చర్మం మీద పుండ్లు మరియు దురద 02892...Australia
ఒక 47 ఏళ్ళ వ్యక్తి రెండేళ్ళగా తన చర్మం మీద నొప్పి మరియు మంటతో కూడిన ధద్దుర్లుతో భాధపడేవాడు. ఈ చర్మవ్యాధి వలన అతనికి చర్మం మీద సూదులతో గుచ్చుతున్నట్లు ఉండేదని చెప్పాడు. రెండు నెలలుగా దద్దుర్లు అతని శరీరమంతయు వ్యాపించడంతో అతని అసౌకర్యం మరింత పెరిగింది. (ఈ క్రింద ఇవ్వబడిన పటంలో (ఎడమ) అతని ఎడమ భుజం మరియు చేయి చూడండి)
అతను అల్లోపతి మరియు అనేక రకాల లేపనాలు వాడాడు కాని ఉపశమనం కలుగలేదు.
2015 ఫెబ్రవరి 1న అభ్యాసకుడు అతనికి ఈ క్రింద వ్రాసిన మందులు ఇచ్చారు
CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.4 Stings & Bites + CC21.6 Eczema...TDS
చర్మం పైన రాయడానికి ఇవే మందుల్నివిబుతి మరియు ఆలివ్ ఆయిల్లో కలిపి అతనికి ఇవ్వబడింది. ఈ మందుల్నిరోజువారి రెండు సార్లు(BD) చర్మం మీద రాయమని అతనికి సలహా ఇవ్వబడింది.
రెండు రోజుల తరవాత ఫెబ్రవరి 3న అతనికి మంట మరియు దురద తగ్గినట్లు తెలిపాడు. ఈ మందులు అద్భుతంగా పనిచేసి అతని చర్మ వ్యాధి ఒక నెల రోజులలో పూర్హ్టిగా తగ్గిపోయింది. క్రింద ఇచ్చిన పటం (కుడి) చూడండి.