కీళ్ల వాతం 02051...Chile
44 ఏళ్ల మహిళకు శరీరం అంతటా కీళ్లలోబిగుసుకు పోయినట్లు ఉండడం ముఖ్యంగా ఆమె చేతుల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. ఆమె పరిస్థితి క్రమంగా క్షీణించడం వలన కీళ్ళు వాపు మరియు బాధ తోపాటు విపరీతమైన అలసట మరియు రోజువారీ పనులను నిర్వహించడానికి ఆసక్తి లోపిస్తోంది. ఉదయపు వేళల్లో లక్షణాలు మరింత అధ్వాన్నంగా ఉండటంతో ఆమె కదలడం కూడా కష్టమవుతోంది. ఆమెకు 2017లో కీళ్లనొప్పులు ఉన్నట్లు నిర్ధారణ అయింది మరియు అప్పటి నుండి సూచించిన స్టెరాయిడ్స్, మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు పెయిన్ కిల్లర్ మందులను తీసుకుంటున్నారు కానీ కొద్దిపాటి ఉపశమనం మాత్రమే లభించింది. 2021 ఆగస్ట్ 28 న, ఆమె వైబ్రియానిక్స్ తీసుకోవాలని నిర్ణయించుకుని ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు. సందర్శన సమయంలో ఆమె చేతుల్లో తీవ్రమైన కీళ్ల నొప్పులు ఉండడంతో చాలా ఆందోళనకు గురై ఉన్నారు. వీరికి క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి:
CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis…TDS
ప్రాక్టీషనర్ సలహా మేరకు, రోగి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆధ్యాత్మిక అభ్యాసాలు, ఆశావాదం తో ఉండడం, క్షమార్పణ తత్వం మరియు ప్రేమను పెంపొందించుకోవడం, ఆకుకూరలు మరియు వాటి రసాలను ఆహారంలో చేర్చడము, మాంసం మరియు పాల ఉత్పత్తులను మినహాయించడం, వంటి ఆరోగ్యకరమైన ఆహారంతో సహా అనేక జీవనశైలి మార్పులను చేసారు. ఒక నెల తర్వాత ఆమె నొప్పి, వాపు మరియు కీళ్ల బిగింపు నుండి 30% ఉపశమనం పొందారు. మరో రెండు నెలల్లో ఇది 50%కి పెరిగింది. ఆమె సులభంగా కదలగలుగుతున్నందుకు చక్కని ఆనందానుభూతిని పొందారు. రెండు వారాల తర్వాత, అనగా డిసెంబర్ 15 నాటికి ఆమె భయాందోళన తొలగడంతో సహా మొత్తం మీద ఆరోగ్యంలో 85% మెరుగుదల కలిగినట్లు చెప్పారు. ఇది అల్లోపతి మందులను ఆపగలిగేలా ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
2022 జనవరి నాటికి ఆమెకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవు, ప్రశాంతంగా మరియు మరింత శక్తివంతంగా ఉండగలుగుతున్నారు. కొన్నిసార్లు వాతావరణ మార్పులు మరియు అమిత ఆహారము తీసుకున్న సమయాలలో, ఆమె స్వల్పంగా లేదా అతితక్కువ స్థాయిలో కీళ్ల నొప్పిని అనుభవిస్తున్నారు. 2022 ఏప్రిల్ నాటికి, ఆమె ఆరోగ్యంగా ఉంటూ రెమిడీ ని TDSలో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.