Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రేగు ప్రకోపం (ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ IBS) 02726...यूएसए


30 ఏళ్ల వ్యక్తి BMI రీడింగ్ 30 కలిగి ఉండి చిన్నప్పటి నుండి వారంలో ఒకటి లేదా రెండు సార్లు లూజ్ మోషన్ కలిగి ఉన్నారు. అతను మషాలాతో కూడిన ఆహారం ఏ కొంచెం తీసుకున్నా లూజ్ మోషన్ తో పాటు పొత్తికడుపు నొప్పితో కూడా బాధపడేవారు, తిరిగి అది అతని సాధారణ ఆహారంతో స్వయంగా పరిష్కరింపబడుతుంది. 2017లో కామెర్లు సోకి అలోపతి చికిత్సతో కోలుకున్నారు, అప్పటినుండి తేనుపు మరియు ఉబ్బిన పొత్తికడుపు అతనిని దాదాపు ప్రతిరోజూ ఇబ్బంది పెడుతున్నాయి. క్రమంగా అతనికి IBS ఉన్నట్లు గుర్తింప బడి దానికోసం గత కొన్ని నెలలుగా సూచించిన మందులను (ఫాంటాసిడ్ డి ఎస్ ఆర్ మరియు యూనిఎంజైమ్) తీసుకుంటున్నారు కానీ గుర్తించదగిన మెరుగుదల లేనందున వాటిని నిలిపివేశారు. తన ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండడం ద్వారా తన పరిస్థితిని మైంటైన్ చేయగలుగుతున్నారు.

ఒక పేషెంట్ విషయంలో విజయవంతమైన ఫలితాలు చూసిన తర్వాత అతనికి వైబ్రియానిక్స్ వ్యవస్థపై విశ్వాసం పెరిగి 2023 మార్చి 3వ తేదీన ప్రాక్టీషనర్ను సంప్రదించగా క్రింది రెమిడీలు ఇచ్చారు:

అజీర్ణ సమస్యలకు :

#1. CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10

Indigestion…6TD    

సాధారణ ఆరోగ్యానికి :  

#2. IB*…OD   

మానసిక ఆరోగ్యానికి :  

#3. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic…TDS     

రెండు రోజుల్లో అతని లక్షణాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించి, ఆ తర్వాత రెండు వారాల్లో అనారోగ్య సమస్యలు పూర్తిగా పరిష్కరింపడ్డాయి. తను మానసికంగా మరియు శారీరకంగా మెరుగ్గా ఉన్నారు కాబట్టి #1 రెండు వారాల పాటు TDS కు తగ్గించబడింది, మరియు రోగి ఏప్రిల్ 8న అన్ని రెమిడీలను నిలిపివేయాలని భావించారు.                                          2023 సెప్టెంబర్ 8 నాటికి అతను రోగ లక్షణాలలో ఎటువంటి పునరావృతం లేకుండా సంతోషంగా మరియు ఆరోగ్యంగా కొనసాగుతున్నారు! 

*IB combo వార్తా లేఖ సంచిక 13 #5 ప్రకారం