Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 15 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2024
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ప్రశాంతి నిలయం ఇది అత్యంత ఉత్సాహ భరితమైన సమయాల్లో ఒకటి - సెలవు కాలము. సంవత్సరంలో ప్రస్తుత పవిత్ర కాలంలో క్రిస్మస్ జరుపుకోవడానికి మరియు నూతన సంవత్సర ఆరంభాన్ని ఆనందముగా గడపడానికి అనేక దేశాల నుండి విభిన్న మత విశ్వాసాలు, సంస్కృతులు గల ప్రజలు ప్రశాంతి నిలయం చేరతారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన భక్తులు చక్కగా ఏర్పాటు చేసి, విశేషంగా అలంకరించిన అలంకరణతో ఆశ్రమం అంతా ఎంతో శోభాయమానంగా ఉంది. తూర్పు ప్రశాంతి ఎదురుగా 35 అడుగుల ఎత్తైన క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేశారు. ప్రేమ, శాంతి, కృతజ్ఞతతో ఆశ్రమము లోని గాలి అంతా నిండిపోయి ఉంది. స్వామి అంటారు“సేవా మరియు ప్రేమను మీ జీవిత ఆదర్శంగా స్వీకరించి ఈ క్షణం నుండి మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. మీకు ఇదే నా ఆశీర్వాదము మరియు దీవెన”  శ్రీ సాయి బాబా నూతన సంవత్సర ప్రసంగం 2000 జనవరి 1. మనలో ప్రతీ ఒక్కరూ పరిణామం చెందడానికి, అభివృద్ధి చెందటానికి ఇదే సరైన అవకాశం. 2024 లో ఎక్కువ జన బాహుళ్యానికి ప్రేమ మరియు స్వస్థత ప్రకంపనలను వ్యాపింప చేసేందుకు తమ పరిధిని విస్తరించాలని ప్రాక్టీషనర్లు అందరిని నేను వినమ్రతతో అభ్యర్థిస్తున్నాను. 

2023 అనే దర్పణంలో చూసుకుంటే మనం కృతజ్ఞతతో ఉండటానికి మరియు దాని నుండి నేర్చుకోవడానికి చాలా ఉంది.

  • సాయి వైబ్రియానిక్స్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SVIRT ను మనం విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్నాము. ఇది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్స్ IASVP ను భర్తీ చేస్తుంది. ఇప్పటినుండి SVIRT మన పరిశోధనలు నిర్వహించడానికి మరియు శిక్షణను కొనసాగించడానికి మన మిషన్ యొక్క ప్రధాన వేదికగా మారాలని ఆకాంక్షింప బడుతోంది. 
  • 2023లో మరో ముఖ్యమైన మైలు రాయి భారతదేశంలో మొట్టమొదటిసారిగా జులై 22 వ తేదీన విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి వైబ్రియానిక్స్ కాన్ఫరెన్స్. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటికి చెందిన ప్రాక్టీ షనర్లను ఒకచోట చేర్చింది.    ప్రాక్టీషనర్లు మరియు ఉత్సాహవంతులైన వాలంటీర్లను ఏకం చేసిన ఈ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ విజయం భారత దేశంలోని ఇతర రాష్ట్రాలు మరియు ప్రాంతాలవారు అనుసరించడానికి ప్రేరణ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుతం దేశం నలు మూలల నుండి వైబ్రియానిక్స్  ప్రాక్టీషనర్లను ఒక చోట చేర్చే ఉద్దేశ్యంతో జాతీయ సదస్సుకు పునాది వేయడమే మన లక్ష్యం.   
  • వైబ్రియానిక్స్ వెల్నెస్ క్యాంపుల సంఖ్య ముఖ్యంగా పట్టణములు, మురికివాడలు, మరియు గ్రామీణ ప్రాంతాల్లో క్రమంగా పెరుగుతున్నట్టు నివేదించడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. 109 ప్రదేశాల్లో 1367 శిబిరాలు నిర్వహించబడి సుమారు 57,000 మంది రోగులకు వైబ్రియానిక్స్ రెమిడీలు అందించబడడం ఒక ఆద్భుతమైన పరిణామం. స్వామి అనుగ్రహించిన వైబ్రో రెమిడీల ద్వారా అత్యంత అణగారిన వ్యక్తులను చేరుకోవడానికి మరియు వారికి స్వాంతన కలిగించడానికి రాబోయే సంవత్సరాల్లో తమను తాము హృదయపూర్వకముగా అంకితం చేసుకోవాలని ప్రాక్టీషనర్లు అందరిని నేను అభ్యర్ధిస్తున్నాను.  
  • సాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రశంసనీయమైన చొరవకంటే మన స్వామికి నివాళులర్పించడానికి మంచి మార్గం ఏముంది.  2025 లో భగవాన్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా లక్షలాది చెట్లతో భూమాతను అలంకరించేందుకు వారు కృషి చేస్తున్నారు. భారతదేశంలోని సత్య సాయి సంస్థ మరియు సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ల మధ్య ఒక ప్రత్యేకమైన సహకారాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మరియు ఢిల్లీ ఎన్సీఆర్ నుండి విశేషమైన చొరవ చూపడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాక్టీషనర్లు సాయి వైబ్రియానిక్స్ సంరక్షణలో చెట్లను నాటడం మరియు సంరక్షించడంలో ఈ ప్రయత్నాలకు సహకరిస్తూ కొనసాగుతున్న కార్యాచరణ 2024 లో మరింత వేగవంతం కావాలని ఆశిస్తున్నాను.   
  • సంవత్సరం అంతా కూడా IB పంపిణీ కొనసాగింది. కొత్త కోవిడ్ వేరియంట్ రావడం తో ఈ పంపిణీ మరింత ఊపు అందుకుంది.

ఎప్పటిలాగే ఒక సంస్థగా మేము కార్యకలాపాలలో కొనసాగుతున్నాము, 2024 నాటికి SVIRT ఆధ్వర్యంలో పరిశోధనపై మరింత ఎక్కువ దృష్టి పెడతాము.

చివరిగా 2024 ను స్వాగతిస్తూ స్వామివారి సందేశాన్ని మనం ప్రతిబింబించుకుందాం- “కొత్త సంవత్సరం లేదా కొత్త నెల తనతో కొత్త ఆనందాన్ని లేదా దుఃఖాన్ని తీసుకురాదు, ప్రతీ సెకనూ కొత్తదే, ఎందుకంటే ఇది కాలగమనాన్ని తెలియజేస్తుంది. వాస్తవానికి సెకండ్లు నిమిషాలుగా, రోజులుగా, మరియు నెలలుగా మారితే ఏర్పడేదే సంవత్సరం. ప్రతీ క్షణాన్ని కొత్తగా ఆదరించినప్పుడే కొత్త సంవత్సరం యొక్క కొత్తదనం వ్యక్త మవుతుంది. ప్రతీక్షణాన్ని ఎంత పవిత్రంగా గడుపుతామో అదే సంవత్సర ఫలాన్ని నిర్ణయిస్తుంది. మీరు పవిత్రమైన జీవితాన్ని గడపాలని మరియు పవిత్రమైన అనుభవాలను పొందాలనుకుంటే మీరు పవిత్రమైన చర్యలలో నిమగ్నమై ఉండాలి”...శ్రీ సత్యసాయి దివ్య వాణి,  సంపుటి 31 జనవరి 1 1998.  

 2024 ను ఒక ఫలవంతమైన సంవత్సరంగా ఆస్వాదించడానికి మనమందరం ప్రతీ రోజు “ప్రేమతో రోజును ప్రారంభించాలని, ప్రేమతో రోజంతా గడపాలని ప్రేమతో రోజును నింపాలని చివరికి ప్రేమతోనే రోజును ముగించాలని” సంకల్పించుకుందాం.

ఈ 2024 మిమ్మల్ని సంతోషంగా ఆరోగ్యంగా సుసంపన్నంగా ఉంచాలని కోరుకుంటూ,

 సాయికి ప్రేమ పూర్వక సేవలో,

జిత్ కె అగ్గర్వాల్.

చర్మము పై ఎలర్జీ 18001...भारत

26 ఏళ్ల మహిళ ముఖంపై తీవ్రమైన చర్మపు దద్దుర్లు ఏర్పడి ఎరుపుదనం, కొంచం వాపు మరియు దురదతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం బ్యూటీ పార్లర్ కు వెళ్లిన వెంటనే ఈ దద్దుర్లు బయటపడ్డాయి. వైద్యులు సూచించిన అల్లోపతి మాత్రలు మరియు లేపనం ఉపయోగించడం ప్రారంభించారు కానీ ఇవి పాక్షిక ఉపశమనాన్ని మాత్రమే ఇచ్చాయి, అదికూడా  తాత్కాలికంగానే ఉంది. ఈ చికిత్స సమయంలో హోమియోపతి ప్రయత్నించారు కానీ ఉపశమనం లభించలేదు. వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న వెంటనే ఆమె ఇతర చికిత్సలు పిలిపివేయాలని నిర్ణయించుకున్నారు, ఎందుకంటే ఒక వారంలో ఆమె వివాహ వేడుకకు హాజరు కావలసి ఉన్నందున సత్వర పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు.

2022 జనవరి 27 ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది: 

CC8.1 Female tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.11 Wounds & Abrasions...ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున గంట వరకు అనంతరం 6TD, బాహ్య అనువర్తనం కోసం నీటితో …BD 

మూడు రోజులలో రోగిని ఆశ్చర్య, ఆనందానికి గురి చేస్తూ ఎరుపు, వాపు, దురదలలో 50% మెరుగుదల కనిపించింది, అలాగే ఇతర లక్షణాలు కూడా తగ్గాయి, చర్మం సాధారణ స్థితికి వచ్చింది. బాహ్య అనువర్తనం ఆపి నోటి ద్వారా తీసుకునే రెమిడీని తగ్గించడం ప్రారంభించారు. ఎలాంటి ఆందోళన లేకుండా పెళ్లికి హాజరవుతున్నందుకు ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నోటి ద్వారా తీసుకునే రెమిడి ఫిబ్రవరి 16న ఆపివేయబడింది, 2023 నవంబర్ నాటికి ఎటువంటి పునరావృతం లేదు.  

ఆలస్యమైన శాశ్వత దంతాలు 18001...भारत

వైబ్రియానిక్స్ క్యాంపు సమయంలో ఒక ఎనిమిదేళ్ల బాలిక చాలా దిగులుగా ప్రాక్టీషనర్ ను కలసి తనకు 2 సంవత్సరాల క్రితం దవడ ముందు వైపు వైభాగపు కోత ఏర్పడక పోవడంతో శాశ్వత దంతాలు బయటికి రాలేదని చెప్పింది. అల్లోపతి మందులు సంవత్సరం పాటు వాడినా ఫలితం లేకుండా పోయింది. తోటి పిల్లలు ఆమెను ఎగతాళి చేయడం మరింత బాధ కలిగిస్తోంది. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆశతో కూడిన భరోసా కల్పిస్తూ ప్రాక్టీషనర్ 2022 డిసెంబర్ 21 క్రింది రెమిడీ అందించారు: 

CC9.4 Children's diseases* + CC10.1 Emergencies + CC11.6 Tooth infections + CC12.2 Child tonic...TDS 

సరిగ్గా నెల తర్వాత తదుపరి శిబిరంలో గత రెండు సంవత్సరాలుగా ఆందోళన కలిగించిన రెండు చిగుళ్లలో కోత ఏర్పడి దంతాలు ఏర్పడు తున్నాయనే శుభవార్తను తెలపడానికి బాలిక ఉత్సాహంగా ప్రాక్టీషనర్ వద్దకు వచ్చి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

*ప్రాక్టీషనర్ కు ఈ కొంబో ను జోడించాలని అంతరంగం నుండి బలంగా అనిపించింది!

మోకాలు మరియు పిక్కలలో నొప్పి 18001...भारत

75 ఏళ్ల మహిళ రెండు కాళ్ళలో మోకాలు మరియు పిక్కలలో నిరంతరం కండరాల నొప్పితో బాధపడుతున్నారు. నడుస్తున్నప్పుడు నొప్పి స్వల్పంగానే ఉంటుంది కానీ రాత్రి సమయంలో కాళ్లు చాచడం కష్టంగా మారింది. ఆమె కాళ్ళకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల కొంత ఉపశమనం అనుభవించే వారు. అప్పుడప్పుడు నొప్పి భరించ లేనప్పుడు సూచింపబడిన పెయిన్ కిల్లర్ తీసుకుంటూ ఉండేవారు. ప్రాక్టీషనర్ నుండి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఆమె ఆలస్యం చేయకుండా వెంటనే సంప్రదించగా 2022 జూన్ 10 ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది: 

CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC20.2 SMJ

pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue…TDS మౌఖికంగా మరియు కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనముగా BD 

రెండు వారాల తర్వాత పిక్కల కండరాల నొప్పి మరియు కాళ్ళను సాగదీయగలిగే సామర్థ్యం 40% మెరుగుపడింది. అర్ధరాత్రి ఎప్పటిలాగే తన మసాజ్ కొనసాగించారు. జూలై 10 నాటికి ఆమె లక్షణాల్లో 90% ఉపశమనం కలగడంతో మౌఖిక రెమిడీ యొక్క మోతాదు OD కి తగ్గించబడింది. ఆయిల్ మసాజ్ ఆగిపోయింది. మరో వారం తర్వాత తను పూర్తిగా నొప్పి లేకుండా ఉన్నట్లు ఆనందంగా తెలియజేశారు. ఆగస్టు 5న రెమిడీ ఆపే వరకు మోతాదు క్రమంగా తగ్గించబడింది.

2023 నవంబర్ నాటికి చికిత్సకు ముందులా కాకుండా ఇప్పుడు తన ఇంటి పనులు అసౌకర్యం ఏమీ లేకుండా చేయగలుగుతూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలియ జేసారు. 

తెల్ల కుసుమ వ్యాధి 11633...भारत

వృత్తి రీత్యా దర్జీ పని చేసే (సీమ్ స్ట్రెస్*) 36 ఏళ్ల స్త్రీ 2022 సెప్టెంబర్ నుండి 4 నెలలుగా ప్రతీరోజూ దుర్వాసనతో కూడిన తెల్లటి యోని ఉత్సర్గాన్ని కలిగి ఉన్నారు. ఆమెకు యోని వద్ద దురద కూడా ఏర్పడి తన పనికి అంతరాయం మరియు అసౌకర్యానికి గురి చేసింది. నవంబర్లో డాక్టర్ గర్భాశయంలో పుండు ఉన్నట్లు అనుమానిస్తూ పెల్విక్ స్కాన్ సిఫారసు చేశారు. స్కాన్ కు భయపడి సూచించిన మందులను మాత్రమే ఎంచుకున్నారు. కానీ తిమ్మిరి మరియు అస్పష్ట మైన దృష్టి వంటి దుష్ప్రభావాల కారణంగా రెండు రోజుల్లో వాటిని నిలిపివేశారు. పక్కింటి వారు వైబ్రియానిక్స్ గురించి తెలియ చేయగా ఆమె ప్రాక్టీషనర్ ను సంప్రదించి తన సమస్య వెల్లడించి పని వత్తిడి కారణంగా తగినంత నీరు తీసుకోవడం లేదని వెల్లడించారు. 2023 జనవరి 22 ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:  

CC8.5 Vagina & Cervix + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.7 Fungus...TDS 

నీటి వినియోగాన్ని క్రమంగా పెంచాలని ఆమెకు సూచించారు. ఫిబ్రవరి చివరి నాటికి అన్ని లక్షణాల్లో 30% మెరుగుదల ఉంది, మార్చి చివరి నాటికి ఇది 80% నకు చేరింది. ఏప్రిల్ 10 నాటికి రోగ లక్షణ రహితంగా మారి అసౌకర్యం లేకుండా తన టైలరింగ్ పనిని కొనసాగిస్తున్నారు. మొతాదు పది రోజుల పాటు OD కి తగ్గించబడింది మరియు మే 25న ఆపివేసే వరకు క్రమంగా తగ్గించబడింది. 2023 నాటికి నవంబర్ నాటికి ఎటువంటి పునరావృతం లేదు.

 *జీవనం కోసం బట్టలు, వస్త్రములు కుట్టే స్త్రీ

శ్వాస అందక పోవడం, పిల్లి కూతలు 11633...भारत

55 ఏళ్ల వ్యక్తి గత 24 సంవత్సరాలుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు పిల్లికూతలతో బాధపడుతున్నారు. ప్రారంభంలో ఈ లక్షణాలు చలికాలంలో మరియు దుమ్ముకు గురి కావడం వలన ఏర్పడి 1998లో అలర్జీ బ్రౌన్కైటీస్ నిర్ధారణకు దారి తీసింది. చికిత్స ఆస్థాలిన్ మాత్రలతో ప్రారంభమై తర్వాత బ్రాంఖో డై లేటర్ మరియు స్టెరాయిడ్ (నోటికి మరియు ఇంజక్షన్ ద్వారా) ఇచ్చారు కానీ పరిమిత ఉపశమనం లభించింది. 2002-2003లో అతను లైవ్ ఫిష్ ట్రీట్మెంట్ వంటి సంప్రదాయ పద్ధతులు ప్రయత్నించారు కానీ అది కూడా ఫలించలేదు. 2007 నాటికి ఊపిరి ఆడక పోవడం పిల్లి కూతలు అనేవి రోజువారి సంఘటనగా మారి మెట్లు ఎక్కడం, తలస్నానం చేయడం, దోసకాయ, ఐస్ క్రీమ్ వంటి కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా సమస్య మరింత తీవ్రమయ్యేది. పడుకోవడం కూడా అసౌకర్యాన్ని కలిగించి రాత్రంతా కూర్చున్న స్థితిలో నిద్రపోయేలా చేస్తోంది. అతనికి ఆస్థాలిన్ ఇన్హేలర్ సూచించగా అది పది నిమిషాల్లో ఉపశమనము కలిగించి రోజంతా రోగ లక్షణరహితంగా ఉండ సాగారు. అతను ఒక్క మోతాదు దాటవేసినా అతనికి ఊపిరి అందని పరిస్థితి ఏర్పడుతోంది. 

అల్లోపతి ఔషధాలపై ఆధారపడకుండా ఉండేందుకు 2016- 2021 వరకు హోమియోపతి ప్రయత్నించారు కానీ ఉపశమనం తాత్కాలికంగా ఉండేది, అంతే కాక ఇబ్బంది నుండి అధిగమించ డానికి వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇన్హేలర్ అవసరము ఏర్పడేది. శాశ్వతమైన మరియు ఆశాజనకమైన పరిష్కారం కోసం అతను వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న వెంటనే 2022 జనవరి 5న ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. అతనికి అనేక సంవత్సరాలుగా గురక కూడా ఉంది. ఇన్హేలర్ తప్ప మరే ఇతర మందులు అతను తీసుకోవడం లేదు. అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది:   

శ్వాస అందక పోవడం , పిల్లి కూతలు: 

#1. CC3.1 Heart tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack...TDS 

సాధారణ ఆరోగ్య శ్రేయస్సుకు: 

#2. IB...OD

గురకకు: 

#3. CC15.6 Sleep disorders...OD

జనవరి 29 నాటికి శ్వాస లోపం మరియు పిల్లి కూతలు నుంచి 30% ఉపశమనం లభించింది, ఇన్హేలర్ వాడకం కూడా వారానికి ఒక సారికి తగ్గింది. ఏప్రిల్ చివరి నాటికి తనకు 80% వరకూ తగ్గిందని ప్రతీ రోజు కాకుండా దుమ్ము వలన లేదా మెట్లు ఎక్కినప్పుడు, తల స్నానం చేసినప్పుడు, మాత్రమే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతోందని తెలిపారు. గతంలో లాగా కూర్చుని కాకుండా సాధారణ స్థితిలోనే తను నిద్రపోగలుగుతున్నానని అంతేకాక గత మూడు నెలల్లో ఒక్కసారి మాత్రమే ఇన్హేలర్ ఉపయోగించానని  తెలిపారు. ప్రాక్టీషనర్ మార్గదర్శకత్వాన్ని అనుసరించి జాగ్రత్తగా తన ఆహారంలో పెరుగు, దోసకాయ ఐస్ క్రీములు తక్కువ స్థాయిలో ప్రవేశపెట్టారు. ఈ ఆహారాలు అతని వ్యాధి లక్షణాలను ప్రేరేపించడం లేదా తీవ్రతరం చేయక పోవడం గమనించి అతను ఆశ్చర్య ఆనందములను పొందారు. సెప్టెంబర్ చివరి నాటికి మరో 5 నెలలు గడిచే సరికి అతని లక్షణాలు అన్నీ మాయమయ్యాయి, మెట్లు ఎక్కడం, దుమ్ము, ధూళికి గురికావడం వల్ల అతి తక్కువ అసౌకర్యం కలుగుతోంది. #1 మోతాదు BD తగ్గించబడింది.

2023 జనవరి లో విదేశాలకు వెళ్ళినా ఎటువంటి లక్షణాలు పునరావృతం కాలేదు. అంతకు ముందు ప్రయాణాలతో పోలిస్తే ఇది  స్వాగతింపతగిన మార్పు. ఐతే శీతాకాలం లో తల స్నానం చేసినప్పుడు స్వల్పంగా శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది గమనించారు, ఐతే తన  బిజీ వర్క్ షెడ్యూల్ కారణంగా ఇన్హేలర్ ద్వారా తక్షణ ఉపశమనం పొందేందుకు సౌకర్యవంతంగా ఉన్నారు.

నవంబర్ నాటికి ఎటువంటి పునరావృతం లేదు అతను #1 మరియు #2 మెయింటెనెన్స్ డోస్ OD గా కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. దురదృష్టవశాత్తు #3 సీరియస్ గా తీసుకోక పోవడంతో గురకలో మెరుగుదల లేదు.

పార్శ్వపు నొప్పి 11633...भारत

49 ఏళ్ల మహిళ 12 సంవత్సరాలుగా వారానికి 2-3 సార్లు మైగ్రేన్ తలనొప్పితో బాధ పడుతున్నారు. ఇట్టి ఇబ్బంది ఏర్పడిన ప్రతీ సారి తనకు తల ఎడమవైపున తీవ్రమైన నొప్పి, వికారము, అలసట, చికాకు,  మరియు అధిక చమటతో ఇబ్బంది పడుతున్నారు. ఈ లక్షణాలు సాధారణంగా రెండు గంటల్లోవాటంతట అవే తగ్గిపోతాయి. అయితే అనంతర పరిణామాలు ఆమె రోజంతా అలసిపోయినట్లు చేసి తన నిత్య కృత్యాలకు భంగం వాటిల్లే లాగా చేస్తున్నాయి. రాత్రిపూట తలనొప్పి వస్తే నిద్రకు భంగం కలుగుతోంది. బిగ్గరగా ఉండే ధ్వనులు, ఎండకు గురి కావడం, లేదా మొబైల్ స్క్రీన్ ని 10 నిమిషాలు చూడడం ఆమె లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తున్నవి.  

అలోపతి చికిత్సకు ఇష్టపడక తలనొప్పి భరించ లేనప్పుడు ఓవర్ ది కౌంటర్ (OTC) పెయిన్ కిల్లర్ తీసుకునేవారు. ఇది ఆమెకు ఒక గంట సేపు ఉపశమనం ఇచ్చేది. నొప్పి భరించ లేనంతగా లేని సందర్భాల్లో లక్షణాలు తగ్గే వరకు విశ్రాంతి ఎంచుకునేవారు. మధుమేహం చికిత్స విషయంలో తన భర్త పొందిన విజయవంతమైన అనుభూతి యొక్క స్ఫూర్తితో 2022 జనవరి 24 ప్రాక్టీషనర్ ను సంప్రదించగా ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:   

#1. CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia...TDS

#2. CC15.6 Sleep disorders...OD

2022 మే వరకు అనగా తర్వాత నాలుగు నెలల వరకు ఆమె భర్త తన సొంత రెమిడీని రీఫిల్  చేసుకోవడానికి వచ్చేవరకు రోగి నుండి ఎలాంటి ఫీడ్బ్యాక్ లేదు. తన భార్యను బలహీన పరిచిన మైగ్రేన్ తలనొప్పి పూర్తిగా విలిచిపోయిందని అతను ప్రాక్టీషనర్ కు తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం రోగిని సంప్రదించినప్పుడు రెమిడి ప్రారంభించిన మొదటి రెండు వారాల్లో ఆమెకు కేవలం రెండు సార్లు మాత్రమే ఇబ్బంది ఏర్పడిందని ఆమె వెల్లడించారు. అంతేకాక ఇప్పుడు తలనొప్పి సాధారణ తీవ్ర లక్షణాలు లేకుండా స్వల్పంగా ఉంటోంది. తర్వాత రెండు వారాల్లో ఆమె పరిస్థితి మరింత మెరుగుపడి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఏర్పడింది. ఏప్రిల్ లో తలనొప్పి పూర్తిగా మాయమయ్యే నాటికి ఈ రెండు నెలల్లో తలనొప్పి తీవ్రత మరియు తరుచుదనం క్రమంగా తగ్గింది. రెమిడీ ప్రారంభించిన నాటినుండి ఆమెకు OTC  మెడిసిన్ అవసరం రాలేదని తనకు నిద్రలో కూడా ఎటువంటి సమస్య ఏర్పడలేదని సంతోషంగా తెలియజేసారు. గతంలో మాదిరిగా కాకుండా ఆమె ఎండ వేడిమి తీవ్రంగా ఉండే ప్రదేశానికి యాత్రకు వెళ్ళినప్పటికీ ఎటువంటి తలనొప్పి లేకుండా ఆనందంగా ఉన్నట్లు తెలియ జేసారు. గోళీలు పూర్తి కాగానే 2022 మే నెలలో వాటిని ఆపివేసారు.

2023 నవంబర్ నాటికి ఎటువంటి పునరావృతం లేకుండా ఆనందంగా ఉన్నారు.

ఋతు క్రమ రుగ్మత 03614...यूएसए

44 ఏళ్ల మహిళకు ఎల్లప్పుడు 23- 25 రోజుల ఋతు చక్రం సాధారణ రక్తస్రావంతో నాలుగు రోజులు పాటు కొనసాగుతూ ఉండేది.  నవంబర్ 22 నుండి ప్రతీ పీరియడ్ యొక్క వ్యవధి మరియు రక్త స్రావము తగ్గటం మొదలైంది. దీంతో పాటుగా పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, మరియు బలహీనత ఆ పీరియడ్ మొత్తము కొనసాగడం ప్రారంభించింది. 2023 జనవరి నాటికి ఆమె ఋతుస్రావం చాలా తక్కువ ప్రవాహంతో మూడు రోజులు మాత్రమే కొనసాగింది. మార్చి నాటికి అది రెండు రోజులకు తగ్గింది. మే నెలలో ఆమె ఋతుస్రావం 10 రోజులు ఆలస్యం అయ్యింది. ఈ మార్పులను ఋతు విరతి (మెనోపాస్) ప్రారంభ అవస్థగా భావించి ఆమె తన తల్లిలో గమనించిన లక్షణములకు ఆపాదిస్తూ ఆమె ఎటువంటి చికిత్సా తీసుకోలేదు. దశాబ్దాలుగా అధిక బరువు 75 కేజీలు ఉన్నప్పటికీ ఆమె చురుకుగా ఉంటారు, మంచి శాఖాహారం తింటారు, ప్రతిరోజు వ్యాయామం చేస్తారు, ఆరోగ్యకరమైన జీవనశైలి నిర్వహిస్తున్నారు. తన అంకుల్  నుండి వైబ్రియానిక్స్ గురించి విన్న వెంటనే 2023 జూన్ 5 ప్రాక్టీషనర్ ను సంప్రదించగా క్రింది రెమిడి ఇవ్వబడింది:  

 ఋతు రుగ్మత కోసం : 

#1. CC8.8 Menses irregular…TDS 

సాధారణ ఆరోగ్య శ్రేయస్సు కోసం : 

#2. IB…OD

జూన్ 30 నాటికి 23 రోజుల తర్వాత ఆమె ఋతుక్రమం షెడ్యూల్ ప్రకారం తిరిగి ప్రారంభమై, ఆ సమయంలో నొప్పి, ఉబ్బరం, లేదా బలహీనత లేకుండా సాధారణ ప్రవాహం కొనసాగిందని తెలిపారు. జూలై 30న కూడా ఇదే కధ కొనసాగిందని రోగి తెలిపారు. కాబట్టి #1 యొక్క మోతాదు రెండు వారాలకు BD కి,  మరొక వారానికి OD కి ఆ తర్వాత నిర్వహణ మోతాదు OW కి తగ్గించబడింది.

తర్వాత నాలుగు నెలలు ఋతుక్రమం నవంబర్ 22 కి ముందు మాదిరిగానే ఉంది. 2023 నవంబర్ నాటికి రోగి రెమిడీలను సంతోషంగా కొనసాగిస్తున్నారు.

రోగి యొక్క వాంగ్మూలము వెబ్సైట్ లో అందుబాటులో ఉంది.

శ్వేశ కోశ ఎలర్జీ, నిద్రా రుగ్మత 11655...भारत

45 ఏళ్ల మహిళ గత 15 సంవత్సరాలుగా తుమ్ములు, ముక్కు కారడం, నిద్రా రుగ్మత తో బాధపడుతున్నారు. దుమ్ము మరియు పుప్పొడి వలన ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ లక్షణాలు ఏర్పడి ఏడాది పొడవునా కొనసాగి శీతాకాలంలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. తుమ్ముల దాడి కొన్నిసార్లు ప్రతీ 10-15 నిమిషాలకు పునరావృతం అయ్యి కొన్ని గంటల పాటు తుమ్ములు కొనసాగుతాయి. 1లేదా 2 గంటల లోపు తుమ్ములు ఆగిపోక పోతే సూచించబడిన యాంటీ హిస్టమిన్ OD గా తీసుకొనగానే తుమ్ములు 30 నిమిషాల్లో తగ్గిపోతాయి. యాంటీ హిస్టమిన్ యొక్క ఉపశమన ప్రభావ కారణంగా ఆమె దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుటకు ప్రాముఖ్యత ఇవ్వసాగారు. 2023 మే లో ఒక నెలపాటు మందులు తీసుకోకుండా కాలం వెళ్ళదీద్దామనే ప్రయత్నంలో ఆమె తీవ్రమైన పొడి దగ్గుతో పాటు తన లక్షణాలు మరింత తీవ్రమవుతున్నట్లు గుర్తించారు. అల్లం మరియు తేనె వంటి ఇంటి నివారణలను ఆశ్రయించడం కొంత ఉపశమనం కలిగింది. అయినప్పటికీ యాంటీ హిస్టమిన్ యొక్క ఆవశ్యకత గ్రహించి ఆమె దాన్ని తీసుకోవడం కొనసాగించారు. ప్రాక్టీషనర్ను సంప్రదించే నాటికి ఆమె ఒక నెలరోజులుగా తీవ్రమైన పొడి దగ్గు మరియు తుమ్ములతో బాధ పడుతున్నారు. 

ఆమెకు నిద్రపోవడం కూడా కష్టము కావడంతో పుస్తకాలు చదువుతూ నిద్రకు ఉపక్రమించడానికి ప్రయత్నించేవారు. అది విఫలమైనప్పుడల్లా సూచించిన స్లీపింగ్ పిల్ మాత్రమే వేసుకొని ఒక గంటలోపు నిద్రపోసాగారు. 2023 ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:   

శ్వాశ కోశ ఎలర్జీ కి :

#1. CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic…ప్రతీ 10 నిమిషాలకి ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకు అనంతరం 6TD 

నిద్ర పోవడంలో ఇబ్బందికి :

#2. CC15.6 Sleep disorders…నిద్రించ డానికి గంట ముందు ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు.  

మరుసటి రోజు స్లీపింగ్ టాబ్లెట్స్ అవసరం లేకుండానే #2 యొక్క రెండు మోతాదుల తర్వాత చక్కగా నిద్రపోతున్నట్లు తెలిపారు.  దగ్గు కూడా 25% తగ్గింది. ఆమె అవసరం మేరకే యాంటీ హిస్టమిన్ తీసుకోవడం కొనసాగించారు.

జూన్ 17న దగ్గు తగ్గడంతో  #1 యొక్క మోతాదు TDS కు తగ్గించబడింది. వైబ్రియానిక్స్ పట్ల విశ్వాసం బలపడడంతో యాంటీ హిస్టమిన్ పుర్ర్తిగా ఆపివేశారు. ఈ సందర్భంగా తుమ్ములు, ముక్కు కారడం రెమిడీ తీసుకోవడం నిలిపి వేస్తేనే వస్తున్నట్లు ఆమె గుర్తించారు. అటువంటి పరిస్థితి లో #1 తరుచుగా వేసుకోమని సూచించడం జరిగింది. జులై మొదటి వారంలో ఆమె నిద్ర పూర్తిగా పునరుద్ధరింపబడటంతో #2  ఆపి వేయడం జరిగింది. తదుపరి ఒక నెల రోగ లక్షణ రహితంగా ఉన్నారు కాబట్టి  #1 యొక్క మోతాదు ODకి ఆగస్టు చివరి నాటికి OW కి తగ్గించబడింది.

నవంబర్ 23 నాటికి ఎటువంటి పునరావృతం లేదు ఆమె OW నిర్వహణ మోతాదు కొనసాగిస్తున్నారు. 

రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ 11647...भारत

50 ఏళ్ల మహిళ 1997 నుంచి గత 30 సంవత్సరాలుగా వేళ్ళు మరియు మణికట్టు మొదట్లో నిరంతర నొప్పి మరియు వాపుతో బాధపడుతున్నారు. 2000 సంవత్సరంలో ఇది రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ గా (కీళ్ల వాతావ) నిర్ధారణ కావడంతో సూచించిన అల్లోపతి మందులు మౌఖికంగా మరియు బాహ్యంగా తీసుకుంటూ ఉన్నారు. ఆమె పరిస్థితి క్రమంగా క్షీణించి వేళ్ళు, మణికట్టు, తొడలు, మోకాలు, మరియు వీపు ముఖ్యంగా ఉదయం వేళల్లో విపరీతమైన భరించలేని నొప్పి మరియు దృఢత్వానికి దారితీసింది. మెడ మరియు భుజము నొప్పులు, ఉన్న బాధలకు తోడు కావడంతో ఆమెకు స్వేచ్ఛగా కదలికలు లేకపోవడంతో సాధారణ పనులు కూడా చేయలేకపోయేవారు. ఈమెకు సరియైన నిద్ర కూడా లేదు.  

అల్లోపతి మందులు కొంత ఉపశమనం కలిగిస్తూ  ఉన్నప్పటికీ అవి మగత, బలహీనత, అప్పుడప్పుడు వాంతులు వంటి దుష్ప్రభావాలకు కారణమయ్యాయి. మెరుగైన పరిష్కారాన్ని వెతుక్కుంటూ అనేక ప్రదేశాలకు ప్రయాణిస్తూ ఆయుర్వేదంతో సహా వివిధ ప్రత్యామ్నాయ చికిత్సలు ప్రయత్నించారు. తన జీవన నాణ్యత మెరుగుపరుచుకోవాలని తీవ్రంగా కోరుకుంటూ తన సోదరి సిఫారసు పై వైబ్రియానిక్స్ వైపు మొగ్గు చూపారు. 2023 జనవరి 8 ప్రాక్టీషనరు క్రింది రెమిడి ఇచ్చారు:  

#1. CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue…every 10 minutes ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున రెండు గంటల వరకు అనంతరం 6TD 

#2. CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.7 Fractures…OD నువ్వుల నూనెలో బాహ్య అనువర్తనం కోసం.  

ఆమె అల్లోపతి మందులు కూడా కొనసాగించారు. ఫిబ్రవరి 15 నాటికి నొప్పి, వాపు మరియు ధృఢత్వం లో 25% ఉపశమనం కలిగిందని చాలా కాలం తర్వాత తన సుఖంగా ఉన్నానని ఆమె ఆనందంతో తెలియజేశారు. జూన్ 2 నాటికి ఆమె లక్షణాలలో 60% మెరుగుదల ఏర్పడడంతో పాటు నిద్ర కూడా మెరుగుపడింది. ప్రాక్టీషనర్ సలహా అనుసరించి వ్యాయామం, యోగా, సమతుల్య ఆహారము స్వీకరిస్తూ ఆమె ఆరోగ్యకరమైన జీవన శైలి అనుసరించ సాగారు. ఆగస్టు 10 నాటికి 80% ఉపశమనం పొందడంతో అల్లోపతి మందులను నిలిపివేయడానికి తగినంత నమ్మకం ఏర్పడింది. #1 యొక్క మోతాదు TDS కు తగ్గించబడింది.

సెప్టెంబర్ 9న అన్ని రోగ లక్షణాల నుండి 100% ఉపశమనం లభించినందుకు ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతికూల ప్రభావాలతో కూడిన ఖరీదైన మందుల అవసరం లేకుండా తన రోజువారి పనులను తిరిగి ప్రారంభించగలిగారు. #1 యొక్కమోతాదు OD కి తగ్గించ బడింది. అద్భుతముగా కోలుకున్నందుకు కృతజ్ఞతలు మరియు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు తన ఇంటి నుండి బయటకు వెళ్లగలుగుతున్నారు, ప్రయాణంలో అవసరం మేరకు నొప్పి నివారిణి పై ఆధార పడుతున్నారు. ఆమె OD వద్ద రెమెడీ కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. 

2023 డిసెంబర్ 25 నాటికి ఎటువంటి పునరావృతం లేదు.    

చర్మము పై దురద 11652...भारत

ప్రాక్టీషనర్ తన 57 ఏళ్ల కజిన్ ని సందర్శించినప్పుడు ఆమె తన కుడి ముంజేతి మణికట్టు, కుడి తొడ, మరియు కుడిఛీలమండ దగ్గర దురదగా ఉందని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం 2020 మే లో కోవిడ్ మహమ్మారి సమయంలో ఇంటిలో సహాయం చేసేవారు లేక పని భారం పెరిగడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజూ 2-3 సార్లు ముఖ్యంగా ఇంటి పని తర్వాత స్వల్పంగానూ మరియు తోటపని తర్వాత ఎక్కువగాను దురద ఏర్పడుతోంది. తరచుగా గోకడం వల్ల ఆమె మణికట్టు మరియు చీలమండల వద్ద చిన్న చిన్న నల్లని మచ్చలు ఏర్పడ్డాయి. కాలక్రమేణా ఆమె తొడలు, నడుము, పొత్తికడుపు దిగువ భాగంపై దురద అభివృద్ధి చెందాయి. వేడినీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేయడం మరియు కాండిడ్ క్రీమ్ ఉపయోగించడం వల్ల 2-3 గంటల వరకు ఉపశమనం లభిస్తున్నది. ఆమె వంటి సబ్బు మార్చడానికి ప్రయత్నించినప్పటికి దురద అలాగే కొనసాగింది. మేల్కొన్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఆమె చేతి వేళ్ళు మరియు కాలివేళ్ల వద్ద జలదరింపు అనుభూతిని కూడా అనుభవించసాగారు.  

ఆమె వైద్యుడిని సంప్రదించడానికి ఇష్టపడలేదు. ఆమె ప్రభావిత ప్రాంతాలను గోకడం ప్రాక్టీషనర్ గమనించారు. 2023 మే 24 ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది: 

#1. CC21.3 Skin allergies + CC21.6 Eczema…BD బాహ్య అనువర్తనం కోసం శుద్ధమైన కొబ్బరి నూనెలో  

#2. CC18.5 Neuralgia + #1…TDS

 ఆమె పరిస్థితి మెరుగుపడే వరకు చేతికి గాజులు ధరించకుండా ఉండాలని సూచించారు. సాధారణ స్నానాలు చేయడం ప్రారంభించి  క్యాండీడ్ క్రీమ్ నిలిపివేశారు. జూన్ 7 నాటికి రెండు వారాల్లో దురద నుండి 50% ఉపశమనం లభించింది, కానీ మచ్చలు మారలేదు ఐతే దురద మణికట్టు మరియు చీల మండలకు పరిమిత మయ్యింది. ఫ్రీక్వెన్సీ వారానికి 2-3 సార్లు తగ్గింది, కొంత మెరుగైన అనుభూతి అనుభవించారు. జూన్ 26 న దురద పూర్తిగా పోయిందని మరియు మచ్చల రంగు కూడా మారిందని తెలియజేశారు. ఒక నెల తర్వాత జూలై 25న మచ్చలు పూర్తిగా అదృశ్య మయ్యాయని, తోటపని తర్వాత కూడా దురద రావడం లేదని తనకు 100% ఉపశమనం కలిగినట్టు తెలిపారు. అంతేకాక వ్రేళ్ళ జలధరింపు అనుభూతి కూడా అదృశ్యమైంది. #2 ను ఆగస్టు 22న ఆపివేసే వరకు BD కి తగ్గించబడింది.  #1 రెమిడీ అయిపోయే వరకు కొనసాగించబడింది.

అక్టోబర్లో ప్రాక్టీషనర్ ఆమెను కలుసుకున్నప్పుడు దురద నుండి పూర్తిగా విముక్తి పొందినట్లు ఆమె సంతృప్తి మరియు ఆనందం వ్యక్తం చేశారు, డిసెంబర్ 2023 నాటికి ఆమె బాగానే ఉన్నారు. 

ఋతు విరతి (మెనోపాస్) అనంతరం ఏర్పడిన మచ్చలు (హైపర్ పిగ్మెంటేషన్), అలసట 11654...भारत

45 ఏళ్ల మహిళకు ఋతు విరతి అనంతర సమస్యలు ఏర్పడ్డాయి. ఆమెకు ఋతుక్రమం ఒకటిన్నర సంవత్సరాల క్రితం 2021 డిసెంబర్లో ఆగిపోయింది. 2022 మార్చి నుండి ఆమె అలసట మరియు చికాకు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు రెండు బుగ్గలపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి, దురద లేనప్పటికీ ఇవి క్రమంగా వ్యాపించాయి. ఆమె హైపర్ పెగ్మెంటేషనుకు ఎటువంటి చికిత్స తీసుకోలేదు, విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఇతర లక్షణాలనుండి ఉపశమనం పొందుతున్నారు. 2023 జూన్ 6 ప్రాక్టీషనర్ను సంప్రదించినప్పుడు ఆమె చాలా బలహీనంగా కనిపించారు, ముఖ్యంగా పెగ్మెంటేషన్ గురించి ఆందోళన తో ఉన్నారు. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:   

#1. CC8.6 Menopause + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…TDS 

జూన్ 18 నాటికి మచ్చలు లేత గోధుమ రంగులోకి మారాయి, అలసట, చికాకు 50% పైగా తగ్గింది. ఇప్పుడు ఆమెకు శ్రమ తర్వాత కొంచం వెన్ను నొప్పి వస్తున్నట్లు పేర్కొన్నారు, కాబట్టి ఋతు విరతి ఆనంతరము ఏర్పడిన డీ కాల్సిఫికేషన్ పరిష్కరించడానికి #1 మెరుగుపరిచబడింది:

#2. CC20.6 Osteoporosis + #1…TDS 

జూన్ 23న మచ్చలు జాడ లేకుండా పోయాయని, అలసట మరియు చిరాకు కూడా తగ్గిపోయాయని ఆమె ఆనందంగా తెలియజేశారు. ఆగస్టు23 న ఆపివేసే వరకు తదుపరి రెండు నెలల పాటు మోతాదు OD కి తగ్గించబడింది. 2023 డిసెంబర్ 8 నాటికి ఆమె ఎటువంటి లక్షణాలు లేకుండా సంతోషంగా ఉన్నారు.   


 

 

కోవిడ్ అనంతరం స్వరం కోల్పోవడం 03604...यूएसए

2022 జూన్ లో కోవిడ్ (ఒమిక్రాన్) వల్ల తీవ్రంగా ప్రభావితమైన 68 ఏళ్ల నటి మరియు గాయని బలమైన యాంటీబయాటిక్ మరియు స్టెరాయిడ్ చికిత్స పొంది కోలుకున్నారు. అయితే గొంతు నొప్పి మరియు దగ్గు నాలుగు నెలల పాటు కొనసాగి ఆమె మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఆమెకు గొంతు నొప్పి వచ్చేది. ఒకప్పుడు గంభీరంగా ఉన్న గొంతు ఇప్పుడు పేలవమైన కీసు గొంతుకలా మారిపోయింది. నవంబర్ 4న ENT స్పెషలిస్ట్ ఆమె గొంతులో వాపు మరియు పెరుగుదల రావడానికి తిత్తు లేదా పాలిప్  ఏర్పడడం కారణం అని గుర్తించి శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు. శస్త్ర చికిత్స వలన స్వరతంతువు దెబ్బతింటుందని ఇది తన కెరీర్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆమె ఆందోళన  చెందారు. ఆమె స్వరపేటిక నిపుణుడు లారింగాలజిస్ట్ ను సంప్రదించగా డాక్టర్ నిర్ధారించిన దానిని ధ్రువీకరించి శస్త్ర చికిత్సను సిఫారసు చేసారు. శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఇష్టము లేకపోవడంతో 3వ అభిప్రాయం కోసం మరొక లారింగాలజిస్ట్ ను సంప్రదించగా మునుపటి ఫలితాలు ధ్రువీకరిస్తూ పాలిప్స్ వాటంతట అవే అదృశ్యం కావడం అసంభవం అని వ్యాఖ్యానించారు, కాబట్టి సంకోచముతోనే ఆమె శస్త్ర చికిత్సకు అంగీకరించారు.

శస్త్ర చికిత్స కోసం వేచి చూస్తున్న సమయంలో రోగి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని ప్రాక్టీషనర్ను సంప్రదించారు. పాలిప్  మరియు ఇతర లక్షణాలతో పాటు ఆమె తన రోగ చరిత్రలో భాగంగా తన లోతైన బాధలు, కోపము వంటి విషయాలు వెళ్లడిస్తూ తనకు  29 సంవత్సరాల వయసులో తన జీవ సంబంధమైన కుటుంబము మొత్తాన్ని కోల్పోయి నట్లు తెలిపారు. అంతేకాక ఆరు సంవత్సరాల క్రితం ఆమె భర్త హఠాత్తుగా మరణించగా ఆమెపై తప్పుడు ఆరోపణలతో వాంగ్మూలం కొనసాగుతున్నది. ఆమె ఇప్పుడు ఒంటరిగా మరియు మానసికంగా కలత చెంది ఉన్నారు. 2023 మార్చి 26 తేదీన ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:

CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…TDS

మే 19న శస్త్ర చికిత్స కు ముందు చెకప్ సమయంలో డాక్టర్ ఆశ్చర్యపడే విధంగా గతంలో గుర్తించిన పాలిప్ కనుగొనబడలేదు. గొంతు నొప్పి మరియు దగ్గు కూడా అప్పటికే మాయమైపోగా ఆమె రెమిడి తీసుకోవడం మానేశారు. “ఇది దేవుని నుండి నేరుగా జరిగిన అద్భుతం” అని పేషంటు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఆమెకు వాక్కు పూర్తిగా పునరుద్ధరింపబడింది కానీ వృత్తిపరమైన గాన ప్రమాణాలను తిరిగి పొందటానికి ఆమె స్పీచ్ థెరపీ చేయించుకున్నారు. ఆమె భావోద్వేగ శ్రేయస్సు కూడా మెరుగుపడి ఆమె సంతోషంగా తన పనిని తిరిగి కొనసాగించడానికి వీలు కల్పించింది.

సెప్టెంబర్ 18న తను ఇప్పుడు ఒక నూతన భావాన్ని స్వీకరించి సంపూర్ణంగా స్వస్థత పొందానని వైబ్రియానిక్స్ యొక్క రూపాంతర ప్రభావానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెళ్లడించారు. 2023 డిసెంబర్ 10 నాటికి ఆమె బోధించడం, నటించడం, పాడడం, యధావిధిగా కొనసాగిస్తున్నారు.   

ప్రాక్టీషనర్ల వివరాలు 18001...भारत

ప్రాక్టీ షనర్ 18001…ఇండియా BA డిగ్రీ కలిగిన ఈ ప్రాక్టీషనర్ హోమియోపతిని కూడా అభ్యసించారు. సాయి కుటుంబంలో పుట్టడం అదృష్టంగా భావిస్తూ తనకు ఏడేళ్ల వయసులో 1976 లో తన తండ్రి మొదటి సారి పుట్టపర్తి దర్శించారు. 10 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో కలిసి ప్రశాంతి నిలయానికి వెళ్ళినప్పుడు తొలిసారిగా వీరు స్వామి దర్శనం పొందారు.

2000 సంవత్సరం నుండి పుట్టపర్తి లో ద్వైవార్షిక సేవాదళ్ డ్యూటీకి మార్చిలో ఎనిమిది రోజులు, మరియు డిసెంబర్ లో పది రోజులు స్వచ్ఛందంగా హాజరు ఔతున్నారు. 11 సంవత్సరాల కాలం పాటు పుట్టపర్తి మరియు వైట్ ఫీల్డ్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం టెలీ మెడిసిన్ టెక్నీషియన్ గా వారానికి రెండుసార్లు సేవ చేశారు. తన సమితిలో ఆధ్యాత్మిక సమన్వయకర్తగా మరియు బాల వికాస్ గురువుగా కూడా పనిచేశారు. ఆమె మదర్ థెరీసా లెప్రసీ సెంటర్లో 2012 వరకు, తరగతులు నిలిపే వరకు 11 సంవత్సరాలు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చారు. ఆమెకు సేవ మరియు వాలంటీరు గా చేయడం పట్ల మక్కువ కారణంగా అవకాశం దొరికినప్పుడల్లా వృద్ధాశ్రమాలను సందర్శించడం, వైద్య శిబిరాలకు హాజరవడం, తన స్వస్థలంలో రథయాత్ర సమయంలో నారాయణ సేవ చేయడం, గురునానక్ జయంతి మరియు గురు గోవింద్ సింగ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా స్థానిక గురుద్వారాలో కూడా సేవ చేస్తూ ఉండేవారు. మృదువుగా ఉండే బొమ్మలు తయారుచేయడం, అల్యూమినియం ఫాయిల్ పెయింటింగు, తోటపని, బేకింగ్  మరియు వంట చేయడం ఆమె హాబీలు. 

2002లో వైబ్రియానిక్స్ కోర్సు తన తండ్రి నుండి తెలుసుకున్నారు, వివరాలు తెలుసుకునేందుకు ఆశ్రమంలో ఉన్న డాక్టర్ అగర్వాల్ గారిని కూడా కలిశారు కానీ ఆ సమయంలో ఆమెకు వైబ్రియానిక్స్ నేర్చుకోవాలనే ఉద్దేశం లేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మహమ్మారి సమయంలో ఒక వార్తాలేఖ చదవడం ద్వారా ప్రేరణ పొంది వైబ్రియానిక్స్ ద్వారా తను మరింత ఎక్కువమంది పేద ప్రజలకు ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి సేవ చేయవచ్చనే ఆలోచన ఆమెలో కలిగించింది. ఆమె ఆన్లైన్ కోర్సు కోసం దరఖాస్తు చేసారు. డిసెంబర్ 2021లో AP అయ్యారు.

వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడంలో ఆమె అద్భుతమైన విజయాన్ని సాధించారు. 2022 మేలో ఆటిజం తో బాధ పడుతున్న 8 ఏళ్ల అబ్బాయికి చికిత్స చేశారు. అతనికి మాట లేదు, హైపర్ ఆక్టివ్, మరియు నిద్రలేమితో బాధపడుతూ ఉన్న కారణంగా తనకి ఒక సంవత్సరం వయసు నుండి అర్ధరాత్రి తన తల్లిని ఇబ్బంది పెట్టేవాడు. తల్లి తన శిశువును ఊరకుండ బెట్టటానికి మొబైల్ ఫోను ఇవ్వడం వల్లనే ఈ సమస్యలన్నీ పుట్టుకొచ్చాయని భావించారు. ఆమె అతనికి : #1. CC12.2 Child tonic + CC15.5 ADD & Autism + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities + CC18.2 Alzheimer’s disease and #2. CC15.6 Sleep disorders. ఇచ్చారు. నెల తర్వాత అతను ఇప్పుడు మొదటిసారి మాట్లాడుతున్నాడని ప్రవర్తన మెరుగుపడిందని రాత్రంతా నిద్రపోతున్నాడని తల్లి నివేదించారు.

మరొక సందర్భంలో గత 15 సంవత్సరాలుగా ఏ విధమైన మందుల నుండి ఉపశమనం లేకుండా మలములో అధిక శ్లేష్మంతో బాధపడుతున్న బంధువు ఆమెను సంప్రదించారు. అతనికి CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.5 Ulcers + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders. ఇచ్చారు. నాలుగు వారాల్లోనే సమస్య పూర్తిగా సర్దుమణిగింది.

మరొక సందర్భంలో చేతులు మరియు మెడపై చిన్న తెల్లటి కురుపులు ఉన్న 12 ఏళ్ళ బాలికకు చికిత్స చేశారు. మూడు నెలల పాటు అల్లోపతి హోమియోపతి చికిత్సలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రాక్టీషనర్ ఆమెకు CC10.1 Emergencies + CC21.2 Skin infections + CC21.8 Herpes + CC21.11 Wounds & Abrasions ఇచ్చారు.  

15 రోజుల తర్వాత కురుపుల లోపల చీము ఏర్పడడం ప్రారంభమై అవి చాలా నొప్పిగా మారాయి. ప్రాక్టీషనర్ మౌఖిక నివారణ తో పాటు వేడి నీటి కాపడం పెట్టమని సిఫార్సు చేసారు. క్రమంగా చీము కారడం ప్రారంభమై రెండు నెలలలో చర్మం పూర్తిగా సాధారణమైంది.

జాయింట్ నొప్పుల కోసం క్రింది కొంబోతో ముందుకు వచ్చి CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine, ఈ కొంబో కొబ్బరి లేదా ఆవాల నూనెలో ఉపయోగించినప్పుడు అద్భుతంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు.  చార్ధామ్ యాత్రకు వెళుతుండగా ఉత్తర కాశీలో ఆమె ఒక పదునైన రాయిపై పడిపోవడంతో అది తన రెండు మోకాళ్ళను తీవ్రంగా గాయపరిచింది. పైన పేర్కొన్న కాంబోను ప్రతి పది నిమిషాలకు ఒకసారి చొప్పున ఒక గంట పాటు తీసుకొని ఈ కోంబోను ఆలీవ్ నూనెలో తను మోకాళ్ళపై కూడా రాసారు. ఆశ్చర్యకరంగా ఆమెకు నొప్పి అదృశ్యమై  ఎటువంటి సమస్య లేకుండా తీర్థయాత్ర పూర్తి చేయగలిగారు. 

ఒక అల్లోపతీ డాక్టరు కుమార్తెగా ఆమె వ్యాధి నుండి కోలుకున్న రోగుల చిరునవ్వులను మరియు వారి ముఖాలలో వ్యక్తమయ్యే అపారమైన ఆనందాన్ని నిరంతరం ఆస్వాదించేవారు. కాబట్టి ఆమెలో డాక్టర్ కావాలనే ఆకాంక్ష ఉదయించింది. ఈ చిరకాల స్వప్నాన్ని స్వామి నెరవేర్చినందుకు ఇది స్వామి ఆశీర్వాదంగా ఆమె భావిస్తున్నారు. ఉత్తమ ఫలితాల కోసం ప్రతికూల ఆలోచనలపై ఎప్పుడూ దృష్టి పెట్టకూడదని మరియు ఏ వ్యాధిని నయం చేయలేనిదిగా పరిగణించకూడదని ఆమె గ్రహించారు. స్వామికి శరణాగతి చేసి అనుకూల దృక్పథంతో మరియు పూర్తి విశ్వాసంతో రెమెడీలు ఇస్తే ఫలితాలు ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి.  

   కొత్త ప్రదేశాలలో వైద్య శిబిరాల కోసం ఆమె ఎల్లప్పుడూ వెతుకుతూ ఉంటారు. 2023 ఫిబ్రవరిలో పుట్టపర్తికి నివాసం మార్చినప్పటికీ ఈ ప్రాక్టీషనర్ పశ్చిమ బెంగాల్లో కోల్కతాలోని తాన ఇంటికి సమీపంలో ఉన్న మూడు వేర్వేరు ప్రదేశాల్లో త్రైమాసిక వైబ్రో క్యాంపులను నిర్వహించడం కొనసాగిస్తూనే ఉన్నారు. పుట్టపర్తికి తిరిగి వచ్చే ముందు జార్ఖండ్ లోని ఒక నిరుపేద గ్రామంలో రెండు ప్రదేశాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తారు.  పుట్టపర్తిలో ఉన్నప్పుడు వైబ్రియానిక్స్ యొక్క సామర్ధ్యా న్ని ప్రత్యక్షంగా అనుభ వించిన ఆ గ్రామానికి చెందిన ఒక సేవాదళ్  పిలుపుమేరకు ఈ సేవ ప్రారంభమైంది. రోగులకు ఫాలో అప్ సంప్రదింపుల కోసం ఆమె మొబైల్ యాక్సెస్ అందిస్తున్నారు. అంతేకాక  ఆశ్రమాన్ని సందర్శించే స్థానిక భక్తుల ద్వారా రోగులకు రెమిడీలు పంపుతూ ఉంటారు, అది సాధ్యం కానప్పుడు ఆమె రెమిడి బాటిళ్ళను కొరియర్ లో పంపుతుంటారు. వారానికి రెండుసార్లు SVIRT కార్యాలయంలో క్లినిక్ మరియు ఈశ్వరమ్మ గ్రామం మరియు బ్రాహ్మణపల్లి లో క్లినిక్ క్రమం తప్పకుండా నిర్వహించే ప్రాక్టీషనర్ల బృందంలో ఆమె కూడా ఒక సభ్యురాలు. ఆమె పుట్టపర్తి లో ఉన్నప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలోని మందిరంలో కొత్త క్లినిక్ లో ప్రతీ ఆదివారం వాలంటీర్ గా సేవలు అందిస్తారు, అదనంగా పుట్టపర్తిలో ఉన్న తన అపార్ట్మెంట్ నుండి కూడా రోగులను చూస్తారు.   

తన రోగుల ఆశీర్వాదబలమే తన సేవను విస్తరించడానికి అదనపు శక్తి అందించిందని భావిస్తున్నారు. మానవసేవే మాధవసేవ అనే స్వామి వాక్కుతో ఆమె జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నారు.

 పంచుకున్న కేసులు :

 

ప్రాక్టీషనర్ల వివరాలు 11633...भारत

ప్రాక్టీషనర్ 11633...ఇండియా బాటనీలో బీఎస్సీ కలిగి ప్రస్తుతం వృత్తిపరంగా టైలర్ ఐన వీరు ఫ్రీ హ్యాండ్ అవుట్ లైన్ మరియు మోడల్ డ్రాయింగ్ లో కోర్సులు కూడా చేశారు. టైలరింగ్, డ్రాయింగ్ మరియు గార్డెనింగ్ ఆమె అభిరుచులు. 1992లో వివాహం తర్వాత అత్తమామల నుండి మొదటిసారి సత్యసాయి బాబా వారి గురించి విన్నారు. 1994లో మొదటిసారి సాయిబాబావారిని బెంగళూరులో దర్శనం చేసుకున్నారు, వారి బోధనల గురించి చదవటం, స్వామిని అంత దగ్గరగా చూడడం ఆమెకు ప్రేరణ ఇచ్చి సాయి భక్తురాలిగా మారేలా చేసింది. 2000 లో ముంబైలో నెల రోజులు పాటు నిర్వహించబడుతున్న స్వామి నామ పారాయణ కోటి అర్చనకు హాజరై ఆశీర్వాదం పొందారు. ఈ అనుభవం ఆమెలో పరివర్తన కలిగించింది. 2003లో ఆమె సోదరి వీరిని స్థానిక సాయి సమితికి పరిచయం చేశాక ఆమె బాలివికాస్, నారాయణ సేవ, మరియు భజనలు పాడే కేంద్రంలో సాధారణ వాలంటీర్ గా మారారు. 5-6 సంవత్సరాల వరకు NIMHANS లో నెలవారీ నారాయణ సేవ, వైట్ ఫీల్డ్ ఆసుపత్రిలో కొంత కాలం సేవ, షిరిడి సాయి ఆలయం మరియు సాయి ప్రేమాంజలి లో విభూది ప్యాకింగ్ సేవ, మరియు మహమ్మారి సమయంలో సేవాదళ్ కోసం IB  తయారీకి స్వచ్ఛందంగా పనిచేశారు. ఆమె సామాజిక సమస్యల కోసం అనగా వీధి దీపాలు మరియు రోడ్డు మరమ్మత్తులు వంటి స్థానిక మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి తరచుగా ప్రభుత్వ అధికారులను కలుస్తూ ఉంటారు. 

చిన్నతనం నుండి తన తండ్రి హోమియోపతి వైద్య నిర్వహణ చూసి ప్రత్యామ్నాయ వైద్యం పట్ల ఉత్సుకత కలిగి ఉండేవారు. ఆమె తండ్రి వారి గ్రామంలో ప్రజలకు ఉచితంగా వైద్యం చేసేవారు, తేలు కుట్టడంతో వైద్యం కోసం వారి ఇంటికి అర్ధరాత్రి రోగులు వచ్చిన జ్ఞాపకాలు కూడా ఆమెకు ఉన్నాయి. ఆమె తండ్రి రెమిడీని అందించిన తర్వాత వారు అరగంటలో సాధారణ స్థితికి చేరుకునేవారు! సహజ చికిత్సలను అభ్యసించిన తన తాత ముత్తాతల గురించి కథలు వింటూ పెరిగిన వీరు ఇంటి నివారణలతో కత్తిరింపబడిన  వ్రేళ్లను కూడా సరిదిద్దవచ్చని తెలుసుకున్నారు. ఇవన్నీ ప్రాక్టీషనరును వైద్యసేవ వైపు ఆకర్షితురాలయ్యేలా ప్రేరేపించాయి. 2018లో సాయి గీతాంజలి సమితిలో వైబ్రో ప్రాక్టీషనర్ల సేవను ఆమె గమనించి ప్రాక్టీషనరుగా మారడానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రేరణ పొందారు. కుటుంబ కట్టుబాట్ల కారణంగా ఆలస్యం అయినప్పటికీ ఆ తర్వాత 2021 జూలైలో AVP శిక్షణ పూర్తి చేసి 2022 ఆగస్టులో VP  అయ్యారు. 

యూనివర్సల్ హీలర్ ఐన స్వామికి ఒక పనిముట్టుగా ఎంపిక చేయబడిన ఉద్వేగంతో  రొగులు కోలుకున్న తర్వాత వారిలో వ్యక్తమయ్యే ఆనందాన్ని చూడటం కంటే గొప్ప అనుభూతి మరేది లేదు అంటారు. ఆమె మొదటి పేషంటు ఐన ఆమె భర్త గాయం కారణంగా నాలుగు నెలల పాటు చేతిలో నొప్పి మరియు వాపుతో బాధ అనుభవిస్తూ కేవలం వైబ్రోతో ఒక నెలలో పూర్తిగా కోలుకున్నారు.

  ప్రాక్టీషనర్ కొన్ని ఆసక్తికరమైన సందర్భాలను పంచుకోవాలని అనుకుంటున్నారు. 2020 నవంబర్లో ఈమె క్రింద పడిపోయి వెన్నుముక కంప్రెషన్ ఫ్రాక్చర్ కి లోనయ్యారు. తీవ్రమైన నొప్పిని తగ్గించ డానికి నొప్పి నివారణ మందులు సూచించబడ్డాయి. ఈ సమయంలో ఆమె AVP కోసం అడ్మిషన్ ప్రక్రియ మధ్యలో ఉన్నారు. రెండు రోజుల తర్వాత నిర్వాహక బృందం ఆమెను ఒక ప్రాక్టీషనర్ను సంప్రదించి పెయిన్ కిల్లర్లు లేకుండా కేవలం వైబ్రోతో నొప్పి తగ్గించు కోవడంలో ఆమెకు సహాయపడ్డారు. కొన్ని వారాల తర్వాత ఆమె ఒక వీధి కుక్కను చూశారు, అది కాలికి బలమైన గాయంతో నొప్పితో నిరంతరం విలపిస్తూ కదలేకపోయింది. ఆమె తన సొంత ఔషధాన్ని పాలలో వేసి ఒక డోసు ఇచ్చారు, అలాగే కొన్ని పిల్స్ నీటిలో కరిగించి దాని శరీరంపై చల్లారు. అద్భుతం! రెండు మూడు డోసుల తర్వాత కుక్క సాధారణంగా నడవ గలిగింది!

 2022 మార్చిలో చెట్టు నుండి పడిపోయినందున ముక్కు నుండి రక్తం కారడంతో షాక్ లో ఉన్న చిన్న చిలుక పిల్లకు చికిత్స చేయడంలో ఆమె విజయం సాధించారు. CC10.1 Emergencies రెండు మోతాదులతో చిలుక ఇతర పక్షుల కూతలకు ప్రతిస్పందించి మళ్లీ ఎగరడం ప్రారంభించింది. 2022 సెప్టెంబర్ లో ఆమె కుమార్తె ఆరు చేపలతో కూడిన చేపల తొట్టి ఎక్వెరియమ్ ఇంటికి తీసుకువచ్చారు. దురదృష్టవశాత్తు ఆ చేపలన్నీ ఆ మరునాడే మరణించగా ఆమె మరో ఆరు కొనవలసి వచ్చింది. ఈసారి ప్రాక్టీషనర్ తొట్టెలో  CC1.1 Animal tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.1 Travel sickness (ఎక్కువ సార్లు నీటి మార్పు కారణంగా చేపలు చనిపోతాయి అనే భావనతో) ఇచ్చారు. ఈ ఆరు చేపలు ప్రాణాలతో బయటపడి ఆరోగ్యంగా ఉన్నాయి. 

ఈ ప్రాక్టీషనర్ అనుభవంలో IB అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. 2021 ఆగస్టు 17 నుండి క్రమం తప్పకుండా IB తీసుకోవడం ప్రారంభించిన తర్వాత 61 ఏళ్ల పురుషుడు తన పదేళ్ల మైగ్రేన్ సమస్య నుండి మూడు వారాల్లో 50% ఉపశమనం పొందారు. అక్టోబర్ 17 నాటికి ఏ ఇతర ఔషధం తీసుకోకుండానే పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాక ఇదే సమయంలో రోగిని అప్పుడప్పుడు ఇబ్బంది

పెట్టే మడమ నొప్పి, తలనొప్పి, దగ్గు కూడా మాయమై అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అతను 2023 జనవరి లో రెమిడీ ఆపివేసినా 2023 డిసెంబర్ నాటికి అతనికి లక్షణాలు ఏమీ తిరిగి రాలేదు.

ఆన్ని అనారోగ్యాలకు మనసు మూలకారణం కాబట్టి అన్ని రెమిడీలకు CC15.1 Mental & Emotional tonic కలిపితే రోగులకు విశ్వాసం మెరుగుపడుతుందని మరియు కోలుకోవడం వేగవంతం అవుతుందని ఆమె కనుగొన్నారు. తల్లులకు మొదటి కాన్పు సందర్భంలో ప్రసవానంతర వ్యవస్థ చాలా షాక్ తో కూడినది కనుక ప్రాక్టీషనర్ వారి కొంబోలకు CC10.1Emergencies జోడిస్తారు.  మొత్తం మీద శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి అన్ని రెమిడీలకు CC12.1 Adult tonic లేదా CC12.2 Child tonic జోడించడానికి ఇష్టపడతారు.

కుడి కంటిలో లింబల్ డెర్మాయిడ్ సిస్ట్ (కంటి పాపకు దగ్గరగా ఉన్న ప్రదేశంలో తిత్తి) తో బాధపడుతూ కనురెప్పను మూయలేక పోతున్న14 ఏళ్ల బాలికకు ఆమె చికిత్స చేసారు. పాప రెండు ఏళ్ళ వయసులో లేజర్ సర్జరీ చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఆమె అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ప్రయత్నించినా ఫలించలేదు. ఆమెకు ఆ కంటిలో చూపులేక పోవడంతో వైద్యులు కార్నయా మార్పిడిని సూచించారు. ప్రాక్టీషనర్ ఆమెకు : #1. CC2.3 Tumours & Growths + CC7.2 Partial Vision కంటి చుక్కలుగా మరియు #2. CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC18.5 Neuralgia + #1. ఇచ్చారు. క్రమంగా దృష్టి మెరుగుపడటం ప్రారంభించి ఆమె కనుపాపను కప్పి ఉంచిన తెల్లటి పొర ఒకచోట పేరుకు పోవడం ప్రారంభించింది. ఒక నెలలో ఆమె రెండు అడుగుల వ్యాసార్థంలో గల వస్తువులను స్పష్టంగా చూడగలిగింది, మూడు నెలల్లో తిత్తి పరిమాణం తగ్గిపోయి ఆమె కన్ను పూర్తిగా తెరుచుకుంది. ఆ తర్వాత పాప విజయవంతముగా కార్నియా గ్రాఫ్టు చేయించుకున్నది. 

యుక్త వయసు నుండి సక్రమంగా ఋతుక్రమం లేని 38 ఏళ్ల మహిళ అల్లోపతి మందులు ప్రయత్నించారు, కానీ అది ఆపిన తర్వాత సమస్య పునరావృతం అవుతున్నది. 2021 నవంబర్ 22న ఆమెకు CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular ఇచ్చారు. మరుసటి నెల నుండే ఋతు క్రమం సక్రమం అయ్యింది. ఇదే విధంగా ఋతు క్రమం సక్రమంగా లేని 15 ఏళ్ల అమ్మాయి CC8.8 Menses irregular + CC12.2 Child tonic తో ఇదే అద్భుతమైన ఫలితాన్ని పొందారు.    

రోగ లక్షణాలను అధ్యయనం చేయడానికి, మూల కారణాన్ని అంచనా వేయడానికి, మరియు రిపోర్టులు ఏమైనా ఉంటే పరిశీలించడానికి తద్వారా మెరుగైన  ప్రిస్క్రిప్షన్ సూచించడానికి తగినంత సమయం ఉంటుందని ఫోన్ లో రోగులను సంప్రదించడానికి ఆమె ఇష్ట పడుతూ ఉంటారు. వైద్య సేవలో పాలుపంచుకోవాలన్న చిన్ననాటి కలను నెరవేర్చుకున్నఈ ప్రాక్టీషనర్ స్వామి చేత ఆశీర్వదింపబడినందుకు సంతృప్తిని అనుభవిస్తున్నారు. రోగులు అనేక ఇతర వైద్య విధానాలను ప్రయత్నించినా విజయం సాధించకుండా వైబ్రో రెమిడీల ద్వారా రోగ స్వస్థత పొందినప్పుడు స్వామివారి అపారమైన ఆశీర్వాదాల పట్ల ఆమె లోతైన కృతజ్ఞతతో నిండిపోతున్నారు.

ఆసక్తిగల తోటమాలి కావడంతో వివిధ ఔషధ మొక్కలతో పాటు తన టెర్రస్ పై కూరగాయల తోటను పెంచుకుంటున్నారు (చిత్రాన్ని చూడండి). అన్ని మొక్కలకు ప్లాంట్ టానిక్ మాత్రమే కాకుండా మిగిలిపోయిన రెమిడి నీటిని కూడా మొక్కలకు ఇస్తారు. మొక్కలపై పరిశోధనలో భాగం కావడంతో పాటు తమిళంలోకి అనువాద పనుల్లో కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. వైబ్రియానిక్స్ ను దైవిక ఔషధంగా అభివర్ణిస్తూ ఈ సేవ నుండి తనకు లభించే గొప్ప ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేయలేను అంటున్నారు. 

పంచుకున్న కేసులు :

 

ప్రశ్నలు జవాబులు

Q1. AVP కోర్సు సమయంలో మెరుగైన చికిత్స కోసం రెమిడీకి తక్కువ సంఖ్యలో కోంబోలను జోడించడం మంచిదని సలహా ఇవ్వబడింది. కానీ IB లో 13 కోంబోలు జోడిస్తున్నాము ఇది అంత ప్రభావంతంగా పనిచేస్తుందా?

A. మొదటగా ఎన్ని కాంబోలను కలపాలనే దానిపై కఠినమైన నియమాలు ఏమీ లేవు. అనారోగ్యానికి సంబంధించి కాంభోలను మాత్రమే నేరుగా కలపడం ఎల్లప్పుడూ మంచిది. మీ అభ్యాసం ప్రారంభంలో తక్కువ రెమిడీలు అందించడం ద్వారా మీరు వ్యక్తిగత రెమిడీల ప్రభావాన్ని మరియు ప్రతి ఒక్కటి ఎంత బాగా పనిచేస్తుందో అధ్యయనం చేయడం ముఖ్యం. కానీ అనుభవంతో మీరు కోంబోలను కలిపి ఇచ్చినప్పుడు ఏ కోంబోలు బాగా పనిచేస్తున్నాయో మీరు గుర్తించి నిర్ణయించుకోగలుగుతారు. ఇమ్యూనిటీ బూస్టర్ ఐ‌బి ఒక ప్రత్యేక ఉదాహరణ. కోవిడ్ 19 శరీరంలోని అనేక వ్యవస్థలను ప్రభావితం చేసింది, అందుకే IBలో పెద్ద సంఖ్యలో కొంబోలు ఉన్నాయి. కొత్త ప్రాక్టీషనర్లకు మా సలహా ఏమిటంటే కనీస సంఖ్యలోనే కోంబోలకు కట్టుబడి ఉండండి, ఐతే మీకు తెలిసిన కొన్ని టానిక్కులను అదనంగా కూడా జోడించవచ్చు. ఆ తర్వాత మీకు అవసరమైన అనుభవం కలిగినప్పుడు మీరు రుగ్మతులకు సంబంధించినవి మాత్రమే కాక మరికొన్ని రెమిడీలను జోడించడం ప్రారంభించవచ్చు. 

_______________________________________________________________________________

Q2. మేము మా చికిత్స ప్రోటోకాల్ యొక్క సాధారణ కోర్సులో QDS మరియు BD మోతాదులను ఎందుకు సూచించకూడదు?

A. బాగా పనిచేసే అత్యంత సాధారణ మోతాదు TDS అని మేము అనుభవం ద్వారా తెలుసుకున్నాము. ఇది అనువైనది మరియు ఆచరణాత్మకమైనది- ఉదయం లేవగానే ఒక మోతాదు, మధ్యలో ఒకటి ముఖ్యంగా మధ్యాహ్న భోజనానికి ముందు, రాత్రి నిద్రించే ముందు ఒకటి. మోతాదు వ్రాయబడనప్పుడు ఆటోమేటిక్ గా TDS అని అర్థంచేసుకోవాలి. మేము QDS ని కూడా సూచిస్తాము కానీ ఆచరణలో దాన్ని అనుసరించడం చాలా కష్టం. అలాగే అనేక సముచితమైన సందర్భాల్లో మేము BD ని కూడా సూచిస్తాము.   

_______________________________________________________________________________

Q3. ఈ రోజుల్లో వాయు కాలుష్యం ముఖ్యంగా భారతదేశంలోని పెద్ద నగరాల్లో డబ్ల్యూహెచ్వో సిఫార్సు చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI పరిమితి 60 ని అధిగమించి ఉన్నది. ఇటీవలే డిల్లీ లో AQI 500 దాటిపోయింది. అటువంటి కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి ఏదైనా రెమిడీ ఉన్నదా?  

A. క్రింద సూచించిన రెమిడీ అనుసరించండి:

SRHVP మిషను ఉపయోగించే వారి కోసం:  SM14 Chemical Poison + SM31 Lung & Chest + SM35 Sinus + SR272 Arsen Alb 30C + SR292 Graphites 30C + SR349 Euphrasia 6X + SR399 Nux Mosch

108CC బాక్సు ఉపయోగించే వారి కోసం:  CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic

_______________________________________________________________________________

Q4. ఒక రోగి ముఖ్యంగా ఒక పిల్లవాడు పొరపాటున రెమిడీ పిల్స్ గానీ లేదా రెమిడీ వాటర్ గానీ నాలుక కింద ఉంచడానికి బదులు మింగివేస్తే రెమిడీ పనిచేస్తుందా?

A. వైబ్రేషన్లు పనిచేస్తాయి కానీ అవి తక్కువ ప్రభావంతంగా ఉండవచ్చు, ఎందుకంటే అవి నాలుక కింద ఉన్న నరాల చివరలలో బాగా గ్రహింపబడతాయి. శిశువు మళ్ళీ ఆ మోతాదు తిరిగి తీసుకోవడం మంచిది. శిశువులు లేదా నవజాత శిశువులకు వైబ్రేషన్లు నిర్వహించడంపై మార్గదర్శకత్వం కోసం సంపుటి 2 సంచిక 3 ప్రశ్న 5, సంపుటి 3 సంచిక 6 ప్రశ్న2 మరియు సంపుటి 14 సంచిక 3 ప్రశ్న 1 చూడండి.

_______________________________________________________________________________

Q5. 108 సిసి బాక్స్ రీఛార్జ్ చేయడానికి సంబంధించి తాజా సూచనలు ఏవి? 

A.ఈ ప్రశ్న సంపుటి 14 సంచిక 4 ప్రశ్న 2 లో తగిన విధంగా వివరింప బడింది. ఇక్కడ మీరు మునుపటి ఇతర సూచనలను కూడా కనుగొంటారు. ఐతే కోవిడ్ మహమ్మారి సమయంలో చాలామంది ప్రాక్టీషనర్లు తమ 108 CC బాక్సు రీఛార్జి చేయలేకపోయారు. అయినప్పటికి మూడు సంవత్సరాల తర్వాత కూడా వారి సీసీలు అంతే సమానంగా ప్రభావితంగా ఉన్నాయని నివేదించారు. దీన్ని మనం స్వామి  అనుగ్రహానికి ఆపాదించవచ్చు. ఇంతేకాక మా పరిశోధనా బృందం కాలానుగుణంగా అప్డేట్ చేస్తున్న రెమిడీలు మాస్టర్ బాక్స్ కి జోడింపబడుతున్నాయని గుర్తుంచుకోండి. అందువల్ల ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి మీ బాక్స్ ను రీఛార్జి చేయడం మంచిది. 

_______________________________________________________________________________

Q6. SRHVP తో బహుళ కార్డులు ఉపయోగించి రెమిడి సిద్ధం చేస్తున్నప్పుడు రెమిడి బాటిల్ను బావిలో నుంచి తీసిన తర్వాత దాన్ని ఎక్కడ ఉంచాలి? యంత్రం మరియు బాటిల్ మధ్య కనీస దూరం ఉండాలా?   

A. బాటిల్ మరియు SRHVP మధ్య కనీసం 6 అంగుళాలు లేదా 15 సెంటీమీటర్ల సహేతుకమైన దూరాన్ని పాటించాలి. బాటిల్ను SRHVP యొక్క కుడివైపున ఉంచడం ఉత్తమం, ఎందుకంటే ఎడమవైపున నమూనా బావి కింద బలమైన అయస్కాంతం ఉంది మరియు దానికి దగ్గరగా ఉంచినట్లయితే అది రెమిడిని తటస్తీకరిస్తుంది.   

దివ్య వైద్యుని దివ్య వాణి

ఈ దుస్థితి అంతా మానవజాతి వల్లనే కలుగుతున్నది. వారు చెప్పినట్లుగా వ్యాధి అనేది సత్య, ధర్మ, శాంతి మరియు ప్రేమ అనే విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఈ విటమిన్లను తీసుకోండి మీరు కోలుకుంటారు, వాటిని మీ పాత్ర మరియు ప్రవర్తనలో మల్చుకోండి. మీరు చక్కటి మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో ప్రకాశిస్తారు.

...సత్యసాయి ఉవాచ, దివ్య వాణి “ You are born for your own sake” (నీ శ్రేయస్సు కోసమే నీవు  పుట్టింపబడ్డావు), 1964 డిసెంబర్ 16, SSS సంపుటి 4 అధ్యాయం 47                                                                                              https://sssbpt.info/ssspeaks/volume04/sss04-47.pdf

 

మీరు సేవకులు, సేవకే అంకితం ఐన వారు. మీరు సేవ చేస్తున్న వ్యక్తులు మీకు కృతజ్ఞతలు తెలిపినా లేదా మిమ్మల్ని నిందించినా  మీకు కేటాయించిన పని మీరు సంతోషంగా చేయాలి. మీరు మీకే సేవ చేసుకుంటున్నారు వారికి కాదు అని గుర్తుంచుకోండి. పూల బొకేలను, లేదా ఇటుక రాళ్ళను సమాన ప్రశాంతతతో స్వీకరించండి. తాము ఈ శరీరము అనే భావనతో తాదాత్మ్యం చెందే వారు మాత్రమే సంతోషిస్తారు లేదా బాధపడతారు. మీరు దేహము కాదు దేహి అని భావింఛాలి. ఇదే మీకు ఉత్తమమైన సేవ చేయడానికి శక్తి ఇస్తుంది”   

... సత్యసాయి ఉవాచ, దివ్య వాణి “The burden of the Badge” (బ్యాడ్జి యొక్క గొప్పదనం), 1965 ఫిబ్రవరి 24, SSS సంపుటి 5 అధ్యాయం 6                                            https://sssbpt.info/ssspeaks/volume05/sss05-06.pdf

ప్రకటనలు

భవిష్యత్తులో నిర్వహింప బోయే వర్క్ షాపులు * 

  • ఇండియా : విర్చువల్  AVP విర్చువల్ వర్క్ షాప్ 5-22 ఏప్రిల్ 2024 అనంతరం ముఖాముఖీ వర్క్ షాప్ 26-28 ఏప్రిల్ 2024, సంప్రదించ వలసిన వారు [email protected]
  • ఇండియా: పుట్టపర్తి : SVP వర్క్ షాప్ 3-5 May 2024**, సంప్రదించ వలసిన వారు కల్నల్ డోగ్రా  వెబ్సైట్  [email protected]

**మార్పులు ఉండవచ్చు

*ఈ వర్క్ షాప్ లు ప్రవేశ ప్రక్రియ మరియు e కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే.

 

అదనంగా

1. ఆరోగ్య కధనం 

ఆరోగ్యానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు గల విటమిన్లు సమృద్ధిగా ఉండే సంపూర్ణ ఆహారం తీసుకోండి ! 

 “సమతుల్యంగా మరియు సంపూర్ణంగా ఉండే శాఖాహారం, క్యారెట్ వంటి కూరగాయల్లో లభించే విటమిన్ సి మరియు విటమిన్ ఈ, లను పుష్కలమైన మోతాదులలో కలిగి ఉండాలి. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యం సరిగా లేని వ్యక్తి సంపదను అనుభవించలేడు. ఆరోగ్యం చాలా ముఖ్యమైనది ఎందుకంటే అది వ్యక్తికి శారీరక మరియు మానసిక బలాన్ని ఇస్తుంది” ..సత్య సాయి బాబా1 

మా వార్తా లేఖ మునుపటి సంచికలో మేము సమతుల్య ఆహారం కోసం మాక్రో న్యూట్రియెంట్ల గురించి తెలియ జేసాము. ఈ కథనం అవసరమైన సూక్ష్మ పోషకమైన విటమిన్లను గురించి తెలుపుతుంది. 

1. విటమిన్ల యొక్క ప్రాముఖ్యత

1.1 ఆరోగ్యానికి ఎంతో కీలకం : విటమిన్లు మరియు మినరల్స్ అనేవి శరీరానికి జీవించటానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి తక్కువ మొత్తంలో అవసరమైన రెండు ముఖ్యమైన పోషకాలు వాటిని సమిష్టిగా సూక్ష్మ పోషకాలు మైక్రోలు అని అంటారు. అవి మాక్రో లను అంటే స్థూల సూక్ష్మ పదార్థాలను జీవక్రియ ద్వారా శోషణం చేసి శక్తిని పొందేలా చేస్తాయి. మైక్రోలు చాలా కీలకమైనవి, వీటి లోపం శక్తిస్థాయి, మానసిక స్పష్టత మరియు మొత్తం సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇవి గుర్తింపబడదగిన పరిణామంలో ఉండక పోవచ్చు కానీ మనల్ని వ్యాధికి గురిచేసి ఆ తర్వాత అది తీవ్రమైన అనారోగ్య పరిస్థితిలకు దారితీసి ప్రాణాపాయ స్థితిని కలిగించ వచ్చు.2

1.2 కీలకమైన పాత్ర మరియు వైవిధ్యం : విటమిన్లు అనేవి మొక్కలు మరియు జంతువులచే తయారు చేయబడిన సేంద్రియ పదార్థాలు మరియు జీవించడానికి ఆహారము నుండి పొందబడతాయి. ఇవి కార్బన్ మూలకాన్ని కలిగి ఉండి భూమిపై జీవితాన్ని ప్రారంభించేలా చేసి మన శరీరం లోని ప్రతీ అవయవం యొక్క పనితీరులో తమ పాత్ర కలిగి ఉంటాయి. కొన్ని సంవత్సరాల పరిశోధన తర్వాత 1948 నాటికి విటమిన్ల ఆవిష్కరణ జరిగి కొన్ని వ్యాధులు విటమిన్ లోపం వల్లనే వస్తాయని, ఇన్ఫెక్షన్లు మరియు టాక్సిన్స్ వల్ల కాదని తెలిసింది. స్థూలంగా 13 విటమిన్లు ఉన్నాయి- A, C, D, E, K, మరియు 8 B కాంప్లెక్స్ విటమిన్లు. B1(థైయామిన్), B2(రైబోఫ్లోవిన్), B3 (నియాసిన్), B5 (పాన్టోతేనిక్ యాసిడ్), B6( పైరడాక్సిన్), B7(బయోటిన్ విటమిన్ హెచ్ అని కూడా పిలుస్తారు), B9(ఫోలిక్ యాసిడ్) మరియు B12 (కోబాల్మిన్). ఇవికాక మిగిలిన B4, B8, B10, & B11 విటమిన్లు గా పరిగణింపబడవు. ఇవన్నీ శరీరానికి జన్యు సంబంధిత మరియు జీవ రసాయన విశిష్ట లక్షణాల ఆధారంగా వివిధ పరిమాణల్లో  అవసరమవుతాయి.3-6

1.3 విటమిన్లు వినియోగం యొక్క స్వభావం : విటమిన్లు A, E, D, & K కొవ్వులో కరిగేవి. ఆహారంలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజ లవణాలు ఈ విటమిన్లు శరీరం లోకి ప్రవేశించడానికి ఉపయోగ పడతాయి, మరియు కాలేయం మరియు కొవ్వు కణజాలంలో ఇవి నిల్వ చేయబడతాయి, కాబట్టి వీటిని ప్రతిరోజూ తీసుకోవలసిన అవసరం లేదు. విటమిన్ C మరియు B విటమిన్లు నీటిలో కరిగేవి, శరీరంలో కొద్దికాలం నిలువ ఉంటాయి, అందుచేత వీటిని తరుచుగా శరీరంలో భర్తీ చేసుకుంటూ ఉండాలి. కానీ విటమిన్ B12 మాత్రం కాలేయంలో మూడు నుండి ఐదు సంవత్సరాలు పాటు నిల్వ ఉంటుంది, ఏదైనా అదనపు పరిమాణం ఉంటే సాధారణంగా అది మూత్రంలో విసర్జింపబడుతుంది.7,8

2. కొవ్వులో కరిగే విటమిన్లు

2.1 విటమిన్ : వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్తో పోరాడటానికి కళ్ళు, చర్మం, మరియు రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ A చాలా ముఖ్యమైనది. ఇది ఊపిరి తిత్తుల యొక్క పొరలను, పేగులు మరియు మూత్ర నాళాలను తగిన ఆకృతిలో ఉంచుతుంది. బాహ్య మరియు అంతర్లీన మొటిమల నివారణకు, మరియు చికిత్సకు గాయాలను నయం చేయడానికి విటమిన్ A ఎంతో ఉపయోగ పడుతుంది. ఫ్రీ ఫార్మ్డ్ విటమిన్ A లేదా రెటినాల్ సహజంగా గుడ్లు మరియు పాలతో సహా జంతు ఉత్పత్తుల్లో లభిస్తుంది. ప్రో విటమిన్ A లేదా కెరోటినాయిడ్ (సాధారణముగా బీటా కెరోటిన్ గా లభ్యమయ్యేది) అనేది శరీరం విటమిన్ A గా మార్చే పోషకం. ఇది ప్రకాశవంతమైన రంగులలో కనిపించే అన్ని రకాల పండ్లు మరియు కూరగాయలలో కనిపిస్తుంది. కూరగాయలను ఆరోగ్యవంతమైన కొవ్వుతోపాటు ఉడికించి తినేటప్పుడు మన శరీరం విటమిన్లను బాగా ఉపయోగించుకుంటుంది. 9-12

విటమిన్ A లోపం ఉన్నప్పుడు అలసట, పొడి కళ్ళు (కన్నీళ్లు ఉత్పత్తి చేయలేకపోవడం మొదటి సంకేతాల్లో ఒకటి) దృష్టి కోల్పోవడం, చీకట్లో చూడలేకపోవడం రాత్రి అంధత్వమునకు దారి తీస్తుంది. పొడిబారిన, దురద తో కూడిన,  లేదా కఠినమైన ఎగుడు దిగుడు చర్మం, వంధత్వం, మరియు పిల్లల్లో పెరుగుదల మరియు అభివృద్ధి ఆలస్యం అవ్వడం వంటివి ఏర్పడ వచ్చు. లోపం తేలికపాటిది ఐనా లేదా తీవ్రమైనది ఐనా ఇన్ఫెక్షన్ ముఖ్యంగా చాతి మరియు గొంతులోఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.9-11

2.2 విటమిన్ D (సూర్య రశ్మి విటమిన్/కాల్సి ఫెరాల్): మనకు అవసరమైన పోషక పదార్థం మరియు శరీరం ఉత్పత్తి చేసె హార్మోన్ గా విటమిన్ డి, కీలకమైన ఖనిజాలను గ్రహించి నిలుపుకోవడం ద్వారా ఎముకలను నిర్మించడంలో సహాయపడేందుకు, క్యాన్సర్ కణాల పెరుగుదల నివారణకు, వాపు మరియు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, అంతేకాక నాడీ వ్యవస్థను పటిష్ట పర్చడానికి, హృదయ నాడీ వ్యవస్థను, ఎండోక్రిన్ వినాళ వ్యవస్థను పటిష్ట పరచడానికి ఇది ఎంతో ముఖ్యమైనది. దాని పాత్ర గురించి వివరాలు కోసం సూర్యరశ్మి మరియు ఇతర వనరుల నుండి దాన్ని ఎలా తీసుకోవాలి మరియు దాని లోపం వల్ల వచ్చే వ్యాధులు గురించి మన వార్తా లేఖ సంపుటి 3 సంచిక 4 జులై- ఆగస్టు 2012, మరియు సంపుటి 5 సంచిక 1 జనవరి- ఫిబ్రవరి 2014 మరియు క్రింద పేర్కొన్న లింకులను చూడండి. 13-19

 ఈ విటమిన్ లోపానికి సూచికలు తక్కువ కాల్షియం స్థాయిలు (హైపో కాల్సేమియా) అతి చురుకైన పారా థైరాయిడ్ గ్రంధులు( హైపర్ పారా థైరాయిడిజం), ఎముకలలో ఖనిజ లోపం (డి మినరలైజేషన్) మరియు మృదువైన ఎముకలు, పిల్లల్లో ఎముకలు మరియు కీళ్లలో వైకల్యం (రికెట్స్ వ్యాధి), కండరాల బలహీనత, తిమ్మిరి, తరచుగా పడిపోవడం, నడవడంలో ఇబ్బంది, అలసట మరియు నిరాశ వంటివి ఉంటాయి. కనుక ఈ లక్షణాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి. 16

2.3 విటమిన్ E : సహజంగా పళ్ళు, కాయలు, గింజలు మరియు ఆకుకూరల్లో ప్రత్యేకించి గోధుమ పొట్టు నుండి తీసిన నూనె (చాలా ఎక్కువ స్థాయి), పొద్దుతిరుగుడు విత్తనాలు మరియు బాదం లో ఇది లభిస్తుంది. శరీరానికి విటమిన్ K ను ఉపయోగించుకోవడంలో ఇది సహాయపడుతుంది. బలమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ E మేధస్సు, అభిజ్ఞా మరియు రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది, ధమనులలో రక్తం గడ్డ కట్టడం నిరోధానికి, వయస్సు సంబంధిత దృష్టి మాంద్యం, న్యూరో డిజనరేటివ్ వ్యాధులు మరియు క్యాన్సర్ను నివారిస్తుంది. ఇది చర్మం జుట్టు మరియు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 8 వారాలపాటు ప్రతీరోజు విటమిన్ సి మరియు ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలతో కలిపి తీసుకున్నప్పుడు ఋతునొప్పి, తిమ్మిరి, నుండి ఉపశమనం కలుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. విటమిన్ E యొక్క తైలము చర్మం, గోర్లు, మరియు వెంట్రుకలపై పూయడానికి ఆరోగ్యకరమైనదిగా పరిగణింపబడుతుంది, అలాగే మచ్చలు, చర్మం పొడిబారడం, మరియు మొటిమలను కూడా తొలగిస్తుంది.20-23

దీని లోపం యొక్క సంకేతాలు రెటీనా పాడవడం, పరిధియ నరాల వ్యాధి. శరీర కదలికలలో నియంత్రణ కోల్పోవడం మరియు రోగ నిరోధక శక్తి తగ్గటం.20-23

2.4 విటమిన్ K : బిజీ న్యూట్రియెంట్ గా పేరుగాంచిన ఇది రక్తము గడ్డ కట్టడానికి, గుండె ఆరోగ్యానికి, బలమైన ఎముకలకు, మరియు గాయాలను నయం చేయడానికి అవసరమైన కొన్ని ప్రోటీన్లను తయారుచేస్తుంది. అతి సాధారణ మైన K 1 విటమిన్ ఆకుపచ్చ మరియు క్రూసిఫెరస్ కూరగాయలలో, బ్లూబెర్రీస్ మరియు అత్తిపండ్ల వంటి పళ్ళలో మరియు తక్కువ మొత్తంలో తృణధాన్యాలు మరియు పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది. అరుదుగా K2 విటమిన్ జంతు ఉత్పత్తులు మరియు పులియబెట్టబడిన ఆహారాల్లో కనుగొనబడుతుంది మరియు గట్ లేదా జీర్ణశయ బ్యాక్టీరియా ద్వారా కూడా ఉత్పత్తి చేయబడుతుంది. శరీరంలో K1 కంటే ఎక్కువ సేపు నిలువ ఉండి శరీరానికి ప్రయోజనాలు పెంచుతుంది. ఎవరికైనా విటమిన్ D లోపిస్తే, కాల్షియం ను ఎముకల వైపు మళ్ళించడం ద్వారా K2 కాల్సిఫికేషన్ను నిరోధిస్తుంది. విటమిన్ D తో పాటు K2 ను ఆహారంలో తీసుకోవడం వల్ల ఎముకలు విరగడాన్ని నివారించడం, ధమనులలో పలకల నివారణ, ఆర్థరైటిస్ మరియు డెమిన్షియ ప్రమాదాలు కూడా తగ్గింప బడతాయి. 24-28  

దీని లోపం యొక్క చిహ్నాలు వేళ్ళ గోళ్ళ కింద చిన్న గాయాలు, రక్తం గడ్డ కట్టడంలో ఆలస్యం, ఆనియంత్రిత రక్తస్రావం, చిగుళ్ళు మరియు ముక్కు నుండి రక్తస్రావం, రక్తంతో తడిసిన నల్లటి మలం, రక్తస్రావం, ఆస్టియోపేనియా లేదా ఆస్టియో పోరోసిస్, బోలు ఎముకల వ్యాధి వంటివి ఏర్పడ వచ్చు. బ్లడ్ తిన్నర్స్ తీసుకునే వారు K సప్లిమెంట్ తీసుకోకూడదు, వారి డాక్టర్ సూచించిన విధంగా ఆహారం నుండి K విటమిన్ తీసుకోవడం కోసం ప్లాన్ చేసుకోవాలి. శిశువుల విషయంలో సాధారణంగా వారి శరీరంలో చాలా తక్కువ మొత్తంలో విటమిన్ K తో పుట్టినప్పుడు రక్తస్రావం నిరోదించడానికి పుట్టినప్పుడు విటమిన్ K యొక్క ఒక ఇంట్రా మస్కులర్ ఇంజెక్షన్ సిఫారసు చేయబడింది.24-29

3. నీటిలో కరిగే విటమిన్లు

3.1 విటమిన్ C (ఆస్కార్బిక్ యాసిడ్) : నీటిలో కరిగే శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ ఐన ఈ విటమిన్ రోగ నిరోధక వ్యవస్థను మరియు కణజాల ఆరోగ్యాన్ని బలపరచడం ద్వారా తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం, జలుబు మరియు ఫ్లూ యొక్క తీవ్రతలు తగ్గించడం, కళ్ళు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇది ఇనుము శరీరం లోకి ప్రవెశించడాన్ని సులభతరం చేసి గాయాలు, కోతలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ C అధికంగా ఉండే ఆహారాలు ఇండియన్ గూస్ బెర్రీ (ఉసిరి), చెర్రీస్, స్ట్రాబెర్రీ, సిట్రస్, కివి, జామ, బొప్పాయి, పెర్సిమోన్స్, గ్రీన్ ప్లమ్స్‌, పసుపు రంగు బెల్ పెప్పర్స్, టమాటాలు, కృసిఫెరస్ కూరగాయలు తాజా పార్స్లీ మరియు తెల్ల బంగాళదుంపలు. 30-33 

ఈ విటమిన్ లోపం యొక్క హెచ్చరిక సంకేతాలు, రక్తనాళాల నుండి రక్తస్రావం లేదా గాయాల వలన చర్మము పై మచ్చలు, చిగుళ్ల వాపు లేదా రక్తస్రావం వలన చివరికి దంతాల నష్టం, జుట్టు రాలడం, గాయాలు మానడంలో ఆలశ్యము, అలసట మరియు ఇనుము లోపం కారణంగా రక్తహీనత వంటివి ఏర్పడుతూ ఉంటాయి. స్కర్వి అనేది తీవ్రమైన లోపం యొక్క ముఖ్య లక్షణం. 30-33 

హెచ్చరిక: ప్రజలు విటమిన్ సి సప్లిమెంట్లను విరివిగా తీసుకుంటూ ఉంటారు. నీటిలో కరిగేది అయినప్పటికీ అదనంగా తీసుకోవడం వలన తలనొప్పి, ఉబ్బరం, అతిసారం, ఎర్రబడిన చర్మం, మరియు తిమ్మిరి, మూత్రపిండల్లో రాళ్లు, మరియు వైఫల్యానికి కూడా దారి తీయవచ్చు. ఇది ఐరన్ ఓవర్ లోడ్ కారణంగా గుండె, కాలేయం, మరియు ప్యాంక్రియాస్ ను పాడు చేయవచ్చు. 30-33 

 3.2 B-విటమిన్లు :  

మొత్తం ఎనిమిది B విటమిన్లు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి, మంటను తగ్గిస్తాయి, హార్మోన్ల పనితీరుకు మద్దతు ఇస్తాయి, ఎర్ర రక్త కణాలను అభివృద్ధి చేస్తాయి, మరియు ఆరోగ్యకరమైన జీవక్రియ మరియు జీర్ణవ్యవస్థను నిర్ధారిస్తాయి. వీటి పాత్రలు మరియు రసాయన లక్షణాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ ప్రతీ విటమిన్ తన దైన తీరులో పనిచేస్తూ అలసట, రక్తహీనత, భావాందోళన రుగ్మతలు, మరియు జ్ఞాపకశక్తి లోపాన్ని నిరోధించడానికి దాని ప్రత్యేక పనితీరును కలిగి ఉంటుంది. వీటిలో అన్నింటి (బి కాంప్లెక్స్) కలయిక ఉత్తమంగా ఉంటుంది ఎందుకంటే ఇవి కలసికట్టుగా పనిచేస్తాయి. 7,34,35 

3.2.1 విటమిన్ B1: తృణ ధాన్యాలు, అనేక రకాల గింజలు, నల్ల చిక్కుళ్ళు, పచ్చిబఠానీలు, చింతపండు, మరియు పెరుగులో సహజంగా లభిస్తుంది. ఇది జీవక్రియ మరియు నరాల పనితీరులో కీలక పాత్ర కలిగి ఉంటుంది. టీ మరియు కాఫీ థయామిన్ శోషణాన్ని అడ్డుకుంటాయి. తీవ్రమైన లోపం బెరి బెరి  వ్యాధిని కలిగించి అసంకల్పిత చర్యలు, కండర పనితీరును దెబ్బతీస్తుంది. దీనివలన కండరాల రుగ్మత  మరియు చేతుల మరియు కాళ్లలో శక్తి లేనట్లు అనుభూతి (పరదీయ నరాల వ్యాధి), మేధస్సు (అభిజ్ఞా) క్షీణత, పక్షవాతం, మరియు గుండె ఆగిపోవడం వంటివి ఏర్పడవచ్చు..34,36-38 

 3.2.2 విటమిన్ B2 : పెరుగు, పాలు, వెన్న, ఓట్లు, క్వినోవా, మరియు బాదంపప్పులో ఉత్తమంగా లభిస్తుంది. ఆపిల్, పాలకూర, టమోటాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, కిడ్నీ బీన్స్, మరియు జీర్ణాశయ బ్యాక్టీరియా లో  తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మం మరియు కళ్ళకు ఇది అవసరం. ఇది ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇనుము మరియు ఇతర B విటమిన్లను గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపించడం వలన కలిగే లక్షణాలు పెదవులలో పగుళ్లు, గొంతు నొప్పి, చర్మంపై దద్దుర్లు, దురద తో కూడిన ఎర్రని కళ్ళు, తీవ్రమైన సందర్భాల్లో కంటి శుక్లము, మరియు ఇనుము లోపం కారణంగా రక్తహీనత కలుగుతాయి. దీర్ఘకాలిక లోపం పార్శ్వపు నొప్పి,  మెదడు మరియు గుండె లోపాలు, మరియు కొన్ని రకాల క్యాన్సర్లకు కారణం కావచ్చు. అధికముగా తీసుకున్నప్పుడు మూత్రం ప్రకాశవంతమైన పసుపు రంగులోనికి మారుతుంది. 4,6,39-41   

3.2.3 విటమిన్ B3 : ఇది బ్రౌన్ రైస్ వంటి ధాన్యాల్లో, గింజలు, విత్తనాలు, చిక్కుళ్ళు, మరియు అరటిలో లభిస్తుంది. మొక్కజొన్నలో సహజంగా B3 ఎక్కువగా ఉంటుంది అయితే దానిని ఉడికించి మెత్తగా చేస్తే తప్ప శోషింపబడదు. అరుదైనదైనప్పటికీ దీని యొక్క తీవ్రమైన లోపం పెల్లాగ్రా వ్యాధికి అనగా సూర్యరశ్మికి గురైన చర్మప్రాంతాలపై ముదురు రంగు దద్దుర్లు ఏర్పడడం, నాలుక ప్రకాశవంతమైన ఎరుపు రంగుకు మారడం, అతిసారం, నిరాశ, మరియు చిత్త వైకల్యం వంటి వాటికి దారి తీయవచ్చు. 42,43

 3.2.4 విటమిన్ B5 : ఇది క్యాబేజీ, బ్రోకలీ, తెలుపు మరియు ఎరుపు చిలకడ దుంపలు, అవకాడో, బ్రౌన్ రైస్, ఓట్స్, పొద్దుతిరుగుడు గింజలు, మరియు పాల ఉత్పత్తుల్లో ఉంటుంది. కొద్ది మొత్తంలో జీర్ణాశయ బ్యాక్టీరియా ద్వారా తయారు చేయబడుతుంది. ఈ విటమిన్,  B2 విటమిన్ ను మన శరీరం సమర్ధవంతంగా ఉపయోగించు కోవడంలో సహాయ పడుతుంది. అంతేకాక తామర, విషపూరిత మొక్కల వల్ల ఏర్పడే చర్మ రుగ్మత, కీటకాల కాటు, డైపర్ వలన ఏర్పడే దద్దుర్లు, వంటి వ్యాధుల నిర్మూలనకు ఉపయోగ పడుతుంది. అంతేకాక చర్మం మరియు జుట్టును పొడిబారకుండా తేమగా ఉంచడం వంటి వివిధ చర్మ పరిస్థితులను నయం చేయడానికి సౌందర్య సాధనాల్లో కూడా ఉపయోగిస్తారు. ఈ విటమిన్ లోపం యొక్క లక్షణాలు అలసట, చిరాకు, న్యూరో సమస్యలు, మరియు ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటివి. తీవ్రమైన లోపం చాలా అరుదు కానీ తేలికపాటి లోపం కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.44-46

3.2.5విటమిన్ B6 : ఇది సహజంగా చిక్ పీస్ లో (ఒక కప్పు మన రోజువారి అవసరాలు 65% తీరుస్తుంది) మరియు ఇతర చిక్కుళ్ళు, అవకాడో, పృన్స్, అరటి పళ్ళు, పిస్తా పప్పులు, ముదురు రంగు ఆకుకూరలు, పచ్చి బఠానీలు, క్యారెట్లు, మరియు చిలకడదుంపల్లో లభిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట  పరుస్తుంది, మెదడు మరియు నరాలను రక్షిస్తుంది, గర్భిణీ స్త్రీలలో వ్యాధులను మరియు మార్నింగ్ సిక్నెస్ నుండి ఉపశమనం ఇస్తుంది. B12 మరియు పోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా దీని లోపం ఏర్పడుతుంది. తేలికి పాటి లోపం గుర్తింప దగిన లక్షణాలను కలిగి ఉండకపోవచ్చు కానీ తీవ్రమైన లోపం రక్తహీనత, నిరాశ, గందరగోళం, మరియు రోగనిరోధక శక్తి లోపం వంటివి చూపుతుంది. అధిక మోతాదులవల్ల పరధీయ నాడీవ్యాధులు, శరీర కదలికలపై నియంత్రణ కోల్పోవడం, వికారం, మరియు వెలుతురికి (కాంతికి) సున్నితత్వం ఏర్పడవచ్చు. అయితే అధిక మోతాదు ఆపిన వెంటనే ఈ లక్షణాలు కూడా తగ్గిపోతాయి. 47-49   

3.2.6 విటమిన్ B7 : దీనికి మంచి ఆహార వనరులు అవకాడో, చిలకడ దుంప, పొత్తు తిరుగుడు విత్తనాలు, గింజలు, చిక్కుళ్ళు, మరియు పుట్టగొడుగులు. దీని లోపంవలన జుట్టు రాలడం, చర్మంపై దద్దుర్లు, మరియు గోర్లు పెళుసుగా మారడానికి దారి తీస్తుంది. సప్లిమెంట్ల యొక్క ప్రయోజనాలు ఆకర్షణీయంగా మరియు జనాదరణ పొందినప్పటికీ ప్రస్తుతం అనిశ్చితమైన అధ్యయనాలే ఆధారం.  హెచ్చరిక పచ్చి గుడ్లు తినేవారికి దీనిలో ఉండే అడ్విన్ అనే ప్రోటీన్ B7 యొక్క శోషణాన్ని నిరోధిస్తుంది, కనుక ఉడికించినవి సురక్షితం.50,51

3.2.7 విటమిన్ B9 (ఫోలిక్ యాసిడ్) : ప్రోటీన్ జీవక్రియ, జన్యుపదార్థాల ఉత్పత్తి, మరియు ఆరోగ్య కరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి గర్భధారణ సమయంలో పిండం అభివృద్ధిలో ఇది చాలా కీలకం. ఉత్తమ ఆహారాలు ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, ఎక్కువ పోలేట్లను నిలుపుకోవడానికి పచ్చిగా లేదా కొద్దిసేపు ఆవిరిలో ఉడికించినవి ఉత్తమమైనవి. బీన్స్, వేరుశనగ, పొద్దు తిరుగుడు విత్తనాలు, తృణధాన్యాలు, మరియు చింతపండు. ఇతర ఆహార వనరుల నుండి పోలేట్ రూపంలో (కేవలం 50%) కంటే సప్లిమెంట్ల నుండి పోలిక్ యాసిడ్ రూపంలో(85%) బాగా గ్రహించబడుతుంది. అధిక మొత్తంలో తీసుకుంటే B12 లోపాన్నికప్పి ఉంచే అవకాశం ఉంది. రక్తహీనత, అలసట, సక్రమంగా లేని హృదయ స్పందన, ఊపిరి ఆడక పోవడం, జుట్టు రాలడం, మరియు నోటి పుండ్లు వంటివి ఈ విటమిన్ లోపం యొక్క లక్షణాలు.52

3.2.8 విటమిన్ B12 : ఇది నరాల పనితీరు, డీఎన్ఏ ఉత్పత్తి, మరియు ఎర్ర రక్త కణాల అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. విటమిన్ B12 యొక్క ప్రయోజనాలు, అది లభించే మూలాల గురించి, అది ఎలా షోషింపబడుతుంది, దీని లోపం యొక్క లక్షణాలు, రోగనిర్ధారణ మరియు చికిత్స గురించి వార్తాలేఖ సంపుటి 4 సంచిక 6 నవంబర్- డిసెంబర్ 2013 లోని కథనం నుండి తెలుసుకోండి. జీర్ణాశయ బ్యాక్టీరియా B12 ని తయారు చేయగలదు కానీ గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం  వంటి రుగ్మతలు ఈ ప్రక్రియను అడ్డుకుంటాయి.53-55

4. విటమిన్ల నష్టాన్ని నిరోధించండి

మన ఆహారంలో చాలా కాలం పాటు తగినంత విటమిన్లను తీసుకోక పోయినా లేదా మనం సంపూర్ణ ఆహారం తీసుకోక పోయినా అప్పుడు లోపము ఏర్పడుతుంది. ముసలితనం లేదా అనారోగ్యం, అనారోగ్య కరమైన జీవనశైలి ముఖ్యంగా మద్యపానం వంటి అలవాట్లు, ఆరోగ్యకరమైన ఆహారం నుండి విటమిన్లను శరీరం గ్రహించకుండా చేస్తాయి. అలాగే మనం తీసుకునే యాంటీబయటిక్స్ ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను తుడిచివేస్తాయి లేదా విటమిన్ K మరియు విటమిన్ B వంటి పోషకాలను క్షీణింప చేస్తాయి. కాంతికి గురి కావడం(అల్ట్రా వైలెట్ UV లైట్)  A, D, E, K, B2, B7 వంటి విటమిన్లను నాశనం చేస్తుంది లేదా క్రియారహితం చేస్తుంది. వేడి A, C, B1, B9, B12; విటమిన్లను నాశనం చేస్తుంది. గాలి D, E, K, C, B9, B12 విటమిన్లను నాశనం చేస్తుంది.5,34,36,56,57  

 ఫ్లేవనాయిడ్ లతో కూడిన విభిన్నమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అన్ని విటమిన్లను గరిష్టంగా వినియోగించగలుగుతాము. ఫ్లేవనాయిడ్లు అనేవి  మొక్కల ఉత్పత్తుల్లో లభించే సహజ పదార్థాల సమూహం- పండ్లు (బెర్రీలు, చెర్రీలు, నిమ్మ జాతి పండ్లు) మరియు ఆకుపచ్చ కూరలు ధాన్యాలు (నలుపు, ఊదా, ఎరుపు, రంగులవి), చిక్కుళ్ళు, కాయలు, గింజలు, బెరడు, వేర్లు, కాండం పువ్వులు (ఎండిన పార్సిలీ, ఓరిగానో, చెమోమిలే, పిప్పరమెంటు మరియు ఎర్ర మిరియాలు) మరియు తెలుపు, ఆకుపచ్చ, ఊలాంగ్ మరియు బ్లాక్ టీ, డార్క్ చాక్లెట్ వంటి కొన్ని పానీయాలు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అనేక లక్షణాలను కలిగి ఉంటాయి. 58

కూరగాయల్లో కొన్ని పోషకాలు వండినప్పుడు మాత్రమే శరీరం లోకి గ్రహించబడతాయి. ఉదాహరణకు పూర్తి క్యారెట్లు (చర్మం మరియు ముక్కలు చేయనివి), పాలకూర, టమోటాలు, బెల్ పెప్పర్స్. కానీ తగినంత విటమిన్ C పొందటానికి కొన్నిటిని పచ్చిగా తీసుకోవాలి. B1, B2, B3, B6, మరియు C విటమిన్లు వంట చేస్తున్నప్పుడు వంట ద్రవం లోకి వచ్చేస్తాయి కనుక మిగిలిన ద్రవాన్ని పులుసుగా ఉపయోగించడం మంచిది. 5,12

5. విటమిన్ల నుండి ఉత్తమ ఫలితాలు పొందటానికి చిట్కాలు

  • కొన్ని విటమిన్ లను తయారు చేసే మీ జీర్ణాశయం మరియు విటమిన్లను నిల్వ ఉంచే కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోండి7,8,59
  • అన్ని విటమిన్లను పొందటానికి మరియు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కూరగాయలు (వండినవి మరియు పచ్చివి) పండ్లు, తృణ ధాన్యాలు, గింజలు మరియు విత్తనాలు, చిక్కుళ్ళు, బీన్స్, కాయ ధాన్యాలు మరియు పాల ఉత్పత్తులతో కూడిన సమతుల్య ఆహారంపై ఆధారపడండి. పాలిష్ చేసిన మరియు శుద్ధి చేసిన పిండి పదార్థాలను నివారించండి.6,36
  • కేవలం అవసరమైనంత నీరు మరియు సరైన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఆహారాన్ని వండాలి. 5,12
  • తప్పనిసరి అయితే తప్ప చక్కెర జోడించబడని బలవర్ధకమైన ఆహారం ఎంచుకోండి, ఎందుకంటే అవి సాధారణంగా ప్రాసెస్ చేయబడతాయి.60  .
  •  మీకు విటమిన్ లోపానికి సంబంధిత లక్షణాలు ఉంటె తప్ప లేదా మీ వైద్యుడు సలహా ఇస్తే తప్ప సప్లిమెంట్లను ఎంచుకోవద్దు. ఆహారం ద్వారా విటమిన్ ల అధిక వినియోగం వలన భయం లేదు. అదనపు సప్లిమెంట్లు దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి. అధిక మోతాదులో తీసుకోవలసి ఉంటే సాధారణ పర్యవేక్షణ ముఖ్యం. 6,34,61
  • సంపూర్ణ శోషణం కోసం కొవ్వుతో కూడిన ఆహారాన్ని తిన్న తర్వాత కొవ్వులో కరిగే విటమిన్లు A, E, D, & K సప్లిమెంట్లను తీసుకోండి. ఉదాహరణకు కొవ్వుతో వండిన ఆహారం మరియు కొద్ది మొత్తంలో పెరుగు. నీటిలో కరిగే విటమిన్లు C మరియు B12 తీసుకోవడానికి ఉత్తమం సమయం భోజనానికి ముందు ఖాళీ కడుపుతో ప్రధానంగా ఉదయం లేదా భోజనం పూర్తి ఐన తర్వాత 2-3 గంటలు అనంతరం.  అలాగే 1-2 గంటల విరామంలో నీరు మరియు కొవ్వులో కరిగే విటమిన్లను విడిగా తీసుకోండి. వివిధ  రకాల విటమిన్ తో కూడిన మల్టీ విటమిన్లు శరీరానికి సవాలుగా మారవచ్చు, వాటిని విడిగా తీసుకోవడం మంచిది. 62

చివరి మాట : ఆహారం ఔషధంగా స్వీకరించండి, అలాగే ఔషధమును మీ ఆహారంగా ఉండనివ్వండి... ఆధునిక వైద్య పితామహుడు హిపోక్రటీస్.5,63

రిఫరెన్సులు మరియు లింకులు

  1. Divine Discourse of 21 Jan 1994 on “Food, the heart and the mind”: https://www.ssbpt.info/ssspeaks/vol27/sss27-03.pdf
  2. What are micros: https://www.who.int/health-topics/micronutrients#tab=tab_1
  3. https://www.nia.nih.gov/health/vitamins-and-supplements/vitamins-and-minerals-older-adults
  4. RDA for Micros: https://www.hsph.harvard.edu/nutritionsource/vitamins/
  5. Nature of Vitamins: https://www.bodybuilding.com/fun/vitamins.htm
  6. https://www.foodunfolded.com/article/vitamins-in-food-why-do-we-need-vitamins
  7. Vitamins profile: https://extension.colostate.edu/topic-areas/nutrition-food-safety-health/water-soluble-vitamins-b-complex-and-vitamin-c-9-312/
  8. Healthy fats: https://news.vibrionics.org/en/articles/419
  9. Vit A deficiency: https://my.clevelandclinic.org/health/diseases/23107-vitamin-a-deficiency
  10. https://www.healthline.com/nutrition/vitamin-a-deficiency-symptoms
  11. https://patient.info/healthy-living/vitamin-a-deficiency-leaflet
  12. Veg best cooked: https://theconversation.com/nine-vegetables-that-are-healthier-for-you-when-cooked-182723
  13. Vitamin D: https://www.hsph.harvard.edu/nutritionsource/vitamin-d/#
  14. Enhanced role of vitamin D: https://ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4399494/
  15. https://consultqd.clevelandclinic.org/understanding-the-endocrine-impact-of-vitamin-d-calcium-deficiency-in-the-elderly/#
  16. D deficiency: https://my.clevelandclinic.org/health/diseases/15050-vitamin-d-vitamin-d-deficiency
  17. Source sunshine: https://news.vibrionics.org/en/articles/133
  18. https://news.vibrionics.org/en/articles/167
  19. https://www.goodreads.com/quotes/tag/vitamins
  20. Vitamin E: https://www.hsph.harvard.edu/nutritionsource/vitamin-e/
  21. https://www.healthline.com/health/all-about-vitamin-e#3.-May-benefit-those-with-nonalcoholic-fatty-liver-disease-(NAFLD)
  22. https://ufhealth.org/conditions-and-treatments/vitamin-e
  23. https://www.lybrate.com/question/1095904873/hey-i-bought-evion-400-capsule-can-i-have-it-what-are-the-uses-of-it-in-skin-and-hair
  24. Vitamin K: https://health.clevelandclinic.org/vitamin-k
  25. https://health.clevelandclinic.org/vitamin-k2
  26. https://www.hsph.harvard.edu/nutritionsource/vitamin-k/#
  27. https://www.healthline.com/health/vitamin-k
  28. https://www.usatoday.com/story/life/health-wellness/2023/03/27/what-vitamin-k-benefits-body-who-needs-it-k-2-explained/11548498002/
  29. Vitamin K at birth: https://www.cdc.gov/breastfeeding/breastfeeding-special-circumstances/diet-and-micronutrients/vitamin-k.html
  30. Vitamin C: https://health.clevelandclinic.org/vitamin-c
  31. https://www.hsph.harvard.edu/nutritionsource/vitamin-c/
  32. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4648887/
  33. https://www.healthline.com/nutrition/vitamin-c-foods
  34. Vitamin B: https://www.betterhealth.vic.gov.au/health/healthyliving/vitamin-b
  35. https://draxe.com/nutrition/vitamin-b/
  36. Vitamin B1: https://www.hsph.harvard.edu/nutritionsource/vitamin-b1/
  37. https://tools.myfooddata.com/nutrient-ranking-tool/thiamin-b1/nuts-and-seeds/highest
  38. https://www.healthline.com/nutrition/thiamine-deficiency-symptoms
  39. Vitamin B2: https://ods.od.nih.gov/factsheets/Riboflavin-HealthProfessional/
  40. https://draxe.com/nutrition/vitamin-b2/
  41. https://www.hsph.harvard.edu/nutritionsource/riboflavin-vitamin-b2/
  42. Vitamin B3: https://www.hsph.harvard.edu/nutritionsource/niacin-vitamin-b3/
  43. https://my.clevelandclinic.org/health/diseases/23905-pellagra
  44. Vitamin B5: https://www.hsph.harvard.edu/nutritionsource/pantothenic-acid-vitamin-b5/
  45. https://www.healthline.com/health/vitamin-watch-what-does-b5-do#food-sources
  46. https://draxe.com/nutrition/top-10-vitamin-b5-foods-pantothenic-acid/
  47. Vitamin B6: https://www.hsph.harvard.edu/nutritionsource/vitamin-b6/
  48. https://health.clevelandclinic.org/vitamin-b6
  49. https://ods.od.nih.gov/factsheets/VitaminB6-HealthProfessional/
  50. Vitamin B7: https://www.hsph.harvard.edu/nutritionsource/biotin-vitamin-b7/
  51. https://www.medicinenet.com/11_foods_that_have_the_highest_biotin/article.htm
  52. Vitamin B9: https://medicalnewstoday.com/articles/287677
  53. Vitamin B12: https://news.vibrionics.org/en/articles/164
  54. https://my.clevelandclinic.org/health/diseases/22831-vitamin-b12-deficiency
  55. Vitamin B12 stored: https://www.merckmanuals.com/home/disorders-of-nutrition/vitamins/vitamin-b12-deficiency#
  56. Nutritional deficiency causes: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC9710417/#
  57. Antibiotics affect gut bacteria: https://my.clevelandclinic.org/health/body/25201-gut-microbiome
  58. Flavonoids: https://www.healthline.com/health/what-are-flavonoids-everything-you-need-to-know#sources
  59. Role of gut bacteria: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3144392/#
  60. Choose fortified foods: https://www.healthline.com/health/food-nutrition/fortified-and-enriched-foods#Bottom-line
  61. Supplements: https://www.pennmedicine.org/updates/blogs/health-and-wellness/2020/february/the-truth-about-supplements#
  62. Best time for vitamins: https://health.clevelandclinic.org/the-best-time-to-take-vitamins
  63. Food as medicine: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC318470/

______________________________________________________________________________

2. వర్క్ షాప్ లు మరియు శిబిరాలు

1. AVP వర్క్ షాప్: వర్చ్యువల్ నవంబర్ 1-18 తదనంతరం పుట్టపర్తి లో ముఖాముఖీ వర్క్ షాప్ 2023 నవంబర్ 25-27  

   భారతదేశం నుండి అయిదుగురు మరియు గ్వాటిమాలా నుండి ఒక్కరూ AVP లు గా అర్హత సాధించి ప్రమాణ స్వీకారం చేశారు. వైబ్రియానిక్స్ ఉపాధ్యాయులుగా లేదా అడ్మిన్‌ బృందంలో భాగం కావాలనుకునే వారితో సహా పలువురు ప్రాక్టీషనర్లు కూడా వర్క్ షాప్ లో పరిశీలకులుగా పాల్గొన్నారు. ఈ మూడు రోజుల ప్రాక్టికల్ సెషన్లో పాల్గొన్నవారు మునిపటి ఆరునెల ఆన్లైన్ కోర్సులో  నేర్చుకున్న వాటిని పునరా లోకనం చేసుకోవడమే కాకుండా రోగులతో వాస్తవంగా ముఖాముఖి సంభాషన ద్వారా ఆచరణాత్మక అనుభవాన్ని కూడా పొందడం తో అందరూ ఈ ప్రక్రియను అభినందించారు. డాక్టర్ జెకె అగర్వాల్ తన ముగింపు ప్రసంగంలో వైబ్రియానిక్స్ యొక్క అపారమైన సామర్థ్యాన్ని నొప్పి చెప్పారు. కొత్తగా అర్హత పొందిన ప్రాక్టీషనర్లకు సూచనలు ఇస్తూ ఇప్పుడు వైబ్రియానిక్స్ లో అనేక అడ్వాన్స్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నందున వారి ప్రయాణంలో AVP అర్హతను ఒక సోపానంగా చూడాలని వారిని ప్రోత్సహించారు. ఐతే తగినంత జ్ఞానం మరియు అనుభవం లేకుండా వైబ్రియానిక్స్ పై ప్రసంగములు చేయవద్దని హెచ్చరించారు. కొందరు ప్రాక్టీషనర్లు గతంలో ఈ తప్పులు చేశారని చెప్పారు. రోగులను పరిశీలించినప్పుడు మరియు విజయవంతమైన రికవరీ ఉన్నప్పుడు (ఇది అహంకారానికి ఆజ్యం పోస్తుంది) ఫలితాలతో సంబంధం లేకుండా నిరాడంబరంగా ఉండాలని మరియు ఫలితాలు ఆశించినంతగా లేకుంటే నిరుత్సాహ పడవద్దని ఎందుకంటే స్వస్థత అనేది భగవంతుని సంకల్పము అని వారికి సలహా ఇచ్చారు. మొత్తం మీద ఈ ప్రాక్టికల్ వర్క్ షాప్ కొత్త AVP లలో  సేవా భావాన్ని మరియు అంకిత భావాన్ని రేకెత్తించగా వారు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.  

______________________________________________________________________________

2. AVP & రిఫ్రెషర్ వర్క్ షాప్: పెరిగ్యూక్స్ ఫ్రాన్స్ 2023 నవంబర్ 9-13

ఫ్రెంచ్ కోఆర్డినేటర్ 01620 ముగ్గురు AVP ల కోసం ఈ రిఫ్రెషర్ మరియు వర్క్ షాప్ నిర్వహించారు.  వీరిలో ఒకరు కొత్త అభ్యర్థి కాగా మరొకరు రెండేళ్ల క్రితం శిక్షణ పొంది రెఫ్రెషర్ అవసరమని భావించి హాజరైన వారు. మూడవ వారు  2004లో వైబ్రియానిక్స్ చేపట్టి కుటుంబ కట్టుబాట్ల కారణంగా కార్యకలాపాలు తగ్గడంతో ఇప్పుడు తన సేవను పున ప్రారంభించడం కోసం ఉత్సాహంగా హాజరయ్యారు. ఆమె కోఆర్డినేటర్ తో కలసి చాలా నెలలుగా ఈ కోర్స్ ద్వారా వర్క్ షాప్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తను కలిగి ఉన్న SRHVP కి అదనంగా 108CC బాక్సు ఉపయోగించడానికి ఎదురుచూస్తున్నారు. పాల్గొన్న ముగ్గురూ తమ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణులై ప్రమాణ స్వీకారం చేశారు. జూమ్ ద్వారా డాక్టర్ అగర్వాల్తో కాంటాక్ట్ కావడం ద్వారా  మౌఖిక, బాహ్య అనువర్తన, లేదా మరేదైనా పద్ధతిలో రెండు రెమెడీల మధ్య ఆదర్శవంతమైన విరామం ఎంత ఉండాలి, వంటి తమ సందేహాలను స్పష్టంగా నివృత్తి చేసినందుకు సంతోషం వ్యక్తం చేసారు. ప్రాక్టీషనర్లు తమ సేవలో నమ్మకంగా ముందుకు సాగడానికి సంసిద్ధులయ్యారు. 

______________________________________________________________________________

3. ఢిల్లీ లోని సాయి ఇంటర్నేషనల్ సెంటర్ లో 2023 డిసెంబర్ 10 వ తేదీన నిర్వహింప బడిన సమావేశము

 SVIRT గవర్నర్11964 ఆధ్వర్యంలో ఢిల్లీ NCR నుండి ప్రాక్టీషనర్లు డాక్టర్ మరియు శ్రీమతి అగర్వాల్తో నిర్వహించిన ఒక పూట ఇంటరాక్టివ్ సమావేశము ఫలవంతముగా ముగిసింది. తక్కువ సమయంలో వెల్లడించి నప్పటికీ 20 మంది ప్రాక్టీషనర్లు హాజరు కావడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. రెమిడీ లు పంచిపెట్టేటప్పుడు స్వామితో కనెక్ట్ అవడం మరియు అహంకారము మరియు ఆపేక్ష లేకుండా నిస్వార్థ సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. డాక్టర్ అగర్వాల్ లిబరేషన్ -ముక్తి యొక్క నిజమైన అర్ధాన్ని విశ్లేషణాత్మకంగా లోతుగా వివరిస్తూ ఆచరణాత్మక ఉదాహరణలను ఇవ్వడం ద్వారా పాల్గొన్న వారి ప్రశ్నలకు చక్కని సమాధానములు ఇచ్చారు. ప్రాక్టీషనర్లు తమ వంతుగా వైబ్రియానిక్స్ యొక్క అద్భుతమైన సామర్థ్యాన్ని వివరిస్తూ అనేక విజయవంతమైన అద్భుతమైన కేసులను పంచుకున్నారు. వైబ్రియానిక్స్ కమ్యూనిటీ ప్రయోజనం కోసం అటువంటి కేసులన్నిటిని పంపమని వారిని ప్రోత్సహించారు. ఢిల్లీ NCR రాష్ట్ర ప్రెసిడెంట్ మరియు స్వామి కాలేజీ పూర్వ విద్యార్థి వైబ్రియానిక్స్ పట్ల గొప్ప ఆసక్తిని కనబరుస్తూ సభను ఉద్దేశించి ప్రసంగించారు, ఇది వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది.  

______________________________________________________________________________

3. క్యాంపులు మరియు క్లినిక్కులు

 స్వామివారి 98వ జన్మదినోత్సవం పురస్కరించుకొని 2023 నవంబర్ లో SVIRT ఆధ్వర్యంలో జరిగిన శిబిరాలు

నవంబర్ నెలలో భారతదేశంలోని 12 రాష్ట్రాల నుంచి అనగా AP, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, యూపీ, ఉత్తరాఖండ్, మరియు పశ్చిమ బెంగాల్ నుండి 33 మంది ప్రాక్టీషనర్లు 1-3 రోజుల వ్యవధిలో 30 క్యాంపులు నిర్వహించి 1634 మంది రోగులకు చికిత్స అందించి 1668 IB బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ వేదికలలో భాగంగా పాఠశాలలు, మారుమూల గ్రామాలు, పబ్లిక్ మరియు మతపరమైన ప్రదేశాలు మరియు స్థానిక సాయి కేంద్రాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఉదహరించ దగినది పుట్టపర్తి రైల్వే స్టేషన్లో నవంబర్ 21 నుంచి 23 వరకు ప్రాక్టీషనర్01228 ద్వారా నిర్వహింపబడిన 15వ వార్షిక శిబిరానికి మరో ముగ్గురు మద్దతు ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోదగిన సేవ. రోగుల నిరంతర ప్రవాహం నలుగురు ప్రాక్టీషనర్లను విశ్రాంతికి అవకాశం లేకుండా వారి కాలిపై నిలబడేటట్లు ఉంచగా ఉత్సాహభరితమైన ఈ బృందం 913 మంది రోగులకు రెమిడీలు అందించారు. గత సంవత్సరాల మాదిరిగానే చుట్టుపక్కల గ్రామాల్లోని చాలామంది రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సమీపములోని పెనుగొండ కాలేజీకి చెందిన 300 మంది విద్యార్థుల బృందం వారి పరీక్షలు మరియు శీతాకాల విరామం తర్వాత మన  బృందాన్ని ఆహ్వానించి తమ విద్యార్ధులకు మెడికల్ క్యాంపు నిర్వహించాలని అంతేకాక ఇది నిరంతరాయంగా కొనసాగాలని సూచించారు.  

 

 

______________________________________________________________________________

4. పర్యావరణ అనుకూల ప్రయత్నం

ప్రేమతరు మొక్కల పెంపకం కార్యక్రమం ఊపందుకుంది!

     ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లోని స్టీల్ ప్లాంట్ సహకారంతో సత్య సాయి సంస్థ జపనీస్ మియా వాకిటెక్నిక్ ని ఉపయోగించి అడవుల పెంపకం కార్యక్రమం చేపట్టింది. 2023 సెప్టెంబర్ 27న 3200 మొక్కలు నాటారు. ప్రాక్టీషనర్11634…ఇండియా  ఈ మెగా ఈవెంట్ లో భాగంగా మొక్కల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఈ క్రింది రెమిడీ అందించారు: 

CC1.2 Plant tonic + NM67 Calcium + SM1 Removal of Entities + SM5 Peace & Love Alignment

అటవీశాఖ సిబ్బంది సహాయంతో మొక్కలను పర్యవేక్షించడానికి పెద్ద మొత్తంలో రెమిడీ తయారు చేసే విధానాన్ని వివరించారు.

మరో ప్రదేశం డొంకడ్ కాలనీలో మూడు ఎకరాల స్థలంలో 14,500 స్థానిక పండ్ల జాతుల మొక్కలను నాటుతున్నారు. సీనియర్ ప్రాక్టీషనర్11567…ఇండియా  ఆధ్వర్యంలో 17 మంది స్థానిక వైజాగ్ ప్రాక్టీషనర్లు ఈ సేవ కోసం వివిధ ఆధ్యాత్మిక సంస్థలతో చేతులు కలిపారు.

ఢిల్లీ NCR లో నోయిడా లోని పక్షి అభయారణ్యం సిటీ ఫారెస్ట్ లో కొత్తగా నాటిన 1600 పళ్ళు, పువ్వులు, ఇతర మొక్కలపై  ప్లాంట్ టానిక్ పిచికారి చేయడానికి ప్రాక్టీషనర్11437 చొరవ తీసుకున్నారు.  

______________________________________________________________________________

5. కధానిక

సరైన స్థలం లో సరైన సమయంలో 11570...ఇండియా

2023 మార్చి 8 తన పరిసరాల్లో హోలీ పండుగ జరుపుకుంటున్నప్పుడు సహాయం కోసం ఎవరో పెద్దగా కేకలు వేయడం ప్రాక్టీషనర్ విన్నారు. ఒక యువకుడు తన వాటర్ గన్ తో  సమీపంలో చెట్టుపై ఉన్న పెద్ద తేనెతుట్టను కొట్టినట్లు ఆమె కనుగొన్నారు. కలవరపడిన తేనెటీగలు అమాయక ప్రేక్షకుడి పై దాడి చేశాయి. 45 ఏళ్ల ఈ నిస్సహాయ వ్యక్తిని తల, మెడ, మరియు చేతులపై కుట్టడం ప్రారంభించాయి. ప్రాక్టీషనర్ ఇంటికి పరిగెత్తి CC21.4 Stings & Bites + CC21.11 Wounds & Abrasions నీటిలో తయారుచేసి తేనె టీగలు కుట్టిన వాటిపై స్ప్రే చేశారు. అదే రోజు సాయంత్రం అతనిని కలిసినప్పుడు తను ఇంటికి తిరిగి వచ్చి కొన్ని గంటలు పడుకున్నానని మేల్కొన్నప్పుడు నొప్పి లేకపోవడం, వాపు కూడా చాలా తక్కువగా ఉండడం చూసి తను నమ్మలేకపోయానని చెప్పారు. మరుసటి రోజు ఉదయం అతను పూర్తిగా నయమై ఉల్లాసంతో యధావిధిగా తన పనికి వెళ్లారు. ప్రాక్టీషనర్ తనను సరైన సమయంలో సరైన స్థలంలో నిలిపి ఉంచినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

______________________________________________________________________________

6. జ్ఞాపకార్ధం

కేతరీనా రైటర్  02713…ఆస్ట్రియా మన వైబ్రియానిక్స్ వార్తా లేఖలను జర్మన్ భాష లోనికి అనువదించే అత్యంత విలువైన పెన్నిధి అంకిత భావానికి ప్రతిరూపం ఐన 59 ఏళ్ల కేతరీనా రైటర్ 2023 సెప్టెంబర్ లో స్వామి పాదాల చెంత చేరుకున్నందుకు మేము సంతాపం తెలియజేస్తున్నాము. ఆమె భర్త ఇలా రాశారు. “మా అధ్యాత్మిక ప్రయాణంలో మా ప్రియమైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ప్రతీ క్షణం మాకు తోడుగా మార్గ నిర్దేశం చేశారు. కేతరీనా తన నశ్వరమైన శరీరాన్ని విడిచిపెట్టి పరిపూర్ణ ప్రశాంత స్థితి లోనికి చేరిపోయారు” ఆమెను ఎల్లప్పుడూ గుర్తుంచు కోదలచిన వారందరూ తమ హృదయ నిశ్శబ్దంలో ప్రశాంత స్థితిని అనుభవించాలని భగవంతుని అమూల్యమైన దర్శనంలో ఆమెను శాశ్వతంగా చేర్చుకోవాలని ఆమె కోరిక. ఆమె ఎడబాటు యొక్క తుఫాను అలలలో  ఆమెను గాఢంగా ప్రేమించే ఆమె భర్త బాబా మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ “ఆమె ఎక్కడికి వెళ్ళగలదు, ఎక్కడికీ లేదు ఆమె ఇప్పుడు ఇక్కడ శాశ్వతమైన స్థితిలో ఉంది.  

అక్టోబర్ 22న మేము పోగొట్టుకున్న మరో సాయి ఆభరణం 77 ఏళ్ల రోజలిజా మారోల్ట్ 02243…స్లొవేనియా  చాలాకాలంగా అస్వస్థత తో ఉంటూ  క్లాసిక్ లింఫోసైట్ లుకేమియాతో సంవత్సరాలుగా పోరాడుతున్నారు. కానీ ఇతరులకు సేవ చేయడంలో, దాదాపు ఆమె చివరి రోజు వరకు ఆమె నెలవారి నివేదికలను సమర్పించడం లో ఆమెకు గల దక్షతను ఈ వ్యాధి నిలువరించ లేకపోయింది. తన స్థానిక సాయి సెంటర్లో నిత్యం పాల్గొనేవారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ, ఎప్పుడు తప్పులెన్నని మరొక వైబ్రియానిక్స్ ఆభరణం స్వామి మధురమైన ప్రేమలో సురక్షితంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.