గౌట్ 18004...भारत
76 ఏళ్ల రైతు గత 22 సంవత్సరాలుగా చీలమండలు మరియు మోకాళ్లలో వాపు, మంట, నొప్పితో పాటు వేళ్ల యొక్క కీళ్లలో నొప్పితో బాధపడుతున్నారు. అతను పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, అతనికి జ్వరం కూడా వచ్చేది. 2000 సంవత్సరంలో, అతని రక్త పరీక్షలో యూరిక్ యాసిడ్ పెరిగినట్లు వెల్లడైంది మరియు అతని పరిస్థితి గౌట్‌గా నిర్ధారించబడింది. అతను వివిధ వైద్యుల నుండి చికిత్స తీసుకున్నాడు కానీ గుర్తించదగిన మెరుగుదల లేదు. ప్రతీ రోజూ వైద్యులు సూచించిన పెయిన్ కిల్లర్స్ తీసుకోవడంపైనే ఆధారపడాల్సి వచ్చేది, అయినప్పటికి కూడా పొలాల్లో పని చేస్తూ జీవనోపాధి పొందడం కష్టంగా మారింది.
2018లో, అతనికి పొత్తికడుపు, కాళ్లు మరియు పాదాలలో నొప్పి మరియు మంటలు మొదలయ్యాయి. అతను గ్యాస్, అసిడిటీ లేదా అజీర్ణం వంటి తీవ్రమైన జీర్ణ సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా, అతను మూలికా నివారణలు మరియు యాంటాసిడ్‌లతో ఉపశమనం పొందేవారు. 27 జూన్ 2022న, అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
గౌట్ మరియు పాదాలు, కాళ్ళలో మంటలకు:
#1. CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.3 Arthritis…TDS
అజీర్ణ సమస్యలకు:
#2. CC4.5 Ulcers + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion…TDS
రోగికి ఆయుర్వేద మందులు లేదా యాంటాసిడ్‌లు తీసుకోవలసిన అవసరం లేదని భావించారు కానీ అవసరమైనప్పుడు నొప్పి నివారిణిని తీసుకోవడం కొనసాగించారు. జూలై 4న, మోకాళ్లు మరియు చీలమండలలో భరించలేని నొప్పి మరియు జ్వరం ఉన్నట్లు రోగి తెలపడంతో ఇది పుల్ అవుట్ అని భావించి, ప్రాక్టీషనరు #1 మోతాదును BDకి తగ్గించారు. జూలై 10 నాటికి, నొప్పి 50%కి తగ్గింది మరియు భరించగలిగేది ఉండేది కానీ అతని రెండు మోకాళ్లు ఎర్రగా మారాయి. జూలై 17 నాటికి, మోకాళ్లపై ఎరుపు రంగు మాయమైంది కానీ చీలమండలు ఎర్రగా మరియు నొప్పిగా మారాయి. ప్రాక్టీషనర్ #1 బాగానే పని చేస్తున్నదని రోగికి సౌకర్యవంతంగానే ఉన్నదని విశ్వసించారు. జూలై 24 నాటికి, అతని లక్షణాలన్నీ పూర్తిగా అదృశ్యమయ్యాయి! జూలై 31న ఒక వారం తర్వాత, రోగి #2ను ఆపాలని నిర్ణయించుకున్నారు, అయితే BDలో #1ని కొనసాగించారు. ఆగస్ట్ 28న, అతను పొలాల్లో తన పనిని తిరిగి ప్రారంభించారు. సెప్టెంబర్ 2న, అతను #1ని కూడా నిలిపివేశారు.
జూలై 2023 నాటికి, అతను గౌట్ మరియు అన్ని జీర్ణకోశ సమస్యల నుండి పూర్తి విముక్తి పొంది ఆరోగ్యంతో జీవనం కొనసాగిస్తున్నారు.