద్భుతాలన్నిటికీ మూల కారణం స్వామీ యొక్క దివ్యానుగ్రహం మాత్రమే. నేను ఆస్ట్రేలియాలో సాయి వైబ్రియానిక్స్ సహ సమన్వయకర్తగా ఉండే అవకాశం కూడా నాకు లభ్యమైంది.ఆస్ట్రేలియా చాలా పెద్ద దేశం కావడం వల్ల అభ్యాసకులు ఎక్కువ సంఖ్యలో ఉండడం ఎంతో అవసరం.
ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో ఉన్న సాయి వై బ్రియానిక్స్ పేషంట్లకి చికిత్స అందిస్తున్నాను.నేను ఫోన్,స్కయిప్ ,ఈమెయిలు ద్వారా పేషంట్లను సంప్రదించి మందుల్ని మెయిల్లో పంపిస్తున్నాను. సాయి భక్తులు వైబ్రో మందుల్ని భక్తితో మరియు పూర్తి విశ్వాసంతో తీసుకుంటున్నారని, ఇతరులు వెంటనే ఉపశమనం ఆశిస్తున్నారని నా అనుభవంలో నేను చూసాను. ఉపశమనం కలుగడానికి కొంత సమయం పట్టవచ్చని నేను నా పేషంట్లకు చెప్తాను.ఉదాహరణకు 25 ఏళ్ళగా బైపోలార్ డిసార్డర్ తో భాదపడుతున్న ఒక వ్యక్తికి పూర్తిగా నయంకావడానికి ఒక సంవత్సరం పట్టింది కాని అతను తీసుకుంటున్న 18 అల్లోపతి మందుల్నుంది విముక్తి పొందాడు. 'సాయి వైబ్రియానిక్స్ మానవజాతి కోసం సిద్ధంగా ఉంది, కానీ మానవాళి సాయి వైబ్రియానిక్స్ కోసం సిద్ధంగా లేదు' అని మాకు చెప్పబడింది, కాని స్వామీ ప్రేమ,శ్రద్ధ కొరకు తపించే అనేక మంది, పేషంట్లను నన్ను సంప్రదించడానికి పంపిస్తునే ఉంటారు. వారందరు కూడను ఈ వైద్యం ఉచితంగా ఇవ్వబడుతున్నందుకు ఎంతో క్రుతజ్ఞ్యత చూపారు.
నేను "యు కేన్ హీల్ యువర్ లైఫ్"అన్న లూయీ హే పుస్తకంలో అందజేసే 'కొత్త మానసిక ఆలోచనా విధానాలు' నేను సాయి వైబ్రియానిక్స్ చికిత్సలో ఉపయోగపరుస్తున్నాను.నేను పేషంటు కోసం ఎంపిక చేసిన కొత్త ఆలోచనా విధానాన్ని ఒక రంగుల కాగితం మీద రాసిస్తాను.అదే కాగితం మీద రంగుల సీతాకోకచిలుక స్టికర్ని కూడా అతికిస్తాను.నేను నా పేషంట్లను ఈ మంత్రాన్ని మందు తీసుకుంట్టున్నపుడు లేదా ఇంకెప్పుడైనా చెప్పుకోమని సలహా ఇస్తున్నాను.
నేను ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో నివసిస్తున్నాను.ఈ కేంద్రం వారానికి రెండు సార్లు తెరిచి ఉంటుంది. ఈ కేంద్రాన్ని సందర్శించడానికి అనేక మంది వస్తూంటారు.వీళ్ళలో అనేక మందికి వైబ్రో చికిత్స అవసరం ఉంటోంది కనుక అనేక మంది పేషంట్లకు సేవ చేసే అవకాశం నాకు లభిస్తోంది.
స్వామీ నాపై చూపించిన అపార కరుణ నేను మాటల్లో చెప్పలేను.స్వామి సేవ చేయడం నా అద్రుష్టంగా నేను భావిస్తున్నాను. "నా పని మీరు చేస్తే మీ పని నేను చేస్తాను" అని స్వామీ అన్న మాటలు ఎంత నిజమో.ఈ "నిశబ్ద విప్లవం"లో పాల్గొంటున్న సాయి వీరులైన మనమందరము ఎంతో ధన్యులం.