ధీర్గకాలిక వీపు నొప్పి మరియు శయాటికా 02892...Australia
ఇరవై ఏళ్ళగా వీపు మరియు మెడ నొప్పితో భాదపడుతున్న ఒక 48 ఏళ్ళ మహిళ, ఒక సాయి భక్తుడు ద్వారా అభ్యాసకుడిని సంప్రదించింది. ఆమెకు శయాటికా నొప్పి మరియు పాదాలలో మండుతున్న సంచలనం కూడా ఉండేవి. దీనికి కారణం ప్రసవ సమయంలో ఆమెకు ఇచ్చిన ఎపిడ్యూరల్ వలన అయ్యుండచ్చని ఆమె చెప్పింది.19 ఏళ్ళ వయస్సప్పుడు ఒక కారు ప్రమాదంలో ఆమె కోకిక్స్ (వెన్నుపూసలు కలిసి ఏర్పడే త్రికోణాకారపు చిన్న ఎముక) దెబ్బ తిందని చెప్పింది. ఆమె ఉపశమనం కొరకు ఇన్ని సంవత్సరాలు యోగా, పైలేట్స్, ఫిజియోథెరపీ, స్విమ్మింగ్ మరియు అల్లోపతి మరియు హోపియోపతి మందులు ప్రయత్నించారు కాని సఫలితం లభించలేదు. ఫెబ్రవరి 18 న ఆమెకు క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి
CC18.5 Neuralgia + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS
5 వారాల తరువాత ఆమె తిరిగి మార్చి 29 న అభ్యాసకుని సంప్రదించినప్పుడు ఆమె రోగ లక్షణాలలో ఏ విధమైన మార్పులేదని, అపార్ధం వలన ఆమె మందుల్ని సరైన మోతాదు తీసుకోవడంలేదని తెలిసింది. ఆమె అపార్ధం సరి చేసి ఆమె మనోవ్యాకులతతో భాదపడుతున్నట్లు తెలపడంతో, ఆమెకు మునుపు ఇచ్చిన మందులో CC15.1 Mental & Emotional tonic చేర్చి ఇవ్వడం జరిగింది.
ఏడు వారాల తరువాత, మే 20న, ఆమె తిరిగి సంప్రదించినప్పుడు 20 సంవత్సరాలలో మొదటిసారిగా ఆమెకు నొప్పినుండి ఉపశమనం కలిగిందని చెప్పింది. ఆమెకు ఈ రోగ లక్షణాలు పూర్తిగా తగ్గినప్పటికీ, దీర్ఘకాలంగా ఈ సమస్యలు ఉండడంవలన అభ్యాసకుడు ఆమెను వైబ్రో మందులు మరి కొద్ది కాలం పాటు తీసుకొమ్మని చెప్పారు. ఏప్రిల్ 2015 నాటికి, ఆమె వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవడం కొనసాగిస్తోంది. ఆమె భాగస్వామి ఊపిరితిత్తుల క్యాన్సర్తో భాద పడుతున్న కారణంగా ఆమె అభ్యాసకుడిని మద్దతు మరియు కౌన్సిలింగ్ కొరకు సంప్రదిస్తోంది. ఆమె భర్తకు ప్రత్యామ్నాయ చికిత్స తీసుకోవడం ఇష్టం లేదు.