శ్వాశకోశ ఎలర్జీ 03586...क्रोएशिया
32 ఏళ్ల వ్యక్తి 2015 నుండి గత ఐదేళ్లుగా శ్వాసకోశ అలెర్జీతో బాధపడుతున్నారు. అతనికి ప్రతీ సంవత్సరం వసంత ఋతువులో (మార్చి నుండి జూన్ వరకు) కళ్లవాపు తుమ్ములు ఏర్పడతాయి. దీనివలన అతని రోజువారీ జీవితం మరియు సాధారణ కృత్యాలు నిర్వహించడం కష్టంగా మారింది. ఐతే రోగి అల్లోపతి మందులతో ఉపశమనం పొంద సాగారు కానీ ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందించాయి. రోగి ప్రాక్టీషనర్ వద్దకు వెళ్లినప్పుడు ఎటువంటి మందులు లేదా చికిత్స తీసుకోవడం లేదు, ఈ అలర్జీకి కారణం మానసిక సంబంధమైనదేనని భావించిన ప్రాక్టీషనర్ 15 మార్చి 2020న, అతనికి క్రింది రెమిడీ ఇచ్చారు.
CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies...TDS
కేవలం రెండు రోజుల తర్వాత, అతను తన అలెర్జీ లక్షణాలు పోయినట్లు తెలిపారు. అతను మరో రెండు నెలల పాటు రెమెడీని తీసుకోవడం కొనసాగించి 15 మే 2020న దానిని ఆపారు. తదనంతరం, అలెర్జీ పునరావృతం కాలేదు మరియు 27 జూలై 2023 నాటికి, అతను బాగానే ఉన్నారు.