Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మెడ ప్రాంతంలో నొప్పి 03518...India


42 ఏళ్ల వ్యక్తి గత 10 సంవత్సరాలుగా తల వెనుక భాగంలో చెవుల భాగం నుండి మెడ వరకు నొప్పితో బాధ పడుతున్నారు. అది క్రమంగా ఇబ్బంది కరంగా మారి ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరింది. తను సరైన భంగిమలో కూర్చోనకుండా తన లాప్ టాప్ ను రోజుకు ఎనిమిది గంటలు ఎక్కువ సేపు వాడుతున్నప్పుడు ఇలా జరుగుతూ ఉన్నట్లు అతను కనుగొన్నారు. అతను కొన్ని నెలలు హోమియోపతి ప్రయత్నించారు కానీ పెద్దగా ఉపశమనం లేదు. తను అల్లోపతీ మందులు తీసుకోలేదు. అతను ల్యాప్టాప్ తో  పనిచేయకుండా ఉన్నప్పుడు(ఉదాహరణకు సెలవుల్లో) అతను కొంత ఉపశమనం పొందారు, తిరిగి పని  ప్రారంభించినప్పుడు నొప్పి తీవ్రమవుతున్నది. 2021 ఏప్రిల్ 16న అతను తల మరియు ముఖ భాగంలో నిర్దిష్ట బిందువుల వద్ద ఆక్యుప్రెషర్ ను ఎలా ఉపయోగించాలో నేర్పించిన ప్రాక్టీషనర్ ను సంప్రదించి క్రింది రెమిడీ స్వీకరించారు:

CC3.7 Circulation + CC11.3 Headaches + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.5 Spine…TDS 

  ఒక నెలలో నొప్పి 80% తగ్గింది, మరియు కంప్యూటర్ లో అతను రోజువారీ పనిగంటలు 4 నుండి 5 గంటలకు తగ్గింది. జూన్ 13 నాటికి నొప్పి 90% వరకూ తగ్గిపోగా, జూన్ 27 నాటికి నొప్పి పూర్తిగా తగ్గిపోవడంతో మోతాదు OD కి తగ్గించబడింది. జూలై 1 నుండి అతని  కంప్యూటర్ వినియోగం రోజుకు 8 గంటల వరకు పెరిగింది ఐతే రెండు సందర్భాలలో అతను అతిగా ఒత్తిడికి గురైనట్లు అనిపించినప్పుడు అతను కొంత నొప్పి అనుభవించారు, కానీ రెండు రోజుల పాటు మోతాదు BD కి పెంచడం ద్వారా అతను పూర్తిగా బాగానే ఉన్నారు. నిర్వహణ మోతాదుగా రెమిడీ కొనసాగించమని అతనికి సలహా ఇచ్చినప్పటికీ జులై 3వ వారం నుంచి నొప్పి తిరిగి రాకపోవడంతో రెమిడీ తీసుకోవడం మానేశారు. 2021 నవంబర్ 30 నాటికి అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు,  శ్రద్ధగా ఆక్యుప్రెషర్ కొనసాగిస్తున్నారు.