Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 15 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2024
అవలోకనం

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ అగర్వాల్ 2023లో ఇన్‌స్టిట్యూట్ (సంస్థ) మరియు ప్రాక్టీషనర్లు కలిసి చేసిన సమిష్టి కృషి, సాధించిన ముఖ్యమైన విజయాల గురించి సమగ్ర అవలోకనాన్ని అందిస్తున్నారు. 2024లో, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ప్రేమను మరియు స్వస్థత ప్రసాదించే వైబ్రేషన్స్ ను మరింత విస్తృతంగా చేరవేయడానికి మన సేవా పరిధిని విస్తరించాలని, అలాగే స్వామి బోధించిన మార్గంలో ప్రతి క్షణాన్ని పవిత్రంగా గడపాలని ఆయన మనందరినీ సంకల్పం చేయమని పిలుపునిస్తున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

దృష్టాంత చరిత్రలు

ఈ సంచికలో 12 ఆసక్తికరమైన కేసులు పంచుకోబడ్డాయి: చర్మ అలర్జీ), శాశ్వత దంతం ఆలస్యంగా రావడం, మోకాలి & పిక్క కండరాల నొప్పి, తెల్లబట్ట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వీజింగ్ (పిల్లికూతలు), మైగ్రేన్, బహిష్టు సంబంధిత రుగ్మతలు, శ్వాసకోశ అలర్జీ, నిద్ర సంబంధిత రుగ్మత, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, చర్మ దురద, పోస్ట్-మెనోపాజల్ హైపర్‌పిగ్మెంటేషన్ (మెనోపాస్ అనంతరం చర్మం నల్లబడడం), అలసట, కోవిడ్ అనంతరం గొంతు స్వరం కోల్పోవడం.

దృష్టాంతములు చదవండి

సాధకుని వివరములు

ఈ సంచికలో కళాత్మక ప్రతిభ కలిగిన ఇద్దరు ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. వీరిద్దరికీ చిన్ననాటి నుంచే తోటపని మరియు వైద్య సేవ పట్ల ఆసక్తి ఉంది. 2000 సంవత్సరం నుండి వివిధ సేవా కార్యక్రమాలలో చురుకుగా స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. 2021 నుండి వీరిద్దరూ ఎంతో ఉత్సాహంతో వైబ్రియోనిక్స్ సేవ చేస్తున్నారు. తమ అనుభవంలో ఆసక్తికరమైన కేసులు మరియు అత్యుత్తమ ఫలితాలను అందించిన కాంబోల గురించి ఈ సంచికలో పంచుకుంటున్నారు.

సాధకుని వివరములు చదవండి

ప్రశ్నలు జవాబులు

ఈ సంచికలో మీరు ఈ క్రింది అంశాల గురించి తెలుసుకోవచ్చు: ఒక రెమెడీ లో తక్కువ సంఖ్యలో కాంబోలు ఉంచాలని ఎందుకు సూచిస్తారు? అలాగే ఇబి లో 13 కాంబోలు ఉండటంలోని ప్రాముఖ్యత ఏమిటి? క్యుడియెస్ మరియు బిడి మోతాదులు సాధారణంగా ఎందుకు సూచించబడవు? కాలుష్యం వల్ల కలిగే హానికర ప్రభావాలను ఎదుర్కొనే రెమెడీలు ఏమిటి? రోగి రెమెడీ నీరు లేదా పిల్ ను నాలుక కింద ఉంచకుండా పొరపాటున మింగివేసినా, రెమెడీ పనిచేస్తుందా? మీ 108సిసి బాక్స్ను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రీచార్జ్ (పునఃశక్తివంతం) చేయాలని ఎందుకు సూచిస్తారు? యెస్ ఆర్ హెచ్ వి పి నుండి రెమెడీ బాటిల్‌ను వెల్ నుండి బయటకు తీసిన తరువాత, దానిని ఎక్కడ ఉంచాలి? అలాగే యెస్ ఆర్ హెచ్ వి పి +మరియు రెమెడీ బాటిల్ మధ్య కనీసం ఎంత దూరం ఉండాలి?

పూర్తి వ్యాసం చదవండి

దివ్య వైద్యుని దివ్య వాణి

బాధలను నివారించి, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించడానికి మనం ఏ విటమిన్లను జీవితంలో అలవర్చుకోవాలో, అలాగే ప్రశంసలు వచ్చినా, విమర్శలు ఎదురైనా వాటికి చలించకుండా అత్యుత్తమంగా సేవ చేయడానికి మనలో శక్తిని ఎలా పెంపొందించుకోవాలో స్వామి ప్రేమపూర్వకంగా మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

ప్రకటనలు

పుట్టపర్తిలో జరగబోయే శిక్షణా శిబిరాలు.

పూర్తి వ్యాసం చదవండి

అదనంగా

విటమిన్లు సమృద్ధిగా ఉన్న సంపూర్ణ ఆహారం తీసుకోండి – ఆరోగ్యానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అనే ఆరోగ్య వ్యాసంలో విటమిన్ల యొక్క స్వభావం, ప్రాముఖ్యత, వాటి రకాలు, పాత్ర మరియు ఉపయోగాల గురించి వివరించబడింది. ఇందులో నాలుగు కొవ్వులో కరిగే విటమిన్లు అయిన ఏ, డి, ఈ, కె అలాగే తొమ్మిది నీటిలో కరిగే విటమిన్లు అయిన విటమిన్ సి మరియు బి-విటమిన్స్ గురించి సంక్షిప్త వివరణ ఇవ్వబడింది. అంతేకాకుండా, విటమిన్ల నష్టం జరగకుండా ఎలా కాపాడుకోవాలి, వాటి నుండి గరిష్ట ప్రయోజనం ఎలా పొందాలి అనే విషయాలపై ఉపయోగకరమైన సూచనలు కూడా ఉన్నాయి. భారతదేశంలోని పుట్టపర్తి మరియు ఫ్రాన్స్లో నిర్వహించిన శిక్షణా శిబిరాలు, అలాగే ఢిల్లీలో జరిగిన సెమినార్. స్వామి వారి 98వ జన్మదినోత్సవం సందర్భంగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన క్యాంప్స్. ప్రేమతరువు వృక్షారోపణ కార్యక్రమానికి అనుబంధంగా మొక్కలకు పంపిణీ చేసిన మరియు వాటిపై పిచికారీ చేసిన రెమెడీలు. తీవ్రమైన తేనెటీగలు కుట్టడం నుండి త్వరిత ఉపశమనం పొందిన ఒక ఆసక్తికరమైన అనెక్డోట్ (స్ఫూర్తిదాయక సంఘటన). ఇద్దరు ఆదర్శవంతమైన సేవకులు మరియు అంకితభావం కలిగిన ప్రాక్టీషనర్లకు అర్పించిన నివాళి.

పూర్తి వ్యాసం చదవండి