Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఆలశ్యమైన శాశ్వత దంతాలు 03547...यूएसए


6½ ఏళ్ల బాలుడికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం క్రితమే అనగా 2022 మార్చిలో పాల దంతాలు రాలిపోయినప్పటికీ ఎగువ ముందు దంతాలు బయటపడలేదు. ఈ విషయంలో ఆందోళన చెందిన తల్లి (AVP) దంతాల ఖాళీ భాగంలో చిగుర్లు గట్టిపడి పోయినట్లు గుర్తించి వైద్య సలహా కోరారు. X రే రిపోర్ట్ ప్రకారం చిగుర్ల లోపల సెంట్రల్ ఇన్ సి సర్ పళ్ళు(పైకి పొడుచుకు రావడంలో ఆలశ్యం) ఉన్నట్లుగా వెల్లడించింది. డాక్టరు ఒక చిన్న శస్త్ర చికిత్సా విధానాన్ని సిఫారసు చేస్తూ గట్టిపడిన చిగుళ్ళను తెరవడానికి ఒక సంవత్సరం వరకు వేచి చూడవలసి రావచ్చు అనితెలిపారు. అందుచేత బాలుడు తల్లి సహాయం కోసం సీనియర్ ప్రాక్టీషనరును సంప్రదించారు. 2023 జూలై 14న బాలుడికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:

NM12 Combination-12 + NM67 Calcium + NM89 Mouth and Gum + NM90 Nutrition + SM38 Teeth + SR254 Calc Phos…QDS 

బాలుడు ఇతర మందులు ఏమి తీసుకోవడం లేదు. రెమిడీ తీసుకున్న కేవలం రెండు నుండి మూడు రోజుల్లో తల్లికి సంతోషం కలిగించే విధంగా ఎడమ వైపు చిగుళ్ల మధ్య కోత కనిపించింది. ఒక నెలలో అనగా ఆగస్టు 14 నాటికి కుడివైపు కోత కూడా కనిపించింది(చిత్రాలు చూడండి). దంతాలు మొత్తం పట్టిష్టతను నిర్ధారించడానికి తదుపరి రెండు నెలల పాటు రెమిడి కొనసాగించబడింది. ఆపివేయడానికి ముందు నెమ్మదిగా ODకి తగ్గించబడింది. దంతాలు విజయవంతంగా ఆవిర్భవించడంతో  డాక్టర్ తో ఫాలోఅప్ అవసరం లేకుండా పోయింది.

108CC బాక్సు ఉపయోగిస్తుంటే : CC11.6 Tooth infections + CC12.2 Child tonic ఇవ్వాలి