నిద్రలో ఆయాసం 18004...भारत
ఇండో-చైనా సరిహద్దు దగ్గర పని చేస్తున్న 44 ఏళ్ల పోలీసు, 2010 నుండి దాదాపు ప్రతి రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు గుండె దడతో ఊపిరి పీల్చుకోలేకపోవడం, ఊపిరి ఆడకపోవటం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. గుండె దడ తో హఠాత్తుగా మెలుకువ రాగా గంట లేదా అంతకంటే ఎక్కువసేపు ఇది కొనసాగుతుంది. ఆ తరువాత, ఇది అతనికి రాత్రంతా మెలుకువగా ఉంచుతుంది. అతను నిపుణుడిని సంప్రదించే స్థోమత లేక ఎటువంటి చికిత్స తీసుకోలేదు. అలాగే 2019 నుండి, అతను అధిక BP కోసం సూచించిన మందులు తీసుకుంటున్నప్పటికీ, అది ఇప్పటికీ 160/100 మరియు 80/60 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతోంది. 15 మే 2022న, అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC3.1 Heart tonic + CC3.3 High Blood Pressure (BP) + CC3.7 Circulation…TDS
అతను కాలానుగుణముగా తన వ్యాధి యొక్క స్థితి గతులను ప్రాక్టీషనర్ కు అందించలేకపోయారు. మూడు నెలల తర్వాత, రోగి భార్య తన వ్యక్తిగత చికిత్స కోసం ప్రాక్టీషనర్‌ను సందర్శించినప్పుడు, రెండు వారాల్లోనే తన భర్తకు ఊపిరాడక పోవడం నుండి 100% ఉపశమనం కలిగిందని మరియు అప్పటి నుండి కలత లేకుండా నిద్రపోతుఉండడంతో అతను మరో రెండు వారాల తర్వాత రెమిడీ ని నిలిపివేసాడు, మిగిలిన మాత్రలను భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. అలాగే అతను తన బిపి మాత్రలు వేసుకోవడం కొనసాగించగా అతని బిపి నార్మల్ గా ఉండసాగింది.
10 ఆగస్ట్ 2023 నాటికి, ఊపిరాడక పోవడం వంటి సమస్యలు లేవని మరియు మంచి నిద్రను పొందగలుగుతున్నట్లు తెలిపారు.