Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 13 సంచిక 3
మే / జూన్ 2022
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా. జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ఇటీవలే ఆరాధన మహోత్సవం గడిచిపోయి ఈశ్వరమ్మ దినం సమీపిస్తోంది - ఈ రెండు సందర్భాలు అత్యంత  పవిత్రమైనవి. మన సాయిమాతను మరియు వారి తల్లి మాతృశ్రీ ఈశ్వరమ్మను గౌరవించడానికి ఈ పండుగను అపారమైన భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటాము. ఆరాధన దినోత్సవం సందర్భంగా, మనము స్వామి జీవితాన్ని మరియు  ప్రేమ & సేవ మూల స్తంభాలుగా కలిగిన వారి ప్రబోధనలను గుర్తుచేసుకుందాము. స్వామి ఇలా అంటారు “మానవాళికి చేసే సేవ పవిత్రమైనప్పటికీ, అది భగవంతుని యొక్క ఉన్నతమైన ఆదర్శంలో విలీనం చేయబడి, అందరిలో అంతర్లీనంగా ఉన్న భగవంతుడిని దర్శిస్తూ, అందరి రూపంలో ఉన్న భగవంతుడిని ఆరాధిస్తే తప్ప, ఎటువంటి లాభము లేదు. మనిషికి  దైవత్వంపై పూర్తి విశ్వాసం ఉండాలి, మరియు భగవంతుని నిరంతర చింతనతో సేవ చేయాలి”...సత్యం శివం సుందరం సంపుటి 1, అధ్యాయం 14, p191. ఇదే  స్వామివారి విజన్. సేవా మార్గాన్ని చేపట్టిన వారికి ఇది స్ఫూర్తిదాయకంగా ఉండాలి. భగవంతుని తల్లి అయిన ఈశ్వరమ్మ, స్వామి సందేశంలో అత్యంత ప్రధానమైన ప్రేమ మరియు త్యాగమునకు ప్రతిరూపం. స్వామి మాట్లాడుతూ, “ఈశ్వరమ్మ చనిపోయే ముందు, నేను ఆమె కోరికలన్నీ తీర్చాను. మా సంస్థల్లో ఎలాంటి రుసుము లేదు. ప్రతీ ఒక్కరికీ విద్య పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. మా ఆసుపత్రులలో కూడా అంతా ఉచితమే”. ఈశ్వరమ్మ ద్వారానే స్వామి మనకు సేవ చేయడమే ఆరాధన అనే వైఖరిని ప్రబోధించారు. తన జీవితమే తన సందేశమని బాబా ప్రకటించారు. కాబట్టి, ‘’’వారి సన్నిధిలో ఉండటం, వారి కరుణ, వారి సరళత, వారి శ్రద్ధ, అంతర్దృష్టి, వారి ప్రేమను గమనించడం, సంపూర్ణతను మరియు స్వేచ్ఛను ఆకాంక్షించే వ్యక్తికి ఒక విలువైన అవకాశం...సత్యం శివం సుందరం వాల్యూం 3, అధ్యాయం 7, పేజి 89.

రెండు సంవత్సరాల ఆంక్షలు మరియు అనిశ్చితి తరువాత, జీవితం దాదాపు పూర్తిగా సాధారణ స్థితికి మారింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో మన వైద్య సేవా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుతున్నాయి. ఇప్పుడు మన క్లినిక్‌లు మరియు మెడికల్ క్యాంపు కార్యకలాపాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఇందులో గురువారం హైదరాబాద్‌లోని శివమ్‌లో క్లినిక్, ముంబైలోని ధర్మక్షేత్రలో శనివారం క్లినిక్, SSSIHMS వైట్‌ఫీల్డ్‌లోని వెల్‌నెస్ సెంటర్‌లో వీక్లీ క్లినిక్ మరియు ఇంటర్నేషనల్ సెంటర్  న్యూ ఢిల్లీలో ఆదివారం క్లినిక్ ఉన్నాయి. మా 108CC బాక్స్ ఛార్జింగ్ సెషన్‌లు కూడా కర్నాటకలో ఏప్రిల్ 9న ప్రారంభించబడిందని, ఆ తర్వాత ఏప్రిల్ 23న ముంబైలో ప్రారంభించబడిందని తెలపడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. పుట్టపర్తిలో, మహమ్మారి సమయంలో కూడా మనము సామాజిక దూర నిబంధనలను అనుసరిస్తూనే రీఛార్జ్ సెషన్‌లను కొనసాగించాము.

కష్టకాలంలో కూడా అవకాశాలను గుర్తించడమే చాలా ప్రధానం. క్రమము మరియు గందరగోళం అనే ధృవాల మధ్య జీవితం తిరుగుతూ ఉంటుందనేది వాస్తవం. కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన గందరగోళం మరియు రుగ్మతకు మన వైబ్రియానిక్స్ మిషన్ యొక్క క్రమానుగత అనుసరణ ఈ ఉన్నత దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది జీవిత పరిణామ క్రమంలో అవసరమైన భాగం. రోగనిరోధక శక్తి బూస్టర్ (IB) యొక్క అభివృద్ధి మరియు భారీ-స్థాయి పంపిణీ, మన ప్రసార నమూనా యొక్క విజయం మరియు విస్తరణ, మొదటి అంతర్జాతీయ వైబ్రియానిక్స్ కాన్ఫరెన్స్‌తో సహా అన్ని కేసు చరిత్రల పూర్తి డిజిటలైజేషన్, https://vibrionics.org/?page_id=4046 మరియు భారతదేశంలోని మన పోస్టల్ నెట్‌వర్క్‌ని 8 నుండి 43 ప్రాక్టీషనర్‌లకు పెంచడం వంటివి అన్నీ చెప్పుకోదగ్గ కార్యక్రమాలు. ఇవి మన సంస్థాగత మరియు ఆపరేటింగ్ మోడళ్ళు  మహమ్మారి నుండి బలంగా బయటకు వచ్చి మరింత సమర్థవంతంగా ఎలా అభివృద్ధి చేయబడ్డయో చూపుతాయి.  

మాతృభాషలో మన AP శిక్షణా కార్యక్రమం అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. మొత్తం తొమ్మిది APలు (ఐదుగురు హిందీ మరియు నలుగురు తెలుగు మాట్లాడేవారు) వారి సంబంధిత మెంటర్‌ల ఆధ్వర్యంలో తమ ప్రొబేషనరీ పీరియడ్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. వారు ఇప్పుడు మారుమూల గ్రామాలు మరియు కమ్యూనిటీలలో అట్టడుగు స్థాయిలో ప్రభావం చూపడానికి సిద్ధంగా ఉన్నారు. AP నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఫీడ్‌బ్యాక్ మరియు సమాచారాన్ని పంచుకునే సాధారణ వ్యవస్థ అమలులో ఉంది. సమీప భవిష్యత్తులో, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల నుండి AP అభ్యర్థుల కోసం మరిన్ని వర్క్‌షాప్‌లను ప్లాన్ చేస్తున్నాము. మాకు అందిన సమాచారం ప్రకారం ప్రవేశ ప్రక్రియ మరియు శిక్షణ వ్యవధి తక్కువగా ఉన్నందున ఈ శిక్షణా కార్యక్రమం విస్తృతంగా ప్రశంసించబడుతున్నట్లు తెలుస్తోంది. మేము ఇప్పుడు అంకితభావం గల వ్యక్తులకు వారి మాతృభాషలో శిక్షణ ఇవ్వగలుగుతున్నాము. ఇది భవిష్యత్తులో గరిష్ట సామాజిక ప్రభావంతో వైబ్రియానిక్స్ యొక్క వృద్ధికి మార్గం సుగమం చేస్తుందని మేము ధృఢంగా విశ్వసిస్తున్నాము.

ప్రశాంతి నిలయంలో IB పంపిణీ మార్చి 2020లో ప్రారంభించబడింది మరియు ఫిబ్రవరి 2021 నుండి ప్రతీ సేవాదళ్ సభ్యుడు IBలను పొందాడు. అయితే, కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గిన దృష్ట్యా, ఈ పంపిణీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇటీవల నిర్ణయించారు. అవసరం వచ్చినప్పుడు ఇది పునఃప్రారంభించబడుతుంది.

స్వామి మనల్ని శాంతి స్వరూపులుగా సంబోధిస్తారు, ఎందుకంటే వారు మన ప్రతీ ఒక్కరిలోని అంతర్గత స్వరూపాన్ని చూస్తారు. నిజానికి స్వామి మనలో ఒక అంతర్భాగమే. "అందరిలో సాయి ఉన్నాడు; కాబట్టి, ప్రతి ఒక్కరికీ, శాంతి ప్రధానమైనది”...ప్రొఫెసర్ కస్తూరి 108 విలువైన రత్నమాల 4వ ఎడిషన్, 1979, పేజీ 107-8. ఈ బోధనను ఆచరణలో పెట్టడానికి, భారతదేశానికి చెందిన 18 మంది SVPల బృందం 6 మార్చి 2022న రష్యా మరియు ఉక్రెయిన్‌లో యుద్ధములో -దెబ్బతిన్న ప్రాంతాలకు రోజువారీ దైవిక స్వస్థత ప్రకంపనలను ప్రసారం చేయసాగడం విశేషం. మనము ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలను కూడా ప్రసారం చేస్తున్నాము. ప్రేమ, సామరస్యం మరియు సహకారముతో కూడిన యుగం త్వరలోనే యుద్ధం, ద్వేషం మరియు దురాశలతొ నిండిన పరిస్థితిని తొలగింప చేస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. అన్నింటికంటే ముఖ్యం అలా చేయగలిగేది మరెవరో కాదు మన సాయి మాత మాత్రమే అని గ్రహించాలి. "ఈ ప్రపంచంను రక్షించడానికి భగవంతుని నామం కంటే శక్తివంతమైనది ఏదీ లేదని గుర్తుంచుకోండి. ప్రపంచాన్ని రక్షించేది ఆయుధాలు, బాంబులు కాదు. భగవంతుని దయ మాత్రమే ప్రపంచాన్ని రక్షిస్తుంది."...సత్యసాయి ప్రసంగం సంపుటం 24 p34.

మీ ఆచరణలో మరియు జీవితంలో మీకు అపారమైన ప్రేమ మరియు శాంతి ఉండాలని  

ప్రేమతో

సాయిసేవ లో మీ

జిత్ కె అగర్వాల్

పునరావృత మవుతున్న మూత్రకోశ వ్యాధి (UTI) 11235...India

67 ఏళ్ల మహిళ జ్వరం మరియు మూత్రవిసర్జన సమయంలో నొప్పితో పునరావృతమవుతున్న UTIతో ఆరు నెలలకు పైగా బాధపడుతున్నారు. ఇది ప్రతి రెండు నెలలకు ఏర్పడుతూ ఉంటుంది, ఆ సమయంలో ఆమె 5 నుండి 7 రోజుల పాటు సూచించిన యాంటీబయాటిక్స్ యొక్క కోర్సును తీసుకుంటారు. ఆ తర్వాత ఆమె లక్షణాలు తొలగిపోతాయి. ఆ తర్వాత 2014 ఆగష్టు 8 న ఆ రోగ లక్షణాలు మరలా  ఏర్పడినప్పుడు ఆమె తన వైద్యుడి వద్దకు వెళ్లడానికి బదులుగా, ప్రాక్టీషనరును సంప్రదించాలని నిర్ణయించుకొనగా వారు క్రింది రెమిడీ ఇచ్చారు:

 CC8.1 Female tonic + CC13.2 Kidney & Bladder infections + CC15.1 Mental & Emotional tonic…TDS 

మూడు రోజుల తర్వాత జ్వరం తగ్గి మరో నాలుగు రోజుల తరువాత నొప్పి పూర్తిగా అదృశ్యమైపోయింది. ఈసారి యాంటీబయాటిక్స్‌ను ఆశ్రయించాల్సిన అవసరం రాలేదని రోగికి ఎంతో ఆనందంగా ఉంది. తదుపరి ఈ  సమస్య పునరావృతం కానందున మోతాదు నాలుగు నెలల తర్వాత BDకి మరియు మరో రెండు నెలల తర్వాత ODకి తగ్గించబడి జూన్ 2015లో రెమిడీ నిలిపివేయబడింది. ఫిబ్రవరి 2022 నాటికి, సమస్య పునరావృతం కాలేదు.

పార్శ్వపు నొప్పి, భుజం నొప్పి 11235...India

51 ఏళ్ల మహిళకు రెండేళ్ల క్రితం నుండి తలనొప్పి రావడం ప్రారంభించింది. సూర్య కాంతి ఐదు నిమిషాలు వంటిమీద సోకినా ఆ రోజంతా వికారంతో తలనొప్పిని కలిగిస్తుంది. వాంతి తర్వాత మాత్రమే ఉపశమనం కలుగుతుంది. ఆమె పరిస్థితి మైగ్రేన్‌గా నిర్ధారణ అయింది. ఆమె వృత్తి రీత్యా నెలకు 4-5 సార్లు టూర్‌కి వెళ్లాల్సి రావడంతో ఎండలో వెళ్లకుండా ఉండలేకపోయేవారు. అదనంగా, కొన్ని నెలల క్రితము, ఆమెకు మెడపై నొప్పి ప్రారంభమై ఎడమ భుజం మరియు మోచేయి వరకు పాకుతూ పోయేది. నొప్పి నివారణ మాత్రలు తీసుకోవడం ఆమెకు ఇష్టం లేదు కాబట్టి ప్రత్యామ్నాయం కోసం వెతికారు. 2018 సెప్టెంబర్ 21న, ప్రాక్టీషనర్ ఆమెకు క్రింది రెమిడీ అందించారు:   

పార్శ్వపు నొప్పి కోసం : 

#1. CC11.3 Headaches + CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic…6TD

భుజం నొప్పి కోసం :

#2. NM59 Pain + OM4 Cervical + OM27 Supportive tissue + CC20.4 Muscles & Supportive tissue…TDS 

రోగిని ఆశ్చర్య ఆనందాలకు గురి చేస్తూ #1 యొక్క మూడు మోతాదులను తీసుకున్న తర్వాత ఆమె తలనొప్పి మరియు వికారం నుండి పూర్తిగా ఉపశమనం పొందారు.  2 వారాల తర్వాత, అక్టోబర్ 5న, ఆమె తలనొప్పి తీవ్రత, వ్యవధి మరియు తరుచుదనం 75% తగ్గిందని చెప్పారు. #1 TDSకి తగ్గించ బడింది. ఒక నెల తర్వాత ఆమెకు 100% ఉపశమనం లభించింది. ఈ సమస్య యొక్క జాడ లేకుండా పోవడంతో ఆమె ఎండలో బయటకు వెళ్లగలుగుతున్నారు. ఈ రెమెడీని మరో నెల పాటు కొనసాగించారు, తర్వాత డిసెంబర్‌ 4న ODకి తగ్గించి 2019 ఫిబ్రవరి 6 న ఆపివేయబడింది. భుజం నొప్పికి సంబంధించి, ఒక నెల తర్వాత 20% ఉపశమనం లభించింది, ఐదు నెలల తర్వాత 90% మరియు మరో రెండు నెలల తరువాత 100% ఉపశమనం లభించింది. మే 28న, #2 OD కి తగ్గింపబడి నెల అనంతరం 2019 జూలై లోఅపీయబడింది. 2022 మార్చి నాటికి ఎలాంటి లక్షణాలు పునరావృతం కాలేదు.

108CC బాక్సు ఉపయోగిస్తున్నట్లైతే #2:CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20. 4 Muscles & Supportive tissue ఇవ్వండి

కీళ్ల వాతం 02051...Chile

44 ఏళ్ల మహిళకు శరీరం అంతటా కీళ్లలోబిగుసుకు పోయినట్లు ఉండడం ముఖ్యంగా ఆమె చేతుల్లో  ఇది ఎక్కువగా ఉంటోంది. ఆమె పరిస్థితి క్రమంగా క్షీణించడం వలన కీళ్ళు వాపు మరియు బాధ తోపాటు విపరీతమైన అలసట మరియు రోజువారీ పనులను నిర్వహించడానికి ఆసక్తి లోపిస్తోంది. ఉదయపు వేళల్లో లక్షణాలు మరింత అధ్వాన్నంగా ఉండటంతో ఆమె కదలడం కూడా కష్టమవుతోంది. ఆమెకు 2017లో కీళ్లనొప్పులు ఉన్నట్లు నిర్ధారణ అయింది మరియు అప్పటి నుండి సూచించిన స్టెరాయిడ్స్, మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు పెయిన్ కిల్లర్ మందులను తీసుకుంటున్నారు కానీ కొద్దిపాటి ఉపశమనం మాత్రమే లభించింది. 2021 ఆగస్ట్ 28 న, ఆమె వైబ్రియానిక్స్ తీసుకోవాలని నిర్ణయించుకుని ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు. సందర్శన సమయంలో ఆమె చేతుల్లో తీవ్రమైన కీళ్ల నొప్పులు ఉండడంతో చాలా ఆందోళనకు గురై ఉన్నారు. వీరికి క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి:   

CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis…TDS 

ప్రాక్టీషనర్ సలహా మేరకు, రోగి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆధ్యాత్మిక అభ్యాసాలు, ఆశావాదం తో ఉండడం, క్షమార్పణ తత్వం మరియు ప్రేమను పెంపొందించుకోవడం, ఆకుకూరలు మరియు వాటి రసాలను ఆహారంలో చేర్చడము, మాంసం మరియు పాల ఉత్పత్తులను మినహాయించడం, వంటి ఆరోగ్యకరమైన ఆహారంతో సహా అనేక జీవనశైలి మార్పులను చేసారు. ఒక నెల తర్వాత ఆమె నొప్పి, వాపు మరియు కీళ్ల బిగింపు నుండి 30% ఉపశమనం పొందారు. మరో రెండు నెలల్లో ఇది 50%కి పెరిగింది. ఆమె సులభంగా కదలగలుగుతున్నందుకు చక్కని ఆనందానుభూతిని పొందారు. రెండు వారాల తర్వాత, అనగా డిసెంబర్ 15 నాటికి ఆమె భయాందోళన తొలగడంతో సహా మొత్తం మీద ఆరోగ్యంలో 85% మెరుగుదల కలిగినట్లు చెప్పారు. ఇది అల్లోపతి మందులను ఆపగలిగేలా ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

2022 జనవరి నాటికి ఆమెకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవు, ప్రశాంతంగా మరియు మరింత శక్తివంతంగా ఉండగలుగుతున్నారు. కొన్నిసార్లు వాతావరణ మార్పులు మరియు అమిత ఆహారము తీసుకున్న సమయాలలో, ఆమె స్వల్పంగా లేదా అతితక్కువ స్థాయిలో కీళ్ల నొప్పిని అనుభవిస్తున్నారు. 2022 ఏప్రిల్ నాటికి, ఆమె ఆరోగ్యంగా ఉంటూ   రెమిడీ ని TDSలో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.  

 

దీర్ఘకాలిక దగ్గు 03567...USA

52 ఏళ్ల మహిళ గత నాలుగు సంవత్సరాలకు పైగా రోజుకు కనీసం రెండు లేదా మూడు సార్లు తరుచుగా పొడి దగ్గును ఎదుర్కొంటున్నారు. దగ్గు అకస్మాత్తుగా మొదలై 20 నుండి 30 నిమిషాల పాటు స్వల్ప విరామాలతో కొనసాగుతుంది, దీనితో ఆమె చాలా అలసిపోతుంది. ఈ దగ్గును అణచివేయడానికి ఆమె వేడి నీటిని త్రాగుతుంది లేదా లాజెంజ్‌లను (చప్పరించే మాత్రలను) తీసుకుంటుంది. ఆమెకు ఇతర శ్వాసకోశ సమస్యలు ఏమీ లేవు. డాక్టర్ అనేక పరీక్షలను సూచించారు కానీ అవి ఏమీ రోగ కారణాన్ని వెల్లడించలేదు మరియు ప్రిస్క్రిప్షన్ మందులు ఏమాత్రం సహాయం చేయలేదు. ప్రాక్టీషనరు ఉంటున్న మేడిటేషన్ గ్రూపు లోనే రోగి ఉన్న కారణంగా ప్రాక్టీషనర్ ఆమెకు అనేక సందర్భాల్లో వైబ్రియానిక్స్ చికిత్సను తీసుకోమని కోరినా ప్రతీసారీ ఆమె సున్నితంగా తిరస్కరించారు.

ఆమె తీసుకుంటున్న చికిత్సతో ఎటువంటి ఉపశమనం లేనందున రోగి ఇకపై పరిస్థితిని ఎదుర్కోలేక అయిష్టంగానే వైబ్రియానిక్స్ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. ఆమె అన్ని ఇతర మందులను నిలిపివేసి  2020 మార్చి 1 న  ప్రాక్టీషనర్ ని సంప్రదించగా వారు క్రింది రెమిడీ ఇచ్చారు:  

CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.1 Chest tonic + CC19.6 Cough chronic…TDS 

రెండు నెలలుగా పేషెంట్ నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ రాలేదు! 2020 మే లో, ప్రాక్టీషనర్ రోగికి ఫోన్ చేసినప్పుడు, దగ్గు పూర్తిగా తగ్గిపోయిందని మరియు ఈ మొత్తం అనుభవం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె తెలిపారు. మోతాదు  మెయింటెనెన్స్ డోసేజ్‌కి క్రమంగా తగ్గించబడింది, అనారోగ్యం మళ్లీ తలెత్తకుండా చూసుకోవడానికి ఆమె 2020 చివరి వరకు OW గా కొనసాగించారు. ఆమె ఇకపై దగ్గు తో ఇబ్బంది పడే సంఘటనలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదని తెలిసి ఎంతో  ఉపశమనం పొందారు. వైబ్రియోనిక్స్ చికిత్స కోసం ఆమె తన కుటుంబంలోని ఒక సభ్యుడిని కూడా ప్రాక్టీషనర్‌కి సూచించారు. 2022 ఫిబ్రవరి నాటికి, ఒక సంవత్సరం తర్వాత, రోగి బాగానే ఉన్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడల్లా, ఆమె ఇప్పుడు సంతోషంగా చికిత్స కోసం వైబ్రియానిక్స్ వైపు చూస్తున్నారు.

మొటిమలు 03554...Guyana

34 ఏళ్ల మహిళ 2016 జనవరి నుండి  ముఖం అంతా తీవ్రమైన మొటిమలతో బాధపడుతున్నారు. చర్మవ్యాధి నిపుణుడితో సహా అనేక మంది వైద్యులను ఆమె సంప్రదించారు, యాంటీబయాటిక్స్ మరియు ఇతర మందులతో పాటు సిఫార్సు చేసిన ఫేషియల్ క్రీమ్‌లను కూడా ఉపయోగించారు కానీ అవి ఏమీ సహాయం చేయలేదు. మొటిమలు ఎండిపోయిన వెంటనే, కొత్త మచ్చలు కనిపిస్తాయి. వైద్యుని సలహా మేరకు మూత్రపిండాలు, అండాశయాలు మరియు పిత్తాశయం యొక్క అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నారు, మరియు క్యాన్సర్, పాప్  స్మియర్, మామోగ్రామ్, హార్మోన్లు, థైరాయిడ్, కాలేయం, కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్ పరీక్షలు కూడా మొటిమల కారణము వెల్లడించలేదు. ఆమె ఇటీవలే తన నాలుక యొక్క రుచిని కోల్పోయింది, అలాగే ఆమె కుడి చెవిలో వినికిడిని కోల్పోవడం ప్రారంభించింది, పరీక్షలో ఓటోస్క్లెరోసిస్ అని నిర్ధారణ అయింది. 2016 అక్టోబరు 21 న ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:   

మొటిమలకు :

#1. CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC21.2 Skin infections…6TD in water for 7 days 

వినికిడి శక్తి లోపానికి :

#2. CC5.2 Deafness + CC15.1 Mental & Emotional tonic…TDS నీటిలో, రెండు చుక్కలు చెవిలో కూడా వేసుకోవలసి ఉంది.

రోగి #1 మాత్రమే తీసుకున్నారు, 3 రోజుల తర్వాత పుల్ అవుట్ ఏర్పడి -` అతిసారం మరియు వాంతులు - రెండు గంటల పాటు కొనసాగాయి. మొటిమలు ఎండిపోవడం ప్రారంభించాయి మరియు కొత్తవి ఏర్పడలేదు. ఒక వారం తర్వాత మోతాదు TDSకి తగ్గించబడింది. 2017 జనవరి 10 నాటికి, 95% ముఖం సాధారణ స్థితికి చేరుకుంది, మరియు మచ్చలు కూడా మసకబారడం ప్రారంభించాయి. ఆగస్ట్‌లో ఆమెకు మొటిమల దగ్గర మంటగా అనిపించ సాగింది కానీ రెమిడీ #1 ని TDS లో కొనసాగించడంతో వెంటనే తగ్గిపోయింది. నవంబర్ 2017 నవంబర్ నాటికి అన్ని మచ్చలు మాయమైనందున ఆమె రెమిడీలు నిలిపివేసారు. 2022 ఫిబ్రవరి నాటికి ఆమెకు ఈ పరిస్థితి పునరావృతం కాలేదు.

రోగి 2016 అక్టోబర్ 27 నుండి #2 తీసుకోవడం ప్రారంభించారు. ఒక వారంలోపు, వినికిడిలో 20% మెరుగుపడింది, మరియు నాలుక యొక్క రుచి కూడా తిరిగి వచ్చింది. ఉదయం మేల్కొన్న తర్వాత ఆమె చెవిలో ఎండిపోయిన  మైనమున వంటి పదార్థమును కనుగొనడం ప్రారంభించారు. 2017 జనవరి 10 నాటికి, ఆమె వినికిడి శక్తి 60% మెరుగయ్యింది. కానీ 2017 నవంబర్ వరకు ఆ పైన ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో, ఆమె #2ని కూడా ఆపివేసారు.

ఎడిటర్ యొక్క వ్యాఖ్యానం: నూనెను చెవిలొ చుక్కల మందుగా (ఇయర్‌డ్రాప్స్‌గా) ఉపయోగించమని మేము సిఫార్సు చేస్తున్నాము (30ml వర్జిన్ ఆలివ్/కొబ్బరి నూనెలో ఒక చుక్క రెమెడీని డ్రాప్పర్ బాటిల్‌లో వేయాలి) మరియు ఎప్పుడూ నీటిలో వేయకూడదు. చెవిలో చేరిన నీరు వినికిడి లోపంతో సహా అనేక సమస్యలను కలిగిస్తుంది. టింపానిక్ మెంబ్రెన్ లో రంధ్రం కారణంగా చెవుడు వచ్చినప్పుడు రోగికి చెవి చుక్కలు ఇవ్వకూడదు.

అపెండిసైటిస్ 11601...India

2018 ఆగస్టు మధ్యలో 9 ఏళ్ల బాలికకు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఆమె సరిగ్గా తినలేదు మరియు ప్రతిరోజూ నొప్పితో ఏడుస్తుంది. డాక్టర్ తీవ్రమైన అపెండిసైటిస్‌ గా నిర్ధారించి  శస్త్రచికిత్సను సిఫార్సు చేశారు. అతను ఎటువంటి మందు రాయలేదు మరియు చాలా తేలికైన ఆహారం తీసుకోవాలని బాలికకు సూచించాడు. నాలుగు రోజుల తర్వాత 2019 ఆగస్టు 19  బాలిక యొక్క అమ్మమ్మ ఆమెను ప్రాక్టీషనర్ వద్దకు తీసుకువెళ్లారు. ప్రాక్టీషనర్ ఈ క్రింది రెమిడీ ఇచ్చారు:

CC4.1 Digestion tonic + CC4.3 Appendicitis + CC10.1 Emergencies + CC12.2 Child tonic…ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున ఒక గంట వరకు ఆ తరువాత ఒక వారం వరకు 6TD తర్వాత TDSకి తగ్గింప బడుతుంది.

రీఫిల్‌లను తీసుకువెళుతున్నప్పుడు పాప వాళ్ళ అమ్మమ్మ, రోగికి నొప్పి లేదని మరియు బాగా తిని నిద్రపోతున్నదని ప్రాక్టీషనరుకు తెలియజేసారు. అక్టోబరు 12న, అపెండిక్స్ పరిమాణం తీవ్ర పరిస్థితి నుంచి కొంచెం తక్కువ తీవ్ర పరిస్థితికి  (అక్యూట్ నుండి సబ్‌అక్యూట్‌కు) తగ్గిందని నివేదిక రావడంతో మోతాదు TDS వద్ద కొనసాగించబడింది. డిసెంబరు 30న, రోగి యొక్క తల్లి స్కాన్‌లో అపెండిక్స్ పరిమాణం మరింత తగ్గిందని మరియు ఇప్పుడు సాధారణ పరిధిలో ఉందని మరియు ఆమె కుమార్తె పూర్తిగా క్షేమంగా ఉందని ప్రాక్టీషనరుకు తెలియజేసారు. మోతాదు ఒక నెల పాటు ODకి తగ్గించబడింది మరియు 2019 జనవరి 31 న ఆపివేయబడింది. 2022 మార్చి నాటికి, నొప్పి పునరావృతం రాలేదు.

చూపు కోల్పోవడం 11520...India

53 ఏళ్ల వ్యక్తికి 2018 జులై 25 నుండి నుదిటిపై తీవ్రమైన నొప్పి, ముఖం ఎడమవైపు వాపుతో పాటుగా ఎడమ కంటిలో మంట మరియు దృఢత్వముతో (స్టిఫ్నెస్ తో) బాధ పడుతున్నాడు. తర్వాతి కొద్ది రోజులలోనే, అతను ఈ కంటిలో దృష్టిని కోల్పోయారు. రెండు వారాల తర్వాత, అతను నేత్ర వైద్యుడిని చూసినప్పుడు, అతని పరిస్థితి టెంపోరల్ BRVO (బ్రాంచ్ రెటినాల్ వెయిన్ ఆక్యులూజన్, అంటే చిన్న సిరల్లో అడ్డు ఏర్పడడం) అని నిర్ధారణ అయింది. రోగికి గత పదేళ్లుగా అధిక బిపి ఉంది, దీని కోసం అతను ఆల్ప్రాక్స్ 0.5 మి.గ్రా. తీసుకుంటున్నారు. బిపి హెచ్చుతగ్గులే  BRVO కి కారణమని కంటి పరీక్షలో నిర్ధారించారు. రక్తం గడ్డలను కరిగించడానికి డాక్టర్ ఐ-సైట్ క్యాప్సూల్స్ మరియు నెపాఫెనాక్ కంటి చుక్కలు మరియు నొప్పి మరియు వాపు కోసం 30,000 ($400) విలువ చేసే ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్‌లను సూచించారు. ఇంజెక్షన్‌లు తన పరిస్థితిని నయం చేస్తాయనే నమ్మకం లేక అతను వాటిని తీసుకోలేదు. 2018 ఆగస్టు 18 నుండి ఇతర రెండు మందులను తీసుకోవడం ప్రారంభించారు. అదే రోజు, అతను ప్రాక్టీషనర్ ను సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు.

 #1. NM17 Eye + NM36 War + NM109 Vision + NM113 Inflammation + OM11 Eye + OM25 Eye-Retina + OM26 Eye Muscles + BR20 Eye + SM20 Eyes + SR216 Vitamin-E + SR247 Triple Warmer + SR405 Ruta…6TD 

ఏడు వారాల తర్వాత, సెప్టెంబర్ 30 న నొప్పిలో 50% మెరుగుదల మరియు వాపులో 20% మెరుగుదల ఏర్పడింది,  అయినప్పటికీ, అతను తీవ్రమైన నొప్పి అనేక సార్లు ఏర్పడుతూ వేదన అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి సమయాల్లో సాధారణ 6TDతో పాటు ప్రతీ ఐదు నిమిషాలకు ఒక మోతాదు చొప్పున మొత్తం మూడు డోసులను అదనంగా  తీసుకోవాలని ప్రాక్టీషనర్ రోగికి సూచించారు. 10 రోజుల తర్వాత, ఈ తీవ్రమైన నొప్పి యొక్క తరుచదనం గణనీయంగా తగ్గింది మరియు వాపు మరియు మంటలో 100% మెరుగుదల కలిగింది. నవంబర్ 8 న రోగి నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని నివేదించారు. ప్రభావితమైన కంటిలో అప్పుడప్పుడు మాత్రమే దృఢత్వం ఉంటోంది. ఇప్పుడు కొన్ని రెమిడీలు అవసరం లేనందున, #1 క్రింది విధంగా సవరించబడింది.   

#2. NM36 War + NM109 Vision + OM25 Eye-Retina + OM26 Eye Muscles + BR20 Eye + SM20 Eyes + SR216 Vitamin-E + SR247 Triple Warmer + SR405 Ruta…6TD 

2019 జనవరి 30 న చూపు కోల్పోవడం తప్ప, తనికు ఏ ఇతర కంటి సమస్యలు లేవని రోగి తెలిపారు. అల్లోపతి మందులు చూపు పునరుద్ధరణకు సహాయం చేయనందున మరియు రోగ నిరూపణ సరిగా లేనందున వాటిని నిలిపివేయమని అతని వైద్యుడు అతనికి సలహా ఇచ్చారు.   

తీవ్రమైన కాంతి నుండి దూరంగా ఉండాలని మరియు ఆరోగ్యకరమైన కుడి కన్ను ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి ఎక్కువసేపు టీవీ, కంప్యూటర్ లేదా మొబైల్ ఉపయోగించవద్దని ప్రాక్టీషనర్ రోగికి సూచించారు. నాలుగు నెలల తర్వాత, మే నెలలో ఇప్పుడు తను చిత్రాలను  రేఖమాత్రంగా చూడగలుగుతున్నానని సంతోషంగా తెలియ జేసారు! మోతాదు QDSకి తగ్గించబడింది మరియు ప్రాక్టీషనర్ అదే రెమిడీ OD గా ప్రసారం చేయడం ప్రారంభించారు.   

మరో రెండు నెలల తరువాత, జూలైలో, రోగి ఎటువంటి రంగు లేకుండా నలుపు చిత్రాలను చూడగలిగారు, మరియు సెప్టెంబర్ 9 నుండి, అతను సుదూర చిత్రాలను మాములుగానే చూడగలుగుతున్నారు కానీ ఇప్పటికీ అక్షరాలు  చదవలేకపోతున్నారు. మోతాదును TDSకి తగ్గించి, హృదయపూర్వకమైన ప్రార్థన తో ప్రసారాన్ని కొనసాగించారు. ఒక నెల తర్వాత, అక్టోబర్ 10న, అతను కొన్ని అక్షరాలు అలలుగా మరియు అస్పష్టంగా కనిపించినప్పటికీ వాటిని గుర్తించగలిగారు. నవంబరులో, రోగి మరియు ప్రాక్టీషనర్ ఇద్దరినీ అమిత ఆనందమునకు గురిచేస్తూ అతని దృష్టి పునరుద్ధరించబడింది. అతను ఇప్పుడు ప్రతిదీ స్పష్టంగా చూడగలుగుతున్నారు. ప్రసారం నిలిపివేయబడింది. మోతాదు నెమ్మదిగా OWకి తగ్గించబడి చివరకు 2020 జనవరి 10 న ఆపివేయబడింది. 2022 ఏప్రిల్ నాటికి, రోగి యొక్క దృష్టి  సాధారణ స్థాయిలోనే ఉంది.

108CC బాక్సు ఉపయోగిస్తున్నట్లైతే  #1: CC7.1 Eye tonic + CC7.2 Partial Vision + CC7.3 Eye infections; #2: CC7.1 Eye tonic + CC7.2 Partial Vision + CC7.3 Eye infections ఇవ్వండి.

ప్రాక్టీషనర్ వ్యాఖ్య : 2011,లో ఈ రోగి దాదాపు మంచాన పడి వైబ్రియానిక్స్ తో విజయవంతంగా చికిత్స పొందారు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్ పుస్తకం లోని 151 వ పేజీని చూడండి.   

చర్మముపై దురద 11592...India

ప్రాక్టీషనర్ తల్లి ఐన 62 మహిళ తన శరీరమంతా దురద మరియు కొన్ని చోట్ల తేలికపాటి దద్దురుతో 15 సంవత్సరాలుగా బాధపడుతున్నారు. సూచించబడిన అల్లోపతి మందులు  మూడేళ్లపాటు, ఆయుర్వేద చికిత్స నాలుగేళ్లపాటు తీసుకున్నా ఫలితంలేదు. ఆమె బెండకాయ మరియు పుల్లని ఆకులను తిన్నప్పుడల్లా, దురద తీవ్రమవుతోంది, కాబట్టి ఆమె తన ఆహారం నుండి వీటిని తొలగించారు. ఆమె  కుమారుడు పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికీ ఆమె వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవాలనుకోలేదు. ఆమె లక్షణాలు చాలా అధ్వాన్నంగా మారినప్పుడు, ఆమె చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించేవారు, సూచించిన మందులు ఆమెకు కడుపులో చికాకు మరియు వికారం కలిగించగా దానిని ఆమె  తట్టుకోలేక పోయారు. కాబట్టి ఆమె ఒక నెల తర్వాత వాటిని ఆపివేసి చివరకు వైబ్రియోనిక్స్ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. 2018 నవంబర్ 30 న ప్రాక్టీషనర్ తన తల్లికి ఈ క్రింది రెమిడీని ఇచ్చారు:

 #1. CC21.2 Skin infections + CC21.3 Skin allergies…TDS 

ఒక నెల తర్వాత దురదలో 20% ఉపశమనం లభించింది, అది మరో నెలకి 40%కి పెరిగింది. దద్దుర్లు యొక్క కొత్త మచ్చలు ఏర్పడడంతో ఇవి ఆహార అలెర్జీ వల్ల కావచ్చునని భావించినందున, ప్రాక్టీషనర్ 2019 జనవరి 29 తేదీన రెమిడీ క్రింది విధంగా మెరుగుపరిచారు:

 #2. CC4.10 Indigestion + CC21.6 Eczema + #1…TDS 

 ఫిబ్రవరి 24 నాటికి, అనగా ఒక నెల లోపే రోగికి ఆనందం మరియు ఆశ్చర్యం కలిగించే విధంగా, ఆమె దద్దుర్లు మరియు దురద నుండి 100% ఉపశమనం పొందారు. 2019 ఏప్రిల్ 22 నాటికి రెమెడీని ఆపడానికి ముందు రెండు నెలల వ్యవధిలో డోసేజ్ ODకి ఆపై OWకి తగ్గించబడింది. లక్షణాలు తిరిగి రాలేదు.

మే మొదటి వారంలో, రోగికి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ క్రింది వాటిని అందించారు. 

#3. CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases…OD ఒక సంవత్సరం వరకు

2022 ఫిబ్రవరి నాటికి ఆమె తన ఆహారంలో బెండకాయ మరియు సోరెల్ ఆకులను చేర్చుకోవడంపై ఇంకా భయపడుతూ ఉన్నారు కనుక #2 ను ముందస్తు జాగ్రత్త కోసం OD మోతాదులో సూచించబడింది, ఇది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అప్పటి నుండి ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్పుడప్పుడు పైన పేర్కొన్న కూరగాయలను ఆస్వాదించడం ప్రారంభించారు.  

Haemorrhoids, indigestion 11623...India

Since early 2019, the practitioner’s 45-year-old husband had a protruding haemorrhoid forming a lump that was very uncomfortable and caused severe pain while sitting for long periods at work. Occasionally he had shooting pain while passing stool with slight blood in it. He took homoeopathic treatment for six months but stopped it as he had very little relief. Then he managed the pain by applying coconut oil to the anal region. He also used a soft cushioned chair in his office and started on a healthy diet.

On 5 April 2020 he developed throbbing pain along with swelling in the anus which he ignored due to his busy work schedule. Two days later the pain became worse; he developed fever and chills accompanied by severe vomiting and burping with a bad odour. The indigestion occurred due to the intake of spicy food. Because of the Covid situation the patient isolated himself, took paracetamol for the pain and fever and, on 7 April 2020, his wife, who had just qualified as a practitioner, gave him:

CC4.4 Constipation + CC4.10 Indigestion...in water every 10 minutes for one hour followed by 6TD 

 

There was no relief after one hour and the fever was consistently high, so he was advised to dab the remedy water on the anal region. While applying the remedy the patient suddenly strongly felt the presence of the Divine, started sweating profusely and the fever began to subside. The next day, the fever and vomiting were gone and burping and pain in the anus had reduced by 50%.

In three days he became free of all symptoms except for the lump. The dosage was reduced to TDS and within a month the lump vanished as well. The dosage was gradually tapered down over the next one month and finally stopped on 10 June 2020. The patient is delighted that he was completely cured of this painful condition. There has been no recurrence as of Feb 2022.

వాపు మరియు ముఖం పై దురద 03555...UK

36 ఏళ్ల మహిళ కనురెప్పలతో సహా ముఖంపై పునరావృతమయ్యే వాపు మరియు దురదతో మూడు సంవత్సరాలకు పైగా బాధపడుతూ ఉన్నారు. వైద్యులు కారణాన్ని గుర్తించలేకపోయారు ఐతే  నోటి ద్వారా మరియు పై పూత కోసం స్టెరాయిడ్ల మందులను మరియు క్రీమ్ రెండింటినీ సూచించారు. లక్షణాలు నెమ్మదిగా తగ్గిపోతాయి కానీ ప్రతీ ప్రతి సారి ఈ పరిస్థితి తట్టుకోడానికి ఆరు వారాలు పడుతుంది. ఆమె స్టెరాయిడ్లను ఆపివేస్తే కొన్ని వారాల తర్వాత లక్షణాలు మళ్లీ కనిపిస్తాయి. దురద తీవ్రంగా ఉన్నప్పుడల్లా ఆమె పదేపదే పనికి సెలవు పెడుతూ ఉంటుంది. గత ఆరు నెలల్లో, ఆమె మునుపటి కంటే ఎక్కువ తీవ్రతతో మూడు సార్లు ఈ విధమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పడిన ఇబ్బంది ప్రకారం స్టెరాయిడ్స్ వాడిన ఆరు వారాల తర్వాత కూడా లక్షణాలు తగ్గలేదు, కాబట్టి నిరాశతో, ఆమె వైబ్రియానిక్స్‌ను ఎంచుకున్నారు. ఆమె ముఖానికి మేకప్ చాలా మందంగా  వేసుకోవడం గమనించిన ప్రాక్టీషనర్ ఆమె అనారోగ్యానికి ఇదే కారణం కావచ్చని భావించారు. మేకప్ ఉపయోగించడం మానేయమని  ఆమెకు సలహా  ఇస్తూ 2021 జూన్ 28 న ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు:

 #1. CC7.1 Eye tonic + CC7.3 Eye infections + CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.6 Eczema...6TD 

24 గంటల్లోనే ఆమెకు 50% ఉపశమనం లభించింది మరియు ఆమెను ఆశ్చర్యపరిచే విధంగా, ఇది 48 గంటల్లో ఇది 100%కి పెరిగింది! మూడు వారాల తర్వాత ఆమెకు డోసేజ్‌ని TDSకి తగ్గించమని సలహా ఇవ్వబడింది కానీ బదులుగా, ఆమె దానిని ఆపివేసారు. ఐదు రోజుల్లో, దురద మరియు వాపు తిరిగి వచ్చింది కానీ తీవ్రత తక్కువగా ఉంది. దీనితో వత్తిడికి గురియైన ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా #1 యొక్క రీఫిల్‌ని అందించారు. రెండు రోజుల్లో ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకుండా తగ్గిపోయింది. మోతాదు TDSకి తగ్గించబడింది. ఆగస్ట్ 8న ఆమె తన అనారోగ్యానికి సంబంధించిన మరో విషయాన్ని బయటపెట్టారు. గత ఏడాది కాలంగా తాను ఎండలో బయటకు వెళ్లినప్పుడల్లా, ముఖం మీద, ముఖ్యంగా కళ్ల చుట్టూ మంట మరియు దురద ఉంటుంది. సన్ గ్లాసెస్ మరియు సన్ హ్యాట్ ఉపయోగించమని ఆమెకు సలహా ఇవ్వబడింది మరియు అదనపు రెమిడీ కూడా ఇవ్వబడింది:

#2. CC7.3 Eye infections + CC21.3 Skin allergies + CC21.6 Eczema బయటకు వెళ్ళేటప్పుడు ముఖం మీద రాసుకోవడానికి వీలుగా క్రీమ్ రూపంలో ఇవ్వబడింది. 

రెండు రోజుల తర్వాత ఆమె #2 తక్షణ ఉపశమనం అందించిందని తెలిపారు. తరువాతి కొన్ని నెలల్లో, ఆమె ఎలాంటి సమస్యలు లేకుండా తన అలంకరణను తిరిగి ప్రారంభించగలిగారు. ట్రీట్‌మెంట్ ప్రారంభించినప్పటి నుండి ఆమెకు పనికి సెలవు పెట్టాలని ఎప్పుడూ అనిపించలేదు. 2022 జనవరి 10 న, #1 మోతాదు ODకి తగ్గించబడింది. 2022 ఫిబ్రవరి లో రెండు రెమిడీలు నిలిపివేయబడ్డాయి. పేషెంట్ ఇండియాకు వెళ్లి భారీ మేకప్ వేసుకుంటూ నాలుగు పెళ్లిళ్లకు హాజరైనా లక్షణాలు పునరావృతం కాలేదు. ఏప్రిల్ నాటికి ఆమె బాగానే ఉన్నారు. ఈ విజయవంతమైన ఫలితం ద్వారా ప్రేరణ పొందిన ఆమె కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు వారి ఆరోగ్య సమస్యల కోసం వైబ్రియానిక్స్‌ని ఆశ్రయిస్తున్నారు.

సక్రమంగా రాని ఋతుక్రమం 11616...India

21 ఏళ్ల యువతికి తొమ్మిదేళ్ల క్రితం రజస్వల అయినప్పటినుండి సక్రమంగా రుతుక్రమం లేదు. ఆమెకు మూడు నెలలకు ఒకసారి మాత్రమే పీరియడ్స్ వస్తూ ఒక్కో ఋతు చక్రం 6 రోజులు కొనసాగుతూ వీనిలో ఎక్కువ రోజుల పాటు అధిక రక్తస్రావం ఏర్పడ సాగింది. ఆమె ఎలాంటి చికిత్స తీసుకోలేదు. వ్యక్తిగత పరిస్థితుల కారణంగా, ఆమె ప్రస్తుతం చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఆమెకు  చివరి పీరియడ్ 2021 జనవరిలో  కలుగగా 2021 మార్చి 11 న ఆమె ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు, వీరికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:

CC8.8 Menses irregular + CC15.1 Mental & Emotional tonic…ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకు అనంతరం 6TD

ఆమె తదుపరి ఋతుస్రావం ఏప్రిల్ 15న వచ్చింది, రెండు వారాల పాటు ఉన్నప్పటికీ సాధారణ రక్తస్రావంతో కొనసాగింది. మోతాదు TDS కి తగ్గించబడింది.

రోగి తదుపరి ఋతుక్రమం వరకు TDS లో కొనసాగాలని సూచించినప్పటికీ, ఆమె ఏప్రిల్ 25 నుండి మోతాదును OD కి తగ్గించారు. మే 6న, ఆమె తను ఏమాత్రం వత్తిడిని అనుభవించడం లేదని ప్రాక్టీషనరుకు తెలిపారు. మే మరియు జూన్‌లో రోగికి సాధారణ రక్తస్రావం ఏర్పడి ఐదు రోజులు మాత్రమే ఉంది, కాబట్టి ఆమె జూన్‌లో రెమిడీను తీసుకోవడం మానివేసారు. 2022 మార్చి నాటికి, ఆమెకు 3 నుండి 4 రోజుల పాటు సాధారణ రక్తస్రావంతో రెగ్యులర్ పీరియడ్స్ కొనసాగుతున్నాయి.

పిలోనిడల్ కణితి 03596...USA

22 ఏళ్ల మహిళ గత ఐదు సంవత్సరాలుగా వీపుపై వెన్నుచివర ఎముక వద్ద  పునరావృతమవుతున్న తిత్తితో బాధపడుతున్నారు. ఇది పిలోనిడల్ సిస్ట్‌గా నిర్ధారించబడింది – అనగా జుట్టు మరియు చర్మ వ్యర్థాలను కలిగి ఉండే చర్మంలోని ఒక అసాధారణ కణితి. సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు అది ఇంఫెక్శన్ సోకి చీము చేరి తీవ్రమైన నొప్పి మరియు వాపుకు కారణమవుతుంది. ఇది 3 నుండి 4 వారాల పాటు ఆమె కదలిక మరియు నిద్రను ప్రభావితం చేసింది, ఆ తర్వాత అది దానంతటదే చీలి తగ్గిపోతుంది. ఇటీవలే 2020 సెప్టెంబరు మధ్యలో ఇది ఏర్పడి రోగి సాధారణ వాపు మరియు తీవ్రమైన నొప్పిని అనుభవించినప్పుడు, ఆమె ఆసుపత్రి ఎమర్జెన్సీని సందర్శించడానికి ఎంచుకున్నారు. అక్కడ ఆమె సర్జన్ కి రిఫర్ చేయబడగా డిసెంబరు 11న శస్త్రచికిత్స షెడ్యూల్ చేయబడింది, ఈసారి తిత్తి తనంత తాను పగిలిపోలేదు. అందుచేత ఆమె 2020 నవంబర్ 3 వ తేదీ న ప్రాక్టీషనర్‌ను సంప్రదించగా ఈ క్రింది రెమిడీ అందించబడింది:

 #1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.11 Wounds & Abrasions…TDS

ఒక వారం తర్వాత వాపు 20% తగ్గడంతో ఎక్కువ నొప్పి లేకుండా ఆమె తన పనులు తాను చేసుకోవడానికి సానుకూల పడింది. తదుపరి ఐదు వారాల వరకు ఈ మెరుగుదల కొనసాగింది. డిసెంబరు 11న ఆమె శస్త్రచికిత్సకు వెళ్లే సమయానికి, నొప్పి గాని వాపు గానీ లేవు. అయినప్పటికీ, షెడ్యూల్ ప్రకారం శస్త్రచికిత్స జరిగింది. తిత్తి కనిపించకపోవడంతో సర్జన్ అయోమయంలో పడ్డారు.! తదుపరి పరీక్ష కోసం మరియు కుట్లు తొలగించడం కోసం అతను 18 జనవరి 2021న మరొక అపాయింట్‌మెంట్‌ని షెడ్యూల్ చేశారు. మరోసారి ఏమీ కనిపించలేదు. ఈ అద్భుత స్వస్థతకు సాయి వైబ్రియానిక్స్ మాత్రమే కారణమని రోగికి స్పష్టంగా అర్థమైంది. CC10.1 Emergencies ఇకపై అవసరం లేదని ప్రాక్టీషనర్ భావించినందున, జనవరి 18న ఆమె #1 స్థానంలో క్రింది రెమిడీ ఇచ్చారు.    

#2. #1 CC10.1 Emergencies…TDS లేకుండా

ఏప్రిల్ 2021 చివరి నాటికి డోసేజ్ OWకి తగ్గించబడింది. జూలై చివరిలో రోగి రెమెడీ తీసుకోవడం మానేశారు. అయితే, అక్టోబర్ 2021 ప్రారంభంలో, రోగికి తన వీపు భాగంలో కొంచెం నొప్పి అనిపించడం ప్రారంభించింది. #2 TDS వద్ద పునఃప్రారంభించబడింది. రెండు రోజుల తర్వాత, రోగి యొక్క గొప్ప ఆనందానికి, అవధులు లేని చందంగా అసౌకర్యం పూర్తిగా పోవడమే కాక కణితి యొక్క జాడ కూడా లేదు. ఆమెకు ఒక నెల పాటు రెమిడీ కొనసాగించమని సలహా ఇవ్వబడింది, ఆ తర్వాత అది నిలిపివేయబడింది. ఏప్రిల్ 2022 నాటికి ఎటువంటి పునరావృతం లేదు.  

ప్రాక్టీషనర్ల వివరాలు 11235...India

ప్రాక్టీషనర్  11235...ఇండియా   సైన్స్ మరియు లా లో గ్రాడ్యుయేట్ ఐన వీరు కొచ్చిన్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. తీరిక సమయాల్లో ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడంతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 1990లో తన బంధువు ఇచ్చిన సాయిబాబా పుస్తకాన్ని మొదటిసారి చదివారు. పుస్తకం చదువుతున్నప్పుడు అతను పూర్తిగా వేరే ప్రపంచము లోనికి చేరినట్లు భావోద్వేగం చెందగా కన్నీరు ధారాపాతంగా వీరి చెక్కిళ్ళ మీదుగా ప్రవహించాయి అంతేకాకుండా అంతరంగికంగా ఏవో అవ్యక్త భావాలను అనుభవించారు. స్వామి వైపుకు వీరు చేసే ప్రయాణంలో ఇది ప్రధామాంకము.

1992 నుండి, వీరు ప్రశాంతి సేవ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందుల పంపిణీ మరియు నెలవారీ వైద్య శిబిరాలలో పాల్గొనడం వంటి సాయి సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. మొత్తం ఏడేళ్లపాటు సేవా, ఆధ్యాత్మిక, ప్రచురణ విభాగాల్లో సమన్వయకర్తగా సేవలందించారు. మూడు సంవత్సరాలుగా వారు తన స్థానిక సాయి సమితిలో స్టడీ సర్కిల్‌లకు ఇన్‌ఛార్జ్‌గా ఉంటున్నారు.

ఒక జిల్లా సమావేశంలో సాయి వైబ్రియానిక్స్ గురించి విన్నప్పుడు, ప్రాక్టీషనరుగా మారాలని అంతరంగంలో బలమైన కోరిక అంకురించింది. 2010లో దీనికి అవకాశం వచ్చినప్పుడు, అతను రెండో ఆలోచన లేకుండా వెంటనే దరఖాస్తు చేసుకున్నారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో AVP, సెప్టెంబరు 2011లో VP మరియు మార్చి 2013లో SVPగా అర్హత సాధించారు. అతను 9200 కంటే ఎక్కువ మంది రోగులకు చికిత్స అందించారు. కేరళలో గల ఐదు ప్రాంతీయ సమన్వయ కర్తలలో వీరు కూడా ఒకరు. వీరి బృందం వేల సంఖ్యలో ఇమ్యూనిటీ బూస్టర్ బాటిళ్ల పంపిణీలో ప్రధాన పాత్ర పోషించింది, 50% కంటే ఎక్కువ IBలు వీరి రాష్ట్రంలో పంపిణీ చేయబడ్డాయి.

అతను ఇతర ప్రాక్టీషనర్లతో కలిసి పని చేయడం మరియు మహమ్మారి ప్రారంభానికి ముందు ఒక నెలలో మూడు వారాంతాల్లో మూడు వేర్వేరు కేంద్రాలలో వైబ్రియానిక్స్ శిబిరాలు నిర్వహించే అవకాశాలను పొందడం అదృష్టంగా భావిస్తారు.  మహమ్మారి సమయంలో కూడా, అతను తన రోగులతో ఫోన్ సంప్రదింపుల తర్వాత కొరియర్ ద్వారా రెమెడీలను పంపడం ద్వారా సేవను కొనసాగించారు. అతని సేవ యొక్క లబ్ధిదారులు ప్రస్తుతం నెలకు 100 మంది రోగులు ఉన్నారు.

ఈ ప్రాక్టీషనరు తన సేవలో అనేక ఆసక్తికరమైన సందర్భాలను ఎదుర్కొన్నారు. ఒక సందర్భంలో, 42 ఏళ్ల మహిళ RA ఫ్యాక్టర్‌ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారింప బడ్డారు. ఆమె దీర్ఘకాలంగా కీళ్లలో వాపు మరియు నొప్పితో బాధపడుతూ ఉన్నారు.  దీని కోసం ఆమె చాలా కాలం అల్లోపతి మందులను తీసుకున్నారు కాని ఉపశమనం కలుగ లేదు. వైబ్రో రెమెడీలు తీసుకున్న రెండు వారాల తర్వాత, 50% మెరుగుదల మరియు ఒక నెల తరువాత దాదాపు పూర్తి ఉపశమనం కలిగింది. మరో సందర్భంలో, వెర్టిగోతో బాధపడుతున్న 63 ఏళ్ల వ్యక్తి, నాలుగు నెలల పాటు అల్లోపతి చికిత్సను ప్రయత్నించినా ఉపశమనం కలగని కారణముగా తనకు  CC5.3 Meniere's disease + CC15.1 Mental & Emotional tonic + CC18.7 Vertigo  ఇవ్వబడింది. రెండు వారాల్లో అతనికి 70% ఉపశమనం కలుగగా తదనంతరం అతను పూర్తిగా నయమయ్యారు.   

 వైబ్రియానిక్స్ చికిత్స వలన పూర్తి స్వస్థత చేకూరిన వీరి రోగులలో ఒక మహిళ ఎంతో ప్రేరణ చెంది తన కుమార్తె మరియు అల్లుడిని ప్రాక్టీషనరు వద్దకు పంపారు. ఈ యువ జంట గత మూడు సంవత్సరాలుగా బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ సఫలం కాలేదు. ఇద్దరికీ అధిక కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్ ఉన్నాయి, దీని కోసం వారు అల్లోపతి చికిత్స తీసుకుంటున్నారు. ఆ యువతికి పిసిఒడి కూడా ఉంది, దాని కోసం ఆమె కొన్ని ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేయించుకుంది. వైబ్రో రెమెడీలు తీసుకున్న ఒక నెల తర్వాత, వీరిద్దరికీ కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్ లెవల్స్‌లో తగ్గుదల కనిపించింది అంతేకాక రెండు నెలల తర్వాత ఆమె IVF చికిత్స ప్రారంభించటానికి కేవలం ఒక వారం ముందు తను గర్భం దాల్చింది! గర్భం దాల్చిన తేదీ అల్లోపతి మెడిసిన్ షెడ్యూల్‌తో సరిపోలడం లేదని, తద్వారా ఈ విజయాన్ని పూర్తిగా వైబ్రియానిక్స్ చికిత్సకు ఆపాదించాలని సంబంధిత వైద్యుడు సూచించాడు, కాబట్టి నవంబర్ 2019లో వారి కుమారుడు జన్మించినప్పుడు, వారు అతన్ని 'వైబ్రో బేబీ' గా పిలిచారు.

 ఈ ప్రాక్టీషనరు కొన్ని కాంబోలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని గ్రహించారు. అతను CC8.2 Pregnancy tonic నొప్పిలేకుండా, సాధారణ ప్రసవానికి ఉత్తమమైన ఔషధంగా కనుగొన్నారు. వీరి అనుభవంలో CC18.7 VertigoCC19.6 Cough chronic, CC19.7 Throat chronic మరియు CC21.11 Wounds & Abrasions ఎప్పుడూ విఫలం కాలేదు సిమ్యులేటర్ కార్డ్‌లలో NM59 Pain మరియు NM97 Sciatica అతనికి అసాధారణమైన ఫలితాలను అందించాయి.

 వైబ్రియానిక్స్ అభ్యాసం ప్రాక్టీషనరుకు నిస్వార్థ సేవ యొక్క నిజమైన అర్థాన్ని నేర్పింది, అలాగే రోగుల పట్ల సహనం,  కరుణను పెంచింది. ఈ సేవలో విజయవంతం కావాలంటే, అహంకారం లేకుండా మరింత క్రమశిక్షణతో మరియు అంకితభావంతో పనిచేస్తూ మెరుగైన శ్రోతగా ఉండాలని అతను గుర్తించారు. ప్రారంభ రోజులలో ఒక పేషెంట్ తనను 'డాక్టర్' అని పిలిచినప్పుడు అతను ఉబ్బితబ్బిబ్బైన అనుభూతి చెందినా క్రమంగా చికిత్సా ఫలితాలను నిరంతరం గమనించడం ద్వారా, అతని అహం చికిత్సా ప్రక్రియకు ఆటంకం కలిగిస్తోందని అవగాహన కలిగింది. అప్పటి నుండి, అతను రోగుల పట్ల తన విధానంలో సమానత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నించ సాగారు. రోగులకు స్వస్థత చేకూర్చే స్వామి చేతిలో తాను కేవలం ఒక సాధనం మాత్రమేనని వీరికి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇంత వయసులో కూడా తను అలసిపోకుండా వైబ్రియానిక్స్ క్యాంపులు నిర్వహించేందుకు వివిధ ప్రాంతాలను సందర్శించే శక్తి కలిగి ఉండటం స్వామివారి కృప వల్లనే అని భావిస్తారు.

    ఇతర ప్రాక్టీషనర్లకు వీరి సందేశం ఏమిటంటే, ‘మన వైద్య ప్రక్రియ యొక్క విజయం మన ఆలోచనలు, మాటలు మరియు పనుల స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. సానుకూల ప్రకంపనలను పెంపొందించేది మన సాధన మరియు దీనిని సాధించడానికి నామస్మరణ ఉత్తమమైన పద్ధతుల్లో ఒకటి. ప్రాక్టీషనర్లు ఆధ్యాత్మిక మరియు సేవా ఆధారిత వ్యక్తులతో సహవాసం చేయాలని మరియు సేవ చేయడానికి అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీరు సూచిస్తున్నారు.

 పంచుకున్న కేసులు

 

ప్రాక్టీషనర్ల వివరాలు 02051...Chile

ప్రాక్టీషనర్ 02051…చిలీ   అభ్యాసన వ్యూహాలు మరియు వనరుల విభాగంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు. 2018లో వెనిజులా నుండి చిలీకి వలస వచ్చినప్పటి నుండి, సమస్యాత్మకమైన వెనిజులా నుండి అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పొందలేకపోవడం వల్ల ఆమె మరియు ఆమె భర్త, గతంలో యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు, అయినప్పటికీ క్లరికల్ ఉద్యోగాలు చేయవలసి వచ్చింది.

  ఏప్రిల్ 1988లో, బరువైన నీటి బాటిళ్లను తీసుకువెళుతున్న ఒక మహిళకు సహాయం చేస్తున్న సందర్భంలో  ప్రాక్టీషనర్ మరియు ఆమె భర్త సాయి కేంద్రానికి తీసుకెళ్లబడ్డారు, అక్కడ వారు సాయి బాబా గురించి మొదటిసారి  విన్నారు. వారు తక్షణమే స్వామితో ప్రేమలో పడి శాకాహారులుగా  మారిపోయారు మరియు వారి ఇంట్లో సాయి కేంద్రాన్ని ప్రారంభించగా అది తదుపరి 13 సంవత్సరాలు పనిచేసింది. వారు భారతదేశాన్ని చాలాసార్లు సందర్శించారు మరియు ప్రాక్టీషనరుకు పుట్టపర్తిలోని బాబా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసే అదృష్టం లభించింది. ఆమె ఏడు సంవత్సరాలు వెనిజులా లో EHV ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా పనిచేసారు మరియు 2016-2018 నుండి మూడు సంవత్సరాల పాటు నేషనల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్‌గా పనిచేసారు. ప్రస్తుతం, ఆమె చిలీ యొక్క ఏకైక సాయి సెంటర్‌కు ఎడ్యుకేషన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు మరియు చిలీలో EHV ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటులో పాలుపంచుకున్నారు. ఆమె భర్త, పిల్లలు కూడా సాయి సంస్థలో క్రియాశీలక పాత్రలు పోషిస్తున్నారు.

2001లో, తన భర్త మరియు కుమార్తెతో కలిసి ప్రశాంతినిలయం మొదటిసారి సందర్శించినప్పుడు ఆమె వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నారు. తనకు మరియు ఇతరులకు స్వస్థత చేకూర్చగలగడమే తన వృత్తి అని భావించడం, ఆమె సాయి వైబ్రియానిక్స్ ప్రారంభ కోర్సు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేసింది. పరీక్ష మరియు ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులు కావడంతో ఈ  ముగ్గురూ ప్రాక్టీషనర్లుగా అర్హత సాధించారు. తదనంతరం, ఆమె తన SVP కోర్సు 2006లో పూర్తి చేసారు.  ప్రస్తుతం, ఆమె మాత్రమే చురుకుగా వైబ్రియానిక్స్ సాధన చేస్తున్నారు, అయినప్పటికీ ఆమె కుటుంబం ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నది.

గత కొన్ని సంవత్సరాలుగా వైబ్రియానిక్స్‌పై ఈమె విశ్వాసం ఎంతో బలపడింది. ఆమె అనుభవంలో సాయి వైబ్రియానిక్స్ ఔషధం 'సాయి' స్వరూపం కనుక అపజయము ఎరుగనిది.  ఆరోగ్య పరిస్థితి మెరుగుపడని వ్యక్తులు

సూచించిన ప్రోటోకాల్‌ను పాటించని వారు మాత్రమే అని ఆమె అనుభవంలో తెలుసుకున్నారు. ఆమె రోగులలో చాలామంది వైబ్రియానిక్స్‌ స్వస్థతా ప్రక్రియలో తాము ప్రశాంతంగా ఉన్నట్లు గమనించారు. ప్రతి వ్యక్తి ప్రత్యేకంగా ఉంటారని మరియు అందరూ ఒకే విధంగా రెమిడీలకు ప్రతిస్పందించరని లేదా ఒకే ఫలితాలను పొందరని ఆమె తెలుసుకున్నారు. ఒక ప్రాక్టీషనరుగా ఆమె రోగికి చికిత్స చేయడం ప్రారంభించే ముందు, మరియు రెమిడీలను సిద్ధం చేసే ముందు ప్రార్థన తప్పనిసరిగా చేస్తారు. ఆమె వైబ్రియానిక్స్‌ సేవ చేసే రోజులను ముందుగానే నిర్ణయించుకుని దానికి  అవసరమైన మెటీరియల్‌ అంతా ముందుగానే సమీకరించు కోవడంలో జాగ్రత్త వహిస్తారు. అలాగే ఈ సేవ లో ఉపయోగింపబడే రెమిడీల యొక్క సమగ్ర రికార్డులను భద్రంగా ఉంచుతారు. వైబ్రియానిక్స్‌ పట్ల నమ్మకం చూపేందుకు  ప్రజలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నందున తనకు రోగుల కొరత లేదని ఆమె స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఒక ఆసక్తికరమైన కేసును ఈ ప్రాక్టిషనరు పంచుకోవాలనుకుంటున్నారు. కంప్యూటర్ అద్దెకు ఇచ్చే సెంటర్ లో ఈమె వర్క్ చేస్తున్నప్పుడు, అత్యంత నిస్పృహకు లోనై ఉన్న ఒక మహిళ తనకు ఇక జీవించడం ఇష్టం లేదని ఏడుస్తూ ఆమె పక్కన కూర్చోనడం తటస్థించింది. ప్రాక్టీషనరు CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities ను సిద్ధం చేసి, మొదటి మోతాదును ఆమెకు అందించారు. మరుసటి రోజు ఆ మహిళ తన కోసం వెతుకుతూ వచ్చింది, తాను ఒక అద్భుతాన్ని చూశానని తన జీవితంలో మొదటిసారిగా, ఎలాంటి బాధాకరమైన ఆలోచనలు లేకుండా రాత్రిపూట నిద్రపోగలిగానని ఆమె చెప్పింది. అప్పటి నుండి, ఈ మహిళ ఎలాంటి డిప్రెషన్‌తో బాధపడలేదు.

అన్ని కాంబోలు శక్తివంతమైనవి అయినప్పటికీ, ఈ ప్రాక్టీషనర్ CC6.3 Diabetes  మధుమేహ వ్యాధిని నియంత్రించడంలో మరియు CC15.1 Mental & Emotional tonic మరియు CC15.2 Psychiatric disorders, మానసిక మరియు భావోద్వేగ అంశాలను సమతుల్యం చేయడంలో అసాధారణంగా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు. క్యాన్సర్, మధుమేహం, హార్మోన్ల రుగ్మతలు, వంధ్యత్వం, ఆటిజం, డిప్రెషన్/భావోద్వేగ సమస్యలు, కీళ్లనొప్పులు, ఎముకలు మరియు చర్మ బాధలు వంటి వ్యాధులు నయం చేయడంలో ఆమె గొప్ప విజయాన్ని సాధించారు.

తనకు, తన కుటుంబం మరియు ఇతరుల యొక్క సమగ్ర ఆరోగ్యం (శారీరక & మానసిక ఆరోగ్యం & ఆరోగ్యకరమైన సంబంధాలు) పట్ల ఆసక్తిని రేకెత్తించి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనరుగా తనకు పాత్రను ఇచ్చినందుకు ఆమె స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఆమె మరియు ఆమె భర్త వైబ్రియానిక్స్ వైపు మొగ్గు చూపుతారు. మెరుగైన ఫలితాల కోసం రోగుల చికిత్సల విషయంలో సహాయపడటానికి మరియు తద్వారా వారు మెరుగైన జీవన నాణ్యతను సాధించడంలో సహాయపడటానికి ఆమె రోగులకు ఉపయోగకరమైన సూచనలను అందించడానికి పోషకాహారం మరియు ఆరోగ్య సమస్యల గురించి మరింత తెలుసుకోవడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నారు. స్వామి ప్రేరణతో, ఆమె తన రోగులకు మార్గనిర్దేశం చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా, మానవ విలువలు మరియు జీవనశైలికి సంబంధించి వారికి సూచనలు ఇస్తూ ఉంటారు. వైబ్రియానిక్స్ తనను మరింత దయగల మరియు ఆత్మవిశ్వాసం గల వ్యక్తిగా మార్చిందని మరియు జ్ఞానం కోసం తన తపనని మరింత పెంచడంలో సహాయపడిందని ఆమె భావిస్తున్నారు.

తోటి ప్రాక్టీషనర్లకు ఆమె సలహా ఏమిటంటే, ఎప్పటికీ ఆశ వదులుకోవద్దు; పట్టుదలతో మరియు పూర్తి విశ్వాసంతో, స్వామిని ఆశ్రయిస్తే ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు.

పంచుకున్న కేసు

కీళ్ల వాతం

 

ప్రశ్న జవాబులు

Q1. IBతో చికిత్స పొందిన నా రోగులందరూ ఆరోగ్యవంతులయ్యారు. అల్లోపతి చికిత్స తర్వాత కొంతమందికి కోవిడ్ నెగెటివ్ అని వచ్చినప్పటికీ పూర్తిగా కోలుకోలేదని నేను అర్థం చేసుకున్నాను. కోవిడ్-సోకిన వారిలో మొత్తం మెదడు పరిమాణం 0.2 మరియు 2% మధ్య కుదించబడిందని ఇటీవలి అధ్యయనంలో ఎందుకు సూచించబడుతుందనే దానిపై వివరణ సూచించబడవలసి ఉంది. మెదడు లో వాసనతో మరియు జ్ఞాపకశక్తికి అనుసంధానించబడిన ప్రాంతాలలో బూడిదరంగు పదార్థంలో నష్టమునకు గురియైనట్లు తెలుస్తోంది. అటువంటి రోగులకు సహాయం చేయడం సాధ్యమేనా ?

A. అవును, రోగికి SR258 Kali Phos 6X + SR464 CN1: Olfactory 10M…TDS గా 4వారాల పాటు ఇవ్వండి. 108CC బాక్స్ మాత్రమే ఉన్నవారు దీనిని SVP నుండి పొందేందుకు ప్రయత్నించాలి, ఒక వేళ కుదరకపొతె వారు పై రెండు రెమెడీలను కలిగి ఉన్న CC18.1 Brain disabilities అందించగలరు.

________________________________________________________________________________

Q2. ప్రసారం లేదా బ్రాడ్కాస్టింగ్ కోసం మేము రోగి యొక్క పూర్తి-నిడివి రంగు చిత్రాన్ని ఉపయోగించడం ముఖ్యమా? వాల్యూం 9 #4లో మీరు పూర్తి-నిడివి ఉన్న ఫోటో మెరుగైన ఫలితాలను ఇస్తుందని సూచించి నట్లు తెలుస్తోంది.

A. ప్రాక్టీషనర్ల నుండి వచ్చిన అభిప్రాయం ఆధారంగా తదుపరి సాగింపబడిన పరిశోధన ప్రకారం పూర్తి-నిడివి ఫోటో అవసరం లేదని నిర్ధారింప బడింది. పాస్‌పోర్ట్-పరిమాణ ఫోటో కూడా  సమానంగా పని చేస్తుంది కానీ ఉత్తమ ఫలితాల కోసం దానిని మంచి నాణ్యత గల ఫోటోగ్రాఫిక్ పేపర్‌పై ముద్రింప బడాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, చిత్రం చుట్టూ ఖాళీ అంచు ఉండకూడదు, ముఖ్యంగా ఫోటో దిగువన రోగి యొక్క శరీర భాగం SRHVP యొక్క రెమెడీ బావి యొక్క దిగువ భాగాన్ని తాకగలగే విధంగా ఉండాలి.

________________________________________________________________________________

Q3. సెలవుదినములు వస్తున్నందున, దయచేసి దూర ప్రయాణాలు చేస్తున్న నా రోగులందరికీ నేను అందించగల రెమిడీని  మీరు సిఫార్సు చేయగలరా?

A. నివారణ అనేది వారు ప్రయాణించే నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ కేసుకు సంబంధించి తగిన రెమిడీని సిద్ధం చేయవచ్చు. అయితే చాలా సందర్భాలలో మీరు కింది సాధారణ కాంబోని ఇవ్వవచ్చు: CC4.4 Constipation + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC10.1 Emergencies + CC11.6 Tooth Infections + CC21.3 Skin allergies + CC21.4 Stings & Bites…OD

________________________________________________________________________________

Q4. నా చర్మ రోగులందరికీ ఆలివ్ నూనెలో బాహ్య వినియోగం కోసం నేను వైబ్రియోనిక్స్ రెమిడీలను సిద్ధం చేయవచ్చా?

A. సరైన మాధ్యమాన్ని ఉపయోగించడం ముఖ్యం కాబట్టి, మీరు బాహ్యానువర్తనం కోసం సమయోచితంగా ఉపయోగించే ఏదైనా మాధ్యమానికి రోగికి అలెర్జీ ఉందో లేదో ముందుగా తనిఖీ చేయడం ఉత్తమం. ఉదాహరణకు, సోరియాసిస్‌తో బాధపడుతున్న రోగి విషయంలో, అదనపు వర్జిన్ ఆలివ్ నూనెలో రెమెడీని తయారు చేసినప్పుడు, అతని చర్మంపై కొత్త గాయాలు కనిపించడం ప్రారంభించాయి. అనగా అతనికి కొన్ని మొక్కల ఉత్పత్తులకు అలెర్జీ అని తరువాత తేలింది. మీడియంను పరిమళం లేని క్రీమ్‌గా మార్చినప్పుడు, అతని పరిస్థితి వెంటనే మెరుగుపడటం ప్రారంభించింది. నీటి వినియోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బాహ్య చర్మం పై పూత సౌలభ్యం కోసం, ఒక స్ప్రే బాటిల్ ఆ పనిని చక్కగా నిర్వర్తిస్తుంది.

________________________________________________________________________________

Q5. డయాబెటిక్ పేషెంట్ వైబ్రియానిక్స్‌కి బాగా స్పందించి అల్లోపతి మందులను తీసుకోవడం కొనసాగించినప్పుడు రక్తంలో గ్లూకోజ్ చాలా వరకు తగ్గే అవకాశం ఉందా?

A. ఈ ప్రశ్న వార్తాలేఖలు వాల్యూమ్ 7 #4 మరియు వాల్యూం 5 #5లో ప్రస్తావించబడింది, అయితే ఈ సమస్య చాలా ముఖ్యమైనది కాబట్టి మేము దీన్ని మళ్లీ స్పష్టం చేయాలనుకుంటున్నాము. వైబ్రో రెమెడీ బ్లడ్ షుగర్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం, ఇది ఎక్కువగా ఉంటే తగ్గుతుంది, తక్కువగా ఉంటే తగిన స్థాయికి చేరుస్తుంది. అయినప్పటికీ, ఇన్సులిన్ లేదా అధిక మోతాదులో మౌఖిక మందులు తీసుకున్న రోగి విషయంలో, రక్తంలో చక్కెర చాలా త్వరగా తగ్గుతుంది. ఇది హైపోగ్లైకేమియాకు దారి తీయవచ్చు, ముఖ్యంగా రోగి నిద్రపోతున్నప్పుడు ఇది జరిగితే, అతను కోమాలోకి వెళ్ళవచ్చు. రక్తంలో చక్కెర చాలా తక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడవచ్చని ప్రాక్టీషనరు రోగికి తెలియజేయాలి. ఈ కారణంగా, రోగి వైబ్రో డోస్ తీసుకోవాల్సి ఉన్నపుడు అదే సమయంలో భోజనం చేసే సమయం ఆసన్నమైన  పరిస్థితిలో వారు భోజనం చేసిన 20 నిమిషాల తర్వాత వైబ్రో డోస్ తీసుకొనవలసిందిగా గట్టిగా సిఫార్సు చేయబడింది. కాబట్టి, రోగి విషయంలో జాగ్రత్తగా మెలగండి, OD వంటి తక్కువ మోతాదుతో అదికూడా ఉదయం ప్రారంభించి, నెమ్మదిగా పెంచండి మరియు రోగి తన చక్కెర స్థాయిలను తనిఖీ చేసుకోమని చెపుతూ ఉండాలి. అలాగే అటువంటి రోగి తన వైద్యునితో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుకునేలా మనం ఎల్లప్పుడూ ప్రోత్సహించాలి.

________________________________________________________________________________

Q6. రెమెడీల పంపిణీ కోసం నేను కార్క్ మూతలు ఉన్న గాజు సీసాలను ఉపయోగించాలనుకుంటున్నాను. కొన్ని లోహాల మాదిరిగా కార్క్ కూడా వైబ్రేషన్స్ ను ప్రభావితం చేస్తుందా ?

A. కార్క్‌తో గాజు సీసాలు ఉపయోగించడం ఖచ్చితంగా సురక్షితం మరియు మంచిది. యాదృచ్ఛికంగా, కొంతమంది హోమియో వైద్యులు కూడా అదే ఉపయోగిస్తారు.


 

దివ్యవైద్యుని దివ్యవాణి

ఎంతో స్వచ్ఛమైన జీవితాన్ని గడపాల్సిన వ్యక్తులు సరియైన ఆహారం తినక పోవడం వలన అపవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారు తమ హృదయంలో మంచి భావాలకు బదులుగా ప్రతికూల భావాలను పెంచుకుంటున్నారు. పాలను స్వచ్ఛమైన (సాత్విక) ఆహారంగా పరిగణిస్తారు. అయినప్పటికీ, చిక్కటి పాలు తాగకూడదు ఎందుకంటే అది బద్ధకం/(తామసిక) భావాలను కలిగిస్తుంది.... చిక్కటి పాలు మీకు మరింత కొవ్వును, శక్తిని ఇస్తుంది, కానీ అది మానసిక మందగమనాన్ని కూడా పెంచుతుంది.

...సత్యసాయిబాబా, “పరిపూర్ణ జ్ఞానం నుండి మాత్రమే సంపూర్ణ ఆనందం లభిస్తుంది.” 1996 సెప్టెంబర్ 1 దివ్యవాణి                                     http://sssbpt.info/ssspeaks/volume29/d960901.pdf

అన్ని సేవలను భగవంతునికి అర్పణగా పరిగణించాలి మరియు సేవ చేసే ప్రతి అవకాశాన్ని భగవంతుని బహుమతిగా స్వాగతించాలి. ఈ స్ఫూర్తితో సేవ చేసినప్పుడు, అది తగిన సమయంలో ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తుంది

…సత్యసాయి బాబా, “బోర్న్ టు సర్వ్” ఉపన్యాసం, 19 నవంబర్ 1987                                 http://www.sssbpt.info/ssspeaks/volume20/sss20-26.pdf 

 

 

ప్రకటనలు

 ప్రస్తుతం జరుగుతున్న మరియు భవిష్యత్తులో నిర్వహించబోయే వర్క్ షాప్ ల వివరాలు *

  • యు ఎస్ ఎ: వర్చ్యువల్ ఎవిపి (AVP) వర్క్ షాప్ 2022 ఏప్రిల్ 25నుండి జూన్15 వరకు **, సంప్రదించ వలసిన వారు సూసాన్ ఈమెయిల్  వెబ్సైట్  [email protected]
  • ఇండియా  పుట్టపర్తి : వర్చ్యువల్ ఎవిపి (AVP) ప్రాక్టికల్ వర్క్ షాప్ 2022 జులై 6-22 ** అనంతరం 2022 జులై 28-30 వరకు పుట్టపర్తి లో ముఖాముఖీ వర్క్ షాప్**, సంప్రదించ వలసిన వారు లలిత ఈమెయిల్  [email protected]  లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092

*వర్క్ షాప్ లు ప్రస్తుతం ప్రవేశ ప్రక్రియ మరియు ఈ కోర్సు పూర్తి చేసిన వారికి.

**మార్పులు ఉండవచ్చు

అదనంగా

1. ఆరోగ్య చిట్కాలు

జీవనశైలి వ్యాధులను నివారించడానికి ఆరోగ్యంగా జీవించండి

నేడు ప్రజలలో అనారోగ్యానికి అత్యంత సాధారణ మూలబీజం టెన్షన్. టెన్షన్‌కి కారణం ఏమిటి? మితిమీరిన అనేక కృత్యాలలో పాలుపంచు కోవడం. మగవారు జీవన గమనాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి. తొందరపాటు(హర్రీ) ఆందోళన(వర్రీ) కలిగిస్తుంది మరియు ఆందోళన వ్యాధిని కలిగిస్తుంది. ‘హర్రీ, వర్రీ మరియు కర్రీ (కూర లేదా కొవ్వు ఆహారం)’ గుండె జబ్బులకు కారణాలు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజెక్షన్ల ఉపయోగం నాల్గవ వంతు మాత్రమే, మిగిలిన మూడు వంతులు: ఆహార పరిమితులు, శారీరక వ్యాయామాలు మరియు ఇటువంటి ఇతర విషయాలు. కాబట్టి, మొదట నియంత్రించ వలసినది ఫుడ్(ఆహారం) మరియు హెడ్(మనస్సు). మీరు ఈ రెండింటినీ నియంత్రించినప్పుడు, అనారోగ్యానికి ఆస్కారం ఉండదు”...సత్యసాయిబాబా 1,2

1. ఆరోగ్యం అంటే ఏమిటి ?

హెల్త్ (ఆరోగ్యం) అనే పదం హోల్ (మొత్తం) అనే పదం నుండి వచ్చింది. ఇది శారీరకంగా, మానసికంగా, సామాజికంగా మరియు ఆధ్యాత్మికంగా - కేవలం వ్యాధి లేకపోవడమే కాకుండా - రోజువారీ జీవితంలో ప్రతి స్థాయిలో అనుభవించాల్సిన సంపూర్ణ శ్రేయస్సు యొక్క స్థితి. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి లోపల నుండి శాంతి మరియు ఆనందం వెల్లివిరుస్తుంది3,4.

2. జీవన శైలి వ్యాధులు అంటే ఏమిటి?

ప్రాథమికంగా ఇవి అంటు వ్యాధులు కావు కానీ ఎక్కువగా దీర్ఘకాలికమైనవి. అనారోగ్యకరమైన మరియు క్రమశిక్షణ లేని జీవనశైలి వల్ల ఇవి ఉత్పన్నమవుతాయి లేదా ప్రేరేపించబడతాయి లేదా తీవ్రతరం అవుతాయి. మందులను తీసుకోవడమే ఒక జీవన విధానంగా చేసిన వ్యాధులు ఇవి.5,6,7,8

ప్రధాన  కారణాలు: శరీర తత్వానికి సరిపడని విధంగా అధికంగా తినడం తాగడం, శారీరక శ్రమ లేకపోవడం, స్వచ్చమైన గాలి మరియు సూర్యకాంతికి లోనుకాకపోవడం, నిద్ర సరిపోక పోవడం  మరియు ఒత్తిడి. ఈ వ్యాధి-పీడిత జీవనశైలి ఏర్పడడానికి ప్రధాన కారణాలు సాంకేతికతతో నడిచే వేగవంతమైన జీవితం, ఎక్కువ గంటలు పని చేయడం, పేలవమైన భంగిమ, పోటీగా ఉండాలనే  కోరికతో సామాజిక మరియు తోటివారి ఒత్తిడి, ఆరోగ్యకరమైన వినోదం మరియు ప్రియమైనవారితో సమయం గడప లేకపోవడం, కుటుంబంలో సంస్కృతి పరంగా వచ్చే సాధారణ మార్పులు లేదా కుటుంబాల విచ్ఛిన్నం. ఈ సమస్య ధూమపానం, మద్యం సేవించడం మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి అలవాట్లతో మరింత జటిలం అవుతుంది. జన్యు పరంగానూ,  గాలి, నీరు మరియు నేల కాలుష్యం వంటివి కూడా ఇతర ప్రధాన కారకాలు.5,6,7,8

అత్యంత సాధారణ జీవన శైలి వ్యాధులు  అసిడిటీ, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, గుండెపోటు, ఊబకాయం, మరియు  టైప్ 2 మధుమేహం,   ఇటీవలే అధికంగా పెరుగుతూ ఈ జాబితాలో చేరే ఇతర వ్యాధులు క్యాన్సర్, ముఖ్యంగా నోటి మరియు పెద్దప్రేగు క్యాన్సర్, దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, సిర్రోసిస్, పెద్దప్రేగు శోథ, ప్రేగు  ప్రకోప వ్యాధి లేదా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, PCOD, ఎముక లేదా దంత క్షయాలు, ప్రవర్తనా సమస్యలు, నిరాశ, అల్జీమర్స్ వ్యాధి, ఆస్తమా, కీళ్లనొప్పులు, బోలు ఎముకల వ్యాధి, చర్మ వ్యాధులు, మరియు మూత్రపిండాల వైఫల్యం.5,6,7,8

3. మూడు ప్రధాన జీవనశైలి వ్యాధుల స్వభావం మరియు లక్షణాలు

3.1 ఊబకాయం: ఊబకాయం అంటే శరీరంలో అసాధారణ అధిక కొవ్వు చేరిక;  అధిక చక్కెర, అధిక కొవ్వు, ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం,   తక్కువ శారీరక శ్రమ వలన ఊబకాయం కలుగుతుంది. స్థూలకాయం యొక్క సూచిక BMI (బాడీ మాస్ ఇండెక్స్ అనేది శారీరక బరువును కిలోలలో అలాగే ఎత్తును మీటర్ల స్క్వేర్‌లో భాగించడం ద్వారా వచ్చినది) 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే స్థూలకాయం కలిగి ఉన్నట్లే. ఇది అనేక వ్యాధులకు ప్రధాన కారణాలలో ఒకటి, ముఖ్యంగా పెద్దలలో టైప్ 2 మధుమేహం, ప్రస్తుతం పిల్లలు మరియు యువత కూడా దీనికి గురి అవుతున్నారు. 25 కంటే ఎక్కువ ఉన్న BMI అధిక బరువుగా పరిగణించబడుతుంది, ఇది నివారించవలసిన ఊబకాయానికి సంకేతం. 8,9

 3.2 టైప్ 2 మధుమేహం:  టైప్ 2 డయాబెటిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది అంటే, ప్యాంక్రియాస్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయక పోవడం లేదా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సరిపోకపోవడం.  సాధారణంగా ఇది పెద్దలలో సంభవిస్తుంది కానీ ఇటీవల పిల్లలలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఊబకాయం ఉన్నవారు, అధిక కేలరీల ఆహారాన్ని తినడం, కుటుంబ చరిత్ర లేదా జన్యు సంబంధిత కారణాలు, మరియు ఉదర ఊబకాయం (పెరిగిన నడుము నుండి తుంటి నిష్పత్తి) ఉన్న వారు దీనికి ఎక్కువగా గురైయె అవకాశం ఉంది. అలాగే, గర్భధారణ సమయంలో తల్లికి పోషకాహార లోపం వలన తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు మరియు బాల్యంలో తల్లిపాలు సరిపోని పిల్లలు కూడా దీనికి  గురైయె అవకాశం ఉంది. అటువంటి బలహీనమైన పిల్లలకు అత్యుత్సాహం గల తల్లిదండ్రులు అతిగా తినిపించడం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. 8,9,10

లక్ష ణాలు నెమ్మదిగా అభివృద్ధి అవుతాయి: వ్యాధి ప్రాధమిక దశలో దాహం పెరగడం, తరచుగా మూత్రవిసర్జన లేదా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వంటి వాటిలో ఏదో ఒకటి ఉండవచ్చు. ఆకలి పెరగడం, బరువు తగ్గడం, అలసట, కళ్లు తిరగడం, చూపు మసకబారడం, పుండ్లు నెమ్మదిగా తగ్గడం, తరచుగా ఇన్‌ఫెక్షన్‌లు, చేతులు లేదా కాళ్లు తిమ్మిరి లేదా జలదరింపు లేదా పాదాలలో స్పర్శ తగ్గడం, తినేటప్పుడు చెమటలు పెరగడం మరియు చర్మం పైన అక్కడక్కడ  నల్లబడిన ప్రాంతాలు వంటివి ఈ వ్యాధిని గుర్తించదగిన సంకేతాలలో కొన్ని. ఖచ్చితమైన లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు. మధుమేహాన్ని అనుమానించడానికి ఒక్క లక్షణం మైనా సరిపోతుంది ఐతే యాభై శాతం కేసులు లక్షణరహితంగా ఉండవచ్చు మరియు రక్త పరీక్షలు ఈ పరిస్థితిని వెల్లడించినప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తాయి. అనుకోకుండా బరువు తగ్గడం, చిన్నపాటి స్కిన్ ఇన్‌ఫెక్షన్ లేదా ప్రైవేట్ పార్ట్స్‌లో దురద వంటి తేలికపాటి లక్షణాలను ఈ వ్యాధిగ్రస్తులు కలిగి ఉండవచ్చు, ఇవి గుర్తించబడకపోతే  గుండెపోటు, స్ట్రోక్, దృష్టి కోల్పోవడం, కోమా మొదలైన వాటికి దారితీయవచ్చు. పిల్లల విషయంలో ముఖ్యంగా  తగినంత పోషకాహారాన్ని పొందుతున్నప్పటికీ పిల్లల ఎదుగుదలలో లోపం, చీమలు పిల్లల మూత్రం పోసిన చోట చేరడం, ఇలాంటి సూచికల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. 8,9,10 

డయాబెటిక్ ఎమర్జెన్సీ లక్షణాలు: మధుమేహం ఉన్న వ్యక్తి భోజనం మానేసినప్పుడు లేదా ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పడిపోతుంది (హైపోగ్లైసీమియా). దీని సాధారణ లక్షణాలు: ఆకలి, చెమట, మగత లేదా గందరగోళం, బలహీనత లేదా మూర్ఛ, లేదా అకస్మాత్తుగా ప్రతిస్పందన కోల్పోవడం: లేదా రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగవచ్చు (హైపర్‌గ్లైసీమియా) దీని సాధారణ లక్షణాలు: శ్వాస ఆడకపోవడం, నోటి నుండి పండ్ల వాసన, వికారం, వాంతులు, మరియు నోరు పొడిబారడం. 8,9

3.3 హృదయ సంబంధ వ్యాధులు:  ఇవి గుండె మరియు రక్త నాళాల రుగ్మతలు. అనారోగ్యకరమైన జీవనశైలి సాధారణంగా కరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD)కి దారి తీస్తుంది, ధమని గోడలపై దీర్ఘకాలం కొవ్వు నిల్వలు గుండె మరియు మెదడుకు రక్త ప్రవాహాన్ని నిరోధిస్తాయి. దీని వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ రావచ్చు. అధిక రక్తపోటు, అసాధారణ కొలెస్ట్రాల్ మరియు అధిక ట్రైగ్లిజరైడ్స్, ఊబకాయం మరియు మధుమేహం ఉన్న వ్యక్తులు సులభంగా ఈ వ్యాధికి లోనౌతారు. గుండె పోటుకు ముందు ఏదైనా ఒక సూచన పొందవచ్చు (దానిని విస్మరించకూడదు), లేదా అది ఆకస్మికంగా కూడా ఉండవచ్చు. 8,9,13-16

గుండెపోటు యొక్క తీవ్రమైన లక్షణాలు: ఆకస్మిక నొప్పి లేదా ఛాతీలో ఒత్తిడిని అనుభూతి చెందడం,  పిండినట్లుగా లేదా నొక్కివేసి నట్లుగా అనిపించడం, ఛాతీ మధ్యలో బరువుగా ఉండడం, లేదా చేతులు, భుజాలు, మోచేతులు, దవడ లేదా వీపులో ఆకస్మిక నొప్పి ఉండవచ్చు. వీటికి అదనంగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆందోళన, వికారం, వాంతులు, మూర్ఛ, దడ, లేదా చెమటతో వళ్ళు చల్లగా అయిపోవడం, లేదా పాలిపోయినట్లుగా మారిపోవడం  ఉండవచ్చు. ఇది కొన్ని నిమిషాల పాటు కొనసాగవచ్చు లేదా తిరిగి వస్తూ ఉండవచ్చు. 8,13-16

స్ట్రోక్ (మెదడుపై దాడి) యొక్క తీవ్రమైన లక్షణాలు: ముఖం, చేయి లేదా కాలు, ముఖ్యంగా శరీరం యొక్క ఒక వైపున ఆకస్మిక బలహీనత లేదా తిమ్మిరి. ఇతర లక్షణాలు అనగా అకస్మాత్తుగా గందరగోళం, మాట్లాడటంలో ఇబ్బంది, మాటలను అర్థం చేసుకోలేకపోవడం, దృష్టిలో అస్పష్టత /రెండుగా కనిపించడం లేదా డబల్ విజన్, లేదా దృష్టి కోల్పోవడం, ముఖ్యంగా ఒక కంటిలో, మైకము, సమతుల్యత కోల్పోవడం లేదా సమన్వయం కోల్పోవడం లేదా కారణం ఏదీ  లేకుండా తీవ్రమైన తలనొప్పి మరియు మూర్ఛపోవడం ఉండవచ్చు.8,9,17

4. మధుమేహ సంబంధిత అత్యవసర స్థితి, గుండెపోటు లేదా స్ట్రోక్ సమయంలో చేయవలసిన ప్రధమ చికిత్స:

4.1 డయాబెటిక్ ఎమర్జెన్సీ: డయాబెటిక్ ఎమర్జెన్సీ అనేది రక్తంలో చక్కెర ఎక్కువ లేదా చాలా తక్కువ ఐన కారణంగా కావచ్చు. ఒక వేళ కారణం చక్కెర చాలా తక్కువ స్థాయి వలన అయితే రోగి స్పృహలో ఉండి మింగగలిగే స్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక తీపి పానీయం, లేదా  చాక్లెట్ లేదా ఏదో ఒక స్వీట్ ను తినడానికి ఇవ్వండి; నిమిషాల్లో రోగి మెరుగు పడతాడు. రోగి మరింత అప్రమత్తంగా ఉన్నప్పుడు, గణనీయమైన కార్బోహైడ్రేట్ లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అందించండి, ఉదా, శాండ్‌విచ్ లేదా తీపి బిస్కెట్లు. వ్యక్తి అపస్మారక స్థితిలో ఉంటే వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయండి; అట్టి వారికి తినడానికి లేదా త్రాగడానికి ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే వారు ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది. శ్వాసకు ఆటంకం కలగకుండా వారిని ఒక వైపుకు తిప్పండి.18,19

4.2 గుండెపోటు: గుండెకు శాశ్వత నష్టాన్ని నివారించడానికి తక్షణ వైద్య సహాయం లేదా ఒక గంటలోపే చికిత్స చేయడం అవసరం. సహాయం అందే వరకూ గుండెపై ఒత్తిడిని తగ్గించడానికి మరియు వారు కింద పడిపోతే గాయాన్ని నివారించడానికి వ్యక్తిని కుర్చీలో లేదా గోడకు ఆనుకుని నేలపైన గానీ కూర్చోబెట్టండి. రోగి యొక్క మెడ, ఛాతీ మరియు నడుము చుట్టూ ఉన్న దుస్తులను వదులు చేసి వారు ప్రశాంతంగా ఉండటానికి సహాయం చేయండి. రోగి చుట్టూ ఎవరినీ  గుమికూడనివ్వవద్దు. రక్తాన్ని పలచన చేయడానికి ఆస్పిరిన్ టాబ్లెట్ (ఒక మోతాదులో 300 mg కంటే ఎక్కువ కాకూడదు) చప్పరించ నివ్వాలి. రోగి అప్పటికే మందులపై ఆధారపడి ఉంటే వారు నిత్యమూ తీసుకొనే ఔషధం ఇవ్వవచ్చు. 20-23

కార్డియో పల్మనరీ రిసస్కియేషన్ (CPR): రోగి కుప్పకూలిపోయినా లేదా నాడీ స్పందన ఆగిపోయినట్లు అనిపించినా రోగిని  నేలపై నిటారుగా ఉండేలా దృఢమైన ఉపరితలంపై మెల్లగా వెల్లకిలా పడుకునేలా చేసిన తర్వాత CPR ఇవ్వండి. అనగా రోగి ఛాతీపై వెంటవెంటనే 30 వేగవంతమైన మరియు గట్టి కుదింపులను లేదా వత్తిడి లను ఒక సైకిల్ గా లేదా చక్రంలా  ఇవ్వండి. శ్వాస తీసుకోవడానికి వాయుమార్గాన్ని తెరుచుకొనేలా చేసి రెండు రెస్క్యూ బ్రీత్‌లను కూడా ఇవ్వండి (C-A-B అని పిలుస్తారు). రోగి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించే వరకూ లేదా వైద్య సహాయం అందె వరకూ ఈ C-A-B సైకిల్ లను కొనసాగించండి. ఛాతీపై కుదింపులు మాత్రమే ఒక జీవితాన్ని రక్షించగలవు! సాధారణ వ్యక్తి CPR.21-23.ని ఎలా నిర్వహించవచ్చో తెలుసుకోవడానికి క్రింది లింక్‌ల ద్వారా వెళ్లండి (మహిళల్లో గుండెపోటు పై అవగాహన కోసం వాల్యూం 1 #1 సెప్టెంబర్ 2010 మరియు ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటును ఎలా తట్టుకోవాలో వాల్యూం 2 #5 సెప్టెంబర్ 2011 చూడండి).

ఎడమ చిటికెన వేలు గోరు యొక్క మొదలు చుట్టూ నొక్కడం గుండెపోటుకు ఆక్యుప్రెషర్‌లో విధానంలో సమర్థవంతమైన ప్రాణాలను రక్షించే ప్రథమ చికిత్సగా పరిగణించబడుతుంది.24

4.3 స్ట్రోక్ మెదడులోని రక్తనాళం గడ్డకట్టడం లేదా పగిలిపోవడం కారణంగా మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది. ఇది ఎప్పుడూ పిడుగులా వస్తుంది. మెదడులో కణాలు చనిపోతూ ఉంటాయి కనుక ప్రతీ సెకను కూడా ప్రధానమైనదే. అత్యవసర వైద్య సహాయం కోసం కాల్ చేయవలసి ఉంటుంది. రోగి పూర్తి స్పృహలో  లేకుండా ఉంటే సాధ్యమైనంత ఎక్కువ సౌలభ్యం ఉన్న స్థితిలో వారిని ఒక ప్రక్కగా పడుకునేలా ఉంచి, వైద్య సహాయం వచ్చే వరకు వేడిని కోల్పోకుండా రోగిని కవర్ చేయాలి. 25-26

రోగిని నిద్రపోనివ్వవద్దు. స్ట్రోక్ వ్యక్తి యొక్క మింగే సామర్థ్యాన్ని ప్రభావితం చేసి రోగిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, కాబట్టి మందులు, ఆహారం లేదా పానీయాలు ఇవ్వకూడదు. ఇది హెమరేజిక్ స్ట్రోక్ అయితే (20% స్ట్రోక్స్ ఇలాంటివే కావచ్చు) ఆస్పిరిన్ ఇవ్వడం మరింత రక్తస్రావమును కలిగిస్తుంది. లక్షణాలు త్వరగా అదృశ్యమైనప్పటికీ, సహాయం కోసం కాల్ చేయడంలో ఆలస్యం చేయవద్దు. చాలా మంది స్ట్రోక్ రోగులకు CPR అవసరం లేదు కానీ రోగికి పల్స్ లేకపోయినా, శ్వాస తీసుకోలేకపోయినా, అపస్మారక స్థితిలో ఉన్నా వెంటనే CPR.25-26 ఇవ్వండి. 

5 ఆరోగ్య కరమైన జీవన శైలి ఏ వ్యాధినైనా నివారించ వచ్చు లేదా నిరోధించవచ్చు.

చాలా వరకు జీవనశైలి వ్యాధులు నివారించదగినవి మరియు తిరిగి వెనుకకు మళ్లింపదగినవి! క్రమమైన శారీరక శ్రమ తో పాటు తగిన ఆహారంతో అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు (తృణధాన్యాలు, కూరగాయలు మరియు పండ్లు), మొక్కల ఆధారిత ప్రోటీన్ (కాయధాన్యాలు, బీన్స్, బఠానీలు, గింజలు మరియు విత్తనాలు) మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు "కొవ్వు రహిత" ఆహారాలు అని పిలవబడే వాటితో పోలిస్తే మితంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి జన్యు పరంగా మనం గురి అయ్యె వ్యాధులను కూడా చాలా వరకు అరికట్టగలవని పరిశోధనలు చెబుతున్నాయి.5,8,9,27-32

సామాజిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం దయ, సేవ లేదా సమాజపు పని, మరియు సంబంధాలను పెంపొందించడం అలాగే ధ్యానం లేదా సైలెంట్ సిటింగ్ ద్వారా ప్రతిరోజూ తనతో తను నాణ్యమైన సమయాన్ని గడపడం శాంతి మరియు ఆనందాన్ని ఇస్తుంది. 32.  జీవనశైలికి సంబంధించి ఈ సందర్భంలో మహాత్మా గాంధీ యొక్క బంగారు పదాలు గుర్తు తెచ్చుకోవడం సముచితం. "దేహాన్ని దేవుని ఆలయంగా ఉపయోగించుకునే బదులు, మనము దానిని భోగాలకు వాహనంగా ఉపయోగించడం మరియు అవసరమైనప్పుడు సహాయం కోసం వైద్యుల వద్దకు పరిగెత్తుతూ ఈ భూలోక గుడారాన్ని దుర్వినియోగం చేయడానికి సిగ్గుపడము.33

రిఫరెన్సులు మరియు వెబ్సైట్ లింకులు

  1. Sathya Sai Speaks, Divine Discourse on “Health, Diet, and Divinity”, 3 June 1995,https://www.sssbpt.info/ssspeaks/volume28/sss28-16.pdf
  2. Sathya Sai Speaks, Divine Discourse on “One-fourths and three-fourths”, 27 March 1968 https://www.sssbpt.info/ssspeaks/volume08/sss08-14.pdf
  3. Health comes from whole: https://isha.sadhguru.org/yoga/yoga-articles-body-health/living-healthy-well/
  4. https://www.who.int/about/governance/constitution
  5. https://www.who.int/news-room/fact-sheets/detail/noncommunicable-diseases
  6. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2862441/
  7. https://www.who.int/news-room/fact-sheets/detail/healthy-diet
  8. https://www.nhp.gov.in/lifestyle-disorder_mtl
  9. Prevent diabetes: The world’s invisible enemy: Diabetes, by Dr V. Lakshminarayan & Dr. Sooraj Tejaswi, Sri Sri Publications Trust India, foreword by Dr V Mohan
  10. https://www.diabetes.org.uk/diabetes-the-basics/differences-between-type-1-and-type-2-diabetes#
  11. Symptoms of diabetic emergency: https://www.redcross.org.uk/first-aid/learn-first-aid/diabetic-emergency
  12. https://my.clevelandclinic.org/health/diseases/9815-hyperglycemia-high-blood-suga
  13. Symptoms of heart attack: https://www.who.int/news-room/fact-sheets/detail/cardiovascular-diseases-(cvds)
  14. https://www.cdc.gov/heartdisease/heart_attack.htm
  15. https://www.cdc.gov/heartdisease/risk_factors.htm
  16. https://www.heart.org/en/health-topics/heart-attack/warning-signs-of-a-heart-attack
  17. Symptoms of Stroke: https://www.cdc.gov/stroke/signs_symptoms.htm
  18. First aid in a diabetic emergency: https://www.stjohn.org.nz/first-aid/first-aid-library/diabetes/
  19. First aid in diabetic coma: https://www.betterhealth.vic.gov.au/health/conditionsandtreatments/diabetic-coma
  20. First aid in heart attack: https://www.redcross.org.uk/first-aid/learn-first-aid/heart-attack
  21. Apollo Hosp on first aid in heart attack: https://www.youtube.com/watch?v=WDh0LdqCeYg
  22. CPR: https://www.drugs.com/cg/lay-person-cpr-on-adults.html#
  23. https://www.icicilombard.com/blogs/health-insurance/hi/heart-attack-first-aid-steps-everyone-must-know#
  24. Acupressure for Total Wellness, Ketan V Shah, 2011 edition, page 118
  25. Stroke: https://www.stjohn.org.nz/first-aid/first-aid-library/stroke/
  26. Stroke—Dos and Donts: https://www.pennmedicine.org/updates/blogs/neuroscience-blog/2022/march/what-to-do-if-someone-is-having-a-stroke
  27. Prevent heart ailments: https://www.northwestern.edu/newscenter/stories/2010/11/heart-disease.html
  28. Diabetic diet: https://drmohans.com/patient-care/diabetic-diet/
  29. Sai Baba advice for diabetes: http://saibaba.ws/articles/medicaladvices.htm
  30. https://www.sathyasai.org/healthy-living/simply-prevent-diseases
  31. Nine ways to prevent disease: https://health.clevelandclinic.org/9-ways-to-prevent-disease/
  32. Self-care health checklist: https://draxe.com/health/self-care-checklist/
  33. Gandhiji, 8 August 1929, Young India magazine, https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC6515727/

________________________________________________________________________________

2. SVP వర్క్ షాప్ 2022 మార్చ్ 3నుండి 7 ప్రశాంతి నిలయం

 సాయి వైబ్రియానిక్స్ మానవాళికి సేవ చేయడానికి వాస్తవం చెప్పాలంటే భగవంతునికి సేవ చేయడానికి నిరంతరం అవకాశాన్ని అందించే ఒక అద్వితీయమైన బహుమతి. స్వామివారి ఆశీర్వాదం దీని ప్రభావాన్ని ఇనుమడింప చేయడమె గాక ప్రాక్టీషనర్లు తమ రోగులకు ఉత్సాహంతో సేవ చేయడంతో పాటు నైపుణ్యము మరియు జ్ఞానంలో అభివృద్ధి చెందడానికి తమతో పాటు సాయి వైబ్రియానిక్స్ సంస్థను కూడా బలోపేతం చెయడానికి పనికి వస్తుంది. ఇటీవల జరిగిన ఈ SVP వర్క్‌షాప్‌లో ఇది స్పష్టమైంది.

మా సీనియర్ శిక్షకులు నిర్వహించిన 12 వారాల అద్భుతమైన ఆన్‌లైన్ శిక్షణను పూర్తి చేసిన తర్వాత, చాలా ఉత్పాదకమైన ఈ ప్రాక్టికల్ వర్క్‌షాప్‌కు భారతదేశం నుండి నలుగురు ప్రాక్టీషనర్లు, USA నుండి ఒకరు మరియు ఫ్రాన్స్ నుండి ఒకరు హాజరయ్యారు. పాల్గొనే వారందరూ వారి 'విజన్ ఫర్ వైబ్రియోనిక్స్ - ఇప్పటి నుండి ఐదు సంవత్సరాలు" మరియు వైబ్రియానిక్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ ఎలా దోహదపడగలరు అనే అంశంపై ప్రెజెంటేషన్‌లు ఇచ్చారు. డా. అగర్వాల్ ద్వారా స్ఫూర్తిదాయకమైన మరియు హృదయపూర్వక ప్రసంగం జరిగింది మరియు ఇది ప్రశ్నోత్తరాల సెషన్‌తో ముగిసింది. శిక్షణార్థులందరి ప్రమాణ స్వీకార కార్యక్రమంతో వర్క్‌షాప్ ముగిసింది. పాల్గొన్నవారు మరియు శిక్షకుల నుండి తీసుకున్న సామూహిక ఫీడ్‌బ్యాక్ అత్యంత సానుకూలంగా ఉండడమే కాక వైబ్రియానిక్స్ ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి అందుబాటులో ఉండేందుకు స్వామి సంకల్పం కోసం కృషి చేయడానికి అందరినీ ప్రేరేపించింది.

________________________________________________________________________________

3. రిఫ్రెషర్ వర్క్ షాప్, బెంగళూరు, 2022 ఏప్రిల్ 9  

కర్ణాటక ప్రాక్టీషనర్లు ఏప్రిల్ 2020 నుండి ఆన్‌లైన్‌లో నెలవారీ సమావేశాలను నిర్వహిస్తున్నారు అలాగే 108CC పుస్తకంలోని 21 కేటగిరీలలో 20ని కవర్ చేసారు. బెంగుళూరులోని సాయి గీతాంజలి సమితిలో ఈ రిఫ్రెషర్ వర్క్ షాప్ సమాచారాత్మకమైన, ప్రోత్సాహకరమైన మరియు ఉత్తేజకరమైన రీతిలో జరిగింది. చాలా మంది ప్రాక్టీషనర్లు తమ లేఖలు మరియు 108 CC బాక్సులు స్వామి ఫోటో ముందు ఉంచడానికి ముందుగానే ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ ఉత్తరాలు, పంపిణీకి ఉపయోగించబోయే ఫోటోలు, అలాగే SSIHMS లో వెల్నెస్ సెంటర్ లో ఉపయోగించే 108 CC బాక్సుతో సహా కొన్ని ఇతర బాక్సులపైన స్వామి తమ అనుగ్రహ విభూతిని అపారంగా వర్షించడంతో ప్రాక్టీషనర్లు అందరూ ఉద్వేగానికి ఆనందానికి గురి అయ్యారు (ఫోటోను చూడండి). ప్రాక్టీషనర్ 11622 ‘స్వీయ పరివర్తనకు సేవ యొక్క ఆవశ్యకత’ అనే అంశం పై తమ ప్రసంగంతో ఉదయపు సమావేశము ప్రారంభించారు.  తదుపరి సమావేశములో 108CC పుస్తకంలోని 21వ వర్గంపై సమాచారం అందించడము మరియు దానిపై చర్చ జరిగింది,  తదుపరి ఐదుగురు ప్రాక్టీషనర్లు స్ఫూర్తిదాయకమైన తమ అనుభవాలను అందించారు. ఈ వర్క్‌షాప్‌లో హైలైట్ మధ్యాహ్నం నిర్వహించిన రీఛార్జ్ సెషన్. ప్రాక్టీషనర్11601 కృషితో పర్తి నుండి ప్రత్యేకంగా ఈ సెషన్ కోసం మాస్టర్ బాక్స్ తెప్పించబడి సెషన్ అనంతరం తిరిగి పంపించి వేయ బడింది. హాజరైన 35 మంది ప్రాక్టీషనర్లు తమ బాక్సులను నేరుగా మాస్టర్ బాక్స్ నుండి ఛార్జ్ చేయడం విశేషంగా భావించారు (ఫోటో చూడండి).

________________________________________________________________________________

4. రీ చార్జింగ్ సెషన్, ముంబయ్ 2022 ఏప్రిల్ 23.

ధర్మ క్షేత్రం వేదికగా సాయంత్రం 4 గంటలకు వెల్‌నెస్ సెంటర్‌లో ఉత్సాహభరితమైన వాతావరణంలో స్వామివారికి ప్రార్థన, ఓంకార మంత్రోచ్ఛారణలతో ఈ రీఛార్జ్ సెషన్‌ ప్రారంభమయ్యింది. సాయంత్రం 5 గంటలకు రిచార్జ్ చేసిన మొత్తం 31, 108CC బాక్సులను స్వామివారి ఆశీస్సుల కోసం స్వామివారి పాద పద్మాల చెంత ఉంచడం జరిగింది. మంగళ హారతి తో కార్యక్రమం ముగించే ముందు మహమ్మారి అనంతర సమస్యలు మరియు సాధారణ సమస్యల పరిష్కారానికి కొంత సమయం కేటాయించ బడింది.

________________________________________________________________________________

5. చికెన్ ఫాక్స్ నుండి గోవులు కోలుకోవడం 11570 ఇండియా  

 ఒక పెద్ద గోశాలలో గల మొత్తం 2200 ఆవులలో ఐదు ఆవులకు ముఖం, మెడ మరియు వీపుపై పొక్కులు ఏర్పడడం తో పాటు జ్వరం కూడా వచ్చింది. ఫలితంగా, అవి ఆహారం మానివేయడంతో, ఐదు రోజుల తర్వాత, ఆసుపత్రి పాలయ్యాయి. రెండు రోజుల తర్వాత అక్టోబర్ 5న, మరో 20 గోవులు అస్వస్థతకు గురయ్యాయి. అందువలన వాటి ప్రదేశంలోనే అవి క్వారనైటైన్ చేయబడ్డాయి. ఆసుపత్రిలో వారం రోజులు గడిపిన తర్వాత, అక్టోబర్ 10న, ఐదు ఆవులు తిరిగి వచ్చాయి, అవి జ్వరం లేకుండా బాగానే ఉన్నాయి, కానీ ఇంకా బలహీనంగా ఉన్నాయి. అంతేకాక ఆకలి సరిగా లేకపోవడంతో పాటు పొక్కులు వంటి లక్షణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్టోబరు 11న ప్రాక్టీషనర్ అన్ని ఆవులకు CC1.1 Animal tonic + CC9.4 Children’s diseases…TDS తాగే నీటిలో ఇవ్వడం జరిగింది. మరుసటి రోజుకు వాటికి  ఆకలి పెరిగింది, అలాగే జ్వరం మరియు పొక్కులు కూడా తగ్గాయి. అక్టోబర్ 17 నాటికి, వాటి జ్వరం తగ్గిపోయి, పొక్కులు కూడా తగ్గడంతో అవి 80% మేర కోలుకున్నాయి. అవి ఇప్పుడు చక్కగా మేత మేస్తున్నాయి. ఒక వారం తర్వాత అక్టోబర్ 24న, మొత్తం 25 ఆవులు పూర్తిగా కోలుకున్నందుకు ఆ ప్రదెశాన్ని సందర్శించిన ప్రాక్టీషనర్ ఎంతో సంతోషించారు! 2022 ఏప్రిల్ నాటికి అనగా ఆరు నెలల అనంతరం మొత్తం 25 ఆవులు బాగానే ఉన్నాయి. ఈ అనుభవం ప్రాక్టీషనరుకు వైబ్రియానిక్స్ సేవ చేసుకోవడానికి మరొక వేదికను అందించింది. 

________________________________________________________________________________

6. జ్ణాపకార్ధం

శ్రీ రవీందర్ బాలకృష్ణ దవే 10163 2021 డిసెంబర్ 24న 70 సంవత్సరాల వయస్సులో శ్రీ దవే స్వామిలో ఐక్య మయ్యారు. ఒక సంవత్సరం క్రితం గుండెపోటుతో కోలుకున్న తరువాత వీరికి పేగులో గ్యాంగ్రీన్‌ ఏర్పడింది. దాని కోసం ఆపరేషన్ చేయబడినప్పటికి ఒక నెల తరువాత వీరు స్వర్గస్తులయ్యారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, వీరు తన జీవితంలో చివరి నెల వరకు చురుకుగా ఉండడమే కాక నెలవారీ నివేదికలను క్రమం తప్పకుండ సమర్పించారు.  వైబ్రియానిక్స్ పట్ల వీరికి ఉన్న గొప్ప అంకితభావాన్ని మేము కృతజ్ఞతతో తెలియజేస్తున్నాము.

ఫాదర్ చార్లెస్ ఒగడా 02522  2022 మార్చి 30 న 51 ఏళ్ల చిన్న వయస్సులో తన స్వర్గలోకపు నివాసానికి నిష్క్రమించారు.  వీరు 2009 నుండి నైజీరియాలో వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ చేస్తూ తన సోదరుడితో కలిసి వేలాది మంది రోగులకు చికిత్స అందించారు. నాలుగేళ్ల క్రితం తాను స్థాపించిన ఆసుపత్రిలో వైబ్రియానిక్స్‌ను ప్రవేశపెట్టారు. మరణించడానికి రెండు నెలల ముందు వీరు కోవిడ్ -19 బారిన పడ్డారు, ఐతే దాని నుండి వారు కోలుకున్నారు కాని తరువాత మలేరియా బారిన పడ్డారు. ఈ నిజమైన అన్వేషకుని యొక్క సేవ మరియు జ్ఞానభాండాగారమును రెండింటినీ కోల్పోవడం నిజంగా విచారకరం. కోవిడ్-19 నుండి కోలుకుంటున్నప్పుడు, వీరు ఒక పద్యం వ్రాసారు, దానిని మీతో పంచుకోవాలనుకుంటున్నాము.

మీ ఉనికి యొక్క అస్తిత్వాన్ని వెతకండి.

నేను ఈ దేహాన్ని కాదు-ఇది అనారోగ్యం మరియు బలహీనత గురించి చింతిస్తుంది.  

నేను మనసు కాదు – శరీరం గురించి చింతిస్తుంది.

నేను భావోద్వేగాలు కాదు- ఇవి చీకటి శక్తి యొక్క మేఘం లా నా చుట్టూనే తిరుగు తున్నాయి.  

నేను నా బిడ్డలు కూడా కాదు - ఏకత్వం అనే వేదికపై నిర్మించిన లోతైన బంధాలతో కూడినవి.

నేను ఆనంద గ్రామాన్ని కాదు - ప్రేమ మరియు సేవ యొక్క ఆకాశ హార్మ్యాలు ఎత్తుగా, ధృఢంగా నిలిచి ఉన్నాయి.

నేను నా వైఫల్యాలు కూడా కాదు - అవి చాలానే ఉన్నాయి.

నేను నా విజయాలు కూడా కాదు - అవి కూడా చాలా ఉన్నాయని నాకు తెలుసు.

నేను పూజారిని కాదు – సన్యాసిగా గుర్తింపబడే అలవాట్లు మరియు దుస్తులు లేవు.

నేను దేవుణ్ణి కాను - అన్ని మతపరమైన భావనలు మరియు ఆలోచనలు దానికి ఒక ఉనికిని ఏర్పరిచాయి.

నేను ఏమీ కాదు; నేను ఏమీ కానివాడిని కూడా కాదు; నేను నేనే కాదు – అది స్వకీయ ప్రతిబింబంగా అంచనా వేయబడింది!

మరియు నేను ఈ ఆలోచనా ప్రక్రియను కూడా కాదు - 'నేను ఇది కాదు మరియు నేను అది కాదు'

నేను ఏదీ కాదు ;

అయినప్పటికీ నేను ఉన్నాను.