Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మానసిక వ్యాకులత 03599 & 02726...यूएसए


58 ఏళ్ల మహిళ గత 12 సంవత్సరాలుగా మానసిక వ్యాకులతో బాధపడుతు అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన తల్లికి చికిత్స చేస్తున్న ప్రాక్టీషనర్ను సంప్రదించారు. రోగి తన చిన్ననాటి రోజుల్లో చాలా ఆత్మవిశ్వాసంతో సంతోషంగా మరియు శక్తివంతంగా ఉండేవారు కానీ ఆమె పెరిగికొద్ది ఆమె తన తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో ఇది ఆమె మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపి యుక్త వయసులో నిరాశకు దారితీసింది. ఏ పని పైన దృష్టి సారించలేకపోతూ క్రమంగా వివాహానంతరం జీవిత భాగస్వామితో విభేదాలకు కూడా దారితీసి చివరకు ఇద్దరు విడిపోవడం జరిగింది. గత నాలుగు సంవత్సరాలుగా అల్లోపతి మందులు వాడుతున్నారు కానీ పెద్దగా ఉపయోగం లేదు,

2022 సెప్టెంబర్ 23 ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది: 

#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing + CC17.3 Brain & Memory tonic...TDS 

#2. IB…OD అల్లోపతి మందులు నిలిపివేశారు

అక్టోబర్ 7వ తేదీన ఆమె ప్రాక్టీషనరు ను తిరిగి సందర్శించిన సందర్భంలో ఆమె తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం వలన ఎక్కువ ఒత్తిడికి లోనై ఉన్నారు, కాబట్టి ప్రాక్టీషనర్ #1 ని 6TD గా నీటితో తీసుకోమని చెపుతూ క్రింది రెమిడి కూడా ఇచ్చారు:  .

#3. CC17.2 Cleansing…TDS నీటితో ఇంటి లోపలా మరియు బయట చల్లుకోవడానికి అనంతరం అక్టోబర్ నెలలోనే ఆమె తల్లి గతించారు.  

2022 నవంబర్ చివర్లో జరిగిన ఒక ఫాలోఅప్ సెషన్ లో ఆమె తన పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు అయితే గత కొన్ని వారాలుగా ఆమె శరీరం అంతా కండరాల తిమ్మిరి, మరియు సంకోచాలను కలిగి ఉంది కనుక #1 క్రింది విధంగా మెరుగుపరచబడింది: 

#4. CC3.7 Circulation + #1...6TD నీటితో  

2023 మార్చి నాటికి ఆమె మానసిక వ్యాకులత విషయంలో 60% మెరుగుదల ఏర్పడి, కండరాల తిమ్మిరి మరియు నొప్పుల విషయంలో 70% మెరుగుదల ఏర్పడింది. ఐతే ఆమెకు అజీర్ణం మరియు ఆమ్లత్వము కారణంగా కాలేయ పనితీరు స్వల్పంగా దెబ్బతినడంతో(బోర్డర్ లైన్ లో) దానిని గుర్తించిన డాక్టర్ అల్లోపతీ సూచించడంతో అది తీసుకోవడానికి ఇష్టపడనందున ప్రాక్టీషనరును అజీర్ణం మరియు ఆమ్లత్వానికి చికిత్సను అభ్యర్థించగా  #4 క్రింది విధంగా మెరుగుపరచబడింది: 

#5. CC4.10 Indigestion + CC4.11 Liver & Spleen + CC13.1 Kidney & Bladder tonic + #4...6TD నీటితో

ఏప్రిల్ 27 నాటికి ఆమె డిప్రెషన్, కండరాలు తిమ్మిరి, మరియు సంకోచాలలో 90% మెరుగుదల, అజీర్ణం, ఆమ్లత్వం విషయంలో 80% మెరుగుదల కనిపించింది. #5 ను TDS, కు తగ్గించడం, #2 ను ఆపివేయడం జరిగింది. #3 ను అప్పుడప్పుడు మాత్రమే ఆమె ఉపయోగిస్తున్నారు. మే 23 నాటికి ఆమెకు ఎటువంటి లక్షణాలు లేవు ఆమె బాగానే ఉందని తెలిపారు. 2023 సెప్టెంబర్ నాటికి ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది, ఇది ఆమెకు మరింత విశ్వాసాన్ని ఇవ్వడంతో #5 కొనసాగించాలని భావించారు.